July 31, 2008

కాళిదాసు శ్లోకం తాలూకు కథ!

'ఉత్ప్రేక్షా కాళిదాసస్య .కొద్దిసేపటి క్రితం 'చంద్రిమ ' అనే కొత్త బ్లాగులో ' అనే టపా చూశాను. దానికి సంబంధించిందే ఈ కథ!

అక్కడే కామెంట్ గా రాస్తే టపాని మించి పోయే పరిమాణంలో కథ ఉంది. అందుకే నా బ్లాగులో రాస్తున్నాను.
'
కుసుమే కుసుమోత్పత్తిః శ్రూయతే నతు దృశ్యతే'
బాలే తవ ముఖాంభోజే దృష్టమిందీవర ద్వయం' ఇదీ శ్లోకం.
నిజానికిది మొదటి సగం భోజరాజుది కాగా, రెండో సగం కాళిదాసుదని ఒక రోజు తెలుగు క్లాసులో తెలిసింది.

పై శ్లోకం గురించి ఒక కథ మా తెలుగు లెక్చెరర్ స్వర్గీయ శ్రీ పళ్ళె శ్రీనివాసాచార్యులు గారు చెప్పారు. ఒక సారి భోజరాజుకి కాళిదాసుకు కొంచెం మాట తేడా వచ్చి కాళిదాసు రాజు గారి మీద అలిగి చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడట!
భోజరాజు కాళిదాసు కోసం వెతికించి వెతికించి విసిగి వేసారి పోయాడు. ఎక్కడా కనపడ్డే!
చివరకు కాళిదాసు ఆచూకీ తెలుసుకోవాలంటే ఒకటే మార్గమని తలచి ఈ సమస్యను తయారు చేసి చాటింపు వేయించాడు.
కుసుమే కుసుమోత్పత్తిః శ్రూయతే నతు దృశ్యతే....

పువ్వులోంచి పువ్వు పుడుతుంది అనేమాట వినడమే కానీ చూడలేదు....! ఈ సమస్యను పూరించిన వారికి గొప్ప నజరానా అని ప్రకటించాడు. భోజ రాజుకి తెలుసు అది కేవలం కాళిదాసు మాత్రమే పూరించగలడని!

ఆ సమయంలో కాళిదాసు ఒక దూరప్రాంతంలో ఒక వేశ్యాంగన ఇంట్లో మకాం వేసి ఉన్నాడు. ప్రకటన ఆనోటా ఆనోటా వేశ్యాంగనక్కూడా తెలిసింది. రాజుగారు ఇవ్వబోయే బహుమతి మీద ఆశ కలిగింది.
కాళిదాసు కవి కనుక ఆయన ముందు ఈ సమస్య ఉంచింది. సమస్య భోజరాజు ఇచ్చాడని చెప్పలేదు.

కాళిదాసు అలవోకగా 'బాలే! తవ ముఖాంభోజే దృష్టమిందీవరద్వయం " అని పూరించాడు.
'బాలా, నీ ముఖమనే తామరపూవులో రెండు నల్ల కలువలు కనిపిస్తున్నాయి" అని.
ఇది విని వేశ్య ,బహుమతి తనకే అని మురుస్తూ భోజరాజు ఆస్థానానికి వెళ్ళింది.
భోజ రాజు సమస్యను చదవగానే ఆమె తడుముకోకుండా..
'రాజే! తవ ముఖాంభోజే దృష్టమిందీవర ద్వయం " అన్నది.
వెంటనే రాజు ఆమెను బంధించి కాళిదాసు ఆచూకీ చెప్పమన్నాడు. ఆమె బిత్తరపోయి చివరకు కాళిదాసు ఫలనా ఊరులో తన ఇంట ఉన్నాడని చెప్పింది.

ఆమె చేసిన తప్పేమిటంటే "రాజే" అనడానికి బదులు "రాజన్ " అని ఉండాలి పూరణలో! తప్పు చేసి వెంటనే దొరికిపోయింది.
కాళిదాసుకు భోజరాజు స్వయంగా క్షమాపణ చెప్పి ఆస్థానానికి తీసుకు వచ్చాడట.
ఇలాంటి కథలు శ్రీనివాసాచార్యులు గారు అనేకం చెపుతుండేవారు. వారి నాన్న గారు శ్రీ పళ్ళె పూర్ణ ప్రజ్ఞాచార్యులు గారు ఆంధ్ర ప్రదేశ్ ఆస్థాన కవి గా ఉండేవారు.

24 comments:

oremuna said...

Start giving links eg.. you referred to chandrika jI blog and no link to that blog from here!

భావకుడన్ said...

సుజాత గారు,
చాలా బావుందండి ఈ శ్లోకం, దాని పూరణ. పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

ఇక్కడ చిన్న అనుమానం, ఇంతకూ ముందు ఎక్కడో నేను చదివిన గుర్తు "కాళిదాసు భోజుడు సమకాలీకులు కాదు" అని. వికీ వెతికితే కూడా కాళిదాసు "విక్రమాదిత్యుడు" అనే రాజు దగ్గర ఉండే వాడు అని అంచనా అని మాత్రమె రాసారు. అందువల్ల దీన్ని ఒక "చాటువుగా" మాత్రమె తీసుకోవచ్చనుకుంటాను. ఇంకా వివరాలు తెలిస్తే చెప్ప గలరు.

దైవానిక said...

సుజాత గారు,
రాజే బదులు రాజన్ అని ఎందుకుండాలో చెబితే బాగుండేది. నేను అనుకోవడం, గణాలు సరిగ్గా కుదరవు కదా..
రాజే - UU
రాజన్ - UI

cbrao said...

కాళిదాసుకిచ్చిన సమస్యా పూరణం లో సౌందర్యతత్వం ఉంటే, నేను చెప్పబొయే దాంట్లో హాస్యతత్వం ఉంది. మా స్కూల్ రోజులలో అలంకారాలు గురించి చదివే సమయంలో, మా తెలుగు పంతులు గారు ఒక విద్యార్థిని ఉపమాలంకారానికి ఉదాహరణ చెప్పమంటే, వెండి కొండపై శివుడు, సుమతి (మా సహ విధ్యార్ధిని) తలలో పేనులా ఉన్నాడు అనే సరికి క్లాసంతా గొల్లుమంది.

హర్షోల్లాసం said...

సుజాత గారుఉఉఉఉఉఉఉఉఉఉఉఉఉ ఎప్పుడొచ్చారు ???
మీ టపా మీ గురూ గారు చెప్పింది బాగుంది.కాని నా మనసులో మాట మీరు అలా కళిదాసు గారిని అలాగ ఏకవచనం చేసి రాయటం బాగోలేదండీ.మీ మనసు నొప్పించి వుంటే sorry.లేకపోతే take it easy.bye:)
mee ee టపా లో నదేగా మొదటి comment:)

సుజాత said...

దైవానిక గారు,
నాకు సంసృతం తెలియదు. బహుశా "రాజన్" అనేది పులింగం ,"బాలే" అనే స్త్రీలింగానికి వాడతారని ఊహిస్తున్నాను.

సుజాత said...

ఒరెమూనా గారు, ఇదిగో, లింక్ ఇచ్చాను చూడండి!

దైవానిక said...
This comment has been removed by the author.
భావకుడన్ said...

దైవానిక గారు,

నాకు తెలిసి "రాజన్" గణ విభజన "UU" నేనండి, ,UI కాదు ఎందుకంటే అది "హలాంత్" కాబట్టి.


వివరణకు వికీలో "గురువుల" గూర్చి చెప్పిన rules లో 6వ రూలు చూడండి ఇక్కడ http://telugu.wikispaces.com/Chandassu

సుజాత said...

హర్షోల్లాసంగారు,
కాళిదాసు గారు అంటే కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది నాకు! అంతే కానీ మరేం లేదు. ఏదో కాళిదాసు తో ఉన్న చనువు కొద్దీ అలా...!

సుజాత said...

భావకుడన్ గారు,ధన్యవాదాలు!
అవునా! నాకు కాళిదాసు భోజరాజు ఆస్థానకవి గానే తెలుసు! ఇంతకంటే వివరాలు తెలియవు.

రవి said...

@సుజాత గారు, కథ అద్భుతం! బాగా నచ్చింది, అయితే, కాళిదాసు నచ్చలేదు నాకు.

@భావకుడన్ గారు, కాళిదాసు కాలం మీద భిన్నాభిప్రాయాలున్నాయి. ఈయన మాళవ రాజ్యాధిపతి (ఉజ్జయిని రాజధాని) రెండవ విక్రమాదిత్యుని ఆస్థాన కవి అని ఎక్కువ మంది అభిప్రాయం. ఆయనే కుమార గుప్తుడు. క్రీ. శ , 3 వ శతాబ్దం నుండీ క్రీ.శ. 6 వ శతాబ్దపు మధ్య అని ఊహిస్తున్నారు.ఆయన బిరుదు భోజ రాజు అయి ఉండవచ్చు.

ఈయన ఖచ్చితంగా, గౌతమ బుద్ధుడి తర్వాతి వాడు, అని రాహుల్ సాంకృత్యాయన్ అనే పండితుడు చెబుతున్నారు.

ఓ సారి నా టపా చూడంది, మీకు పనికి వస్తుందేమో?
http://blaagadistaa.blogspot.com/2008/06/blog-post_14.html

వేణూ శ్రీకాంత్ said...

కధ బాగుంది సుజాత గారు

సుజాత said...

రావు గారు,
ఉపమాలంకారం చదివి నవ్వాపుకోలేకపోయాను.

రవి గారు,
మీరు ఇచ్చిన లింకు బాగుంది.

వేణూ,
ధన్యవాదాలండీ!

కత్తి మహేష్ కుమార్ said...

కథ బాగుంది.పంచుకున్నందుకు నెనర్లు.

చైతన్య said...

బాగుందండి మీ టపా. మీ అమ్మగారికి ఎలా ఉంది? సుజాత గారు తెలుగు లో అష్టపదులు లింక్ ఎక్కడైన వుందా? తెలిస్తే చెప్పగలరు.

సుజాత said...

మహేష్ గారు,
బహుకాల దర్శనం! బాగా బిజీ అనుకుంటాను! ధన్యవాదాలు
చైతన్య గారు,
ధన్యవాదాలు! మా అమ్మ గారి ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది. మరో సారి థాంక్యూ!
అష్టపదుల కోసం నేను వెదుకుతున్నాను. ఈ మధ్యకాలంలో చుడలేదు గానీ...ఒక సారి www.musicindiaonline.com లో ప్రయత్నించి చూడండి.

భావకుడన్ said...

చైతన్య గారు,

ఇక్కడ తెలుగులో అన్ని అష్టపదులు దొరుకుతాయి చూడండి.

http://www.andhrabharati.com/kIrtanalu/jayadEva/index.html

ఇక్కడ ప్రతిపదార్థ తాత్పర్యము చూడండి, కాకపొతే ఇది ఆంగ్లేయుడు రాసినది, ఆంగ్లములో ఉంది కాని నాకు చాలా నచ్చింది. ఇంతకంటే authentic మరియు detailed టీకా నాకు ఇంతవరకు దొరకలేదు.
http://www.geocities.com/giirvaani/gg/gg_intro.htm


ఇకపోతే పాటలు మంగళంపల్లి వారివి, భానుమతి వారివి వినటానికి సురస.నెట్ లో ఉన్నాయని గుర్తు, చూడండి. లేదంటే నాకు మెయిల్ చేయండి నా దగ్గర ఉన్నవి మీకు మెయిల్ చేయగలను.

Chandra Mohan said...

సుజాత గారు,
నేను బ్లాగులో వ్రాసిన శ్లోకం మీకు మీ మాస్టారు చెప్పిన కథను గుర్తుకు తేవడం, మీ టపామీద వస్తున్న చర్చ, కాళిదాసుకు తెలుగువారి హృదయాలలో ఎలాంటి స్థానం ఉందో తెలుపుతోంది. ఈ కథ నేను కూడా చదివాను (చిన్న చిన్న మార్పులతో).
ఇక మీ టపా పై వచ్చిన వ్యాఖ్యల పై నా వ్యాఖ్య ...

1. భోజుడనే రాజు ఉన్నట్లు చారిత్రిక ఆధారాలు లేవు. చంద్రగుప్త విక్రమాదిత్యుడి ఆస్థానంలో కాళిదాసు ఉన్నట్లు పలువురి అభిప్రాయం. దీనికైనా ఆధారాలు లేవు. కాళిదాసు తన ఏ రచనలోనూ, తన జీవితం గురించి గాని, తన రాజు గురించి గానీ వ్రాయలేదు. “విక్రమోర్వశీయం” కావ్యం తన రాజైన చంద్రగుప్త విక్రమాదిత్యుని సంతోషపెట్టడానికి వ్రాసిందని కొందరంటారు.

2. మనసుకు దగ్గరైన వారిని ఏకవచనంలోనే పిలవాలనుంటుంది. అందులో అగౌరవమేమీ లేదు. దేవుడిని ఎంత భక్తి తో కొలిచే వారైనా “దేవుడా! నువ్వే నన్ను కాపాడాలి” అంటారు గానీ “దేవులుంగారండీ! తమరే నన్ను కాపాడాలండీ” అనరు కదా. అమ్మ ను ‘అమ్మగారూ’ అని పిలిస్తే ఎంత కృతకంగా ఉంటుంది?

- చంద్ర మోహన్

te.thulika said...

నువ్వు చెప్పిన కథ నేను కూడా చిన్నప్పుడు విన్నాను కానీ వివరాలు అంతగా గుర్తులేవు. ఇలాటికథలు నాకు చాలా ఇష్టం. నీకు వీలయినప్పుడు, రాసి పెడుతూ వుండు. థాంక్స్.

హర్షోల్లాసం said...

@చంద్ర మొహన్ గారు నా వ్యఖ్యానానికి ఎంత నైస్ గా సమాధానాన్ని ఇచ్చారండి:)
anyways naku matram nacchaleedu
:(
amtee

వేణూ శ్రీకాంత్ said...

ఇక్కడ ఘంటసాల గారు బాలమురళి గారు పాడిన అష్టపదులు దొరుకుతాయి చూడండి. పాతబంగారం

Murali said...

రాజన్ అంటే సంబోధన.
రాజా అంటే రాజు. రాజన్ అంటే ఓ రాజా! అని సంబోధించడం.
బాలా అంటే బాలిక. బాలే అంటే సంబోధన.

asha said...

chandra mohan garu, meeru cheppina ekavachanam concept suparb.........

Post a Comment