April 13, 2008

కలాపోసన

ఒక వారం రోజులుగా మా కేబుల్ ఆపరేటర్ ఏదో ప్రాబ్లం ఉందని, కేవలం ఈటీవీ మాత్రమే ఇస్తున్నాడు. . ఇంతలో ఊరినించి మా పిన్ని వచ్చింది. ఆవిడ నేత్రుత్వంలో ఈ వారమూ నేను ఈటీవీ మాత్రమే చూడాల్సి వచ్చింది. నిజానికి నేను రాత్రి తొమ్మిదింటి న్యూస్ తప్ప ఈటీవీలో ఇంకేం చూడను.ఈ వారమూ చూశాక, ప్రభాకర్ ప్రభ ఎలా వెలిగిపోతోందో తెలిసింది. ప్రతి కార్యక్రమానికీ ఆయనే క్రియేటివ్ హెడ్ మరియు హోస్టూనూ! ఇంతా చేసి ఆయన్ క్రియేటివిటీ ఏమిటంటే, ప్రముఖ హిందీ చానెళ్ళలో వచ్చే ప్రజాదరణ పొందిన కార్యక్రమాలన్నిటికీ తెలుగు పేర్లు పెట్టి ప్రేక్షకుల నెత్తిన రుద్దడం. గ్రేట్ లాఫ్టర్ చాలెంజ్ కి 'స్మైల్ రాజా స్మైల్ ' అనీ, నచ్ బలియే కి స్టార్ వార్ అనీ పేర్లు పెట్టి జనం మీదకు వదిలాడు.
ఈ స్మైల్ రాజా....ప్రోగ్రాం చూసి, మనకు మనమే కితకితలు పెట్టుకున్నా నవ్వు రావడం కష్టం! పైగా ప్రభాకర్ వివిధ మేకప్ లతో ప్రాణాలు తోడేస్తుంటాడు. అందులో పాల్గొన్న వాళ్ళు వేసే ప్రతి జోకుకీ ప్రభాకర్, ఆయనతో పాటు ఉండే గెస్ట్ కూడా విరగబడి నవ్వుతుంటే మన మీద మనకు జాలెయ్యక పోతే, మనలో ఏదో లోపం ఉందన్నమాటే!
స్టార్ వార్ ప్రోగ్రాం లో ప్రతివారమూ మొదట ప్రభాకర్ డాన్స్ చేయాల్సిందే! మన ఊహకందని మేకప్పులతో! అందులోనూ మళ్ళీ గ్రాఫిక్స్. ఆయన సిం హంగా, పులిగా మారి పోతుంటాడు.గొప్ప పెర్సనాలిటీయా అంటే కాదు. పైగా చెప్పలేనన్ని హైర్ స్టైల్స్!పాపం న్యాయ నిర్నేతలుగా వచ్చిన వాళ్ళు ఏమి చేయాలో తెలియక మనకేసి చూస్తారు.
ఇక పెద్ద పెద్ద డైలీ సీరియళ్ళలో ఆయనదే లీడింగ్ రోల్! పైగా ఆ పాత్రకు జరామరణాలు ఉండవు. ఉదాహరణకి పద్మ వ్యూహం అనే సీరియల్ నా చిన్నప్పుడు మొదలైంది. మొదటి ఎపిసోడ్ నుంచి ప్రభాకర్ కారెక్టర్ ఉందని గుర్తు. మా పిన్ని చెప్పింది..మోహన రావు (ప్రభాకర్) ముని మనవరాళ్లు కూడా చలివేంద్రం కుండలంత కడుపులతో డెలివెరీకి రెడీగా ఉంటారు. తాత మాత్రం తెల్ల జుట్టుతో ఒక్క ముడతన్నా మొహాన లేకుండా బలే హుషారుగా ఉంటాడు.
ఇంకో సీరియల్ లో, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తప్పిపోయి, వాళ్ళకు తలా ముప్ఫయ్యేళ్ళు వచ్చాక తిరిగొస్తాడు. యంగ్ లుక్ తో! ఇంకో సీరియల్లో బుర్ర ఎదగని అమాయకూడిగా! ఇదీ మరీ డేంజరస్ మన బుర్రలకి!
త్వరలో ఇంకో మెగా సీరియల్ వస్తోందట! అది కాక,ఇంకో గేం షో అట! జుట్టంతా ఆముదం రాసి వెనక్కి దువ్వి, భలే ఉంటాడట ఆ షోలో..పిన్ని చెప్పింది.
సుమన్ రచించి, పాటలు , మాటలు, సంగీతం, కాస్టింగ్, దర్శకత్వం, (లేదా దర్శకత్వ పర్యవేక్షణ) వహించిన కార్యక్రమాలు, మరియు ఆయన రచించి సంగీతం కూర్చిన జూనియర్ అన్నమాచార్య కీర్తనలతో ప్రేక్షకుల సహనానికి పరీక్షలు పెట్టింది చాలక, ఏదో ఒక మాదిరిగా ఉండే మా బుర్రలపై ఇంత 'క్రియేటివిటీ 'ని రుద్దితే భరించగలమా!
'అతడు ' సినిమాలో మహేష్ బాబు త్రిష తో అనే డైలాగ్ 'ఏదో అందరూ అందరూ నువ్వందంగా ఉన్నావని అంటూండ బట్టి నీకలా అనిపిస్తుందేమో గానీ, నిజానికి నువ్వంత అందంగా ఏమీ లేవు ' ! ప్రభాకర్ తన క్రియేటివిటీ గురించి ఒక సారి ఈ డైలాగ్ అన్వయించుకుంటే బాగుణ్ణు.
నెలా నెలా డబ్బు కట్టి (సెట్ టాప్ బాక్స్ పెట్టుకుని మరీ) టీవీ చూసే ' కస్టమర్లకీ ఈ మాత్రం విమర్శించే హక్కుందనుకుంటా!

7 comments:

తెలుగు అభిమాని said...

సకల కళా భల్లూకం

బ్లాగాగ్ని said...

హ్హ హ్హ హ్హా! మీ పోస్టూ, దానివెంటనే తెలుగు అభిమాని గారి కామెంటూ రెండూ అదిరాయి.

దైవానిక said...

అందుకే ఈ మధ్య ఈటివి చూడడమే మానేసాము వీడి గోల భరించలేక. పాటల ప్రోగ్రాముల కాడినుంచి రియాలిటీ షో ల వరకు అన్నింట్లో వాడే. టార్చర్ చేస్తున్నాడు. ఈ సరి వాడికి ఒక అద్దం పంపుదామనుకుంటున్నా ..

krishna rao jallipalli said...

అంతా రామ మయం అనుకోన్నట్లే... etv అంత కామెడీ మయం అనుకొందాము. ప్రభాకర్.. తను ఒక పుడింగి అనుకొంటున్నాడు. అప్పట్లో ఈ లోకల్ ఛానల్స్ లేనప్పుడు దూర దర్శన్ లో ఇటువంటి పుడింగిలు చాల మంది ఉండే వారు.. ఇప్పుడు ఆ పుడింగీలను తలచుకొనే వాడే లేడు. దాంట్లో అన్ని లలితా గీతాలకి ఒక్కడే music director. తరువాత్తరువాత వాడు serials లో కూడా act చేసేవాడు. ఎందుకంటీ వాడి హవా అలాగుండేది మరి. ఇప్పుడు ఒక్కడు కూడా సోది లో లేరు. time అంటే ఇంతే మరి. ఒకో టైం లో ఒకోడు అలా వెలిగిపోతుంటాడు. లక్ష్మి పార్వతి వెలగలా ??

sujatha said...

నల్లూరి సుధీర్ కుమారేగా! లక్ష్మీ పార్వతి వెలుగు కళ్ళారాచూసాను లెండి నరసరావు పేటలో! మా చెల్లెలు వాళ్ళ కాలేజీలో లెక్చరర్ ఆవిడ.

Manohar said...

ఇప్పుడో, ఇంకొన్ని రొజుల్లోనో ఇంకొక సీరియల్ వస్తుందట, దళపతి అని. మళ్ళీ సుమన్ "ఉషా పరిణయం" అని ఒక సినిమా తీస్తున్నాడు.దానిలో ఈయన గారి నటనా వైదుష్యాన్ని చూపిస్తాడేమో! ఏమైనా ఒక విషయం చెప్పుకోవాలి. తెలుగు లో సొంతగా ప్రోగ్రామ్స్ తయారు చెయ్యనందుకు

sivaprasad said...

మోహన రావు (ప్రభాకర్) ముని మనవరాళ్లు కూడా చలివేంద్రం కుండలంత కడుపులతో డెలివెరీకి రెడీగా ఉంటారు. తాత మాత్రం తెల్ల జుట్టుతో ఒక్క ముడతన్నా మొహాన లేకుండా బలే హుషారుగా ఉంటాడు.
ఇంకో సీరియల్ లో, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తప్పిపోయి, వాళ్ళకు తలా ముప్ఫయ్యేళ్ళు వచ్చాక తిరిగొస్తాడు. యంగ్ లుక్ తో! ఇంకో సీరియల్లో బుర్ర ఎదగని అమాయకూడిగా! ఇదీ మరీ డేంజరస్ మన బుర్రలకి!
meeru cheppindi 100%correct. suman ,prabhakar valla etv ni chudam ledu. etv lo meeru e time lo chusina suman ,prabhakar kanapadatharu. etv ki prabhakar kartha,karma,kriya anukuntunnadu bahusa.inka nayam etv lo 12 pm serials start ayi 1 am run ayivi kada. ippudu etv bagupadinidi prabhakar vellipovatam valla.

Post a Comment