March 2, 2010

"చివరికి మిగిలేది" మాత్రమే కాదు, ఏ పుస్తకమైనా అసలు ఎలా చదవాలి?


ఒక పుస్తకాన్ని "మంచి సాహిత్యం" లేదా క్లాసిక్ అని ఎలా నిర్థారిస్తాం?

పుస్తకంలోని విషయాన్ని బట్టా, అందులో రచయిత ఏం చెప్పాడా అనే దాన్ని బట్టా? పుస్తకం ఎంత ప్రజాదరణ పొందిందా అనే దాన్ని బట్టా?
 పుస్తకంలో చదివించే గుణం ఉందా లేదా అనే దాన్ని బట్టా?
 ఎన్నాళ్లయినా చెక్కు చెదరని దాని కాలాతీత "నాణ్యత" బట్టా?
ఎన్నో ఆలోచనల్ని రేపే దాన్లోని "విషయం" బట్టా?
జీవితంలోని కోణాల్ని అని స్పృశించిన తీరుని బట్టా? దేన్ని బట్టి నిర్ణయిస్తాం?

ఎవరొప్పుకున్నా ఒప్పుకోకపోయినా చివరికి మిగిలేది నిస్సందేహంగా ఒక క్లాసిక్! దాన్ని హేలీ గారు పుస్తకం .నెట్. లో పరిచయం చేసిన తీరు  తెలిసిందే! దాని మీద నలుగురు నిరసన వ్యక్తం చేయడం, మరో నలుగురు ఆ నలుగురి మీదా నిరసన వ్యక్తం చేయడం అందరికీ  తెలిసిందే!


ఒక పుస్తకాన్ని "ఇలా చదవాలి"అని చెప్పేందుకు సిలబస్ ఏమీ లేదు.కానీ పుస్తకం ద్వారా పాపం.......ఆ రచయిత ఏం చెప్పాలనుకున్నాడో కొంచెం అర్థం చేసుకోడానికి ప్రయత్నించాలనుకుంటా!

 అర్థం కానప్పుడు దాని జోలికి పోకుండా వదిలెయ్యాలి. ఆ రచననొక గొప్ప రచనగా యాక్సెప్ట్ చేసిన అసంఖ్యాక పాఠకుల దృక్కోణాన్ని అవహేళన చేయడానికి ప్రయత్నించకూడదు. 


నిడదవోలు మాలతి గారి నిజానికీ ఫెమినిజానికీ ...కథ చదివి పాఠకులందరికీ ఏమర్థమైయిందో నాకూ అదే అర్థమయింది. మా కజినొకడు ఆ కథ చదివి "పాపం స్త్రీల విషయంలో సీతాపతి బహుళ ఆసక్తుల గురించి కూడా రచయిత్రి పట్టించుకోవద్దూ?" అన్నాడు. ఆడ్ మాన్ అవుట్ అన్నమాట! :-))

 మాయాబజార్ మళ్ళీ విడుదలైంది. వెళ్ళి చూసి వచ్చాను.

"అబ్బ, ఏం సినిమా అది? ఒట్టి చెత్త! ఆ వెకిలి హాస్యం ఏమిటసలు? పాండవులు లేకుండా మహా భారతమేమిటి? ఘటోత్కచుడి వెకిలి హాస్యం చూడలేక చచ్చాను.తల్పం గిల్పం అదీ ఇదీ అంటూ పిచ్చి మాటలు!అసలు వాస్తవికతే లేదు!ఇంత బోర్ సినిమా నా జీవితంలో చూడలేదు"అని నా బ్లాగులో రివ్యూ రాస్తాననుకోండి! తిట్టడానికి తిట్లు కూడా దొరకనంత కోపం మీకు వస్తుంది కాదూ!


అదేమని ప్రశ్నించిన వారిని "కేవీ రెడ్డి గారు 'నువ్విలాగే చూడాలి' అని నాకు టైటిల్స్ లో చెప్పలేదు. అసలిది నాకూ కేవీ రెడ్డిగారికి జరిగిన సంభాషణ!మేమిద్దరం ఎలా మాట్లాడుకోవాలో మీరు చెప్తారేమిటి?"అని జవాబిస్తే? నా పిడివాదానికి నమస్కారం పెట్టి తొలగని వారెవరు అప్పుడు?

 (కేవీ రెడ్డిగారూ, బాబ్బాబు క్షమించండ్సార్, మీ దగ్గరికొచ్చినపుడు కాళ్ళట్టేసుకుంటాను) 

ఇంతే!ఇంతకంటే ఏమీ చెప్పక్కర్లేదనుకుంటాను.

అసలు ఒక    విషయంలో స్పష్టత కావాలి.ఒక పుస్తకాన్ని ఎలా చదవాలి? ఆ పుస్తకానికి చదివించే గుణం లేదు. సరే! చదివించే గుణమే కావాలనుకుంటే ఏ సపరివార పత్రికో చదివి ఊరుకుంటే సరి! పుస్తకం మనకు అర్థం కానంత మాత్రాన రచయితకేమీ నష్టం లేదు. రచయిత ఏమి చెప్పాలనుకుంటున్నాడో అర్థం కాకపోవడం మన దౌర్భాగ్యమే! ఎంతసేపూ రచయిత పాఠకుడి స్థాయికి దిగి రాయడమే తప్ప పాఠకుడు రచయిత స్థాయికి ఎదగడం అంటూ జరక్కూడదా?


రచయిత ఒక విషయాన్ని తనదైన శైలిలో ఒక పుస్తకాన్ని రాస్తాడు.అంతవరకే అతని బాధ్యత! పుస్తకంలోని విషయాన్ని దగ్గర కూచుని పాఠకుడికి బోధించాల్సిన అవసరం అతనికి లేదు.దాన్ని సక్రమంగా గ్రహించాల్సిన బాధ్యత, అవసరం పాఠకుడిదే! "ఒకటో అధ్యాయంలో హాస్యం ఉంటుంది,పదహారో అధ్యాయంలో జీవితం గురించిన విశ్లేషణ ఉంటుంది,ముప్ఫై రెండో అధ్యాయంలో ప్రణయం ఉంటుంది!వీటన్నింటినీ జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోరా ప్లీజ్" అని రచయిత (ఏ పుస్తకంలో అయినా సరే, ఏ రచయిత అయినా సరే) అడగడు.

పుస్తకం అనేది రచయిత-పాఠకుల మధ్య జరిగే సంభాషణ కాదు. కేవలం రచయిత పాఠకుడితో మాట్లాడ్డమే!
 వన్ వే!

ఆ సంభాషణ సారాంశం మనకెలా అర్థం అయిందనేది మన లోకజ్ఞానం స్థాయిని బట్టీ,సాహిత్యంతో మనకున్న పరిచయాన్ని బట్టీ,ఉంటుందనుకుంటాను.

అంతే తప్ప "రచయిత ఫలానా రకంగా చదవాలి అని నాకు చివరిపేజీలో చెప్పలేదు కాబట్టి అది నాకు సీ క్లాసు సినిమాలాగా కనపడింది" అంటే సరిపోదు.ఎలా చదవాలో,ఎలా రిసీవ్ చేసుకోవాలో పాఠకుడే అర్థం చేసుకోవాలి తప్ప రచయిత చెప్పడు.

పద్య సాహిత్యం నాకు అర్థంకాదు. అంతమాత్రాన దాన్ని నేను నిరసించను. కనీసం ఇతర్లు రాసిన వ్యాఖ్యానాలను బట్టి అర్థం చేసుకోడానికి,చదివి ఆనందించడానికి ఇష్టపడతాను.

ప్రతి పుస్తకానికీ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ మనకు అందకపోతే అందే పుస్తకాలనే చదవాలి మరి! అందని పుస్తకాల గురించి కనీసం అవహేళనగా మాట్లాడకుండా ఉండాలి! అది వెయ్యిమందికి ఒకరకంగా అర్థమై ఇద్దరికో ముగ్గురికో మరో రకంగా అర్థమైతే దానికి కారణాలేమిటో అన్వేషించాలి తప్ప హాస్యం పూత పూసిన నాలుగు అవహేళన మాటలు రాసి "నాకిలాగే అర్థమైంది మరి" అంటే ఎవరేం చెప్పగలరు?ఇలాంటి వాదాలకు అసలు సమాధానాలుండవు!

ఇదేమిటని ఆశ్చర్యపడ్డవాళ్లని "మీది ఈ కాలం కాదు.మీదంతా నాస్టాల్జియా" అంటారు  .అక్కడికి ఈ ఆశ్చర్యపడ్డవాళ్ళు శతాధిక వృద్ధులైనట్టూ,వీళ్ళేమో నిన్నో మొన్నో పుట్టి తెలుగు సాహిత్యాన్ని ఇంతకు ముందెవరూ అర్థం చేసుకోని వినూత్న రీతిలో (అదీ నిజమేలెండి) అర్థం చేసుకుని ఆవిష్కరించినట్టూ!

ఈ లెక్కన బుచ్చిబాబు చైతన్య స్రవంతి కి ఏ గతి పడుతుందో!

క్లాసిక్స్ ని "మాకిలాగే అర్థమైంది, మేమిలాగే చదువుతాం" అంటూ అపహాస్యం చేసే ధోరణి ఇంకెంత దూరం పోతుందో, ఎన్ని పుస్తకాల్ని వరిస్తుందో వేచి చూద్దాం!

ఒకందుకు ఈ ధోరణిని అభినందించాలి. ఈ పుస్తకాలకు పాఠకులను పెంచుతున్నందుకు!

ఇంతే..నేను చెప్పాలనుకున్నది!

62 comments:

Enaganti (ఇనగంటి) Ravi Chandra (రవిచంద్ర) said...

సుజాత గారూ,
పుస్తకం చదవడానికి ఆసక్తి ఉంటే చాలని నా అభిప్రాయం. కాకపోతే చదివిన తర్వాత తమకు ఏర్పడ్డ అభిప్రాయాలను సరైన రీతిలో (ఒకవేళ విమర్శలైతే సహేతుకంగా ఉండి సద్విమర్శలుగా) ఉంటే అందరికీ మంచిది.

సుజాత said...

Ravichandra, can you elaborate?

"అందరికీ మంచిది."....?

వేణు said...

‘నాకిలాగే అర్థమైంది, నేనిలాగే దీని గురించి రాస్తాను’ తరహా పుస్తక సమీక్షలపై సూటిగా , చక్కగా ప్రశ్నలు సంధించారు. మీ టపా సమయోచితం.

మామూలు పుస్తకాలు చదవటానికీ, ‘చివరికి మిగిలేది’ లాంటివి చదవటానికీ తేడా ఉంది. ఇలాంటి క్లాసిక్స్ సరిగా అర్థం కావాలంటే.. పాండిత్యమేమీ అక్కర్లేదు కానీ, సవ్యంగా చదివే దృష్టి మాత్రం అవసరమే!

Enaganti (ఇనగంటి) Ravi Chandra (రవిచంద్ర) said...

అందరికీ అంటే ఇక్కడ... రచయిత, పాఠకుడికీ అన్న అర్థంలో చెప్పాను.
రచయితకు అలాంటివి తదుపరి రచనకు feedback గా ఉపయోగపడతాయి.
అలాగే పాఠకుడి దృక్కోణ పరిధిని మరింత విస్తృతపరచడానికి ఉపయోగపడతాయి.

కత్తి మహేష్ కుమార్ said...

చేతన్ భగత్ తో తృప్తిపడేవాళ్ళకి ‘చివరికి మిగిలేది’ చదివిస్తే ఇలాగే ఉంటుంది. యండమూరిని మహారచయితగా నిర్ధారించినవాళ్ళకు చలాన్ని పరిచయం చేస్తే ఇలాగే ఉంటుంది. ఇది అంతే. అదీ అంతే!

neelaanchala said...

గాఠ్ఠిగా ఒక విజిలు!

వీరుభొట్ల వెంకట గణేష్ said...

Out of context comment:

I read the story in the pdf link that you gave and I didn't understand what author wanted to convey. Especially the ending of the story is like RGV movie.

వీరుభొట్ల వెంకట గణేష్ said...

I second Ravichandra.

Sravya Vattikuti said...

సుజాత గారు ఈ పుస్తకం ఎలా చదవాలి అనేది ఒక బుచ్చిబాబు గారి చివరికి మిగిలేది లేదా చలం గారి మైదానాలకి మాత్రమే వర్తిస్తుందా లేకపొతే రామయణ, మహాభారతాలకు కూడా వర్తిస్తుందా ? అంటే నా ఉద్దేశ్యం రామయణ, మహాభారతాలను మన ఇష్టమొచ్చినట్లు చీల్చిచెండాడవచ్చు కాని చివరికి మిగిలేది , మైదానాలు మాత్రం క్లాసిక్స్ గా భావించాలా అని ?

Ruth said...

సుజాత గారు,
మొట్టమొదటగా, మీకు క్షమాపణలు. ఎందుకంటే మీరు అన్న "నలుగురు నిరసన వ్యక్తం చేయడం, మరో నలుగురు ఆ నలుగురి మీదా నిరసన వ్యక్తం చేయడం..." ఆ రెండో నలుగురిలో నేనూ ఉన్నాను. పైగా మీ పేరు కూడా చెప్పిమరీ నిరసించాను.
మళ్ళీ చెప్తున్నాను, నేను ఈ పుస్తకం చదవలేదు. కాబట్టి నాకు పుస్తకం గురించి ఏ అభిప్రాయమూ లేదు. కాని నేను పుస్తకం.నెట్ లో చూసెటప్పటికే ఒక నలభై పైన కామెంట్లు ఉండటం అందులోను మీరు, కత్తి గారు (ఇతనికి సెపరేట్ గా చెప్పాలి క్షమాపణలు) చేసిన కామెంట్లు నాకు ఆశ్చర్యం కలిగించాయి. సరే, ఎవరో ఒక అద్భుతమైన పుస్తకాన్ని గురించి తేలికగా రాసారు అనుకోండి, దానికి అంత రియాక్ట్ అవ్వవలసిన అవసరం లేదేమొ అని నా ఉద్దేశం. ఇంతకీ ఆ అబ్బాయి తనకి పుస్తకం నచ్చిందనే అన్నాడు కదా! మిగతా వాళ్ళని చదవమనే చెప్పాడు కదా...కాని, ఒక పుస్తకం గురించి చెప్పేటప్పుడు, ఆ చెప్పటం కూడా పుస్తకం రాసిన శైలిలోనే ఉండాలంటే ఎలా???
ఇంకో విషయం అన్నారు, "మీది ఈ కాలం కాదు.మీదంతా నాస్టాల్జియా" అంటారు .అక్కడికి ఈ ఆశ్చర్యపడ్డవాళ్ళు శతాధిక వృద్ధులైనట్టూ" ... ఈ విషయం మాత్రం మీరు అర్ధం చేసుకోవాలి. ఈ రోజుల్లో శతాధిక సంవత్సరాలు తేడా ఉందక్ఖరలేదు ఆలోచించే విధానంలో తేడా ఉండడానికి. సంవత్సరాలు ఒక అంశం మాత్రమే, కాని ఇంకొ శతాధిక కారణాలు ఉంటాఇ ఆలోచనా విధానాన్ని ఇంఫ్లియెన్సు చేసేవి. మీరు వయస్సుల్లో తేడా మాత్రమే చూసుకుటే అస్సలు లాభం లేదు. మీరు వేరు ఆ అబాయి వేరు అంతే! మీరు ఎక్ష్ప్రెస్స్ చేసే విధానం వేరు తను ఎక్ష్ప్రెస్స్ చేసే విధానం వేరు అంతే! ఇక్కడ ఉన్నది జెనరేషన్ గాప్ కాదు మైడ్ సెట్ గాప్ అంతే! మీకు ఈ విషయం ఆ ఆర్టికల్ చదవగానే అర్ధం కావాలి.
చివరగా, కత్తి గారు అక్కడ ఆఖరుగా కామెంటేరు..." ...enjoy your bliss!" ;) అని. అదేదో మొదటి కొన్ని కామెంట్ల తరువాతే అనేసుకుంటే పొయేది.

Ruth said...

@ కత్తి గారు,
నాకు చేతన్ భగత్, యండమూరి, చలం వీళ్ళెవ్వరూ నచ్చలేదు !!! మొదటి ఇద్దరూ వాళ్ళ quality of writings వల్ల నచ్చలేదు. చలం, నా Quality of values నచ్చలేదు !!!

రవి said...

బుచ్చిబాబు మీద అభిమానం తో ఆయన రచనకు అన్యాయం జరిగిందని మీరు వాపోవడం బానే ఉంది. అలా ఉంచండి.

అయినా మీటపా మీద ఓ రెండు వరహాలు.

"దాన్ని హేలీ గారు పుస్తకం .నెట్. లో పరిచయం చేసిన తీరు తెలిసిందే!"

"వక్ర భాష్యాలు చెప్పి"

ఇందాక పరిచయం అన్నారు. తర్వాత భాష్యం అంటున్నారు.

"అసంఖ్యాక పాఠకుల దృక్కోణాన్ని అవహేళన"

అసంఖ్యాక పాఠకులకు ఒకే దృక్కోణముందని మీకెలా తెలిసింది? పుస్తకం.నెట్ లో మీరన్నారు. "చివరకు మిగిలేది - ప్రేమ మాత్రమేనని." - కొంతమంది దృక్కోణంలో "చివరకు మిగిలేదు - ప్రశ్న మాత్రమే (ప్రేమ కాదు)". ఇంకొంతమందికి "చివరకు మిగిలేది - తను ఓ విషయాన్ని ఎలా perceive చేస్తాడో అది మాత్రమే. నిజమైన విషయం, value అంటూ ఏదీ లేదు".

ఇలా రకరకాల దృక్కోణాలున్నప్పుడు పాఠకుల దృక్కోణాన్ని అవహేళన చేశాడని మీరెందుకు భావిస్తున్నారు?

"ఇంత బోర్ సినిమా నా జీవితంలో చూడలేదు"అని నా బ్లాగులో రివ్యూ రాస్తాను....

ఇందాక పరిచయం/భాష్యాన్ని రివ్యూతో పోలుస్తున్నారు!

"రచయిత ఏమి చెప్పాలనుకుంటున్నాడో అర్థం కాకపోవడం మన దౌర్భాగ్యమే! ఎంతసేపూ రచయిత పాఠకుడి స్థాయికి దిగి రాయడమే తప్ప పాఠకుడు రచయిత స్థాయికి ఎదగడం అంటూ జరక్కూడదా?"

రచయిత ఏమి చెప్పాలనుకుంటున్నాడో అర్థం కాకపోతే అది పాఠకుడి దౌర్భాగ్యం కాదు. ఇందాక పేరా చదవండి. ఈ పుస్తకం లో ప్రేమ మిగిలిందని మీకు అర్థమయింది. ప్రశ్న మిగిలిందని నాకు అర్థమయింది. రచయిత మరేదో చెప్పాలనుకొని ఉండవచ్చు. మనకిద్దరికీ ఒక్కోరకంగా అర్థమయింది కాబట్టి మనిద్దరిలో ఒకరు దౌర్భాగ్యుడంటారా? (క్షమించాలి).

అసలు అర్థమయీ అర్థం కానిదేదో మానవ జీవితంలో ఉందని రచయిత చెప్పదల్చుకుని, ఆ విషయం మీకు స్పష్టంగా అర్థమయితే, మీరు కూలంకషంగా వివరిస్తే బావుంటుంది.

ఇంకో ఉదాహరణ:

"అదీ పూర్ణం. ఇదీ పూర్ణం. ఆ పూర్ణం నుండీ ఇదొచ్చింది. ఆ పూర్ణం నుండీ ఈ పూర్ణం తీసేస్తే మిగిలేదీ పూర్ణమే" - ఈశావాస్యోపనిషత్తు లో ఓ శ్లోకానికి యథాతథంగా అర్థమిది. మీకేమి అర్థమయింది చెప్పగలరా? అర్థం కాలేదు కాబట్టి ఈ విషయానికి రకరకాల అర్థాలు ఊహించి చెప్పిన వారిది పొరబాటు (దౌర్భాగ్యం?) అంటారా?

"కేవలం రచయిత పాఠకుడితో మాట్లాడ్డమే!
వన్ వే! "

బ్లాగు కూడా ఓ రచనాసంవిధానం అనుకుంటే - మీరు బ్లాగులో చెప్పాలనుకున్నదీ వన్ వే నే అంటారా? అలాంటప్పుడు వ్యాఖ్యలెందుకు?

నా దృష్టిలో నిజమైన, నిజాయితీ గల రచన ఏదైనా రచయిత తనతో తాను మాట్లాడుకోవడమే. That is neither a dialog nor a preach. It's a monologue with himself. అయితే అది అన్ని రచనలకూ ఇది వర్తించదు. వర్తించనప్పుడు, పాఠకుడు తన స్థాయిలో అర్థం చేసుకోవడంలో తప్పు లేదు.

చదువరి said...

శ్రావ్య వట్టికూటి గారూ - గుక్కతిప్పుకోలేని ప్రశ్న! :)

ఈ ప్రశ్న మీరు సుజాత గారిని అడిగినప్పటికీ, నేను మాత్రం మహేష్ కుమార్ గారిని అడుగుతాను.

సుజాత said...

శ్రావ్య వట్టికూటి గారూ,
క్లాసిక్స్ అయినా ఇతిహాసాలైనా ఇలాంటి చీల్చి చెండాడే రచనలు వచ్చినపుడు వాటి మీద విమర్శలు, నిరసనలు వ్యక్తం కాక తప్పదు. ఇతిహాసాలను చీల్చి చెడాడుతూ వచ్చిన రచనల మీద వచ్చిన విమర్శలు మీకు తెలియవని నేననుకోను.

చదువరి గారూ, ఇందులో గుక్క తిప్పుకోలేకపోవడానికీ, కళ్లు తిరగడానికీ ఏమీ లేదు. అయినా మీ ప్రశ్న మీరు మహేష్ కుమార్ గార్ని అడగండి..ఇక్కడ కాదు. ఆయన బ్లాగులో!

వీరుభొట్ల వెంకట గణేష్ said...

Yes, What Sravya & Chaduvari garu said is correct.

______________________
పుస్తకం మనకు అర్థం కానంత మాత్రాన రచయితకేమీ నష్టం లేదు. రచయిత ఏమి చెప్పాలనుకుంటున్నాడో అర్థం కాకపోవడం మన దౌర్భాగ్యమే!
______________________

Then, why he is publishing it? He could have kept the draft with himself?

కత్తి మహేష్ కుమార్ said...

@Ruth: అన్ని పుస్తకాలూ అందరికీ నచ్చాలని లేదు. హేలీ వ్యాసంలో అభ్యంతరపెట్టింది తన అవగాహనా రాహిత్యాన్ని అవహేళనద్వారా కప్పిపుచ్చాలని చూసిన శైలిని. ఆ తరువాత ఊరుకోకుండా మరిన్ని రాళ్ళు మా మీద రువ్వి తనచుట్టూ కోట ఉందని మురిసిపోయిన తన చతురతకు చిరాకుచెంది కొంత నా "జ్ఞానాన్ని" ఒలకబోసుకున్నాను. ఆ తరువాత నా అజ్ఞానం నాకు తెలిసొచ్చింది. అందుకే అలాంటి ముక్తాయింపునిచ్చాను. ఇప్పుడొచ్చిన వ్యాసానికీ దూరంగానే ఉంటాను.

@శ్రావ్య వట్టికుట్టి: ఇక్కడ సమస్య "పవిత్రత" కాదు. చలాన్నీ,బుచ్చిబాబునీ,రామాయణమహాభారతాల్ని పూజచెయ్యమని ఎవరూ చెప్పడం లేదు. చెప్పులదండలతో సత్కరించినా దానికి సహేతుకమైన విశ్లేషణ ఉండాలంటున్నాము.

సుజాత said...

Ruth గారూ,
భలేవారండీ మీరు! ఒక చర్చ అన్న తర్వాత అందులో నిరసనలూ వాటి మీద నిరసనలూ వ్యక్తం కావడం మామూలే! ఇందులో వ్యక్తిగత ప్రస్తావన ఏమీ లేదు. ఉండదు కూడా!క్షమాపణల ప్రసక్తి ఏముంది?

ఆలోచనల్లో తేడా మైండ్ సెట్ లోనే అని నేనూ అనుకున్నాను. కానీ ఈ రోజు పుస్తకంలో వచ్చిన మరో "చివరికి మిగిలేది" వ్యాసంలో ఈ రివ్యూ “మా కాలంలో అలా ఉండేది..” అనే నోస్టాల్జియా ఇంకా సోకని ఈ తరం పాఠకుల కోసం...అని కనపడింది. అందువల్ల ఆ నాస్టాల్జియా నాకు సోకిందేమో అని సందేహం వచ్చింది.

సుజాత said...

రవి గారూ,నా ఏడుపు(అదే..వాపోవడం) మీకు సరిగా అర్థం కాలేదు. వన్ వే కదా!(ప్చ్,సరిగా ఏడవటం కూడా రావట్లేదు)

కరివేపాకు గురించి రాసినా శ్లోకాలతో మొదలెట్టే మీరు ఇక్కడ కూడా ఫలానా శ్లోకం మీకర్థం అయిందా అని నన్ను బెంచీ ఎక్కిస్తే ఏం చెప్పగలను? మీలాంటి పాండితీ ప్రకర్ష గల వారు వస్తారనే నాకు పద్య సాహిత్యం అదీ అర్థం కాదని రాసుకున్నాను!

పరిచయం, భాష్యం,రివ్యూ సమీక్ష ఇటువంటి వాటి విషయంలో ఎవరికీ స్పష్టత లేదని మొన్ననే ఒకచోట చదివాను.

అన్నట్లు ఈ వ్యాఖ్య మీరు టపా పబ్లిష్ అయిన వెంటనే రాసి తర్వాత పోస్ట్ చేసినట్లున్నారు. వక్ర భాష్యం అన్నమాట సందర్భానికి తగినట్లుగా అమరిందని తోచక ఆ పదాన్ని నేను టపా పబ్లిష్ అయిన వెంటనే తీసేశాను.

బ్లాగు కూడా వన్ వే నే! పుస్తకం చదివిన తర్వాత అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు ఇక్కడ కూడా వ్యాఖ్యలుంటాయి మరి! వ్యాఖ్యలు రాయక్కర్లేదు అని పాఠకుడికి అనిపించినపుడు రాయనక్కర్లేదు.

వేణు said...

రవి గారూ,
రచన అంటే ‘రచయిత తనతో తాను మాట్లాడుకోవటమే’ అన్నారు. పాఠకులతో సంబంధం లేకుండా... వారికి ఏదో చెప్పాలనే ఉద్దేశం లేకుండా కూడా ఎవరైనా రచనలు చేస్తారా? అలాంటపుడు ‘ప్రచురించటం’ ఎందుకు? (‘నిజమైన, నిజాయితీ గల రచన’ అనీ, ‘అది అన్ని రచనలకూ వర్తించదు’ అనీ మీరు డిస్ క్లెయిమర్లు ఇచ్చారనుకోండీ).

మీరన్నట్టు- పాఠకుడు (రచనను) తన స్థాయిలో అర్థం చేసుకోవడంలో తప్పులేదు. అపార్థం చేసుకున్నపుడే, అనవసరంగా అవహేళన చేసినపుడే వస్తుంది సమస్యంతా !

Pinstriped Zebra said...

"Especially the ending of the story is like RGV movie"

ఇటువంటి కామెంట్లు రాసేముందు కనీసం వర్మ సినిమాలనీ చూసి ఉండుంటే బాగుండేది. వర్మ తీసిన సినిమాలన్నీ చూసే ఉంటే, శివ, క్షణ క్షణం, రంగీలా, సత్య లాంటి సినిమాల్లో అర్థం కాని విషయాలేవో చెప్తే మేమూ కాస్త వింటాం. గత రెండు మూడేళ్ళలో తీసిన నాలుగైదు సినిమాల్ని దృష్టి లో పెట్టుకుని "వర్మ సినిమాల్లా అర్థం కాలేదు" అనడం అన్యాయం. Using such loose refernces might help add some dim-witted humour rather than substance to you comment

The comment on RGV is as half-assed as the book review being discussed here.

@Sraavya చలం రచనలైనా బుచ్చి బాబు రచనలైనా ఎవ్వరి రచనలైనా ఖచ్చితంగా చీల్చి చెండాడొచ్చు. I assume that people whoo took exception to the review here did so not because it offended their sensibilities or such like. Their point was that the person that reviewed the book is completely lost on the context of the book. It was like critiquing a book from a foreign language without first knowing the language.

'తుళ్ళి పడ్డాను ' 'మల్లె పూలు ' లాంటి పదాల్ని తమిళులో కన్నడిగులో విని "తెలుగు ఒక బూతు భాష. నాకన్ని పదాలు అర్థమయ్యాయి. అన్నీ బూతులు గానే తోచాయి. నాకిలా అర్థమయ్యింది కాబట్టి తెలుగు నా ఉద్దేశంలొ ఒక బూతు భాష " అంటే ఎలాగుంటుందో అలా ఉంది ఆ రివ్యూ.

One should be capable enough to understand the tenor of the book before venturing into writing about it.

neelaanchala said...

రవి గారూ,
పుస్తకం సభ్యులుగా ఈ మాత్రం బాధ్యత మీకు ఉండాల్సిందే! కానివ్వండి!

నా దృష్టిలో నిజమైన, నిజాయితీ గల రచన ఏదైనా రచయిత తనతో తాను మాట్లాడుకోవడమే. That is neither a dialog nor a preach. It's a monologue with himself. అయితే అది అన్ని రచనలకూ ఇది వర్తించదు.....

ఈ డిస్ క్లైమర్ పుస్తకానికి ఎలా వర్తించదో చెప్పండి?

రవి said...

సుజాత గారు : పాండితీ ప్రకర్ష అదీ అంటూ నా మీద వ్యక్తిగత దాడి చేస్తున్నారు. నాకలాంటి ప్రకర్ష ఏదీ లేదు. పద్యసాహిత్యం గొప్పదన్న రంగుల కళ్ళజోడూ నాకు లేదు. (మామూలు సులోచనాలు ఉన్నాయనుకోండి. :-))

ఇకపోతే నా ఉద్దేశ్యం మిమ్మల్ని బెంచి ఎక్కించాలని కాదు. అలా ఉంటే ఆ శ్లోకమే చెప్పి ఉండేవాణ్ణి.

నా ఉద్దేశ్యం - ఓ రచన ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అర్థమవుతుంది. చివరకు మిగిలేది వంటి పుస్తకమైతే ఆ possibility ఇంకా ఎక్కువ. ఇది పాఠకుల దౌర్భాగ్యం కాదు. అంతే.

@వేణు:
"రచన అంటే ‘రచయిత తనతో తాను మాట్లాడుకోవటమే’ అన్నారు."

అలా అనలేదు. "నిజమైన, నిజాయితీ గల" అని విశేషణాలు పెట్టాను. మీరే అన్నారామాట. రవీంద్రనాథ్ ఠాగూర్ గుర్తొచ్చి అలా అన్నాను.

@నీలాంచల గారు: పుస్తకం అన్నది ఒక పత్రిక అనేకన్నా, forum అన్నదే సబబు. ఆ forum ఉద్దేశ్యం, వ్యాసకర్త ఉద్దేశ్యం సాధ్యమైనంత స్పష్టంగానే చెప్పారనుకుంటున్నాను. ఇది మీకు సమాధానం మాత్రమే. పుస్తకానికి నా వకాల్తా కాదు. ఈ విషయాలపై నేను వ్యాఖ్యానించడం బావోదు.

సుజాత said...

అయ్యో, రవి గారు,
ఒట్టు, అలాంటి వుద్దేశం నాకు నిజంగా లేదండీ బాబూ! నిజం చెప్పాలంటే మీ పాండిత్యం పట్ల నాకు చాలా ఈర్ష్య!

పులిహోర గురించి కూడా శ్లోకాలున్నాయని మీ బ్లాగు లో చదివే దాకా నాకు తెలీనే లేదు.

వీరుభొట్ల వెంకట గణేష్ said...

@ Pinstriped Zebra:
మీరు ఉదహరించిన సినిమాలలో 'గాయం' మర్చిపోయారు.
Even I like the RGV movies(not all). As you said, I should have been more specific.

BTW, I don't have any intention to create humor/wit by lose comments on RGV.
Okay, now I say:"Like the ending of some of the RGV movies, at the end of the story, I didn't understand what author wants to convey".

I just said that my frequency and author frequency didn't match. That doesn't mean that I have criticized author or it is my "దౌర్భాగ్యం".
FYI, Neither I involved in the discussion at the pustakam.net nor I criticized the author of story.

The only one word that made me to comment on this blog post is "దౌర్భాగ్యం".

కొత్త పాళీ said...

చాలా ఆసక్తికరమైన చర్చ. ఇందుకే అన్నారు కాబోలు అసలుకంటె కొసరు మేలని :)
ఈ చర్చ మొదలెట్టినందుకు అనేకానేక థాంకులు సుజాతగారు. బహూశ తొలిచర్చలో ఉద్రేకపు వేడి చల్లారిందికాబోలు, ఈ రౌందులో మంచి మంచి పాయింట్లు చాలా కూల్ గా చెబుతున్నారు సభ్యులు. చాలా బావుంది.

నానించి రెండు పాయింట్లు -
1. మీరన్నారు - ఎవరొప్పుకున్నా ఒప్పుకోకపోయినా చివరకు మిగిలేది క్లాసిక్కే! - అని.
అస్సలు కాదు. కొంతమంది ముందుగా ఈ పుస్తకంలో ఏదో ఒక వేల్యూ చూడ్డం, దాన్ని పదిమందికీ తెలియజెప్పడం (అంటే ఒక విధంగా ప్రచారం చెయ్యడం), ఈ ప్రక్రియ ప్రతీ తరంలోనూ పున్రావృత్తం అవుతూ ఉండడం వల్ల ఇది (ఇదే కాదు, ఏదైనా) క్లాసిక్ అయింది. ఈ నవలకి ఇటువంటి భాగ్యం ఎందుకు పట్టింది అంటే మనం అనేక సోషల్ డైనమిక్ విషయాల్ని పట్టించుకోవాలి. అంతేగాని పుస్తకంలో ఉన్న ఏదో అనిర్వచనీయమైన ఉత్తమ లక్షణం వల్ల కాదు. ఈ రచనకైనా (మతగ్రంధాలు కూడా) వాటిని భుజాలమీద మోసే గుంపు లేకపోతే వాటికి ఆ స్టేటస్ రాదు.
2. హేలీ రాతగురించి మీ విమర్శలో - నువ్వు తరవాతి తరం వాడివి, అంచాత దీని గొప్ప నీకర్ధం కాలేదు - అన్నట్టు ధ్వనించింది నాకు.
పోనీ నా ఉదాహరణ తీసుకోండి. నేను హేలీకంటే పూర్తిగా ముందుతరం వాణ్ణి. చివరకు మిగిలేది ని బుజాలమీదనేం ఖర్మ, నెత్తినే పెట్టుకున్న తరానికి దగ్గరివాణ్ణి. పైగా ఆధునిక అభ్యుదయ సాహిత్యంతో బాగానే పరిచయమూ, ఆస్వాదించే శక్తీ ఉన్నవాణ్ణి (కనీసం నేననుకుంటున్నా). ఈ నవలని అనేక సార్లు చదివాను. నా జీవితంలో కనీసం 4 విభిన్న స్టేజిల్లో చదివాను. శ్రద్ధగా చదివాను. చదివిన ప్రతిసారీ నాకు మిగిలింది చిరాకే .. It all seemed much ado about nothing. నాకు హేలీ వొకాబులరీ లేదుగానీ, ఉంటే, నేనీరోజు ఈ నవలకి పరిచయం రాస్తే 90% హేలీ రాసినట్టె ఉంటుంది.

భైరవభట్ల కామేశ్వర రావు said...

సుజాతగారు,

మాయాబజార్ గురించి మీరన్న మాటలు మా మనవడో/మనవరాలో తన బ్లాగులో రాస్తే నేను ఆశ్చర్యపోను (ఆ మాటకొస్తే మా అమ్మాయి రాసిన ఆశ్చర్యపోను). నాకు తనపై కోపమూ రాదు. బహుశా ముందు కొంచెం బాధ కలగుతుంది. అది సహజం. తర్వాత తనకి ఎందుకు నచ్చ లేదని ఆలోచించే ప్రయత్నం చేస్తాను.

మొదట మీరు హేలీగారి వ్యాసంలో "చివరకు మిగిలేది" మీద వట్టినే బురదజల్లడానికి కంకణం కట్టుకున్న వాళ్ళ అవహేళన మాత్రమే కనిపించడం అసలు చిక్కు. మాయాబజార్ గురించి రాబోయే తరం మీరన్న మాటలంటే, వాళ్ళ నిజాయితీని శంకించాల్సిన అవసరం ఏముంది?

రచయిత చెప్పే దాన్ని అందుకొనే ప్రయత్నం పాఠకుడు చెయ్యాలి. నిజమే. కాని అలా అందుకోలేకపోతే అది పూర్తిగా పాఠకుని తప్పే అనడం సమంజసం కాదు. అది ఎంత క్లాసిక్కైనా కూడా. ఒక బలమైన భావజాలం ఒక తరం ప్రజలని ప్రభావితం చెయ్యవచ్చు. ఆ భావజాలానికి సంబంధించిన ఒక రచన ఆ కాలంలో వస్తే సహజంగా అది ఆ కాలంలో చాలామందికి నచ్చుతుంది. ముందు తరాలలో కూడా అదే భావజాలం వల్ల ప్రభావితమైన వాళ్ళందరికీ అది క్లాసిక్ గానే కనిపిస్తుంది. అది రచనలో ఉన్న కొన్ని/చాలా లోపాలని కప్పిపుచ్చ వచ్చు. సరిగ్గా ఆ లోపాలే, ఆ భావజాలం వల్ల ప్రభవితం కాని వాళ్ళకి పెద్దగా కనిపించి, ఆ రచనంటే చిరాకు కలిగిస్తాయి. ఒక భావజాలం బలంగా ఉన్న రోజుల్లో నాకు చాలా నచ్చిన పుస్తకాలే కొన్ని రోజులకి చిరాకు తెప్పించిన అనుభవం నాకుంది. కచ్చితంగా అందరూ ఒకే/కొన్ని దృష్టి కోణాలలోనుంచే ఒక రచనని అర్థం చేసుకోవాలని అనుకోవడం సమంజసమూ కాదు, జరిగే పనీ కాదు.

అయితే, క్లాసిక్ అనిపించుకున్న పుస్తకం నాకు సిక్ అని అనిపిస్తే "చత్, ఇది చెత్త పుస్తకం" అని ఊరుకుంటే పెద్ద ప్రయోజనం లేదు. అది మంచి సమీక్ష అవ్వదు. అది నాకెందుకు నచ్చలేదు, మిగతావాళ్ళకి ఎందుకు నచ్చిందీ అని ఆలోచించే ప్రయత్నం చేస్తే దాని వల్ల ఏమైనా కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. అది హేలీగారి సమీక్షలో నాకు కనిపించ లేదు. లేటెస్టుగా వచ్చిన సమీక్షలో కనిపించింది (దానికి మెహెర్ గారి కమెంట్లో మరీను). కాబట్టి ఇందులో కచ్చితంగా ఆలోచించవలసిన విషయాలున్నాయని నేననుకుంటున్నాను. పుస్తకం నచ్చిన వాళ్ళు అసలిలాంటి విమర్శలని పట్టించుకోవాలా అంటే అక్కరలేదు. అలాంటప్పుడు నొచ్చుకోవలసిన అవసరమూ లేదు!

చదువరి said...

సారీ సుజాత గారూ, ఆ ముక్క అనకుండా ఉండాల్సింది. మహేష్ ప్రశ్న ఇక్కడ అడగనులెండి. :)

సుజాత said...

చదువరి గారూ,
మీరు సారీ చెప్పాలని కాదు. ఒక విషయం మీద చర్చ మొదలై, అది దారి తప్పి చివరికి చర్చ ఎక్కడ మొదలెట్టామో తెలీకుండా దారి తప్పి పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక్కడ అది జరక్కూడదనే నా వ్యాఖ్య ఉద్దేశం! మీరు ప్రస్తావించిన టాపిక్ లో పడితే చివరికి ఇది రెండు మతాల మధ్య గొడవగా మారి బుచ్చిబాబు నిద్రపోయే ప్రమాదం ఉంది.

Sravya Vattikuti said...

సుజాతా గారు
క్లాసిక్స్ అయినా ఇతిహాసాలైనా ఇలాంటి చీల్చి చెండాడే రచనలు వచ్చినపుడు వాటి మీద విమర్శలు, నిరసనలు వ్యక్తం కాక తప్పదు. ఇతిహాసాలను చీల్చి చెడాడుతూ వచ్చిన రచనల మీద వచ్చిన విమర్శలు మీకు తెలియవని నేననుకోను.>>
ఆయా వాటి మీద స్పందన కూడా చదివాను కాబట్టే ఈ వాఖ్య వ్రాసాను :) ఆయనా చదువరి గారి కి ఏదో నా వాఖ్య నచ్చి కామేంటితే దాన్ని కూడా మీ కళ్ళతో చూడమంటే ఎలాగండి ?:)

కత్తి మహేష్ కుమార్ గారు నేను నా కామెంట్ లో ఎక్కడా "పవిత్రత" గురించి చెప్పలేదు మీరెందుకు భుజాలు తడుముకుంటారు ? మీరు పట్టిన కుందేలు కు మీరు మూడంటే మూడే లేదా ఆరంటే ఆరు కాళ్ళు ఆని నాకు తెలియదా ఏమిటి ? నాకు తెలిసి చేతన్ భగత్ మీకన్నా పెద్ద ఫ్యాన్ ఎవరండి, తెలుగు బ్లాగుల్లో ఇప్పుడు సడన్ గా అయ్యాన చీప్ అయ్యాడు మీకు .
@ Pinstriped Zebra: విమర్శించే వాళ్ళతో నాకేమి సమస్య లేదండి, కాని నేను పెద్ద మేధావిని, మిగతా ప్రపంచం లో ఉన్న వాళ్ళంతా దద్దమ్మలు, మూర్ఖులు వాళ్లకు తెలిసింది సున్నా అనే వాళ్ళను చూస్తే నాకు కొద్ది గా వొళ్ళు మంట అంతే :)

సుజాత said...

కొత్తపాళీ గారు,మీ వ్యాఖ్య మీరు పుస్తకంలో హేలీ గారి పరిచయం చదివొచ్చి రాసినట్లుంది కానీ నా టపా చదివి కాదు.

హేలీ వ్యాసంతో నా చిక్కు తరాల అంతరంతో కాదు. పుస్తకాన్ని అర్థం చేసుకున్న తీరుతో, దాన్ని ప్రెజెంట్ చేసిన వ్యంగ్యపూరిత, అవహేళనా పూరితమైన తీరుతోనే!(ఇది ఇక మీకు చెప్పి లాభమేముంది. మీకూ అలాగే అనిపించిందన్నారుగా) అసలు తరం అంటే ఎన్నేళ్ల గాప్ ఉండాలంటారు? తనకి 24 ఏళ్ళు.నాకు మరో పదేళ్ళు కలపండి. పదేళ్ళు ఒక తరానికి సరిపడా గాప్ అవుతుందా? ఇద్దరం ఒక తరానికి చెందకూడదా? అందు చేత ఇక్కడా,హేలీ గారి వ్యాసం విషయంలోనూ తరాల అంతరం ప్రసక్తి తెచ్చినట్లు లేనే నేను? మీకెందుకలా ధ్వనించిందో!

రచయిత ఏం చెప్పాలనుకున్నాడో పాఠకుడు గ్రహించాల్సిన అవసరం లేదా చెప్పండి?"ఇలా చదవాలి"అని నాకు రచయిత చెప్పలేదు అనడం సమంజసంగా కనపడిందా మీకు?

సుజాత said...

కామేశ్వర రావు గారు,
కొత్తపాళీ గారికి చెప్పిందే మీకూ చెప్తున్నా! పదేళ్ళు ఒక తరానికి సరిపడా అంతరం కాదనుకుంటే హేలీ నేనూ ఒకటే తరానికి చెందినవాళ్లమే!

ఒకే దృష్టి కోణం నుంచి ఒక రచనను అర్థం చేసుకోవడం అసాధ్యం కావొచ్చేమో! కానీ అసలు "రచయిత" ఈ రచన ద్వారా ఏం చెప్పాలనుకున్నాడో గ్రహించడానికి కనీస ప్రయత్నం కూడా పాఠకుడు చేయొద్దా?
పుస్తకం నచ్చిన వాళ్ళు అసలిలాంటి విమర్శలని పట్టించుకోవాలా అంటే అక్కరలేదు. అలాంటప్పుడు నొచ్చుకోవలసిన అవసరమూ లేదు!...అసలు.. పాయింట్ ఇదే లెండి!

సుజాత said...

వట్టికూటి శ్రావ్య గారూ, చదువరి గారికిచ్చిన జవాబు చూడండి!

sudheer said...

ఓహో వ్యాఖ్యా మోడరేషనాస్త్రం ఉంది కదూ, ఇహ నా వ్యాఖ్యనేం ప్రచురిస్తార్లెండి :)

సుజాత said...

@sudheer,
ఎవరో చీల్చి చెండాడతారనే భయమే ఉంటే ఈ టపా రాయడానికే సంకోచిస్తాననుకుంటాను కదూ!

హేలీ రాసిన వ్యాసానికి కొనసాగింపే ఈ రోజు వచ్చిన కొత్త వ్యాసం! చెప్పాలనుకున్నది హేలీ వ్యాసంలోనే చెప్పేశాను.ఇహ కొత్తగా అక్కడ చెప్పాలనుకున్నదేమీ లేదు. అంతా ఇక్కడ చెప్పాలనుకున్నదే! నిజానికి ఇది హేలీ వ్యాసం చదవగానే రాయాలనుకున్నదే! కాస్త లేటయింది.

బై ది వే, వ్యాఖ్యలు రాసేటపుడు "సభ్యత" అనేది ఒకటుంటుందని మర్చిపోకండి ఈ సారి రాసేటపుడు. అన్నట్లు ..మంచి భాష వాడటం కూడా! ఓకే?

kiran kumar said...

I second pinstripped Zebra!

One should be capable enough to understand the tenor of the book before venturing into writing about it....thats it!

కొండముది సాయికిరణ్ కుమార్ said...

నా వరకు, ’చివరికి మిగిలేది’ నచ్చటానికి కారణం - అందులోని కవిత్వాత్మక వచనం మాత్రమే. అంతకు మించి విశ్లేషించి, నెత్తిన పెట్టుకోదగ్గ కథేమీ అందులో లేదనేది నా అభిప్రాయం.

బొల్లోజు బాబా said...

చివరకు మిగిలేది లో కనిపించే మరో ఆశక్తికరమైన అంశం దానిలోని కవిత్వం. కొన్ని పారాగ్రాఫులకు పాదవిభజన చేస్తే మంచి వచనకవితలా అనిపించటం రచయిత ప్రతిభకు నిదర్శనం.
ఒక ఉదాహరణను ఈక్రింది లింకులో చూడవచ్చు.

http://aavakaaya.com/articleComments.aspx?articleId=1271

బొల్లోజు బాబా

భైరవభట్ల కామేశ్వర రావు said...

సుజాతగారు,

మీరు హేలీగారి తరంకన్నా ముందు తరం వారని ఒప్పుకోరని ఊహించే ఇది కూడా అన్నానండి, "ముందు తరాలలో కూడా అదే భావజాలం వల్ల ప్రభావితమైన వాళ్ళందరికీ అది క్లాసిక్ గానే కనిపిస్తుంది" :-)

>>"ఈ రచన ద్వారా ఏం చెప్పాలనుకున్నాడో గ్రహించడానికి కనీస ప్రయత్నం కూడా పాఠకుడు చేయొద్దా?"
తప్పకుండా ప్రయత్నం చెయ్యాలి. అయితే అది ఏమిటో అందరికీ ఒకేలా అర్థమవ్వకర లేదు కదా. రవిగారు దీని గురించి ఉదాహరణ ఇచ్చారు. నిజంగా రచయిత ఏం చెప్పాలనుకున్నాడో అది ఎప్పటికీ ఎవరికీ నూరుపాళ్ళు తెలియకపోవచ్చు కూడా! పోని ఎక్కువమందికి రచయిత చెప్పదలుచుకున్నది ఇదీ అని అనిపిస్తే, అదే నిజంగా రచయిత చెప్పదలచుకున్నది అవుతుందని గేరంటీ ఉందా?
ఇప్పుడు లేటెస్టు వ్యాసంలో, బుచ్చిబాబు ఏం చెప్పాలనుకున్నాడో ఆలోచించే ప్రయత్నం మీకు కనిపించలేదా?

స్నేహ said...

అయితే సుజాత గారు, ఒక పుస్తకాన్ని మనకు ఇష్టం వచ్చినట్టు చదవలేము అన్నమాట. క్లాసిక్‌లు అనబడే పుస్తకాలను వాటి అభిమానులు నిరేశించినట్టే చదవాలన్నమాట. అయితే మీరు చెప్పినట్టు మాయాబజార్ అందరికీ నచ్చే తీరాలి నచ్చనివాళ్ళు ఉండకూడదు.

budugu said...

sujaata gaaru, manci post. i agree with your view.

కొత్త పాళీ said...

ఏమండీ, మీరు ఈ టపాలోనే రాసిన వాక్యాన్ని ఉదహరించి మరీ దానిమీద వ్యాఖ్యానిస్తే నాటపా చదివి రాసిన వ్యాఖ్య కాదంటే నేనేమి చెప్పను?
మీరు నాకు ఈ నవల గొప్పతనం గురించి చెప్పి లాభమేం లేదు, అది నిజమే :)
ఈ మొత్తం చర్చలో తరాల అంతరం లాంటి ఆర్గ్యుమెంటు అంతర్లీనంగానైనా ధ్వనించిందేమోనని నాకనిపించింది - అందుకే ఆ ప్రసక్తి తెచ్చాను. సాధారణంగా తరం అంటే ఇరవయ్యేళ్ళని చెప్పుకుంటారు. మీకూ హేలీకి ఆ తేడా లేదేమో గాని నాకూ అతనికీ ఉన్నది. ఎనీవే, మీ వాదనలో తరం ప్రసక్తి లేదన్నారు కాబట్టి వొదిలేద్దాం.
నేను ఇక్కడి వ్యాఖ్యలో ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఒక్కటే. ఏ రచనకీ (ఆ మాటకొస్తే ఏ కళా సృజనకీ) స్వతస్సిద్ధంగా గొప్పతనమేమీ ఉండదు. ఆ కళలో, ఆ రచనలో ఆ అందాన్ని, ఆ గొప్పతనాన్ని చూసి, ఆస్వాదించి, దాన్ని ప్రచారం చేసే వారివల్ల అటువంటి గొప్పతనం ఏర్పడుతుంది. ఒక బీథోవెన్ సింఫొనీ, ఒక త్యాగరాజ కృతి, ఒక మోనే బొమ్మ, ఒక గ్రీకు శిల్పం, ఒక శ్రీశ్రీ పద్యం, ఒక శ్రీపాద కథ .. ఏదైనా ..

Paadarasam said...

Sujatha garu,

A month ago, burning midnight oil, I have read all your old posts at one go and felt happy to know you through your blogs and as a result I have lots of regards for you. But It does not stop me to write this comment.

You are attacking "Halley" and "Achilles" (As Sudheer said in the name of Halley) for writting what ever they felt about so called book by Butchi Babu. May be as per you and by some others it is a classic. What is the benchmark ? People can have different perspectives.

Finally at the fag end of day, you have taken a stand that you are upset due to "AVAHELANA" by Halley. May be due to more % of negative comments ( Well, so far you had only positive comments)But at the same time, read through your own old posts wherein you have ridiculed the divine "Satyanarayana Swamy Vratham/Katha" (ofcourse with a disclaimer ) and made fun of Telangana slang. That time you might have felt that it is just humour. When someone else does, you feel it is AVAHELANA and VYAGYAM. Isn't it double standards ?.. Introspect before replying to my post.

అబ్రకదబ్ర said...

>> "ఎంతసేపూ రచయిత పాఠకుడి స్థాయికి దిగి రాయడమే తప్ప పాఠకుడు రచయిత స్థాయికి ఎదగడం అంటూ జరక్కూడదా?"

పాఠకులు తన స్థాయికి ఎదిగి మరీ చదవగలిగేంత ఆసక్తి రేకెత్తించగలిగినోడే అసలైన రచయిత.

>> "రచయిత ఏమి చెప్పాలనుకుంటున్నాడో అర్థం కాకపోవడం మన దౌర్భాగ్యమే"

పరీక్ష ఫెయిలైన పిల్లాడు 'మమ్మీ, నేను రాసింది మా మేస్టారికి అర్ధం కాలేదు' అంటే వాడి తల్లి మేస్టారి దౌర్భాగ్యానికి జాలిపడి, పిల్లాడి తెలివితేటలకి మురిసిపోతుందా?

పుస్తకం రాసి విడుదల చేశాక ఆ రచయిత పరిస్థితి పై పిల్లాడి పరిస్థితిలాంటిదే. అతని రచన ఎక్కువమందికి (కనీసం, అతను ఏ ఏ వర్గాలని దృష్టిలో పెట్టుకుని రాశాడో ఆయా వర్గాలకీ) ఎక్కకపోతే అతను పరీక్ష తప్పినట్లే. నెపాన్ని పాఠకుల మీదకి నెట్టటం మంచి రచయితల లక్షణం కాదు.

ఇక చలం గురించి. ఒకప్పుడెక్కడో ఇదే విషయంలో నేను మరేదో బ్లాగులో అన్న ముక్క: మేధావుల్ని పిచ్చివాళ్లనుకోటం లోక సహజం. పిచ్చివాళ్లకి మేధావులనే ముద్రేసి నెత్తినెక్కించుకోటం కొందరి నైజం. ఆ బాపతు సాహితీ విమర్శకులు బలవంతాన తెలుగువారి నెత్తిన రుద్దిన మహా రచయితే చలం. ఆయన రాసి పారేసిన గబ్బులో సంఘాన్ని శుద్ధి చేసే సబ్బుని కనిపెట్టగలిగిన మహానుభావులకు హ్యాట్సాఫ్.

మైత్రేయి said...

లేటుగా నైనా ఈ విషయం పై నా రెండు పైసలు..
నాకు తెలిసి విమర్శల్లో రెండు రకాలు ఉంటాయి. సద్విమర్శ , కువిమర్స.
మొదటిది తర్కంతో మంచి చెడు రెండిటినీ చెప్తే రెండవది రచయిత పైన, రచన పైన అప్పటికే తమకు ఉన్న అభిప్రాయాన్ని బలపరచానికి పుస్తకం లో లేనివి ఉన్నట్లుగా చెప్తూ రాసేవి.
నాకు హేలీ వ్రాసిన విమర్శ ఈ రెండిటిలోనూ లేదనిపించింది.
రచయిత మీద, రచన మీద అతని ఉద్దేశ్యాలు (intentions) తప్పు పట్ట దగ్గవి గా నాకు ఎక్కడా అనిపించలేదు. అయితే అతని విమర్శ సహేతుకంగా లేదు. అతను తర్వాత ఇచ్చిన వివరణ బట్టి చూస్తే, అతను ఆ పుస్తకాన్ని చివిరికంటా చదివాడు అన్న విషయాని బట్టి చూస్తే అతను ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకొనే వ్రాసాడు అని అర్ధం అవుతుంది.( తను రాజమౌళి నాయకలతో ఎందుకు పోల్చాడో తర్వాత వివరించ గలిగాడు) అయితే ఆ విషయం క్లియర్ గా రాయగలిగితే చర్చ ఆ విషయం మీద జరిగితే బాగుండేది.

పుస్తకాన్ని ఇలానే చదవాలి ఇలానే అర్ధం చేసుకోవాలనే నియమం మనం enforce చేయ్యాలనుకోవటం కరెక్ట్ కాదు. అయితే, విమర్శ logical గా ఉంటే ఇతరులు ఆ అభిప్రాయాన్ని అంగికరించ టానికో, వ్యతిరేకించ టానికో ఉంటుంది.

ఇంత వయసు వచ్చాకే విమర్శ చెయ్యాలి, విమర్శ మంచి మాత్రమే చెప్పాలి అనటం కూడా సరి కాదు కదా. అతని అభిప్రాయం ఎందుకు మనం ఒప్పుకోమో మనమూ చెప్పవచ్చు. అయితే విమర్శ గొప్పగా లేనప్పుడు ఎందుకు ప్రచురించారు అని కామేశ్వర రావు గారు అడగటం, వాళ్ళు తమ కారణాలు చెప్పటం కూడా బాగానే ఉన్నది.

కత్తి మహేష్ కుమార్ said...

@అమ్మా/అయ్యా శ్రావ్యా వట్టికుట్టి: భుజాలు ఎవరు తడుముకుంటున్నారో చదువరిగారి చంకలెగురెయ్యడంతోనే అర్థమవుతోంది.నేను పట్టిన కుందేలుకు మూడేకాళ్ళని నేనంటే నాలుగోకాలు హిందూద్వేషులెత్తుకెళ్ళారనే తరహా మీది. కాబట్టి మీ సమస్య పవిత్రతా కాదా అనేది నాకు బాగానే తెలుసు.

చేతన్ భగత్ ఇంగ్లీషు గురించి చెప్పినదాన్ని నేను సమర్ధిస్తాను. అంతమాత్రానా నేను తన రచనలకి పెద్ద ఫ్యాన్ ననుకోవడం మీకే చెల్లింది. ఎంతైనా గుడ్డినమ్మకాలూ,తర్కంలేని మూఢనమ్మకాలూ మీకే సొంతం కదా! I support appreciate and admire people based on issues.Not on blind faith.

రమణ said...

సినిమాలతో పోల్చి హేలీ రాశారనే కాదు సమస్య. పుస్తకం నచ్చిందని చెప్పి సినిమాలతో పోల్చుతూ చేసిన వ్యాఖ్యానం అవహేళనగా ఉండటం. ఒకరికి పుస్తకం నచ్చనపుడు "మీకెందుకు నచ్చలేదు?" అని ఎవరూ అక్కడ ప్రశ్నించలేదు. రాసిన విధానం బాగోలేదని చెప్పారు. "నేనిలాగే రాస్తాను. నాకిలాగే అర్ధం అయ్యింది. సాధారణ పాఠకుల కోసం రాసిన సమీక్ష. పండితులకు కాదు" అని గమనిక రాసి రాళ్ళు వేయటమే సమస్య.
యాభై సంవత్సరాల తర్వాత కూడా ఇంకా పాఠకులకు వినిపిస్తుందంటే రచయితకి తగ్గే స్థాయి ఏమీ లేదు. పైగా మరింత మంది ఈ పుస్తకాన్ని చదువుతారు ఈ వివాదాల వలన.

Sravya Vattikuti said...

@అమ్మా/అయ్యా కత్తి మహేష్ కుమార్ మీరు చదివిన చదువు , పుస్తకాలు మీకు కనీస సభ్యత కూడా నేర్పలేదనుకుంటా మీకు సమాధానం మీ బ్లాగు లోనే రాసాను .
సుజాత గారు మీరు పైన కామెంట్ పబ్లిష్ చేయటం తో నాకు సమాధానం ఇక్కడ తప్పలేదు క్షమించండి

KumarN said...

Hmm..most of the comments here are anticipated I guess. However, it is still interesting to read them.

As far me, I read Sujata's and Mahesh's issues are more with the "tone" of articles on Chivaraku Migiledi, as opposed to the substance of those posts.

And I think they are right as far as the 'tone' is concerned.

I don't think they are neither objecting nor advicing as to the way everyone should perceive a book.

Having said that, I agree with someone here that they themselves have resorted to this so called 'avahelana svaram' at times..more so Mahesh garu..so I see why Sravya is jumping the gun :-)

స్నేహ said...

* ఒక పుస్తకాన్ని "మంచి సాహిత్యం" లేదా క్లాసిక్ అని ఎలా నిర్థారిస్తాం?
ఒక రచయిత పుస్తకాన్ని రాసేటపుడు అది క్లాసిక్‌కా కాదా అన్న దృష్టితో రాస్తాడనుకోను.రచనలో వున్న గొప్పదనాన్ని గుర్తించి చేసే ప్రచారం వల్లనే గొప్పదనం వస్తుందేమో.
* ఎవరొప్పుకున్నా ఒప్పుకోకపోయినా చివరికి మిగిలేది నిస్సందేహంగా ఒక క్లాసిక్!
మీకు క్లాసిక్ అనిపించినది ఎవరికీ చెత్త అనిపించకూడదాండి.ఒకవేళ అనిపించినా బయటికి చెప్పకూడదా?

* కానీ పుస్తకం ద్వారా పాపం.......ఆ రచయిత ఏం చెప్పాలనుకున్నాడో కొంచెం అర్థం చేసుకోడానికి ప్రయత్నించాలనుకుంటా!
పుస్తకం చదివిన వాళ్ళందరికి రచయిత ఏమి చెప్పాలనుకున్నాడో అర్థం అవుతుందా. అర్థం అయినా రచయిత చెప్పాలనుకున్నది అదే అని ఎవరు నిర్ణయిస్తారు. మీరా, నేనా, విమర్శకులా, రచయితా.
*అర్థం కానప్పుడు దాని జోలికి పోకుండా వదిలెయ్యాలి. ఆ రచననొక గొప్ప రచనగా యాక్సెప్ట్ చేసిన అసంఖ్యాక పాఠకుల దృక్కోణాన్ని అవహేళన చేయడానికి ప్రయత్నించకూడదు.
మీరు చెప్పిన వ్యాసంలో నాకు అవహేళన కనపడలేదు. అవహేళన ఎక్కడ వుందో చెపుతారా?

*అబ్బ, ఏం సినిమా అది? ఒట్టి చెత్త! ఆ వెకిలి హాస్యం ఏమిటసలు? పాండవులు లేకుండా మహా భారతమేమిటి? ఘటోత్కచుడి వెకిలి హాస్యం చూడలేక చచ్చాను.తల్పం గిల్పం అదీ ఇదీ అంటూ పిచ్చి మాటలు!అసలు వాస్తవికతే లేదు!ఇంత బోర్ సినిమా నా జీవితంలో చూడలేదు"అని నా బ్లాగులో రివ్యూ రాస్తాననుకోండి! తిట్టడానికి తిట్లు కూడా దొరకనంత కోపం మీకు వస్తుంది కాదూ!

మాయాబజార్ చెత్త అంటే ఎవరికైనా ఎందుకు కోపం రావాలి. మీకు నచ్చింది, ఎందుకు నచ్చిందో చెప్పండి. చెత్త అనిపించిన వాళ్ళు ఎందుకు చెత్తనో చెప్తారు. మనకు ఇష్టంలేని అభిప్రాయాలు చెప్పిన వాళ్ళ మీద కోపం తెచ్చుకోవడం, తిట్లు తిట్టుకోవడం ఎందుకు?

*అసలు ఒక విషయంలో స్పష్టత కావాలి.ఒక పుస్తకాన్ని ఎలా చదవాలి?
పుస్తకాలు చదవడం ఎలా అని ఎందుకు చెప్పాలి ఎవరైనా వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు చదవలేరా?
*రచయిత ఏమి చెప్పాలనుకుంటున్నాడో అర్థం కాకపోవడం మన దౌర్భాగ్యమే!
జనాలకు అర్థం కాని రచనలు రాసి మనకు అర్థం కాలేదు కాబట్టి మన దౌర్భాగ్యం అనుకోవాలా?
*రచయిత ఒక విషయాన్ని తనదైన శైలిలో ఒక పుస్తకాన్ని రాస్తాడు.అంతవరకే అతని బాధ్యత! పుస్తకంలోని విషయాన్ని దగ్గర కూచుని పాఠకుడికి బోధించాల్సిన అవసరం అతనికి లేదు.దాన్ని సక్రమంగా గ్రహించాల్సిన బాధ్యత, అవసరం పాఠకుడిదే!
ఏది సక్రమం, ఏది అక్రమం ఎవరు నిర్ణయిస్తారు?
*ప్రతి పుస్తకానికీ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ మనకు అందకపోతే అందే పుస్తకాలనే చదవాలి మరి! అందని పుస్తకాల గురించి కనీసం అవహేళనగా మాట్లాడకుండా ఉండాలి!

అవహేళన ఎక్కడవుందో ఒక్కసారి చెప్పండి.

సుజాత said...

అబ్రకదబ్ర,
పాఠకులు తన స్థాయికి ఎదిగి మరీ చదవగలిగేంత ఆసక్తి రేకెత్తించగలిగినోడే అసలైన రచయిత.

పాఠకుడిని తన స్థాయికి ఎదిగేలా చేయాల్సిన బాధ్యత రచయితది కానే కాదని నేననుకుంటున్నాను. పాఠకుడు ఎదగాలంటే చదవాలి. చదవాలి.విస్తృతంగా చదవడమొక్కటే మార్గం! అప్పుడే రచయిత స్థాయికి పాఠకుడు ఎదుగుతాడు. రచయిత "tone" ని సరిగా గ్రహించగలుగుతారు. ఆ టోన్ ని గ్రహించలేని నాడు పుస్తకం చదవటం దండగే!

మీరూ రచయితగా మారారు కాబట్టి అడుగుతున్నాను...మీరు సైన్సు ఫిక్షన్ కథో, టైం మెషీన్ కథో రాయలనుకున్నడు కథ రాసి పాఠకులకు వదిలేస్తారా, అందులోని సబ్జెక్ట్ అంతా పాఠకులకు వివరిస్తూ కూచుంటారా?అలా వివరించాల్సి వస్తే "కథ" కు విలువుంటుందా?

BTW, ఇక్కడ చలం సబ్జెక్ట్ కాదు కాబట్టి మీరు రాసిన దానికి నేను స్పందించడం లేదు.

సుజాత said...

స్నేహ,
ఒక పుస్తకాన్ని అందరూ ఒకే రకంగా చదవక్కర్లేదు. కానీ ప్రతి పుస్తకానికి ఒక "tone" ఉంటుంది. దాన్ని గ్రహించలేని నాడు ఆ పుస్తకం చదవడం దండగే అని నా అభిప్రాయం!

బస్టాప్ లో నిలబడి బస్సొచ్చేదాకా టైం పాస్ కోసం చదివే పుస్తకాలూ, తీరిక దొరికినపుడో, తీరిక చేసుకునో సీరియస్ గా చదివే పుస్తకాలూ వేరని నేను నమ్ముతాను. నేను బస్టాప్ లో నిలబడి జిడ్డు కృష్ణమూర్తి పుస్తకాలు చదువుతాను,భగవద్గీతలోని కర్మ సన్యాస యోగం చదువుతాను ..అయితే ఏమిటి? అని ప్రశించే వాళ్ళకు సమాధానాలు ఉండవు. ఇవ్వాల్సిన పని లేదు కూడా.. మీరడిగిన మాయా బజార్ ప్రశ్నకు కూడా ఇదే సమాధానం వర్తిస్తుంది.

మీకు భగవద్గీత క్లాసిక్ కావొచ్చు, నేను బస్టాప్ లో నిలబడే చదువుతాను..అంటే ఎవరూ ఏమీ చెప్పలేరు. "సరే, ఎంజాయ్" అనడం తప్ప!

నేను చెప్పిన అవహేళన మీకు ఆ వ్యాసంలో కనపడకపోవడం నా తప్పు కాదు.అది ఎక్కడుందో అక్కడే వ్యాఖ్యలో రాశాను.

ఏది సక్రమం, ఏది అక్రమం ఎవరు నిర్ణయిస్తారు?..దీన్ని విజ్ఞత గల పాఠకులు నిర్ణయించుకోవాలి?

ఏది విజ్ఞత? ఏది కాదు అనే ప్రశ్న వస్తోంది కదూ!

ఇంతే! ఈ లూపుకి అంతం లేదు.

అన్నట్లు ఇక్కడ ఎవరూ ఎవరినీ తిట్టడం లేదు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు సూటిగా చెప్తున్నారు.

జనానికి అర్థం కాని రచనలు రాసి.......

జనంలో ఎవరికీ అర్థం కాకపోతే చివరికి మిగిలేది ఇన్నాళ్ళు నిలబడదు. కొంత మందికి అర్థం కానంత మాత్రాన, దాని విలువ ఏమీ తగ్గదు.

కత్తి మహేష్ కుమార్ said...

@అబ్రకదబ్ర: చదువరుల వర్గాల్ని "టార్గెట్" చేసి చలం,బుచ్చిబాబులు రచనలు చెయ్యలేదు. అయినా ఇప్పటికీ వారి రచనలు సజీవంగానే ఉన్నాయి. అందుకే ఈ చర్చలన్నీ. కాబట్టి మీ assumption సరికాదు."అతని రచన ఎక్కువమందికి (కనీసం, అతను ఏ ఏ వర్గాలని దృష్టిలో పెట్టుకుని రాశాడో ఆయా వర్గాలకీ) ఎక్కకపోతే అతను పరీక్ష తప్పినట్లే." అన్న ఆరోపణకు స్థానం లేదు.

ఇక చలం గురించి మీరు చెబుతున్నమాటలు చలం అభిమానులమని చెప్పుకునేవాళ్ళ భావాలతో మీకున్న విభేధమేతప్ప నిజంగా చలం గురించి కాదు. ఆయన రచనల గురించి అంతకన్నా కాదు. చలం లౌకికుడు కాదు కళాత్మకజీవి. ఆయన రచనల్లో సంస్కరణవాదం పాఠకులకు కనిపిస్తే కనిపించొచ్చుగాక, ఆయన ఉద్దేశ్యం మాత్రం కళాత్మకసృజన మాత్రమే. వాటి ఆధారంగా భౌతికజగత్తులోని నైతికతను చలానికి ఆపాదించి స్టీముదించుకోవడం,అనైతికుడని శుద్దిచెయ్యబూనడం ఎప్పటికీ జరిగేవే. మీరూ అదే చేస్తున్నారు.అంతే!

@శ్రావ్య వట్టికుట్టి: సభ్యాసభ్యాలు మీరు నా బ్లాగులో పెట్టిన వ్యాఖ్యలో తొణికిసలాడుతున్నాయి. మీ స్థాయి తెలియజేసినందుకు ధన్యవాదాలు.

LBS said...

ఈ టపాతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

"చివరికి మిగిలేది" లో నాకు అంగీకారయోగ్యం కానివి అనేకం ఉన్నాయి. కానీ అదొక మహా క్లాసిక్ అని ఒప్పుకుంటాను. ఎందుకంటే ఆ కథ యొక్క సెంటర్ పాయింట్ - ఆ కథలో ఎక్కడా, ఏ దశలోను కనిపించని హీరో తల్లి. దయానిధి యొక్క Mother fixation ని అర్థం చేసుకుంటేనే అతని ప్రవర్తననీ, ఆ కథనీ అర్థం చేసుకోగలం.

--తాడేపల్లి

దైవానిక said...

నాకు ఈ రెండు వ్యాసాలు చదివిన తరువాత అనిపించిన విషయాలు.
హేలీ గారు చెప్పింది, చివరకు మిగిలేదు రాజమౌళి/rgv సినిమాలా ఉంది అని. మీకు దాంట్లో వ్యంగ్యం కనిపిస్తుంది.
నేను చిన్నప్పుడు చదువుకున్న ఉపమా అలంకారాలు గుర్తొస్తున్నాయి. మా టీచరు గారు చెప్పిన definition ప్రకారము "ఉపమాన ఉపమేయములకు సామ్యము మనోహరముగా వర్ణించుట ఉపమా అలంకారము". ఇక్కడ మనోహారము అన్నది చాలా objective. అది ఒకొక్కరికి ఒకలాగా అర్థం అవ్వొచ్చు.
ఉదా: ౧. నీ మోము చంద్రబింబంలా ఉంది
౨. నీ మోము ఇడ్లీ లా ఉంది.
పైన చెప్పిన రెండు ఉదాహరణలు ఉపమా అలంకారాలే కదా.. మొదటిది కాస్త వినసొంపుగా, రెండోది కాస్త మొటుగా ఉండొచ్చు అది వేరే విషయం.

మీరు ఆ అబ్బాయి వ్యాసంలో లేని వ్యంగ్యాన్ని చూస్తున్నారేమో అని నాకనిపిస్తుంది. అతను చెప్పే సామ్యము కాస్త మోటుగా ఉండవచ్చునేమో కాని, వ్యంగ్యంగా కాని అవహేళనగా కాని నాకనిపించలేదు.

చివరగా, నాకు మాత్రం పర్సనల్ గా చివరకు మిగిలేది అస్సలు నచ్చలేదు. పుస్తకం అయిపోయాకా చాలా డిప్రెస్సింగా కూడా అనిపించింది. అదీ, అసమర్థుని జీవయాత్ర, చివరకు మిగిలేది వెంట వెంటనే చదివానా, ఇక చూస్కోండి నా బాధ.

kiran kumar said...

ఇక్కడ చాలా కామెంట్స్ హేలీ వ్యాసాన్ని వెనకేసుకు రావడానికి కావాలని రాసినట్లున్నాయే కానీ జెన్యూన్ గా కనపడట్లేదు."ఆ నవల క్లాసిక్ కాదు, కాదు కాదు " అని బల్ల గుద్ది చెప్పడానికి మొండిగా కంకణం కట్టుకుని వాదిస్తున్నట్లున్నాయే కానీ,అందులో నిజముందే లేదో వాళ్లకే తెలుసు.

సుజాత said...

తాడేపల్లి గారూ,
mother fixation అనే మాట మొదటగా ఫ్రాయిడ్ వాడాడని ఎక్కడో చదివాను. మీరన్నట్లు mother fixation గురించి చదివితే గానీ దయానిధి పాత్ర అర్థం కాదేమో!

సుజాత said...

దైవానిక,
మీకు కొత్తగా ఇక చెప్పేందుకేమీ లేదు. నేను రాయాల్సిన వ్యాఖ్యలు అక్కడే రాశాను. వాటిని ప్రతి చోటా మళ్ళీ వివరిస్తూ కూచోలేను.మిగతా చెప్పాలనుకున్నది ఇక్కడ నా టపాలో రాశాను.

సుజాత said...

మొత్తానికి చివరికి మిగిలేది నవల అర్థం కాని వారు, 20 పేజీలు చదివి బోరు కొట్టినవారూ, బుచ్చి బాబు శైలి అర్థం కాని వారూ దాన్నొక క్లాసిక్ గా ఒప్పుకోకపోవడాన్ని అర్థం చేసుకోవలసిందే!

ఈ నవలను నేను మొదట పదిహేడేళ్ళ వయసులో ఒక వక్తృత్వ పోటీలో అనుకుంటాను బహుమతిగా పొంది చదవడానికి ప్రయత్నించి ఆ శైలీ అదీ అర్థం కాక కొన్నాళ్ళు వదిలిపెట్టాను. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళ ప్రభావం చేత జేకే పుస్తకాలూ, ఈకే పుస్తకాలూ చదివి మళ్ళీ కొన్నాళ్లకి బుచ్చిబాబు వెంటపడ్డాను. అప్పటికి కొంచెం నయం. మొత్తానికి పాతిక నిండే సరికి ఈ నవల నాకు పూర్తిగా నచ్చింది..వివిధ స్టేజీల్లో చదివినా చివరికి అర్థం చేసుకోగలిగాను.:-)

ఇప్పటికీ ఎప్పుడు చదివినా కొత్తగా అప్పుడే చదువుతున్నట్టుంటుంది నాకు!

ఈ చర్చలో పాల్గొని అమూల్యాభిప్రాయాలు వెలిబుచ్చిన పాఠకులకు కృతజ్ఞతలు.చివరికి మిగిలేది మీద ఎక్కడైనా చర్చ జరిగినపుడు ఇది కొంచెమైనా ఉపయోగపడుతుందేమో చూద్దాం!

ఈ చర్చ ఇంతటితో సమాప్తం.(నాకే విసుగ్గా ఉంది) తిరిగి ఇదే అలవరసలపైన కొత్త టపా రాసినపుడు కలుసుకుందా! అంతవరకూ సెలవు.

చదువరి said...

"..చదువరిగారి చంకలెగురెయ్యడంతోనే.." ఓయ్ ఓయ్ మహేష్ గారూ, ఇదేంటిది.., మీతో మాట్టాడాలంటే మీ బ్లాగులో ఆడుకొమ్మని ఈ బ్లాగరి చెప్పారు కాబట్టి ఒద్దని ఒట్టేసుకున్నాను, భీష్ముడిలాగా. :)

ఇక్కడ ఈడు మాటాడ్డులెమ్మనే దైర్నంతోటే గదా ఇలా నామీద బాణాలేస్తున్నారు!? :) నన్ను మరోసారి భీష్ముణ్ణి చెయ్యదలచినట్టున్నారు!

సుజాత said...

మహేష్ గారూ, మీరు కూడా టపాకు సంబంధించని వ్యాఖ్యలేమైనా చేయాలనుకుంటే అది మీ బ్లాగులో చేయండి!

ప్రభాకర్ said...

సుజాత గారు మీ వివరణ అద్బుతం , మీ తదుపరి టపా మహిళా బిల్లు మీదే అనుకొంటాను..

Ali said...

"చివరకు మిగిలేది" చదివిన తరువాత నాకు చివరకు ఎవీ మిగల్లేదండీ...:-)

Post a Comment