90 ల్లో కొలొనియల్ కజిన్స్ పేరుతో వచ్చిన ఆల్బమ్ లో ఈ కీర్తన ని హరిహరన్ లెస్లీ లూయిస్ తో కలిసి పాడినపుడు ప్రతి సంగీతాభిమానినీ ఉర్రూతలూగించింది. వ్యాసతీర్థుల వారు రచించిన ఈ కన్నడ సంకీర్తనలో చిన్ని కృష్ణుడి సౌందర్యాన్ని వర్ణిస్తూ రారమ్మని పిలవడం జరుగుతుంది.
కొలోనియల్ కజిన్స్ ఆల్బం తర్వాత ప్రతి శాస్త్రీయ సంగీత కచేరీలోనూ "కృష్ణా నీ బేగనే బారో" తప్పనిసరై పోయిందిట.
ఆ ఆల్బం లో లెస్లీ, హరి హరన్ లు ఇద్దరూ అద్భుతంగా పాడారు. ఇంగ్లీష్ సాహిత్యం కూడా భలే ఉంటుంది. ఏ కాలానికైనా సరిపోయేట్టుగా ! ఇదిగో చూడండి....
Krishna nee begane baro
Krishna nee begane baro
Darkness coming round
And everybody fighting with their brothers
Everybody wants control
Don't hesitate to kill one another
So come back as Jesus
Come back and save the world
That's all the future
Of every boy and girl
Come back as Rama
Forgive us for what we've done Come back as Allah
Come back as anyone
Krishna nee begane baro
krishna nee begane baro
Religion is the reason
The world is breaking up into pieces
Colour of the people
Keeps us locked in hate please release us
hmm..
So come down and help us
Save all the little ones
They need a teacher
And you are the only one
We can rely on
To build a better world
A world that's for children
A world that's for everyone
Krishna nee begane baro
Krishna nee begane baro
Time is the healer
Time moves on
Time don't wait for anyone
You tell you'll be back
But that will take some time
I'm waiting...
ahh......
I'm waiting...
Waiting...
I'm waiting...
I'm waiting
Yea.... Yea...
Come back as Jesus
Come back and save the world
We need a teacher
You are the only one
Come back as Rama
Forgive us for what we've done
Come back as Allah
Come back as anyone
Krishna nee begane baro
Krishna nee begane baro
Jesus!
Come back and save the world
That's all the future
Of every boy and girl
Come back as Rama
Forgive us for what we've done
Come back as Allah
Come back for everyone
Govinda bolo hare Gopal bolo...
వీడియో కూడా చాలా నచ్చింది నాకు!
ఆ మధ్య హైదరాబాదు లో హరిహరన్ లైవ్ షో జరిగినపుడు ఈ పాట పాడాలని కోరగానే వెంటనే పాడాడు. మామూలుగా అయితే చివర్లో I'm waiting.." తో పాట పూర్తవుతుంది.
లైవ్ లో I'm waiting.."అంటూ హరిహరన్ నెమ్మదిగా గొంతు తగ్గిస్తూ వెళ్ళి కూచోగానే percussionist(పేరు తపన్ ఘోష్ అని గుర్తుంది ....)అందుకుని దాదాపు 35 నిమిషాల సేపు రకరకాల బీట్స్ తో ఒక ఆట ఆడుకున్నాడు ప్రేక్షకుల్ని! ఎంతగా అంటే ఆ పాట హరిహరన్ మొదలెట్టాడని అందరూ మర్చిపోయేంతగా!
అంతా ఊపిరి బిగపట్టి ఆ బీట్స్ లో లీనమైపోయి ఉండగా చివర్లో హటాత్తుగా హరిహరన్ వచ్చి "I'm waiting" అని అందుకునేసరికి ఉలిక్కిపడి తెప్పరిల్లిన ప్రేక్షకుల నుంచి చప్పట్లు కుంభవృష్టిగా కురిశాయి.
ఈ పాట ను శ్రీ కృష్ణ దర్శనం ఆల్బమ్ కోసం ఉన్ని కృష్ణన్ పాడిన వెర్షన్ ఇక్కడ. వినండి.
"బారో..." అనడంలో ఎంత లాలన, గారాబం పలికిస్తాడంటే బాల కృష్ణుడు వెన్న చేతిని నాక్కుంటూ
పరుగెత్తుకు రావలసిందే! (ఉన్ని కృష్ణన్ గురించి ఒక టపా రాయాలి)
కద్రి గోపాలనాథ్ గారి శాక్సో ఫోన్ లో ఇక్కడ .వినండి!
February 22, 2010
February 13, 2010
ఈ బలవంతపు పెళ్ళిళ్ళకు విలువెంత?
ప్రేమ రోడ్డెక్కి చాలా రోజులైంది. అంతకు మించి ఈ మధ్య ప్రేమ మరీ బహిరంగ కార్యకలాపమై పోయి గర్వంగా పబ్లిక్ ప్లేసుల్లో పరుగులెత్తడం మొదలెట్టి కూడా చాలా రోజులైంది.
"ప్రేమకు పరాకాష్ట(లేదా గమ్యం) పెళ్ళి కాదు" అనే చాలా మంది అభిప్రాయం! వీరితో నేను వాదించబోవడం లేదు.
చల్లని సాయంకాలం ఏ ఇందిరా పార్కో, టాంక్ బండో,నెక్లెస్ రోడ్డో పిల్లలతో కలిసి పోయి కాసేపు మురుక్కాలవ మీదనుంచి వచ్చే మలయ మారుతం ఆస్వాదించాలనుకుంటే కుటుంబాలు చచ్చేంత భయపడే దృశ్యాలు కళ్ళబడతాయి! తల ఎటు తిప్పుదామన్నా ఛాయిస్ లేదు. దుర్గం చెరువు వైపు పొరపాటున ఏ వీకెండో వెళితే... శివ శివా! సెన్సార్ వాళ్ళు కట్ చేసిన సీన్లన్నీ అక్కడ కనపడతాయి.
దీనికి కారణమేమిటని ఇప్పుడు బాధపడి లాభం లేదు. గ్లోబలైజేషనూ, వివిధ సంస్కృతుల కలయికగా మారిన నగరాలు,కాల్ సెంటర్లూ(ఇవొకటి పాపాల భైరవులు పాపం),ఎక్కడ ఏం చేస్తున్నారో కూడా చూడకుండా పిల్లలకు దండిగా డబ్బులిచ్చే తల్లి దండ్రులూ...ఒకటా రెండా.. కర్ణుడి చావుకున్నన్ని కారణాలు! మొత్తంగా కళ్ళముందే మారిపోయిన సమాజ ముఖ చిత్రం!
వాళ్లెవరో సమాజ పరిరక్షకులు ప్రేమికుల దినం రోజు జంటగా రోడ్డుమీద కనపడిన ప్రేమికులకు పెళ్ళిళ్ళు చేసి పారేస్తామని బెదిరింపు జారీ చేశారు. బానే ఉంది ప్లాన్!
వీళ్ళమీద నాకు దురభిప్రాయం ఏమీ లేదు గానీ కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు వస్తున్నాయి.
బాబూ, ...ప్రేమికుల రోజు మన సంస్కృతి కాదు...నిజమే! ఇంకా మన సంస్కృతి కాని అనేక అంశాలు, ముదనష్టపు విషయాలు అనేకం మన సంస్కృతిలో భాగమైపోయాయి. మీకు ఏ డిసెంబర్ 31 న పబ్బుల్లో అమ్మాయిలు కనపడినపుడో,ఏ ప్రేమికుల దినం రోజు రోడ్లమీద జంటలు కనపడినపుడో ఈ సంస్కృతీ పరిరక్షణ అర్జెంటుగా ఎందుకు గుర్తొస్తుంది? ఏడాదంతా మీరేం చేస్తుంటారు? మీ కార్యకలాపాలేమిటి? ఏదో ఒక రాజకీయ పార్టీకి ఒకానొక శాఖగా ఉండటమేనా?
పిజ్జాలు,బర్గర్లు,మల్టీప్లెక్స్ లు మన దేశానికి కొట్టుకొచ్చినపుడు "ఇది మన సంస్కృతి కా"దని ఎందుకు ఉద్యమాలు చేపట్టలా మీరు?(మీలో ఎంతమంది పిజాలు , బర్గర్లు తినని వారున్నారోమరి)
"ఇదీ మన సంస్కృతి గొప్పదనం"అని యువతరానికి తెలియజెప్పే కార్యాచరణ ప్రణాళిక ఏనాడైనా చేపట్టారా మీరు?
భారతీయ సంస్కృతి లో శీలానికెంత (శీలమంటే సత్ప్రవర్తన అని అర్థం చేసుకోండి దయచేసి) ప్రాముఖ్యం ఉందో కాలేజీల్లోనూ,యువత ఎక్కువగా ఉండే ఇతర ప్రదేశాల్లోనూ చాటే కార్యక్రమం ఏదైనా ఇంతవరకూ అమలు చేశారా?ఇకముందు చేసే ప్లాను ఏదైనా ఉందా?
"సంస్కృతి"ని ఏమని నిర్వచిస్తారు మీరు?
"మీది టైమ్ పాస్ వ్యవహారమైతే నాలుగ్గోడలమధ్యా ఉంచుకోండి.వీధినపడొద్దు"అని ఏ జంటకైనా చెప్పి చూశారా మీరు?
గాలితో పాటు కొట్టుకుపోయే ఎంగిలాకుల్లా తయారైన కొద్ది శాతం యువతని,వెర్రి తలలు వేస్తున్న వారి అశ్లీల సంస్కృతిని కళ్ళారా చూస్తూ ఏడాదంతా కూచుని ఫిబ్రవరి 13 రాత్రి హఠాత్తుగా నిద్ర లేచి జూలు విదిలిస్తారన్నమాట!
మీ వాదన ఒప్పుకుంటాను!
ప్రేమ అన్న పదానికి తలవంపులు తెచ్చేలా చాలామంది ప్రవర్తిస్తున్నారు.
ఇక్కడ మీకు ఒక విషయం స్పష్టంగా అర్థం కావడంలా?
వాళ్ళ ప్రేమలో సీరియస్ నెస్ లేదనీ, అది టైమ్ పాస్ వ్యవహారమనీ తెలీడంలేదా?
ప్రేమ మీద గౌరవం లేనివాళ్ళు మీరు చేసే బలవంతపు పెళ్ళిని గౌరవిస్తారా?
మీరటు పోగానే ఆ పెళ్ళినీ విదిలించి అవతల పారేస్తారు తప్ప పాతకాలపు తెలుగు సినిమా హీరో హీరోయిన్లలా సూత్రాలు కళ్లకద్దుకుని పారా,తట్టా నెత్తినపెట్టుకుని పొలం పని చేసుకుంటూ పాట పాడుకోరు.
అంటే , ప్రేమికులకు బుద్ధి చెప్పి సంస్కృతిని రక్షించబోయి చివరికి మీరు చేసే నిర్వాకం ఏమిటంటే భారతీయ వివాహ వ్యవస్థకు అవమానం తెచ్చి పెట్టడం. !
అయ్యవారిని చెయ్యబోతే కోతి అయిందంటే ఇదేనేమో!
ఇంకో మాట!
పేమంటే ఒకరి సాహచర్యాన్ని, సాన్నిహిత్యాన్ని మరొకరు కోరుకోవడం! ఈ సాన్నిహిత్యం జీవితాంతం కావాలని కోరుకునే సీరియస్ ప్రేమికులు కూడా ఉంటారు. జీవితంలో స్థిరపడ్డాక పెళ్ళి చేసుకుని టెన్షన్ లేకుండా జీవించాలనుకునే వారుంటారు. వారి ఉదాత్త ప్రేమను గుర్తించరా? వారిక్కూడా మీకిష్టమైనపుడే పెళ్ళా? అందర్నీ ఒకే గాటన కట్టి పోలోమని పెళ్ళి పెద్దలుగా అవతారమెత్తితే సరిపోయిందా?
అసలు ప్రేమించుకున్న వాళ్ళంతా పెళ్ళి చేసుకుని తీరాలా అని ప్రశ్నించింది ఒక మీడియా ఛానెల్ ఇవాళ పొద్దున!
ఈ బలవంతపు పెళ్ళిళ్ళ వల్ల మీకొరిగేదేమిటి? రోడ్లమీద జనానికి వినోదం,యువతీ యువకులు భయభ్రాంతులు కావడం తప్ప? ప్రేమించుకున్నవాళ్ళు ఒకరోజు కలుసుకుని బహుమతులిచ్చుకుంటే నష్టమేమిటి?
కాబట్టి, మీకు డబ్బులెక్కువుంటే కనీసపు పెళ్ళి ఖర్చు పెట్టుకోలేని పేదవారెవరైనా ఉంటే వారికి పెళ్ళి చేయించి నాలుగు అక్షింతలు వేయండి!
పెడదారి పట్టిన పిల్లలకు నచ్చజెప్పే పద్ధతి, బుద్ధి చెప్పే పద్ధతి ఇది కాదు! కురుపు లేస్తే దానికి మూలకారణం ఎక్కడుందో వెదికి యాంటీ బయాటిక్ వాడాలి కానీ,కురుపు బారినపడ్డవారిని వేపమండలు తీసుకుని బాదడం కాదు మీరు చేయాల్సిన పని.(చిత్రంగా...యాంటీ బయాటిక్ విదేశీ, వేపమండలు స్వదేశీ...)
పౌరోహిత్యం మీరు చేయాల్సిన పని కాదు కానీ బుద్ధిగా మీ పన్లు మీరు చూసుకోండి!
హాపీ వాలంటైన్స్ డే ప్రేమికులూ!
February 10, 2010
అందమైన ఫొటోలు !
photography is all about timing! నిజమే అని ఈ ఫొటోలు చూసి ఒప్పేసుకోవాలి!
ఫొటోగ్రఫీ అంటే నాక్కూసింత సరదానే! డిజిటల్ కెమెరా కాదని , ఎస్సెల్లార్ లో ఫిల్మ్ రోల్స్ చాలా తగలేస్తూ ఉంటా. కాసిన్ని మంచి ఫోటోలు కూడా తీశాను. తర్వాతెప్పుడైనా చూపిస్తాలెండి!
నా బ్లాగు క్రమం తప్పక చదివే ఒక ఫ్రెండ్ ఈ ఫొటోలు నిన్న పంపారు నాకు. అద్భుతమనే మాట చాలదు.
ఇంత పవర్ ఫుల్ కెమెరా కొనడానికి ఎంతవుతుందో , నేనెప్పుడు కొంటానో, నాకెప్పుడు ఇంత స్కిల్ వస్తుందో..ఏమిటో..అంతా మాయ!
.ఈ ఫొటోలు ఇంతకు ముందు మీరు చూసుంటే సరే, చూడకపోతే ఒకసారి .......!
ఫొటోలు పంపిన ఫ్రెండ్ కి థాంక్యూలు!
I'm a disco dancer....!
ఎంతైనా అమ్మ వొడి భలే వెచ్చగా ఉంటుంది కదండీ!
ఏమిటింతాలస్యం? ఆకలి దంచేస్తోంది
There is no excuse for lazyness here! But I'm working on that!

అద్దిరా దెబ్బ! జాక్ పాట్ కొట్టానివ్వాళ!
అమ్మతోటే ఉంటాము.. అమ్మ మాటే వింటాము!
బాబోయ్, అరుపులా ఆవలింతలా?
నేనూ మీతోనే ఉంటా..!
ఆవురావురు...!
Mow, Curly, and Larry..the three stooges!
తువ్వాయి తువ్వాయి...!
కాసేపు పిచ్చాపాటీ కబుర్లాడుకుందాం!
వదల బొమ్మాళీ వదల!
సెలవుల్లో సరదాగా జిమ్నాస్టిక్స్ నేర్చుకుంటున్నా!

ఎంత ముద్దొస్తున్నావో తెలుసా! హు, మా పిల్లలూ ఉన్నారు, ఇంతింత మెడలేసుకునీ....

ఇట్నుంచి తీసినా వస్తుందా పొటిగరాఫు?
అమ్మతోటే ఉంటాము.. అమ్మ మాటే వింటాము!
బాబోయ్, అరుపులా ఆవలింతలా?
నేనూ మీతోనే ఉంటా..!
ఆవురావురు...!
Mow, Curly, and Larry..the three stooges!
తువ్వాయి తువ్వాయి...!
కాసేపు పిచ్చాపాటీ కబుర్లాడుకుందాం!
వదల బొమ్మాళీ వదల!
సెలవుల్లో సరదాగా జిమ్నాస్టిక్స్ నేర్చుకుంటున్నా!

అయ్యో పప్పోతున్నా! హెల్ప్ హెల్ప్!
వీళ్ళమ్మ షాపింగ్ నుంచి వచ్చేదాకా బుజ్జి ముండ నా దగ్గరే ఉంటుందిలెండి!

నేనూ నేర్చుకుంటా, ఫుడ్డు సంపాయించుకోడం!
ఆటాడుకుందాం రా !
February 3, 2010
"మనిషి" ఇంకా చావలేదు.
మూడు రోజుల వ్యవధిలో ఒక పచ్చని కుటుంబం మనమంతా నిర్ఘాంతపోయి చూస్తుండగానే కుప్పకూలిపోయింది.దుఃఖ తీరాన దీనంగా నిలిచింది.
వైష్ణవి ని చంపిన తీరు, ఆమె తండ్రి మరణం ఇవన్నీ మనల్ని అందర్నీ కదిలించి వేశాయి. కన్నీళ్ళు పెట్టేలా చేశాయి.హంతకుల్ని ఉరితీయాలని కొందరు, నరికి ముక్కలు చేయాలని కొందరు, చెప్పుతో కొట్టి ఊరంతా తిప్పాలని కొందరు, పెట్రోలు పోసి తగలెట్టాలని కొందరు, పాపను వేసిన బాయిలర్లోనే వేసి కాల్చాలని కొందరు ... టీవీల్లో కూడా సామాన్య ప్రజలు ఆవేశం, ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. "అవును, వాళ్లనలాగే శిక్షించాలి" అని నాకూ అనిపించింది.
ఇక మీడియా ఛానెళ్ళ సంగతి చెప్పక్కర్లేదు. "చేతులు ముడుచుక్కూచున్న మా ఖాకీల్ని క్షమించమ్మా" అని కవిత్వం ఏడుపు గొంతులు పెట్టి మరీ ఒలకపోశారు. అసలు ప్రతి నేరంలోనూ పోలీసులకంటే ముందే అత్యుత్సాహంతో సగం దర్యాప్తు వీళ్ళే చేసేస్తారుగా!మరి ఈ కేసులో ఏం చేస్తున్నారో!
సమాజం ఇంతగా కుళ్ళిపోవడానికి కారణం ఎవరు?
ఈ రాక్షస సమాజంలో, ఈ జాలి లేని లోకంలో, ఈ ప్రేమ లేని ప్రపంచంలో, ఈ నీతి రహిత సమాజంలో...ఇదీ వరస!
ఈ నేరాలు ఇలా జరగడానికి కారణమెవరు?అని ప్రశ్నలు..పాపం వాళ్ళకేం తెలీనట్లు!వాళ్లకేం భాగం లేనట్లు!
మానవత్వం మంటకలిసింది. సమాజం కుళ్లిపోయింది. రాక్షసంగా మారిపోయింది.మానవ సంబంధాలకు విలువ లేదు.సాటి మనిషనే కన్ సర్న్ లేదు.ఎవరి నోట చూసినా ఇవే మాటలు. బ్లాగుల్లో కూడా ఆవేదన ఇదే స్థాయిలో ఉంది.ఎవర్నీ తప్పుపట్టడం లేదు.ఎందుకంటే నిన్న సాయంత్రం వరకూ నా ఆలోచన్లూ ఇదే బాటలో ఉన్నాయి.
తర్వాత ఆలోచిస్తుంటే కొత్త బాటలో ఆలోచనలు పరిగెట్టాయి.
పసి పాప అన్న జాలి, విచక్షణ లేకుండా చంపిన దుర్మార్గులు నివసిస్తున్న సమాజంలోనే మనమూ ఉన్నాం!
మనం..అంటే..?
పాపతో గానీ, ఆమె తండ్రితో గానీ, ఎటువంటి పరిచయమూలేని పరాయివాళ్ళం!
పాప గుప్పెడు బూడిదగా మారిందని తెలిసి కన్నీరు వర్షించిన వాళ్ళం!
పాప తండ్రి కూడా మరణించాడని తెలిసి భోరున విలపించిన వాళ్లం!
అంత్యక్రియలు చూస్తూ "ఈ బంధాలింతేనా"అని వైరాగ్యానికి గురైన వాళ్లం
అవి ముగిశాక "ఇప్పుడు ఆ తల్లి పరిస్థితి ఏమిటి? బంధువులు బతకనిస్తారా?"అని ఆలోచనలో పడ్డవాళ్లం!
ఆడపిల్లలమీద యాసిడ్ దాడి జరిగితే మన చెల్లికో,కూతురుకో జరిగినంతగా తల్లడిల్లినవాళ్లం!
ఎవరం మనమంతా?
సాటి మనుషులం!
రోడ్డుమీద ఎవరినా బైక్ మీదనుంచి కిందపడితే "అరె!"అని పదిమంది పరిగెడతాం లేపడానికి!
ఈ మధ్య 108 పుణ్యమా అని యాక్సిడెంట్ అయినా వెంటనే పౌరులు స్పందిస్తున్నారు.
అర్జెంట్ గా ఒక పేషంట్ కి ఫలానా గ్రూపు రక్తం కావాలంటే పరిగెత్తుకొచ్చేవారున్నారు.
చికిత్స కోసం డబ్బు లేని పేద రోగుల వివరాలు పేపర్లో చూసి డబ్బు ఇచ్చేవారెంతోమంది.
అనాధ పిల్లలకోసం సహాయం చేసేవారు కొందరైతే ఆ పిల్లల కోసం సమయాన్ని,డబ్బును కూడా వెచ్చించేవారెంతోమంది.(వీరికి ఉదాహరణలు మన బ్లాగర్లలోనే ఉన్నారు.).
ఇటువంటి ఘోరానికి పాల్పడ్డ నేరస్థులు ఎంతోమంది దయార్దృ హృదయులు నివసిస్తున్న ఈ సమాజంలో ఒక చిన్న భాగం! వాళ్ళు కేవలం కాన్సర్ సోకి కుళ్ళిపోయిన ఒక చిన్న భాగం!
ఆ భాగాన్ని మందులతో బాగన్నా చేసుకోవాలి.లేదా నిర్దాక్షిణ్యంగా కత్తిరించి(Amputation)అవతలన్నా పారేయాలి.అది మనచేతుల్లోనే ఉంది.
జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైనదే! కారణాలనేకం కావొచ్చు!
ఉమ్మడికుటుంబవ్యవస్థ చిన్నాభిన్నం కావడం వల్ల "నాది"అనే స్వార్థం పెరిగిపోవడం, ఇదివరలో విలాసాలుగా ఉన్నవి ఇప్పుడు అవసరాలుగా మారడం,డబ్బు చుట్టూ జీవితాలు గిరికీలు కొట్టడం!
ప్రభాకర్ స్వయంకృతాపరాధం కూడా కొంత కారణం కావొచ్చు.ఇప్పుడు ఆ విషయాన్ని చర్చించలేం!
ఏమైనా,మమతానుబంధాలతో పెనవేసుకున్న రెండు జీవితాలు నిర్దాక్షిణ్యంగా చిదిమివేయబడ్డాయి! ప్రాంతాలతో సంబంధం లేకుండా రాష్ట్రమంతా కన్నీటితో తడిసి ముద్దయిపోయింది. కన్నీరు మున్నీరైపోయింది.
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవాళ్ళు,డబ్బుకోసం ఎంత నీచాకైనా దిగేవారు మామూలు జనంతో పోల్చుకుంటే సమాజంలో చాలా స్వల్ప భాగం!(కానీ ఈ స్వల్ప భాగమంటేనే మనకు భయం)
వీళ్లున్నంత మాత్రాన "రాక్షస సమాజం" "కుళ్లిన సమాజం" "మానవతలేని సమాజం" "పనికిమాలిన సమాజం" "మృగాళ్లసమాజం" (కొంతమంది అయితే టీవీల్లో దీన్ని మహిళలపై జరిగిన దాడిగా అభివర్ణిస్తూ నేరస్థులకంటే నీచంగా స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు).
వాళ్ల కౄరత్వాన్ని సమాజం మొత్తానికీ ఆపాదించడం ఏ పాటి న్యాయం?
సాటి మనిషి కష్టానికి స్పందించే మనసులు,మనుషులు సమాజంలో ఉన్నంతకాలం ఈ సమాజం రాక్షస సమాజం కాదు.
ఒక తల్లి కన్నీరు తుడవడానికి, ఆమెతోపాటు కన్నీరు పెట్టుకోడానికి ఇన్ని కోట్లమంది ఉన్నపుడు ఈ సమాజం కుళ్లిందని ఎలా అనుకుంటాం!
కష్టంలో ఉన్న మనిషికి ఆసరాగా మనచేయి సాచగలిగినంత కాలం ఈ సమాజం ప్రేమరహితమైంది కాదు.
మనిషి గుండెలో తడి ఉన్నంత కాలం ఈ సమాజం పనికి మాలింది కానే కాదు!
ఎదుటి మనిషి బాధకు మన కంటిలో నీటి చుక్క ఊరినంత కాలం ఈ సమాజం కుళ్ళిపోకుండానే ఉన్నట్లు!
సమాజమంటే మనం! నేరస్థులు కాదు!
ఆ నలుగురు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఒక డైలాగ్ చెప్తాడు."మనిషిని నమ్మాలయ్యా!"అని!
చివర్లో కూడా అంటాడు "ఈ సమాజాన్ని నడిపించేది ప్రేమే అని నాకు తెలుసు, నేనే గెలిచాను"అని!
అవును, ఒక కుటుంబాన్నైనా, మనుషుల మధ్య స్నేహ సంబంధాలనైనా , ఒక సమాజంలో మనుషుల మధ్య బంధాలనైనా నడిపించేదీ, నిలబెట్టేదీ నమ్మకం, ప్రేమలే!
అవి మానవజాతిలో మిగిలి ఉన్నంత కాలం "మనిషి"కి మరణం లేదు
"మనిషి" ఇంకా చావలేదు.
చిన్నారి వైష్ణవి,ఆమె తండ్రి ప్రభాకర్,వారి డ్రైవర్ లక్ష్మణరావుల ఆత్మలకు శాంతి లభించాలని కోరుకుంటున్నాను.