December 5, 2009

ఆంధ్రులు ఈ రాష్ట్ర ప్రజలు కాదా?

మొన్న బంధువుల ఇంట్లో వ్రతానికి వెళ్ళి తారనాక వైపునుంచి రావలసి వచ్చి చాలా ఇబ్బందులు పడ్డాం! కార్ల మీద రాళ్ళు విసిరారు అల్లరి మూకలు తెలంగాణా విద్యార్థుల పేరుతో! వారిలో విద్యార్థులెంత మందో బయటివారెంత మందో నాకు తెలీదు. కానీ నా కారు బయటి రాష్ట్రం రిజిస్ట్రేషన్ తో ఉండటం వల్ల మాత్రం బతికి బయటపడిందని అనిపిస్తోంది.నిన్న ఏపీ రిజిస్ట్రేషన్ తో ఉన్న కార్ల నంబర్ ప్లేట్లన్నిటిమీదా రంగు పూసి TG అని రాశారట ఆందోళన కారులు! అలాగే ఆంధ్రా బాంక్ పేరును కూడా "తెలంగాణా బాంక్"అని మార్చారట. సిటీ సెంట్రల్ లైబ్రరీ పేరుని "వట్టికోట ఆళ్వారు స్వామి లైబ్రరీ" గా మార్చేశారట!




ఇదెక్కడి చోద్యం! ఆంధ్రా బాంక్ తెలంగాణా లో ఉన్న బ్రాంచ్ లన్నింటికీ ఇదే గతి పట్టిస్తారా అయితే? మరి తెలంగాణాలో ఉన్న మిగతా రాష్ట్రాల బాంకులకు ఈ పేరు మార్పు వర్తిస్తుందా లేక "ఆంధ్రా" బాంక్ కేనా?



వీరి ఉద్యమ లక్ష్యం ఏమిటి? వీళ్ళు అనుసరిస్తున్న ద్వేష పూరిత వైఖరేమిటి? ఉద్యమ లక్ష్యం తెలంగాణా సాధన అయితే దానికి హైదరాబాదులో ఉన్న ఆంధ్రుల్ని ద్వేషించడమా మార్గం?  హైదరాబాదు అభివృద్ధిలో సింహ భాగం పోషించి ఇక్కడ స్థిరపడిన ఆంధ్రులు ఈ రోజు ఎంతటి అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతున్నారో కూకట్ పల్లి, దిల్ సుఖ నగర్, S.R వంటి చోట్ల ఉన్న ఆంధ్రుల్ని చూస్తే తెలుస్తుంది.తెలంగాణా కావాలని కోరుతున్నవారంతా , హింసలో పాలు పంచుకోకపోయినా "హింస వద్దు!మన మార్గం ఇదికాదు"అని మాత్రం దాన్ని ఖండించకపోవడం గమనార్హం!



అసలీ "ఆంద్రోళ్ళ" కాన్సెప్ట్ ఏమిటి? ఆంధ్రులెవరు? ఈ రాష్ట్ర ప్రజలు కాదా?  వారికి ఈ రాష్ట్రంలో ఎక్కడ ఇష్టమైతే అక్కడ, ఎక్కడ అనుకూల పరిస్థితులుంటే అక్కడ నివసించే హక్కు ఉందా లేదా?  తీవ్రవాదులకు కూడా యధేచ్చగా హైదరాబాదులో సంచరించే స్వేచ్ఛ ఉందే! వీరికెందుకు లేదు?



"ఆంధ్రా వాలో భాగో"...ఎంత అవమాన కరంగా ఉంది ఈ నినాదం! అదేమంటే "అది భూ కబ్జా దారులకే వర్తి"స్తుందని సవరణ. "ఆంధ్రా వాళ్లని తరిమి కొట్టండి" అని విద్వేషపూరితమైన పిలుపునిచ్చాక, ఆవేశాలను రెచ్చగొట్టాక "కుంజరః" టైపులో పెట్టిన ఈ "భూకబ్జా దారులు మాత్రమే" టాగ్ లైన్ ఎవరికి వినిపిస్తుంది.?



హైదరాబాదులో చెలరేగుతున్న విధ్వంస కాండను, హింసను ప్రేరేపిస్తున్నదెవరు? పొట్టిశ్రీరాములు విగ్రహాన్ని ధ్వంసం చేస్తే తెలంగాణా తల్లి ఆనంద భాష్పాలు రాలుస్తుందా? "హింసా మార్గం విడనాడండి"అని నోటితో చెప్తూ చేతులెత్తి నమస్కరిస్తూ నమస్కరిస్తూ మరో వైపు కనుసైగతో "రెచ్చిపొమ్మని" ఆదేశాలిస్తున్న రాజకీయ నాయకుల కుటిలనీతిని ఎలా అర్థం చేసుకోవాలి?



బుద్ధిలేని నాయకుల ఆదేశాలను కళ్ళుమూసుకుని ఆచరించేవాళ్ళు తెలంగాణా విద్యార్థులా?


స్కూలు బస్సుల్ని తగలెట్టడం,ఆర్టీసీ బస్సుల్ని ధ్వసం చేయడం, ఆంధ్రా ప్రజల ఆస్తుల్ని బుగ్గి చేయడం, "ఆంధ్రా"  పేరున్న ప్రతి బోర్డునీ పీకి అవతల పారేసి ఆస్తుల్ని ధ్వంసం చేయడం,....
 ఇదేనా ఉద్యమ రూపం? ఇదేనా తెలంగాణా సాధనకి మార్గం?



అర్థం లేని ఆవేశంతో ప్రాణ త్యాగాలకు ఒడిగడుతున్నవార్ని తురుపు ముక్కల్లా రాజకీయ నాయకులు ఉపయోగించుకుంటున్నారన్న సంగతి పసి పిల్లవాడికి కూడా అర్థం అవుతుందే!
నిన్న మరణించిన శ్రీకాంత్ గురించి ఇవాళ మట్లాడుతున్నారు. నాల్రోజుల క్రితం మరణించిన కానిస్టేబుల్ గురించి ఈ రోజు ఎవరైనా మాట్లాడుతున్నారా? మరో రెండు రోజుల తర్వాత శ్రీకాంత్ గురించీ ఎవరూ మాట్లాడరు.

మిగిలుండేది మాత్రం శ్రీకాంత్ తల్లి కడుపు కోతా, కానిస్టేబుల్ భార్య గుండె కోతానూ! వారి పైన ఎనలేని సానుభూతి ఉన్నా,బాధ కలుగుతున్నా, వారి త్యాగానికి విలువ ఎంత ?,ప్రయోజనం నెరవేరిన తర్వాత వారిని గుర్తు పెట్టుకునే వారెంతమంది అనే ప్రశ్నలు  ఉదయిస్తున్నాయి.

 వీరికి నా విన్నపం! దయచేసి ప్రాణాలు తీసుకోకండి. కుటుంబసభ్యులంకు తీరని దుఃఖాన్ని మిగల్చకండి. ఇది సరైన దారి కాదు.



తెలివైన వారెప్పుడూ ప్రాణాలు తీసుకోరు!
ఒక్కటే జీవితం! పోతే తిరిగి రాదని వారికీ తెలుసు.

తెలంగాణా కావాలన్న నినాదంతో హైదరాబాదులో హింసా మార్గంలో చిందులు తొక్కుతున్న యువరక్తానికి, యువక రత్నాలకు నా విన్నపం ఒక్కటే!

"బాబూ, వివేకంతో ఆలోచించి తెలంగాణాకు అడ్డుపడుతున్నదెవరో తెలుసుకోండి. దశాబ్దాలుగా తెలంగాణా నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలూ, ఎంపీలూ, మంత్రులు, ముఖ్యమంత్రులు,ప్రధానమంత్రులు తెలంగాణా సమస్యల్ని పట్టించుకోకుండా ఏం చేశారో నిలదీయండి.

 కె సి ఆర్ రాకముందు మనలో ఉన్న ఈ ఆవేశమంతా ఏమైపోయిందని ఆలోచించండి.ఇన్నాళ్ళూ ఎవర్నీ ప్రశ్నించకుండా కూచున్నందుకు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇది రాజకీయ నాయకులు ఆడుతున్న వికృత క్రీడ అని గ్రహించండి.అంతే కానీ అర్థం లేని ఆవేశంతో ఆంధ్రా వాళ్ళని ద్వేషించడం తగని పని"



కెసీఅర్ ప్రాణానికి ప్రమాదమేం లేదని అందరికీ తెలుసు.అయినా "కేసీఆర్ కి ఏదైనా జరిగితే రక్తపుటేరులు పారిస్తాం"అని ప్రతిజ్ఞలు ఎటు చూసినా! హైదరాబాదు వాసులకు ఎంత ఆందోళన కలిగిస్తుందిది?



ఒకవేళ తెలంగాణా ఏర్పడి, హైదరాబాదు అందులో భాగంగా ఉంటే మాత్రం,ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యం దృష్ట్యా హైదరాబాదులోని ఆంధ్రుల రక్షణ గురించి ఆందోళనగానే ఉంది నాకు!

65 comments:

Rambondalapati said...

telanggannaa to kalipi raashtram erpaatu chesina aandhraa naayakulanu anaali. telangaanaa vaallu 1950 la nundee andhraa vaalla meeda atyaachaaraalu chestoo chee kodutunnaaru. andhraa naayakulaku e maatram siggunnaa, veru padi, e vijayavaaDo vaizago rajadhani gaa raashtram erpaatu cheyyaali.ituvanti tappulu punaraavrutam kaakundaa mallee E raayalaseema vaallo vaste kalupuko koodadu. andhra nayakulu indastrialist laku ee maatram cheemoo netturoo unnaa vaari vaari astulanu kostaa ku taralinchaali. aandhra lo kooDaa padda udyamam modloutundi ika. haidaraa baadu loni andhrulanu kodite,kostaa jillalalo koodaa telangaanaa vaallu unnaru,vaallanee kodataaranna vishayam te'langaa'naa vaalla ki teliyaali

సుబ్బారావు said...

వీళ్ళ చేష్టలని చూస్తుంటే "అయినవాడికి ఆకులోను, కాని వాడికి కంచం లో పెట్టే రకం లా కనిపిస్తున్నారు". తెలుగు వాడిగా ఆంధ్రా, రాయలసీమ ప్రాంతం లో పుట్టి, హైదరాబాద్ (తెలంగాణా) వచ్చి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకోకూడదు. కాని ఇతర రాష్ట్రం వాడు వచ్చి చేసుకోవచ్చు. తెలంగాణా వచ్చి వ్యాపారాలు చేస్తున్నది ఒక్క ఆంధ్రా ప్రాంతం వాళ్ళేనా, వేరే ఇతర రాష్ట్రాల వాళ్ళు లేరా. మరి దీనికి ఏమంటారో, తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకుంటున్న తెలంగాణా ప్రజలు..

శ్రీధర్ రాజు - చికాగో said...

Please be mindful of your safety. The situation is not healthy.

KCR is a wrong leader for the right cause.

I knew this situation will come the moment Roshayya mishandled KCR's arrest.

He provoked all sleeping tigers of Telangana to an extent of insulting one of their respectable leader and Member of Parliment by throwing him in 3rd class jail far away from his base camp.

That was a wrong step and totally "unconstitutional". And the reason given to the public was a lie. If there are anti-social elements then Govt should provide protection and have allowed KCR to go on hunger strike...

Now the terror will not stop until the state is formed - it is not easy thing to control.

Please take care.

santhosh said...

మీడియా వాళ్ళు కూడా చిన్న చిన్న ఘటన లను కూడా హైలైట్ చేస్తున్నారండి.
కొన్ని రొజులు ఆగితే "తెలంగాణ"జ్యొతి,"తెలంగాణ"ప్రభ ,"తెలంగాణ"భూమి అని కూడ మార్చినా ఆశ్చర్యపోనక్కరలేదు.

ఎస్పీ జగదీష్ said...

ఆంధ్రా వాళ్ళు తెలంగాణకి ఏమి అన్యాయం చేసారో ఆలోచించే ముందు, తెలంగాణా ఏర్పడిన తరువాత కె.సి.ఆర్. తెలంగాణా కి ఏమి ఒరగబెడతాడో అది చెప్పమనండి. తెలంగాణా అభివృద్దికి ఏమి చేస్తారో చెప్పకుండానే ఉద్యమాలు అవీ, ఇవీ అని ప్రజల్ని రెచ్చగొట్టడం ఎందుకు? మనమున్నది ప్రజాస్వామ్యంలో, మనకేది కావాలన్నా ప్రభుత్వాన్ని అడిగి సాధించుకోవచ్చు. దానికి విడిపోవడం ఒకటే పరిష్కారం కాదు. ఇతరుల ఆస్తుల్ని ధ్వంసం చేయడం, అవమానించడం మాత్రమే పరిష్కారం కాదు. వెనకటికెవరో దాచాను మొగుడా, వేరే వెళ్ళిపోదాము అనేదట. చివరికి అత్తగారితో విడిపోయిన తరువాత రెండు ఇటుకముక్కలు చూపించిందట. రేపు కె.సి.ఆర్ పరిస్తితి కూడా ఇలాగేనేమో అనిపిస్తుంది.

లలిత said...

సుజాత గారు మీ ధ్యైర్యానికి నా జోహార్లు.
పైన ఆయనెవరో జగ్రత్త చెపుతున్నారు. ఎందుకైనా మంచిది పెట్టేబేడా సర్దుకుని మీ వూరికి రిజర్వేషన్ కూడా చేయించి పెట్టుకోండి . అదేదో సామెత చెప్పినట్టూ ......( ఏ సామెత అని అడకండి చెప్పే ధైర్యం నాకులేదు)

సుజాత said...

లలితా,
ఇప్పుడేగా ధైర్యాన్ని మెచ్చుకున్నారు? పెట్టె సర్దుకుంటే ఎలా?

శ్రీనివాస్ said...

చికాగో గారు బలే బెదిరిస్తునారు ... కాక పొతే నిద్రలేచిన సింహాలు ఎన్నాళ్ళు గోల చేస్తాయో చూద్దాం.

అసలు మీ ఉద్యమ కారులకు ఒక సిద్ధాంతం అంటూ ఉండదా ... కాసేపు మా నీళ్ళు మా డబ్బు గుంజకపోతున్నారు అంటారు .. కాసేపు హైదరాబాద్ లో ఆంధ్ర ప్రాంత వ్యక్తుల ఆస్తుల మీద దాడి చేస్తారు ఆంధ్ర తో కలిసి ఉండడం మీ ప్రాబ్లమా .. లేక వలస వచ్చియన్ వారి వల్ల ప్రాబ్లమా .. మీ పిచ్చ గాని ... ఆంధ్రా బాంక్ అమెరికా లో కూడా ఆంధ్ర బాంక్ ఏ తెలంగాణా బ్యాంకు అని పేరు మార్చడం ఏంది..

Swarnamallika said...

చాలా బాగా చెప్పారండీ. అసలు హైదరాబాద్ ఆంధ్ర ప్రదేశ్ రాజధాని కాబట్టీ, ఉద్యోగావకాశాలు సహజంగానే ఎక్కువ కాబట్టీ ఇక్కడికి కొస్తా వాళ్ళు వస్తున్నారు కానీ. తెలంగాణాలోని మిగతా ప్రాంతాలలో ఎక్కడ ఉన్నారండి ఆంధ్రులు. కేవలం కొద్దిమంది రాజకీయ కుళ్ళుతో వేల మంది అమాయక ప్రాణాలు బలి చేసి గద్దె ఎక్కాలని చేస్తున్న కుట్ర ఇది. అయినా కొస్తా వాళ్ళు వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు కోస్తాలోనె చేసుకుంటూ ఉండి ఉంటె పాపం వీరికి ఈమాత్రం ఉద్యోగాలు ఎవరిచ్చెవారు. హైదరాబాద్లో కోస్తా వాళ్ళ కన్నా ఎక్కువ పరాయి రాష్ట్రాల వారు ఉన్నారు. మరి వారందరు మంచివారు. మేము మాత్రం గిట్టని వారం. ఇదేం న్యాయం.

శరత్ 'కాలమ్' said...

చక్కగా చెప్పారు.

Jess said...

హెలొ! అస్సలు చూసారా మనమే మన అంధ్రా, ఈ తెలంగాణా వాళ్ళు అని వేరుగా మట్లాడుతున్నాము. తెలంగాణా వాళ్ళు అంధ్ర వాళ్ళు అని విడిగా లేరండి. మనమంతా తెలుగు వాళ్ళం. ఇది గుర్తుంచికుని వుంటే అస్సలు గొడవలే రావు . ఇక నైనా ఈ విద్వెషాలను రెచ్చ గొట్టడం మాని అంతా కలిసి వుందాం. అస్సలు రాష్త్రం ఎర్పడిందే బాషా ప్రధానంగా.

గీతాచార్య said...

What the hell is goin' on in the state. Not a single person (I mean the so called leaders) is behaving rationally about this issue.

ప్రభాకర్‌ మందార said...

సుజాత గారూ
ఆంధ్రుల మీద తెలంగాణా ప్రజలలోని విద్వేషభావనను వివరించే క్రమంలో తెలంగాణా ప్రజలమీద, తెలంగాణా విద్యార్థుల మీకున్న విద్వేషాన్ని తీవ్రస్థాయిలో వెళ్లగ్రక్కారు. మంటల్ని ఎగదోసేందుకు, ఉద్యమకారుల్ని మరింత రెచ్చగొట్టేందుకు మీ వంతు ప్రయత్నం బాగానే చేశారు. మీ వాక్యాల్ని కొన్నింటిని ఇక్కడ తిరిగి పొందుపరుస్తున్నాను. మరోసారి చదువుకుంటే చాలా ఆవేశపడ్డానే అని మీ ఆలోచనల్ని సరిదిద్దుకుంటారని దురాశ.

1) 'ఆంధ్రుల్ని' చంపేయాలన్నంత కోపం ఎక్కడినుంచి వస్తోంది? 'వీళ్లకి'.
2) తీవ్రవాదులకి కూడా హైదరాబాదులో సంచరించే స్వేచ్ఛ వుందే ...'ఆంధ్రులకి' ఎందుకు లేదు?
3) ప్రాణత్యాగాలకి రక్తం మరిగే యువకుల్ని రెచ్చగొట్టి ఆ రక్తంతో గొంతు తడుపు కుంటారు.... వారి రక్తంతో ఉద్యమం ముంగిట ముగ్గులేసి, వాటిని తొక్కుకుంటూ లోపలికి వెళ్తారు....
4) బుద్దిలేని నాయకుల ఆదేశాలను కళ్లు మూసుకుని ఆచరించే వీళ్లు తెలంగాణా విద్యార్థులా? వీళ్లు విద్యార్థులా??
5) తెలంగాణా కావాలన్న నినాదంతో హైదరాబాద్‌లో ''హింసామార్గంలో చిందులు తొక్కుతున్న'' యువరక్తానికి
Contd...

ప్రభాకర్‌ మందార said...

Cntd...2
మీరు కాస్త విజ్ఞతతో రాస్తారు. 54 ఏళ్లుగా రావణ కాష్టంగా నలుగుతున్న తెలంగాణా సమస్య మూలాల్లోకి వెళ్లి కొన్ని మంచి సూచనలు చేస్తారేమో చూద్దామని ఆసక్తిగా చదివిన నాకు చాలా నిరాశ కలిగింది. కనీసం 2004 ఎన్నికల నాటినుంచి ఇప్పటివరకు తెలంగాణా సమస్యతో రాజకీయపార్టీలు ఆడుతున్న నాటకం గురించి ఏమైనా ప్రస్తావిస్తారేమో అనుకున్నాను. కానీ మీ బాధ మీదే. తెలంగాణా సమస్య పట్ల కనీస అవగాహన కానీ, తెలంగాణా ప్రజలకు జరుగుతున్న అన్యాయం పట్ల కనీస సానుభూతి గానీ ఎక్కడా కనిపించలేదు. పైగా ప్రతివాక్యంలో వెటకారం, వ్యంగ్యం, చులకన, అభాండాలు.

1969లో పెల్లుబికిన తెలంగాణా ఉద్యమాన్ని అణిచినట్టే ఇప్పటి ఉద్యమాన్ని కూడా అణిచేయాలని గనక ప్రభుత్వం నిర్ణయించుకుంటే మీ అభాండాలన్నీ నిజమవుతాయేమో నని భయం వేస్తోంది. లగడపాటి రాజగోపాల్‌, టి.జి.వెంకటేష్‌ల సరసన మీరూ చేరినట్టు అనిపిస్తోంది. చాలా ఆవేదనగా వుంది.

te.thulika said...

పొట్టి శ్రీరాములుగారు తన ప్రాణాలను ధార పోసినది ఇందుకా అనిపిస్తోంది. హైదరాబాదంతా అమెరికనైజు అయినట్టనిపించింది నేనకక్కడ వున్న నెలరోజులూ. .. తెలుగుదేశం అని అనిపించనేలేదు. అయితే ఆంధ్రాకి తెలంగాణాకీ తేడా వుందా. ప్చ్.

Mahesh Khanna said...

చాల బాగా రాసారు సుజాత గారు !

ఇదొక్క సమస్యే కాదు, కులపరమైన, ప్రాంత, భాష పరమైన విద్వేషలన్నిటికి ప్రజలలో మార్పు రానిదే ఎవరెంత చెప్పిన ఈ సమస్యలు పోవు. (ఏ చరిత్ర చూసిన ఏమున్నదని గర్వకారణం అన్న శ్రీ శ్రీ మాటలు గుర్తుకొస్తోంది)

మనకు స్వతంత్రం వచ్చింది కాని, చాల మందికి స్వతంత్ర భావాలూ రాలేదు. చదువు ఉంది కానీ, విజ్ఞత లేదు. ఎప్పుడైతే మనిషి విజ్ఞతతో స్వతంత్రంగా ఆలోచించ గలాడో, అలోచించి తప్పు ఒప్పులను గుర్తించ గలాడో అప్పుడు ఎలాంటి కుటిల రాజికియలకు, రాజకీయ నాయకులకు తావుండదు.

- మహేష్

సుజాత said...

ప్రభాకర్ గారు,
ఈ టపా నేను ఆంధ్రులను కూడగట్టడానికో, తీరూ తెన్నూ లేకుండా సాగుతున్న ఆవేశాలను రెచ్చగొట్టడానికో రాయలేదు. అలా రాయాలనుకుంటే నా పదజాలం వేరుగా ఉండి ఉండేది! నాకెదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రాశాను.

రోజూ వార్తలు చూస్తున్నారనుకుంటాను టీవీలో. మూడు రోజుల క్రితం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల గుంపులో ఒకరు వాడిన మాటే ఇది. 'సంపేస్తాం ఆంద్రోల్లని తెలంగానా ఇయ్యకుంటే! ఎల్లిపోవాలిక్కడికెల్లి"...!

బలిదానం చేస్తున్నామన్న భ్రమలో ప్రాణ త్యాగాలు చేస్తున్న వారి గురించి, వారిని ఉపయోగించుకుంటున్న వారి గురించి నా అభిప్రాయం మార్చుకునే ప్రశ్నే లేదు.

సుజాత said...

#contd...#మీరు కోట్ చేసిన వాక్యాలన్నింటినీ మళ్ళీ మళ్ళీ చదివాను. నా అభిప్రాయాలలో ఏదీ తప్పని నాకనిపించడం లేదు.తప్పనిపిస్తే తప్పకుండా మార్చుకునే దాన్నే!

తెలంగాణా ప్రజల సమస్య గా కంటే రాజకీయ నాయకుల సమస్యగా మారిందన్న విషయం నేనెప్పటినుంచో నమ్ముతున్న విషయమే!నిజంగా ప్రజలే ఉద్యమిస్తే తెలంగాణా సమస్య ఎప్పుడో పరిష్కారమయ్యేది కాదా!

కంటికెదురుగా కనిపిస్తున్న హింసను గురించి (కొద్దిలో నేనూ తప్పించుకున్నాను దీన్ని) ప్రస్తావించడమే కానీ సమస్య మూలాల్లోకి వెళ్ళి చర్చించాలనే ఉద్దేశం ఈ టపా కి లేదు.ఒకమాట చెప్పండి. ఈ ఆందోళన కారులెవరికైనా సమస్య మూలాలు తెలుసా!

తెలంగాణా విద్యార్థుల మీద నాకెలాంటి ద్వేషమూ లేదు. నేనూ ఇక్కడే చదువుకున్నాను.

తెలంగాణా ప్రజలకు జరుగుతున్న అన్యాయం పట్ల నాకు సానుభూతి ఉంది,కొద్దో గొప్పో అవగాహనా ఉంది(కాస్తో కూస్తో చదువుకున్నాను కదా). కానీ తెలంగాణా సమస్యలన్నింటికీ హైదరాబాదులో నివసిస్తున్న ఆంధ్రులే కారణమన్నట్లు వ్యవహరిస్తున్న ఆందోళన కారులను సమర్థిస్తామా?

సుజాత said...

ఈ వ్యాఖ్య రాస్తున్న సమయానికి అమీర్ పేటలో గొప్ప హింసాకాండ సాగుతోంది.

నేను ఎవరిపక్కనా చేరనండీ ప్రభాకర్ గారూ! నా అభిప్రాయలెప్పుడూ నా స్వంతమే! లగడపాటి రాజగోపాల్ వంటి వారి పక్కన దయచేసి నన్ను చేర్చకండి.

వీర తెలంగాణా కోసం జరిగి ప్రాణాలర్పించిన చరిత్ర తాలూకూ రికార్డ్ అంతా నా దగ్గర భద్రంగా ఉంది. సమస్య పట్ల సానుభూతి ఉండటం వేరు. దాన్ని పరిష్కరించుకోడానికి అనుసరించే హింసా మార్గాన్ని వ్యతిరేకించడం వేరు.

టపా అంతా చదివి మీరు విమర్శించడానికి అనుకూలమైన అంశాలే ఎంచుకున్నారు కానీ ప్రజలను అభద్రతా భావంలోకి నెట్టేస్తున్న హింసను వ్యతిరేకిస్తున్నట్టు ఎక్కడా కనపడలేదు!

ఈ హింసాకాండను మీరు సమర్థిస్తున్నారా?

సమైక్య వాదులైనంత మాత్రాన్న తెలంగాణా ప్రజలమీద ద్వేషం ఉంటుందని భావించకండి దయచేసి.

సుజాత said...

Due to technical problem in blogger, Im not able to post huge comments..sorry for the inconvinience..! Above 3 comments are the parts of a single comment.

బొల్లోజు బాబా said...

గత వారం రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న మేహం చూస్తుంటే ఇస్మాయిల్ గారు రాసిన ఈ కవిత ఎందుకో పదే పదే గుర్తుకొస్తుంది.


ద్వేషం

చూసారా, ఎంత చురుగ్గా
ఎంత ఆరోగ్యంగా ఉందో-
మన శతాబ్దపు ద్వేషం.
ఆటంకాలని ఎంత సులువుగా అధిగమిస్తుందో,
కుప్పించి మనల్నెలా ఒడిసి పట్టుకొంటుందో.

మిగతా అనుభూతుల్లా కాదు
ఎంత ముసిలో అంత పడుచు.
తనను సృష్టించే హేతువుల్ని
తనే సృష్టించుకుంటుంది.
ఎపుడేనా నిద్ర జోగినా, అది దీర్ఘ నిద్ర కాదు.
నిద్రపోకపోయినా నీరసపడదు.

ఏ మతమైనా పరవా లేదు-
దేనితరపు నైనా సిద్దం.
ఏమాతృభూమైనా పరవాలేదు-
దేనికోసమైనా రెడీ.
ద్వేషం వేగం పుంజుకోటానికి మొదట్లో
న్యాయం వంటి భావాలు కూడా ఉపయోగపడతాయి.

ద్వేషం ద్వేషం.
రత్యోద్రేకంతో వికృతమైన
ముఖంతో.

మిగతా అనుభూతుల గురించి చెప్పకండి.
వట్టి నీరసప్పీనుగులు.

సౌభాతృత్వం పేరు చెపితే
ఎక్కడేనా జనం మూగారా?
జాలీ, దయా
ఎప్పుడేనా గెలిచాయా?

పనిచేసి చూపించేది
ద్వేష మొక్కటే//


(ఇస్మాయిల్ గారి ఒక అనువాదం)


బొల్లోజు బాబా

రవిగారు said...

నా కర్ధం కాని విషయం ఏంటంటే రేపొద్దున్న కల్లా తెలంగాణా ఇచ్చేసి కెసిఆర్ న సిఏం చేసేస్తే ఏం అద్బుతం జరుగుతుంది?పాని పూరి బండి వాడు ఎప్పటి లాగే కట్లెట్ అమ్ముకుంటూ అలాగే వుంటాడు .అరటి పళ్ళ వాడు సిటియలమొస్ అంటూ అమ్ముకుంటూ అలాగే వుంటాడు .ఎవరి జీవితాలు వాళ్ళవి అలాగే వుంటాయి . వొక్క వందమంది రాజకీయ నాయకులూ మాత్రం కొత్త గ వచ్చిన మంత్రి పదవులతో లాభ పడతారు .ఇంకొంతమంది తెలంగాణా వ్యాపారాలు చందన , బొమ్మన , కళామందిర్ యెగిరి పోవడం తో కొండల్రెడ్డి బ్రదర్స్ బట్టల దుకాణం అనో ,శోభన్ రెడ్డి బ్రదర్స్ బట్టల దుకాణం అనో తెరుచుకుని లబ్ది పొందుతారు .ఇంకొందరు నారాయణ , చైతన్య వెళ్లి పోవడం తో యాద్గిరి ,మల్లేశ అంటూ colleges ఓపెన్ చేసుకుని పైకి వస్తారు .లిక్కర్ వ్యాపారం , రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప వేరే వ్యాపారాలు రాని ధనిక వర్గం బేరాలు లేక డీలా పడి ఆర్దిక మాంద్యం లో కొట్టు మిట్లడతారు .వొక్క సెల్ ఫోన్ వర్గాలకి మాత్రం తెలంగాణా వస్తే పండగే ఎందుకంటె ఖమ్మం దాట గానే roaming పడుతుంది ఇక్కడ కుకట్పల్లి నుంచి ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళే కాల్స్ తో వచ్చే లాభం తో బ్రూనే సుల్తానులై పోవచ్చు , సో వొక్క నాలుగు లేదా అయిదు వర్గాలకి తప్ప తెలంగాణా వస్తే లాభం ఎవ్వరికీ లేదు నష్టమే ఎక్కువ .
అయిన సుజాత గారు మా ఇలాకకి వచ్చి మా ఇంట్లో చాయి తాగ కుండా అట్లెట్లా ఎల్లిపోయిన్రు?

రమణ said...

Excellent article. You written many Hyderabadi people’s mind .
Funny thing here is , no one objects for Telanagana , except high command (?)
but no one is thinking about what happens after getting Telganana?
Will all these Telangana protesters can come out and vote for a good party/leader?
Again some useless MLA/MPs will be elected.
We have to fight for correcting our society from poverty , corruption and political leaders capability.

kvrn said...

తెలెంగాణ గురించి కెసీఅర్ బలిదానం అవక తప్పదులా వుంది.ప్రస్తుత స్తితికి సిద్దాంతకర్త గారు ఒక్కరే సంతొషంగ వున్నరు.ఖమ్మంలో డాక్తర్లు పొలిసులు ఫ్రభుత్వంథొ కలసి కుట్ర చేసారు అని వారిమీద నమ్మకం లేదన్నరు. కెసీఅర్ ఉద్యమం పెంచడానికి కుమారుడు కెటీఅర్, కుమార్తె కూడా ఉద్యమాన్ని పెంచడానికి. ఇప్పుడు వారికి చాల గంభీరమైన స్తితి.ఇది బలావంతపు ఉపవాసము అయ్యింది. కెసీఅర్ సుగర్ పేషంటు.ఒక రొజు పూర్థిగా ఉపవాసం చెస్తే కోమా లొకి వెల్లడం ఖాయం. మందులతోని, సాలైనె యెక్కించి, డాక్తర్ల సాయంతొ చేసేది దీక్షా అవుథుందా

neelaanchala said...

ఆఫీసు నుంచి ఇల్లు చేరేదాకా ప్రాణాలరచేతిలో పెట్టుకునే ఉన్నాను. విజయవాడ నుంచి హైదరాబాదుకు 48 గంటలు బస్సులు రద్దు చేశారు. హైదరాబాదు నుంచి నైట్ సర్వీసులు లేవట. ఆందోళనకారులు పెట్రోలు బంకుల మీద పడతారేమో అని వాటినీ మూసేశారు. వచ్చేదారిలో అక్కడ పెద్ద క్యూలు...వెనుదిరుగుతూ! అమీర్ పేట లో "ఏపీ" అని కనపడిన ప్రతి దాన్నీ తగలెట్టారట. బస్సులు తగలపెట్టారు. సైరన్లతో తిరుగుతున్న పోలీస్ వాన్లు!రాష్ట్ర రాజధానిలో ఇలాంటి పరిస్థితి!

ఇదంతా చూస్తూ కూడా ఆందోళనకారులను ఉద్యమకారులుగా గుర్తిస్తున్న వారిని ఏమనాలో తోచడం లేదు. హింసను ప్రోత్సహించడం తప్ప మరేమీ కాదు. సిగ్గుచేటు.

నాగప్రసాద్ said...

>>"దశాబ్దాలుగా తెలంగాణా నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలూ, ఎంపీలూ, మంత్రులు, ముఖ్యమంత్రులు,ప్రధానమంత్రులు తెలంగాణా సమస్యల్ని పట్టించుకోకుండా ఏం చేశారో నిలదీయండి."

తెలంగాణా రావాలంటే, ముందు వీళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేయాలి. వీళ్ళందరినీ కిడ్నాప్ చెయ్యాలి. కిడ్నాప్ చేసి, అవసరమైతే వాళ్ళల్లో ఒకరిద్దరు నీచులు అనిపించుకున్నవారిని పెట్రోల్ పోసి తగలెట్టాలి. అప్పుడు తెలంగాణా వస్తుంది, దానితోపాటుగా ఆ ప్రాంతాన్ని బాగుచెయ్యాలన్న భయంకూడా కలుగుతుంది వాళ్ళ నాయకుల్లో.

ఆంధ్రావాళ్ళ మీద దాడి చేస్తే ఏమొస్తుంది? వాళ్ళ నాయకులకు వచ్చే నష్టమేముంది?. కనీసం ఓట్లు కూడా వచ్చే అవకాశం లేదు. అలాంటప్పుడు తెలంగాణ కోసం పోరాడాలన్న/అభివృద్ధి చెయ్యాలన్న ఆలోచన ఎక్కడ నుంచి వస్తుంది వాళ్ళకు.

అసలు, ఈ తెలంగాణ, ఆంధ్రా అన్న బేధం లేకుండా అప్పట్లోనే తమిళనాడు లాగా, మన రాష్ట్రానికి కూడా "తెలుగునాడు" అనో లేదా "తెలుగుదేశం" అనో పేరు పెట్టింటే బాగుండేది. ఇవ్వాళ బోర్డులు మార్చాల్సిన అవసరం వచ్చేది కాదు.

అబ్రకదబ్ర said...

@Sridhar:

>> " insulting one of their respectable leader .."
>> "KCR is a wrong leader for the right cause."

Once again, praise and despise simultaneously. Please compose your thoughts right, first.

నిద్రపోతున్న పులులు .... huh!

అన్ని ప్రాంతాల్లోనూ ఉంటాయి పులులు. అవీ లేస్తే?

అమెరికాకి వలసొచ్చాకా వలసదారులమీద చిన్నచూపు పోకపోతే ఎలా?

తగలెట్టండి ఎన్ని తగలెడతారో. రేపో మాపో ఆంధ్రా/సీమ వాసులూ తిరగబడతారు. అప్పుడవుతుంది హైదరాబాద్ అసలైన కురుక్షేత్రం. ఆ తర్వాత మిగిలేది బుగ్గే.

వేణు said...

అసహనం, విద్వేషం ఏ ఉద్యమానికైనా చెరుపు చేసేవే. విధ్వంసానికి దిగితేనే ఉద్యమం నడుస్తున్నట్టు కాదు. ‘అల్లరి మూకలు’ ఉద్యమకారులు ఎన్నడూ కాలేరు!

‘ధ్వంస రచన’ తెలంగాణ ఉద్యమానికి ప్రజల్లో ఉన్న సానుభూతిని దూరం చేస్తుందని గ్రహించకపోతే అది ఆ ఉద్యమానికే నష్టం!

‘ఆంధ్రులెవరు? ఈ రాష్ట్ర ప్రజలు కాదా?’ అని మీరడిగింది ఎంతో సూటి ప్రశ్న. దానికి సమాధానం ఏదీ?

Harish said...

తప్పంతా రోశయ్య దే.....

ఇలాంటి డ్రామా లు కెసిఆర్ 7 సంవత్సరాలుగా చాలా జాగ్రత్త నడిపిస్తూ ఉన్నాడు...మరీ ఈ సారి ఎందుకు విపరీతం అయింది అంటే.....రోశయ్య "ముందు జాగ్రత్త".....

ఖమ్మం లో వదిలేసి ఉంటే....కెసిఆర్ రెండు మూడు రోజు దీక్ష చేసి తెరాస కార్యకర్తల చేత ఒక బస్సు కాల్పించేసి...మాది గాంధీ మార్గము.....ఉద్యమం పక్క దోవ పడుతుంది అని ఎదవ కబుర్లు చెప్పి దీక్ష ఆపేసి....ధం కా బిర్యాని తినేవాడు....

అనవసరంగా sketch వేసి..సీన్ చేసి ఇష్యూ పెద్దది చేసారు....ఇప్పుడు జనాలు రెచ్చిపోయి ఉన్నారు.....పరిస్థతి 'చెయ్యి' దాటి పోయింది...

YSR ఇలాంటి వాటిని చూసి చూడనట్లు ఉన్నాడు....ఎవరు నిజంగా దీక్ష చేస్తారు....ఎవరు దీక్ష పేరు తో నాటకాలు ఆడతారు అనేది ఆయనకు బాగా తెలుసు....మనుషులుని అంచనా వేయడం లో దిట్ట....

ఇప్పట్లో మళ్లీ బాబు CM అవ్వడమే మంచిది...

బ్లాగాగ్ని said...

బాగా రాశారు సుజాత గారూ!!!

చికాగో గారు, మీదేంపోయింది సార్, అక్కడెక్కడో ఉండి రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామంటారు ఇంకేమైనా అంటారు. ఏం జరిగినా మీదాకా రాదుగా మరి! మళ్ళీ జాగ్రత్త హెచ్చరికలొకటీ!!

మందారగారూ, మీరేమైనా కేసీయార్‌తో చేరిపోయారా అనిపిస్తోంది మీ మాటలు వింటే. ఈ టపా ఉద్దేశం ప్రస్తుతం జరుగుతున్న హింసని ఖండించడం. ఇలా కాక మరెలా మాట్లాడాలో నాకైతే అర్థం కావట్లేదు. అంటే వీళ్ళు షాపులు పగలకొట్టినా, కార్లు తగలపెట్టినా, అమాయకుల్ని కొట్టినా, అగ్నిగుండం అనీ, రక్తపాతం అనీ కారుకూతలు కూసినా ఏమనకూడదు, కానీ ప్రతిస్పందిస్తే(అదీ ఇలా శాంతియుతంగా) మాత్రం తప్పు అంతేనా? రాజకీయ పార్టీలని(ఆఖరికి టీఆరెస్ ని కూడా) నిలదీయలేని మీరు(తెలంగాణా ప్రజలు) ఆడలేక మద్దెల ఓడన్నట్లు అమాయక జనాల మీద పడి మీ శాడిజం ప్రదర్శించడాన్ని మీరెలా సమర్ధిస్తారు?

సుజాత గారూ,
అసలీ సంఘటలన్నిటి వెనకాలా నే గమనించింది మరోటి ఉంది, అది మానవహక్కుల సంఘాల నిర్వాకం. మొదటిరోజు విద్యార్ధుల మీద లాఠీ చార్జి జరిగినప్పుడు సుభాషణ్ రెడ్డిగారు అంత హంగామా చేశారు కదా, మరి అదే సో కాల్డ్ విద్యార్ధులు గత కొన్నిరోజులుగా ఇన్ని విధ్వంసాలకు దిగుతుంటే, సాక్షాత్తూ ముఖ్యమంత్రిగారే పోలీసులు సమ్యమనం పాటిస్తున్నారు అని శలవిస్తూంటే, "ప్రజల ఆస్తులని ధ్వంసం చేస్తూ భయభ్రాంతులని చెయ్యకుండా చూడాలని" పోలీసులని ఎందుకు ఆదేశించలేకపోతున్నారో మేధావులెవరైనా వివరిస్తే తెలుసుకోవాలని ఉంది. సామాన్య ప్రజలు మానవహక్కుల సంఘాల పరిధిలోకి రారా? మా.హ.సం. వారు పోలీసులకు వ్యతిరేకంగానే పోరాడతారా?

Krishna said...

@Nagaprasad,
"మన రాష్ట్రానికి కూడా "తెలుగునాడు" అనో లేదా "తెలుగుదేశం" అనో పేరు పెట్టింటే బాగుండేది. ఇవ్వాళ బోర్డులు మార్చాల్సిన అవసరం వచ్చేది కాదు."
మీరు భలే వాళ్లెనండి, అప్పుడు తెలంగాణా నాడు అనో, తెలంగాణా దేశం అనో, లేకపోతే నిజాం దేశం అనో పెడతాం అనేవాళ్లు ఈ గొఱ్ఱెలు.
బుఱ్ఱ అరికాలులోకి దిగిన వాళ్లకు లాజిక్ కావాలంటారా? ముందు ఎమో తెలుగు అనేది మా తెలంగాణా శబ్దం, మీది కాదు అన్నారు, తర్వాత తెలుగు తల్లి మాదికాదు, మాది తెలంగాణా తల్లి అన్నారు. తెలుగు భాషను, ఆ భాష మాట్లాడే వాళ్లలో కస్తో కూస్తో పేరు ఉన్న వాళ్లను పొగుడుతూ వ్రాసిన "మా తెలుగు తల్లికి మల్లెపూదండ" మాది కాదు అంటున్నారు.

మరి కాకతీయులు వరంగల్ వాళ్ళు కాబట్టి కాకతీయ పేరుతో ఉన్న బార్లు, పరిశ్రమలు కోస్తా, రాయల్సీమ ప్రాంతాలలో పగలగొట్టాలేమో ఈ గొఱ్ఱెల లాజిక్ ప్రకారం :).

ఇన్నాళ్లు అమాయక తెలంగాణా ప్రజలతో ఆడుకొంటున్నాడు అనుకొన్న kcr, ఇప్పుడు ఈ వీళ్ల చేష్టలలు చూస్తూ ఉంటే వీళ్లకు సరిపోయిన నాయకుడే అనిపిస్తోంది.

phani said...

ఇందరు ఇన్ని మాట్లాడుత్తున్నరు కని, తెలంగాణా కు అన్యాయం జరుగుతుందంటే ఒక్కరైనా దానిపై మాట్లాడారా, సమస్య పరిష్కారం ప్రజలందరి సమిష్టి బాధ్యత,
మాకు అన్యాయం జరిగినప్పుడు ఎమైంది మీ అలోచన, సంవత్సరాల తరబడి మొత్తుకుంటున్నా పట్టిచుకోలేదు.. నాయకుల పక్షపాత వైఖరికి (అన్ని ప్రాంతాల నాయకులు) అనుభవించాల్సి ఒస్తున్న మూల్యం ఇది..
ఫణి

కొండముది సాయికిరణ్ కుమార్ said...

సుజాత గారు నిక్కచ్చిగా మీ అభిప్రాయాలు చెప్పారు. హింసాత్మకంగా మారని ఏ ఉద్యమం కూడా ఎక్కడా సక్సెస్ అయిన తార్కాణాలు నాకైతే కనిపించటంలేదు. స్వాతంత్ర్య పోరాటమైనా, ఆంధ్ర రాష్ట్రం కోసమైనా, సెజ్ లకు వ్యతిరేకంగా నిన్నమొన్నటి రైతుల పోరాటమైనా. పొట్టి శ్రీరాములు గారు మరణించిన పిమ్మట చెలరేగిన హింసాకాండ బహుశా చాలామందికి తెలియదు. అంతవరకూ కిమ్మనకుండా కూర్చొన్న అప్పటి ప్రధాని నెహ్రూలో కూడా కదలిక తెచ్చింది ఆ హింసాకాండే.

మొన్నటిదాకా తెలంగాణాపై ఆలోచించని ప్రభుత్వం ఈనాడు కనీసం ఆ పనైనా చేస్తున్నదంటే దానికి కారణం కె.సి.ఆర్. నిరాహారదీక్ష కాదు. విద్యార్ధుల చేతుల్లోకి ఈ ఉద్యమం ప్రవేశించటమే.

ప్రత్యేక ఆంధ్ర ఉద్యమానికి, ఇప్పటి తెలంగాణా ఉద్యమానికి ఉన్న తేడా అల్లా ఒక్కటే. అప్పుడు పొట్టి శ్రీరాములు గారు ఆసుపత్రిలో నిరాహారదీక్ష చేయలేదు. ప్రత్యేక పార్టీ పెట్టలేదు. నిస్వార్ధంగా నిరాహారదీక్ష చేసారు. కె.సి.ఆర్. కేవలం నాటకాలతో చిచ్చు పెడుతున్నాడు.

SIVA said...

సుజాతగారూ,

మంచి వ్యాసం వ్రాశారు. అభినందనలు. హైదరాబాదులో ఉందే ఆంధ్రా ప్రాంతం వారి భయాలను చక్కగా వ్యక్తీకరించారు.చివరకు కాశ్మీరులోని పండిట్ కుటుంబాలలగా అవ్వదుకదా వీరి పని అని భయమేస్తోంది, నిన్నటి ఘటనలు చూస్తుంటే. తెలంగాణా కోసం ఉద్యమించండి, తెచ్చుకోండి, ఇలా ఆంద్రా ప్రాతం వాళ్ళమీద ద్వేషం దేనికి. ఆంద్ర ప్రాంత ప్రజలను ద్వేషిస్తే తెలంగాణ వస్తుందా, ఆంద్ర బాంకు పేరు ఇవ్వాల్టికి ఒకరోజు తెలంగాణ బాంకు అని రాస్తే అదొక వార్త, ఫొటో వాల్యూ తప్పితే ఒరిగేదేమిటి.

వ్యాఖ్యలలోకెల్ల "రవి" వ్యాఖ్య నిజం. చివరకు లాభపడేది సెల్ కంపెనీలు, రాజకీయ నాయకులు.

తరువాత మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని ఒకడు ఉండాలి, పరిపాలనా దురంధరుడు, అనుభవశాలి అని ఊదరగొట్టారు ఈ మధ్యదాక, ఇప్పుడేమిటి, చిన్న పిల్లాడిలాగ ఢిల్లీ పరిగెత్తాడు, "అమ్మా.....వీళ్ళు చూడవే" అంటూ. ఇదేనా పరిపాలనా సామర్ధ్యం (దయచేసి రోశయ్య వ్యతిరేక వర్గం ఈ విషయాన్ని రాజకీయం చెయ్యకండి మీరైతే ఈ పాటికి పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకోవటానికే భయంగా ఉన్నది). రోశయ్య గారు ఇప్పటికైనా రాజకీయ భయం నుండి తేరుకుని తన పరిపాలనా సామర్ధ్యం తో ముఖ్యంగా హైదరాబాదులో మరియు ఇతర తెలంగాణా ప్రాంతాల్లో ఉన్న ఆంధ్ర ప్రాంత ప్రజలకు భద్రతా భావాన్ని కలిగించాలిసిన అవసరం ఎంతయినా ఉన్నది. లేకపోతే ఆంద్ర ప్రాంతలో మరొక ఉద్యమానికి బీజాలు ఇప్పటికే పడ్డాయి, అవి పెరిగి వృక్షాలయ్యి మరిన్ని సమస్యలు తెస్తాయి.

బ్లాగాని మీరు చెప్పినట్లుగా మానవ హక్కుల సంఘం ఈ హింస గురించి మాట్లాడదదు! వాళ్ళకు కనిపించేది పోలీసుల హింస మాత్రమే అనుకుంటా. వారు ఈ సంఘటనలు తమంతట తామే విచారణకు స్వీకరించి (సువ్వొ మోటో) తగిన ఉత్తర్వులను ఈ ప్రభుత్వానికి ఇవ్వవలసి అవసరం ఎంతయినా ఉన్నది.

SIVA said...

My appeal to the real intelligentia of Telangana to use their good offices to stop this mindless destruction and violence. This kind of incidents will only defame the Telangana Agitation.

అబ్రకదబ్ర said...

@సాయి కిరణ్:

మీరు కూడానా!?!

అయితే హింసని సమర్ధిస్తానంటారు. మీరూ వెళ్లి వాళ్లకి తోడుగా నాలుగు బస్సులు తగలబెట్టి అప్పుడొచ్చి ఈ కామెంటేసుంటే బాగుండేది.

BVJ said...

Good article and good comments; but can be little more healthy though - can be more objective. I am failing to understand one thing; what is the motive behind this agitation to separate Telangana? Is it because, Telangana region is not developed enough, not enough resources, not many opportunities? If that is true, how will the separation help? Even if Telangana is separated and assume even Hyderabad becomes part of Telangana, will the income from Hyderabad alone (as there are not enough resources or development in Telangana region) be sufficient DEVELOPE the entire Telangana region? What i think is, instead of fighting for separating Telangana, it may be wise to fight for the overall development of Telangana region. As Sujathagaru pointed out, what are these 'so called leaders' from Telangana regions doing all this time? If they acted timely and in the best interest of public, they can (even now / atleast now) focus on required development.

సుజాత said...

అబ్రకదబ్ర,
హింసను విజ్ఞత గలిగిన ఏ పౌరుడైనా ఎలా సమర్థిస్తాడు? సాయి కిరణ్ గారు చరిత్ర మిగిల్చిన తార్కాణాలను గురించి చెప్పాలనుకున్నారని అనుకుంటున్నాను. ఉద్యమం విద్యార్థుల చేతిలోకి నెట్టడం తెరాస పన్నిన వ్యూహం!నిరాహార దీక్ష దీనికి బేస్!

ఇప్పుడైనా ఇది సఫలీకృతం అవుతుందా అన్నది తేలని విషయమే!

SATHYA said...

ఆంద్రా వాళ్ళు మాత్రమే కాదు ...
రాయలసీమ వాళ్ళు కూడా "ఆంధ్రులే"
తెలంగాణా వాళ్ళు కూడా "ఆంధ్రులే"

"ఆంధ్రులు" కారు .....................ఆంధ్రా వాళ్ళు... సవరించు కోగలరు. . . .
విడి పొయాక చూద్దాం ఎవరి నేమనిపిలవాలో...

" మీ రందరూ తినబోతూ రుచులు లెక్కపెట్టే వారే... "

stavapriya said...

హహ్... హహ్... హ

ఇదంతా పిల్లికి గంట కట్టడాని కి "ఎలుకల ర్చ"....
ఇంకెప్పుడు మారతారండీ బాబో...

అబ్రకదబ్ర said...

@సుజాత:

నేను తప్పుగా అర్ధం చేసుకున్నట్టున్నాను.

@సాయి కిరణ్:

please don't mind my previous comment.

But, హింసాత్మకమైతేనే ఉద్యమాలు ప్రభావం చూపిస్తాయనే మాటతో ఏకీభవించలేను. హింసాత్మక పంధా తీసుకుని సఫలమైన ఉద్యమాలకంటే విఫలమైనవే ఎక్కువున్నాయి, ఉంటాయి. పైన శ్రీధర్ అన్నారు, 'ఉద్యమ లక్ష్యం గొప్పది, దానికి దొరికిన నాయకుడే చవట' అని. దానితోనూ ఏకీభవించలేను. Leaders can only be as good as the cause. నలభయ్యేళ్లుగా సాగుతున్నా (అలాగని ప్రత్యేకవాదులు చెప్పుకుంటున్నారు) నిఖార్సైన నాయకుడిని ఒకడినీ పుట్టించలేని ఉద్యమం ఎంత ఉదాత్తమైనదవుతుంది?

ఇక 'స్టూడెంట్ పవర్' అంటూ మురిసిపోతున్నవారు కొందరున్నారు. 1990లో విద్యార్ధుల నేతృత్వంలో దేశమంతా ఉవ్వెత్తున ఎగసిన రిజర్వేషన్ వ్యతిరేకోద్యమం గతేమైందో గుర్తుకు తెచ్చుకోండి.

కొన్ని బస్సులు తగలబట్టి, బోర్డులు తిరగరాసి, దుకాణాలు ధ్వంసం చేసినంతనే కోరికలు తీరిపోతే .... ఓ చేతిలో కోరికల చిట్టాలు, మరో చేతిలో పెట్రోలు డబ్బాలతో తయారయ్యేవారు దేశమంతా ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్థుల విధ్వంసంతో రాష్ట్రం ముక్కలవటం కల్ల.

అసలిదంతా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చెయ్యని చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోటానికి కేసీయార్, ఓబుళాపురం గనుల గాలి దుమారం నుండి దృష్టి మరల్చటానికి కాంగ్రెస్ పార్టీ .... కలసికట్టుగా ఆడుతున్న నాటకం.

rk blogs in said...

see this blog on spoof of ....http://dedicatedtocpbrown.wordpress.com/2009/12/04/kcr-atmasakshi-palike/

అర్జున్ ప్రతాపనెని said...

కె.సి.ఆర్ తెలంగాణ నినాదం మొదలు పెట్టిన దగ్గర నుంచి మొన్న నిరహార దీక్ష వరకు చాలా డ్రామాలు ప్లే చేశాడు.ఇప్పుడు కూడా టి.ఆర్.యస్ పార్టీ ఉనికి కోల్పోకుండా కాపాడటానికి ఈ నాటకం మొదలు పెట్టాడు..ఒక రెండు రోజులు ఏదో నాటకం ఆడి తరువాత ఖమ్మంలో నిమ్మరసం త్రాగాడు..కాని ఏప్పటినుంచో తెలంగాణ ప్రజలు,విధ్యార్దులు,మేదావులు,కళకారుల కోరుకుంటున్న ప్రత్యెక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ముందు ఆయన నాటకం వర్కవుట్ కాలేదు. ఈ సారి విధ్యార్దులు సహనం కోల్పోయారు రాజకీయ నాయకులను నమ్మే స్ధితి లో లేరు..తెలంగాణ ఉద్యమాన్ని ఇప్పుడు పరిష్కరించవలసింది ప్రభుత్యమే...., లేకపోతే ఈ గొడవలు నిజమైన తెలంగాణ ప్రజలనుంచి ఏ ఆరాచక శక్తుల చేతుల్లోకో వేల్తే అప్పుడు అన్నదమ్ముల్ల కలసి ఉన్న ఆంద్ర ,తెలంగాణ ప్రజలు ప్రాంతీయ విద్వేషాలతో రగిలిపోతారు. ఆ తరువాత తెలంగాణ వచ్చిన సుఖం ఉండదు.. అందుకే దీని పై రాసే ముందు కోంచెం జాగ్రత్తగా రాయగలరని మిత్రులను కోరుతున్నా..

Nobody said...

Very nice to read your bold expression. What you say is not at all exaggeration. They must constrain themselves.

My congratulations

Chakravarthy said...

@Sridhar, Prabhakar, Sai Kiran, Phani - Hello guys… I don’t have any clue on how much bitterness you have faced/heard/seen in your lives… Why don’t someone from you tell all of us about what “Problems/Difficulties/Agony faced in the past or present by Telangana region and/or its people because of so called Andha people?” Please don’t mention the problems created by Neta’s or negligence of officers, there is no point talking about them. “Aren’t any of these issues faced by people in other regions of AP or other states? And is violence on common man the only solution?”

Do you think people of Pakistan don’t have their own valid reasons supporting their violence against Indians? Aren’t the acts of violence on innocent people for the sake of a different state any different from terrorism?

I hope I am addressing intellectual people (if not HIGHLY intellectual) who can think beyond egoism/racism with some consciences.

@Sujatha – Sorry for diverting the topic, if I had. Like for many of us here, ur article was the right platform to put forward our voices. U r article was an eye opener, even though some r still napping.

సుజాత said...

ఈ వ్యాసం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన మిత్రులందరికీ కృతజ్ఞతలు! ప్రతి ఒక్కరి అభిప్రాయాన్నీ గౌరవిస్తున్నాను.

తెలంగాణా మిత్రులు గ్రహించవలసినదేమిటంటే...

తెలంగాణా ఉద్యమం పై నాకెటువంటి దురభిప్రాయం లేదు. నాయకత్వం సరైనది కాదనే అభిప్రాయం తప్పించి! తెలంగాణా విద్యార్థులంటే కూడా దురభిప్రాయం ఏమీ లేదు. నేను ఇక్కడ చదువుకున్నాను. ఇంకా చదువుకుంటున్నాను కూడా!

ఉద్యమం హింసా మార్గం పట్టడం, సాటి తెలుగువారిని ఆంధ్రా వారనే పేరుతో ద్వేషించడం ..దీని గురించే నా వ్యతిరేకత అంతా! ఇక్కడ చాలా మంది అభిప్రాయం కూడా అదే !

ఏ రోజు ఏం జరుగుతుందో తెలీని అభద్రతా భావంలో హైదరాబాదు ప్రజలు (వీరిలో తెలంగాణా వారు కూడా ఎక్కువమందే ఉన్నారు)ఈ రోజు ఉన్నారంటే కారణం ఏమిటో అందరికీ తెలిసిందే!

ఇక్కడ ఉన్న కోస్తా జిల్లాల కుటుంబీకులు తమ వారి సంక్షేమం గురించి ఎంత తల్లడిల్లిపోతున్నారో మీలో చాలామందికి తెలుసు.

బస్సులు,భవనాలు వంటివాటిని తగలపెట్టడం వంటి విధ్వంస కాండకు దిగితే ఉద్యమం పట్ల సానుభూతి ఏర్పడదు.ప్రజా జీవితం అస్తవ్యస్తం కావడం తప్ప!



ఉద్యమం సాగించండి, తెలంగాణా సాధించండి! హింసను, విద్వేషాన్ని విడనాడి...! ఇంతకంటే చెప్పాల్సింది ఏమీ లేదు.

ప్రభాకర్ said...

రాజకీయనాయకుల స్వార్థం ప్రయోజనాల కోసం ,అభం శుభం తెలియని విద్యార్థులు వారి విలువైన జీవితాలను నాశనం చేసుకోవడం, ప్రాణాలు తీసుకోవడం చాల భాద కలిగించే విషయం.

సమీరా వైఙ్ఞానిక్ said...

హ్మ్! ఇప్పుడు ఆంధ్రాలో మొదలైంది గోల.

samaikya said...

@శ్రీధర్ గారూ,
మీరన్నట్లు అదే పరిస్థితి వస్తే నా సోదరుల చేత (మీ మాటల్లో ఇప్పుడే నిద్ర లేచిన పులుల చేతిలో) సంతోషంగా కన్నుమూస్తాను. ఇది సత్యం.

P S Ravi Kiran said...

అస్సలు నాకు అర్ధం కాని విషయం ఒకటి ఉంది. ఇన్నేళ్ళు తరవాత వీడు తెలంగాణా వీడు ఆంధ్రా అని ఎలా తేలుస్తారు? సొంతూరా? పుట్టిన ఊరా? చదివిన ఊరా? ఉద్యోగం చేస్తున్నఊరా? నేను ఎక్కడి వాడినో?

శ్రీధర్ రాజు - చికాగో said...

@Chakravarty and a few others:

You asked if I faced any bitterness... yes, I was refused to be recruited as a Lecturer by SBTET because a few candidates from Guntur and Bhimavaram were able to get recommendations from Ministers and gave more bribes even if they have lesser merit than me. And these jobs are meant for Telangana candidates in Govt Polytechnic Colleges in Telangana area. Along with two other candidates from Telangana, we fought that case for 2 years against government lawyers in the court 1991 and could afford to drag it any further. By then we didn't have Information Right Act and had difficulty obtaining information from officials. I still remember the names of those candidates: Prabhakar Reddy and Hanumantha Rao

And the other two victims are Ravi from Korutla and Bhiman Patnayak from Basara. I don't know where they are right now.

If I recall that incidents - it boils down my blood.

If you want to forget the past then read this recent bitterness -
http://kovela.blogspot.com/2009/12/blog-post_19.html

Please don't think Telangana leaders are sitting quietly without fighting... the dominion rulers know the game of split-n-rule really well. Ministers from Telangana don't have any authority and/or permission to speak-up and support MLAs.

We are living in a fake democracy. Personally I don't like violence - unfortunately it has become the only way to raise the voice now-a-days.

I urge everyone to remain calm and don't criticize anyone or make any provocative comments. Please sit and think about it.

Lakshman said...

సుజాత గారు,
మేరు రాసిన్ మనసులో మాట చదివా. మరి ఆంధ్ర లో కూడా గొడవలు, అల్లర్లు, బస్సులు కూడా తగలపెడుతున్నారు, పగలకోడుతున్నారు. మరి వారు దేని కోసం చేస్తున్నట్టు? ఎవరు చేస్తున్నట్టు. అది ఒకసారి తెలంగాణా వస్తే మాత్రం ఇలాంటి గొడవలు, అల్లర్లు జరగవు. మేము గొడవ చెసది మాకు న్యాయం కోసం. govt జాబ్స్ లలో, infrastrcutre setup జరిగే అన్యాయం. మీరు @ బాగా చూస్తారు కదా. సో, ఒకసారి మేరు ఇంటర్నెట్ లో videos, youtube చుడండి..మాకు ఎంత అన్యం జరుగుతుందో? Real ga చదువుకున్న వారికీ మాకు జరిగే అన్యాయం అర్థం అయతుంది.
jess చెప్పినట్టు మనందరం ఒకటే. తెలుగువాళ్ళం ఒకరే కాదు భారతీయులం కూడా కాదు, అందరం మనశులం. కానీ అది మేమోక్కరమే అనుకుంటే జరగదు కదా. 50 years నుంచి మాకు జరుగుతున్నా అన్యాయం. తెలంగాణా లో వాటర్ లేక, పంట పొలాలను అన్నిటిని real estate వెంచర్స్ చేసి ఉద్యోగాలలు లేక దరిద్రాన్ని అనుభవిస్తున్నాం. మాకు ఎవ్వరి మెడ కోపం లేదు. ఈ ఉద్యమం ఎ రోజు పుట్టింది కాదు.1969 లోనే 300 మంది చనిపోయారు. నెహ్రు గారు కూడా అ నాడే చెప్పారు. ఇప్పుడు కలుపుతున్నాం, కానీ అవసరమున్నప్పుడు విడిపోవచ్చు అని.
అంతే కాదు కెసిఆర్ ఒక్కరే తెలంగాణా కాదు. అయనా అప్పుడే చెప్పారు కెసిఆర్ గారు అప్పుడే చెప్పారు, ఎవ్వరి ఆస్తులకు ఎటువంటి హాని చెయ్యము అని. గొడవల వాళ్ళ తెలంగాణా, ఆంధ్ర కే కాదు india కి investments రావు. సో తెలంగాణా వచ్చాక కూడా Govt, పోలీసు ఉంటుంది...ఎవ్వరి properties కీ హాని జరగకుండా చూస్తారు.

అంతే కాదు నాకు తెలీసన వాళ్ళు గొవ్త్ జాబ్స్ లలో ఉన్నారు. ప్రభుత్వ ఉద్య్గాలలో ఎంత అన్యాయం జరుగుతుందో. మేరు కూడా ఒకసారి @ లో డాకుమెంట్స్, videos చూసి అర్థం చేసుకోండి . మాకు తెలుసు మేకు బాధగా ఉండచ్చు. కానీ తప్పదు.

SIVA said...

Dear Sridar Rajugaru,

As you rightly said,"......violence.......unfortunately it has become the only way to raise the voice now-a-days......" Yes this is root cause for the mob mentatlity to attack and destry. The powers that be although became leaders and ministers never felt part of democracy excepting when its time for elections. They feel that they are specially created to rule like, in the same manner yester years Kings were under the impression.

Normal expression of public opinion with peaceful rallies, protests etc. were always ignored if not dispersed violently by Police.

The fear among people who have native places in Coastal/Rayalaseema areas stem from the violence against Andhra people during Telangana agitation of 1969, whence I very well remember, lorry loads of people started from Vijayawada rushed to Hyderabad, who were rightly and boldly stopped by Policy near Nandigama-Jaggayyapeta and averted a major confrontation and rioting.

After seeing the violence of burning of offices, Buses etc. in Coastal and Rayalaseema areas, its quite clear the phenomenon us universal.

Quite strangely, the same area(Coastal-Rayalaseema)people shouted at the top of their voices for Separate Andhra from Sep.1972 to March,1973 and more than 350 people died in police firings. Eminent people like Tenneti Viswanatham took leadership of the movement. Venkayya Naidu grew up and became as a leader in that agitation. And one Congress leader ditched the agitation as he was lured with the post of Dy CM under Jalagam. Had the separate state was carved out then itself?? what would have been the position now.

Now, same area is going up in flames chanting Samaikya Andhra.

In the history of any state 30 years is just miniscule unit of time. Even within such Samaikya chanters who say if not, we want Kalinga Andhra,we want Greater Rayalaseema. How to understand this?

Jess correctly said we are suffering from "they" and "us" syndrome.

Its time that people with political maturity and more importantly maturity of mind and heart from all areas of the State to sit together and resolve this problem honestly, so that once every 2-3 decades an agitation comes and people of entire state suffer.

SIVA said...

In my above comment, the last paragraph, there is a mistake(WORD NO WAS NOT ADDED) and it should be read as follows:

Its time that people with political maturity and more importantly maturity of mind and heart from all areas of the State to sit together and resolve this problem honestly, so that once every 2-3 decades NO agitation comes and people of entire state suffer.

Murali said...

మీ పోస్ట్తింగ్ బాగుంది. ఒక జనరల్ ప్రశ్న. పిల్లలకు ముద్దు పేర్లు ఉందే సైట్లు గాని , బ్లాగులు గాని మీకు తెలిస్తీ చెప్పండి

satya said...

Educated people like sreedhar raju also looking the problem with narrow lens. In his case a fellow telangana guy who has recommendation and the capacity to bribe would have get the post. Also the andhra guys who got the post will do the same thing to a fellow andhra candidate if the recruitment happens in andhra region. It is not the problem of regions. how can a seperate state ensures a genuine telangana candidate who has the merit will get his post? It is the political system that should change. To change such political system we must be more united than getting divided.

Sreenivas said...

hello....

హైదరాబాదు అభివృద్ధిలో సింహ భాగం పోషించి ఇక్కడ స్థిరపడిన ఆంధ్రులు - ee statement ni khanda - khandaalugaa khandisthunnaa... kevalam ee ANDHRA nundi vacchina valasa prajala vallene HYD develop ayyindi anedi vatti bhutakapu maata. ee maata anemundu oka aatha prabodha chesukondi ...

One more point - TELANGANA poratam ante okka KCR kaadu (we know that KCR is a stupid fellow, but he made our REVOLUTION alive again)... entho mandi PORATA YOUDULU - PORATALA GADDA NAA TELANGANA ki eppudu vimukthi labhinchunoo ...

Jai Telangana

Chandamama said...

సుజాత గారూ,
డిసెంబర్ 5న మీరు రగిలించిన చర్చ ఇంకా కొనసాగుతూనే ఉన్నట్లుంది. బూతులతో సత్కారాలకు గురి కానంతవరకు చర్చ విస్తృతంగా జరగడం ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమే. అయితే పెద్ద మనుషుల ఒప్పందానికి ఎందుకు తూట్లు పడ్డాయన్న విషయం మీద ఇప్పటికయనా దృష్టి పెట్టడానికి బదులు, తెలంగాణా స్వార్థ నేతల మీదో, విద్యార్థుల, ప్రజల హింసాకాండ మీదో చర్చ కొనసాగితే ఈ రావణకాష్టం ఎప్పటికీ ఆరదు.

అన్యాయం జరుగుతూంటే మీ నాయకులు ఏం చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు అనే చర్చ కూడా ఈ సందర్భంగా జరుగుతున్నట్లుంది. మీ బ్లాగులో చర్చకు అది కేంద్రబిందువు కానప్పటికీ ఈ ముఖ్యమయిన విషయాన్ని ఇక్కడ పంచుకోవడం అవసరమనిపించి ప్రస్తావిస్తున్నాను.

ఉమ్మడి ఒప్పందంలో రాసుకున్న వాటిని అమర్చవలసిన బాధ్యత తెలంగాణేతర సీమాంధ్ర ముఖ్యమంత్రుల, నేతలపై ఉండదా? ఒప్పందం అమలుకు రాష్ట్రం ఏర్పడిన తొలి రోజునుంచే తూట్లు పడ్డాయని ఆధారాలు కూడా బలంగా ఉన్నాయి.

'ముఖ్యమంత్రి పదవిలో నేనుండగా ఉమముఖ్యమంత్రి పదవి ఎందుకు దండగ' అని సాక్షాత్తూ నాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి స్వయంగా తోసిపుచ్చారంటేనే ఈ ఉమ్మడి ఒప్పందం ఎంత ఘనంగా అమలయిందో తెలుస్తూనే ఉంది.

అందరూ కలిసి ఒప్పందానికి తూట్లు పొడిచినప్పుడు తెలంగాణా నేతల మీదే నేరం మోపడం సరికాదు. ఒకప్పటి చెన్నారెడ్డి అయినా, నేటి కెసిఆర్, కాంగ్రెస్‌‌ తదితరపార్టీలలోని గోతికాడ గుంటనక్కలయినా, తమకు అన్యాయం జరుగుతోందన్న ప్రజల ఆకాంక్షల బలం ప్రాతిపదికనే ఉద్యమాలను నడిపి సొమ్ము చేసుకుంటున్నారు తప్ప ఇదంతా కేవలం నాయకులు స్వార్థంగా మాత్రమే కొట్టి పారేయకూడదు. తెలంగాణా ప్రజల ఆకాంక్షను బయట ఉన్న ఎవ్వరం కూడా అగౌరవర్చకూడదు.

తెలంగాణాలో జీవన్మరణ సమస్యలకు గురవుతోంది అప్పుడూ, ఇప్పుడూ కూడా ఎల్లయ్య, పుల్లయ్య, రామక్క, సీతక్కలే తప్ప కెసీఆరో దామోదరుడో, వాళ్ల వారసులో కాదు. స్వంత ప్రాంతంలో కూడా మోసానికి, వంచనకు గురవుతున్న వారి సమస్యను ఎలా పరిష్కరించాలి అనే దానిమీదే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది. తెలంగాణాలో నిజమైన బాధితుల సమస్యను పట్టించుకోకుండా కేవలం అక్కడి రాజకీయ నేతల స్వార్థం మీద మాత్రమే బాణం ఎక్కుపెడితే మరింత ఆవేశకావేషాలు పెరగడమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఒరగదు.

ఈ బ్లాగ్ కథనం సారాంశాన్ని విమర్సించడం నా అబిమతం కాదు. 50 ఏళ్లుగా జరుగుతూ వస్తోందని వారంటున్న అన్యాయం, వివక్షతలలో ఎవరి పాత్ర ఎంతెంత ఉంది అనేవిషయం తేల్చకుండా, 'మీ నాయకుల చేతకానితనాన్ని మీరు ప్రశ్నించరెందుకు' అంటూ వారిని దెప్పడం సమస్యకు పరిష్కారం కానేకాదు. అందరూ కలిసి పెంచి పోషించిన ఇప్పటి విద్వేష వాతావరణంలో తెలుగు వారు కలిసిమెలిసి ఉండే కనీస భౌతిక ప్రాతిపదికకే తూట్లు పడింది. కాబట్టి ఇది భావోద్వేగాలకు, ఆవేశ ప్రదర్శనలకు సమయం కాదు.

ఇలా బ్లాగుల్లో, వివిధ వేదికల్లో పరస్పరం ఆరోపించుకుంటే 'ప్రత్యేకతా' సమస్య తీరేది కాదు. మనకన్నా బాగానే అవతల పెద్ద తలకాయలు అబ్బలను, అమ్మలను కూడా వదలకుండా సినిమా చూపిస్తూనే ఉన్నాయి ఉచితంగా.

తెలంగాణా కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, సీమ కావచ్చు వెనుకబడిన ప్రాంతాల భాష, ఆ ప్రజల యాసను కూడా సినిమాలలో వికృతకరించి అపహాస్యం చేస్తూ వస్తున్న మహా సంస్కృతి మనది. నిజంగా ఐక్యంగా ఉండాలనుకునే చోట ప్రజల యాసకు ఇలా అవమానం జరగగలదా? సంవత్సరాలుగా చెల్లుబాటవుతూ వస్తున్న ఈ భాషా వివక్షతకు కారకులెవరో విడమర్చి చెప్పాలా?

ప్రత్యేకించి గత 20 ఏళ్లుగా అభివృద్ధి పేరిట హైదరాబాదులో జరుగుతూ వస్తున్నది నిజంగా ప్రజలకోసమేనా? ప్రజల కోసమే అయితే ఏ ప్రజలు? కంప్యూటర్లమీద మాత్రమే పనిచేయగలిగినవారు, సేద్యం తప్ప మరొకటి ఎరుగని వారు, వృత్తిపనులనుంచి బయటపడలేక మగ్గుతున్నవారు, తాటి చెట్లు ఎక్కడం మాత్రమే తెలిసిన వారు... హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ది వీరిలో ఎవరికి ఉద్దేశించిందో చెప్పగలరా?

అందుకే.. రక్తం రుచి మరిగిన నేతలను, విద్వేషాన్ని పెట్టుబడిగా పెడుతున్న వారిని పక్కన పెట్టి, నిజంగా కడుపుకాలిన వాళ్ల బాధను మరింత సంయమనంగా అర్థం చేసుకుంటే మంచిదేమో.

నా వ్యాఖ్యలో నొప్పించే అంశాలుంటే క్షమించాలి.

Sreenivas said...

Thanks Chandamama Garu,
I second to you. Na Telangana gadda meeda jaruguthunna "jaathi, bhasha" vivakshatani chala baga chepparu.

Thank a lot. I hope, this time we will reach our "FINAL DESTINATION"

Jai Telangana

సుజాత said...

రాజుగారూ,టపా ఉద్దేశం హింసను వ్యతిరేకించడమే కానీ చర్చను "రగిలించడం" కాదు!
శ్రద్ధగా చదివి వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదాలు!

తెలంగాణా గురించి, ప్రజల సమస్యల గురించి కొంచెం అవగాహన ఉంది నాకు! ఉద్యమం తీవ్రమయ్యాక తెలంగాణా వాదులు విస్తృంగా నెట్ లో ఉంచుతున్న లింకులను చదివి మరికొంత అవగాహన పెంచుకుంటున్నాను కూడా!

ఎవరి డిమాండ్లు వారికుంటాయి, ఎవరి వాదనలు వారికుంటాయి. వారి హక్కును ఎవరూ కాదనలేదు. నా టపాలో ముఖ్యాంశం విద్వేష భావనలు-హింస! ఇదే !ఈ రెండూ తెలంగాణా ఉద్యమకార్లు చేసినా, సమైక్యాంధ్ర ఉద్యమకారులు చేసినా వ్యతిరేకించాల్సిందే! దీనివల్ల సామాన్య జనం జీవితాలు ఎంత అభద్రతా భావంలో కూరుకుపోతాయి?

తెలంగాణా నాయకులు, మంత్రులు,లేక ఆంధ్రా నాయకులు మంత్రులు తెలంగాణాని పట్టించుకోకపోతే ఆ కోపాన్ని సామాన్య ఆంధ్రా జనంపై చూపించడం ఏం న్యాయం? ఇదీ నేను అడిగింది.ఇటువంటి అంశం మీద టపా రాసినపుడు చర్చ అనేక వైపుల పాకడం సహజమే!

ఇక్కడ హైదరాబాదులో ఉన్న ఆంధ్రుల పరిస్థితి ఎంత డోలాయమానంగా ఉందో మీరు అర్థం చేసుకోవాలి. కొన్ని చోట్ల మాట తీరుని బట్టి "మీరు ఆంద్రోల్లా"అనే ప్రశ్న(ఊరికే) ఎదురవుతోంది.ఇదివరలో ఇలా ఎవరూ అడగలేదు. బంద్ ప్రకటించారంటే భయంగా ఉంది.

"తెలంగాణాలో జీవన్మరణ సమస్యలకు గురవుతోంది అప్పుడూ, ఇప్పుడూ కూడా ఎల్లయ్య, పుల్లయ్య, రామక్క, సీతక్కలే తప్ప కెసీఆరో దామోదరుడో, వాళ్ల వారసులో కాదు!"

కదా! మరి వారి సమస్యలకు కారణమైన పరిస్థితుల్నో వ్యక్తుల్నో, వ్యవస్థల్నో,ప్రభుత్వాన్నో ప్రశ్నించాలి తప్ప వెంకటేశ్వరరావుమీదో, శ్రీనివాస శాస్త్రి మీదో,సుబ్రహ్మణ్యం మీదో విరుచుకుపడటం ఏమిటి? ఎవరిమీద కోపం ఎవరిమీద చూపిస్తారు?

కలిసి సామరస్యంగా ఉండటం అనేది ఇకపై సాధ్యం కాని విషయం! ఆ మేరకు విద్వేషాలను రగిలించడంలో నాయకులు సఫలీకృతం అయ్యారు.

ఏమి జరగనున్నదో దానికి సిద్ధంగా ఉండటమే చేయాల్సిన పని! ప్రభుత్వ నిర్ణయం కోసం ఎఉదురు చూడటం!

Chandamama said...

సుజాత గారూ,

"మీరు రగిలించిన చర్చ ఇంకా కొనసాగుతోంది" అనడంలో నా ఉద్దేశం పాజిటివ్‌గానే ఉందనుకున్నాను. ఉద్యమం వెనుకాల హింసపై మీ మనోభిప్రాయాన్ని చాలామంది అటూ ఇటూగా అందుకుని చర్చలో పాల్గొంటున్నారు అనే నా ఉద్దేశం... కానీ చర్చను రగిలించడం అంటే నిప్పురాజేయడం అనే అర్థం కూడా ఉందని భావించలేకపోయాను. అప్పటికే రాత్రి గం.2.40లు కావడంతో వ్యాఖ్య రాయడం పూర్తయ్యాక మళ్లీ ఓ సారి చూసుకోలేదనుకుంటాను. కాబట్టి మరోలా అనుకోవద్దు.

"తెలంగాణా వాదులు విస్తృతంగా నెట్‌లో ఉంచుతున్న లింకులను చదివి మరికొంత అవగాహన పెంచుకుంటున్నాను కూడా"
చాలా మంచి ఆత్మపరిశీలన. ఇప్పుడు మనందరమూ చేయవలసిన పని ఇదే. పత్రికలలో, నెట్‌లో విపరీతంగా వస్తున్న సమైక్య, వేర్పాటు వాదాల సాహిత్యాన్నిఅధ్యయనం చేయడం, గత 50 ఏళ్లలో ఏం జరిగింది అనేది నిష్పాక్షికంగా అంచనా వేయడం. అంతకు మించి వ్యక్తిగత ఆవేశకావేషాలకు దిగకుండా అందరం సంయమనం పాటించడం. ఇవే ప్రస్తుతం ఎవరైనా ఆశించదగినవి.

కాని చాలామందికి ఈ బాటలో నడవడం ఇష్టం లేనట్లుంది. రాజకీయనేతలనుంచి కిందివరకు అందరూ రెచ్చగొట్టడం, రెచ్చిపోవడంలోనే ఆనందం పొందుతున్నట్లుంది.. ఇలాంటి పరిస్థితుల్లో హింస ప్రేరేపించబడ్డాక దానికి మంచి చెడు విచక్షణ ఉంటుందని, ఉండాలని అనుకోవడం కూడా భ్రమే.

ఇక్కడే మీ స్పందనను, ఆవేదనను పంచుకుంటున్నాను. విద్వేషాగ్ని ఇంతగా ప్రజ్వరిల్లిన తర్వాత హైదరాబాద్ నగరంలో మీ వంటి వారి పరిస్థితి నిజంగానే బాధ కలిగిస్తోంది. ప్రజాందోళన హింసాత్మకంగా మారి ధ్వంసరచన తప్పని నేపథ్యంలో ఏ వాదానికీ అనుకూలంగా లేకపోయినా, మీ మానాన మీరు బతకాలన్నా సాధ్యం కాదు. మీకారు, మీ గుర్తింపు, మీ మాటతీరు కూడా మీ ఉనికికి ప్రమాదం కలిగించే వాతావరణం ఇప్పుడు హైదరాబాద్‌లో ఉందనడంలో సందేహం లేదు.

అణగారిన ప్రజలు మాత్రమే ఈ తరహా హింసాచర్యలకు పాల్పడి ఉంటే పోలీస్ యంత్రాంగానికి దాన్ని అణిచివేయడం చిటికెలో పని. కాని ఇక్కడ సమస్త పాలకవర్గం మొత్తంగా ఈ ఆందోళనలో వెనుకనుంచి, ముందునుంచి పొగ రాజేస్తుండటంతో పోలీసు యంత్రాంగం నిర్వీర్యమయినట్లు కనిపిస్తోంది. రాజ్యవ్యవస్థ పాక్షిక స్వభావం కూడా ఇక్కడే మనకు బాగా అర్థమవుతుంది.

జై ఆంధ్ర ఉద్యమంలో, ముల్కీ జిందాబాద్ ఉద్యమంలో వందలాది మందిని పిట్టలు కాల్చినట్లు కాల్చిన ప్రభుత్వ వ్యవస్థకు ఇలాంటి ఉద్యమాలను అణచడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఢిల్లీ అధినాయకత్వంతో సహా రాష్ట్ర పాలకవర్గం మొత్తంగా ప్రస్తుతం ఆత్మ -లేదా స్వచర్మ- రక్షణలో పడిన నేపథ్యంలో ఆందోళనను, హింసను బలప్రయోగంతో అణచివేయడం సాధ్యం గాని పరిస్థితి ఏర్పడింది.

ఇప్పుడుకూడా తెలంగాణా సమస్యకు మూడు మార్గాలు ఉన్నాయి. వేలాది బలగాల సహాయంతో ఉద్యమహింసను అణచివేయడం, -దీనివల్ల సమస్య మరికాస్త పొడిగించబడుతుందంతే- రెండు. రాష్ట్ర విభజనకు ప్రత్యామ్నాయంగా అన్ని ప్రాంతాల అభివృద్ధికి భారీ ప్యాకేజీలను ప్రకటించి కేంద్రమే అందరికీ నచ్చచెప్పే ప్రయత్నం చేయడం, మూడోది. రాష్ట్రాన్ని ముందు 'రెండు'గా విడగొట్టడం. ఈ మూడింటిలో దేనికీ 'సమయం' ఇంకా ఆసన్నం కానట్లుంది. కాబట్టి మీలాంటివారు ఈ నిత్య భయాందోళనల్లో ఇంకొంతకాలం మగ్గవలసిందే.

"సమస్య ఎల్లయ్య, పుల్లయ్య, రామక్క, సీతక్కలదే అయినప్పుడు అందుకు కారణమైన పరిస్థితులను, వ్యక్తులను, వ్యవస్థలను ప్రశ్నించాలి తప్ప రావు, శాస్త్రి, మీద విరుచుకుపడటం ఏమిటి" చాలా మంచి ప్రశ్న. ఇక్కడ కూడా 'కోటీశ్వర' రావులపైనా, 'లక్షాధిపతి' శాస్త్ర్ర్రిలమీద పడలేరండీ. తాత్కాలికంగా దెబ్బతిన్నప్పటికీ, వారి రక్షణ గోడలు వారికుంటాయి. భయపడవలసింది మీలాంటి మనలాంటివారే...

అందుకే మీకు సానుభూతి చెబుతున్నా. తెలంగాణా తెలుగులకు ఆంధ్రా తెలుగులు శత్రువులు కానప్పటికీ, విద్వేషాగ్ని పరాకాష్ట చేరిన తర్వాత ఏమరుపాటుగా ఉంటే, ఎలాంటి సంబంధం లేనివారికే దెబ్బలు ఎక్కువగా పడటం ఏ కాలంలో అయినా వాస్తవమే. జై ఆంధ్రలో, ముల్కీ జిందాబాద్‌లో, ఇప్పుడు సమైక్యాంధ్ర, జై తెలంగాణాలో ఒక్క రాజకీయ నేత లేదా సంపన్నుడు లేదా వారి వారసులు ప్రాణాలు కోల్పోయిన ఘటన జరగలేదు. నోరు పారేసుకునేది, వీధుల్లోకి వచ్చేది, ఘర్షణలకు దిగేది, కాల్పులకు గురయ్యేది. ఇటూ, అటూ కూడా సామాన్యులే..

అందుకే మీరు క్షేమంగా ఉండాలనే కోరుకుంటున్నాము. మరింత విధ్వంసం జరగదని, జరగకూడదనే ఆశిస్తున్నాం. ఎప్పుడేం జరుగుతుందో తెలియని ఉద్రిక్తత మళ్లీ ఏర్పడుతోంది కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండండి. ఇవి రాష్ట్రం బయటినుంచి పలుకుతున్న ఆప్తవాక్యాలే అనుకోండి. ఇంతకుమించి ఎవరూ ఏమీ చేయలేరు కూడా..

మీ బ్లాగ్ స్పేస్‌ను మళ్లీ దుర్వినియోగం చేస్తున్నట్లుంది. స్పేస్ సమస్యతో ఇది పోస్ట్ కాకపోతే మీ పర్సనల్ మెయిల్‌కే పంపిస్తాను.

రాజు
blaagu.com/chandamamalu

M Vani said...

http://www.youtube.com/watch?v=iKxILa40ML0&feature=related

http://www.youtube.com/watch?v=fkTVQfiwEoU&feature=related

http://www.youtube.com/watch?v=jT0_hs_TgF8&feature=related

Watch them thoroughly before judging someone.

Lakshman said...

Sujaa garu,

మీకు place ఉందని బాగానే పెద్ద వ్యాసం రాసారు బాగుంది కానీ.మీరు ఒక్కసారి హరీష్ రావు Assembly లో ఇచ్చిన స్పీచ్ చుడండి. moreover తెలంగాణ అంటే KCR ఒక్కరే కాదు. ఆయన తాగుతున్దచ్చు, మనం ఎవ్వరు తాగామా? మరి 2001 lo YSR తెలంగాణా కావాలని అందరి MLA, MP లతో కలిసి సంతకాలు తీసుకోని కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు లేకలు ఇచ్చాడునిజమగా అన్యాయము జరగపోతే? మీరు facebook, orkut తెలంగాణా profiles కి వెళ్లి చూస్తున్నారు కదా. మీకు చాలా Pdf, word documents దొరుకుతాయి. అందరు ఎందుకు separate వద్దు అంటున్నారో ఒక్క కారణం కూడా ఇవ్వ్వలేదు, ఒక్క తెలంగాణ ఉద్యమాన్ని విమర్శిచడం తప్ప. కానీ తెలంగాణా వాళ్ళు వంద కారణాలు చూపిస్తారు ఎందుకు కావాలో.
కొందరు చెప్పారు, తెలంగాణా లో కొందరు సమైక్య ఆంధ్ర కోరుకుంటున్నారు అని మరి ఆంధ్ర లో లేరు అంటారా separate రాష్టం కావాలని కోరుకునే వాళ్ళు..ఉన్నారు మీరు regular గా వార్తలు follow అయ్యి ఉంటె మీరు చూసే ఉంటారు. మేము అందరు ఆంధ్ర వాళ్ళు అన్యాయం చేసారు అని అనడం లేదు, తెలగాణ పోరాటం ఆంధ్రా ప్రజల మీద కాదు, ఆంధ్రా పాలకుల మీద మాత్రమే.

తెలంగాణా వచ్చిన తరువాత ఆంధ్రా వాళ్ళను వేల్లగోడుతారు అని అనుకోవడం తప్పు. ఎ విషయం చదువుకున్న వాళ్ళు బాగా అర్థం చేసుకుంటారు. ఈ ఉద్యమం లో కొందరి ఆస్తులు ద్వంసం చెయ్యడం ఏదో ఆవేశం లో అంటే…Example, సమైక్యాంధ్ర ఉద్యమం లో ఆంధ్రా ప్రజలే ఆంధ్రా లో తమ వాళ్ళ ఆస్తులు ద్వంసం చెయ్యడం చేసారు. అంటే తప్ప ఏదో అందరిని వెళ్ళగొట్టాలని కాదు.

తెలంగాణా వాళ్ళు ఒక్కరే మనం తెలుగు వాళ్ళు అనుకుంటే సరిపోదు కదా..అందరు అనుకోవాలి.

మరి మీరు ఇంటర్నెట్ లో posts చూస్తున్న అని చెప్పారు కదా..మరి మీ ప్రస్తుత అభిప్రాయం కూడా మళ్ళి ఒక కొత్త post లో రాయండి. ఎందుకంటే చాలా మంది కామెంట్స్ అన్ని చదవరు కదా..

lakshman said...

@subbarao garu,

మీరు అన్నట్టు హైదరాబాద్ లో చాలా రాష్టాల వారు ఉన్నారు. కానీ వారు ఎవ్వరు తెలంగాణా వాళ్ళకి అన్యాయం చెయ్యడం లేదు.
మేము అందరు ఆంధ్ర వాళ్ళు అన్యాయం చేసారు అని అనడం లేదు, తెలగాణ పోరాటం ఆంధ్రా ప్రజల మీద కాదు, ఆంధ్రా పాలకుల మీద మాత్రమే.

మేము ఎవ్వరిని కూడా వ్యాపారాలు చెయ్యద్దు అనడం లేదు. మాకు అన్యాయము చెయ్యద్దు అంటున్నాం అంటే.
@SP jagadesh garu,
తెలంగాణా అంటే KCR ఒక్కరే కాదు, తెలంగాణా form అయ్యాక KCR ముఖ్యమంత్రి అని ఎవరు చెప్పలేదు. మీరు ఇంకొకటి చూడాలి ఇక్కడ, ఆస్తుల ద్వంసం కేవలం తెలంగాణా లోనే కాదు, ఆంధ్ర లో కుడా జరిగాయి. మీరు చెప్పిన సమేత బాగుంది కానీ ఇక్కడ అసలు అది సందర్బం కనే కాదు, ఎందుకంటే కెసిఆర్ కానీ ఇంకెవ్వరు కానీ ఇక్కడ ఏదో దాచం అని ఎవ్వరు చెప్పలేదు. మాకు లేకనే మేము ప్రత్యెక రాష్టం కోరుకుంటున్నాం.
@స్వర్నమాలిక గారు,
హైదరాబాద్ ఒక్కటే తెలంగాణా కాదు, మేము మాట్లాడేది Hyd లో ఉండే software, బిజినెస్ జాబ్స్ గురుంచి కాదు. గవర్నమెంట్ ఉద్యోగాల గురుంచి అధికారం కోసం అని మీరు గమనించాలి ఇక్కడ. ఇంకొక్కటి ఈ పోరాటం ఆంధ్ర నాయకుల మీద మాత్రమే. ఈ ప్రజల మీద కాదు.
@te.thulika,
మీరు ఒకసారి history చదవాలి. పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశ్ కోసం కాదు ఆంద్ర రాష్టం కోసం.
@సుజాత గారు,
"తెలంగాణా ప్రజల సమస్య గా కంటే రాజకీయ నాయకుల సమస్యగా మారిందన్న విషయం నేనెప్పటినుంచో నమ్ముతున్న విషయమే!నిజంగా ప్రజలే ఉద్యమిస్తే తెలంగాణా సమస్య ఎప్పుడో పరిష్కారమయ్యేది కాదా!"
కానీ అసలు మాకు అధికారం ఇస్తే కదా..పెత్తందారులు అందరు ఆంధ్ర నాయకులే. ఇక ఎవరు వింటారు? 1969 లో 400 మంది చనిపోయారు, మరి అది రాజకీయ పోరాటమా?

ఆంధ్ర లో buses తగలపెటిన వాళ్ళకి ఎంతమందికి తెలుసు తెలంగాణా కి జరుగుతున్నా అన్యాయం గురుంచి.

srinu said...

సుజాత గారు

మీ విష్లేషన ఒక వైపుగా మాత్రమే ఉంది
అంద్రావాల్ల గురించి మీకేం తెలుసండి, పక్కనున్న పాకిస్తాన్ వాడ్నైనా నమ్మొచ్చు కాని ఆంద్రవాల్లు అంతకంటే ఘోరం. మాది కరిమ్నగర్ లొ ఒక టౌన్ మా ఇంటి పక్కన అంతా అంద్రవాల్లె

మా భాషను వెక్కిరిస్తరు, మాయాసను వెక్కిరైస్తరు, మా తిండిని , అన్నిటిని వెక్కిరిస్తారు
హేలనగా మత్లదుతరు, మీకు తెలివుంటే మేమింత దూరం వఛ్ఛెవల్లం కాదు అంటారు.

మాకు సంస్కుతి సాంప్రదయలు తెలువవంట. చెప్తే అదొక కాలపాని
ఇప్పుదు సిగ్గుతో తల దించుకుంటుద్రు

ఇక్కడ జరుగుతున్నది మాతెలంగన మాకివ్వమనే

ఇంతా సమైక్య వాదులు ఆ మదరసు పక్కలొ ఎందుకుండలేదు ,

నేనూ ఒక నాన్-రెసిడెంట్ ఇందియన్ని,బట్ తెలంగనలో ఎవడైన బతుకొచ్చు కాని తెలంగన మీద హక్కు మాత్రం తెలంగనా వాడిదే

స్వంతఊరి కోసం బ్లాగులు పెట్టుకోవచ్చు , కాని తెలంగన వాల్లు మాత్రం తెలంగన అనకుడదు

సినిమ రంగంలో, వ్యపరల్లొ, పత్రికల్లొ, రాజకియల్లొ, అది ఇది అని కాదు అన్నిట్లో దోచుకొన్నరు

పొట్టకూటి కోసం మేము దుబై పొతున్నం
అప్పటికి పెల్లాల్ని విడిచి దుబై పొతారు అనుకుంటూ నవ్వుతారు

మేము ఉద్యమం చెస్తలేము , అంద్రవాల్ల చేత చేయించబదుతున్నం ,
ఒక కే .సి. అర్ పిలిస్తే ఎవ్వడు రాడు. మాలోని అవేదనకి కే .సి. అర్ గొంతు కలిపిండు
సుజత గారు ఇప్పటికైన మా ఆవెదన ఎందుకో అర్ధం చేసుకొంది

అత్మీయురాలిగ మిగిలి పోండి

Post a Comment