October 19, 2010

సరదాగా కాసేపు...:-))

ప్రయాణాల్లో పుస్తకాలు తోడుంటే ఎంతో బావుంటుంది. కానీ రైల్లో ప్రయాణిస్తూ ఉన్నపుడు సీరియస్ పుస్తకాలు కాక, హాస్యాన్ని పంచి నవ్వులు పూయించే పుస్తకాలు చేతిలోఉంటే హాయిగా ఉంటుంది. మధ్య మధ్యలో బయటికి చూస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ, అప్పుడప్పుడూ పుస్తకం చదువుతూ ఉండాలి. పుస్తకంలో లీనమైపోయి మన స్టేషన్ దాటి పక్క స్టేషన్లో దిగేలా చేసే పుస్తకాలు రైలు ప్రయాణాల్లో నేను అడ్వైజ్ చేయను. ఒకసారి హైద్రాబాదు నుంచి ఢిల్లీ వెళ్ళేందుకు ఏపీ ఎక్స్ ప్రెస్సెక్కి రాంబాబు డైరీ చదివాను.  26 గంటల ప్రయాణం హాయిగా నవ్వులతో గడిచిపోయింది. (రాంబాబు పరిచయం చేసుకోదగ్గ స్నేహితుడు)  

అలాగే ఈ మధ్య ప్రముఖ కార్టూనిస్టు సరసి(సరస్వతుల రామ నరసింహం) గారి కార్టూనుల సంకలనం కొన్నాను. నాకు ఆయన కార్టూనులంటే చాలా ఇష్టం! ముఖ్యం గా ఆ గీతలో expression అధ్భుతంగా పండుతుంది. అది చాలా గొప్ప విషయం,కార్టూను ప్రాథమిక లక్షణం!

మూడ్ ఎంత చెత్తగా ఉన్నా, ఈ సరసి కార్టూనులు చూస్తే చటుక్కున నవ్వొచ్చి మూడ్ బాగై పోయే అవకాశం ఉంది!

మచ్చుకు కొన్ని కార్టూనులు ఇక్కడ సరదాగా కాసేపు నవ్వుకోడానికి!

ఎంచక్కా కొని దగ్గర పెట్టేసుకుంటే ఎవరిమీదైనా బోల్డంత ఖోపం వచ్చినపుడు చదివి దాన్ని పోగొట్టుకోడానికి మంచి టానిక్ !

ఏ బోరు కొట్టించే సాహితీ సమావేశానికో, సన్మాన కార్యక్రమానికో మిత్రులెవరైనా పిలిచారనుకోండి, ఈ పుస్తకం చేతిలో పట్టుకుని చివరి లైన్లో కూచోవాలి. సన్మాన గ్రహీతకి శాలువా కప్పేటప్పుడో, పుస్తకావిష్కరణ టైములోనో మీరు గొల్లున నవ్వితే నా పూచీ లేదు మరి!   :-))


కొనుక్కోవాలంటే విశాలాంధ్ర, నవోదయ వంటి ప్రముఖ షాపుల్లో దొరుకుతుంది.  సరసి బొమ్మలు పంచిన వినోదంతో పోల్చుకుంటే వెల పెద్ద ఎక్కువేం కాదనిపించింది...75 రూపాయలు!  10 comments:

కొంచెం మానవత్వం said...

Hahahaha..... Nice andi.

ఆ.సౌమ్య said...

సరసి గురించి ఎప్పుడూ వినలేదండీ, ఈ సారి తప్పక కొనేస్తాను ఆయన పుస్తకాలని. పైన మీరు పెట్టిన కార్టూన్లు భలే ఉన్నాయి.

నాకూ ప్రయాణాల్లో పుస్తకాలు చదవడం చాలా అలవాటు. దూరాలు వెళ్ళాలంటే ఓ 4-5 పుస్తకాలు ఖచ్చితంగా పెట్టుకుంటా. ఇప్పుడు కూడా రోజూ మెట్రోలో ఆఫీసుకి వస్తు పోతున్నప్పుడు చదివేసుకుంటూ ఉంటా. అలా బోలెడు పుస్తకాలు పూర్తిచేస్తున్నా.

మధురవాణి said...

Thank you Sujatha garu!
భలే ఉన్నాయి కార్టూన్లు. :)
నేను చాలాసార్లు పత్రికల్లో సరసి గారి కార్టూన్లు చూసాను. ఆయన పూర్తి పేరు మాత్రం ఇప్పుడే తెలిసింది. కొనాల్సిన పుస్తకాల లిస్టులో ఇది పెట్టేసాను. :)
అన్నట్టు, ఆ రాంబాబు డైరీ కథా కమామీషు ఏవిటో కూడా కాస్త చెబుదురూ!

మనసు పలికే said...

సుజాత గారు, చాలా బాగుందండీ మీ టపా. చాలా మంచి విషయాన్ని పంచుకున్నారు. నేను కొనాలనుకుంటున్న పుస్తకాల లిస్ట్‌లో కూడా ఇవి చేర్చేశాను..:)

రవిగారు said...

ఇంత మంచి మంచి పుస్తకాల్ని పరిచయం చేస్తున్న మిమ్మల్ని సన్మానించ వలసిందే.
వచ్చిన అతిధులకి ప్రవేశ ద్వారం లోనే యి పుస్తకాని ఉచిత పంపిణి కూడా చేద్దాం ----)

అబ్రకదబ్ర said...

>> "రాంబాబు పరిచయం చేసుకోదగ్గ స్నేహితుడు"

మరే. ఎంత మంచోడవకపోతే డైరీ చదూకోమని మీకిచ్చేస్తాడు!

వేణూ శ్రీకాంత్ said...

సరసి గారి గీతలతో నాకూ పరిచయం ఉంది కాని ఈయన పుస్తకాలు ఎక్కడా చూడలేదండి. వీక్లీలకే పరిమితమనుకున్నా.. బాగున్నాయ్ మీ టపా లో పంచుకున్న కార్టూన్లు.

సుజాత said...

వేణు గారు,
థాంక్యూ!

సౌమ్యా, ఆయన కార్టూనులు నాకు జంధ్యాలను గుర్తుకు తెస్తాయి. ఈ పుస్తకం చూసి తనెకెళ్ళ భరణి గారు కూడా " ఇక మీరొక మంచి కామెడీ మూవీ డైరెక్టరైపోవచ్చండీ" అన్నారట కూడా!

మధుర వాణి,
రాంబాబు చాలా మంచోడు. కాస్త తీరిక చూసుకుని పరిచయం చేస్తా మీ అందరికీ!

మనసు పలికే,
థాంక్యూ!

రవి గారూ,
అమ్మో, థాంక్స్, కుట్ర ముందే బయట పెట్టారు. ఈ సన్మానానికి నేనొప్పుకోను. లేదా "లోపలికి వచ్చువారు పుస్తకాలు తేరాదు" అనే కండిషన్ మీద ఓకే!

అబ్రకదబ్ర,
రాంబాబు ఎంతో స్వచ్ఛమైన వాడు.చాలా నవ్విస్తాడు. కానీ అలాంటి వాడిని నిజజీవితంలో భరించాలంటే బోల్డు సహనం ఉండాలి. అతగాడి డైరీ నంపాసా గారు ఆంధ్ర దేశానికంతటికీ ఇచ్చారు, అచ్చేసి మరీ! :-))

వేణూ శ్రీ,
ఇవి కొన్ని మాత్రమే! కడుపుబ్బ నవ్వించే కార్టూనులు ఈ పుస్తకం నిండా ఉన్నాయి.

శివరంజని said...

భలే ఉన్నాయి కార్టూన్లు. :) ఇంకా నవ్వుతూనే ఉన్నా చాలా చాలా బాగున్నాయి కార్టూన్స్...ఈ బుక్ తప్పక కొనాల్సిందే

కృష్ణశ్రీ said...

ఎంపిక చేసిన "సరసి" కార్టూన్లు చాలా బాగున్నాయి. చెయ్యితిరిగిన కార్టూనిస్టుల్లో ఒకరు ఆయన.

పనిలో పని, నా క్రింది టపాని చదవండి.

http://kyamedidotcom.blogspot.com/2010/10/blog-post_17.html

Post a Comment