November 24, 2008

ప్రమదావనంలో "అంకురిం"చిన సేవాభావం!

"ఎప్పుడూ బ్లాగుల గురించేనా? ప్రమదావనం సభ్యులుగా,స్నేహితులుగా  ఇంకేదైనా చేద్దామర్రా" అని ఆ మధ్య జ్యోతి గారన్నారు. ఏదో ఒక సహాయ కార్యక్రమం చేపడదాం అని సూచించారు. ఎవరికి సహాయం చేయాలని ఆలోచిస్తుండగా, నేను "అంకురం" పేరు సూచించాను. ఈ స్వచ్చంద సంస్థతో నాకు కొంచెం పరిచయం ఉండటం అందుక్కారణం. అంతా సరేనన్నారు. కొందరు ప్రమదావనం మహిళా బ్లాగర్లు తలా ఒక చేయి వేయగా కొంత డబ్బు సేకరించి అంకురం సంస్థకు పెద్ద ఎత్తున స్టేషనరీ కొన్నాము. ఇక్కడ అంకురం గురించి కొంచెం చెప్తాను.
ఒక్క మాటలో చెప్పాలంటే "ఆడపిల్లల అప్నా ఘర్..అంకురం"! స్త్రీలు, ఆడపిల్లల సంక్షేమం కోసం కృషి చేస్తున్న స్వచ్చంద సంస్థ! అనాధలు, ఇంటినుంచి పారిపోయిన వారు, అక్రమ రవాణాకు గురయ్యేవారు, లైంగిక హింసకు గురైన వారు,సెక్స్ వర్కర్ల పిల్లలు , తల్లి దండ్రులున్నా చదువుకునే స్థోమత లేని వారు..ఇలాంటి అడపిల్లలకు అంకురం ఆశ్రయమిచ్చి, వారికి విద్యా బుద్ధులు చెప్పించి వారి భవిష్యత్తుని తీర్చి దిద్దుతుంది. ప్రస్తుతం కీసర మండలం భోగారం లో ఉన్న "సంకల్పం" హోం లో 6 నుంచి 18 సంవత్సరాల వయసు గల దాదాపు వంద మంది ఆడపిల్లలకు ఆశ్రయం కల్పిస్తోంది అంకురం!
అంతే కాక, అంకురం 20 మురికివాడల్లోని ఆడపిల్లలకోసం "అంకురం లైఫ్ స్కిల్స్ సెంటర్" ని నడుపుతూ వివిధ చేతివృత్తుల్లో వారికి ఉచిత శిక్షణ ఇస్తోంది. పిల్లలపై జరిగే లైంగిక వేధింపుల గురించి ఈ సంస్థ waves foundation తో కల్సి పని చేస్తుంది. మహిళలకు న్యాయ సహాయం, బాల కార్మికుల నిర్మూలన, స్త్రీల కోసం ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం ఇలాంటివి అంకురం కార్యకలాపాల్లో కొన్ని.
అంకురం హోం కెళ్ళినపుడు చిరునవ్వుల్తో ఎదురొచ్చే ఆడ పిల్లల మొహాలు చూస్తే ఒక పక్క ఆవేదన, మరో పక్క ఆలోచన, ఇంకో పక్క వారి ధైర్యానికి సంతోషం ముప్పిరిగొంటాయి. కింద ఫొటోలో ప్రసంగిస్తున్న వారు డైరెక్టర్ శ్రీమతి సుమిత్ర


అంకురం గురించి మరింత తెలుసుకోవాలనుకున్న వారు వారి వెబ్సైట్ www.ankuram.org.in లో చూడొచ్చు.అయితే ప్రస్తుతం వెబ్సైటు సాంకేతిక కారణాల వల్ల దర్శించలేకపోతున్నాం. వచ్చే వారం నుంచి కనిపిస్తుందట. ankuram@yahoo.com కు మెయిల్ చేయవచ్చు.  అంకురం డైరెక్టర్ శ్రీమతి సుమిత్ర పిల్లల్ని ఎంతో ప్రోత్సహిస్తారు. సంకల్ప హోం పిల్లలు తమ రచనలతో "బాలవాక్కు" అనే త్రైమాసిక పత్రికను కూడా నడుపుతున్నారు.అక్కడి పిల్లలకు కావలసిన స్టేషనరీ కొని, ప్రమదావనం మహిళా బ్లాగర్లు అంకురం కార్యాలయానికి వెళ్ళి అందజేయడం జరిగింది.హోం చాలా దూరంగా ఉండటం వల్ల, అందరు బ్లాగర్లూ అందుబాటులోలేకపోవడం వల్ల అక్కడికి వెళ్ళే కార్యక్రమం మరో సారికి వాయిదా వేశాము.

ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న మహిళా బ్లాగర్లకు ప్రమదావనం కృతజ్ఞతలు.53 comments:

te.thulika said...

బాగుంది సుజాతా. ఫొటోలు చూస్తూంటే గుంటురు దగ్గర మంగాదేవి గారి బాల కుటీర్ గుర్తొచ్చింది. థాంక్స్

sujata said...

Thanks for what you did Sujatha. This idea is really wonderful and I hope we can go strength to strength in doing many more 'good things' in life.

Congrats to Pramadavanam.

నల్లమోతు శ్రీధర్ said...

మహిళా బ్లాగర్లు కలిసి ఇలాంటి మంచి ప్రయత్నం చేసినందుకు అభినందనలు.

రమణి said...

సుజాత గారు: శుభాకాంక్షలు అందరికీ స్ఫూర్తిదాయకం అయ్యారు.

krishna rao jallipalli said...

Ankuram-Sangamam-Poram
Plot No: 142 & 143
AP Text Book Colony
Transport Road, Karkhana
Secunderabad - 500 009
Andhra Pradesh, India

Phone: +91 40 27894574
Fax : +91 40 27894573
Email: info@ankuram.com

మీ కృషి అభినందనీయం.
మీరు ఇచ్చిన లింక్ తప్పు. www.anukuram.com. correct కదూ??
పైన ఇచ్చిన contact address కరెక్టేనా??

సుజాత said...

కృష్ణా రావు గారు,
మీరు చెప్పిన అడ్రసులో నేను చెప్పిన అంకురం లేదు. మీరు చెప్పే అంకురం వేరు! ఈ హోం ఆఫీసు తారనాక లో ఉంది. సంకల్ప హోం భోగారం విలేజ్ లో ఉందండి!ఫోన్ నంబర్లు..040-27017446/7 వాళ్ళ వెబ్సైట్ update చేస్తున్నామని, కొద్ది రోజులు చూడడం కష్టమని ఇప్పుడే వాళ్ళకు ఫోన్ చేస్తే చెప్పారు. నేను ఇచ్చిన ఫోన్ నంబర్లలో కాంటాక్ట్ చేయవచ్చు.

సుజాత said...

రమణి,
ఇది మనం సమిష్టిగా చేసిన పని! నేనొక్క దాన్నీ స్ఫూర్తి దాయకం ఎలా అవుతానండి బాబూ!

durgeswara said...

సేవాభావము సాగుతున్న మీలో భగవంతునిదయవలన ఈ నిర్వాహణా శక్తిని మరింత తేజరిల్లాలని ప్రార్ధిస్తున్నాను.

కత్తి మహేష్ కుమార్ said...

చాలా స్ఫూర్తిదాయకమైన పని. మంచి ప్రారంభం. ఇలాగే కొనసాగాలని మనసారా కోరుకుంటూ. అభినందనలు.

ravigaru said...

pramadavanam lo yekkuva pattu chiralagurinchi ,padatulu andamga kani pinchadaniki chitkalu vanti yedo uppara meeting anna durabhiprayanni duram chestu,yevaro okaru yepudo apudu antu mundadugu vesina nari janam twaralo srustinchali oka prabhanjanam ani asistu.

అబ్రకదబ్ర said...

Great job. Congratulations. Keep the good work going :-)

శివ - teluguratna.com said...

అభినందనలు.

బాబు said...

చాలా మంచి పని చేసారు. అభినందనలు.ఇలాంటి కార్యకలాపాలు మరెన్నో చేయగలరని ఆశిస్తున్నాను.

@te.thulika

గుంటూరు శ్యామలనగర్ లోని మంగాదేవి గారి స్కూలు గురించి విన్నాను.బెత్తం లేని స్కూలు!

మధు said...

ప్రమదావనం బ్యాచ్ అందరికీ అభినందనలు !!!

chaduvari said...

రాతల్లోనే కాదు, చేతల్లోనూ చూపించారు, ఈ మంచిపనిలో పాల్గొన్న వారందరికీ నా అభినందనలు.

సత్యప్రసాద్ అరిపిరాల said...

మహిళా బ్లాగర్ల ప్రయత్నం స్పూర్తిదాయకం.

కృష్ణారావుగారు,
మీరు చెప్పిన అంకురం సంగమం పోరం, దళిత స్త్రీలతో పనిచేస్తుంది. (ముఖ్యంగా సూక్ష్మ రుణాలు).

వెతకాలేగాని ఇలాంటి సంస్థలు ఎన్నో వున్నాయి. సేవాభావం వుండాలి.. అడుగు ముందుకు వెయ్యాలి.. అంతే
వీలుంటే ఈ లింకు చూడండి...

http://givefoundation.org

teresa said...

ఈ మొదటడుగు మరో పది అడుగులేసి ముందుకు సాగాలని,మరో పది చేతులు కలవాలనీ ఆశిస్తూ... అభినందనలు.

cbrao said...

"అక్కడి పిల్లలకు కావలసిన స్టేషనరీ కొని, ప్రమదావనం మహిళా బ్లాగర్లు అంకురం కార్యాలయానికి వెళ్ళి అందజేయడం జరిగింది."

ఆ కింది లైన్లో

"హోం చాలా దూరంగా ఉండటం వల్ల, అందరు బ్లాగర్లూ అందుబాటులోలేకపోవడం వల్ల అక్కడికి వెళ్ళే కార్యక్రమం మరో సారికి వాయిదా వేశాము."

ఈ పరస్పర విరుద్ధమైన వ్యాక్యాలు అంతుపట్టడం లేదు.
వెళ్లారా లేదా? ఎవరు వెళ్లారు?
వెళ్లక పోయినా, మహిళా బ్లాగరుల ఈ సేవాదృక్పథం కొనియాడ తగినది. అభినందనలు.

కొత్త పాళీ said...

చాలా సంతోషం! మాటల వాళ్ళమే కాదు చేతల్లో కూడా సత్టా ఉందని చూపించారు. ప్రమదావన ప్రమిదలందరికీ అభినందనలు.

వేణూ శ్రీకాంత్ said...

Very Good initiative... kudos to ప్రమదావనం

సుజాత said...

సిబిరావు గారు,
అంకురం వారి హోం సంకల్ప కీసర మండలం లో భోగారం గ్రామంలో ఉంది. ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చిన హైదరాబాదు బ్లాగర్లు అందరం ఉంటే తప్పక వెళదామని అనుకున్నాం. కానీ వివిధ కారణాల వల్ల కొద్ది మంది మాత్రమే కలవగలిగాము.(వీకెండ్ కావడంతో నాక్కూడా కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి) మరో సారి అందరం కలిసి హోం కి వెళ్ళి పిల్లలని కలవాలని నిశ్చయించుకుని కేవలం ఆఫీస్ కి వెళ్ళి అవి అందజేశాం.

సుజాత said...

మాలతి గారు, మంగా దేవి గారి స్కూలు గురించి ఒక టపా రాయాలని ఉంది కానీ ఎప్పుడు అక్క దగ్గరికెళ్ళినా మరుద్వతి గారే ఉంటారు తప్పించి మంగాదేవి గారు ఉండటం లేదు. ఈ సారి వెళ్ళి ఆ నందన వనం గురించి తప్పక రాస్తాను.

బాబు గారు,
మంగాదేవి గారి స్కూలు గుంటూరు శ్యామలా నగర్ లోనే కాక, చిలకలూరి పేట(గుంటూరు నుంచి) రోడ్లో ఉన్న చౌడవరం అనే ఊర్లో కూడా రెసిడెన్షియల్ స్కూలుగా ఉంది. 50 ఎకరాల స్థలంలో! అక్కడ "అంకిత" అనే అనాధ శరణాలయం, సంధ్యా తీరం అనే వృద్ధాశ్రమం, చేతన అనే స్త్రీ చైతన్య సంస్థ...school on wheels అనే మొబైల్ స్కూలు మొదలైనవి కూడా ఉన్నాయి. చాలా బాగుంటుంది.

చైతన్య said...

ఈ మంచిపనిలో పాల్గొన్న వారందరికీ నా అభినందనలు.

టి. శ్రీవల్లీ రాధిక said...

సుజాత గారూ!
కౌముదిలో "...సోషల్ సర్వీస్ కూడా చేస్తుంటారు" అని మీ పరిచయం లో చదివి, వివరాలు అడుగుదామనుకున్నాను. ఈ లోపు మీరే టపా వ్రాసేశారు. బాగుంది. అభినందనలు.

భాస్కర రామి రెడ్డి said...

Congratulations on initiating wonderful work as a group. You are becoming something of a legend around here

kumar said...

సుజాత గారు,
మీ టపాల్ని ఆసక్తిగా చదివే వాళ్ళల్లో నేనూ ఒకణ్ణి.
ఇక ముందు ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా చేపడితే నాక్కూడా ఓ ముక్క చెవిన పడెస్తే, అన్ని సార్లూ కాక పోయినా, కొన్ని సార్లయినా, నా వంతు రుణం నేనూ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తా. హెల్ప్ చేస్తారని ఆశిస్తూ..

ఎన్ కె యు ఎం ఎ ఎ ఆర్ టి ఇ ఎల్ ఎట్ జీమెయిల్

థాంక్యూ..

netizen నెటిజన్ said...

@ మంగాదేవి గారి ఇంటి ఫోను నెంబరు: ౨౨౩౬౦౪౧.

శ్రీనివాస్ పప్పు said...

శుభసంకల్పం..నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటున్నాను..
మాక్కూడా ఏమన్నా అవకాశం ఉంటే చెప్పండి..అజ్ఞాతంగా సాయం చేస్తాము..(ప్రమదావనం అంటున్నారు కదా..)

satya said...

సుజాత గారు, అభినందనలు. చాలామంది అనుకుంటూ వుంటారు కాని మొదలు పెట్టరు. You have taken Great Initivative towards that.
అందర్ని కలుపుకుపోండి.. ఇక్కడ కూడా Gender Descrimination యేనా? :)

Keep up the Good Work

"Hands that help are holier than those lips that pray"

మధుర వాణి said...

సుజాత గారు..
క్షమించండీ ఈ ప్రశ్న అడుగుతున్నందుకు. నేను బ్లాగ్గింగ్ కి కొత్త అవ్వడం వల్ల ఎక్కువ విషయాలు తెలియవు నాకు. ప్రమదావనం అని మహిళా బ్లాగ్గర్ల గుంపు అన్నారు. దాని గురించి నాకు తెలియదు. అందులో నేను కూడా చేరవచ్చా..? నేను ప్రస్తుతానికి ఇండియాలో లేకపోయినా సాధ్యమైనంతవరకు మీరు చేసే మంచి పనుల్లో భాగాస్వామినయ్యే అవకాశం ఉందా..? తెలుపగలరు.
కృతజ్ఞతలు..!

సిరిసిరిమువ్వ said...

చప్పట్లు! మొదటి అడుగు విజయవంతంగా వేసినందుకు మనకు మనమే చప్పట్లు కొట్టుకుందాం.

నిషిగంధ said...

ప్రమదలందరికీ అభినందనలు.. ఆశయం, సహాయం అందరిదైనా ఇంకాస్త ఎక్కువ శ్రమ తీసుకున్న స్నేహితురాళ్ళకు హృదయపూర్వక కృతజ్ఞతలు! ఫోటోలు తీయడానికి కుదురుతుందో లేదో అనుకున్నాను.. ఆ కోరిక కూడా తీర్చినందుకు ధన్యవాదాలు :-)

సుజాత said...

కుమార్ గారు, శ్రీనివాస్ పప్పు గారు,
చాలా సంతోషం! మరిన్ని సేవా కర్యక్రమాలు చేయాలనే అనుకుంటోంది ప్రమదావనం. తర్వాతి కార్యక్రమం వివరాలు మీ చెవిన తప్పక వేస్తాము. థాంక్యూ!

నెటిజెన్ గారు
థాంక్యూ! ఫోన్ నుంబర్ తాలూకు అచ్చతెలుగు అంకెలు అర్థం కావడం లేదు. మా సిస్టర్ బాలకుటీర్ లోనే టీచర్ గా పని చేస్తారు. మంగాదేవి గారితో నాకూ స్వల్ప(అక్క ద్వారా) పరిచయం ఉంది. తీరిగ్గా వెళ్ళడం కుదరడం లేదు..అదే సమస్య!

మధుర వాణి గారు,
మహిళా బ్లాగర్లందరి కోసం ఈ ప్రమదావనం! మీరూ చేరాలంటే మన జ్యోతి గారికొక్క మెయిల్ కొట్టండి. మీరు ఈ గుంపులో చేరొచ్చు. మంచి పనులు చేయడానికి ఆసక్తి ఉన్నవారెవరైనా స్త్రీ పురుష తేడాలు లేకుండా పాలు పంచుకోవచ్చు ఈ కార్యక్రమాల్లో!

jyothivalaboju@gmail.com జ్యోతి గారి మెయిలైడీ!

సుజాత said...

వరూధిని గారు,
చప్పట్లు గట్టిగానే వినపడుతున్నాయి అందరి దగ్గర్నుంచీ! ("శ్రమ"కు తగ్గ ఫలితం అనుకుందామా)

నిషిగంధ,
మీకు స్పెషల్ థాంక్స్! ఎందుకో మీకు తెలుసు! కొంచెం టైం కేటాయించడానికి వీలైంది కాబట్టి మేము వెళ్లాము, అంతే! అంకురం సభ్యులు స్టేషనరీ అందుకుంటున్న ఫొటో ఒక్కటే అక్కడ మొబైల్ లో తీశాను. మిగిలినవి వాళ్ళ తాలూకు బ్రోచర్లనుంచి స్కాన్ చేసాను. కెమెరా పట్టుకెళ్ళాలని అయిడియా రాలేదు. ఈ సారి హోం కి వెళ్ళినపుడు తప్పక తీసుకెళ్ళాలి.

సుజాత said...

అభినందించిన బ్లాగ్మిత్రులందరికీ ధన్యవాదాలు! టపా నేను రాశాను గానీ ఇది ప్రమదావనం సభ్యుల సమిష్టి కృషి !

Samanyudu said...

Congratulations to one and all. I could see several appreciations and eagerness, rather enthusiasm to participate in such future activities. Good luck to all and i would also be very thankful if given an opportunity to do little bit of mine.

ooops ...sorry, u must be thinking who is this stranger ... చెప్పుకోవడానికి పెద్దగా ఎమీ లేని 'సామాన్యుడు ' నేను. ఎవరో చెప్పినట్లు 'ఆకలేసిన వాళ్ళకి అన్నం పెట్టడం కన్నా, దాన్ని సంపాదించడం నేర్పడం అవసరం అని '. అంత relevant కాకపోయినా, though the stationery and others you gave them are of great help, it may help better if you all educated and people with quality thoughts spend some valuable time with them. I wish this can be an agenda when you visit their home next time. I think your knowledge, experience, exposure etc might help them learn / inspire. Thanks - సామాన్యుడు

krishna rao jallipalli said...

thanks a lot for clarification sujata gaaru.

సుజాత said...

సామాన్యుడు గారు,
ధన్యవాదాలు! అభినందించడం కూడా ఒక రకంగా సహాయమే అనిపిస్తోందండి! ఇకపై మరిన్ని సహాయ కార్యక్రమాలు చేయగలమనే విశ్వాసం పెరిగింది.

మీలాగే ప్రమదావనం కు సహాయం అందించడానికి ముందుకొచ్చిన వారు మరి కొందరున్నారు వ్యాఖ్యాతల్లో, చూడండి, కుమార్ , శ్రీనివాస్, సత్య, మధురవాణి గార్లు. మరికొంతమంది నన్ను ఈ మెయిల్లో కాంటాక్ట్ చేసారు తామూ ఓ చెయ్యి వేస్తామని.

అంకురం పిల్లలకు మంచి పుస్తకాలు కొనివ్వాలని కూడా ఉంది నాకైతే!

ఎవరైనా ఇందులో పాలు పంచుకోవచ్చు! ఇతర వివరాల కోసం నాకు మెయిల్ చేయవచ్చు...gulabi98@gmail.com నా చిరునామా!

సామాన్యులందరూ కలిస్తేనే కదండీ, అసాధారణ ఫలితాలు సాధించగలం? ధన్యవాదాలు.

Samanyudu said...

Thanks for the positive response Sujatha garu.

నేను సూచించిన 'interactive session' గురించి కూడా అలొచించండి. ఏదైనా మంచి topic తీసుకుని కొంచెం పెద్ద పిల్లలతో open discussion పెట్టుకుంటె, అది వాళ్ళలొ 'confidence & better thought process' ని ఇంప్రొవె చెస్తుందేమో అని నా అలోచన. Thank you all again. - సామాన్యుడు

సుజాత said...

కుమార్ గారు,
మీ ఈ మెయిల్ కి పంపిన మెయిల్ తిరిగొచ్చిన నా మెయిల్ బాక్స్ లోనే పడింది. స్పెల్లింగ్ తప్పుందా? కరెక్ట్ అడ్రస్ ఇవ్వగలరు లేదా నాకు gulabi98@gmail.com కి మెయిల్ చేయగలరు. ధన్యవాదాలు.

వేణూ శ్రీకాంత్ said...

లేఖిని లో "మ్" కోసమ్ ma^ అని టైప్ చేసి చూడండి వస్తుంది.

జ్యోతి said...

ప్రమదావనం తరఫున మొదలు పెట్టిన ఈ చిరు ప్రయత్నం విజయవంతమైనందుకు సంతోషంగా ఉంది. మిత్రుల స్పందన, ప్రోత్సాహానికి ధన్యవాదాలు. ఈ "సహాయ" కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనవచ్చు. తదుపరి కార్యక్రమము గురించి త్వరలో వివరంగా టపా రాస్తాను.

krishna rao jallipalli said...

సుజాత గారు, మీరు ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేసి సుమిత్ర గారితో మాట్లాడి వివరాలు తీసుకొని నా శక్తి మేరా ఈ రోజు ఒక చిన్ని చెక్కు పంపాను. నేను ఫోన్ చేసినందుకు సుమిత్ర గారు చాలా సంతోషించారు. చాలా మంది ముందుకి వచ్చారని చెప్పారు. ఆ క్రెడిట్ అంతా మీదే అని కూడా చెప్పారు.

బొల్లోజు బాబా said...

అభినందనలు. మంచి ప్రయత్నం.

గీతాచార్య said...

Good act. This ais also an excellent form of charity. see this link. You may make it a must do act everytime you open the net.

See the link. freerice.com

If you are going to do the same as described here kindly inform me. I will give some to the children, who are about to give the society in future.

సుజాత said...

కృష్ణా రావు గారు,
చాలా సంతోషంగా ఉందండి! మీరు ఇంత త్వరగా స్పందించి వారికి సహాయం చేసినందుకు! మీకు మరీ మరీ ధన్యవాదాలు! సహాయం చేయాలనే మనసు ఉండడం ముఖ్యం గానీ, ఎంత ఎలా సహాయం చేశామన్నది కాదు. చాలా సంతోషం!

సుజాత said...

geetaacharya,
we will inform you when we take our next step towards another service. thanks.

neelaanchala said...

congratulations to all the ladies

అరుణాంక్ said...

చాలా మంచి పని చేసారు .మీ అందరిని అభినందిస్తున్నాను.
నేనూ సహాయంచేయాలనుకుంటున్నాను.

సుజాత said...

అరుణాంక్ గారు,
ధన్యవాదాలు. మీరు నన్ను ఒకసారి జీమెయిలు లో gulabi98@gmail పైన కాంటాక్ట్ చేయగలరు. థాంక్స్

ప్రియ said...

A very nice act by you all. I missed the chance? ;-)

It is nice to see that the bloggers, especially Telugu bloggers are doing such nice things, apart from writing. Thank you on behalf of the children benefited.

గీతాచార్య గారు,

Yes. freerice.com is an excellent site, not only to play, but also to help.

Srujana said...

బాగుందండీ మీరు చేసిన పని. మనకున్నంతలో మాత్రం సాయం చేయాల్సిందే. అంకురం గురించి నేనూ విన్నాను.

నాదో చిన్న ప్రశ్న. అసలు ప్రమదావనం అంటే ఏమిటి? అందులో నేనూ చేరవచ్చా? ఈ మధ్యన పనిలో పడిపోయి ఆడవాళ్ళం మనం మాతాడుకునే సంగతులే మర్చిపోయాను. :-)

మీరెప్పుడైనా ఇలాంటి పని (సేవా కార్యక్రమం) చేస్తుంటే నాకూ తెలపగలరు.

సృజన.

సుజాత said...

సృజన గారు, థాంక్యూ! మహిళా బ్లాగర్ల సమూహమే ప్రమదావనం. మీరు కూడా నిరభ్యంతరంగా ఇందులో చేరవచ్చు. కొన్ని సరదా కబుర్లతో పాటు పనికొచ్చే పనులు కూడా ఉంటాయి. ప్రమదావనం పేరుతో ఒక గూగుల్ గ్రూప్ ఉంది. మీరు jyothivalaboju@gmail.com కి మెయిల్ పంపితే జ్యోతి మిమ్మల్ని ఈ గ్రూపులో కలుపుతారు. మీరు మంచిపనుల్లో పాలు పంచుకోవాలనుకోవడం సంతోషం! తర్వాతి ప్రోగ్రాం లో మీరు కూడా కలవొచ్చు!

Post a Comment