July 10, 2009

సానియా నిశ్చితార్థానికి మీడియా హడావుడి !

ఈ రోజు పొద్దుటినుంచీ పొరపాటున టీవీ పెట్టామా, ఒకటే గోల! ఈ రోజు సానియా మీర్జా  నిశ్చితార్థం కాబట్టి తాజ్ కృష్ణ దగ్గర ఏం జరుగుతోందో తెలుసుకోవాలని మీడియా  వాళ్లంతా అక్కడ పడిగాపులు కాస్తూ ఎప్పటికప్పుడు అప్ డేట్ సమచారాన్ని, చూస్తున్నారో కూడా తెలుసుకోకుండా ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఒక పక్క ఇంకా ఆ పార్టీ జరుగుతూ ఉండగానే చిరాకుతో ఈ టపా రాస్తున్నాను."కరాచీ బేకరీలో కేకులు మాయం"

"షాపుల్లో నగలకు , బట్టలకు షార్టేజ్"

"పెళ్ళి కళ వచ్చేసిందే బాలా" ఇలాంటి చీప్ టైటిల్స్ పెట్టి ఇవాళ పొద్దుటినుంచీ ఊదరగొట్టేస్తున్నాయి అన్ని ఛానెల్సూ!సాయంత్రానికి ఈ పైత్యం మరింత ప్రకోపించింది. మీడియాకు ప్రవేశం లేదని, ఇది ప్రైవేట్ వ్యవహారమని కుటుంబ సభ్యులు మొత్తుకున్నా, ఎవరెవరు వస్తున్నారో తెలుసుకుని ఆ "ఫీల్ గుడ్" ఇన్ ఫర్మేషన్ ప్రేక్షకులకు అందించాలని వీళ్ళ తపన! సానియా, సోహ్రబ్ బట్టలు తెచ్చిన కార్లమీదకు ఎగబడి మొత్తానికి వాటిని దాచిన బాక్సులను కెమెరాలతో పట్టుకోగలిగారు.ఏదో పేలుళ్ళ సంఘటన జరిగినట్లు, జాతీయ విపత్తు సంభవించినట్లు స్టూడియోలో ఉన్న న్యూస్ రీడర్లు
"అక్కడి తాజా పరిస్థితి ఏమిటి?"

అని ప్రతి ఐదు నిమిషాలకూ అడిగి తెలుసుకోవడం చూస్తుంటే నవ్వాలో ఏడవాలో తెలీడంలా!
"వంటలేం చేశారు? ఎన్ని ఐటం లు ఉన్నాయి మెనూలో? ఏ యే రంగుల్లో సానియా బట్టలు డిజైన్ చేశారు? ఆ బట్టలు కనిపించాయా?ఇంతకీ పెళ్ళికి ముహూర్తం ఎప్పుడు పెట్టుకుంటున్నారు? "ఇలాంటి చొప్పదంటు అనుబంధ ప్రశ్నలు!ఇది కాక సానియాకు మనం అభినందనలు తెల్పాలంటే మెసేజ్ కి ఆరేసి రూపాయలు వదిలించుకుని ఎస్సెమ్మెస్ పంపే అద్భుత అవకాశం మనకి సొంతం!సానియా "గొప్ప క్రీడాకారిణి"  అయితే కావొచ్చు! ఆమె వివాహ నిశ్చితార్థం "వార్త" అయితే కావొచ్చు!మీడియాకి లోపలికి ప్రవేశం లేదని తెలిసీ, హోటల్ బయట పడిగాపులు కాస్తూ లోపల జరిగే తంతు ను ఊహిస్తూ, బయటి హడావుడిని ప్రేక్షకులకు ప్రతి నిమిషం ఎన్నికల ఫలితాల కంటే అన్యాయంగా అందించాలన్న అత్యుత్సాహం, కుప్పలు తెప్పలుగా పుట్టిన మీడియా ఛానెళ్ల మధ్య నెలకొన్న పోటీకి నిదర్శనంగా మిగిలింది ఇవాళ!విషాదం ఏమిటంటే రెండు గంటల క్రితం కూకట్ పల్లి JNTU వద్ద బ్రేకు ఫెయిలైన లారీ పలు కార్లను ఢీ కొట్టి (ఇప్పటివరకూ)ఇద్దరి ప్రాణాలను అక్కడికక్కడే హరించి, మరి ఐదుగురి జీవితాలను ప్రాణాపాయ స్థితిలోకి విసిరి కొట్టిన హృదయ విదారక సంఘటన సానియా నిశ్చితార్థ హడావుడిలో కొట్టుకుపోయి చాలా సేపు కేవలం స్క్రోలింగ్ కి మాత్రమే పరిమితం కావడం! ఇప్పటికీ స్పష్టంగా అక్కడ ఏం జరిగిందో తెలీదు కానీ సానియా డ్రెస్సులు మాత్రం పింక్, బ్లూ, మరియు క్రీమ్ కలర్స్ లో ఉన్నాయని మాత్రం తాజా సమాచారం.

అదండీ సంగతి!

33 comments:

Harish said...

ఊపెకుహ

Bhardwaj Velamakanni said...

You called those Media guys DOGS!!!

How dare you insult the DOGS like this?

I think you have to apologize to the dogs

శరత్ 'కాలమ్' said...

అక్కడి తాజా పరిస్థితి ఏమిటి?

sriramaditya said...

sujahta garu....
naaku saitam ee roju konni telugu news channels dhorani kasintha vegatu puttinchindi. Rastrapathi paryatananu saitam live chupani ee tv chanallu saniya nichithardaniki inthaga hadavudi cheyadam vidduram. inkoka vishayam emitante ivi news channels aaa... leka pramukula functions ku video graphersaa ane sandeham kaligindi.

sriramaditya said...

Nijamenandi, Maaku kuda eeroju konni news channels ni chuste veeranthaa pramukula functions cover chese video graphers emo ani doubt vacchindi.

Rastrapati AP paryatan ku kuda intha pradanyatha ivvaranukunta

Kaani idi veekshakulaku vegatu kalgistunna vastavam telusukoleka povatame ee roju vaarthalloni pradanamsham.

భవాని said...

నిన్నటివరకూ సానియా ప్రాక్టీస్ చేసింది. ఈ విషయం చెప్పలేదేంటి మీరు? ఆ విషయం తెలియకపోతే మనం చచ్చిపోమా?

గీతాచార్య said...

RightO Rightt!! Bro.

గీతాచార్య said...

"ఇప్పటికీ స్పష్టంగా అక్కడ ఏం జరిగిందో తెలీదు కానీ సానియా డ్రెస్సులు మాత్రం పింక్, బ్లూ, మరియు క్రీమ్ కలర్స్ లో ఉన్నాయని మాత్రం తాజా సమాచారం."

కత్తి మహేష్ గారు రావాల్సిందే. ;-)

What can we say about our media? Real media died long ago. What now we have is a sophisticated form of porn. That's all. They have no ethics. What they want is... to fulfill voyeuristic tastes of people.

Hmm there's a long list. But... just leave it aside.

ఆలోచించేంత లేదు వాటికి. మంచి గురించీ చెత్త గురించీ ఆలోచించ గలం కానీ న్యూస్ చానళ్ళ గురించి ఏమి ఆలోచిస్తాం?

ప్రభాకర్‌ మందార said...

చాలా బాగా రాశారు.
సానియాను పెళ్లి చేసుకోబోతున్న అసలు వ్యక్తి ని కంటే కేరళ , ఉత్తరప్రదేశ్ ల నుంచి వచ్చిన ఇద్దరు వెర్రి వాళ్ళను ఓ ...అదేపనిగా ... చిర్రెత్తిపోయేలా చూపించారు.
ఆమధ్య అభిషేక్ బచ్చన్ పెళ్ళప్పుడు ఎవరో అమ్మాయి ఇట్లాగే చేస్తే హిందీ చానళ్ళ హడావిడి ఇప్పటికీ గుర్తుంది.
ఇలాంటి మీడియా ప్రచారాలు , బాధ్యతా రాహిత్యపు పనులూ మునుముందు మరెందరు పిచ్చి వాళ్ళను సృష్టిస్తాయో!
ఒక ఛానల్ ని చూసి మరో ఛానల్ , ఒక ఛానల్ ను మించి మరో ఛానల్ వెర్రి తలలు వేస్తున్నాయి.
ఈ ధోరణికి అడ్డుకట్ట ఎలా పడుతుందో, ఎన్నడు పడుతుందో....!

సుజాత said...

భరద్వాజ్,
నేనా మాట ఎక్కడన్నానో చూపించండి.:-)

భాస్కర రామి రెడ్డి said...

ఇప్పుడు కూకట్ పల్లి నుంచి తాజా సమాచారం మనకందించడానికి సుజాత గారు సిద్ధంగా టి.వి. ముందున్నారు. అక్కడ తాజా పరిస్థితి ఏమిటో తెలుసుకుందాము.

సుజాత ( గారు ) అక్కడ పరిస్థితి ఎలా వుంది? సానియా సోనియానైనా రనించారా లేదా సోనియా కూడా మీ దగ్గరే వున్నారా ? కల్యాణం కి ముహూర్తమెప్పుడో తెలుసుకొనే ప్రయత్నం ఏమైనా చేసారా? అక్కడ జనాలు ఎప్పుడు మిగిలిన కార్యం జరగవచ్చు అనుకుంటున్నారు?

భారా, ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఉద్రిక్తంగా వుంది.. కుయ్..కుయ్...కూఊఊఊ..

లైన్లో ఏదో ప్రాబ్లం వుంది తిరిగి కొద్దిసేపాగి ప్రయత్నిద్దాం... అప్పడిదాకా బ్లాగులో ( స్టూడియో ) కి విచ్చేసిన విశ్లేషకుల అభిప్రాయాలు తెలుసుకుందాం...

కత్తి మహేష్ కుమార్ said...

ఇరవైనాలుగ్గంటలూ,లైవ్ కవరేజి లాంటివొచ్చాక ఈ trivialisation తప్పవు.

వేణూ శ్రీకాంత్ said...

ఈ నిరంతర వార్తా స్రవంతి ఛానళ్ళన్నిటినీ ఎవరన్నా కూర్చోబెట్టి ఘాట్టిగా ప్రైవేటు చెప్పేయాలి !!

రమణి said...

తాజా సమాచారం కొంత నాదగ్గిర కూడా ఉంది. మావారు నిన్న తెల్లవారుఝామున 4 గంటలకి వచ్చారు. ఎంటండి అంటే సానియా మిర్జా పెళ్ళిచేసుకొన్నందుకు మీరెలా ఫీల్ అవుతున్నారు అంటూ ప్రెస్ వాళ్ళు హడావిడి పెట్టారట.
" నాకే ఫీలింగ్ లేదు సానియా నా కూతురు కాదు, నా బంధువు కాదు, నా చెల్లెలు కాదు " అని చెప్పినా వదలలేదుట. ఇలా కనిపించినవాళ్ళందర్నీ మీరెలా ఫీల్ అవుతున్నారు అని అడగడం.. :)

వెన్నెల రాజ్యం said...

సుజాత్ గారు.

ఇందులో మీడియాది ఎంత తప్పుందో... సానియా కుటుంబానిది అంతే ఉంది. కావాలనే అమె పెళ్లి చుట్టూ ఓ హైప్ క్రియేట్ చేశారు.అది వారికి కావాలి. ఎందుకంటే సానియా కేవలం ఓ టెన్నిస్ క్రీడాకారిణి కాదు. ఓ బ్రాండ్. ఆ బ్రాండ్ చుట్టూ ఎంత హైప్ చేస్తే అంత రాబడి. మీడియా ఎప్పటిలానే అందులో కొట్టుకుపోయింది.

మురళి said...

టీవీ చూసి బాగా చిరాకు (మామూలు చిరాకు రోజూ ఉండేదే) పడ్డ రోజుల్లో నిన్నటి రోజు ఒకటి.. చాలా 'అతి' చేశారు అందరూ... బాగుందండి టపా..

Harish said...

"ఈ ధోరణికి అడ్డుకట్ట ఎలా పడుతుందో, ఎన్నడు పడుతుందో....!"
--మీరు T.V కట్టేసినప్పుడు.
అందరు ఆ TV9 ని తిడుతూనే వుంటారు....మళ్లీ చూస్తూనే వుంటారు.....జై చిరంజీవ సినిమాలో చిరంజీవి మందు కొట్టినట్లు.....ఈ జనాలకి entertainment కావాలి....వాళ్లకు డబ్బు కావాలి...
ఈ టపా చదివిన వాళ్లలో సగం మంది TV9 ని వాళ్ల ఛానెల్ లిస్ట్ నుంచి తీసేస్తే చాలు...అదో గొప్ప గెలుపు...

P.S:నేను T.V చూడను.

ఉమాశంకర్ said...

నిజమే , ఈ "అతి" చూస్తుంటే నవ్వు రాక మానదు. చూస్తూ ఉండండి తను హనీమూన్ కి ఏ దేశానికి వెళ్ళేది అన్నీ వివరంగా చెప్తారు..

కామెడీ లేదా కూసింత వినోదం కావాలనుకున్నప్పుడు ఒకప్పుడు న్యూస్ ఛానెల్సు నుంచి సినిమా ఛానెళ్ళ వైపు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అక్కడెలాగూ కామెడీ మొహం మొత్తేస్తోంది. న్యూస్ ఛానెళ్ళు ఆ స్థానాన్ని చాలా విజయవంతంగా భర్తీ చేస్తున్నాయి.

రకరకాల మనుషులూ, రకరకాల హావభావాలూనూ.. స్టూడియోలో న్యూస్ రీడర్ అడిగే ప్రశ్నకీ, సంఘటనని కవర్ చేస్తున్నవాళ్ళు చెప్పేదానికీ కొన్నిసార్లు పొంతనుండదు. అదేదో సినిమాలో కమలహసన్లా వీళ్ళు మొదట నోటికొచ్చింది ఏదోఒకటి బడ బడా వాగేస్తూ ఈలోపు ఆ అసలు ప్రశ్నకి సమాధానం ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది మొత్తానికి చివర్లోనైనా సమాధానం చెప్తారు కొంతమంది అదికూడా ఉండదు.

ఇక స్క్రోలింగుల్లో గానీ,వార్తల్లోకానీ వాడే భాష చూస్తే కొన్ని కొన్ని సార్లు ఎంత సీరియస్ న్యూస్ అయినా ఫక్కున నవ్వొస్తుంది.

నిరంతర హాస్య స్రవంతిగా ఈ ఛానల్స్ ఎదగాలని కోరుకుంటూ..

సుజాత said...

హరీష్,
మీరు చెప్పింది నిజమే! ఆ అతికి ఫుల్ స్టాప్ పడేది మనం టీవీ కట్టేసినపుడే! నేను టీవీ చూడను. ముఖ్యంగా టీవీ 9 అసలు చూడను. నిన్న జరిగిన మేటాస్ బాధితుల ధర్నా పట్ల మీడియా స్పందన కోసం రోజంతా టీవీ చూడాల్సి వచ్చింది.లేకపోతే ఇవాళ సానియా ఫొటో పేపర్లో చూసేదాకా ఆ వార్త గురించి కూడా పట్టించుకునే దాన్ని కాదు.

సుజాత said...

వెన్నెల రాజ్యం గారు,
మీరన్నది కూడా నిజమే! గుప్పిట్లో దాచిన కొద్దీ అందులో ఏముందో తెలుసుకోవాలని ఉత్కంఠ పెరగడం సహజం! పైగా పెళ్ళి ప్రసాహ హక్కులను రెండు కోట్లకు అమ్ముకున్నారన్న వార్త రావడం మరీ అయోమయంలో పడేసింది నన్ను. జేడ్ గూడీ చివరి క్షణాలను అమ్ముకుంటే వీళ్ళు మధుర క్షణాలను అమ్ముకున్నారన్నమాట. పెళ్ళీ, చావు రెండూ వ్యాపారమే ఐపోయాయి.

స్నేహ said...

ఇలాంటివి చదివినపుడు మా ఇంట్లో టి.వి లేకపోవడం వల్ల చాలా హాయిగా వుందనిపిస్తుంది.

వేణు said...

చాలా బాగా ఉంది మీ పోస్టు. మనుషుల ప్రాణాలు పోతే ఎవరికి ఆసక్తి? సానియా పెళ్ళి సంగతి ప్రజల తక్షణ జీవన్మరణ సమస్య కానీ!

$h@nK@R ! said...

I am lucky that i am not having TV at my room here ;)

కిషన్ రెడ్డి said...

సానియా నిశ్చితార్ధం పట్ల ప్రజల్లో అంత క్రేజ్ ఉందా??.. అని ముక్కు మీద వేలేసుకునేలా చేస్తున్నారు ఈ మీడియా వాళ్ళు...అంత సీన్ లేదు కదా మరి :)

గీతాచార్య said...

@వేణూ శ్రీకాంత్,

పాపం ఇప్పటిదాకా మేడం గారు చేసిందదేగా? :-D

MIRCHY VARMA OKA MANCHI PILLODU said...

chi e media vallu chala athi chesthunnaruandi veru prathi chinna vishayanni cash chesukovalanii praytnisthunnaru vegutu puttisthunnaru TV chudalante
please vist my blog also http://mirchyvarma.blogspot.com

శేఖర్ పెద్దగోపు said...

నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ సానియా పెళ్ళి కవరేజీకి వెళ్ళి రాత్రి ఒంటి గంట వరకు అక్కడే ఉంది. నేను వచ్చేస్తాన్రా మహాప్రభో అంటే ఏ క్షణం అయినా మీడియాని అనుమతించొచ్చు...అప్పుడు న్యూస్ మనమే ముందు చూపించాలి అని కక్కుర్తి ప్రదర్శించారట సదరు టీ.వీ నిర్వాహకులు. ఇలాంటి న్యూస్ సిటీ లో ఉన్న వాళ్ళ కంటే చిన్న చిన్న ఊళ్ళల్లో ఉండే వారు చాలా ఆసక్తిగా చూస్తారని, అక్కడే వాళ్ళకు రేటింగ్స్ వస్తాయని తను చెప్పింది. రానున్న రోజుల్లో మన ఇంట్లో ఫంక్షన్ కి కూడా భారీగా డబ్బులు దండుకుని మనల్ని ఒక సెలబ్రిటీ స్థాయిలో చూపించినా ఆశ్చర్యపడక్కర్లేదేమో!!

రవి said...

ఇవతల మీనా పెళ్ళి కూడా తయారయింది. మీడియాకు ఇక పండగే.

తృష్ణ said...

సుజాతగారు,నా కీపాడ్ పాడయిపోవటంవల్ల నేను మీకు వెంఠనే వ్యాఖ్య రాయలేకపోయాను.
టి.వి.లో న్యుస్ చానల్స్ మీద ఒక టపా రాయాలని ఎప్పటినుంచో...తీగ దొరికితే చాలు..వేళ్లతొ సహా పీకి పడేస్తారు.ఆ మధ్యన జరిగిన "అఋషి" మర్డర్ కేసుపై మీడియా ఎన్ని కధలల్లి,ఆ కుటుంబ గౌరవాన్ని ఎంత మట్టిపాలు చేసిందో...తెలిసిందే కదా!వాళ్ళ టైం పాస్ కోసం,న్యూస్ మొదట ఆ చానల్ వాళ్ళే చూపించాము అన్న పేరు కోసం....ప్రేక్షకుల బుర్రలు తింటూ ఉంటారు.

SIVA said...

మనం ఇప్పుడు టి విల్లో చూస్తున్నది వార్తలా??? ఈ ప్రసారం చెసేవాళ్ళు పత్రికా విలేఖరులా?? ఈ చానెళ్ళన్నీ డబ్బుకు అమ్ముడుపొయ్యే బాపతే కాకపోతే కొంచెం ఎక్కువ, తక్కువ. వీళ్ళాల్లో ఏ వక్కడన్నా అదో ఒక పార్టీకి బాకా ఊదని వాడున్నాడా. ఒక పార్టీ వాడు ఏమిచెసినా కిమ్మనని వాళ్ళు, మరొక పార్టి పరిపాలిస్తున్న రాష్ట్రంలో చీమ చిటుక్కుమన్న, గోరంతలు కొండంతలు చెస్తూ, చూపించిందే మళ్ళీ, మళ్ళి చూపిస్తూ అక్కడేదో ఘోరం జరిగినట్టు చూపిస్తూ,వేరొక పార్టే దగ్గర డబ్బులు వసూలు చెస్తూంటారని నా ప్రఘాడ నమ్మకం.


అయినా మనకుండాలి బుద్ధి! ఈ చెత్త చానెళ్ళన్నీ చూడ్డం మనేసి ఎంచక్కా మన దూర్దర్శన్ చూస్తూ ఆనందించక....!

శివరామప్రసాదు కప్పగంతు
బెంగుళూరు, భారతదేశం

Vinay Chakravarthi.Gogineni said...

@ baskar rami reddy
ఇప్పుడు కూకట్ పల్లి నుంచి తాజా సమాచారం మనకందించడానికి సుజాత గారు సిద్ధంగా టి.వి. ముందున్నారు. అక్కడ తాజా పరిస్థితి ఏమిటో తెలుసుకుందాము.


baaga chepparu.......reddy gaaru


sujatha gaaru choosara saaniya gurinchi chupistunnaru ani antune meeru ok post raasaru........

aswin budaraju said...

Good Article

aman said...

Idi kevalam media overaction kaadu. Spread of consumerism was the reason. Sania is a brand and we are all naive buyers. Indaru thidutunnaru gaani, TRP ratings chooste telustundi asalu sangati. Andaru Srivaishanuvule gaani gampaloni chepalu mayam ani oka sametha. 'ayya mee coverage gabbu kampu koduthundi, ani oka vando, veyyo smslu kodithe konta chalanam vuntundi.
PS: Sania engagementki yentamandini pilichindee, yevarevarini pilichindee mediaki yela teluso? Family leak chesi vundochchu kada?

Post a Comment