August 4, 2008

నిన్నటి ప్రమదావనం కబుర్లు !

చల్లగా వర్షం కురుస్తున్న సాయంత్రం ఈ వారం ప్రమదావనం చాలా ఆసక్తికరంగా సాగింది. ఈ వారం ప్రత్యేక అతిథి కూడలి, లేఖిని ల సారథి శ్రీ వీవెన్!

ముందుగా ప్రమదావనంలో జ్ఞానప్రసూన గారు, ఊహలన్నిటినీ ఊసులుగా మోసుకుంటూ పూర్ణిమ అడుగెట్టారు. ఇద్దరూ "రచన" అనే అంశం మీద చక్కగా కబుర్లు చెప్పేసుకున్నారు.
"మన వంటని ఎవరైనా తిని మెచ్చుకుంటే ఎంత తృప్తిగా వుంటుందో, మన రచన ని ఎవరైనా మెచ్చుకుంటే కూడా అంత తృప్తిగా ఉంటుద్నని జ్ఞానప్రసూన గారంటే...
"ఇష్టపడి చేసిన వంటైనా, రచన అయినా బాగుంటుందని " పూర్ణిమ అభిప్రాయపడింది!
"నిరంతరం రాస్తూ ఉండాలనే కోరిక అలలా ఎగసిపడుతూనే ఉండాలంటే.?" అన్న పూర్ణిమ ప్రశ్నకు ప్రసూన గారు..
"మేథ, ఉత్సాహం, కృషి సముద్రమంత ఎదగాలి" అని జవాబిచ్చారు.(ఆ సముద్రంలోంచి ఈ అలలు ఎగసిపడతాయన్నమాట!)
ఇంతలో జ్యోతిగారు రావడంతో పూర్ణిమ 'బ్లాగురాయలనే కోరిక జ్యోతిగారికి ఎందుకు కలుగుతుందో " అడిగింది.
జ్యోతి గారి మాటల సారాంశం..క్లుప్తంగా..!
"మొదట్లో నా ఆలోచనలు, అభిరుచుల్ని రాసుకునే డైరీలా నా బ్లాగుని వాడుకున్నాను. కానీ బ్లాగుడు కొనసాగాక, నా అవగాహన, ఆలోచనా శక్తులు పెరిగాయి! మన బ్లాగులో రాసేది అందరికీ నచ్చాలని లేదు. ముందు మనకి నచ్చాలి. మిగిలిన వాళ్లకి నచ్చినా హాపీ, నచ్చకున్నా హాపీ అనుకుని రాస్తేనే ఫ్రీగా రాయగలుగుతాము" (జ్యోతి గారికి జై!)

అంతలో వీవెన్ వచ్చారు.పరిచయం అయ్యాక ఆయన వ్యక్తిగత వివరాలు(ఊరు, స్వగ్రామం వగైరా)చెప్పారు.
"అసలు ఇంటర్నెట్లో తెలుగు వ్యాప్తికి కృషి ఎలా మొదలు పెట్టారు, మీ ఉద్యోగానికి తెలుగుకి సంబంధం ఉందా?" అనిప్రశ్నించారు జ్యోతి .
తనకు తెలుగు అంటే ప్రత్యేకమైన అభిమానం లేదని, వెబ్ డిజైనింగ్ అంటే ఆసక్తి అని వీవెన్ చెప్పారు.
లేఖిని పుట్టు పూర్వోత్తరాల గురించి కూడా అడిగారు జ్యోతి! వీవీన్ గారు ఇచ్చిన ఈ కింది లింక్ ని చూస్తే మీకూ తెలుస్తుంది లేఖిని జన్మ వృత్తాంతం!
http://veeven.wordpress.com/2006/03/15/lekhini-lanuches
లేఖిని పట్ల స్పందన ఎలా ఉందని పూర్ణిమ, నేను అడిగాం! తాను ఊహించనంత ఎక్కువగా ఉందన్నారు.అసలు అంతర్జాలంలో కూడలి ఒక అద్భుతం అన్న నా అభిప్రాయంతో పూర్ణిమ ఏకీభవించింది.వర్డ్ ప్రెస్ ని గూగులు ని తెలుగులోకి మార్చింది బ్లాగర్లు కాని కొంతమంది అని జ్యోతిగారడిగిన ప్రశ్నకు సమాధానంగా వీవెన్ చెప్పారు. బ్లాగులోకంలో నిత్యం వాడే "నెనర్లు" అనేమాటని తెలుగు టపాల్లోకి ప్రవేశపెట్టింది ఎవరని నేను అడిగాను."తాడేపల్లి గారు" అని వీవెన్ చెప్పారు.
ఇంతలో కొండేపూడి నిర్మల గారు, వరూధిని గారు, మరి కాసేపట్లో భూమిక సత్యవతి గారు వచ్చారు. నిర్మల గారు తెలుగు టైపింగ్ గురించి అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతానికి కూడలి నిర్వహణ, మార్పులూ, చేర్పులూ అన్నీ తనే చూస్తున్నానని పూర్ణిమ ప్రశ్నకు సమాధానమిచ్చారు వీవెన్. కూడలి మెరుగుదలకు బ్లాగరులిచ్చే అయిడియాలకు కూడా కూడలిలో చోటుంది. చూడాలంటే కింది లంకె నొక్కండి.
http://groups.google.com/groups/koodali
పద్మ గారు, మోహన గారు వచ్చారు ఇంతలో!
ఆ తరవాత కొన్ని సరదా కబుర్లు నడిచాయి.ఇంటిపనుల్లో మగవాళ్ల సాయం గురించి అందరం సరదాగా మాట్లాడుకున్నాం! మగవాళ్ళకు వంటింటి హక్కులు అప్పజెప్పాలని పూర్ణిమ పునరుద్ఘాటించింది.(తన బ్లాగులోనే కాకుండా) ఇవన్నీ పెళ్ళయ్యాక చెప్పమన్నారు జ్యోతి! (అప్పుడేముంది చెప్పడానికి, వంటిల్లు మనపేర రాసేసి ఉంటారు అప్పటికే)
తర్వాత కూడలి, లేఖిని నిర్వహణ ఖర్చులు గురించి మాట్లాడాము."మీరు బ్లాగర్లనుంచి డబ్బు సహాయం అంగీకరించరని చదివాను, నిజమేనా?" అని నేనడిగాను.
కూడలిని కమర్షియల్ చేద్దామనుకుంటున్నానని, అది వీలుపడకపోతే అప్పుడు బ్లాగర్ల నుంచి చందాలు వసూలూ చేసే విషయం ఆలోచిస్తానని వీవెన్ చెప్పారు.
తర్వాత, వచ్చే ప్రమదావనం గురించి చిన్న చర్చ జరిగింది. ఆ సమావేశం భూమిక ఎడిటరు సత్యవతి గారింట్లో జరపాలని అనుకుంటున్నారు.(కృష్ణకాంత్ పార్క్ శ్రావణమాసం వానల వల్ల బురదగా ఉండొచ్చు కదా అని(సరదాగా))

జ్యోతి గారు స్త్రీ బ్లాగర్లు అందరూ (హైదరాబాదులో ఉన్నవారు) రావాలని ఆహ్వానించారు.
నాకో చిన్న సందేహం వచ్చింది."ఇప్పుడు మనమంతా ఒకరికొరు పరిచయం లేకుండా స్నేహంగానే ఒకరి రచనలను ఒకరు ఆస్వాదిస్తూనే ఉన్నాం కదా, వ్యక్తిగతంగా కలవడం తప్పని సరా" అని !

వరూధిని నాతో ఏకీభవించారు.
పూర్ణిమ "అది పర్సనల్ చాయిస్" అంది.
జ్యోతి గారేమో, "ఇక్కడ స్నేహితులమయ్యాము కదా, సరదాగా కలిస్తే తప్పేముంది" అన్నారు.
"ఇప్పుడు ప్రతిదీ ఉత్సాహంగా, ఆసక్తిగా చర్చిస్తున్నాం! కలిసిన తర్వాత ఆ ఉత్సాహం, ఆసక్తి ఉండవేమో అని సందేహం" అని నా సందేహం!
వీవెన్ ఇది మంచిపాయింటేనన్నారు.
"గొంతు విని,రచనలు చదివి ఏవో రూపాలు ఊహించుకుంటాం కదా! వ్యక్తిగతంగా కలిస్తే ఆ రూపాలు చెరిగిపోతాయని సుజాత భయపడుతోందర్రా" అన్నారు ప్రసూన గారు!
అపుడు కాదన్నాను గానీ నిజమే అనిపిస్తుంది ఇప్పుడు.
ఏదేమైనా, ఆగస్టు 17న ప్రమదావనం వ్యక్తిగత సమావేశం సత్యవతి గారింట్లో జరపాలని పెద్దలు నిశ్చయించిరి గాన,హైదరాబాదులో గల స్త్రీ బ్లాగరులెల్లరునూ తప్పక విచ్చేసి, సత్యవతి గారి ఆతిధ్యాన్ని స్వీకరించి సరదాగా రకరకాల కబుర్లలో పాలు, మరియు ఇతరములు పంచుకోప్రార్థన. ఇదిగో కుంకుమ భరిణె!(ఎంతైనా శ్రావణమాసం కదా)
అదీ నిన్నటి ప్రమదావనం! అదిరింది కదూ!

30 comments:

sujata said...

Sujata garu..

Yesterday, while you were having a nice time, I was struck in Traffic. :D

Good report by not including personal details of bloggers..and veeven.

Also a nice report because of the links provided therein.

More than anybody, I would like to meet you personally! I am ur secret admirer. :D Honest.

I am an admirer of Mrs.Prasoona also. Meeting.. or no meeting, I will make it a point to meet u one day! :D (if u permit:D)

Regards.

సుజాత said...

"Meeting or no meeting, I will make it a point to meet u one day"

sure, sujata gaaru, we'll meet one day and share somany things.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

"మగవాళ్ళకు వంటింటి హక్కులు అప్పజెప్పాలని "---

ఇప్పుడు కాదు చిన్నప్పటినుంచి సగానికి పైగా మేము(నేను)తీసేసుకున్నామని తెలియజేస్తున్నా అధ్యక్షా!!

సుజాత said...

రాంజేంద్ర గారండోయ్,

మీరంటే ఎవరు? మీరొక్కరూనా? అన్ని చోట్లా అల్లా లేదే పరిస్థితి!

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

వాళ్ళపేర్లెందుకులెండి,మేము అంటే Royal We అనుకోండి,:)నావరకూ ఇక్కడ అనుకొండి

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

నాపేరు రాజేంద్రండి బాబు రాంజేంద్ర కాదు హిహిహి

సుజాత said...

వంటింటి హక్కులు ఎవరు తీసేస్కున్నారో తెలుసుకోవాలనే ఉత్సాహంలో అచ్చుతప్పు దొర్లింది. సారీ అండి!

కత్తి మహేష్ కుమార్ said...

మొత్తానికి సరదా సరదాగా జరిగిందన్నమాట. నా అభినందనలు.

Purnima said...

అపుడు కాదన్నాను గానీ నిజమే అనిపిస్తుంది ఇప్పుడు. - :-))))))))

Report adurs!!

తెలుగు'వాడి'ని said...

సుజాత గారు : మీరిచ్చిన లింక్ అడ్రస్ లో తప్పు ఉంది. వీలైతే, మీకిష్టమైతే సరిదిద్దండి :-)

Here is the correct one:

http://veeven.wordpress.com/2006/03/15/lekhini-lanuches/

Address లో ఉన్నది lanuches .. కానీ మీరు ఇచ్చినది ఇది launches

To go directly please click this link : Lekhini Launches

దైవానిక said...

నాకు అందరిని కలుసుకోవాలని ఉంది. మగాళ్ళకి కూడా ఎంట్రన్స్ ఉందని చెప్పండి, వెంటనే రైలు టికెట్టు కొనేస్తా..
సుజాత గారు, నేనయితే మీకు ఒపెన్ అడ్మయిరర్ని.
ఎప్పుడో ఒకప్పుడు తప్పక కలుస్తాను లెండి.

cbrao said...

నెల నెలా బ్లాగరులు, కృష్ణకాంత్ పార్క్ లో కలుస్తున్నారు. వీరి ఛాయాచిత్రాలు చాలాసార్లు ప్రచురితమయాయి. ఈ వ్యక్తిగత పరిచయాలు, ఛాయచిత్ర ప్రచురణ పాఠకులపై పెద్దగా ప్రభావం చూపలేదు, పూర్ణిమ ను మినహాయిస్తే. సుజాతా ఒక రహస్యం చెపుతా -జాగ్రత్తగా వినండి. పూర్ణిమ కు బ్లాగరు వయస్సు ఎక్కువయితే, ఆమె/అతని బ్లాగు పై ఆసక్తి తగ్గుతుంది. నా ఉచిత సలహా ఏమంటే, మీరంతా సంతూర్ సోప్ వాడండి. మీ వయస్సడిగితే, 26 అని చెప్పండి. ఎవరైనా మీ పాపను చూస్తే, మీకు చిన్న వయస్సులోనే పెళ్లయిందని చెప్పండి. ఇలా చేస్తే మీ అభిమానులు తగ్గిపోరు. ఆగస్టు 17న ప్రమదావనం వ్యక్తిగత సమావేశం కు వెళ్లినప్పుడీ జాగ్రత్తలు పాటించండి. మీరు ఎంత Young గా కనిపిస్తే అంత hit. సమావేశమయ్యాక, అవతలవారిపై మీ pre expectations, ఎక్కువ లేకుంటే, నిరాశ చెందరు.

సుజాత said...

రావుగారు,
మీ సూచనలు చిర్నవ్వించాయి. నాకసలు 'వయసు ' అనేది సమస్యే కాదు. నా విషయమే కాదు, ఎవరిదైనా సరే! ఆంటీల గురించి నేను సరదాగా రాశాను గానీ సగం కల్పనే అది! వయసు తెలిసాక టపాలు నచ్చవన్న మన పూర్ణిమ అభిప్రాయం నాకూ ఆశ్చర్యాన్ని కల్గించింది.(అది తన ఫీలింగ్! ఓకే)ఎంతైనా అంతర్జాలంలో ఫొటోల వల్ల నష్టాలెక్కువ అనేది ఎక్కువమంది మహిళల అభిప్రాయం, కనుక మరి రేపు మీటింగ్ ఫొటోలుంటాయో లేదో మరి!

వయసును బట్టో, రూపాన్ని బట్టో అభిమానులు ఏర్పడ్డానికి,టపాలు నచ్చడానికి మేమేం సెలబ్రిటీలు కాదుగా! ఎంత బాగా రాస్తే అంతమంది చదువుతారు.

అయినా నేను ఇప్పటికే ఒక బ్లాగులో మీరిచ్చిన సలహాలను పాటిస్తున్నాను. SPF 50(SPF 100 లేదన్నాడు షాపు వాడు) గల క్రీం రాసుకుంటున్నా సిస్టం ముందు కూర్చోబోయే ముందు.

సుజాత said...

తెలుగువాడిని గారు,
తప్పు దిద్దాను. 'ఇష్టమైతే ' అంటారేంటండీ బాబూ, ఇలా తప్పులు కనపడినపుడు మీలాంటి వారు 'కళ్ళు కనపడవా ' అని అన్నా నేనేమీ అనుకోను.అచ్చుతప్పులు క్షమించరానివి. ఈ మధ్య నాకు త్వరగా టైప్ చేయాలన్న హడావిడిలో(ఈ దిక్కుమాలిన హైదరాబాదులో లెక్క ప్రకారం ఏదీ జరగదు. అందుకే కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు)తప్పులు ఎక్కువే దొర్లుతున్నాయి. ఉదాహరణకి పైన రాజేంద్ర గారి పేరు కూడా తప్పుగా టైప్ చేసాను.

ధన్యవాదాలు!

సుజాత said...

దైవానిక,
తప్పకుండా కలుద్దాం! దానికి మీటింగే అక్కర్లేదు. ఈ సారి హైదరాబాదు వచ్చినప్పుడు మా ఇంటికి రండి. మీ అభిమానానికి ధన్యవాదాలు.

చైతన్య said...

సుజాత గారు బాగుంది మీ నివేదిక. కాని స్త్రీ బ్లాగర్లకు మాత్రమే అనుమతి అంటే మరి.. మీ లాంటి మా అభిమాన బ్లాగర్లను కలిసే అవకాశం మాకు లేదా ? అధ్యక్షా ! నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. మరి అందరు బ్లాగర్లను కలుపుకొని మరి ఆ విధంగా మనం ముందుకు పోవాలి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా.

కల said...

అమ్మో నేను లేకుండా కబుర్లు చెప్పేసుకున్నారా? నేనొప్పుకోను వా వా. ఏం చేద్దాం ఆదివారం అంటే నాకు కుదరడం లేదు. మా హాస్టల్ లో నెట్ లేదు. బయటకి వద్దామనుకొంటే ఒకటే వాన. ప్చ్ ఏం చేద్దాం ప్రతిసారీ ఏదో ఒకటి అడ్డం వస్తూనే ఉంది. లాభం లేదు ఈ సారి ఎలాగైనా ప్రమదావనంలో చేరి మీ అందరితో కబుర్లు చెప్పాల్సిందే.
ఈ నెల ముఖాముఖి లో నాకూ పాల్గొనాలనే ఉంది, మళ్లీ ఇదిగో ఈ షిర్డీ ప్రయాణం అడ్డం వస్తూంది. సరేలెండి ఈ సారికి మీరే ఎలాగోలా కానించెయ్యండి. మిమ్మలందరిని కలుసుకోవాలని నాకు చాలా ఉబలాటంగా ఉంది. త్వరలోనే అందరం కలుసుకొందాం.

జ్యోతి said...

సుజాత,

నివేదిక బావుంది. మీ బదులు కుంకుమభరిణతో నేను ఎందుకు కలవాలనుకున్నానో చెప్పేసాను. ఇక వచ్చేవాళ్ళ ఇష్టం..

రమణి said...

మీటింగ్ మినిట్స్ అదిరాయి సుజాతగారు. ఇక వ్యక్తిగతంగా కలవడం విషయంలో, నేను, మీతోను, పూర్ణిమగారితోను ఏకీభవిస్తాను(ఏకీభవించక తప్పుతుందా.. నేను ఉండేది హైదరబాదులోనే, తీరా నేను మనసుపడి వెళ్దామనుకొని వెళ్ళానా.. మరి భూమి అదిరినా అది భూకంపమో, లేదా బాంబుల దాడో అనుకొని అందరూ అటూ, ఇటూ అర్ధం కాని పరిస్థితిలో .. .. ప్చ్! అర్ధం చేసుకోరూ..) మనము రాసే వాటిని బట్టి ఊహించుకొనే రీతిలో మనము ఉండము. కలిసిన తరువాత నిరుత్సాహం ఆ తరువాత మన బ్లాగు చూడాలంటే నీరసం కలగకుండా ఉండాలంటే కలవకపోవడమే ఉత్తమం. ఇది నా అభిప్రాయం.

ఈ కరెంటు దేవుడి ప్రతాపం నా బ్లాగు వైపు నా వ్యక్తిగత పనులవైపు కూడా పడ్తోందండీ అచ్చుతప్పుల రూపేణా.

మీనాక్షి said...

సుజాత గారు అంటే మీరు మీరే కలుసుకుంటారా..
మరి నేనో..:(
నేను మీ అభిమానినే ఆ సంగతి మాత్రం మరవకండి.

మీనాక్షి said...

చైతన్య గారి బాధ చూసారా సుజాత గారు.
పాపం....
చూసారా సుజాత గారు ఎంత మంది అభిమానులను మూట కట్టుకున్నారు మీరు..అమ్మో నన్ను మరిచిపోయేరు..ఈ హంగామాలో .
ఇ చిట్టి బ్లాగరిని కూడా కాస్త దయ చేసి మీ అభిమానుల లీస్ట్ లో చేర్చుకోగలరని మనవి.

veera swamy said...

this comment is not related to this article. can you please publish again journalist part3 with comments included.

రమణి said...

అయ్యో నేను కూడా వ్యాఖ్య రాసానుగా!! నా వ్యాఖ్యలేమన్నా వద్దనుకొన్నార? సుజాత గారు ఏమయ్యింది? నా వ్యాఖ్య? దారి తప్పిందా లేక మీకేమన్నా అభయంతరంగా అనిపించిందా(నేనేమి అలా రాయలేదే?) ఓ.కె. మీ మినిట్స్ అదిర్యాయండి. ఇంతకన్నా ఇక ఏమి చెప్పను? చెప్పాల్సిందంతా మొదటి వ్యాఖ్యలో చెప్పేసాక.

సుజాత said...

కల,
మీరలా మల్లిక్ 'చిట్టి ' లాగా 'వా వా ' అని గోలపెడితే ఎలా? వారం మార్చి వారం ప్రమదావనం ఉంటుందని తెలుసుగా మీకు! జ్యోతిగారు తన బ్లాగులో చెపుతూనే ఉంటారు. ఈ సారి తప్పక రండి!బోలెడన్ని సరదా కబుర్లు చెప్పుకుందాం మగవాళ్ల మీద!

సుజాత said...

రమణి గారు,
పొద్దుటినుంచీ కూడలి ఎందుకో నీరసంగా ఉంది. కామెంట్స్ కానీ కొత్త టపాలు కానీ అప్ డేట్ కాలేదు. పైగ మాకు కరెంట్ లేదు ఇక్కడ. ఏవో కొత్త లైనులు వేస్తున్నారనే వంకతో మరి కాస్త ఎక్కువ టైము తీస్తున్నాడు ఇక్కడ!(ఎవరన్నా మంత్రి గారి చుట్టాలు మా ఫ్లాట్స్ లో దిగితే బాగుణ్ణు)అందుకే మీ వ్యాఖ్యలు రెండూ ఇప్పుడే చూశాను.

చిట్టి మీనాక్షి,
నువ్వు కూడా అందుకో కుంకుమ భరిణె! మీటింగ్ కి వెళ్ళు!(నేను రావాలో వద్దో ఆ రోజు వర్షం, వీకెండ్ వచ్చిపడే చుట్టాలు వంటి విషయాలు నిర్థారిస్తాయి) ఇకపోతే బ్లాగులు నచ్చగానే అభిమానులైపోతారా ఏంటి? అంత లేదు.

సుజాత said...

వీరాస్వామి గారు,
తప్పక ప్రచురిస్తాను.

సుజాత said...

చైతన్య,
అలాగే ముందుకు పోదాం! వచ్చెయ్యండి!

Purnima said...

రావు గారు: మీది నిఝంగా ఉచిత సలహా అనేనా అని నాకు అనుమానం ఇప్పుడు ;-) నేనేదో వయసూ అన్నానే అనుకోండి, అంత మాత్రాన అందరూ పౌడర్లూ, సబ్బులూ వాడేయమనడంలో లాజిక్కు బాగానే అనిపిస్తున్నా.. మీరు మరీ నా కళ్ళకు పరీక్ష పెడుతున్నారేమో అనిపిస్తుంది. ఎంత మేకప్ ఏసుకుంటే మాత్రం నాకు తెలీదా ఏంటీ? ఇందుకైనా నేనా మీటింగుకి వెళ్ళాలి మరి!! (మీ వ్యాఖ్యని అత్యంత సరదా గా తీసుకుంటే వచ్చిన ప్రతిస్పందన ఇది)

సుజాత గారు: "మన పూర్ణిమ" అన్నది మీ వ్యాఖ్యలో కనిపించకపోతే, అసలు ఇంకేమీ చెప్పకుండా వెళ్ళిపోయేదాన్ని. I give a damn to how people interpret me. మీరా వ్యాఖ్య చదివి, అది నచ్చకపోయినా నా "ఫీలింగ్" కి విలువిచ్చి, నాతో అంతే సరదా ఉన్నందుకు ఎంత సంతోషంగా ఉందో!! ఆ అనందంలోనే ఈ వ్యాఖ్య!!

మీ అందరికీ నేను మహా అయితే ఓ మూడు నెలలుగా తెలుసు, కూడలిలో నా టపాలు వస్తున్న దగ్గరనుండీ! మీ అందరితో ఈ ఉత్తరప్రత్యుత్తరాలు కూడా అప్పటినుండే. కానీ నేను గత రెండేళ్ళుగా తెలుగు బ్లాగులు చదువుతున్నాను. వ్యాఖ్యాన్నించటం చాలా తక్కువ కానీ, చదవటానికి, ముఖ్యంగా బ్లాగులు చదవటానికి నేను కొత్త కాదు. చదివాక, ఏం పట్టించుకోవాలి? దేన్ని మర్చిపోవాలి అన్న వాటి మీద నాకు కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి. కొన్నిసార్లు నేను రాసింది ఆడ/ మగ కూడా చూడను, పేరు గమనించను, ప్రోపైల్ లోకి అసలు వెళ్ళను, ఆ టపా నేను చదువుతున్నంత సేపూ, చదివాకా ఆలోచిస్తున్నంత సేపే, వారితో నా పరిచయం. నాకెంత చనువు ఏర్పడినా, అది వారి అక్షరాలతోటే!! వ్యక్తిగత స్నేహాలుగా మారితే అడ్డుకోను గానీ, అదే పరమావధిగా బ్లాగులు చదవను. ఇప్పుడు నేను రాస్తున్నా ఆ తీరు ఏ మాత్రం మారలేదు.

ఇక వయస్సు మీద నా కమ్మెంట్: "ఒక్కోసారి వారి "వయస్సు" తెలుసుకున్నాక.. ఆ టపాలు అంతగా నచ్చవు!! ;-)"
నాకు అని చెప్పలేదు. ఎవరికీ అనీ చెప్పలేదు. వయస్సు ఎక్కువా, తక్కువా అనీ చెప్పలేదు, ఏ విధంగా నచ్చవో చెప్పలేదు. మరెందుకు రాసాను?? నా టపాలు విరివిగా చదివే ఒకరు, నా వయస్సు తెలిసాక.. "అబ్బే.. ఇప్పుడంత నచ్చటం లేదు" అని నాతో చెప్పారు కనుక. ఇది కేవలం ఒకరు నాతో అనిందే!! అందుకే.. ఒక్కోసారి అని అన్నాను గాని జెనరలైజ్ చేయలేదు. నాకని అసలు చెప్పలేదు. ఒకవేళ ఆ అభిప్రాయమే ఉండుంటే నేనింత "ఆక్టివ్" గా ఉండడం కష్టం. వయస్సులు లెక్కేట్టుకోవటంతో సరిపోయేది.

"వయసును బట్టో, రూపాన్ని బట్టో అభిమానులు ఏర్పడ్డానికి,టపాలు నచ్చడానికి మేమేం సెలబ్రిటీలు కాదుగా! "- బాగా చెప్పారు!! పై పై హంగులు మనకనవసరం, మనమేంటో మనకి తెల్సినంత వరకూ!! మీ మాటే, నాదీనూ!!

ఇక ఈ వ్యాఖ్యని ఎలా interpret చేసుకుంటారన్నది నేను పట్టించుకోను. అందుకే ఇక నేను దీని గురించి ఏమీ రాయను.

మీ పూర్ణిమ :-)

సుజాత said...

పూర్ణిమ,
నువ్వు "వయసు తెలిసాక టపాలు కొన్ని అంతగా నచ్చవు" అన్నప్పుడే అది నీ పర్సనల్ ఫీలింగ్ గా భావించి ఇంకేమీ అడగలేదు. నిజానికి వయసు ఎక్కువైతే నచ్చవా, తక్కువైతే నచ్చవా, వయసుకీ, టపాలకీ సంబంధం ఏమిటి ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ పోతే అసలే ప్రతిదీ ఇష్యూగా మారుతున్న కూడలిలో మరింత "అనవసర " చర్చ జరిగి సమయం వృధా కావడం తప్ప మరేం ఒరగదు.(ఈ డౌట్లు మనసులో వచ్చి కూడా).అందుకే నీ అభిప్రాయం ఆశ్చర్యాన్ని కలిగించిందని మాత్రం అన్నాను ఇక్కడ రావుగారికి నేనిచ్చిన సమాధానంలో! ఒకరి అభిప్రాయాలకు విలువ నివ్వడంలోనే సంస్కారం ఉందని నేను భావిస్తాను ఆ అభిప్రాయం వల్ల మనకేం నష్టం జరగనంతవరకు!

నువ్వన్నట్టుగానే అదే అభిప్రాయం నీకుంటే వయసులు లెక్కెట్టుకోవడంతోనే సరిపోయేదేమో! మనమేంటో మనకు తెలిసినపుడు పై హంగులతో పట్టింపు లేదన్నావుకదా! రావు గారు సరదాగా రాసిన వ్యాఖ్యను ఇంత సీరియస్ గా తీసుకుంటావని నేను అనుకోలేదు.

cbrao said...

@సుజాత: "రావు గారు సరదాగా రాసిన వ్యాఖ్యను ఇంత సీరియస్ గా తీసుకుంటావని నేను అనుకోలేదు. " - మీ/మా/మన పూర్ణిమ అలిగినట్లుంది, అచ్చు మా అమ్మాయి లాగే. పూర్ణిమ కోపం తగ్గాలంటే ఏమి చెయ్యాలి చెప్మా? ఆప్యాయతలున్న చోట కోపాలూ సహజమే.

Post a Comment