May 8, 2008

నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారి ఫొటో

శ్రీ సాకం ప్రభాకర్, శ్రీ నామిని సుబ్రహ్మణ్యం నాయుడు,(తెల్ల జుట్టు వ్యక్తి) మధ్యలో ఉన్నది మా అమ్మాయి సంకీర్తన. తిరుపతి వెళ్ళిన ప్రతి సారీ నామిని గారిని కలవకుండా రాను. పోయిన సారి వెళ్ళినపుడు ఆయన వూరిలో లేకపోవడం తో కుదరలేదు. నాలుగేళ్ళ తర్వాత నామిని గారి ఇంటికి వెళ్ళాను. వస్తున్నానని చెప్పగానే కొందరు సాహితీ ప్రియులైన స్నేహితుల్ని కూడా పిలిచారు ఇంటికి
నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారి ఫొటోలు ఇంతకు ముందెక్కడా పత్రికల్లో రాలేదు. ఆయన వేసిన ఒక పుస్తకం వెనక వైపు చూసిన గుర్తు ఒకసారి. నా బ్లాగులో పెట్టుకోవడానికి అనుమతి అడిగితే ముందు 'వద్దులే తల్లీ ' అని సున్నితంగా తిరస్కరించినా, నా పోరు పడలేక 'వద్దంటే వినేటిదానివి గాదుగా నువ్వు, సరే యేస్కో బో' అని పర్మిషన్ ఇచ్చేసారు.
ఆయన పక్కన కూచున్నది ఆయన మిత్రులు శ్రీ సాకం ప్రభాకర్ గారు, తిరుపతిలో తెలుగు అధ్యాపకులుగా పని చేస్తున్నారు. ఆయన కూడా రచయితే ! ఇటీవల ఆయన అయిదేళ్ళ లోపు పిల్లల కోసం 'ఫూలూ-పళ్ళూ ' అనే సంకలనం వేసారు. ఆ పుస్తకానికి పేరు పెట్టింది నామిని గారే! ఈ పుస్తకం గురించి వేరే టపా రాస్తాను.
'రాయడం ఎందుకు మానేసారు? ' అని అడిగితే "పత్రికల వాళ్ళు కూడా అడగతా ఉండారు తల్లీ, కానీ ఒకళ్ళు అడిగితే రాయలేను గదా మళ్ళ! అ పురుగు బుర్రలో పుట్టాల ' అనేసి తప్పించుకున్నారు. ఎన్ని సార్లడిగినా ఇదే జవాబు!

మొన్న ఒకట్రెండు తారీకుల్లో తిరుపతి వెళ్ళినపుడు తీసిన ఫొటో ఇది.
నామిని సాహిత్యాన్ని ఇష్టపడే సాహితీ ప్రేమికులకు ప్రత్యేకం !

24 comments:

చైతన్య క్రిష్ణ పాటూరు said...

నామిని గారి ఫొటో అందించినందుకు నెనెర్లు. మిట్టూరోడి కథలు నాకు మా అమ్మ పరిచయం చేసింది. నేను తిరుపతిలో పెరిగినా గాని చిన్నప్పుడా భాష కొంచం మోటుగా అనిపించేది. పుస్తకాల్లో తెలుగే స్వచ్చమైన తెలుగన్న అభిప్రాయం వల్లనేమో. కాని ఆయన రచనలు చదివాక ఆ యాస చాలా ప్రియంగా అనిపిస్తోంది.

నేను మాంచి కుశాలగా వున్నప్పుడు ఇంట్లో మా అమ్మతో తిరుపతి యాసలో మాట్లాడుతుంటా(Try చేస్తుంటా). తిరుపతి వెళ్ళిన ప్రతిసారి ఈయన్ని కలవాలని అనుకోవటం, ఎలా కలవాలో తెలీక ఆగిపోవటం. మొత్తానికి కలవకపోయినా, ఆయన ఫొటో చూపించారు, సంతోషం.

విహారి said...

రానారె గురించి ఆయనకు చెప్పారా లేదా? ముందావిషయం చెప్పండి.

-- విహారి

కొత్త పాళీ said...

thank you. He was out of town every time I went to Tirupathi.

roshini said...

Nice Post !
Use a Telugu social bookmarking widget like PrachaarThis to let your users easily bookmark your blog posts.

సిరిసిరిమువ్వ said...

చాలా సంతోషం. ఈ రోజే మాలతి నిడదవోలు గారి ఫొటో ఆవిడ పుస్తకం వెనకాల చూసాను, ఇప్పుడు నామిని గారిది మీ బ్లాగులో...నామిని గారిని ఒకసారి చూడాలి అని ఎప్పటినుండో కోరిక, మీరు చూపించారు, ధన్యవాదాలు.

రానారె said...

చిన్నప్పుడాయనెలావుండేవారో 'పచ్చనాకుసాక్షిగా' తెలిసిందికానీ, ఇప్పుడు కళ్లారా చూడటం చాలా ఆనందంగా వుంది. కృతజ్ఞతలు. మిట్టూరోడి పుస్తకాన్ని కొని మెల్లగా చిన్నప్పుడు 'పిప్పరమింటుబిళ్లను' చప్పరించినట్లు కొద్దికొద్దిగా నిదానంగా చదువుతూ ఆస్వాదిస్తున్నాను. ఈమధ్య ఒక వారం రోజులపాటు నన్ను బాధించిన కత "లబలబా నోరు కొట్టుకోనా?" అనేది.

Srinivas said...

వెళ్ళినప్పుడల్లా అలాగే వెంటపడండి. అలా పడే ఆయన ఇల్లేరమ్మ కథలూ, దర్గా మిట్ట కథలూ, అమ్మకు జేజేలూ రాయించింది.

ఆయన ఇప్పుడెక్కడ పనిచేస్తున్నారు?

వికటకవి said...

నామిని గారిని ఫోటో ద్వారా చూపించినందుకు ధన్యవాదాలు.

bolloju ahmad ali baba said...

మీ బ్లాగులో మంచి మంచి విషయాలు ఉన్నాయి. మీ శైలి చాలా బాగుంది. విషయాన్ని స్పష్టంగా చదివరిబుర్రల్లోకి ఎక్కీచేయగలరు.
ధన్యవాదాలతో
బొల్లోజు బాబా
http://sahitheeyanam.blogspot.com/

te.thulika said...

నామిని వారిగురించి మీరు నాకు ఇదివరకు చెప్పారు. ఇప్పుడు ఫొటోలో.. మీఅమ్మాయి బాగుంది. ఎప్పుడో చిన్నప్పుడు (అదేలెండి తను పాపగా వున్నప్పుడు) చూసాను. మరి మీఫొటో ఎప్పుడు చూపిస్తారు
సిరిసిరిమువ్వగారూ, అనుకోకుండా మీరు నాప్రస్తావన .. ఇక్కడ. ఈరోజు సుదినం.
మాలతి

sujata said...

నాకు నిజంగా 'బులుగూ పేనా' దొరికినంత సంతోషంగా ఉంది. చాలా మంచి ఫోటో.

రాధిక said...

అచ్చూ మా సంస్కృతం మాష్టారిలా ఉన్నారు.ఫొటో పంచుకున్నందుకు నెనర్లు.సిరి సిరి మువ్వగారూ ...మాలతి గారి ఫొటోని మాకూ చూపించండి.

శ్రీ said...

నేను కాలాస్త్రి వాడినే అయినా నామినిని ఎపుడూ కలుసుకోలేదు, చిన్నపుడు "ఉదయం" దిన పత్రికలో సినబ్బ కతలు బాగా చదివేవాడిని, అపుడే అందమయిన నామిని చిత్రం కుడా చూసాను. ఇపుడు తల నెరిసింది.

చైతన్య క్రిష్ణ పాటూరు అన్నట్టు "మన బాస పుస్తకాల బాస లాగా ఉండదు, కొంచెం మోటుగా ఉంటాది" అన్ని భావం రాయలసీమ లో వాళ్ళకి మమూలే.

ఎపుడు మటాడతామబ్బా...మన రాయలసీమ బాసా!

nuvvusetty said...

ఆ మహారచయిత ఫోటోని అందించినందుకు ధన్యవాదాలు.ఆయనందించిన కతలు జీవితంతో పెనవేసుకుపోయాయి. పచ్చనాకు సాక్షిగా, సినబ్బ కతలు, మిట్టూరోడి కతలు ఈ మూడూ కలిసిన పుస్తకం భగవద్గీత తో సమానం.

sujatha said...

ఇంత మంది అభిమానుల్ని పెట్టుకుని ఆయన రాయకుండా కూచోడానికి మనసెలా ఒప్పుతుందో ఆయనకు? అభిమానులంతా మీరు రాయాలని కోరుతున్నారని చెప్దామని ఆయనకు ఫోన్ చేస్తే ప్రభావతి గారు తీసారు. నామిని ఇంట్లో లేరు. ఆవిడకే చెప్పి ఆయనతో పోట్లాడమని చెప్పాను. చిన్న పిల్లలకోసం ఆయన రాసిన 'మా అమ్మ చెప్పిన కతలు ' తప్పించి ఇంకే పుస్తకం తాలూకు కాపీలూ కనీసం ఆయన దగ్గర కూడా లేవు. అది మా పాప కోసం 3 కాపీలు ఇచ్చారు.

ఆయన సాహిత్యం చదివాక నాకూ తిరుపతి యాసలో(సరదాగ) అమ్మతో ఇంట్లో మాట్లాడ్డం అలవాటైంది.'నీ ముండ మొగాన ఎండ గాసిందిలే గానీ ' అని ఒక తిట్టు ఉంటుంది సినబ్బ కతల్లో! 'ఎవరినన్నా తిట్టాలనుంది అలాగ, బలే ఉంది ఆ తిట్టు " అని ఆయనతో అంటే 'ఎవరినో ఎందుకులే గానీ, నన్నే అనేసెయ్' అన్నారొక అసారి నన్ను నిశ్చేష్ట పరుస్తూ! అంత స్పోర్టివ్, నిరాడంబరి నామిని.

రానారె గారు,
ఆ కథ మీకూ నచ్చిందా! ఫెమినిస్టులు చెప్పే లైంగిక హింస అనే మాటకు చిన్న కథలో పెద్ద అర్థాన్ని చూపించిన కథ అది. సుంకోజి దేవేంద్రా చారి గురించి మాటల్లో వచ్చినపుడు 'నిజ్జింతోనే' మీ గురించి కూడా ఆయనకు చెప్పాను.

మాలతి గారు,
నా ఫొటో కాదు గానీ, మీరు సరయు ఉన్న ఫొటో ఉంది నా దగ్గర! అది చూపిస్తాను అందరికీ కావాలంటే !

రాధిక గారు,
మాలతి గార్ని మీరైతే ఫొటో ఏం, ముఖా ముఖి కలుసుకోవచ్చుగా! మాలతి గారు మాడిసన్లోనేగా ఉంటారు.


చైతన్యగారు,
విహారి గారు,
సిరి సిరి మువ్వ గారు,
కొత్త పాళీ గారు,
సుజాత గారు,
శ్రీ గారు ,
నువ్వు సెట్టి గారు,
వికటకవి గారు,
బొల్లోజు బాబా గారు,
శ్రీనివాస్ గారు,
రోషిణి గారు

ధన్యవాదాలండి అందరికీనూ!

Sudheer Gullapalli said...

Sujatha gaaru,

I came across your blog thru google. Great posts !

I just read your post about Namini gaaru (http://manishi-manasulomaata.blogspot.com/2008/05/blog-post.html). I'm an ardent fan of his, since my intermediate days. I was very excited to see his photo. If possible, could you kindly let me know his contact details (with his permission) ? Okka saari aayannu choodaalani, choosi maatlaadaalani vundhi.

Thanks,
Sudheer

Sudheer Gullapalli said...

Sujatha gaaru,

I forgot to include my email address in my earlier comment. It is sgullap@gmail.com.

Regards,
Sudheer

సుజాత said...

sudheer gaaru,
thanks for visiting my blog and for your kind comment.

But your e-mail ID is not working! can you please check it once?

indianinker said...

సుజాత గారు.
నామిని ప్రక్కన వున్నది ప్రభాకర్ కారు, ఆయన సాకం నాగరాజు గారు - ఉత్తమ జాతి మానవుల్లొ వొకరు, ఆయన దయవల్ల , మా అన్న వెంకట సుబ్బయ్య, తెలుగు కథకు జే జే, దువ్వూరి వేకంట రమణ శాస్త్రి గారి స్వీయ చరిత్రం , బాపు గారి అద్భుతమైన బొమ్మలతొ ఈసప్ కథలు పుస్తకాలు వచ్చినై.

సుజాత said...

Indianinker gaaru,
అయ్యో, ఆయన ప్రభాకర్ గారేనండీ! నేను అప్పుడు అక్కడే ఉన్నాను. చాలా సేపు మాట్లాడాను కూడా. ఆయన రాసిన పూలూ పళ్ళూ సంకలనం నాకు ఐదారు కాపీలు కూడా ఇచ్చారు. ఆయనా, నాగరాజు గారూ సోదరులేమో! ఎందుకంటే పూలూ పళ్ళూ పుస్తకంలో కూడా "ప్రజా వైద్యుడు మా అన్న వెంకట సుబ్బయ్య జ్ఞాపకార్థం" అని ఉంది మొదటి పేజీలో!నాగరాజు గారి గురించి ముందే తెలిస్తే మరింతగా ప్రభాకర్ గార్ని అడిగి వివరాలు తీసుకుని ఉండేదాన్ని.

Neeharika said...

నేను సుజాతగారిని నిన్న T V లో చూసానోచ్!

అబ్రకదబ్ర said...

Congratulations.

తెలుగు సాహిత్యంతో నాకంతగా పరిచయం లేదు. నామిని గారెవరో తెలీదు. కానీ మీ అందరి వ్యాఖ్యలని బట్టీ చూస్తే గొప్ప రచయిత అని తెలుస్తుంది. ఆయన రచనల వివరాలు, అవెక్కడ దొరుకుతాయో చెప్పగలరా?

akondisundari said...

munduga malathi gariki kruthajnathalu.namini garini ila photolo chudagaliginanduku naa janma dhanyam iyindi.chitthuru yasa maaku baga ravataniki ayane karanam. namini gurinchi cheppukovataniki naaku enthina chaladu

krishna said...

naamini gaaru maa amma chanipoyinappudu maa ooru vachaaru.vaaritho maataadam kadhala gurinchi discuss cheyyadam aa baadha lo oka santhosham.

Post a Comment