September 5, 2008

చిరంజీవి దత్త పుత్రిక పెళ్ళి గోల!

ఎంకి పెళ్ళి సుబ్బి చావు కొచ్చినట్టు అంటే ఇదేనేమో! కాకపోతే ఇక్కడ కత్తి పద్మారావు ఇంట్లో పెళ్ళి చిరంజీవి పీకకి చుట్టుకుంది.
పద్మారావు గారి కొడుకు పెళ్ళికి ఈయన ఏల వెళ్ల వలె?
వెళ్ళితిరి పో, 'పెళ్ళి కూతురి తల్లి దండ్రుల గురించి ఏల వాకబు చేయవలె?
చేసెను పో,ఆయన 'మీరే ఈ పిల్లకు తండ్రి 'అని ఏల ప్రకటించవలె?
అన్నాడు పో, ఈయన 'కులాంతర వివాహాల వల్ల సమ సమాజం వస్తుందని ఏల వాక్రుచ్చవలె? (తన ఇంట్లో జరిగిన రచ్చ మర్చిపోయి?)

ఇంతకీ విషయమేమిటంటే ఇటీవల ప్రజారాజ్యం పార్టీలో చేరిన దళిత నాయకుడు కత్తి పద్మారావు గారి కుమారుడు చి:కేతన్ నళిని అను సౌభాగ్యవతిని వివాహమాడాడు. అది పిల్ల తల్లి దండ్రులకు ఇష్టం లేని పెళ్ళి. పెళ్ళికి వెళ్ళిన చిరంజీవి వధూ వరులను ఆశీర్వదించి రాకుండా "వధువు తల్లి దండ్రులేరీ" అనడిగాడు (వాళ్లను కూడా పరిచయం చేసుకుంటే రెండు వోట్లు కలిసి వస్తాయని కాబోలు!)

పద్మారావు గారు చాన్స్ తీసుకుని "ఇది కులాంతర వివాహం! అగ్ర కులానికి చెందిన వధువు యొక్క తల్లి దండ్రులకు ఈ వివాహం ఇష్టం లేదు.మీరే వధువుకి ఇక తండ్రి (అతిశయోక్తి కాకపోతే ఇదెక్కడి విడ్డూరం?)అన్నారట.
దానితో విస్తుపోయిన చిరంజీవి (కత్తి పద్మారావు ఇలా ప్రకటిస్తాడని ఊహించడు కదా) వధువు తన కుమార్తె లాంటిది అని అంతటితో సరిపెట్టకుండా కులాంతర వివాహాల వల్ల మాత్రమే నూతన సమాజం వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేసాడట.

తర్వాత పరిణామాలు: వధువు తల్లి దండ్రులు మీడియా ముందు చిరంజీవిని దుమ్మెత్తి పోయడం! చిరంజీవి ఇంటిముందు ధర్నా చేస్తామని బెదిరించడం!తమ కుమార్తెను చిరంజీవి సినీ గ్లామర్ ను చూపించి బంధించి బలవంతంగా ఈ పెళ్ళి చేసారని, వారు ఆరోపిస్తున్నారు.(ఇదేమి వాదన?)24 గంటల లోపుగా తమ కుమార్తెను తమకు అప్పగించాలని వారి డిమాండ్!

NTV లో జరిగిన ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో 24 యేళ్ల వధువు నళిని ఫోన్లో "నా ఇష్ట ప్రకారమే ఈ పెళ్ళి జరిగింది. ఎవరి బలవంతం లేదు" అని చెప్పినా తల్లిదండ్రులు వినిపించుకోకుండా చిరంజీవిని దుమ్మెత్తి పోశారు.

ప్రజారాజ్యం పార్టీ తరఫున అద్భుత మైన వక్త పరకాల ప్రభాకర్ "ఆయన అతిథి గా మాత్రమే వెళ్లారు. పెళ్ళి పెద్దగా కాదు" అని వివరణ ఇవ్వడం తర్వాతి పరిణామం!

ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తోంది? ఎవరో చెరగని చిరునవ్వుతో ఇదంతా జరిపిస్తున్నరని అనిపించటం లేదా కొంచెమైనా?

ఆ తల్లిదండ్రులు చిరంజీవిని టార్గెట్ చేయడమేమిటి? పెళ్ళికి పిలిస్తే వెళ్లాడు, నాలుగు మంచి మాటలు చెప్పి వచ్చాడు. 24 యేళ్ల మేజరు కుమార్తెను, పైగా వివాహితను, అప్పగించకపోతే,చిరంజీవి ఆఫీసు ముందు ధర్నా చేస్తారట!
పోనీ మీ అమ్మాయితో మాట్లాడి చూడండి అంటే "మాకప్పగించే దాకా మాట్లాడేది లేదు" అంటున్నారు.

పెళ్ళి పందిరిలోనికి రానివ్వకపోతే పోలీసులదగ్గరికి వెళ్ళొచ్చుగా? పద్మారావుని వదిలేసి చిరంజీవిని పట్టుకున్నారు.

"మీ కుమార్తె పెళ్ళికి కులాలు అడ్డం వచ్చి మీరు పెళ్ళికి అంగీకరించలేదు. మాకు అక్కర్లేదా కులాలు? మీ అబ్బాయికి దళిత అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారా? కన్నతల్లి బాధ గురించి తిరుపతి సభలో అంత మాట్లాడారుగా, నేను కన్న తల్లిని అని మర్చి పోయారా?" అని ప్రశ్నలు సంధిస్తున్నారు.

నిజానికి ఇందులో చిరంజీవి తప్పేముంది? పెళ్ళిలో కాజువల్ గా వధువు తల్లి దండ్రుల గురించి అడగ్గానే కత్తి పద్మారావు తన కోడలిని దత్తత ఇచ్చేస్తాడని ఊహించడు కదా ! నలుగురిలో ఉన్నాడు కాబట్టి 'కులాంతర వివాహాల వల్ల నూతన సమాజం వస్తుందని ' హితకారకంగా మాట్లాడాలని తపనపడి ఉండొచ్చు (ఇక్కడే కొంచెం సంయమనం పాటించి ఉండవలసింది. శ్రీజ పెళ్ళి విషయంలో తానెలా ప్రవర్తించిందీ గుర్తు చేసుకుని గంబీరంగా చిరునవ్వుతో సరిపెడితే పోయేది)

ఇప్పుడు పార్టీ తరఫున 'అతిథిగా మాత్రమే వెళ్లారు, పెళ్ళి పెద్దగా కాదు" అని ఆత్మ రక్షణ ధోరణి లో పడక తప్పలేదు.
ఇప్పుడు చిరంజీవికి రెండు దార్లు!
1.కులాంతర వివాహాలను సమర్థిస్తూ మాట్లాడాడు కాబట్టి శ్రీజను ఇంటికి ఆహ్వానించడం.

2."నేను అతిథిగా మాత్రమే వెళ్ళాను, అంతకు మించి నాకు , ఆ పెళ్ళికి ఎటువంటి సంబంధం లేదు! ఇదంతా ఎవరు చేయిస్తున్నారో నాకు తెలుసు" అని ఒక ప్రకటన స్వయంగా చేస్తే మీడియా, జనం 'ఎవరై ఉంటారు ' అని SMS కాంటెస్ట్ లు పెట్టుకుంటూ అసలు విషయాన్ని మరిచిపోతారు.

31 comments:

Saraswathi Kumar said...

రాజకీయాలలో ఉన్నవారు ఏం అంటే..ఏంవచ్చి మెడకు చుట్టుకుంటుందో ఆ కొత్త నాయకుడికి అర్థం అయ్యేదాకా ఇటువంటి సమస్యలు తప్పవు.

టెంప్లేట్ మార్చడంతో పాటు మీరు చేయవలసినది కామెంట్ల బాక్స్‌ను టపాక్రింద వచ్చేటట్లు చేయడం. మీకు కామెంట్లు ఎక్కువ గనుక మీరిది చేస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుంది. అదెలాగో చదువరిగారు కొద్ది రోజుల క్రితం టపా రాశారు.

చైతన్య said...

మీతో ఏకీభవిస్తాను సుజాత గారు. 30 తేది వివాహం జరిగితే 4 తేది మీడియా ముందుకు వచ్చారు. మరి ఆ నాలుగు రోజులు ఏమి జరిగినట్టు. " కత్తి " గారిని వదలి ఎందుకు "చిరు" ను పట్టుకున్నారో మరి!!అందరికి తెలిసిన విషయమే. మీరనట్టు చిరునవ్వుతో శెలవు తీసుకొని వుంటే బాగుండేది. ఇన్ని మాటలు పడాల్సి వచ్చేది కాదెమో. తల్లి భాదను అర్థం చేసుకోగలం కాని వారి దృష్టి "కత్తి" గారి కంటే కూడా చిరు మీద ఉంది. చిరు ని టార్గెట్ చెయ్యడం ఇంకా పార్టీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాం అనడం చూస్తుంటే జరిగిన, జరగబోయే సంగతులు అవగతం అవుతాయి.

ss said...

కానీ ఈ రొజు ఆ అమ్మాయి తల్లిదంద్రులు "చెరగని చిరునవ్వు" నవ్వే వ్యక్తిని కాకుండా "నవ్వటం తెలియని" వ్యక్తిని కలిసారేంటి చెప్మా.

కత్తి మహేష్ కుమార్ said...

మిమ్మల్ని అర్జంటుగా ప్రజారాజ్యం పార్టీలో సలహాదారు/రిణి గా నియమించెయ్యాలి. టపా బాగుంది. పాపం చిరంజీవి. రాజకీయాలలో ఇలాంటి మెలికలుంటాయని ఇంకా తెలిసినట్టు లేదు.

durgeswara said...

buradalo ki digaaka marakalamtukunnaayamte elaa? tappavu.

nuvvu narasaraao pet eppudostunnaavammaa?

సుజాత said...

దుర్గేశ్వర గారు,
నేను నరసరావు పేట దసరా కి వద్దామని అనుకుంటున్నాను! (ప్రస్తుతానికి అదే ప్లాను)వస్తే మిమ్మల్ని తప్పక కలుద్దామని ఆలోచన!

Purnima said...

తప్పవు ఇలాంటి తిప్పలు, పాపం చిరంజీవికి!

అవునూ.. చెప్పటం మరిచా, మీ టెంప్లేట్ అదుర్స్!

sujata said...

1) Very nice templete. 2) Chiranjeevi must understand this is just a beginning. 3) U can sure make a good mentor to Chiru..
Love, su

చిలమకూరు విజయమోహన్ said...

చిరునవ్వు నవ్వని వాళ్ళతో ఇలాంటి సమస్య రాదు గానీ చిరునవ్వో, అది ఏ రకం నవ్వో తెలియని నవ్వు నవ్వే వారితోనే అసలు సమస్య. వారిని చిరంజీవి గారు ఎదుర్కోవాలంటే తన సినిమా మేధస్సుకు పదను పెట్టాల్సిందే.

రాధిక said...

"చెరగని చిరునవ్వు" ...హ హ హ :)

bujji said...

hi, sreeja vishayam lo adi kevalam caste matrame reason ani nenu anukonu.. meeku telise untundi, chiru valla pedda ammayini uday kiran ki ichi cheddamanukunnadu.. uday brahmin kada.. caste feeling ekkadundi chiru ki...

independent said...

ఈ మధ్యన ఆంధ్ర లో వార్తలు చదవక చాలా రోజులు అయిపోయింది. అంతకుముందు కనీసం హెడ్ లైన్స్ అయినా చూసేవాణ్ణి. మీ ఈ బ్లాగుల ద్వారా ఇలాంటి వార్తలే కాకుండా, లైఫ్ స్టైల్(మీ కారు సంగీతం బ్లాగు బాగుంది) విశేషాలు కూడా తెలుస్తున్నాయి. కృతఙ్నతలు. మీ రచనా శైలి మల్లాది తరహాలో అహ్లాదంగా, ఎక్కడా ఆసక్తి తగ్గకుండా, పదాలెక్కువ పడకుండా, సరదాగా చదుకోడానికి నాకు బాగుంటుంది.

independent said...

సుజాత గారూ..
నేను ఇందాకటి కామెంట్ నిషిగంధ గారి బ్లాగులో పోస్ట్ చేయబోయి, అప్పటికే ఓపెన్ అయ్యిఉన్న మీ బ్లాగులో పోస్ట్ చేశా..

I apologize. It was an inadvertent mistake.

Please do take care of this.

Sorry again..

అబ్రకదబ్ర said...

పాపం, చిరంజీవి. అసలు కత్తి పద్మారావు ప్రజారాజ్యంలో చేరటమే నాగభూషణం నవ్వు నవ్వే ఆయన పధకం ప్రకారం జరిగిందేమో?

ఈ టెంప్లేట్‌లో రంగులు మరీ ఎక్కువైపోయినట్లున్నాయి.

Sreedhar Garlapati said...

ఏదొ సామెత చెప్పినట్లు వురుము వురిమి చిరంజీవి మీద పడింది. అందరి చేత మాటలు పడుతున్నాడు.

సుజాత said...

మహేష్, మరియు సుజాత గార్లు,
ఏమిటి, నేను హాయిగా బ్లాగులు రాసుకోడం మీకిష్టం లేదా? నన్ను ప్రజా రాజ్యానికి పంపెయ్యాలని చూస్తున్నారు? నేనొప్ప! నేనొల్ల!

సుజాత గారు మీరు su అంటే నవ్వొచ్చింది.
డల్లాస్ లో మా ఇంటికింద వాడు(కింద ఫ్లోరని) నా పేరు పిలవడం రాక 'sujaatha అని రాసిస్తే సుజాథా ' అనే వాడు. sujata అని రాసిస్తే సుజాటా అని పిలిచే వాడు. చివరికి ఈ బాధ పడలేక sue అని పిలవమన్నాను.(వాళ్లకుంటారుగా sue

సుజాత said...

విజయమోహన్ గారు,
దేన్నయినా మెరుగు పరచాలంటే అదంటూ ఉండాలిగా ముందు! మీరు పదును పెట్టాలన్నారుగా..దానిగురించి!

అబ్రకదబ్ర,
మీ డౌటే నాకూ ఉంది!
అయితే తెంప్లేట్ లో రంగు బాగా పడిందన్నమాట! కొంచెం కడుగుతాను.

సుజాత said...

independent గారు,
మీరు నిషి కి రాసిన వ్యాఖ్య చాలా బాగుంది నిషి కథ లాగే! అందులో 'నిషి గంధా' అని లేకపోతే మీరు చెప్పినా వినకుండా నా బ్లాగ్ లో పెట్టేసేదాన్ని ! పబ్లిష్ చేయలేదు లెండి!ఇలాంటి పొరపాట్లు ఇంతకు ముందు నేనూ చేశాను. ఆ తర్వాత ఒక సారి ఒకే బ్లాగు చూడ్డం అలవాటు చేసుకున్నాను.

మీ అభినందనకు ధన్యవాదాలు! మరీ మల్లాది గారితోనా పోల్చడం!

అయితే మరి పొగడ్తతో పొంగి పోయి "ఔరా, మీ రచనా చమత్కృతి ఏమియో గాని " అని పాండవోద్యోగాల్లోని పద్యం చదువుకుంటా కాసేపు!

సుజాత said...

సరస్వతి కుమార్ గారు,
ఏవి ఎప్పుడు మెడకు చుట్టుకుంటాయో తెలుసుకున్నాక రాజకీయాల్లోకి దిగితే బాగుండదూ!

దీనికే ఇంత కుదేలైపోతే ఇక అసెంబ్లీ సెషన్స్ లో ఎలా నెగ్గుకొస్తాడు?(అధికారంలో ఉన్నా, ప్రతి పక్షంలో కూచున్నా), రాజశేఖర్ రెడ్డి ఇ రోశయ్య లాగా తన తరఫున సమాధానం చెప్పేందుకు ఎవర్నన్నా చూసి పెట్టుకోవాలి చిరు!

బుజ్జి గారు,
ఉదయ్ కిరణ్ వ్యవహారంలో కూడా వాళ్ల అమ్మాయి ఉదయ్ కిరణ్ ని ఇష్టపడ్డానని చెప్పాకే విషయం పెళ్ళి కబుర్లదాకా వెళ్ళిందని చదివాను ఒక 'క్రానిక్ ' ఇంగ్లీష్ పత్రికలో !
మీరు చెప్పింది కూడా పాయింటే! కేవలం కులం ఒక్కటే కాదు, ఇంట్లో "ఎవరికీ చెప్పకుండా" అనే విషయం తండ్రిగా చిరంజీవిని బాధించి ఉండొచ్చు!

కానీ శ్రీజ పెళ్ళి జరిగినపుడు అందరూ చిరజీవి కులం కోసమే బాధ పడ్డాడని భావించారు.

chaduvari said...

అసలు సంగతిని చెప్పారు. ఈ పెళ్ళి గొడవా, పెళ్ళి కూతురి తల్లి గొడవా దూది లాగా ఎగిరిపోయేవే. కానీ, ఈ అనవసర వివాదం కారణంగా చిరంజీవి కూతురి గొడవ మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఈ గొడవకు పురెక్కించినవారు సాధించదలచింది కూడా ఇదేనేమో!

ఏదేమైనా, చిరంజీవి ఎరక్కపోయి వెళ్ళి ఇరుక్కుపోయాడు. (తొమ్మిదో టీవీలో వికటకవిలో ఈ పాటే వస్తది చూడండి.)

ఇక, మనోభావాలను గాయపెట్టేసుకునేవారు ఇంకా ఏ ప్రకటనా చెయ్యలేదేమిటో.. ఢిల్లీలో గాని ఉన్నారా!!?

"అద్భుత మైన వక్త పరకాల ప్రభాకర్" -దీన్ని మీరు వ్యంగ్యంగానే అన్నారని భావిస్తున్నాను. కాదంటే చెప్పండి! :)

మొత్తమ్మీద మల్లురవి నచ్చాడు నాకు. ఎగస్పార్టీ వాడయ్యుండీ, చిర్నవ్వుల దొరవారికి బంటయ్యుండీ నిజాయితీగా ఉన్నదున్నట్టు చెప్పేసాడు.

గీతాచార్య said...

చిరంజీవికి సిరంజీవి తగిలింది. అదే సిరంజి లాంటి మాటలు గుచ్చుకున్నాయి. ఇక ప్రాబ్లం లేదు. రాజకీయ అనారోగ్యం తగ్గిపోతుంది. అదే తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకుంటాడు. ఇంక మీ టపా నాకూ పనికి వస్తంది. ఒకట్రెండు చోట్ల నేనూ ఇరుక్కుని.... ఎలాగో తప్పించుకుంటున్నాను.

ఏమన్ఠిరీ ఏమన్ఠిరీ sms contest లా? ఎంత మాఠా ఎంత మాఠా ఇది చిరు సమస్యే కానీ జనం సమస్య కాదె. ఖాదూ ఖాఖూడదూ.

అయినా జనం ఇలాంటివి పట్టించుకోక పోతే ఇల్లాంటి పిచ్చి గోల ఉండదు కదా! జనం వింటున్నారనే పత్రికలూ, టీవీలూ పని కట్టు కాకుండానే ఇలాంటివి......

గీతాచార్య said...

Template is looing good. where did youfind this type of template? would you plz tell me the link?

సుజాత said...

గీతాచార్య, ఇక్కడ చూడండి, మీకు కొన్ని మంచి టెంప్లేట్స్ దొరుకుతాయి. మనవాళ్ల టెంప్లేట్స్ లో చాల వరకు ఇక్కడివే!
www.finalsense.com
మరి కొన్ని ఇక్కడ కూడా చూడండి
www.btemplets.com

ప్రవీణ్ గార్లపాటి said...

ఈ విషయాలను రేపుతారని ఆయన పార్టీ పెడతారని ప్రకటించినప్పుడే అనుకున్నాను.
దిగాక తప్పదు మరి.

ప్రియ said...

చిరంజీవి కూతురి కథ ఇంత ఉందా? ఎప్పుడు రాజకీయాలలోకి వచ్చాడు?
పార్టీ పేరేంటి?

సరే! మీ బ్లాగ్ టెంప్లేట్ బ్లాగు బ్లాగు.

"ఎంకీస్ మ్యారేజ్ సుబ్బిస్ డెత్ యానివర్సరీ."

:-)

independent said...

థాంక్స్ సుజాత గారూ..
ఏదో ఒక perticular space&time లో అలా ఫీల్ అయిపోతుంటాను. తర్వాతెప్పుడో మళ్ళీ వచ్చి అలాంటి వ్యాఖ్యలు చదివితే ఎంబరాసింగ్ గా ఉంటుంది. కానీ 'క్షణాన్ని ' మరపు లోకి పంపించొచ్చేమో కానీ, ఆ 'క్షణం' నిజం కాకుండా పోదు కదా..కనీసం ఆ క్షణానికైనా!.

అవునూ, మీరూ కథలు ఎందుకు రాయకూడదు? మల్లాది "అందమైన జీవితం" చదివారా? మరీ పొగడట్లేదు కాని, మీరు ప్రయత్నిస్తే అలాంటి అహ్లాదంగా ఉండేవి రాయగలరనిపిస్తోంది. (మునగచెట్టేం కాదు. మరీ ఆయనతో ఈక్వేట్ చేయట్లేదు నేను).


సరస్వతీ కుమార్ బ్లాగులో కామెంట్ చూశా..మీరు చాలా సీరియస్ రీడర్ అండి బాబో. "ఓల్గా నుంచి గంగకి" నా వల్ల కాక మళ్ళీ పక్కన పెట్టేసా. మీరసలు దాన్ని నమిలేశారు.

independent said...

సుజాత గారూ..నేను 'ఎంబరాసింగ్' అన్నది నిషిగంధ బ్లాగులో నేనొదిలిన కామెంట్ గురించి...మీమ్మల్ని పొగడ్డం గురించి కాదు..
మీరేమనుకుంటున్నారేమోనని అనుమానమేసి భయం తో ఈ వివరణ!.

సుజాత said...

independent గారు,
నేనేదో సరదాకి అంటే మీరు సీరియస్ గా ఆ వ్యాఖ్యకి రిప్లయి కూడానా! ఏమిటి, ఇంకా వోల్గా సే గంగా అవలేదా!హా! రాహుల్జీ!

బొల్లోజు బాబా said...

అవున్నిజమే.
శ్రీజ విషయం చిరంజీవికి అచెలీసి హీల్ గా పరిణమిస్తుంది. బహుసా ముందుముందు ఇంకా ఉండవొచ్చు.

బొల్లోజు బాబా

రిషి said...

అవసరమున్నా లేకపోయినా...సంబందమున్నా లేకపోయినా....ప్రతీ developer వాళ్ళ PM ని తిట్టినట్టు, చిరంజీవిని కూడా...అందరూ టార్గెట్ చేస్తారు మరి...ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు.

మీ విశ్లేషన బాగుంది.

రిషి said...

అవసరమున్నా లేకపోయినా...సంబందమున్నా లేకపోయిన....ప్రతీ వాళ్ళ ని తిట్టినట్టు, చిరంజీవిని కూడా...అందరూ టార్గెట్ చేస్తారు మరి...ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు.

మీ విశ్లేషన బాగుంది.

Post a Comment