September 11, 2008

తెలుగంటే అంత అలుసా?

"మేము యూపీ వాళ్లం, హిందీ లోనే మాట్లాడతాం" అన్న జయా బాధురి మాటలకు రాజ్ ఠాక్రే ఏమన్నాడో, ఎలా స్పందించాడో అంతా చూసే ఉంటారు,


"యూపీ వాళ్ళై, హిందీ యే మాట్లాడాలనుకుంటే యూపీయే వెళ్ళిపోండి, ఇక్కడెందుకు ఉన్నారు?" ఠాక్రే మాటల్లో సంస్కృతి పట్ల దురభిమానం, అహంకారం కొట్టొచ్చినట్టు కనపడుతున్నా ఆయన పట్టుదలకు ఆశ్చర్యం, కొంచెం ముచ్చట కూడా వేస్తున్నాయి నాకు! ఈ స్థాయిలో మాట్లాడే తెలుగు నాయకుడొకరు మనకు తప్పకుండా కావాలనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర రాజధానిలో ఉన్నంత అధ్వాన్న పరిస్థితి తెలుగు కు రాష్ట్రంలో ఇంకెక్కడా లేదు.

ఒక్కోసారి నేను తెలుగు రాష్ట్రంలోనే ఉన్నానా లేక ఇంకెక్కడైనా ఉన్నానా అని అనుమానపడే పరిస్థితులు ఎదురయ్యాయి నాకు. గత పదేళ్ళ బట్టి(మధ్యలో రెండు మూడేళ్ళు మినహాయించి) హైదరాబాదులో ఉంటున్నా, ఆగస్టు పదిహేనున మైకుల్లో హోరెత్తి పోయే దేశభక్తి గీతాల్లో కనీసం ఒక్క తెలుగు పాట వినలేదు నేను. 'మేరే దేశ్ కి ధరితీ " అంటూ మొదలై "యే మేరే వతన్ కీ లోగోం" అంటూ ముగిసే హిందీ పాటలు తప్పించి! అదే ఆంధ్రా వైపున 'భారత మాతకు జేజేలు, బంగరు భూమికి జేజేలు 'అంటూ మొదలవని స్వాతంత్ర్య దినోత్సవమే ఉండదు! ఇప్పటికి కూడా! వారం రోజుల నుంచీ వింటున్నా గణపతి మండపాల్లో పాటలు, అన్నీ హిందీవే! (ఎక్కడో నల్లకుంట , దిల్ సుఖ్ నగర్ వంటి కొన్ని చోట్ల తప్ప)

హైదరాబాదులో, ఆంధ్ర రాష్ట్ర రాజధానిలో, హిందీ రాకపోతే బతకడం కష్టం అన్న అభిప్రాయం సర్వత్రా ఉందంటే ఇంతకంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉండదనుకుంటాను.ఎప్పుడో ఏళ్ల కిందట వ్యాపారం కోసం ఇక్కడికొచ్చి పాతుకుపోయినా మార్వాడీలు, సర్దార్జీలు మొదలైన వాళ్ల గురించి నాకే ఆక్షేపణా లేదు. బేగం బజార్, సికిందరాబాదు పాట్ మార్కెట్, మొదలైన ప్రాంతాల్లోని ఇతర రాష్ట్రాల వ్యాపారులు చక్కని తెలుగు(కనీసం మనకి అర్థమయ్యే తెలుగు) మాట్లాడతారు!

ఎక్కడికెళ్ళినా హిందీలోనో, ఇంగ్లీషులోనో సంభాషణ మొదలు పెట్టే దౌర్భాగ్యం మనకి ఎప్పుడు మొదలైందంటే...ఐటి కంపెనీల మూలంగా ఇతర రాష్ట్రాల యువత ఇక్కడికి ఉద్యోగాల కోసం తండోప తండాలుగా రావడం మొదలయ్యాక!ఐటీ కంపెనీల ఉద్యోగులు ఎక్కడ ఎక్కువ మంది కేంద్రీకృతమై ఉంటారో అక్కడ "భాషా దురభిమానం" ఎక్కువగా ఉందని నా అనుభవంలో చూసి తెలుసుకున్నాను!

వీళ్ళకి పని మనుషులు, కూరల షాపు వాడు, సూపర్ మార్కెట్ లో వాళ్ళు,ఇస్త్రీ చేసే వాడితో సహా హిందీ వచ్చిన వాళ్ళే కావాలి!మేము ఉండే ప్రాంతంలో అంతా వీళ్ళే! ఇక్కడ స్థలాలు కొంటారు, ఇళ్ళు కొంటారు, ఉద్యోగాలు చేస్తారు గానీ భాష మాత్రం నేర్చుకోవడం మాట అటుంచి, కనీసం అర్థం చేసుకునేందుకు ప్రయత్నించరు.వాళ్ళు ఇక్కడికి వచ్చి స్థిర పడితే నాకేం అభ్యంతరం లేదు. తెలుగుని చులకన చేసి మాట్లాడినపుడు మాత్రం మండిపోతుంది. అలా మాట్లాడి నా చేతిలో చివాట్లు తిన్న వాళ్ళు మా భవనంలోనే ముగ్గురున్నారు.(పాపం, కోపం తెచ్చుకోరు లెండి, ఎందుకంటే వాళ్ళ full time maids తెలుగు వాళ్ళే! వాళ్ళకీ, వీళ్ళకీ మధ్య భాష అర్థం కాక సమస్యలు వచ్చినపుడు నా దగ్గరకు రావలసిందే)


జూన్ నెల మొదటి వారంలో ఒక ఆంగ్ల దినపత్రిక నెక్లెస్ రోడ్ లో ఒక ఉత్సవం ఏదో జరిపింది. మంగుళూరు నుంచి వచ్చిన స్నేహితులను అక్కడికి తీసుకెళ్ళినపుడు చూసాము! అప్పటికప్పుడు కవితలు చెప్పాలని హోస్టు అడిగితే అక్కడున్న యువత అందరూ చక చకా హిందీలో బుల్లి బుల్లి కవితలు చెప్పేసి పెన్నులో, పెన్సిళ్ళొ ప్రైజులు కొట్టేస్తున్నారు.
అంతలో బహుమతి తీసుకున్న ఒక కుర్రాడు తెలిసిన వాడులా అనిపించి వెళ్ళి చూస్తే, నిజంగా తెలిసిన వాడే! జంధ్యాల కృష్ణ మోహన్ , పక్కా తెలుగు వాడు!
"అక్కా, మీరు కూడా వచ్చారా" అని సంతోషంగా పలకరించాడు. "అది సరే, నువ్వు హిందీ కవిత చదివావు ఏం రోగం నీకు, తెలుగు రాదా" అనడిగా!

"వచ్చక్కా, కానీ ఇంతమందిలో ఎవరికి అర్థం అవుతుంది తెలుగు? అసలు ఇంతమందిలో తెలుగు వాళ్ళున్నారో లేదో తెలీదు! నేనొక్కడినే తెలుగులో కవిత చెప్పాలంటే "ఎంబరాసింగ్" గా ఉంటుంది"
ఇదీ వాడి జవాబు!

తెలుగు రాష్ట్ర రాజధానిలో ఉంటూ తెలుగు మాట్లాడాలంటే "ఎంబరాసింగ్" గా ఉంటుందట!

"కూచో, నీతో మాట్లాడాలి" అని నేననగానే మా వారు భయపడి, "ఓకే, బై రా మోహన్, అమ్మ ని అడిగానని చెప్పు!" అని పారిపొమ్మని సైగ చేసి వాడిని రక్షించారు.


బెంగుళూరులో భాష పట్ల ఉన్న అభిమానం చూస్తే ముచ్చటేస్తుంది! ఎంత కొమ్ములు తిరిగిన మల్టీ నేషనల్ కంపెనీ అయినా సరే కంపెనీ పేరుని ఆంగ్లంతో పాటు కన్నడ లో కూడా బోర్డు ఉంచాల్సిందే!ఒక్కసారి మన హైటెక్ సిటీ కెళ్ళి చూడండి, ఎన్ని తెలుగు బోర్డులు కనపడతాయో! అలాగే అక్కడ కొన్ని ప్రైవేటు వాహనాల వెనక అద్దం మీద చాల సార్లు"కన్నడ సేన" అనే అక్షరాలు గమనించాను.(మన వాళ్లైతే పిల్లల పేర్లు, ఇంటిపేరు, ఇంకా వీలైతే గోత్రం పేర్లు కూడా రాస్తుంటారు వెనక అద్దం మీద )అవి కేవలం భాష మీద అభిమానంతో రాసుకున్నవేనట! అదే ఇక్కడైతే ఏదన్నా వాహనం మీద అలాంటి రాతలు 'తెలుగు సేన ' అనో, తెలుగు యువత అనో కనపడితే అది తప్పక తెలుగు దేశం పార్టీ వాహనం అని అనుమానం వస్తుంది.


ఎన్.టీ రామారావు తర్వాత తెలుగు భాషని పట్టించుకున్న ముఖ్యమంత్రి మరొకరు లేరు. ఇక ఉండరు కూడానేమో! అసలు అధికార భాషా సంఘం అనేది ఒకటి ఉంటే, అది ఎక్కడుందో, దాని విధులు ఏమిటో వాటిని అది ఎంతవరకూ సక్రమంగా నిర్వహిస్తుందో, తెలుగు భాషాభివృద్ధికి అది ఏమి చేసిందో  ఎవరైనా వివరంగా తెలియజేస్తే బాగుండు!


'పంద్రాగస్టు ఏమిటండి " " చీరేసుకుంటారా" వంటి పోస్టులు నెటిజెన్ గారి బ్లాగులో చూసి "అమ్మయ్య, తెలుగు భాషలో తప్పుల పట్ల పట్టింపు ఉన్నవారు ఇంకా ఉన్నారు " అని ఊరట కలిగిన మాట నిజం!

మా పాప  సెకండ్ లాంగ్వేజీ తెలుగు తీసుకుందన్న మాట విని వాళ్ల మేనత్త(ఈమె ఒక పెద్ద స్కూల్లో టీచరు), "అయ్యో, తెలుగు ఎందుకిప్పించావు? చదువులో వెనకపడ్డారని పేరుపడ్డ పిల్లలు తెలుగు తీసుకుంటారు! వేస్టు" అని వాక్రుచ్చింది. బాధ్యత గల టీచరు! ఇక ఎవర్ని ఏమని ఏమి లాభం?


రాజధానిలో నానాటికీ మృగ్యమైపోతున్న తెలుగుని పునరుద్ధరించాలంటే ఏమి చెయ్యలో అందరూ ఆలోచించాలి!


అన్నట్టు నా బ్లాగు హిట్ల సంఖ్య పన్నెండు వేలు దాటింది. నేను బ్లాగడం మొదలెట్టింది ఈ ఏడాది మార్చి నెలాఖర్లో! మార్కులు బాగానే పడినట్టా?

90 comments:

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

అమ్మలు,రాజధాని నగరములో తెలుగు సంగతి ఏమో గానీ బ్లాగులో ఆకుపచ్చ(ఆ రంగంటే నాకూ ఇష్టమే)ఎక్కువ పడింది.కాస్త మజ్జిగలొ చల్లో,చల్లలో మజ్జిగో కలిపి కాస్త పలచబరచ కూడదా?

కత్తి మహేష్ కుమార్ said...

మీ టపాలోని అన్ని విషయాలతో నేను ఏకీభవించినా ఈ టపాకు మూలమైన రాజ్ ఠాక్రే పిచ్చితో మాత్రం విభేధిస్తాను. అసలు జయాబచ్చన్ ఏ సందర్భంలో ఈ మాట అన్నదో చూస్తే (zoom TV లో నిన్న రాత్రే చూశా) వాడి బుర్రబద్దలు కొట్టాలనిపించింది నాకు.

‘ద్రోణ’ అనే సినిమా అడియో ఫంక్షన్లో అభిషేక్ బచ్చన్, దర్శకుడి గోల్డీ బెహల్ ఇంగ్లీషులో మాట్లాడితే, ఆ తరువాత వచ్చిన జయాబచ్చన్ "ఈ పిల్లలు ఎప్పుడూ ఇంగ్లీషులో మాట్లాడుతారు, మేము యూపీ వాళ్లం, కాబట్టి నేను మాత్రం హిందీ లోనే మాట్లాడతాం" అని హిందీలో తన ప్రసంగం చేసింది.

ఇందులో మరాఠీని ఎక్కడ అవమానించిందో నాకైతే అర్థంకాని విషయం. ఆంగ్లమయమైపోతున్నా యువతకు హిందీలో మాట్లాడాలన్న స్పృహ కల్పించిన జయా బచ్చన్ ని పొగడ్డం మాని ఈ గోలేమిటో ! నిజానికి, జయాబచ్చన్ ని స్ఫూర్తిగా తీసుకుని ఆ తరువాత మాట్లాడిన హీరోయిన్ ప్రియాంకా చోప్రా (పంజాబీ పిల్ల) కూడా హిందీలో మాట్లాడింది.

తెలుగు భాషని పెంపొందించే నిర్ణయాలు చెయ్యగల మేధావులూ నాయకులూ మనకు అవసరమేగాని, రాజ్ ఠాక్రే లాంటి తింగరి వెధవలు మనకు అస్సలొద్దండీ బాబూ!.

ఇక మీరు అపోహపడుతున్న "కన్నడ రక్షణ వేదికె" కర్ణాటకలో MNS తరహాలో అరాచకం చేస్తోందేతప్ప కన్నడ భాషకోసం ఎమీ చెయ్యటం లేదు.ఇదొక రాజకీయ ఎత్తుగడల్లో భాగం అంతే. కాకపోతే మన తెలుగువారికన్నా, మిగతా దక్షిణాది భాషలవారికి భాషాభిమానం ఎక్కువనేది ఎవ్వరూ కాదనలేని నిజం.

హైదరాబాద్ ఎలాగూ metro city అయిపోయిందికాబట్టి తెలుగు కోసం పట్టుబట్టినా పెద్ద ఉపయోగం వుండకపోవచ్చు.

అన్నీ పక్కనపెడితే, మీ బ్లాగు హిట్లు పన్నెండువేలు దాటినందుకు నా శుభాభినందనలు.

సుజాత said...

మహేష్,
రాజ్ ఠాక్రే తో నేనూ ఏకీభవించటం లేదు! ప్రముఖ షిర్డీ ఈ రోజు ఇంత అభివృద్ధి చెందడానికి కారణం 90 శాతం ఆంధ్రా జనం! అక్కడికి వెళ్ళేవాళ్లలో కూడా 95 శాతం వీళ్ళే! అక్కడ తెలుగు వాళ్ళ సౌకర్యార్థం తెలుగు బోర్డులు ఉండకూడదని వాదించే వాళ్లతో ఎలా ఏకీభవిస్తాను? జయ ఏ సందర్భంలో ఆ మాటలన్నదీ చూశాను కూడా! కాకపొతే హైదరాబాదులో పరిస్థితిని చక్కదిద్దాలంటే ఆ మాత్రం సంస్కృతి పట్ల విపరీత మైన పట్టింపు ఉన్న వాళ్ళు కావాలన్న అభిప్రాయంతో ఠాక్రే వ్యాఖ్యలను ఇక్కడ వాడుకున్నాను.

కన్నడ రక్షణ వేదిక గురించి నాకు ఏమీ తెలియదు. కాకపోతే అక్కడ అన్ని MNC ల బయటా కన్నడ బోర్డులు చూసి 'వీళ్లకు మనకంటే భాషాభిమానం ఎక్కువ ' అని కుళ్ళుకున్నాను.

సుజాత said...

రాజేంద్ర గారు,
ఎందులో ఏది కలపాలన్నా జ్యోతి గారిని అడగాల్సిందే! బ్లాగు టెంప్లేట్ మార్చింది జ్యోతి గారే! అడుగుతాను.

దైవానిక said...

నేను బెంగుళూరు వచ్చి అయిదు సంవత్సరాలైంది, కాని నాకు కన్నడం రాదు. నేర్చుకోవాల్సిన అవసరము పెద్ద కనిపించలేదు. అందుకని కన్నడ రక్షణ వేదికే వారు నన్ను గెంటేస్తె ఎలా ఉంటుంది?? దీన్నే మీరు చెప్పిన వాటికి అనువదిస్తే, ఆ చెప్పిన వాళ్ళలో నేను ఒక్కరిననిపిస్తోంది(కన్నడిగుల ఉద్దేశ్యంలో).
కాని ఎందుకో ఈ విషయంలో నేను మీతో ఏకీవభించలెకపోతున్నాను. constitution provides the basic right to live in any part of the country. రాజ్ ఠాక్రే చేసింది, చేస్తున్నది ముమ్మాటికి తప్పే. ఓట్ల కోసమే చేస్తున్నాడనడంలో అతిశయోక్తి లేదు.

సుజాత said...

దైవానిక,
నేను ఇతర రాష్ట్రాల వాళ్లని గెంటేయమని అనటం లేదు.దానితో నాకు సమస్య లేదని కూడా స్పష్టంగా చెప్పాను. నేనూ ఒక్క హైదరాబాదులోనే కాక దేశంలో మరి కొన్ని చోట్ల కూడా (గుర్గావ్ తో సహా) ఉన్నాను. అలా ఎల అనగలను? నేను ఇంకా మరి కొన్ని ఉదాహరణలు ఇవ్వవలసింది. ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకునే వాళ్లతో హిందీ మాట్లాడే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లు "హిందీ రాదా,ఐతే మీ వూర్లోనే ఉండాల్సింది. అక్కడైతే నీకు భాష సమస్య రాదు ఇక్కడికి ఎందుకు వచ్చావు " అని మాట్లాడే సందర్భాలు దాదాపు రోజూ చూస్తుంటాను మా కాలనీలో! (రోజూ పాలు, పేపర్, మినరల్ వాటర్ ఇచ్చే వ్యక్తి అయితే నెల మొదటి వారంలో ఎన్ని మాటలు పడతాడో లెక్కలేదు, హిందీ రాకపోవడం అనే ఒక్క కారణంతో)

ఇంకో ఉదాహరణ చెప్తాను! ఇళ్లలో పని చేసే వాళ్ళలో చాలా మంది మహబూబ్ నగర్ వంటి వెనకపడిన ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళున్నారు. రాజస్థాన్ నుంచి వచ్చిన ఒకామె (ఈవిడ ఇక్రిశాట్ లో పని చేస్తారు)వాళ్ల పని పిల్లతో,అ పని పిల్లకు వచ్చిన వచ్చీ రాని హిందీతో communicate చేయలేక "తెలుగు తెలుగు ! ఎక్కడికెళ్ళినా ఈ పీడా తప్పటం లేదు నాకు! పెద్ద తలనొప్పిగా తయారైంది" అని స్వయంగా నాతోనే మొరపెట్టుకుంటుంది.
"ఇక్కడినుంచి ఉత్తరభారతం వెళ్ళిన వాళ్ళు నెమ్మదిగా హిందీ నేర్చుకుంటున్నారా లేదా! ఆ పిల్లకు అలవటయ్యే దాకా కొంచెం మీరే నెమ్మదిగా సర్దుకోవాలి" అని చెప్తామనుకోండి,
"no way, హిందీ రాజభాష, హిందీని తెలుగుతో పోలుస్తారా మీరు, హైదరాబాదులోనే తెలుగు మాట్లాడరు, నా ఖర్మ,ఇది నాకు దొరికింది " అంటుంది. తెలుగు గొప్పది కాబట్టి హిందీని పాతరెయ్యాలని నేను కోరటం లేదు. మనకి భాషాభిమానం తక్కువన్న విషయాన్ని ప్రస్తావిస్తూ రాసిన టపా ఇది.

MURALI said...

మనలో నిద్రాణమవుతున్న తెలుగు భాషని తట్టిలేపేందుకు, చెళ్ళు మని కొరడా జులిపించే వాళ్ళుకావాలి. అదిమనమే ఎందుకు కాకూడదు. బ్లాగర్లందరూ సమిష్టిగా ఎదన్నా చేస్తే బాగుంటుందని నా భావన. అందుకే గతంలో కొన్ని టపాలు కూడా రాసాను కానీ స్పందన శూన్యం. అందులో ప్రస్తావించినవి కూడా చిన్న చిన్న విషయాలే. ఖర్చుతోనో, సమయం తోనో కూడినవి కూడా కాదు. అయినా ఎవరూ ఆసక్తి ప్రదర్సించలేదు.

Falling Angel said...

మీకో విషయం చెప్పనా, నేను ఉద్యోగంలో మొదటేడాది హైద్ లో ఉన్నాను. తర్వాత రెండేళ్ళుగా బెంగళూరులో ఉంటున్నాను. నా అనుభవాల ప్రకారం హైద్‍లో కంటే బెంగళూరులోనే తెలుగు ఎక్కువగా వినిపిస్తోంది. ఇక్కడ తెలుగువాళ్ళెక్కువ నిజమే, కానీ నేటివ్ కన్నడజనాలు కూడా చాలామంది తెలుగు చక్కగా మాట్లాడతారు.

కొద్దిగా అతి అనిపించినా కన్నడిగుల భాషాభిమానాన్ని చూస్తే ముచ్చటేస్తుంది. తమిళులలాగా వీరు Fanatics కాదు, మిగతాభాషల్నికూడా చక్కగా నేర్చుకుంటారు. కానీ కన్నడాన్ని మర్చిపోరు. ఈ రెండేళ్ళలో నేను తెలుగులో మాట్లాడితే "ಕನ್ನಡ ಮಾತಾಡಬೇಕು" (You should speak Kannada) అని సమాధానం వచ్చింది ఒకేఒక్కసారి :)

ఇక మనవాళ్ళంటారా... మనకి రాష్ట్రం దాటితేగానీ తెలుగు గుర్తుకురాదు. కొంతమందికి రాష్ట్రమేంటి, దేశందాటినా గుర్తురాదు (yes, I've come across such people)

Saraswathi Kumar said...

సుజాత గారూ! మనకు భాషాభిమానం తక్కువ కాదు.కావలసినంత ఉన్నది.కాక పోతే మనం ఇతరభాషలను ద్వేషించము. ఒక్కోసారి అభిమానిస్తాము కూడా. మన ఆంధ్రదేశంలో ప్రతి పట్టణంలో ‘హిందీ ప్రేమీ మండలి’ ఉంటుంది. తెలుగు వారు ఎంతో ఇష్టంగా హిందీ నేర్చుకుంటుంటారు. ‘దక్షిణ భారత హిందీ ప్రచార సభ’ వారికి మన రాష్ట్రంలో దొరికినంత ఆదరణ మరి యే ఇతర దక్షిణాది రాష్ట్రంలోనూ దొరకదు.

అలాగే తెలుగు భాష ఎన్నో సంస్కృత పదాలతో చాలా అందంగా ఉంటుంది.ఈ సౌందర్యం మనం స్వభాషాభిమానం పేరుతో సంస్కృతాన్ని ద్వేషిస్తే వచ్చేది కాదు కదా!

దేశసమైఖ్యత,దేశంలోని అన్ని భాషలు మాట్లాడేవారి మధ్యన సౌభ్రాతృత్వం కోరేవారిలో తెలుగువారు ముందుంటారు. కనుకనే మనం ఇతరులలా ఎవరినీ ద్వేషించము. ఒక్కోసారి రాజీ పడతాము కూడా. ఈ దేశంలో భాషా ద్వేషానికి బీజం వేసింది తమిళులు. వారిలా మనం కూడా ఉత్తరభారతాన్ని, హిందీని ద్వేషిస్తే వారికి వచ్చినట్లే కొంతగుర్తింపు, కొన్ని ప్రత్యేక కేటాయింపులు, ఇంకా ఇతర సౌకర్యాలు దక్కేవి. కానీ తెలుగువారు ఆవిధంగా వచ్చే గుర్తింపును కోరుకోరు. మనకు గుర్తింపు, గౌరవం వచ్చేరోజున వచ్చేవిధంగా వస్తుంది.

మహరాష్ట్రలో MNS లానో, తమిళనాడులో ద్రావిడ పార్టీలలానో లేక కర్ణాటకలో మరేదో సంస్థలానో తెలుగువారు ప్రవర్తించడం జరిగేపనికాదు. ‘దేశసమగ్రత ఏమైతే మాకేం మా భాష, మా గుర్తింపు, మా రాజకీయ లబ్ధి మాకు ముఖ్యం’ అన్నట్లుగా ఉంటుంది వారి ధోరణి.

హైదరాబాదు మెట్రో సిటీ. అటువంటి నగరాలను భాషా ప్రాతిపదికతో, ప్రాంతీయ ప్రాతిపదికతో పరిశీలించకూడదు.

అన్నట్టు మీరు పేర్కొన్న ‘మేరే దేశ్ కీ ధరితీ’ పాట నాకు చాలా ఇష్టం. మనోజ్ కుమార్ నటించిన ‘ఉపకార్’ చిత్రంలోదనుకుంటా.

మీ బ్లాగుకు మార్కులు 100/100.

nagaprasad said...

ఈ హిందీ వాళ్ళతో నేను కూడా ఇబ్బందులు పడ్డానండీ . ఆ ఇబ్బందులెలాంటివో, వాళ్ళ పొగరు ఎలా అనచవచ్చో, అలాగే మన హైదరాబాదు వాళ్ళ తలకాయలోంచి హిందీ ని ఎలా తీసెయ్యాలో ఆ మాటకొస్తే మన రాష్ట్రం నుంచీ కుడా ఎలా తీసెయ్యవచ్చో సవివరంగా నా రెండవ టపాలో రాస్తాను. అంత దాకా నా బ్లాగుని ఒకసారి చూడండి.
http://telugubhasa.blogspot.com/

వీలైతే నా బ్లాగుకు చక్కని పేరు తెలియ చేయండి. అన్నట్లు నా బ్లాగుని ఇంకా కూడలి లో జత చేయలేదండి బాబు.

సుజాత said...

నాగ ప్రసాద్ గారు,
మీ బ్లాగు ఇప్పుడే చూశాను! బాగుంది. మీరు కూడలికి వెంటనే జత చేస్తే చాలా మంది చదువుతారు! ఆ పనేదో వెంటనే కానీండి !

te.thulika said...

12 వేలు దాటినందుకు అభినందనలు. నేను మొదలు పెట్టి 9 నెలలయినా, 11 దగ్గరే నట్టుతోంది. :(

అబ్రకదబ్ర said...

బాగుంది మీ టపా. బెంగుళూరులో కూడా ఇదే సమస్య కదా? అక్కడ కన్నడం కంటే మిగతా దక్షిణభారత భాషలే ఎక్కువ మాట్లాడతారని విన్నాను. మరి కన్నడిగుల స్పందనేమిటో?

రాధిక said...

సుజాతగారూ మీతో ఏకీభవిస్తున్నను.ఈ హిందీవాళ్ళ జులుం చూస్తే చిరాకేస్తుంటుంది ఒక్కోసారి.పక్కోళ్ళకి హిందీవచ్చా రాదా అని పట్టించుకోరు.రాదు అని చెపితే నేను నేర్పుతాననో,నేర్చుకో అనో అంటారు తప్పించి వాళ్ళ ధోరణి మార్చుకోరు.నిజానికి తమిలోళ్ళకన్నా ఈ హిందీవాళ్ళకే భాషాభిమానం ఎక్కువ అనిపిస్తూ వుంటుంది.

Ramana Murthy said...

Congratulations on reaching 12k hits. I am one of your regular readers.

As you know, the presence of Hindi in Hyd predates Andhra state. Sometimes I think, making Hyd as the capital city of a Telugu state might be one the biggest reason for the plight of the language. As you pointed out, until NTR came, none of the boards on the busses nor was the official communication done in Telugu. I am okay with people from other states living in Hyd not caring to learn the language. But, when you add the official indifference and the TV anchors to that mix, it is becoming unfashionable to communicate in Telugu. IMHO we don’t need Thackeray – for that matter the world don’t need ANY Thackerays – what we need is a few writers, poets, actors / actresses and public personalities who can inspire us to think and express in our mother tongue.

PS: I don’t have sree lipi on my work laptop, so had to write in English.

విరజాజి said...

సుజాత గారూ,

చాలా మంచి చర్చను లేవదీసారు. మీరన్న మాట అక్షరాలా నిజం. మనకి భాషాభిమానం చాలా తక్కువే. అయితే, హైదరాబాద్ కాస్త దీనికి మినహాయింపు. ఇక్కడి తెలుగు సంసృతి కొంతవరకు ముస్లిం ప్రభావం తో మరుగున పడిపోయింది. స్వాతంత్ర్యానికి ముందు, కనీసం తెలుగు చదువుకునే అవకాశం కూడా లేకుండా ఉన్న ప్రాంతం కనుక కొంత హిందీ / ఉర్దూ ప్రభావం ఎక్కువే. తన ఏలిక లో ఉన్న ప్రాతాలలో ఉర్దూ లోనే చదువుకోవాలి అంటూ నిజాం నవాబు తెలుగు వాడకాన్ని పూర్తిగా తగ్గించి వేయడం తో, హైదరాబాద్ లో తెలుగుకి ప్రాముఖ్యత పోయిందనే చెప్పాలి. కాకుంటే, ఇప్పటి ఈ దుస్థితి కి ముఖ్యం గా తెలుగు మాధ్యమం గా చదువుకునే వారు లేకపోవడం కారణం అనిపిస్తోంది నాకు. తెలుగు ఎందుకు చదవాలి? అని ప్రశ్నించడం, తెలుగు దేనికీ ఉపయోగపడని ఒక సబ్జెక్టు గా పిల్లలు పరిగణించడం చూస్తూ ఉంటే, మనం ఎంత ప్రయత్నం చేసినా మరో తరానికి తెలుగు ఒక వెలుగు వెలుగుతుందా? అనే సందేహం రాక మానదు. చాలా మంది తల్లితండ్రులు ఇంటర్ లో చేర్పించగానే, ద్వితీయ భాషగా తెలుగు ఎందుకు, మార్కులు ఎక్కువ రావు.. % పడిపోతుంది. అంటూ, సంస్కృతాన్ని చదవమంటున్నారు. ఆ సంస్కృతం కూడా ఆంగ్లం లో రాసేయ్యచ్చు. మన భాషని మనమే చిన్నబుచ్చుకుంటూ ఉంటే, ఇతర భాషల వాళ్లు ఎందుకు గౌరవిస్తారు?

మన ఉద్యోగాలకి ఇంగ్లీష్ పనికి వచ్చే భాష కావచ్చు. కానీ, దాన్ని నేర్చుకోవడం కోసం మన మాతృభాష ని అవమానించడం ఈ రోజుల్లో చాలా పే....ద్ద గొప్ప గా మారిపోయింది. తెలుగు లో ఎవరైనా ఎం. ఏ చేస్తున్నానని చెప్తే, .. "తెలుగా" అంటూ పెదవి విరవని వాళ్లు ఉండనే ఉండరు. ఇక తెలుగు భాష లో ఏదైనా పరిశోధన చేస్తున్నామని చెప్పండి... ఇవన్నీ దేనికి ఉపయోగ పడతాయి?... అనవసరం గా కాలయాపన తప్పిస్తే...? అంటూ వెనక్కి లాగే వాళ్ళే ఎక్కువ. మన సంస్కృతినీ, మన భాషనీ ముందు తరాల వాళ్ళకి మనమే అందించాలన్న స్పృహ ఉన్నవాళ్ళు చాలా అరుదు. అటువంటి వారంతా ఒక్క తాటిపైకి రాగలిగితే, మన భాష కి మన వంతు సేవ చేసిన వాళ్ళం అవుతాం. ఎవరైనా అటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే, తెలుసుకోగోరుతున్నాను.

తెలుగు బ్లాగులు రాస్తున్న మనం, తెలుగు తల్లి కి ఒక్కసారి "జై " కొడదాం. తెలుగు వారందరితో జై కొట్టిద్దాం. (ఇది కేవలం తెలుగు భాష కి సంబంధించి అంటున్న మాట. ఇందులో తెలంగాణ, కోస్తా .. రాయలసీమ లాంటి ప్రాంతీయ భావనలు ఏమీ లేవని గమనించ ప్రార్ధన.. :-)..!!..)

భాస్కర్ రామరాజు said...

బెంగుళూరులో కొంతమంది వాళ్ళ బండి నెంబరు కూడా కన్నడంలో రాసుకుంటారు. కర్ణాటక ౧౨౩౪ లా.

భాషాభిమానం మనకి తక్కువే. ఇంకా చెప్పాలంటే అస్సలు లేదు.

ఇంక, తెలుగు నేర్చుకున్నా మాట్లాడేవాళ్ళు లేరుగా అనిపిస్తుంటుంది.

ఈ రోజున తెలుగు మాధ్యమంలో పనిచేసే ఎంతమంది ఉపాధ్యాయులు తమ పిల్లల్ని వాళ్ళు పనిచేసే బడిలో జేరుస్తున్నారు?

కాబట్టి, మనమే మన భాషకి గోరీకట్టుకుమ్టున్నాం.

భాస్కర్ రామరాజు

athmakatha said...

sujAtagAru,
nEnu mumbAyilOnE vunTAnu.
nEnu haidarAbAd lO vunTE ilA ceppEvADini kAkapOvaccunEmO....
bOrD la pai sthAnika bhAshalalO rAyAli annadi sthAnika bhAshanu nilabeTTaDamO lEka gouravincaDamO avutundEmO AlOcincanDi.
nAku anubhavam nAku nErpina pATAmEnTi anTE... prajalu vunnannI rOjulU ekkaDO oka mUla aa bhAsha prajvarillutUnE vunTundi.

సుజాత said...

falling angel, అబ్రకదబ్ర,
బెంగుళూరులో మన తెలుగు వాళ్ళే పాతిక లక్షల మంది ఉన్నారని మొన్నీమధ్య అక్కడ ఎన్నికలు జరిగినపుడు నాకు తెలిసింది. తెలుగు దాదాపు అందరికీ అర్థమవుతుంది. అదే సమయంలో కన్నడిగులు వారి భాష కు తగినంత గౌరవాన్ని ఇస్తారు. మిగతా వారిని ద్వేషించరు. అలాగని ఇతర దక్షిణ భారత భాషల వాళ్ళు కూడా కన్నడని ద్వేషించగా నేను చూడలేదు.కన్నడ రక్షణ వేదికె వంటి సంస్థల గురించి నాకు తెలియదు.

మన హైదరాబాదులో ముందు మనవాళ్ళకే ముందు తెలుగులో మాట్లాడ్డమంటే అలుసు. దానికి తోడు హైదరాబాదులో హిందీ కి మొదటి నుంచీ ప్రాముఖ్యం, వాడుక ఉండటం వల్ల హిందీ రాష్ట్రాల వాళ్ళు తెలుగుని చాలా ..చాలా అంటే చాలా లైట్ తీసుకుంటారు, చులకన చేస్తారు.

సరస్వతీ కుమార్ గారు,
హైదరాబాదు మెట్రో సిటీ కాకముందు నుంచీ ఇక్కడ తెలుగుకి అంత ప్రాముఖ్యం లేదు కదండీ! మనం ఇతర భాషలను ద్వేషించం, అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తాం! అదే హిందీ వాళ్ళు మన బలహీనత గా అర్థం చేసుకుంటారు! అయినా గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరినట్లుంటుంది లెండి హైదరాబాదులో తెలుగు గురించి మాట్లాడ్డం!

సుజాత said...

విరజాజి గారు,
హైదరాబాదులో తెలుగు కి ప్రాముఖ్యత ఏర్పడకపోవటం విషయంలో మీ వివరణ నాకు బాగా నచ్చింది.కానీ లక్షల కొద్దీ ప్రజలు ఆంధ్రా జిల్లాల నుంచే వచ్చి హైదరాబాదు అభివృద్ధిలో పాలు పంచుకుని ఇక్కడ స్థిరపడ్డారు. అయినా తెలుగు వాడకం తగ్గిపోయిందే కానీ పెరగలేదు.

పిల్లలు తెలుగులో మాట్లాడకూడదని తల్లి దండ్రులే కోరుకుంటున్న ఇవాళ్టి రోజుల్లో తెలుగు తెలుగు అని మనలాంటి వారు బాధపడితే ప్రయోజనం లేదనుకుంటాను.

రమణ మూర్తి గారు,
నా బ్లాగు రెగ్యులర్ గా చదువుతున్నందుకు కృతజ్ఞతలు! మీరు చెప్పినవి విలువైన విషయాలు! ముఖ్యంగా టీవీ యాంకర్ల తెలుగు గురించి! అంతే కాదు, న్యూస్ చానెల్స్ లో కూడా చాల వరకు ఇంగ్లీష్ పదాలు, వాక్యాలు లేకుండా తెలుగు వార్తలు రావటం లేదు. మన భాషను రక్షించుకోవటాన్ని "unfashionable" గా ఫీలయ్యే వాళ్ళకి ఏమి చెప్పగలం?

రాధిక,
నా బాధని అర్థం చేసుకున్నారు, థాంక్యూ!

భాస్కర్ రామరాజు గారు,
మన భాషకి మనమే గోరీ కట్టుకుంటున్నాం! భలే చెప్పారు.

ఆత్మకథ గారు,

బోర్డులు స్థానిక భాషలో మాత్రమే కాదు, స్థానిక భాషలో "కూడా" రాయాలంటున్నాను.(ఇంగ్లీషు తో పాటుగా)తెలుగు అధికార భాషగా ఉన్న తెలుగు రాష్ట్ర రాజధానిలో "ఏదో ఒక మూల" తెలుగు ప్రజ్వరిల్లితే చాలని సరిపెట్టుకోలేకపోతున్నానండి!

ప్రతాప్ said...

మీ వివరణ బావుంది.
మా గ్రూప్ మేనేజర్ తమిళియన్, తను దాదాపు 4/5 సం" నుంచి ఇక్కడ ఉంటున్నారు. అయినా తనకు తెలుగు మాట్లాడటం అటుంచి తెలుగు అర్ధం చేసుకోవడం కూడా రాదు (ఇది ఒకందుకు మంచిదే, మనమేం తిట్టుకొన్నా తనకి అర్ధం కాదు). ఒకసారి మాటల సందర్భంలో "ఇక్కడ(హైదరాబాదు) కాబట్టి తెలుగు రాక పోయినా నెట్టుకు రాగాలుగుతున్నాను కానీ అదే ఇంకెక్కడన్నా అయితే చాలా కష్టం)" అని అన్నారు. నాకు కాస్త బాధగా అనిపించింది, అదే చెప్పాను. దానికి తను, "ఇక్కడ అందరు హిందీలో బాగా మాట్లాడుతున్నారు, అందువల్ల ప్రస్తుతానికి ఇబ్బంది ఏమీ లేదు, కానీ నాకు తెలుగు నేర్చుకోవాలని ఉంది. తమిళం తర్వాత అంత ప్రాచీనమైన భాష తెలుగే కదా. అది గాక తెలుగుని ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్ అని ఎందుకంటారో కూడా తెలుసుకోవాలని ఉంది. వీలైతే నువ్వు నేర్పించకూడదు?" అని అన్నారు.
చూసారా కొంతమందికి తెలుగు నేర్చుకోవాలని ఎంత ఉత్సాహంగా ఉందో.
ఇంతకీ సమస్య వేరే భాషలని తొందరగా ఆకళింపు చేసుకొనే మనదా? హిందీ వచ్చు, హిందీ దేశభాష కాబట్టి అందరికీ హిందీ వచ్చి ఉండాల్సిందే, అనుకొనే వారిదా?

సుజాత said...

ప్రతాప్ గారు,
మనకి అంటే తెలుగు వాళ్లకి flexibility ఎక్కువ! హిందీ పట్ల మనకు ద్వేషం లేదు కాబట్టి హిందీ నేర్చుకుని ఉత్తరాది వైపు వెళ్ళినపుడు హిందీలో మాట్లాడతాము. దక్షిణాది వైపు అయితే అవసరమైతే ఆ భాష నేర్చుకుంటాము. బెంగుళూరు నించి బ్లాగే వారిని చూడండి, అందరూ దాదాపుగా కన్నడం తెలిసిన వారే, మరీ fluent గా మాట్లాడలేకపోయినా!(మాట్లాడతారేమో కూడా)తమిళనాడు వెళితే మినిమం తమిళం నేర్చుకోక తప్పని పర్తిష్తితి ఉండేది ఇదివరలో! ఇప్పుడు నాకు తెలియదు.

హిందీ వాళ్ళు మాత్రం ఎక్కడికెళ్ళినా చుట్టుపక్కల వాళ్ళు హిందీలోనే మాట్లాడాలంటారు. అదేమిటంటే హిందీ రాజభాష అంటారు! ఇంగ్లీష్ లో ఐనా నెట్టుకొస్తారు గానీ స్థానిక భాష ని కన్నెత్తైనా చూడరు. నేర్చుకోకపోగా, చులకన చేసి మాట్లాడతారు.

సమస్య మనదా వాళ్లదా అన్నారు, అతిశయం వాళ్లది,సమస్య మనది.

గీతాచార్య said...

"దశావతారం" సినిమాలో ముక్కు కమల్ హాసన్ డయలాగు తెలుసా? మన తెలుగు ప్రాబ్లం గురించి చాలా బాగా చెప్పారందులో.

నేను ఎక్కడో చదివాను. గుజరాత్ లో మన తెలుగు వారి గురించి. అసలు గుజరాతి గురించి అయినా మనం అనుమాన పడుతాం కానీ మన తెలుగు వారిని మాత్రం మనం గుర్తుపట్టలేం.

ఇక్కడో విషయాన్ని మనం గుర్తించాలి. నేను ఈ మధ్య (అంటే గత మూడేళ్లుగా) ఎన్నో సార్లు తమిళనాడు వెళ్లాను. ఒక్క ముక్క తమిళ్ వాడకుండానే బ్రహ్మాండంగా నెట్టుకొచ్చాను. పాపం వాళ్ళూ అదో విషయం గా అనుకోకుండా చాలా చక్కగా కమ్యూనికేట్ చేశారు. అదే ఒక తమిలియన్ మన ముందు తమిళ్ లో ఏదయినా అడిగితే మనం ఎంత ఎగతాళి చేస్తాం? మొన్నీ మధ్య ఎందులోనో చూశాను. ద్రావిడ భాషలు ఏవంటే "తెలుగు, కన్నడ, మలయాళం, అరవడం" అన్నారటో పెద్ద మనిషి. మన భాషనే మనం గౌరవించలేము. ఇతర భాషలని ఏమి గౌరవిస్తాం?

తల్లి తండ్రులని గౌరవించ గలిగే వాళ్లు అందరినీ గౌరవించగలరు. వాళ్ళనే లెక్క చేయని వాళ్లు మిగతావారిని ఏమి లెక్క చేస్తారు? భాష విషయమూ అంతే. తెలుగులో బ్లాగు వ్రాస్తున్నానంటే మా కజిన్ నన్ను ఎక్కిరించాడు. "తెలుగులోనా?" అంటూ. అదేదో అక్రమ సంబంధం పెట్టుకున్నావా అన్న లెవెల్లో మొహం పెట్టి. మరి మన భాష ఏమి బాగు పడుతుంది?

మీరు చెప్పిన టీచరు ఉదాహరణ చాలదూ మన వాళ్ళకి భాష మీద ఉన్న గౌరవం తెలుసుకోడానికి.

భైరవభట్ల కామేశ్వర రావు said...

సుజాతగారి టపా, దాని వ్యాఖ్యలూ చూసాక తెలుగు భాష మీద అభిమానం ఆవేదనా చాలా మందికి ఉందని తెలిసింది. ఇలానే బ్లాగ్లోకంలో చాలామంది తెలుగుభాషాభిమానులు ఉన్నారు. మురళిగారు చెప్పినట్ట్లు దీనిగురించి కేవలం చర్చించి వదిలెయ్యకుండా, ఏదో ఒకటి చేయ్యగలిస్తే బావుంటుంది. బ్లాగ్లోకంలోని తెలుగు అభిమానులందరూ కలిస్తే తప్పకుండా కొంతైనా చెయ్యగలుగుతామన్న నమ్మకం నాకుంది. ఈ దిశగా మనం ఈ క్రింది పనులు వెంటనే చెయ్యవచ్చు:
1. ఎలా అయితే అంతర్జాలంలో తెలుగు వాడుకకై ఒక e-గ్రూపు ఉందో, అదే రకంగా ఒక గ్రూపు, మన రాష్ట్రంలో తెలుగు భాషా ప్రచారానికి ఏర్పాటు చేసుకోవచ్చు.
2. గ్రూపులోని సభ్యులందరూ చర్చించి, మన ఆశయాలూ వాటిని సాధించడానికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవచ్చు. దాని ఆధారంగా కార్యా చరణ విధానాన్ని తయారుచేసుకొని మన అభిమానానికి ఒక కార్యరూపం ఇవ్వవచ్చు.

ఇక్కడ తెలుగుభాష మీద అభిమానం, దానిగురించి ఆవేదనా ఉన్నవాళ్ళు దీనికి "సై" అంటే, నేనా పని మొదలుపెట్టడానికి తయారు.
మీ ఒప్పుకోలు కోసం ఎదురు చూస్తాను...

sujata said...

సుజాత గారూ..

చాలా మంచి మార్కులే పడ్డాయి. అందుకోండి వీర తాడు.

తెలుగు గురించి - మరి మా లాంటి వేరే భాష వాళ్ళని పెళ్ళాడే వాళ్ళ బాధ ఎక్కడ చెప్పుకోవాలి ? నేను ఏమి రాస్తానో, ఏమి చదువుతానో మా ముగాంబో కి తెలియదు. అప్పుడప్పుడూ వాళ్ళ భాషమ్మాయిని పెళ్ళి చేసుకోనందుకు తన్ని తానే తిట్టుకుంటాడు. మొదట్లో, మా అబ్బాయి తెలుగు వింటే (ఇపుడు బాగా ఇంప్రూవ్ అయారు) నాకు మతి పోయింది.


పొద్దు గడి కి మహారాణి మీరు. మీరు భాషాభిమానం గురించి రాస్తే అదో అందం. నాకు మీ అంత పట్టు లేదు. (పద్యాలూ.. లాంటివి అర్ధం కావు) ఈ టపా కూడా అదిరింది.


మీ అమ్మాయి అదృష్టవంతురాలు. మొన్న ఏదో కార్టూన్ చూసాను. (జయదేవ్ ది అనుకుంటాను.) బేక్ గ్రౌండ్ లో భార్య ఏడుస్తూంటూంది, భర్త గాట్టిగా అరుస్తూ ఉంటాడు. గోడకివతల ఇద్దరు చిన్ని పాపలు మాటాడుకుంటూ ఉంటారు. ఒక పాప ఇంకో పాప తో అంటూ ఉంటుంది - 'మాతృభాష సౌమ్యంగా, బావుంటుంది. పితృభాష అంతా బండ బూతులే !' అని.

గుర్తొచ్చి రాశేను. ఎవరన్నా తప్పుగా ఫీలయితే సారీ.

Srini said...

హైదరాబాదు లొ తెలుగు పరిస్తితి గురించి బాగా వ్రాసారు. కాని బాషాపరంగా మనుషులు విదడిపొవుట మంచిది కాదు. ఒక ఉదాహరణకి కులాన్ని తీసుకొంటె, అది మనుషులను ఎలా విడదీస్థుందొ మన అందరికి తెలుసు.

Sreedhar Surabhi - SAP SD Consultant said...

bharateeyulam ane manam prastutam adukuni tinevaallam ayyamu, kadani evarayina ante munduku ravachu, andulo mana teluguvaallu mareenu. meeru andaru mee uttaraallallo rasaru kannnadaana(banglore) telugu, punelo telugu, noidalo telugu marekkadayina sare, enduku ante 'dabbuku lokam kadu kadu - telugu varam dasoham' --- meeda paisa vesthe erukodanikayina mana vaallu tayyare.
avunu nenu annatuvanti chotlallo telugu vaare adhikam aa teluguvaallu adhikamga unna chota manam emi chestunam gadida chaakiri (white color donkeys) chestunnam. adedo gadida chakiri manam rastram lo chestunnama ante "cha tappandi" benguloorulo ayithe ekkuva raallu dorukutayi, pune lo ayithe kastha parledu ani ala istam unna mana rastram kaakunda pakka rastralaku vellipotunnamu inka mana gurinchi manalni manam pattinchukoni nadu mana basha, mana sanskruthi ivvani mattilo kalavaka emavutayo meere cheppandi.

tappu anta manalone undi manam yenadayithe maruthamo aanadu manaku manchi jarugutundi. anthe kani ila blogs rasukuni uttaralu panchukunnanta matrana origedemi undadu.
meelo enta mee pillalani telugu madhyamam lo chadivistunnaru, kanisam meeru intlo mimmalni amma naanna ani pilipinchukuntunnaru, okkasari atmavalokanam chesukondi; kaneesam appudayina manam maarutamu. anthe kani marali marali ani cheppukunnanta matrana manam maari pothama.

avunu nenu manalni white color donkeys annanu endukantaru - mana desam-lo unnatuvanti panulu manam cheyyamu; pakkana unna deshala vaalla panulu chesi pedutunnamu adeenu kavalani takkuva karchuke chesipedatamu (entayina migatavaariki pOti kada) danikosam manam viraga padi pani sampadinchukuni pakkavadikosam (america, england, germany) panini mana meeda vesukuni chestunnam. ade mana pani undi - ivvandi ante mana vaallu ivvaru, manama gattiga matladi aa pani teesukoni cheyanu lemu. emi chestam mana karma ani vadileyalsi vastundi.

Tappulunte manninchandi - Paniki vachedi unte grahinchandi.

sadaa mee snehasoudhamlo
mee Sreedhar

సుజాత said...

గీతాచార్య,
నవ్వొస్తోంది, మీరు చెప్పిన "తెలుగు , మళయాళం, కన్నడం, అరవడం " నా బ్లాగులోదే! కానీ అది శ్రీ శ్రీ విసిరిన చలోక్తి! ఆయన దశాబ్దాల తరబడి మద్రాసులో జీవించారు, ఆయన స్వానుభవాన్ని ఎలా కాదనగలం? అందులో నవ్వు తెప్పించే నిజమే కానీ ఎత్తిపొడుపు, హేళన లేవు.

తెలుగులో బ్లాగు ఉందని తెలిసి నన్నూ వింతగా చూసిన వాళ్లున్నారు. కానీ నేను అలాంటి వాళ్ళని వదలను, మొహం పగిలేటట్లు జవాబు చెప్పి పంపిస్తాను.

సుజాత గారు,
మిమ్మల్ని మెచ్చుకోవాలి, పాత్రో గారికి తెలుగు నేర్పుతున్నందుకు! గడి విషయంలో నేను ఒక పిపీలికాన్ని, ఒక్క నెలైనా స్లిప్పు లేకుండా పూర్తి చెయ్యలేను. ఆగస్టు నెల ఆరోగ్య రీత్యా అశ్రద్ధ చేసి అసలు పంపనే లేదు. మీ అభినందనలకు ధన్యవాదాలు!

మీరు చెప్పిన కార్టూను నేనూ చూశాను.

సుజాత said...

కామేశ్వర రావు గారు,
మీ వ్యాఖ్య నాలో ఉత్తేజాన్ని నింపింది. మీలాంటి వారు మొదలెడితే మీ వెంట నడవటానికి నేనూ , నాతో పాటు మరెందరో తెలుగు భాషాభిమానులు సిద్ధం అవుతారు! కానివ్వండి! భాషను బతికించుకోడానికి ఏదైనా చెయ్యాల్సిందే!

సుజాత said...

శ్రీధర్ గారు,

ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాల కు వెళ్లడం తప్పని నేనొప్పుకోను. ఆ చేసే చాకిరి ఏదో ఇక్కడే చెయ్యొచ్చుగా అంటే , దొరికితే చేస్తారు, దొరక్కపోతే ఏం చెయ్యాలి? భాషను మర్చిపోవడం, అనేది క్షమించదగ్గ విషయం కాదు,అదీ సమస్య ఇక్కడ!

పైన కామేశ్వర రావు గారి వ్యాఖ్య చూశారా, ఇలా మన భావాలు అందరితో పంచుకోవడం వల్ల, 'ఏదైనా చెయ్యాలి ' అనే ఉత్తేజం, ఉత్సాహం కలుగుతుంది. అదే ఈ పంచుకోళ్ళ ఫలితం!

తెలుగు భాష కోసం ఇలా బాధపడే వాళ్లంతా పిల్లల్ని తెలుగు మాధ్యమంలో చదివించలేకపోవచ్చు, కనీస స్థాయిలో నైనా పిల్లలకు తెలుగు నేర్పాలని ప్రయత్నిస్తున్న వారే! మీరు అడిగారు కాబట్టి చెపుతున్నాను, మా పాప తెలుగు నేర్చుకుంటోంది, అమ్మ, నాన్న గారు అని అచ్చతెలుగులో పిలుస్తుంది. నాకు నా భాష అంటే ఇష్టం, అందుకే నేను అలా అలవాటు చేసాను.

మీ మొత్తం వ్యాఖ్యలో నాకు అర్థం అయిందేమిటంటే, మన భాషను మనమే కాపాడుకోవాలి అని...దానితో అందరం ఏకీభవిస్తున్నాము!

సుజాత said...

శ్రీని,
భాషల ఆధారంగా విడిపోవాలని ఎవరూ కోరుకోరు! మన భాషను మనం రక్షించుకోవాలని కోరుతున్నారు అందరూ! హైదరాబాదులో తెలుగు మృగ్యమై పోకుండా (కోట్ల కొలదీ ఆంధ్రా జనం ఇక్కడుండి కూడా) చూసుకోవాలన్నదే నా తపన.

మురళీ,
సారీ, చివర్లో స్పందిస్తున్నాను, మీ వ్యాఖ్యకి, కామేశ్వర రావు గారి కామెంట్ చూశారుగా, మరి మొదలెడదామా!

independent said...

ఈ బ్లాగు లోకంలో చాలా చోట్ల చూస్తున్నా..ఈ "వీరతాళ్ళ" గొడవేంటి?

గీతాచార్య said...

చదివిన వెంటనే నేను జవాబు వ్రాయలేదు. పైగా ఈ మధ్యలో నేను చాలా వాటిని చదువుతూ ఏదో ఆలోచనలో ఉండి వ్రాశాను. అదే తప్పు. వ్రాసేది శ్రద్ధ గా వ్రాస్తే పోయేది. సరే. ఆయన స్వానుభావమైనా... సరే ఆ వ్యాఖ్యతో నేను ఏకీభవించను. మన తెలుగుని ఎవరన్నా అంటే మనం ఊరుకుంటామా?

I read your blog before any comments were written. But I commented just yesterday. okay. Good post.

మీ టపాలోని మాటలని మీకు చెబుతూ ఎందులోనో చదివాననటం నాకే కామెడీ గా ఉంది. సారీ.

గీతాచార్య said...

మీ బ్లాగ్ గురించి Computer era లో వచ్చింది. Congratulations.

భైరవభట్ల కామేశ్వర రావు said...

సరే అయితే, మరి యీ గుంపుకి ఏం పేరుపెడదాం? మంచి పేరెవరైనా సూచించండి. "తెలుగు భాషా ప్రచార సంఘం" అంటే ఎలా ఉంటుంది?
గమనిక (Disclaimer): దీనికీ థాకరేల సంఘాలకీ ఎటువంటి చుట్టరికమూ, ఏమాత్రం పోలికా లేదు ఉండబోదు! :-)

సుజాత said...

independent,
వీరతాడు తెలియదా? ఘోరమైన అపచారం! మాయాబజార్ సినిమా (పాతది)చూళ్ళేదా మీరు? అర్జెంటుగా DVD తెచ్చుకుని చూడండి ముందు! ఎస్వీ రంగా రావు గారు, ఘటోత్కచుడు గారూ క్షమించెయ్యాలండీ మీరు!

సుజాత said...

కామేశ్వర రావు గారు,
ఈ విషయమై ఇంత శ్రద్ధ తీసుకుంటున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు! పేరు కూడా మీరే నిర్ణయించండి.

సిరిసిరిమువ్వ said...

మార్కులు బాగా ఏమిటండి ....300/100..చాలా!!
భాష గురించి మంచి చర్చ లేవదీసారు. వేరే ఎవరితో పోల్చుకున్నా మన ఆంధ్రాలోనే వేరే భాషవాళ్ల ఆటలు సాగేది. నేను తమిళనాడులో M.Sc చేసాను. పిల్లలు అటుంచి ఎవరో ఒకరిద్దరు డిపార్ట్మెంటు హెడ్సు తప్పితే ప్రొఫెసర్లు కూడా ఇంగ్లీషులో చస్తే మాట్లాడేవాళ్ళు కాదు. తమిళ్ నేర్చుకోక చస్తారా అన్నట్లుండేది వాళ్ళ ప్రవర్తన. అలా ఉంటుంది వాళ్ళ భాషాభిమానం.

ఇంతకి గణపతి బబ్బ మోరియా అంటే నాకు ఇప్పటికి అర్థం తెలీదు:(

మనలో మనమాట--"ఓ బొజ్జ గణపయ్య" ఎంతమందికి వచ్చంటారు.

lalitha said...

సుజాత గారు, మీ అవేశం చూస్తే ముచ్చటేస్తుంది.
రాజధానిలో తెలుగును చూడలేకపొతే తెలుగు బావున్న చోటికి రాజధానిని మార్చెద్దాం.
మా రాజమ0డ్రి వచ్చెయండీ,ఇక్కడ హిందీని మనది కాని ఎదో విధేసి భాష
అనుకొనే వాళ్లం చాలమంది వున్నాం.

విరజాజి said...

"తెలుగు భాషా ప్రచార ఉద్యమం" అంటే ఎలా ఉంటుందండీ కామేశ్వర రావు గారూ? మీ సంఘం / ఉద్యమం లో సభ్యత్వానికి నేను సిద్ధం. మనం ప్రయత్నిస్తే, మన మాతృభాషకి పూర్వ ప్రాభవాన్ని మనం తప్పకుండా తీసుకురాగలం.

తెలుగు బ్లాగర్లందరికీ ఒక విన్నపం:

మన జిలుగు వెలుగుల తెలుగు మేనికి మళ్ళీ మేలగు పలుకుల నలుగు పెట్టి, చెంగలువల సింగారము తో భావి తరాల వారికి బంగారము వలె అందిచుటకై, అందరూ కదిలి రావాలని అభ్యర్థిస్తున్నాను.

laxmi said...

మన తెలుగు వాళ్ళ తెగులు గురించి ఏమి చెప్పినా తక్కువే... నేను బెంగుళూరు లో పని చేస్తున్నప్పుడు ఒక సారి కాంటీన్ లో ఇద్దరు బెంగాలీ లు చక్కగ బెంగాలీ లో మాట్లాడుకుంటూ ఉంటె నేను నా పక్కన కూర్చున్న సహోద్యోగి తో ఖర్మ కాలి తెలుగు లో మాట్లడే ప్రయత్నం చేశా.. అంతే ఆమె వెంటనె హేయ్ డొంట్ టాక్ ఇన్ తెలుగు ఇట్ డసంట్ లుక్ గుడ్ అంది... నాకు దిమ్మ దిరిగి మైండ్ బ్లాక్ ఐపోయింది... ఇక అమెరికా లో ఐతె మరీ ఘోరం, పక్కా తూగోజీ కాని అస్సలు తెలుగే రాని దాని లాగ ఎదవ స్లాంగు లు, ముక్కులు మూల్గులు... అది మన భాషాభిమానం

యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ said...

అందరికీ 'గ్రీటింగ్స్'

..నా లాగా 'మదర్ టంగ్' ను యింత 'మచ్' గా 'లైక్' చేసే వాళ్ళు చాలా మంది వున్నందుకు చాలా 'హాపీ' గా వుంది..
నా 'ఫీలింగ్స్' 'ఎక్స్ ప్రెస్' చెయ్యటానికి 'వర్డ్స్' రావటంలేదు..

సుజాత said...

వరూధిని గారు,
నాకూ తెలీదు, గణపతి బప్పా మోరియా అంటే ఏమిటో! అది బహుశా మరాఠీ మాటేమో అని అనుమానం!

ఓ బొజ్జ గణపయ్య వినాయక చవితి రోజేగా చదివేది! ఆ రోజు పుస్తకం చూసి (వ్రత కల్పంలో ఉంటుందిగా) చదివితే సరిపోతుంది. అదీ ఇవాల్టి ట్రెండ్!

లలిత గారు,
ఇక్కడ రాజమండ్రి, గుంటూరు, దోసకాయలపాలెం నుంచి వచ్చిన వాళ్ళు కూడా హైదరాబాదు రాగానే హిందీ వాళ్లైపోతారు. అదీ నా బాధ!

లక్ష్మి గారు,
అది మన flexibility అంటాన్నేను. మనం అవతలి వాళ్లకి ఇబ్బంది కలక్కూడదని అందరికీ అర్థం అయ్యే భాష మాట్లాడతాము. అవతలి వాళ్ళు సంస్కృతి ని రక్షిచే బాధ్యతతో మనముందు వాళ్ళ భాషలో ఫ్రీ గా మాట్లాడేసుకుంటారు. ఇలాంటి సందర్భాలు నాకూ ఎదురయ్యాయి.

శర్మ గారు,'
చివర్లో బలే కామెడీ చేసారుగా!

సుజాత said...

కామేశ్వర రావు గారు,
"తెలుగు భాషా ప్రచార సంఘం" గురించి ఏమాలోచించారు? దీని గురించి మీ బ్లాగులో ఒక టపా రాస్తే బాగుంటుందని భావిస్తున్నాను.

టి. శ్రీవల్లీ రాధిక said...

సుజాత గారూ!

ఇక్కడ రెండు variables వున్నాయి కాబట్టి నాలుగు combinations వస్తాయి.

1. మాతృభాషని అభిమానించి పరాయి భాషని అలుసు
చేసేవారు.
2. పరాయి భాషని అభిమానించి మాతృభాషని అలుసు
చేసేవాళ్ళు
3. మాతృభాషనీ పరాయి భాషల్నీ కూడా ఉత్సాహంగా
నేర్చుకుని .. అన్నిట్లోని అందాలనీ ఆనందించి
అభిమానించేవారూ
4. ఏ భాష పట్లా ఆసక్తీ, అభిమానమూ లేని వాళ్ళూ.


4 గురించి మాటల్లేవు.. 3 గురించి బాధ లేదు...1, 2 మాత్రం అప్పుడప్పుడు మనసును తొలిచే విషయాలే.

రవి said...

ఈ చర్చ మొదట్నించీ చదువుతున్నాను, అయితే, కామెంటడం వీలుపడలేదు (మా ఆఫీసు లో ప్రతిబంధకం). నేను సరస్వతీ కుమార్ గారితో ఏకీభవిస్తాను. తమిళులకు భాషా దురభిమానం ఉంది. తమిళమే గొప్ప భాష అని వాళ్ళ నమ్మకం. (హిందీ, తెలుగు వగైరా భాషలు వచ్చి కూడా మాట్లాడరు వాళ్ళు, చెన్నైలో)వాళ్ళను చూసి మనం నేర్చుకోవలసినదేమీ లేదు.

ఇక వాళ్ళు (తమిళులు)సాధిస్తున్న "ప్రగతి"...ప్రగతి అంటే, కొందరిని తొక్కేసి, మనం ముందుకు వెళ్ళడం కాదు.(ఇక్కడ బెంగళూరు లో తమిళుల గురించి చాలా మందికి తెలిసిన విషయమే ఇది.) మనతో బాటు ఓ పదిమంది కలిసి అభివృద్ధి దిశగా అడుగులు వెయ్యడం.

మీరు ఎన్ని చెప్పినా, ఇతర భాషల వారితో పోల్చి, తెలుగు వారి తప్పులు ఎంచడం, చాలా ఆవేదన కలిగిస్తుంది.

కొన్ని విషయాలు ఒప్పుకొంటాను, ఆంగ్ల ప్రభావం ఎక్కువయింది, వగైరా..అయినంత మాత్రాన, మనలను మనం ఎవరితోనో పోల్చుకుని కించపర్చుకోనవసరం ఉందంటారా?

సుజాత said...

రవి గారు, మొదటి నుంచీ చదువుతున్నందుకు, కామెంటడానికి టైము చేసుకున్నందుకు ధన్యవాదాలు!నేను టపాలో తెలుగు వారిని కించపరచలేదు. వ్యాఖ్యాతల్లో చాలా మంది తెలుగు వారికి భాషాభిమానం తక్కువని అభిప్రాయపడ్డారు. నా అభిప్రాయం ఏమిటంటే మనకి flexibility ఎక్కువ. పది మంది కన్నడ వాళ్ళు ఇద్దరు తెలుగు వాళ్ళు ఉన్న చోట మీరు ఏ భాష మాట్లాడతారు? ఇంగ్లీషేగా? మీ పక్కన ఉన్న తెలుగు వ్యక్తితో కూడా తెలుగులో మాట్లాడరు,ఎందుకంటే కన్నడ వాళ్ళకు ఇబ్బందిగా ఉంటుందని. కానీ హిందీ వాళ్ళు ఇలా ఉండరు. ప్రతి ఒక్కరికీ హిందీ వచ్చి ఉండాలని మొండిగా వాదిస్తారు.

మనల్ని మనం తక్కువ ఎప్పుడూ చేసుకోలేమండి! తమిళ వాళ్ళతో నేనైతే అసలు పోల్చుకోలేను, అభిమానానికీ, దురభిమానానికీ తేడా ఉంది కనుక!తెలుగు భాష మీద అభిమానం లేనిదే తెలుగు బ్లాగులు ఇంతగా వర్ధిల్లుతున్నాయంటారా! ఈ టపాకి వచ్చిన ఇంత రెస్పాన్స్ ని బట్టే తెలుగుని ఎవరూ వదులుకోడానికి సిద్ధంగా లేరని అర్థమైంది.

సుజాత said...

శ్రీవల్లి గారు,
1, 2, మనసుని తొలిచే విషయాలే! అవును, అందుకే ఈ టపా!
ధన్యవాదాలు.

భైరవభట్ల కామేశ్వర రావు said...

సుజాతగారూ,
ఇదిగోనండీ, మీ టపా స్ఫూర్తితో "తెలుగు భాషా సమితి" ఆవిర్భవించింది. మీకూ, ఇక్కడ కామెంటిన తెలుగు భాషాభిమానులందరికీ ఇదే నా ఆహ్వానం.
కలసి పాడుదాం తెలుగు పాటా!

వేణూ శ్రీకాంత్ said...

బాగుందండీ టపా, హిట్ల మైలు రాయి దాటినందుకు అభినందనలు.

బొల్లోజు బాబా said...

మీ పోస్టు దాని కామెంట్లన్నీ చదివాను. చాలామంది ఆవేదన వ్యక్తం చేసారు. మరికొంతమంది నిర్వేదం.
ఏది ఏమైనా తెలుగు భాష విస్మరణ కు గురవుతున్నదనేది జన బాహుళ్య అభిప్రాయం గానే తోస్తోంది.

ఇక్కడ ఒక జపనీస్ హైకూ గుర్తుకువస్తుంది.


ఇప్పుడు వాళ్ళు విజయం సాధించారు.
మరో 900 వందల ఏళ్ళలో వాళ్ళు ఓడిపోతారు.
సరే.... టీ వచ్చింది తాగు.

భాష పట్ల నాకు ప్రత్యేకమైన అటాచ్ మెంటు గానీ వ్యతిరేకత కానీ లేదు.
వ్యక్తిగతంగా కానీ సామూహికంగా కానీ ఏదైనా ఒక భాషను బతికించటం/నాశనం చేయటం కానీ చేయలేమని నా వ్యక్తిగత అభిప్రాయం.

మంచి ఆలోచనలు రేకెత్తించిన టపా.

బొల్లోజు బాబా

బొల్లోజు బాబా said...

900 వందల ఏళ్ళు కాదు 9 వందల ఏళ్ళు.
క్షమించండి.

సుజాత said...

బాబా గారు,
ఆ హైకూ చదివి 'బాగుంది ' అనుకున్నాను గానీ మీరు సరిదిద్దే దాకా ఆ చిన్న తప్పు చూడనే లేదు నేను. ఇదీ నా భాషా సౌందర్యం! క్షమించాల్సింది నన్ను!

రవి said...

@సుజాత గారు : క్షమించాలి. నాకు ఆఫీసులో టైము సమస్య కాదు. గూగుల్ బ్లాగర్ గా కామెంటటం కుదరదు.:-) ఇప్పుడు ఇంటి నుండీ రాస్తున్నాను.

నాకు తెలుగు అభిమానం లోనూ, (కాస్త) తమిళ దురభిమానం లోనూ, అభినివేశం ఉంది లెండి :-).

అన్నట్టు, 12 వేలకు గాను అభినందనలు. ఇలాగే సచిను, బిరియాని లారా, ఇలాంటి వాళ్ళ రికార్డులు బద్దలు కొడుతూ సాగండి.:-) బెస్ట్ ఆఫ్ లక్.

eliababu said...

సుజాత గారు ......
ఎంత చదివిన తనివి తీరడం లేదు . .....
తెలుగు లోని తియ్య దనమ్ ...తెలుస్తుంది ....
నేను ఆఫీసు లో తెలుగు లో మాట్లాడడం మొదలు పెట్టా ...
అందరు విచిత్రం గ చూస్తున్న ... తెలుగు లోని చమ్మక్కులు .. చలోక్తులు .... భలే గ వున్నాయి ...
అబ్దుత మైన మీ ప్రయాసకి ధన్య వాదములు ...క్రుతగ్నుడి .....
eliababu@gmail.com

Phanikumar said...

చాలా బాగా రాశారు... మీ చొరవకి నా జోహార్లు...

eliababu said...

sujatha gaaru...


blog lo Navi Bar ela tolaginchaaru....

cheppagalaraa?

eliababu@gmail.com

nagaprasad said...

Eliababu gaaru.

To remove/hide navbar see this link below.

http://freepctipsandtricks.blogspot.com/2008/06/removehide-navbar.html

fruit said...

sujatha gaaru intha matter raasaru, antha time ekkada dorukuthundandee baaboo..antha patiency naa...? best of luck..o story raasthunnaanu help chesthara?

సుజాత said...

fruit గారు,
మీ ప్రొఫైల్ చూసి మీరు సినిమా రచయిత అని తెలుసుకున్నాను. మీ వంటి ప్రతిభా శాలికి నా పోస్టు నచ్చినందుకు సంతోషం! నా మిగతా పోస్టులు కూడా చదివి మీ అభిప్రాయం తెలియ చేస్తారని ఆశించడం అత్యాశ కాదనుకుంటాను.

వేదాల రాజగోపాలాచార్య said...

అబ్బాయి (గీతాచార్య) మీ బ్లాగుగురించి చెప్పి "తెలుగంటే అంత అలుసా?" ప్రింటు ఇచ్చాడు. చాలా చక్కగా వ్రాశారు. నరసరావుపేట వారని చెప్పాడు. సంతోషం కలిగింది.

హైదరాబాదు లో ఈ సమస్య ఇప్పుడు కాదు కానీ అప్పట్లో చాలా ఎక్కువగా ఉండేది. ఆటోల వాళ్లు కొన్నిసార్లు ఉర్దూ తప్ప వేరే భాష మాట్లాడే వారు కాదు.ఇప్పటి పరిస్తితి నాకు తెలియదు. మంచి అభిప్రాయాలని వ్యక్తం చేశారు. తెలుగు రెండో భాష అంటే ఈ రోజుల్లో అందరికీ చిన్న చూపు ఐపోయింది.

ఆశీస్సులు.

ravigaru said...

సుజాత గారు మీరు ఫ్రూట్ ఆన్న బ్లాగేర్ ని ఉద్దేశించి చేసిన అభ్యర్దన చదివాకా ఇది రాయకుండా వుండలేకపోతున్నా.మనసు నొప్పిస్తే మన్నించండి.నెట్ అంటేనే virtual రియాల్టీ.అందులో రాసిన దాన్ని (ప్రొఫైల్ లో )చదివి ప్రతిభని అంచనా వేసేసి న మిగత పోస్ట్ లు కూడా చదివి మీ విలువైన అభిప్రాయాన్ని తెలియ చెయ్యండి అంటు ఏ ఇతర బ్లాగేర్స్ ని అభ్యర్దించని మీరు సిని రచయిత అని చదివి ?పోనీ అ బ్లాగేర్ తన బ్లాగ్ లో ఏమన్నా అద్బుత రచనలు చేసారా ? అంటే అది లేదు ప్రేమ అంటే ఏమిటి అని ప్రశ్నించడం తప్ప.నేను ACTOR రవితేజ ని అని చెపితే ?నన్ను కూడా అలాగే అభ్యర్దించేవర? ఇంతకీ నేను చెప్పదలచుకున్నదేమంటే తమ సమయాన్ని మీ బ్లాగ్ కోసం వెచ్చించి తమ అభిప్రాయాలూ తెలియ చెప్పే ప్రతివారు మీకు ముక్యులే అంతే కానీ ఒక రచయతనో ACTOR అనీ నమ్మి ప్రత్యేకమైన STANAM ఇవ్వనవసరం లేదని నా అభిప్రాయం.

సుజాత said...

ravigaru,

నాకు ఎవరి అభిప్రాయాలైనా అమూల్యమైనవేనండీ! ప్రత్యేకించి ఒకరి కామెంట్స్ వస్తేనే బ్లాగుకు సార్థకత అనే అభిప్రాయానికి నేను వ్యతిరేకిని!

fruit అనే బ్లాగర్ తను సినిమా రచయితను అని తన ప్రొఫైల్ లో పరిచయం చేసుకున్నారు. సినిమాకు రాయడం అంత ఈజీ టాస్క్ కాదని నేను అనుకుంటున్నాను. గొప్ప ప్రతిభ కూడా ఉండి తీరాలి. ప్రతిభా వంతులెవరైనా మన రచనను మెచ్చుకున్నారంటే అది మనక్కూడా ఎంతో కొంత ప్లస్ అనే కదా! ఆ ఉద్దేశంతోనే నా మిగతా బ్లాగులన్నీ కూడా చదవమని కోరాను. అభ్యర్థించడం అనడం సరైనది కాదు! మిగతా పోస్టులు కూడా చదివి అభిప్రాయం తెలియజేయమని కోరానంతే!ఇందులో నమ్మడం, మోసపోవడం అనే విషయాలకు తావెక్కడుంది?

false introduction చేసుకునే వారు తమ ఫొటోలు కూడా పెట్టుకుంటారంటారా?( ఆయన తన బ్లాగ్ లో ఫొటో కూడా పెట్టారు)

నా బ్లాగు కు వచ్చే ప్రతి వ్యాఖ్యా నాకు ముఖ్యమైందే! aggresive గా చెపుతున్నాను అనుకోకపోతే ఒక్కటి చెపుతాను, ఎంతటి మహా రచయితలనైనా సరే" ఈ మధ్య నా బ్లాగు మీద శీతకన్ను వేసారు" అనో, "నా బ్లాగు చూడరా " అనో నేను ఎవరినీ "అభ్యర్థించడం " జరగని పని!

ravigaru said...

సుజాత గారు మీ వివరణ చదివాకా థార్ ఎడారి లో మండుటెండ లో నడుస్తున్న వాడికి చల్లని మజ్జిగ తాగిన అనుభూతి కలిగింది. అందరు ముఖ్యులే అన్నందుకు .మన బ్లాగ్ లో మల్లెల సువాసనలు వేదజల్లుతున్నంత కాలం ఆ పరిమళాల అస్వాదనకి నేటిజేన్స్ కి కొదవలేదు. మీ బ్లాగ్ కూడలి లో ఒక రిలయన్స్ స్టోర్.ఒక చిన్న డౌట్ శీత కన్ను అంటారు కదా అసలు శీత కన్నుకి ముఖం చాటెయ్య డానికి వున్న సంభంధం ఏమిటో మీకేమన్నా తెలిస్తే చెప్పగలరు.

kroy said...

English chaduvuvlu.. i should tell something here.

I read my schooling in Telugu Medium.
From my personal experience..
Telugu Medium, made me to understand logic behind subject with ease.
Many english medium students failed to get logic(much many when compared to TM students). Simple reason, their parents can't speak English.

If parents don't know English much.. its always good to join kids in TM. Kids loves the language which their parents talk. For kids its tough to understand non-parent speaking languages. EM may end up kids with "Bhati kotadam etc.. not good for them in long run"

kroy said...

@16000 hits: tholi Telugu bloggers lo mee peru cherithrlo nilichipothundi :-> ... keep it up..

two weeks back.. neenu telugu google search ela vundo chudam ani "manasu" type chesa .. i found your blogo... I am suprised, that is first time i saw a telugu blogo.

atu Telugu etu Englishu raani maa laanti vaallaki edi eantho konth bhashani, bhavaani nerputhundi ani assisthu
-Kroypatcha

SATYA said...

సుజాత గారు...మీ తెలుగు భాషా అభిమానం నాకు నచ్చింది...నిజంగానే నేను ఒక తెలుగు వాడిని అని చెప్పుకొవడం అని గర్విస్తాను.విలైంత వరకు నాకు కూడా తెలుగు లొ నే మట్లాలడ్లని ఉన్న నేను ముంబై లో ఉంటున్నా ఎదో మీ దయ వలన కొంచం ఇలా తెలుగు వ్రాయగలుగుతున్న ... .మీ బ్లాగు చాలా బాగుంది...ధన్యవాదాలు....మీకు నూటికి నూరు మార్కులు...

noorbasha said...

ప్రాచీన హోదాతో వచ్చే నిధుల్ని ఆధునిక అవసరాలకు వినియోగించాలనే వాదనలు అప్పుడే మొదలయ్యాయి.చైనా భాష తమిళం కంటే ప్రాచీనం.వారు లిపిఆధునిక అవసరాలకు అనువుగాలేదని చాలా సార్లు సంస్కరించుకున్నారు.మనం కుండపెంకుల మీద, బండరాళ్ల మీద రాసుకుంటున్న రోజులలో ఒక లిపి సహితం లేని రష్యా వాళ్లు, జపాన్ వాళ్లు వారి భాషలను ఆధునిక అవసరాలకు అనువుగా మార్చారు.మన లిపిని మనం ఎందుకు మార్చుకోలేము? జాతి ఎదుగుదలకు కావలసింది వారి భాష ప్రాచీనహోదాతో పాటు ఆభాషను ఆధునిక అవసరాలకు కూడా సరిపడేలా తీర్చిదిద్దుకోవటం.భాషాభిమానంతో పాటు ప్రజల నిత్య జీవి తానికి సంబంధించిన పాలనా వ్యవహారాలలో స్వభాష పెత్తనం చేయాలి. తెలుగు అధికార భాష చట్టం 1966లో వచ్చింది.ఉర్దూ హైదరాబాద్, అనంత పురం, కర్నూలు, కడప, గుంటూరు, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలలో రెండవ అధికార భాష అన్న సవరణ 1996లో జారీ అయింది. ప్రభుత్వం జారీ చేసే చట్టాలూ ఆదేశాలూ నియమాలూ, ప్రభుత్వం ఇతర సంస్థలతో జరిపే ఉత్తరప్రత్యుత్తరాలూ అధికార భాషలలోనే ఉండాలనీ చట్టంలో ఉంది,కానీఉర్దూలోకానీ తెలుగులోకాని అనే అమలు కావటంలేదు.ఇద్దరికీ ఇంగ్లీషే శరణ్యమయ్యింది.1988 నవంబర్ 1 నుంచి అన్ని ప్రభుత్వ ఉత్తర్వులూ ఉత్తర ప్రత్యుత్త రాలూ తెలుగులోనే ఉండాలనీ, ఇంగ్లీష్ కేవలం కేంద్ర ప్రభుత్వంతో, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడే భాష అని జీవో జారీ అయ్యింది. ప్రభుత్వ ఉత్తర్వులు ఉత్తర ప్రత్యుత్త రాలు ప్రజలకు అందుబాట్లో ఉంచాలని, వారి అభిప్రాయాలు అభ్యంతరాలు వినడానికి బహిరంగ విచారణ జరపాలనీ చట్టం అంటుంది. కానీ అవి ప్రజలకర్థమయ్యే భాషలో ఉండటంలేదు. ఎన్నిసార్లు మొత్తుకున్నా ఆ పని మాత్రం చేయటంలేదు.అలాగే న్యాయస్థానాలలో స్థానిక భాష వాడటంలేదు.తెలుగు ప్రజల జీవితాలు, ఆస్తులు, కుటుంబ వ్యవహారాలకు సంబం ధించిన వ్యాజ్యాలలో విచారణ, వాదోపవాదాలు తమకు అర్థం కాని భాషలో జరుగుతుంటే తెలుగు ప్రజలు నోరు వెళ్ల బెట్టుకొని చూస్తున్నారు.ఇది మన జాతికి అవమానకరం. తమిళులు 1976 నుంచి క్రిమినల్ కేసులు సెషన్స్ కోర్టు దాకా,1982 నుంచి సివిల్ కేసులు పూర్తిగా తమిళంలోనే జరుపుతున్నారు. హిందీ రాష్ట్రాలు హిందీలోనూ గుజరాత్, బెంగాల్ రాష్ట్రాలుహైకోర్టుల్లో తప్ప మిగతా అన్ని కోర్టుల్లో తమ తమ భాషలలోనే న్యాయవ్యవస్థను నడుపుతున్నాయి. మనకు మెజిస్ట్రేట్ కోర్టులలో కూడా ఇంగ్లీషే.తమిళం ఇంగ్లీష్తో పోటీపడి ఎదుగుతున్నది .వత్తులు గుణింతాలు అన్నీ పక్కపక్కనే ఇంగ్లీష్లో లాగా ఒక వరసలో యంత్రానికి అనుకూలంగా తమిళ లిపి వారికి వరంగా మారింది."అరవమున డెమ్మీ ఫారము ముద్రణకు నాలుగు రూపాయలు చార్జి చేయగా తెలుగునకదేమాదిరి ఫారమునకు ఎనిమిదిరూపాయలు చార్జి చేయుచున్నారు.ఇట్లు ధర తక్కువయగుటకు కారణము అరవ లిపిలో సంకేతముల సంఖ్య మిక్కిలి తక్కువగా నుండుట.తెలుగచ్చును కంపోజిటర్లు నేర్చుకొనుటకు ఆరునెలలు పడితే అరవము ఒక నెలలో నేర్చుకొన వచ్చును.తెలుగు లిపిని గూర్చుట జాల జాగగును.గంటకు ఒక గాలీ అరవము కూర్చగలుగగా తెలుగున అరగాలీ మాత్రమే కుర్చగలము.అచ్చునకే ఇన్ని చిక్కులుండగా నింక టైపురైటింగు కుదురునా?" అని వేటూరి ప్రభాకరశాస్త్రి వాపోయారు.ఇంగ్లీషున అరవమున ఉన్నట్లు లిపి సంకేతములు ప్రక్కప్రక్కనే (ఒకదానిక్రిందనొకటి యుండకుండుట) యుండవలెనని ఆయన కోరారు.రాజీవ్ గాంధీ హత్య కేసు కూడా తమిళంలోనే జరి గిందట. అప్పీలును విచారించే సుప్రీంకోర్టు తమిళంలో ఉన్న పత్రాలన్నిటినీ ఇంగ్లీష్‌లోకి అనువాదం చేయించుకొని అప్పీల్ వింది. ఇంగ్లీష్ వచ్చిన వారికే మంచి ఉద్యోగాలు వస్తున్నందు వల్ల ప్రభుత్వ పాఠశాలలలో కూడ ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నారు.పిల్లలు కొత్త భాషలు సునాయాసంగా నేర్చుకుటారని వాదిస్తున్నారు.మాతృభాషలో విద్యా బోధనే పిల్లల కు మంచిదంటే హేళనచేస్తున్నారు.మీపిల్లలు ఏ మాధ్యమం లో చదువుకుంటున్నారని ఎదురు ప్రశ్నిస్తున్నారు.పిల్లలందరినీ ఆంగ్ల మాధ్యమం లో పడేస్తే నిజంగానే గొప్పఅవకాశాలొస్తాయా? ఉద్యోగాలు వస్తున్నది ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం వల్లనా లేక విషయవిజ్ఞానం వల్లనా? ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళలోకూడా విషయ పరిజ్ఞానం లేని శుంఠలకు కూడా ఉద్యోగాలు వస్తాయా?భాష నేర్చుకోవడం వేరు, భాషలో చదువు నేర్చుకోవడం వేరు.పర భాషలో చదువుపిల్లలకు హింసే. పిల్లలందరినీ ఇంగ్లీష్ మీడియంలోకి నెట్టడంకంటే ప్రైవేట్ పాఠశాలలు కూడా మాతృభాషలోనే చదువు నేర్పటం తప్పనిసరి చేయాలి. ఇంగ్లీష్‌ను కేవలం ఒక భాషగా నేర్పాలి.ఇంగ్లీషు,తమిళ భాషల లాగా మన తెలుగులిపి సంకేతములు ప్రక్కప్రక్కనే కూడా ఉండేలా లిపిసంస్కరణ కోసం ప్రాచీన హోదాద్వారా వచ్చే నిధుల్ని వినియోగించాలి.

noorbasha said...

భాషను కేవలం కొన్ని కులాల వాళ్ళే పుట్టించారు. వివిధ కులాల వాళ్ళు వాళ్ల వృత్తుల్ని బట్టి, అవసరాలను బట్టి పదాలను పుట్టిస్తూ, వాడుతూ ఉండటం వల్ల ఆ భాష అభివృద్ధి చెందుతుంది. అన్ని పదాలూ మాగ్రంథాల్లోనే ఉన్నాయనే అహంకారం పనికిరాదు. అన్ని కులాల వాళ్ల భాషనూ, వాళ్ళు వాడే పదాల్నీ నిజాయితీగల భాషా శాస్త్రజ్ఞుడు గుర్తిస్తాడు, గౌరవిస్తాడు, గ్రంథంస్తం చేస్తాడు. కొన్ని కులాల వాళ్ళ భాషనూ, వాళ్ళువాడే పదాలను అపహాస్యం చేస్తూ, నీచంగా భావిస్తూ, అసలు గ్రంథాల్లోకి ఎక్కత గని భాషగా చిత్రీకరిస్తూ, భాష సంపన్నం కాకుండ గతంలో అడ్డుతగిలారు. అలా అడ్డుతగిలే పని ఈనాటికీ చేస్తూనే ఉన్నారు. మన పల్లె భాషను గౌరవించుదాం. మన పక్కెలు, జెల్లలు, గెడ్డలు, మదుములు, పరసలు, పరజలు,… ఇంకా నీచమని భావించి మన సంస్కృతాభిమాన పండితులు వదిలేసిన తెలుగు పదాలన్నీ తెలుగు నిఘంటువుల్లోకి ఎక్కిద్దాం. కొల్లేరు ప్రక్షాళన కార్యక్రమం ఎలా జరుగు తుందో చూద్దామని వెళ్ళిన విలేఖరులకు అక్కడి ప్రజలు ఎన్ని రకాల చేపలు, పక్షులపేర్లు చెప్పారో చూడండి: మట్టగిడస, కర్రమోను, బొమ్మిడయి, శీలావతి, గొరక, ఇంగిలాయి, జెల్ల, బొచ్చె, జడ్డువాయి, చేదు పరిగె, కొరమీను, వాలుగ, పండుకప్ప, గండి బొగడ, కొయ్యంగ, మునుగపాము, గడ్డు గాయి, చామరాయి, పొట్టిదిలాసు, కట్టినెరసు, బుడపార, చాకరొయ్య, గడ్డికొయ్య, మాల తప్పడలు, ఏటిజెల్ల, మార్పులు, పల్లెంకాయ, పాలజెల్ల, పారాటాయి….. పరజ, గూడ, ఆసాబాతు, కళాయి, చేతన బాతు, నల్లముక్కులు, సముద్రపుచిలుక, నత్తకొట్టుడు…. భాషాసమృద్ధే స్వతంత్రతా భీజం అన్నారు నెహ్రూ. పై పదాలన్నీ తెలుగు పదాలు కావా? వృత్తి పదకోశాల్లోకి ఎక్కించడానికి గతంలో కొంత ప్రయత్నం చేశారు. ఏడదికి సగటున 5 కొత్త యూనివర్శిటీలు ఏర్పడుతున్నా ఇండియాలో 7 శాతం మించి పి.జి స్థాయికి చేరటం లేదు. దానికి కారణం పేదరికం కాదు, ఇంగ్లీషు భాషపై పట్టులేకపోవటమేనని రాష్ట్ర ఉన్నత విద్యాచైర్మన్‌ కె.సి రెడ్డి అన్నారు. (ఆంధ్రజ్యోతి 18-10-2005) అంటే ఇంగ్లీషు భాష మీద పట్లులేకపోతే మన దేశంలో ఏ వ్యక్తీ, అతనికి ఎంత జ్ఞానం, విజ్ఞానం ఉన్నప్పటికీ ఉన్నత విద్యలోకి ప్రవేశించలేడన్నమాట. ఇంగ్లీషొస్తేనే జ్ఞాని, విద్యావంతుడు. ఇంగ్లీషు రాకపోతే అజ్ఞాని, అనాగరికుడు అని మనమే నిర్ధారించు కుంటున్నాం. ఇంగ్లీషే అన్నింటికీ మూలం అన్నట్లుగా మారింది పరిస్థితి. తెలుగును ప్రాచీన భాషగా ప్రకటించాలని అన్ని పార్టీలవాళ్లా అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించారు. కేంద్రానికి పంపారు. కోర్టుకు గూడ వెళ్ళారు. కొద్దిరోజులకే జార్జిబుష్‌ హైదరాబాద్‌ రావటం, సివికాన్‌ వ్యాలీలో ఉన్న ప్రతి ముగ్గురు భారతీయ ఉద్యోగుల్లో ఒకరు ఆంగ్లప్రదేశ్‌కు చెందిన వారేనని తేల్చటం, దిల్‌కుష్‌ అతిథి భవనంలో అమెరికా వెళ్ళ టానికి వీసాలిచ్చే కేంద్రం పెడతామనటం, మన మధ్యతరగతి కుటుంబాలన్నిటికీ ఇంగ్లీషు ఉచ్చు బిగించిపోవటం చకచకా జరిగి పోయాయి. మరోసారి తాజాగా తెలుగుతల్లి సాక్షిగా ఉద్యోగాల కోసం మన పెద్దలు మోకరిల్లారు; ఇలా ఆంగ్లాన్ని స్తుతించారు: ఆంగ్లమేరా జీవితం- ఆంగ్లమేరా శాశ్వతం ఆంగ్లమే మనకున్నది- ఆంగ్లమేరా పెన్నిధీ ఆంగ్లమును ప్రేమించు భాయీ- లేదు అంతకు మించి హాయీ ||ఆంగ్ల|| తెలుగును విడిచీ- ఆంగ్లము నేర్చీ అమెరికా పోదామూ- బానిసలవుదామూ డాలర్లు తెద్దామూ ||తెలుగు|| అంటూ పాటలు కూడ పాడుతున్నారు. తెలుగుకంటే ఇంగ్లీషెందుకు ముద్దో కారణా లతో సహా వివరిస్తున్నారు: 1. తెలుగులో పెద్దగా విజ్ఞాన సాహిత్యం లేదు. తెలుగు భాషా దురభిమానం ప్రదర్శించటం తప్ప మన పాలకులు, పండితులు మన భాషలో పాలనను పెద్దగా ప్రోత్సాహించటం లేదు. తెలుగులో చదివితే ఉద్యోగాలూలేవు. 2. పెద్ద కులాలవాళ్ళు, ఆస్థిపరులు ఇంగ్లీషులో చదువుకుంటూ, పేదకులాల వాళ్ళకు ఇంగ్లీషు చదువులు దక్కకుండ చేయటానికి తెలుగు భాషా ఉద్యమాలు చేయిస్తున్నారు. 3. నిర్భంద చట్టాలతో తెలుగుభాషను తేవా లని చూసినా, పారిభాషిక పదజాలం యావత్తూ సంస్కృతమయం చేస్తూ, పండి తులు తెలుగుభాషను తెలుగువాళ్ళకు రాకుండా చేస్తున్నారు. తెలుగు చదువు కృత్రిమమై ఇంగ్లీషు చదువే సులువుగా ఉంటోంది.

4. దేశం మొత్తానికీ కలిపి ఒకే లిపిలేదు. మరో రాష్ట్రం వెలితే దుకాణాల బోర్డులపేర్లు చద వాలన్నా ఇంగ్లీషు రావాల్సిందే. హిందీ కూడ అందరికీ రాదు. ఆంగ్ల లిపి పిల్లలకు సుల భంగా వస్తుంది. 5. యవ్వనం వచ్చాక బాల్యావస్థకు తిరిగి వెళ్ళగలమా? ఇంగ్లీషొచ్చాక తెలుగెందుకు? ఆధునిక ప్రామాణిక తెలుగు భాష వచ్చాక ఎవరైనా ఇంటి భాషను కోరుకుంటారా? ఆంగ్ల పాలనలో ఎంతో ప్రావీణ్యం సంపాదించిన మన తెలుగుజాతి మళ్ళీ తిరిగి తెలుగుకు పరిమితమై కుంచించుకుపోవాలా? పడ్డచన్ను లెత్త బ్రహ్మవశమే? 6. కంప్యూటర్‌కు ఆంగ్లం అవసరం. ఇంగ్లీషు రానివాళ్ళు ఎందుకూ పనికిరాని వాళ్ళవుతారు. మనం విశ్వమానవులం. అధునాతన విశ్వ చైతన్యాన్ని అందిపుచ్చుకోవాలంటే తెలుగును బలిచేసైనా ఇంగ్లీష్‌ నేర్వాలి. 7. అప్పడగా బోయిందీ అదీ ఒక తప్పా? ఇప్పుడు తెలుక్కొచ్చిన ముప్పేమీలేదు. మమ్మీ, డాడీ, ఆంటీ, అంకుళ్ళతో తెలుగు సంస్కృతికొచ్చే నష్టం ఏంటట? భాషోద్య మాలతో ఎందుకీ గోల? ఇదంతా ప్రాంతీయ దురభిమానంతో చేస్తున్న వేర్పాటువాదం. ఆంగ్లం వల్ల అధికారం, అధికారం వల్ల భాగ్యం కలుగుతాయి. ఇక మనం తెలుగువాళ్ళం అనీ, మన తెలుగును రక్షించుకుందాం అనీ పోరాడే తెలుగు వీరులు చెప్పే సమాధానాలు ఏమిటి?: 1. మాతృభాషను కాపాడుకోవటం భాషా దురభిమానం ఎలా అవుతుంది? అలాగయితే ఇంగ్లీషువాళ్ళది భాషా సామ్రాజ్యవాదం కాదా? సొంతభాష కంటే మనకు ఇంగ్లీషే గొప్పగా కనబడటం బానిస మనస్తత్వం కాదా? 2. మన పాలకులు, అధికారులు డబ్బు సంపాదించటానికి మాత్రమే ఆంగ్ల విద్యను ప్రోత్సహించటం పడుపు కూడు తినటంతో సమానం. అత్యధిక జనాభా మాట్లాడేభాషను నాశనం చేస్తూ పరాయిభాషకు పట్టం గట్టడం అంటే పరస్త్రీ ముందు భార్యను అగౌరవ పరచటం లాంటిది. ఇది భాషా వ్యభిచారం, అనైతికం, అసహజం, తెలుగు జాతి ప్రజల హక్కుల ఉల్లంఘన 3. మన భాషను రక్షించుకోవాలంటే నిర్భంద చట్టాలు ఉండల్సిందే. ఇంటి భాషకు సైతం చోటు కల్పిస్తూ పారిభాషక పదజాలం మనం సమకూర్చుకోవాలి. ఇంగ్లీషుకంటే తెలుగే సుళువుగా వస్తుంది. మన లిపిని కంప్యూ టర్‌కు అనుకూలంగా మార్చుకోవాలి. అవసరమయితే ఆంగ్లలిపినే తెలుగుభాషకు వాడుకుందాం. 4. ప్రపంచవ్యాప్తంగా 15 కోట్లమంది తెలుగు వాళ్ళున్నారు. 110 దేశాలకంటే మన తెలుగు నేల పెద్దది. ఎన్నో యూరోపియన్‌ దేశాల భాషలు తెలుగుకంటే చిన్నవే. వాటికున్న గౌరవం మర్యాదకూడ తెలుగుకు రాదా? మనల్ని మనమే కించపరచుకోవటం ఏమిటి? 5. తెలుగు పనికిమాలిన భాషా? దెబ్బ తగిలితే మమ్మీ అని కాకుండ అమ్మా అని ఎందు కరుస్తారు? వచ్చీరాని ఇంగ్లీషు నడమంత్రపు సిరిలాంటిది. బాల్యంలో తీరని కోరికల్ని యవ్వనంలోనైనా తీర్చుకోవాలి గానీ ఆంగ్ల ప్రావీణ్యం అనే యవ్వన గర్వంతో బాల్యాన్ని మరిచి, తల్లిభాషను అధోగతికి దిగజార్చటం ఏరుదాటాక తెప్ప తగలేసే లక్షణం. 6. మన సాహిత్యం, చరిత్ర, విజ్ఞానం, విద్య, పరిపాలన మన భాషలోనే ఉండలి. కంప్యూటర్‌ కోసం తెలుగును బలి పెట్టటం ఎలుకలున్నాయని ఇంటిని తగులబెట్టడంతో సమానం. కంప్యూటర్‌నే తెలుగులోకి వంచుతాం. ఎన్నో భాషల గ్రంథాలు ఇంగ్లీషు లోకి అనువదించుకున్నారు. అవసరం అటు వంటిది. 7. ఇక్కడ చదివి ఎక్కడికో వెళ్ళి సేవలు చేసే మనస్తత్వం స్వజాతికి ద్రోహం చెయ్యడమే. తెలుగులోనే ఇంజనీరింగు, వైద్యశాస్త్రాలు చదివి తెలుగు ప్రజలకే సేవచేయగలిగితే మన భాషతో పాటు మన జాతి వికసిస్తుంది గదా? మీ భోగ భాగ్యాల కోసం తెలుగు ప్రజలందర్నీ ఇబ్బందు లకు గురి చేస్తారా? వారి మీద మోయలేని భారం మోపుతారా? వారి భాషను నాశనం చేసి వాళ్ళను మూగవాళ్ళుగా చేస్తారా? మాతృ భాషకు ప్రాథంమిక విద్యలోకూడ స్థానం లేకుండ చేసే వాళ్ళది ఇంటి కూడు తిని ఎవరి వెంటో పడే తత్వం కాదా? ఇది ప్రజాద్రోహం కాదా? మాతృభాషాతృణీకారం మాతృదేవీ తిర స్కారం అన్నారు మహాత్మాగాంధీ. మాతృ భాష సరిగా నేర్చుకోని వాళ్ళకు ఇతర భాషలు కూడ సరిగా రావు అన్నారు జార్జి బెర్నార్డ్‌షా. మన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంఘ్వీ ఇలా అన్నారు: మాతృమూర్తికి ఎంతటి గౌరవం ఇస్తామో మాతృభాషకు అంతటి సమున్నత స్థానం దక్కాలి. నేను తల్లితో సమానంగా తల్లిభాషనూ గౌరవిస్తాను. అందరూ మాతృభాషలో మాట్లాడండి. న్యాయ స్థానాల్లో వాదనలు కార్యకలాపాలు ఆంగ్లంలో కొనసాగడమేంటి? ఇంకా ఎంతకాలం ఈ దారుణం? న్యాయస్థానాల్లో వ్యవహారాలు సామాన్యుడి భాషలో కొనసాగినపుడే సామాన్యుడికి న్యాయం అందివ్వగలం. (అమ్మనే మరుస్తారా! ఈనాడు 27-2-2006) అమ్మభాషను మనవాళ్ళు మరచిపోతుంటే ఫ్రాన్సు నుండి పెద్దాపురం వచ్చి బుర్రకథల మీద, తెలుగుభాష మీద పరిశోధన చేస్తున్న డాక్టర్‌ డానియల్‌ నెగర్స్‌ ఇలా అంటున్నారు: తెలుగునేల మీద విదేశీ భాషలు నేర్చుకో డానికి సీఫెల్‌ వంటి సంస్థలు పనిచేస్తున్నాయి గానీ, తెలుగుపై మక్కువతో వచ్చే విదేశీయు లకు తెలుగు నేర్పే సంస్థ ఏదీ ఇక్కడ కనిపించ లేదు. అమెరికా పలుకుబడి, ఆంగ్లభాష ప్రపంచంలోని అన్ని భాషాసంస్కృతులకు నష్టం కలిగిస్తోంది. ప్రపంచీకరణ పేరుతో ప్రతి ప్రాంతానికీ ఈ ప్రమాదం విస్తరిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో రెండువేల భాష లున్నాయి. మరో వందేళ్ళు ప్రపంచీకరణ దాడి ఇలాగే కొనసాగితే 200 భాషలే మిగులు తాయి. భాషల సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవ అవసరం. ఫ్రెంచి, తెలుగు భాషలు దాదాపు ఒకే సమయంలో సాహిత్య భాషలుగా పరణతి చెందాయి. అయితే ఫ్రెంచిభాషను ప్రపంచంలో ఎక్కడయినా నేర్చుకునే వీలుందికానీ తెలుగును తెలుగు నేలపై నేర్చుకోవడమే కష్టంగా ఉంది. ఎంతో ప్రాచీనమైన తెలుగుభాష ఉనికిని కాపాడు కోవాలి. ఆంగ్లభాషను రుద్దడం వల్ల భాషల మధ్య ఘర్షణ తప్పదు. (ఆంధ్రజ్యోతి 22-2-2006) ప్రపంచంలోని అన్ని భాషల కంటే ఎక్కువగా ఆంగ్లభాషలో 7,90,000 పదాలున్నాయట. వాటిలో 3లక్షల పదాలు సాంకేతికమైతే, 4,90,000 పదాలు వాడుకలో ఉన్నాయట. అయితే భాషాశాస్త్రజ్ఞుల లెక్కప్రకారం ఏ ఒక్కరూ తమ జీవితకాలంలో 60వేలకు మించి రాయడంలోకానీ, చదవడంలో కానీ ఉపయోగించలేరట. అంటే అరవై వేల అవ సరమైన పదాలను రాయడంలో, చదవ డంలో ఉపయోగిస్తూ ఉంటే భాషను సజీవంగా కాపాడుకోవచ్చు. మెదక్‌ జిల్లా రాయికోడు మండలం షంషుద్దీన్‌ పూర్‌ గ్రామనివాసి ఏర్పుల కమలమ్మ 50 రకాల విత్తనాలు సాగుచేసి సరఫరా చేస్తోం దట. విత్తనాల పేర్లు చూడండి: తైదలు, ఉలవలు, సజ్జలు, పచ్చజొన్నలు, తోక జొన్నలు, తెల్లమల్లెజొన్న, ఎర్రజొన్న, బుడ్డ జొన్న, అత్తకోడళ్ళ జొన్న, నల్లతొగరి, ఎర్రతొగరి, తెల్లతొగరి, అనుములు, కొర్రలు, బొబ్బర్లు, పెసర్లు, వడ్లు, తెల్లనువ్వులు, ఎర్రనువ్వులు, గడ్డినువ్వులు, పుంట్లు, శనగలు, ఆవాలు, తెల్లకుసుమ, ధనియాలు, వాము, బటాని, సిరిశనగ, మిరప, కోడిసామలు, పల్లీలు, గోధుమ, సాయిజొన్న, నల్లకుసుమ, అవశలు, లంకలు, సిరిశనగ. (వార్త 6-3-2006) ఈ తెలంగాణా తల్లికి ఏమి ఇంగ్లీషొచ్చు? అయినా ఈ తెలుగు నేల తల్లులు ఎన్నో వందల ఏళ్ళనుండి మొక్కల పేర్లు, విత్తనాల పేర్లు మక్కువగా గుర్తు పెట్టుకొని వ్యవ సాయం నడపలేదా? ఇంగ్లీషు, లాటిన్‌ పదాల కిచ్చిన ప్రాముఖ్యత, ప్రాధాన్యత మన తెలుగు పదాలకు కూడ ఇవ్వలేకపోవటానికి కారణం ఏమిటి? మనం మనకి అర్థం కాకపోయినా, ఇంగ్లీషు వాళ్ళకు అర్థం కావాలి. ఈ బాబులు దేశంలో భారతీయులంతా ఒకరికొకరు అర్థం కావాలంటే ఇంగ్లీషే మంచిదనే నిర్ణయాని కొచ్చారు. బాషాప్రయుక్త రాష్ట్రాలన్నీ ప్రత్యేక దేశాలుగా అంటే మొగలులు, బ్రిటీష్‌ వాళ్ళు రాకముందున్నట్లుగా ఉంటే ఎవరిభాషకు వాళ్ళు పట్టం గట్టేవాళ్ళే. ఇప్పుడది సాధ్యంకాదు కాబట్టే మన భాషలకు ఇంగ్లీషు సారథ్యం వహిస్తోంది. తెలుగు భాషకు మూలపురుషులు ఎవరు? యానాదులు. తెలుగుభాషను నిత్యమూ వాడుతూ బ్రతికిస్తున్నది ఎవరూ? వివిధ కులవృత్తుల్లో ఉన్న శ్రామికులు, గ్రామీణులు. అరవైవేలు కాదు దాదాపు 3 లక్షల పదాలు వీళ్ళంతా కలిసి వాడుతున్నారు. వీళ్ళందరూ వాడుతున్న పదాలలో చాలా వరకూ వివిధ పదకోశాల్లోకి ఎక్కాయి. ఇంకా రక్షించు కోవాల్సిన పదజాలం ఎంతోఉంది. మాటకు ప్రాణము వాడుక. వాడుక ఎప్పుడు జరుగు తుంది? మన పంచాయితీలు, న్యాయ స్థానాలు, అసెంబ్లీ అన్నీ తెలుగులో నడిచి నపుడు. కనీసం మన పిల్లలకు ప్రాథంమిక విద్య అయినా తెలుగులో అందించినప్పుడు. ప్రైవేట్‌ స్కూళ్ళు తెలుగు నేర్పవు. మార్కుల కోసం కళాశాల విద్యార్ధులు సంస్కృతం రెండోభాషగా తీసుకుంటున్నారు. సంస్కృత పరీక్షలో జవాబులు తెలుగు, ఇంగ్లీషు లిపుల్లో దేంట్లోనైనా రాయొచ్చట. మార్కులు బాగా వేస్తారట. హిందీ పరీక్షకైతే 20 మార్కులు తెచ్చుకున్నా పాస్‌ చేస్తున్నారు. మరి ఈ రకం రాయితీలు, ప్రోత్సాహకాలు మన తెలుగు భాషకే ఇవ్వవచ్చుగదా? కర్నాటకలో కన్నడ మాతృభాషకాని వాళ్ళైనా సరే కన్నడాన్ని మూడో భాషగానైనా చదవాల్సిందేనట. మరి మన రాష్ట్రంలో? కర్నాటకలో కన్నడం లేకుండ హైస్కూలు విద్య పూర్తికాదు. పైగా 15శాతం మార్కులు కన్నడానికి ప్రోత్సాహకంగా ఇస్తున్నారు. తమిళనాడులో ఎనిమిదవ తరగతిదాకా తమి ళాన్ని ఒక భాషగా నిర్భందం చేశారు. కోయ, గోండు, కొలామి, ఆదివాసి, ఒరియా, సవర, బంజారా, కొండ, కువి మొదలైన గిరిజనులకు వారి మాతృభాషల్లోనే మన రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు ముద్రించి బోధిస్తోంది. ఇదే పని తెలుగు పిల్లలకు కనీసం అయిదో తరగతి వరకు నిర్భందం చేస్తే బాగుంటుంది. ప్రైవేట్‌ స్కూళ్ళమీద కర్నాటక, తమిళనాడు ప్రభు త్వాలు ఎలా వ్యవహరిస్తున్నాయో మన ప్రభుత్వం కూడా అలానే వ్యవహరించాలి. భాషను సాహిత్యానికీ కవిత్వానికీ పరిమితం చేస్తే భాషతోపాటు దాన్ని మాతృభాషగా కలిగిన వారుకూడ వెనుకబడిపోతారు. భాషను ఉపాధితో ముడిపెట్టండి అన్నారు మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ గిడుగురామ్మూర్తి జయంతి ఆగష్టు 29ని తెలుగు భాషా దినోత్సవం గానూ, కాళోజీ జయంతి సెప్టెంబరు 19ని తెలుగు మాండ లిక భాషా దినోత్సవం గానూ జరుపుకుంటు న్నాము. ఇంటిభాస ఎసుంటిదైనా మందే కదా? ఆదరిచ్చుదాం. ఇంపుగా నేరుద్దాం. ఇంగిలీసు నేర్చుకోటల్లా? అట్టా.

సుజాత said...

నూర్ బాషా గారు,
ఇంగ్లీష్ ను ఒక భాష గా మాత్రం నేర్చుకుంటే.... ఏ రాష్ట్రంలో వాళ్ళు ఆ రాష్ట్రం లోనే పని చేయాలి. రాష్ట్రం దాటి దాటి వెళితే చిల్లిగవ్వకు పనికొస్తారా చెప్పండి? కొన్ని మల్టి నేషనల్ కంపెనీలు భాషకు చాలా ప్రాముఖ్యం ఇన్స్తాయి. విషయ పరిజ్ఞానం అంతగా లేకున్నా communication skills ఉంటే రెక్రూట్ చేసుకుంటాయి. ఇంగ్లీష్ రావడం, నేర్చుకోవడం ముఖ్యమే, అంత మాత్రం చేత మాతృభాషను నిర్లక్ష్యం చెయ్యకూడదు..అదీ నేననేది!

ఇక మీ రెండో వ్యాఖ్య చాలా చాలా సమాచారాత్మకంగా, వివరంగా, భాషాభినివేశాన్ని ప్రతిబింబిస్తూ ఉంది. ఇప్పుడే తెలుగు భాషా ప్రచర సమితి గూగుల్ గ్రూపుకు పంపుతాను ఈ లింకు!

noorbasha said...

సుజాత గారూ
ముందు నేరుగా తెలుగులోనే టైపు చేసుకునే సౌకర్యం బ్లాగులో కల్పించండి.
ఇంగ్లీషు వల్ల వచ్చే ఉద్యోగాలకోసం ఆ భాష నేర్వక తప్పడం లేదు.అలాంటప్పుడు తీవ్రమైన ప్రోత్సాహక చర్యలు తీసుకోనిదే మన భాష ఎలా బ్రతుకుతుంది?బ్రతుకుతెరువుకు ఏవిధంగానూ ఉపయోగపడని భాష ఎందుకు బ్రతకాలి?ఆంగ్లేయులు వారి భాషకోసం ఎన్నో ప్రయాసలు పడ్డాకే ఈస్థితికొచ్చారు.తెలుగు వాడు రాష్ట్రం దాటి వెళ్ళి చిల్లిగవ్వకు కూడా పనికి రాని దుస్థితి నిజంగానే ఉంది.తెలుగు ద్వారానే ఉపాధి దొరికుతుందా అనేదే సమశ్య,దొరికితే బాగుండునే అని ఆశ ఆవేధన.మాధవపెద్ది బుచ్చి సుందరరామ శాస్త్రి ఇలా అన్నారు:
"భాషలనెల్ల లెస్సయనబడ్డ స్వభాషను మాటలాడ నామోషియా?
ఇంటిలో ముసలిమోళ్ళును ఇంగిలిపీసులోనే సంభాషణ సేయగా వలెనా?
పండిన పాపమదెల్ల?
ఈదిచి చెంపకాయ నొకటిచ్చు నియంతలు లేక కాద ఈ పోడిమిలోనికిట్లు
దిగిపోయితివాఖరుకున్ సహోదరా?"
విషయ పరిజ్ఞానం అంతగా లేకున్నా ఇంగ్లీష్ బాగా వస్తే రిక్రూట్ చేసుకుంటున్నారుగనుక ఆ భాషకు ఎగబడటం సహజం.వేలూరి శివరామ శాస్త్రి ఆవేదన చూడండి:
"తెలివికి సంస్కృతమున్ మరి కలిమికి ఆంగ్లేయమో ఇక తురకంబో విలువయిడి నేర్చి
ఈ నీ తెలుగెవ్వరి పాలుజేసి తిరిగెదవాంధ్రా?"
బెల్లమున్నచోటచేరే ఈగల్లాంటివారు మనుషులు
." అంతా తైలంలో ఉందండీ"

kroy said...

Sujatha akkai,
communication skills(english lo) nerchukotaaniki, eantha kaalam kavali? 3 nelalu? maximum 1 year..

communication skills ante 80% bhava vyakthikaranna + 20% language.
First 80% comes through attitude(it requires to be told from childhood).
Rest 20% can be learned @ any time.
Many Indians still don't know English. chaduvukuna valla pillalani EM lo vesthunaru ani veellu vestharu. aa pillalu chadava leaka naana kashtalu padatharu.
nijaniki 1000 english words vasthe chaalu, and attitude vunte, He will be awesome speaker. All MNCs want these kind of people. MatlAdagaligithe chaaalu.

neenu em vodu ane chebutha. tm lo english okka subject ga vundi, adi chaalu.

సుజాత said...

నూర్ భాషా గారు,
మాతృభాషలో కనీస భావ ప్రకటన రాజధానిలో కరువైందనిఒక పక్క బాధ పడుతుంటే మీరు బ్రతుకు దెరువంటారు. భలే వారే! నిజానికి భాష పరమార్థం భావప్రకటనే కానీ బ్రతుకుదెరువు కల్పించడం అంటారా? అలా అయితే తెలుగు మాస్టార్లకు, కమర్షియల్ రచయితలకు తప్ప ఇంకెవరికీ వీలుకాని పని.

మీరు కోట్ చేసిన పద్యాలు ఆవేదనకు అద్దం పట్టినట్టు ఉన్నాయి.

noorbasha said...

వలసకూలీలమయ్యాం తెలుగుతల్లీ, క్షమించు!
శక్తిచాలనివాడు సాధుత్వం వహించినట్టుగా ప్రాంతీయభాషలన్నీ జాతీయ భాషను, అంతర్జాతీయ భాషనూ నెత్తిన మోస్తూ ఇచ్చిన కూలి తీసుకొని
బతకవలసిందే గానీ, మరో మార్గం లేదు. అమృతభాషలు మృత భాషలు కాలేదా? ఎన్నో భాషామతల్లులు చనిపోయాయి.
పే ద జనానికి తెలుగు, ధనవంతులకు ఇంగ్లీష్ నేర్పుతూ అంతరాలను కొన సాగిస్తున్నారనే వాదం ఈ మధ్య గట్టిగా వినిపిస్తోంది. ఇంగ్లీషును దేశభాషగా మారిస్తే, ఇంగ్లీషునే అన్ని ప్రభుత్వపాఠశాలల్లో బోధిస్తే, అన్ని కులాల వారు విమానాలెక్కే స్థాయికి వస్తారని కొందరు అంటున్నారు. ఈ రకమైన ఆశ తప్పేమీ కాదు. కానీ ఇంగ్లీష్ భాషవల్లనే దళితులు, వెనుకబడిన తరగతులవారు, ముస్లింలు... బాగుపడతారా? అభివృద్ధికీ, అంతర్జాతీయ సౌకర్యాలు పొందడానికీ ఆంగ్లమే శరణ్యమని ప్రజలు ఎగబడడానికీ కారణాలు ఏమిటి? ఆ కారణాలను అన్వేషించి మన భాషకుకూడా ఆంగ్లమంతటి శక్తిని తెచ్చే ప్రయత్నాలు చేయకూడదా? ఆంగ్లానికున్నంత శక్తి తెలుగుకు రాదా? మన ప్రజలు తలుచుకొంటే ఇది సాధ్యంకాదా?
భాషకూ కులానికీ ముడిపెట్టడం అనవసరం. పెద్ద పెద్ద చదువులు ఇంగ్లీషులో చదివినవాళ్ళే అమెరికా వెళ్ళినా కులసంఘాలు వదడంలేదు. కులతత్వాన్ని, మత ఛాందసాన్ని ఇంగ్లీష్ పోగొట్టదు. పైగా తెలుగువాడిని ఇంగ్లీషులో హడలగొట్టే వాళ్ళు తయారయ్యారు. తెలుగు ముస్లింలను ఉర్దూ, అరబీలతో, తెలుగు హిందువుల్ని సంస్కృతంతో బెదిరించి బానిసలుగా చేసినట్టే, తెలుగు ప్రజల్ని నేడు ఇంగ్లీషుతో పాలిస్తున్నారు. అయినా ఇంకా తెలుగు చచ్చిపోలేదు.
దేశానికి లింకు భాష కావలసిరావడమే మన భాషకు పట్టిన దౌర్బాగ్యం. మనదేశ భాషలన్నీ స్వయంపోషకత్వాన్ని కోల్పోయి, వాడిపోయి రాలిపోయేదశకు చేరుకుంటున్నాయి. ఇంగ్లీష్ లింకు తెగితే ఆక్సిజన్ సరఫరా ఆగిపోయినట్లు దేశాలు విలవిలలాడుతున్నాయి. దేశభాషలన్నిటికీ ఇంగ్లీష్ సెలైన్ బాటిల్‌వలె పనిచేస్తోంది. వరల్డ్‌వైడ్ వెబ్‌లో ఈగల్లా చిక్కుకున్న అన్ని భాషల్నీ ఇంగ్లీష్ అనే సాలెపురుగు పీల్చి పిప్పిచేసింది. ఇంగ్లీష్ లేకుండా ఎవరి భాష వాళ్ళకు తెలిసే అవకాశంకూడా లేదనే పరిస్థితి దాపురించింది. ఇవన్నీ నిజాలు. మన భాషను ఇలాంటి స్థితిలో ఉద్ధరించడం సాధ్యమవుతుందా? మన భాషద్వారా ఐఎఎస్, ఐపిఎస్ అధి కారులు రాగలరా? ఉపాధినిచ్చే భాషను ప్రజలు ఎగబడి నేర్చుకుంటారు. లక్షలాదిమందికి ఉపాధిని, విజ్ఞానాన్ని అందించగలస్థాయికి మనభాషను తీసుకుపోగలమా? అలాంటి ఆశ, అంకితభావం గలవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మన పొలాన్ని మరొకడికి కౌలికిచ్చి, వాడి దగ్గరే కూలీగా పనిచేస్తున్నట్టుంది మన పరిస్థితి.
1984లో వావిలాల గోపాలకృష్ణయ్య ఇలా అన్నారు: 'ఆనాడు మనదేశంలోనే మనం బాని సలం. 1947లో బ్రిటిష్ వాళ్ళనుంచి స్వేచ్ఛను పొందాక మనభాష అభివృద్ధి చెందుతుందను కున్నాం. కానీ మన భాషాభివృద్ధికి అవసరమైన ప్రభుత్వం మనకు రాలేదు. అమెరికా పోయే నలు గురికోసం అంతా ఇంగ్లీష్ చదవాలా? అమెరికా వాళ్ళే వాడితోపాటు మా ఊళ్ళోఉన్న గుమాస్తాకు, తలారికికూడా ఇంగ్లీష్ నేర్పాలట. ఎందుకో మరి? మనప్రభుత్వం ప్రజలకు అర్థంకాకుండా పోయింది. ఇంగ్లీష్ మోజుదారులు మాకు ఇంగ్లీష్ అలవాటైపోయిందండీ అంటారు. మొదట పొరపాటు, తరువాత గ్రహపాటు, ఆ తరువాత అలవాటు. ఈ అలవాటు అనే ప్రమాదకరమైన శత్రువును నిషేధించకపోతే మనం ఇక ఈ స్థితిలోకూడా నిలవం. ప్రజాపాలన ప్రజల మాతృభాషలో ఉండాలి. తెలుగు ఇవాళ చదవకపోతే భాష మరచిపోతాం. భాష ఎంతమాట్లాడుతుంటే అంత వస్తుంది. ఎన్ని విషయాలు మాట్లాడితే అంత పదజాలం పెరుగుతుంది. మన భాషను నిరంతరంగా వాడితేనే తాజాగా ఉంటుంది, ప్రవహిస్తుంది. ఇన్ని సంవత్సరాల తరువాతకూడా ఇంగ్లీష్ వాళ్ళే మనల్ని పరిపాలిస్తున్నట్లుగా ఉంది. కాన్వెంట్ స్కూళ్ళు అంటువ్యాధికంటే ప్రమాదకరమైనవి. తెలుగురాని పిల్లవాడికి ఇంగ్లీష్ నేర్పుతున్నారు. మనభాష ఏమైపోతుంది?'
పూజారి నోట్లోని సంస్కృత మంత్రంలా, ముల్లా నోట్లోని అరబీ సూరాలా ఇంగ్లీష్ గొప్పశక్తి సంపాదించుకుంది. మంత్రాలొస్తేనే గదా పూజారి అయ్యేది? అలాగే ఇంగ్లీష్ వస్తేనే అధికారం, ఉద్యోగం దక్కుతున్నాయి. ఇంగ్లీష్‌వాడికంటె ఎక్కువజ్ఞానం తెలుగులో సంపాదించినా వ్యర్థం. ఎందుకంటె బోలెడంత విషయ పరిజ్ఞానంతో కూడిన తెలుగుకంటె, అసలు ఏ పరిజ్ఞానం లేకపో యినాసరే, వట్టి ఇంగ్లీష్ భాష వస్తేచాలు బతుకు తెరువు దొరుకుతుందని హామీ ఇస్తున్నారు. ఆంగ్ల భాషావాదుల అవసరం అలాందిమరి! హిందీ, ఇంగ్లీష్ రాని తెలుగువాళ్ళు ఒంటరివారిలా బతు కెలా గడుస్తుందోననే భయంతో ఉన్నారు. పరాజితులు విజేతల భాష నేర్చుకోక తప్పదు. గత్యంతరంలేకే తెలుగు వాళ్ళు హిందీ, ఇంగ్లీషులకు పట్టం గట్టారు. బతుకు తెరువుకోసమే ఆ భాషల పంచన చేరారు. ఇంగ్లీష్ గుంపులో చేరితేనే, 'ఇక ఫరవాలేదు బతుకుతాను' అనే నమ్మకం కలుగుతోంది. ఇంగ్లీష్ రాని శ్రీకృష్ణదేవరాయలు ఇప్పుడుంటే ఏం చేస్తాడు?
పక్షులు తమ కూతను మార్చుకోకపోయినా వల సవెళ్ళిన ప్రాంతాలనుబట్టి తమ అరుపుల్లో యాసను మారుస్తాయట. అవసరం అన్వేషణకు తల్లి అంటారు. పశువులు పక్షులేలే తమతమ భాషలతో ఆటలాడుకుంటుంటే, మనిషి ఊరుకుంటాడా? గుంపులుకట్టి కొన్ని భాషల్ని అధికారపీఠం మీద కూర్చోపెడతాడు, కొన్ని భాషల్ని అణిగిమణిగి పడిఉండమని ఆదేశిస్తాడు. ఒకదానిని దేవ భాష అంటాడు, ఒకదానిని అధికారభాష అంటాడు, మరొకదానిని బానిసభాష, పనికిమాలిన బాష అంటాడు. ఏమైనా శక్తిచాలనివాడు సాధుత్వం వహించినట్టుగా ప్రాంతీయభాషలన్నీ జాతీయ భాషను, అంతర్జాతీయ భాషనూ నెత్తిన మోస్తూ ఇచ్చిన కూలి తీసుకొని బతకవలసిందే గానీ, మరో మార్గం లేదు. అమృతభాషలు మృత భాషలు కాలేదా? ఎన్నో భాషామతల్లులు చనిపోయాయి.
అమ్మా తెలుగుతల్లీ, ఇక చచ్చిపో. ఎంతకాలం మంచంమీద రోగిష్టిలా ఉంటావ్! నిన్ను బాగుచేయించే ఆర్థికస్థోమత మాకు లేదు. అంత గొప్ప వైద్యమూ లేదని స్పెషలిస్టులూ తేల్చిచెప్పారు. నీవు ఇంట్లో వాళ్ళందరికీ అడ్డమైపోయావు అని నీ పిల్లలే విసుక్కుంటున్నారు. మొండి ప్రాణమే తల్లీ నీది. నీమీద మాకు ఎంతప్రేమఉన్నా ఏమీ చేయలేని అశక్తులం, బానిసలం, రెక్కాడితేగాని డొక్కాడని వలస కూలీలమయ్యాం. నిన్ను పోషించనందుకు మమ్మల్ని క్షమించమ్మా!
నూర్‌బాష రహంతుల్లా
రచయిత రాష్ట్రప్రభుత్వఅధికారి
వార్త ప్రత్యేకం 7.10.2006

సుజాత said...

నూర్ భాషా గారు,

మీ వ్యాఖ్య నన్ను నిజంగా దిగ్భ్రాంతికి, అంతులేని ఆవేదనకు గురి చేసింది. చివరి పేరా నిజంగా కన్నీరు తెప్పించింది.

అధికార భాషా సంఘం విధులేమిటి?అది వాటిని ఎంతవరకు అమలు పరుస్తుంది?భాషాభివృద్ధి లో ఈ సంఘం పాత్ర ఏమిటి?(ఎందుకంటే వార్తల్లో చూడడం తప్ప ఈ సంఘం గురించి నాకంతగా తెలియదు. పదవీ కాలానికొకరు చొప్పున తూమాటి దోణప్ప తదితరులు ఆ సీట్లో కూచోడం తప్ప వేరే సమాచారం నా వద్ద లేదు.) ప్రైవేటు స్కూళ్లలో తప్పని సరిగా ఇంగ్లీషు లోనే మాట్లాడాలన్న బలవంతపు నిబంధన విషయంలో అధికార భాషా సంఘం వైఖరి ఏమిటి?

ఈ ప్రశ్నల్లో కొన్నింటిని నేను జనాంతికంగా అడిగాను ఈ టపాలో. ఇప్పుడు మీరు రాష్ట్ర ప్రభుత్వ అధికారి అని తెలిసింది కాబట్టి, మీరు ఖచ్చితమైన సమాచారం ఇవ్వగలరనే ధైర్యంతో అడుగుతున్నాను.

మరి భాషను బతికించుకోడానికి ఏం చేయాలో చెప్పండి. అధికారులు ఏం చేయాలి? ప్రజలు ఏం చేయాలి?
గూగుల్ గ్రూపుగా ఏర్పడిన తెలుగు భాషా ప్రచార సమితి లాంటి సంఘాల వల్ల భాషాభిమానం పెంపొందే అవకాశం ఉందా ?

ఎలా? ఎలా? తెలుగు దేశంలో ఎటు చూసినా తెలుగే వినపడాలంటే ఎవరు ఏం చేయాలి? ఎవరి బాధ్యతలేమిటి?

పెరిగిపోయిన సాఫ్ట్ వేర్ పరిశ్రమ, కాల్ సెంటర్లు, మెడికల్ ట్రాన్స్ క్రిప్షన్లు,వెల్లువెత్తిన ఇతర రాష్ట్ర ప్రజలు, ఈ నేపధ్యంలో భాషను బతికించుకోవాలనుకునే వారు ఏం చేయాలో చెప్పండి మీరు.

చైతన్య క్రిష్ణ పాటూరు said...

నూర్ భాషా గారు,
చివరి పేరా నిజంగానే ఆవేదన కలిగించింది. "తెలుగు అధికార భాష కావాలంటే" పుస్తకంలో మీరు చర్చించిన విషయాలు ఎంతో విలువైనవి, మనం ఇప్పుడు దృష్టి పెట్టాల్సినవి. మీలాంటి భాషాభిమానుల నిస్పృహ చాలా బాధ కలిగిస్తోంది.

సుజాత గారు,
అధికార భాషా సంఘానికి పేరులోనే గానీ, బయట ఎటువంటి అధికారాలూ లేవు. వారు కూడా మన లాగా విజ్ఞప్తులు చేయటం తప్ప మరేమి చేయలేరు. స్థానిక భాషా, సంస్కృతలలో కొంతైనా బ్రతుకు తెరువు చూపిస్తే తప్ప, తెలుగు లాంటి స్థానిక భాషలకు మనుగడ లేదు. మాతృభాష పట్ల మన స్పందనలు ఉద్వేగ పూరితస్థాయి నుండి ఎదగాలంటూ ఈ విషయం మీద సీతారాంరెడ్డిగారు నా టపాలో ఒక చక్కని వాఖ్య వ్రాసారు, కుదిరితే చూసి మీ అభిప్రాయం చెప్పండి.
http://chaitanyapaturu.blogspot.com/2008/11/blog-post.html

noorbasha said...

తెలుగు అధికార భాష కావాలంటే...
తెలుగును బాగా వాడుకలోకి తేవాలని అధికార భాషా సంఘం ఎన్నో అవస్థలు పుతోంది.
రకరకాల ప్రయోగాలు చేస్తోంది. కాని ఆ సంఘం ఏమీ చేయలేకపోతున్నది. ప్రజలను
ఓదార్చటం కోసం ఆ సంఘాన్ని స్థాపించారే తప్ప, ఆ సంఘానికి అవసరమైన
అధికారాలను అప్పగించి ప్రోత్సహించలేదు. అధికార భాషా సంఘం ఒక సలహా సంఘం
లాంటిదే గాని దానికి ఎలాంటి చట్టబద్ధమయిన అధికారాలూ లేవు. తెలుగుభాషను
అమలు జరపని అధికారులమీద చర్యలు తీనుకునే అధికారం అధికార భాషా సంఘానికి
దత్తం చెయ్యాలి.
ప్రపంచ భాషలన్నిటిలో తెలుగు 15వ పెద్ద భాష. ఇండియాలో రెండవస్థానాన్ని
ఆక్రమించిన భాష. అయినా అతిగా నిర్లక్ష ్యం చెయ్యబడిన భాష.ఇంగ్లీషు, హిందీ,
ఉర్దూ, సంస్క ృతం లాంటి భాషల దురాక్రమణకు బాగా గురయిన భాష. ఐ.ఎ.యస్‌.
అధికారులు మొదలు అటెండర్ల వరకు చిన్నతనంగా భావించి ఈసడించే బాష. భాషా
ప్రాతిపదికమీద రాష్ట్రం ఏర్పడి 34 ఏళ్ళ గడిచినా పాలకులు చట్టాలు ఇంకా చెయ్యలేక
పోతున్న భాష. పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌, సచివాలయం మొదలైన కార్యాలయాల్లో
అడుగడుగునా అవమానాలకు గురౌతూ, ఆంగ్ల సవతిపోరు అనుభవిస్తున్న భాష.
ఇంతవరకు ఒక సమగ్రమైన శాస్త్రీయమైన నిఘంటువును సైతం సమకూర్చుకోలేక
పోయిన భాష. మమ్మీ, డుడిల డబుసరి చదువుల ముందు సిగ్గుతో ముడుచుకు పోయిన
భాష. ఇన్ని బాధల వలయంలో ఉన్న మన భాషను రక్షించుకొని, దానికి పరిపాలక
భాషగా పట్టం కట్టాలంటే ఎన్నో పనులు చేయవలసి ఉంటుంది. అయితే తెలుగు తెలుగు
అని తెగ అరుస్తూ, ఎలాంటి అభివృద్ధి చేయకుండ పాలకులు కాలం గపటం అనవాయితీ
అయ్యింది. పాలకులకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ క్రింది చర్యలు అమలు జరపాలి.
1. నాయకులు, అధికారులు ముందు తమ మనసుల్లో తెలుగుభాష పట్ల గౌరవాన్ని
పెంచుకోవాలి. ఆ భాషపట్ల అభిమానాన్ని పెంచుకోవాలి. ఆ భాష మర్యాదను
కాపాడటానికి శపధం తీసుకోవాలి. ఎంతో విలువనిస్తూ ఆ భాషను మాట్లాలి,
వాడుకలోకి తేవాలి, అభివృద్ధి చెయ్యాలి. పిల్లలను తెలుగు మాధ్యమంలో
చదివించాలి.
2. రాష్ట్ర ప్రభుత్వం తన చట్టాలన్నీ తెలుగులోకి అనువదించి, ముద్రించి అన్ని
కార్యాలయాలకు సరఫరా చెయ్యాలి. వాటి ఆధారంతో పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌
శాఖాపరమైన పరీక్షలన్నీ తెలుగులోనే జరపాలి. అన్ని పోటీ పరీక్షల్లో తెలుగు
భాషా పరిజ్ఞానం మీద ఒక ప్రశ్నాపత్రం ఉండలి. తెలుగులో పట్టభద్రులైన
వారికి 5 శాతం మార్కులు గ్రూప్‌ 1 పరీక్షల్లో కూడ ఉచితంగా ఇవ్వాలి. ఆ
విధంగా జిల్లా అధికారుల స్థాయిలో తెలుగు పట్టభద్రులను ప్రోత్సహించాలి.
3. సచివాలయంలోని ఇంగ్లీషు టైపు మిషన్లన్నీ తీసివేసి, వాటి స్థానంలో తెలుగు
టైపు మిషన్లు ఉంచాలి. ప్రతి జి.వో. తెలుగులో రావాలి. లిపి సంస్కరణ జరిపి
తెలుగు టైపును సులభతరం చెయ్యాలి.
4. రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న ఇంగ్లీషు మీడియం పాఠశాలలన్నిటినీ తెలుగు
మీడియంలోకి మార్చాలి. తెలుగు మీడియం పాఠశాలలకు మాత్రమే ప్రభుత్వ
సహాయం అందాలి. విశ్వవిద్యాలయాల్లోని చదువులన్నీ క్రమంగా తెలుగులోకి
మార్చాలి.
5. రాష్ట్ర ప్రభుత్వం ఒక సమగ్రమైన తెలుగు-తెలుగు నిఘంటువును తయారు
చేయించాలి. తెలుగు జాతీయాలను, సామెతలను, మాండలికాలను, వివిధ
ప్రాంతాలలోని యాసపదాలను క్రోడికరించి ప్రామాణిక గ్రంధాలుగా
వెలువరించాలి. స్నాతకోత్తర పరిశోధన విద్యలను కూడ తెలుగులో నడపటానికి
వీలుగా శాస్త్ర, సాంకేతిక గ్రంథాలను తెలుగులోకి మార్చుకోవాలి.
6. దూరదర్శన్‌ రెండవ ఛానెల్‌ను తెలుగు కార్యక్రమాల కోసం సాధించాలి. తెలుగును
దేశంలో రెండవ అధికార భాషగా ప్రకటించేందుకు కేంద్రం మీద వత్తి తేవాలి.
7. తెలుగు మాధ్యమం ద్వారానే కళాశాల స్థాయి వరకు చదివిన అభ్యర్ధులకు అన్ని
ఉద్యోగాల్లో కొంతశాతం రిజర్వేషన్‌ కల్పించాలి. ముఖ్యంగా గ్రూప్‌ 1 సర్వీసుల్లో
ఇలాంటి రిజర్వేషన్‌ ఉండలి. అలాగే స్నాతకోత్తర విద్యను కూడ తెలుగులోనే
పూర్తిచేసిన ఉద్యోగులకు ప్రమోషన్‌ విషయంలో ప్రోత్సాహకాలు ప్రకటించాలి.
అధికార భాషగా తెలుగు బాగా అమలు కావాలంటే తెలుగుబాగా వచ్చిన
అధికారులు అధికంగా ఉండలి.
8. ఇక అచ్చతెలుగు వాడలనే ఛాందస నియమాలు వదులుకొని ఇప్పటికే తెలుగులో
బాగా పాతుకుపోయిన ఇతర బాషల పదాలను యధాతథంంగా వాడుకోనివ్వాలి.
అనువదించటానికి వీలులేని మాటలు, తెలుగులో వేరే పదాలులేక బహుళ
ప్రచారం పొందిన పరభాషా పదాలను, వాడుకభాషలోని సంకర పదాలను
స్వేచ్ఛగా ఫైల్స్‌లో రాసుకోనివ్వాలి.
ఈ పనులు చేసేందుకు రాష్ట్ర పాలకులు నడుం బిగించాలి. ప్రజల భాషకు
ద్రోహం చేస్తే ప్రజలకే ద్రోహం చేసినట్లవుతుంది.
నూర్ బాషా రహంతుల్లా
(ఆంధ్రపత్రిక 15-7-90)

noorbasha said...

నలభై ఏళ్ళ నుండి సంస్కృతం, ఉర్దూ, ఇంగ్లీషు భాషల సమ్మెట దెబ్బలకు తెలుగు భాష
తునాతునకలైపోతూ నానాటికి తీసికట్టునాగం భట్టూ అన్నట్లు మనుగడ సాగిస్తూ ఉంది.
మరి మన ఆంగ్ల భాషాదాస్యం పోయి, తెలుగుకు సముచిత స్థానం రావాలంటే ప్రభుత్వం
ఈ క్రింది చర్యలు తీసుకోవాలి.
1. ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలల్ని నిషేధించాలి. ఇంగ్లీషు, హిందీ, మరే ఇతర భాషనైనా నేర్చుకోవటం వ్యక్తుల స్వేచ్ఛకు వదిలేయాలి. మన మాతృభాష అయిన
తెలుగును మాత్రం నిర్భంధంగా నేర్పాలి. డిగ్రీ స్థాయి వరకు ఎక్కడ ఇంగ్లీషు, హిందీ తగలగూడదు.
2. చందస్సుతో కూడిన తెలుగు వ్యాకరణాలను చెప్పి పిల్లల్ని భయపెట్టటం ఆపి, వాడుక భాషను, ఆధునిక సాంకేతిక పదజాలాన్ని విస్తారంగా నూరిపోయాలి.
భాషను సులభతరం చెయ్యాలి.
3. తెలుగులోనే రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు జరగాలి.
అధికార భాషగా తెలుగు అమలు కాకుండ అడ్డుబండలుగా ఉన్న గవర్నర్లు, ఐ.ఎ.ఎస్‌ల వ్యవస్థలో మార్పు తేవాలి. కేంద్రప్రభుత్వం కూడ మన రాష్ట్రంలోని తన కార్యాలయాలలో
తెలుగు వారినే నియమించాలి. హిందీతో సమానంగా తెలుగును గౌరవించాలి.
4. కోర్టు తీర్పులు, జీ.వో.లు తెలుగులో రావాలి. చిన్నద్వీపం నుండి వలసవచ్చిన తెల్లవాడు తన భాషకు మనల్ని దాసులుగా చేసి పోయాడు. మనం ఇతరుల మీద మనభాషను రుద్దలేకపోయినా, కనీసం మనలోనైనా మన భాషను పరిపుష్టం చేసుకోలేమా? ఇంగ్లీషో, హిందీనో నేర్చుకుంటేనే మనకు మనుగ అంటే ఇక తెలుగు వల్ల లాభం ఏమిట?
5. మన నాలుకలపై స్థిరపిన పరభాషా పదాలను మనవిగానే భావించి (బస్సు, సైకిలు. రైలు, పంపు.....లాంటివి) సమగ్రమైన తెలుగు-తెలుగు నిఘంటువులు
తరచుగా ముద్రిస్తూ ఉండలి. అన్ని చట్టాలూ తెలుగులో ముద్రించాలి. సర్వీస్‌ కమీషన్‌ తన శాఖా పరమైన పరీక్షలన్నీ తెలుగులోనే నిర్వహించాలి. ఇంటర్వూలన్నీ తెలుగులో ఉండలి.
6. ఇంగ్లీషు టైపు మిషన్లను కార్యాలయాల్లో నుంచి పూర్తిగా తీసివేసి, తెలుగు టైపు మిషన్లు, తెలుగు కంప్యూటర్లు మాత్రమే ఉంచాలి. తెలుగు లిపిని సంస్కరించాలి.
వత్తులు, గుణింతాల సంస్కరణ జరిపి, ఆంగ్లభాషకు దీటుగా టైపు చేయదగిన రీతిలో తెలుగును దిద్దాలి. ( ఉదాహరణకు, ఋ,ౌ, ో, ó లాంటి వాటిని ప్రజలు వదిలేశారు.) చాదస్తపు గ్రాంధిక భాష వాడకాన్ని మందగింపజేస్తుంది. అక్కరలకు
అనుగుణంగా, స్వేచ్ఛగా నర్తింపగల భాష. విస్తారంగా వ్యాపిస్తుంది.
ఒకరు చెప్పిన సంగతి మరొకరికి సరిగా అర్థమవుతున్నదా లేదా అని చూస్తే చాలు.ఇంకేంచేస్తే బాగుంటుంది?
1. ఇంటర్మీడియట్‌ వరకు తెలుగు మీడియంలో చదివిన వారికి ఇంజనీరింగ్‌, మెడిసిన్‌, బి.ఇడి. కోర్సుల్లో రిజర్వేషన్‌, ఉద్యోగాలలో రిజర్వేషన్‌ ఇవ్వాలి. కర్నాటకలో 5% రిజర్వేషన్‌ ఇస్తున్నారు.
2. తెలుగు మీడియంలో చదివిన వారికి ఉద్యోగ పోటీపరీక్షల్లో గతంలోలాగా 5% వెయిటేజి మార్కులు ఇవ్వాలి.
3. వృత్తివిద్యా కోర్సులన్నింటి సిలబస్‌ (ఇంజనీరింగ్‌, మెడికల్‌, లీగల్‌, బి.ఇడి తదితరా)లను తెలుగు అకాడమీ చేత పాఠ్యపుస్తకాలుగా తెలుగులో ముద్రింప చేయాలి.
4. తెలుగులో ఉత్తర ప్రత్యుత్తరాలు రాయగల ఐ.ఎ.యస్‌. ఐ.పి.యస్‌ అధికారుల్ని, గవర్నర్లును మాత్రమే మన రాష్ట్రంలో నియమించేలా కేంద్రాన్ని కోరాలి.
5. కూడిక, తీసివేత లాంటి తెలుగు పదాలకు బదులు సంకలనం, వ్యవకలనం లాంటి భయంకరమైన సంస్క ృత పదాలను వాడి తెలుగు మీడియం అంటే పిల్లలు భయపేలా చేశారు. పిల్లల పుస్తకాలు వాడుక తెలుగుతో చెయ్యాలి.
6. కేవలం తెలుగు మీడియంలో మాత్రమే చదివిన వాడికి ఇంగ్లీషురాక పోయినా ఎటువంటి శాస్త్ర సాంకేతిక రంగంలో నయినా ఉద్యోగం గ్యారంటీగా వస్తుందనే వాతావరణం కల్పించాలి. అంటే ఇంగ్లీషు రాకపోయినా కలెక్టర్‌, డక్టర్‌, ఇంజనీరు కాగలిగే విధంగా మన విద్యా వ్యవస్థ మారాలి! అప్పుడు జనం తండోపతండలుగా తెలుగులో చదువుతారు.
7. పరిపాలక గ్రంథాలు అంటే కోడ్లు, మాన్యువల్‌లు, లాంటివన్నీ తెలుగులో ప్రచురించి అన్ని కార్యాలయాలకు పంపాలి. సర్వీస్‌కమీషన్‌ పోటీ పరీక్షలు, శాఖాపరమైన పరీక్షలు తెలుగులో నిర్వహించాలి.
8. తెలుగు విశ్వవిద్యాలయం, అధికార భాషా సంఘం, తెలుగు అకాడమీ, అన్ని విశ్వవిద్యాలయాల్లోని తెలుగు విభాగాలు కలసికట్టుగా కృషిచేసి ఏయేటికాయేడు
అవి తెలుగు భాషాభివృద్ధి కోసం ఏంచేశాయో, ఏం సాధించాయో ప్రగతి నివేదికలను తెలుగు ప్రజలకు బయటపెట్టాలి. ఈ సంస్థలన్నీ ప్రజల నుండి సూచనలు తీసుకోవాలి.
9. లిపి సంస్కరణ యంత్రాలకనుగుణంగా జరగాలి. కంప్యూటర్‌లలో వాడకానికి ప్రస్తుతం తెలుగు సాఫ్ట్‌వేర్‌లో ఏయే సమస్యలు తలెత్తుతున్నాయో వాటిని నిశితంగా,పరిశీలించి నిరంతరం వాటిని బాగుచేసే నిపుణుల్ని నియమించాలి. పరిశోధకుల్ని ప్రోత్సహించాలి.'తెలుగుతల్లి' అని ఎంతో గౌరవంతో మన భాషను పిలుచుకుంటున్నాం. కన్న తల్లిలాగా మన భాషను గౌరవించాలనుకున్నాం కాబట్టి మన బాసకు తెలుగుతల్లి అనే పేరు పెట్టాం. తన తల్లి బాగోలేదని మరొకి తల్లిని గౌరవించేవాడిని ఏమనాలి? తన
తల్లిని పస్తులుంచి మరొకి తల్లికి భోజనం పెట్టే వాడిని ఏమనాలి? తన తల్లి రోగాలతో కృశిస్తుంటే మరొకి తల్లికి బలవర్ధక ఔషధాలను సమకూర్చే వాడిని ఏమనాలి? నీ
వంటికి బట్టలుకూడ పెట్టకుండ ఆంగ్లామ తల్లికి అలంకరణలు చేస్తూ ఉన్న నీతెలుగుబిడ్డల్ని ఏమనాలో నీవే చెప్పు తెలుగుతల్లీ! రాష్ట్ర అధికార బాషా, సంఘం ప్రస్తుత అధ్యక్షుడు ఏబికె ప్రసాద్‌గారు ప్రభుత్వానికి కొన్ని మంచి సిఫారుసులు చేసారు.
1) తెలుగు మీడియంలో చదివిన వారికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలి.
2) ప్రైవేటు, కార్పోరేట్‌ పాఠశాలల్లో కూడ అన్ని స్థాయిల్లో పదో తరగతి వరకు తెలుగు మీడియం ఉండలి.
3) వ్యాపార సంస్థలు, దుకాణాలన్నీ తెలుగులో
బోర్డులు ఏర్పాటు చేయకపోతే వాటి లైసెన్సులు రద్దు చేసే అధికారం కన్నడ అధికార భాషా సంఘానికి ఉన్నట్లుగా, తెలుగు అధికార భాషా సంఘానికి కూడ ఉండలి.
4)తమిళనాడులో తెలుగు మాట్లాే వాళ్ళు రెండవ స్థానంలో ఉన్నందున ఆ రాష్ట్రంలో తెలుగును రెండవ అధికార భాషగా ప్రకటించాలి.
5) రాజ్యాంగంతో సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలను
వాడుక బాషలోకి తేవాలి.
6) ఎనిమిదో షెడ్యూల్డ్‌లో పేర్కొన్న బాషలన్నిటినీ అప్పటికప్పుడు తర్జుమా చేసే విధంగా పార్లమెంటులో ఏర్పాటు చేయాలి.
7) స్థానిక న్యాయస్థానంలో తీర్పులు అధికార భాషలో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
8) మండల స్థాయి నుండి సచివాలయం వరకు అధికార భాషను అమలు చెయ్యని అధికారులపై చర్యలు తీసుకునే
అధికారం అధికార భాషా సంఘానికి ఇవ్వాలి.
వావిలాల గోపాలకృష్ణయ్య గారి దగ్గర నుండి ఏబికె ఎవరి కోరికలూ తీరలేదు.మనం ఎప్పుడూ బాధపడుతూ ఉండేకన్నా ఇకమీదట ఇలా నడుచుకోవటం మంచిదనుకుంటున్నాను:
1. పరువు నిలపాలి : ప్రతి వ్యక్తి మాతృభాషకు ఏదో ఒక స్థాయి పరువు ఉంటుంది. పరువు బాగా ఉంటే ప్రతిష్ట అదే వస్తుంది. భాష మాట్లాే జనానికి ముందు
ఆ భాష మీద గౌరవాభిమానాలు ఉంటే వాళ్ళు ఆ భాష పరువు నిలబెతారు. తమ భాష మీద తమకే చిన్నచూపు ఉంటే, తమ భాష కంటే పరాయి భాషే గొప్పదని వాళ్ళు
భావిస్తే, తమ భాష పరవు తీస్తారు, పరభాషా వ్యామోహులై తమ భాషను నాశనం చేసుకుంటారు. సొంత ఇంట్లోనే గౌరవం పొందలేని భాషకు పరువుపోతూ ఉంటుంది.
తెల్లవాడు ఇంగ్లీషు పరువు నిలపటానికి ఏమేం పనులు చేశాడో, తెలుగు వాడు కూడ ఆయా పనుల్ని చేయాలి.
2. ఆదరించాలి: సొంత భాషలో చదువు నేర్పాలి. ఇంటి భాషగాని ఎటువంటి యాస గాని నిఘంటువులో చేర్చాలి. చదువులో, పాలనలో పరిశోధనల్లో సొంత భాషను
బాగా వాడలి. ఇప్పుడు దేశంలో ఇంగ్లీషును ఆదరించినంతగా తెలుగును కూడ ఆదరించాలి. తెలుగు మీడియంలో చదివినా ఉద్యోగాలొస్తాయనే వాతావరణం కల్పించాలి.
3. పొలిమేర దాటాలి: ఇంగ్లీషు తన జన్మస్థానాన్ని దాటి ప్రపంచ వ్యాప్తం అయ్యింది. అరబీ తన స్వస్థలాన్ని దాటి ప్రపంచ వ్యాప్తం అయింది. ఇలా పొలిమేరలు
దాటి మిగతా ప్రాంతాలను ఆక్రమించిన భాషలే రాజ్యాలు ఏలుతున్నాయి. దేశమంతటా హిందీ రాజభాషగా అమలవుతూ పొలిమేరలు దాటింది. దేశంలో రెండవ జాతీయ అధికార భాషగా తెలుగు అమలుకావాలి. ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో తెలుగు నేర్పే వాళ్ళనుప్రోత్సహించాలి. ఇంగ్లీషు నేర్చుకోవటానికి ఎందుకు జనం ఎగబడుతున్నారో, అందుకే తెలుగు నేర్చుకోవటానికి కూడ జనం ఎగబడేలా చెయ్యాలి. ప్రపంచీకరణ ప్రక్రియ ద్వారా 15వ స్థానం నుండి 10వ స్థానానికి క్రమంగా ఎగబాకాలి.
4. పాలించే సత్తా తేవాలి: శాస్త్ర సాంకేతిక విద్యలు, చట్టాలు, శాసనాలు, కోర్టు తీర్పులు, ఇంగ్లీషులో ఎలా సునాయాసంగా సాగిపోతున్నాయో, అవన్నీ తెలుగులో కూడ అంత సులువుగా అమలు చేసే సత్తా తెలుగువాళ్ళకుందని నిరూపించుకోవాలి. తెలుగు సుతిమెత్తని భాషే కాదు తెలుగు వాడి జీవన రంగాలన్నింటిలో అలవోకగా అమలు
చేయగల భాష కావాలి. సంస్క ృత మంత్రానికి, ఇంగ్లీషు తీర్పుకు, అరబీ సూరాలకు ఎంతటి సత్తా ఉందో తెలుగులోని వాటికీ అంతటి సత్తా కావాలి.
5. ప్రజలకు అర్ధం కావాలి: పురోహితుల భాష, పండితుల భాష, పాలకుల భాష, ప్రత్యేకంగా ఉంటే, అది పామరులైన ప్రజలకు అర్ధం కాకుండ ఉంటే, వాళ్ళ ఆలోచనలు కలవవు. జాతి ఐక్యంగా పురోగమించదు. అధికారి రాసిన రాత పల్లెటూరిలో నివసించే నిరక్షరాస్యుడికి సయితం వినిపించినప్పుడు అర్ధమవుతూ ఉంటే ఆ పాలన
ప్రజారంజకంగా ఉందని అర్ధం. క్రమేణా ఆ ప్రజల భాషా సంపద పెరుగుతుంది. పరిపాలన పారదర్శకంగా ఉంటుంది. ప్రజలు తమ భాషలో విన్నపాలు చేసుకుంటారు.
తమ భాషలో నిలదీస్తారు. తమ భాషలోనే తీర్పులు తెచ్చుకుంటారు. ప్రజా జీవితంలోని అన్ని కార్యకలాపాలు తమ భాషలోనే స్వయంగా నిర్వహించుకుంటారు. అంతకంటే
అదృష్టం ఏముంటుంది?
కాకపోతే మొదటి నుంచీ చెప్పుకుంటున్నట్లే పైన చెప్పిన అయిదు పనులూ మనవాళ్ళు తెలుగు భాష కోసం చేయకుండ ఇంగ్లీషు కోసం చిత్తశుద్ధితో అమలు
చేస్తున్నారు. ఆంధ్రులు ఆంగ్లాన్ని ఆదరించారు. దాని పరువు పెంచారు. పొలిమేరలు దాటి ఆంగ్లాన్ని బ్రతుకు తెరువు చూపే భాషగా వాడుతున్నారు. ఆంగ్లంతోనే పాలిస్తున్నారు. అసలు ఆంగ్లంలో మాట్లాితేనే ఒకరికొకరు అర్ధం అవుతున్నారు. ఇక ప్రైవేటు స్కూళ్ళతో
పోటీపి ప్రభుత్వ స్కూళ్ళలో కూడ తెలుగు బాలలకు ఇంగ్లీషు ఉగ్గుపాలు పుతున్నారు. డబ్బురాని తెలుగు విద్య దారిద్య్రానికే అనే సంగతి బాగా గ్రహించారు. అందుకే ఆంధ్ర
ప్రదేశ్‌ ను ''ఆంగ్లప్రదేశ్‌'' గా మార్చే పని తలకెత్తుకున్నారు.
''కంచెయే నిజముగా చేసు మేసిన కాదనువారెవరు
రాజే ఇది శాసనమని పలికిన ప్రతిఘటించువారెవరు'''
(గీటురాయి 16-7-2004, 1-7-2005)

kroy said...

Noorbasha Gaaru,
Meeru vrAsinadi antha chadivaanu. neenu bhasha gurinchi ghtham lo konchum research chesanu. mee vyakyalalo konchum correction vundi anukuntunanu.... Thapugaa theesukokandi.

Telugu Bhashalo padaalu mukyamu ga mana purvikulu vaadina reandu bhashala nundi vachinavi..
okkati samskrutham, reandu palli.
Example word::
arrya (sanskrit), ayya (palli)
reanditi ardham okkate 'purvikudu / gauravniyudu'.
Ee reandu bhashalu telugu roopamlo eppudu manam vaaduthunam.. veetilo ea bhashani anna manadi kaadu anukunte... telugu bhashe leadu.
samskrutham mana meeda okkalu rudhindi kaadu, appati samskrutham/palli maarpulu cherpulatho eppati telugu. english vaadu Indians ni divide cheyataaniki raasina ‘dravida bhashalu/arya bhashalu’ concept neenu nammanu. aa division poorthiga ardha rahitham. aa books ban cheyyali... meelaanti pedalu malli research chesi books rayyali, ani aasisthu,
-Kishore

kroy said...

Noorbasha gaaru chepinatu.. telugu chaduvulu raavali.
school varuku telugu lo chadavatam thpanisari cheyali(need not to force urdhu/koya people). english lo chadiviche parents ki presnna:
mee pillalu maths, physics okka subject tho nerchukunetappudu. english okka sabject tho nerchukoleara? ani subjects lo english eanduku?

సుజాత said...

నూర్ భాషా గారు,కొన్ని సందేహాలున్నాయి.
మీకు ప్రతివ్యాఖ్య రాస్తాను, కొంచెం టైం కావాలి.

kroy గారు,
మీరు తెలుగులో రాయండి సార్,లేఖిని సహాయంతో! ఇలా రోమన్ లిపిలో రాస్తే, కళ్ళకు, మెదడుకు కూడా శ్రమ. మొత్తం విషయం అర్థమయ్యేటప్పటికి జవాబు రాసే ఓపిక ఉండట్లేదు. ప్లీజ్, అర్థం చేసుకొండి. మీ భావ ప్రకటన బాగుంది.

noorbasha said...

తెలుగు ప్రజల మాటల్లో ఎన్నో సంస్కృత, ఆంగ్ల, ఉర్దూ పార్శీ భాషల పదాలు దర్శనమిస్తుంటటాయి. ఈ అన్య దేశ్య పదాలను తెలుగు తనలో దాదాపు పూర్తిగా కలుపుకొని సుసంపన్నమయ్యింది. పరభాషా దురభిమానము,మొండితనములేని సరళమైన భాష తెలుగు. తెలుగువారి కున్నంత పరభాషా సహనం, ఈ దేశంలో మరెవరికీలేదంటే అతిశయోక్తి కాదేమో. ఈ సహనం వలనే అనేక పరభాషా పదాలు తెలుగులోకివచ్చి స్థిరపడి దాని స్వంతమే అన్నట్లయిపోయాయి. సంస్కృత, ఆంగ్ల పదాలు మన అనుదిన జీవితంలో ఎన్నోవాడుతున్నాము. అవి మనకు తెలిసినవే. అయితే మనం రోజూ మాట్లాడే తెలుగులో దొర్లే కొన్ని పదాలు ఉర్దూ పదాలని మనకు తెలియదు. తెలుగు ఇంగ్లీషు నిఘంటువులో సి.పి.బ్రౌన్‌ పేర్కొన్న ఈ క్రింది హిందూస్థానీ పదాలను గమనించండి:- అంగరకా, అంగరేకు, అంగిక, అంగీ, అంగుస్తాను, అంగూరు, అంరు, అండ, అందాజు, అందేషా, అంబారము, అంబారి, అకరం, అకస్వారీ, అకీకత్‌, అక్కసరి, అక్కసు, అక్షాయి, అగాదు, ఆగావు, అజా, అజమాయిషీ, ఆటకాయించు, ఆఠావణీబంట్రోతు, అఠ్వాడ, అడతి, అడితి, అడిసాటా, అతలషు, అత్తరు, అదాపరచు, అదాలతు, అదావత్‌, అనీం అపరంజి, అబ్వాబు, అభిని, అమలు, అమాంతము, అమాదినుసు, అమానతు, అమానీ, అమానుదస్తు, అమీనా, అమ్రాయి, అయబు, అయిటవేజు, అర్జీ, అర్జు, అలంగము, అలకీహిసాబు, అలగా, అలాదా, అలాహిదా, అలామతు కర్ర , అల్కీ, అల్జి, అల్మార, అలమారు, అల్లీసకర్ర, ఆవాజా,అవుతు, అవుతుఖానా, అవ్వల్‌, అవ్వాయిచువ్వలు, అసలు, అస్తరు, అహలెకారులు, అహషాంబంట్రోతులు. ఆఖరు, ఆజుబాజు, ఆజమాయిషీ, ఆబాదు, ఆబాలు, ఆబ్కారీ, ఆమిషము, ఆమీను, ఆరిందా, ఆలుగ్డ, ఆవర్జా, అసరా, ఆసామీ, ఆసాయము, ఆసోదా, ఇక్తియారు, ఇజారా, ఇజారు, ఇనాము, ఇరుసాలు, ఇర్సాలు ఇలాకా, ఇస్తిమిరారి, ఇస్తిరి, ఇస్తిహారు, ఉజాడ, ఉజయబోడ, ఉఠావుఠి ఉడయించు, ఉద్దారి, ఉపరిరయితు, ఉమేదు (ఉమేజు), ఉల్టా, ఏకరారు, ఓకు, కంకర, కంగాళీ, కంగోరీ, కచేరీ, కచ్చా, కజ్జా, కదపా, కదము, కదీము, కబాతుకోడి, కబాయీ, కబురు, కబేలా, కమాను, కమామిషు, కమ్మీచేయ, కరారు, కరుబూజుపండు, కలాలు ఖానా, కళాయి, కళాసి, కవాతు, కసరతు, కసాయి, కసుబా, కాగితము, కాజీ, కాతా, కామందు, కాయము, కాయిలా, కారాేనా, కాళీ, కాసా, కితాబు, కిఫాయతు, కిమ్మత్తు, కిరాయి, కిస్తీ, కిస్తు, కుంజడ, కుంజరి, కుందా, కుంబీ, కుడతా, కుడితినీ, కుమ్మకు, కురింజ, కురిచీ, కుల్లాయి, కుశాలు కుస్తీ, కుషీ, (ఖుషీ) కూజా, కూనీ (ఖూనీ) కేపు, కైదీ (ఖైదీ), కైఫియ్యతు, కైరి, కైలు, కొజ్జా, కొఠీ, కొత్వాలు, కొర్నా (కొర్నాసిగండు), కౌలు (కవులు) ఖజానా, ఖరాగా, ఖరారా (ఖరారు), ఖరీదు, ఖర్చు, ఖసిచేయు, ఖామందు, ఖాయము, ఖాయిదా, ఖాళీ (కాళీ), ఖాసా, ఖిల్లా, ఖుద్దున, ఖులాసా (కులసా) గప్చిప్పు, గప్పాలు, గమ్మత్తు, గయాళీ, గలబ, గల్లా, గల్లీ, గస్లీ, గాగరా, గాడు, గాబరా, గిరాకీ, గుంజాయిషీ, గుజరానీ, గుజరాయించు, గుజర, గుజిలి, గుజస్తీ, గుబారు, గుమాస్తా, గులాబి, గులాము, గైరు, గైరుహాజరు, గోడ, గోండు, గోరీ, గోలీ, గోషా, గోష్వారా, చలాకి, చలానా, చలామణీ చాందినీ, చాకిరీ, చాకు, చిరునామా, చెలామణి, చందా, చందుకా, చోపుదారు, చౌరాస్తా, ఛాపా, ఛావు, జంజీరు, జంపఖానా, జంబుఖానా, జనాభా, జనానా, జమాదారుడు, జరిమానా, జవాబు, జవాహిరి, జాగ, జాగీరు, జాటి, జారీ, జాస్తి, జిరాయితీ, జిల్లా, జిల్లేదారుడు, జెండ, జేబు, జేరుబందు, జట్టీ, జప్తీ, జమ, జమీను, జమీందారు, జముజాలి, జరబాజు, జరీ, జరూరు, జాబితా, జామీను, జుబ్బా, జుమలా, జుల్మానా, జోడ, జోడు, జోరు, టపా, టలాయించు, టటాకీ, రాణా, డలాయతు, డల్లీ, డవాలీ, డులా, డోలి, తండేలు, తకరారు, తగాదా, తనఖా, తనిఖీ, తప్సీలు, తబ్దీలు, తరందారీ, తరద్దూదు, తరహా, తరీఖు, తర్జుమా, తవాయి, తస్రపు (తసరబు), తహశ్శీలు, తాకీదు, తాజా, తారీఖు, తాలూకా, తాలూకు, తాళాబందు, తివాసీ, తీరువ, తీరువజాస్తి, తుపాను, తైనాతీ, తోపరా, దంగా, దగా, దగుల్బాజీ, దఫా, దబాయించు, దబేనా, దమదమా, దమ్మిడు, దరఖాస్తు, దరిమిలాసు, దరియాప్తు, దరుజు, దరోబస్తు, దర్జా, దర్జీ, దర్బారు, దలాలీ, దవుడు (దౌడు) దాణా, దామాషా, దారోగా, దాల్చిని, దాళా, దావా, దినుసు, దిమాకు, దిటవాణము, దివాలా, దివాలాకోరు, దుకాణము, దుప్పటి, దుబారా, దుబాసీ, దురాయీ, దుర్భిణి, దేవిడు, దౌలత్తు, ధూకళి, నంజ (నంజి), నకలు, నకషా, నకీబు, నక్కీ, సఖరా, నగదు, నగారా, నగీషీ, నజరానా, నఫరు, నఫరు జామీను, నఫా (సభా), నమూదు (నమోదు), నమూనా (నమోనా), నమ్మకు, నవరసు, నవారు, నవుకరీ (నౌకరీ), నవుకరు, నాగా, నాజరు, నాకు, నాడ, నాదూరు, నామోషి, నారింజ, నిఘా, నిరుకు, నిలీను, నిశాని, నిషా, నిషిందా, నిసబు, నెజా, నౌబత్తు, పంఖా, పంచాయితీ, పకాళి, పకోడి, పచారు, పజీతి, పటాకి, పట్కా, పట్టా, పట్టీ, పత్తాపరంజు,పరకాళా గుడ్డ, పరగణా, ఫర్మానా, పరవా, పరారీ, పలాన, పల్టీ, పసందు, పస్తాయించు, పాంజేబు, పాజీ, పాపాచి, పాపోసు, పాయకట్టు. పాయకారీ, పాయమాలీ, పాయిఖానా, పారా, పారీఖత్తు, పాలకి (పల్లకి) పావు, పావులా, పిచాడు, పిచ్చికారు, పితూరీ, ఫిరాయించు, ఫిర్యాదు, పీరు, పిరుసుడి, పుంజనేల, పుకారు, పులావు, పుసలాయించు, పూచీ, పూరా, పేరస్తు, పేషిగీ, పేష్కషు, పేష్కారు, పైజారు, పైమాయిషీ, పైలుమాను, ఫైసలా, పోరంబోకు, పోచాయించు, పోంచావణి, పోస్తకాయ, పళిలిజు, ఫకీరు, ఫక్తు, ఫయిసలా, ఫర్మానా, ఫలానా, ఫసలీ, షాయిదా, ఫిరాయించు, ఫిర్యాదు, బంగి (భంగి) బంజారి, బంజరు బందోబస్తు, బకాయి, బజంత్రీ (భజంత్రీ), బట్టువాసంచి, బట్వాడ, బడ, బడయి, బత్తీస, బత్తెము (భత్తెము). బనాతు (బణాతు), బసాయించు,బయాన, బర్తరపు, బరమా, బరాబరి, బరాబరిక, బస్తా బస్తీ, బహద్ధర్‌ (బహద్దూర్‌), బాకా, బాకీ, బాకూ, బాజా, బాజారు, బాజు, బాజుబందు,బాతాఖానీ, బాతు, బాదము, బాపతు, బారా, బాలీసు, బావుటా, బావుడోరు, బిచానా, బిడయించు, బినామీ, బిబ్చీ, బిల్మక్తా, బిసాతు, బస్తీ, బీమా, బుంగ, బురకా, బురుజు, బులాకీ, బూబు, బూర్నీసు, బేగి, బేజరూరు, బేజారు, బేపరాకు, బేబాకి, బేమరమ్మతు, బేరీజు, బేవారసు, బేషకు, బేషు (బేషు), బేసరి, బోణి, బోనాంపెట్టె, బోషాణం, బరవాసా, భర్తీ, బాట (బాట), భేటీ, భోగట్టా, మంరు, మండు, మకాము, మక్తా, మఖమలు, మగ్దూరు, మజిలీ, మజ్కారు, మజుబూతు, మజుమూను, మరి, మ్దరు, మజా, మజాకా, మతలబు, మతాబు, మతించు, మద్ధతు, మిన్నా. మన్న, మరమ్మతు, మర్తబు, మలాము (టమొలాము), టమొహమల్‌, మల్పూవు, మషాకత్తు, మషాలు, మషాల్జీ, మసాలా, మసీదు, మహజరు, మహస్సూలు, (మసూలు), మాజీ, మాపుచేయు, మామూలు, మారీఫత్తు, మాలీసు, మింజుమల, మిజాజు (మీజాదు), మిఠాయి, మినహా, మిరాసీ, ముక్తసరు, ముక్త్యారు, ముగ్దరు, ముచ్చివాడు, ముచ్చలికా, ముఠా, ముదరా, (ముజరా), ముద్దతు, ముద్దాయి, మునసబు, మునిషీ, ముభావము, మురబ్బా, ముల్కీ, ముసద్దీ, ముసనాబు, ముసల్మాను, ముస్తాబు, ముస్తీదు, మెహదా, మెహనతు. యకాయకి (ఎకాయెకి), యదాస్తు యునాని, రకము, రజా, రద్దు రప్పు, రయితు (రైతు), రవాణా, రవేసు (రవీసు), రస్తా, రస్తు, రహదారీ (రాదారి), రాజీనామా, రాయితీ, రివాజు, రుజువు, రుమాలు, రుసుము, రేవల్చిని, రొట్టె, రోజు, రోదా, లంగరు, లగాము, లగాయతు, లడయి, లడి, లమిడి (లమ్డి), లస్కరు, లాచారు, లాడము, లాయఖు, లాలు, లాలూచీ, లిఫాఫా, లుంగీ, లుగుసాను, లుచ్ఛా, లూటీ, లేవిడి, లోటా, లోటు, వకాలతు, వకీలు, వగైరా, వజా, వజీరు, వర్దీ, వసూలు, వస్తాదు, వహవ్వా, వాకబు, వాజివీ, వాపసు, వాయిదా, వారసుడు, వారీ, వారీనామా, విలియా, వేరియా, వేలము (వేలాము), వేలంపాట, శాబాసు (సెబాసు), శాయి, శాయిరు (సాయిరు), శాలువ, శకస్తు శికా, శిస్తు, విస్సాల, శెటమ్మె (సెటమ్మె), శేరు (సేరు), షరతు, షరా, షరాబు, షహా, షికారీ, షికారు, షుమారు, సంజాయిషీ, సందుగు, సకాలాతు, సక్తుచేయు, సగటు, సగతు, సగలాతు, సజావు, సజ్జనకోల, సదరు (సదరహీ), సన్‌వారు, సన్నదు, సన్నాయి, సన్నీ, సఫేదా, సబబు, నబరు, నబురు, సబ్జా, నబ్నివీను, సముద్దారుడు, సరంగు, సరంజామ, సరదా, సర్దారు, సరకు, సరేసు, సర్కారు, సలహా, సలాము, సలిగ, సవాలు, సాంబా, సాకీన్‌, సాబా, సాదరు, సాదర్వారీ, సాదా, సాపు (సాపు), సాబకు, హుకుం, సామాను, సాలస్త్రీ, సాలు, సాలాబాదుగా, సాలీనా, సాలు బస్సాలు, సాళవా,దాళవా, సాహెబు, సిద్దీ, సిపాయి, సిరా, సిబ్బంది, సిలువ, సిసలు, సిస్తు, సిస్సాల, సీదా, సీసా, సుకారి, సుక్కాను (చుక్కాని), సునామణి (సుణామణీ), సున్నతి, సుమారు, సురమా, సుల్తాను, సుసారము, సుస్తీ, సెల్లా, సోదా, హంగామి, హండ, హంసాయి, హకీకత్తు, హక్కసు, హక్కు, హజారము, (అజారము), హద్దు, హటమేషా, హయాము, హరామి, హర్కారా, హల్కా (అల్కి), హటవేలి, హాజరు, హమీతకావి, హాలు, హాలుసాలు, హశ్శీలు (హసీలు), హిజారు (ఇజారు), హుండు, హుకుము, హుజారు, హురుమంజి, హురుమత్తు, హాషారు (ఉషారు), హేజీబు, హైరానా (హైరాను), హోదా, హోదా (హవుదా), హవుసు, హవుసుకాడు, హసుతోట. వేలకొలదిగా ఉన్న ఈ హిందుస్తానీ మాటలు నిత్యవ్యవహరములో ఆంధ్ర భారతి శరీరములోని అంగములయినవి.ఆంధ్రనామ సంగ్రహము మొదలగు నిఘంటువులలో ఉర్దూ మాటలు తెలుగునకు పర్యాయపదాలుగా పూర్వులే చేర్చినారు. గిడుగువారు తెలుగులో మిళితమైపోయిన ఉర్దూ పదాలను పండితులు పుస్తకాల్లోంచి ఏరి పారవేయవచ్చు గాని జనం నోళ్ళలోంచి తీయలేరు అన్నారు.. తెలుగుపై ఉర్దూ పారశీకముల ప్రభావము అనే పుస్తకంలో గోపాల కృష్ణారావుగారు ఉరుదూ పారశీకములందు అరబీ భాష నుండి పెక్కు పదములు ప్రవేశించినవి. కనుక పరోక్షముగా అరబీ పదములు కూడ తెలుగులో చేరినవనుట నిశ్చయము అన్నారు.

kroy said...

Sujatha Gaaru,
:(
naaku writing raadu :(
I need spell checking tool.. Then only I can write. :-(
I Hope, one day Microsoft / Google will develop spell checker in Telugu. Telugu has very good syntax, so it will be very easy to develop telugu spell checker.

Noorbhasha Gaaru,
I don’t see telugu at all with out Sanskrit/palli / may be some Urdu..
Telugu is not Oam / God, Telugu has parents. I am always worried about lower class people, for lower class people ‘Telugu == knowledge, education etc.. ”
How much government / society go away from telugu, that much poor will lose knowledge/life.
Only Telugu can bring them out of poverty. All education should be provided in Telugu. Japanese don’t know English. Most of European countries don’t prefer English. Why should poor Telugu boy learn English?

Regards,
Kishore

ఎర్ర మార్తాండుడు said...

తెలుగు భాష గురించి తెలియని తెలుగు వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. తెలుగు ద్రవిడ భాష. ఆర్య భాషలతో పోలిస్తే తెలుగులో సంస్కృత పదాలు తక్కువ. కానీ నేను చిన్నప్పుడు తెలుగులో ఆంగ్ల పదాలు కలపకుండా మాట్లాడితే ఫ్రెండ్స్ నేను సంస్కృతంలో మాట్లాడుతున్నానని వెక్కిరించేవారు.

--మార్తాండ

kroy said...

@ మార్తాండ::
ఆర్య భాషా? అంటె? హిందీ న? బెంగాలిన?
వాటిలో సంస్కృత పదాలు ఎక్కువ?
మీరు ఎదో మిస్ అవుతునటు వున్నారు?
పారసీ బాష పదాలు హిందీలో చాలా ఎక్కువ (సంస్కృత పదముల కన్నా)
తెలుగు గురించి ::
౧. సంస్కృత శ్లోకాలను ఎదతదం తెలుగు లిపిలో వ్రాయవచ్చు , చదవనూ వచ్చు
౨. తెలుగు పదములు సంస్కృత (ఎక్కువగ, ౮౦ % దాక ) + పాళ్లి (మిగతా పదములు ౯౦ %) లకు చెందినవి.
ఫర్ మోర్ ఇన్ ఫోర్మషన్::
http://en.wikipedia.org/wiki/Telugu_language

తెల్లవాళ్ళు రాసిన పుస్తకాలు అసత్యాలు.
there are no such languages/people as array/Dravida.
It's all false.
నాకు అంత వ్యవధి లెదు...
that's all for now
-kroy

ISP Administrator said...

హిందీలో 40% వరకే పారశీ పదాలు ఉన్నాయి. అవి ఎక్కువేమి కాదు. హిందీ పై సంస్కృత ప్రభావమే ఎక్కువ.

kroy said...

40% అవివుండవచ్చు
తెలుగులో 80% సంస్కృత పదాలు.
my last message is as reply to మార్తాండ

ISP Administrator said...

తెలుగుకి సంస్కృతంతో అంత దగ్గరి పోలిక లేదు. చిన్నప్పుడు దూర్ దర్శన్ లో సంస్కృత వార్తలు వినేవాడ్ని. కనుక ఆ విషయం ఖచ్చితంగా చెప్పగలను.

kroy said...

Any language, you can’t understand by just listening to it. You need to talk/ practice it.

If you start doing it, you will realise how close Sanskrit is to Telugu (more then any language hindi,english, kannada whatever..)..

if you wont talk in telugu for next 10 years, you will forget that also..
example: some NRIs can't speak in Telugu.

Then what is the point in "saying sanscrit is not closer to telugu, with out parcticing it?" :)
Language is not just about words… it’s about “pronunciation, grammar, proverbs, poetry and much more…”
Cheers,
kroypatcha

Ashok8734 said...

నాకు నిజంగా తెలుగు బాష అంటే చాల అభిమానం నేను ముంబై లో ఉంటాను మన తెలుగు వాళ్ళని నమస్కారమండి అని అచ్చ తెలుగులో పలకరించిన వాళ్ళు మాత్రం అదొక అవమానం లాగ ముఖం పెట్టి గుడ్ మార్నింగ్ అని వెళ్ళిపోతారు ఎందుకో మాతృబాష అంటే అంత చులకన అనిపిస్తుంది గుండె తరుక్కుపోతుంది.

Post a Comment