April 18, 2011

నామిని నెంబర్ వన్ పుడింగా? ఏమో!


నామిని కొత్త పుస్తకం వచ్చిందనగానే ఆయన భాషలో చెప్పాలంటే ఆడెగిరి ఈడ దూకినంత పని చేసి ఆ పుస్తకం సంపాదించా!(నేను చదివేటప్పటికి మార్కెట్లోకి రాలేదు!ఇప్పుడు వచ్చేసి ఉండొచ్చు)కానీ ఈ పుస్తకంతో నామిని నా లాంటి అభిమానులకు ఇంకా చెప్పాలంటే వీరాభిమానులకు చాలా నిరాశ కలిగించాడు. (రచయితకూ అభిమానులకూ మధ్య ఉండే చనువు కొద్దీ "డు" అంటున్నా)

"నా ఇష్టం" తో వర్మ ఏమైనా inspiration ఇచ్చాడేమో గానీ ఇందులో నామిని తను చేసిన చెత్త పనులన్నీ "మొగలాయితనం"కింద లెక్కేసి చెప్పుకున్నాడు. నామిని పుస్తకాలన్నీ ఆయన జీవిత చరిత్రే! పచ్చనాకు సాక్షిగా,సినబ్బ కతలు,,మిట్టూరోడి కతలు ఇవన్నీ వరసగా పేరిస్తే నామిని జీవిత కథ సగం!ఆంధ్రజ్యోతి వీక్లీకి ఎడిటర్ అయిన తర్వాత నామిని కతేమయింది? ఆయన తిరప్తి పోయి ఏం చేశాడు? జీవనం ఎలా గడిచింది? ఈ ప్రశ్నలన్నింటికీ నామిని ఇందులో జవాబులు చెప్తాడు.

ఈ క్రమంలో నామిని కి సహాయం చేసిన వాళ్ళూ ,చెయ్యని వాళ్ళూ,చులకనగా మాట్లాడిన వాళ్ళూ,అందరి గురించీ రాశాడు. కొంచెం కూడా వెనకాడలా! ఇదంతా బాగానే ఉంది.

"నా జీవితంలో ఇలా జరిగింది" అని చెప్పడంలో తను చేసిన పనుల పట్ల confession ఉందా అనే మాటకు జవాబు దొరకదు.

అయితే కొంతమంది గురించి నామిని చేతికొచ్చినట్టు రాయడం నాకు నచ్చలా! ముఖ్యంగా ఇల్లేరమ్మ కతలు రాసిన సోమరాజు సుశీల గారి గురించి ఆయన ఈ పుస్తకంలో చాలా చోట్ల అనేక "విసుర్లు" విసిరారు! ఎందుకంటే ఆవిడ ఆంధ్ర జ్యోతి మూతపడి నామిని నిరుద్యోగిగా మిగిలినపుడు, కంప్యూటర్ కొనిమ్మని అడిగినపుడు "ఏనుగు పడిందండీ! ఏనుగే లేవాలి. ఎవరూ లేపలేరు" అన్నందుకు! అయితే అంతకు ముందు ఆవిడ చేసిన ఆర్థిక సహాయాన్ని కూడా నామిని ప్రస్తావించాడనుకోండి.

సుశీల గారి భర్త బూతులు తిట్టడం...ఇలాంటివి తెలుసుకోవాలని పాఠకులెవరూ అనుకోరు! అలాగే నామిని శ్రీమతి అత్తగారిని సరిగా చూడకపోవడం, ఆ వంక పెట్టుకుని ఆయన భార్యను కొట్టడం,మామగారి మొహం మీద ఉమ్మేయడం ఇలాంటి వాటిని "ఓపెన్ గా రాసుకున్నా"అనుకోడానికే కానీ పాఠకుల దృష్టిలో ఆసక్తి కరమైనవీ కాదు! ఇలాంటివి బలవంతాన పాఠకుల చేత ఎందుకు చదివించడం? "నా జీవితాన్ని నేను రాసుకున్నా" అని మొండికి తిరుక్కుంటే ఏం చేయలేం!

ఆయన పుస్తకాలు అమ్మడానికి ఎంత శ్రమ పడ్డాడో, ఎన్ని డబ్బులు సంపాదించాడో, ఆ డబ్బులతో రియల్ ఎస్టేట్లో దిగి ప్రస్తుతం కోటీశ్వరుడిగా ఎలా మారిపోయాడో చెప్పడం బాగానే ఉంది కానీ అందులో స్వోత్కర్ష పాళ్ళు మరీ ఎక్కువై పోయాయి.నామిని పుస్తకాల్లో ఉండే "చదివించే లక్షణం" ఈ పుస్తకంలో కనిపించలేదు కదా, మధ్య మధ్యలో "ఏందీ గోల" అని పుస్తకం వదిలేసి లేచెళ్ళిపోదామనిపించింది.

ఇహ ఇతర రచయితల పుస్తకాల మీద నామిని అమూల్యాభిప్రాయాలు చదివి తీరాలి. ఆ అభిప్రాయాలు చెప్పడంలో ఏదైనా హాస్యం,చమత్కారం ఉందేమో అని వెదకబోయాను కానీ...అబ్బే! కనపళ్ళా!

కేశవ రెడ్డి "ఇంక్రెడిబుల్ గాడెస్" అని రాయలసీమ పల్లెటూరి కథకు పేరు పెట్టడం,పులికంటి కృష్ణా రెడ్డి "కోటిగాడు స్వతంత్రుడు"అని పెట్టడం గానీ ఈయనకు నచ్చలేదు. పల్లెటూళ్ళ గురించి రాసే సాహిత్యమంతా చచ్చినట్టు ఆ మాండలికంలో ఉండి తీరాలట. కొటేషన్స్ లో ఉండే మాటలూ,(డైలాగులు),కొటేషన్స్ బయట ఉండే మాటలు(రచయిత నెరేషన్) రెండూవేర్వేరు గా ఉండకూడదట.

కేశవరెడ్డి గానీ,కారా,చాసో,ఎవరి రచనలనీ తను "మతింపు"చేయలా అని చెప్పుకోడం! ఇదివరలో ఇలాంటి మాటలు నామిని వాడలా! ఈ పుస్తకం రాసిన "పుడింగి నామిని"నాకు పూర్తిగా కొత్త!

"అమ్మ పైరుగాలిరా,అది మన ప్రాణవాయువురా"అని గజల్ శ్రీనివాస్ పాడితే..ఊహూ.."అవి పోయి పజ్యాలా"అనిపించిందిట. ఇహ వంశీ పసలపూడి కథలైతే "ఒట్టి పోరంబోకు కతలమాదిరిగా" అనిపించాయి నామినికి . ఆ కతల్లో మాటి మాటికీ వచ్చే ఇంటిపేర్లు తప్ప రంగు రుచి వాసన ఏవీ లేవుట. పుస్తకంలో చాలా భాగం ఇవే మాటలు!

"నేను డబ్బు కోసం పుస్తకాలు రాయలేదు"అంటూనే పుస్తకాల వల్ల ఎంత డబ్బు వచ్చిందో చెప్తాడు. చివర్లో చెప్పిన సాహిత్య బీరువా అయిడియా భరించలేకపోయాను నేను.అందరు రచయితలనీ ఎద్దేవా చేయడమే! గొప్ప పుస్తకాలుగా పేరు పడ్డవి మాత్రమే సాహిత్యం కాదు, అని నిష్టూరపడటం తెలుస్తోంది గాని అందులో వెక్కిరింపు పాళ్ళు ఎక్కువై వికటించింది.

అసలు నామిని ఉక్రోషం,కోపం ఎవరిమీదో ప్చ్ ....ఏదో, మామూలు పాఠకురాలిని....గ్రహించలేకపోయాను.!

ఈ పుస్తకం లక్ష్యమేమిటో ఆయన దగ్గరి స్నేహితులకు,గొప్ప విమర్శకులకు తప్ప అంతుపట్టదు.

ఏనుగు పడింది! ఏనుగే లేచింది. కానీ ఇలా పడి లేచిన ఏనుగులెన్నో ప్రపంచం నిండా చాలా ఉంటాయి. కానీ ఈ మాదిరి "తిమురు" తో ఘీంకరించవనుకుంటున్నా!

బహుశా ఈ పుస్తకం లో ఉన్న కంటెంట్ వల్ల కాబోలు బాపుని బొమ్మలేయమని అడిగినట్టు లేదు నామిని! ఒక్క బొమ్మకూడా లేదు.

ఇహపై ఇలాగే రాస్తే నామిని పుస్తకాల్ని అభిమానులు పక్కన పెట్టడానికి ఇదే మొదటి పుస్తకమవుతుంది.


48 comments:

KumarN said...

:-)

astrojoyd said...

excellent analysis,due to his head weight only,he fallen down.as i know naamini is a no 1 sadist,when he is in a.jyothi as mufsl desk incharge.pani takkuva vaagudekkuva naaminiki..oh sorry no-1..pudingiki.he mostly sit wyh the news editor by saying somehing on his subordinates.ivanni cheppukoledemi naamini e chettha pustakamlo?

S said...

నేను, మొదట ఒక ఇరవై పేజీలేమో చదివా. అసలుకే ఏదీ చదవట్లేదేమో, మళ్ళీ ఈ యాసలో చదవలేను ఇప్పుడు అని పక్కన పెట్టేశా. మీరు చెప్తూంటే...అర్జెంటుగా చదవాలి అనిపిస్తోంది :)) అంటే, అలా ఎలా ఇష్టమొచ్చినట్లు రాసారో చూద్దామని!!

సిరిసిరిమువ్వ said...

ఇంతకు ముందు కోతికొమ్మచ్చి బ్లాగులో బాలు గారు కూడా ఈ పుస్తకాన్ని గురించి వ్రాసారు.

http://kothikommachchi.blogspot.com/2011/03/blog-post.html

అప్పుడే అనుకున్నా ఈ పుస్తకం ఆయన అభిమానులికి నిరాశ కలిగిస్తుందేమో అని! ఓ రచయిత పుస్తకాలు చదివి అతని మీద ఓ అభిప్రాయం ఏర్పరుచుకుంటే చివరికి నిరాశచెందేది పాఠకులే!

ఎంత కన్ఫెషను అయినా మీరు చెప్పినట్టు కొన్ని కొన్ని వ్యక్తిగత విషయాలు పాఠకులకి అనవసరం! ఓ విధంగా అది పాఠకులల్లో ఆ రచయిత మీద ఓ నెగటివ్ ఇమేజిని కలిగిస్తుంది.

ఇంతకు ముందు కల్పన గారి బ్లాగులో ఆయన ప్రసంగం గురించి వ్రాసినప్పుడు..ఆ ప్రసంగాన్ని చదివినప్పుడు నాకు కాస్త నిరాశ కలిగింది..

http://kalpanarentala.blogspot.com/2010/01/blog-post_29.html

నామిని ఇలాంటివాడా అనిపించింది..అందుకే రచయిత రాతల్నిబట్టి వాళ్ల వ్యక్తిత్వాలని బేరీజు వేసుకోకూడదు..రచనల్ని రచనలగానే చూడాలి అనిపించింది..ఈ పుస్తకంతో అది ఇంకా బలపడింది! వ్యక్తిత్వాలు వేరు..అభిప్రాయాలు వేరు..రచనలు వేరు.

కానీ ఇప్పటి తన రచనలు ఎలాగన్నా ఉండనివ్వండి తెలుగు సాహిత్యంలో ఓ రచయితగా నామినికి ఓ ప్రత్యేక స్థానం ఎప్పుడూ ఉంటుంది. ఆయన ఆ స్థానాన్ని నిలబెట్టుకునే రచనలు చేస్తే బాగుంటుంది.

సుజాత said...

వరూధిని గారూ

వ్యక్తిత్వాలు వేరు..అభిప్రాయాలు వేరు..రచనలు వేరు.___________అవును! కానీ నామిని మొదటినుంచీ "కల్పనా సాహిత్యం"(fiction) కాకుండా తన బాల్యాన్ని, దుర్భర దారిద్ర్యపు జీవితాన్ని, కథలు గా రాసుకున్నాడు కాబట్టి మనం వాటిని బట్టి ఆయన మీద ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నాం! అందుకే నామిని ఈ పుస్తకాన్ని "ఇలా" రాశాడంటే నమ్మలేకపోయాను.

వ్యక్తిగతంగా కలిసినపుడు కూడా ఎంతో ప్లెయిన్ గా నిరాడంబరంగా ఉండే నామిని అభిప్రాయాలేనా ఇవన్నీ అని నిరాశ కల్గింది.

తెలుగు సాహిత్యంలో ఓ రచయితగా నామినికి ఓ ప్రత్యేక స్థానం ఎప్పుడూ ఉంటుంది. ఆయన ఆ స్థానాన్ని నిలబెట్టుకునే రచనలు చేస్తే బాగుంటుంది___ఇదే నా అభిప్రాయం కూడా!

MURALI said...

నామినిగారి పుస్తకాలు నేను ఇంతవరకూ చదవలేదు. చాలాసార్లు చదవాలనుకొని ఆ మాండలీకంలో చదవగలనో లేదో అనుమానం వల్ల ప్రయత్నించలేదు. కానీ పసలపూడి కధలు గురించి ఆయన విమర్శించటం చాలా భాదగా అనిపించింది. కేవలం మాండలీకాలు, ఇంటిపేర్లేనా పసలపూడి కధలు. అందంగా ఒదిగిపోయినా జీవన చిత్రాలు కనిపించలేదా ఆయనకి. మన పక్కనే కూర్చుని, మనతో మాట్లాడి గుండెలోతుల్లోనుండి తమ వెతలు మనకు చెప్పి సజీవంగా మిగిలిపోయిన పాత్రలు కనిపించలేదా. వృత్తిని వదిలి వ్యసనానికి లొంగితే పతనం ఎలా ఉంటుందో చూపిన కధలున్నాయి. ఒక మనిషి మహాత్ముడిగా, పరమాత్ముడిగా మారిన మార్గాన్ని చూపిన కధలున్నాయి. అంతెందుకండీ భావితరలాకి అమెజాన్,సింధు నాగరికతల్లా గోదావరి నాగరికత నేర్చుకోవాలంటే పసలపూడి కధలే వాళ్ళకు టెక్స్ట్‌బుక్. మీరన్నట్టు పడిలేచిన ఏనుగులు 10 గడపలున్న ప్రతీ ఊర్లోనీ ఉంటాయి. అందులో గొప్పేం లేదు, పుడింగత్వం అంతకంటే లేదు.

సుజాత said...

మురళీ, నామిని చాలా మంచి రచయిత. ఆయన కథలు చదవండి మీరు! (ఈ పుస్తకాన్ని పక్కన పెట్టండి, మిగతా రచనలన్నీ చదివాక అప్పుడు చదువుదురుగానీ) . రాయలసీమ పేద జీవితాల్ని ప్రతిభావంతంగా చిత్రించిన రచయిత. ఆ మాండలికం మొదట్లో కష్టంగా ఉన్నా రాను రాను మనక్కూడా అలవాటైపోతుంది

రాఘవ said...

ఒక రచనలో ఆ రచయిత హృదయం ఆవిష్కృతమౌతుంది... బయటకు కనబడకపోయినా, అంతర్లీనంగానైనా సరే. తనకు నచ్చనిది తనకు ఆమోదయోగ్యం కానిది ఎవరైనా వ్రాయలేరు కనుక. ఉదాహరణకు ఏ విశ్వనాథవారినో ఏ జాషువానో తీసుకోండి.

వ్రాసేది ఒట్టి కబుర్లు మాత్రమే ఐతే, ఆ మాత్రం కబుర్లు ఎవరైనా చెప్పగలరు. కేవలం కబుర్లనూ సంఘటనలనూ యథాతథంగా చెబితే, దానిని కథ అనటంకంటె వార్త అనటం న్యాయ్యం. మాండలికం తెలుసుకోవటం కోసం చదువుతాను అనుకుంటే మాండలికపాఠనం ఒక్కటే ప్రయోజనంలా కనిపిస్తుంది. దానికైతే నిఘంటువులను ఆశ్రయించటం లఘువైన పద్ధతి.

నేనింతవఱకూ నామినివారివి ఏమీ చదవలేదు. ఇప్పుడు మీరు వ్రాసిన ఈ వ్యాసం చదివాక... ఈయనను చదువనవసరం లేదనీ, నేను ఈయనను చదువకపోవటం వల్ల తెలుగుసాహిత్యంలో విశేషంగా ఏమీ కోల్పోలేదనీ అనిపిస్తోంది!

సుజాత said...

రాఘవ,

ఈ ఒక్క పుస్తకం పట్లే నా వ్యతిరేక్తత! తెలుగు సాహిత్యంలో తనదంటూ ముద్ర వేసిన నామిని పుస్తకాలు సహజంగా ఉంటాయి.

Sravya Vattikuti said...

హ్మ్ ! template మార్చారా ? ఇప్పటికి రెండు సార్లు వాఖ్యాల ద్వారా ఈ లింక్ ఓపెన్ చేసి వస్తున్నా , మీ బ్లాగు కాదు అని క్లోజ్ చేసున్నా :)

ఈ పుస్తకం నేను చదివాను , సాధారం ఎంత పెద్ద పుస్తకం అయినా maximum 10 రోజులు పట్టని నాకు , ఇది చదవటానికి మాత్రం రెండు నెలల దాక పట్టింది . నాకు అస్సలు నచ్చలేదు , ఇంతకనా ఎక్కువ రాయలేను ;)

వేణూ శ్రీకాంత్ said...

నిస్పాక్షికంగా రాసిన రివ్యూ బాగుంది సుజాత గారు.. నా ఇష్టమ్ మొన్నే కదా వచ్చింది.. నామిని గారు ఈ పుస్తకం మొదలెట్టి చాన్నాళ్ళే ఐ ఉండచ్చు అనుకుంటున్నాను.. ఆయన పుస్తకాలు కొంచెం సూటిగానే ఉంటాయి కనుక ఉన్నదున్నట్లు రాయాలనే ఆలోచన తనదే ఐఉండచ్చు... బాల్యంలో తననుభవించిన పేదరికం గురించి తెలుసున్నవారు(పాఠకులు), తను ఎన్ని కష్టాలు పడి మాయలు చేసి పైకొచ్చింది తెలుసుకుని తనని అర్ధం చేసుకుంటారు అనే నమ్మకమేమో.. ఏమైనా ఈ పుస్తకం కొని చదవకుండా ఉండటం కొంచెం కష్టమే నేను ఇంకా కొందామనే ఆలోచిస్తున్నాను..

వేణూ శ్రీకాంత్ said...

రాఘవ గారు.. జరిగిన సంఘటనను ఒక వార్తగా చెప్పడం వేరు.. కానీ తన రచన ద్వారా మన వేలుపట్టి తనతో తీసుకు వెళ్ళి సాధారణ పాఠకులకు తెలియని/గమనించని ఒక దృక్కోణాన్ని చూపించడం నామిని గారి ప్రత్యేకత.. అది తను తన మాండలీకంలో సహజంగా మనం ఆ సంఘటన జరుగుతున్న స్థలంలో ఉన్నట్లు అనిపించేలా చెప్తారు.. మనం రోజువారీ సంఘటనలుగా పట్టించుకోకుండా వదిలేసే వాటినుండి ఎన్ని నేర్చుకోవచ్చో తెలియచెప్తారు. అందుకే చదవాలి తన రచనలు..

Sravya Vattikuti said...

వేణు గారు నా దగ్గర కాంప్లిమెంటరీ కాపీ మీకు కావాలంటే పంపగలను !

రమణ said...

// కొటేషన్స్ లో ఉండే మాటలూ,(డైలాగులు),కొటేషన్స్ బయట ఉండే మాటలు(రచయిత నెరేషన్) రెండూవేర్వేరు గా ఉండకూడదట. //

ఎవరైనా ఈ విధంగా నేను చదవలేదు. ఇక నామిని గారు రాసింది చదవాలేమో!!. ఇది మరీ ఎక్కువ. మెహర్ గారు ఎప్పుడో ఒక లింక్ పోస్టులో ఉంచితే చదివా.

సుజాత said...

రమణగారూ,
అంటే పూర్తిగా text మొత్తం రాయలసీమ మాండలికం లో రాయాలని నామిని ఉద్దేశం! కేశవెరెడ్డి గారి నవలల్లో పాత్రలు మాండలికం మాట్లాడినా ఆయా పాత్రల గురించి రచయిత మాండలికంలో మాట్లాడ్డు! ప్రామాణికమైన తెలుగు మాట్లాడతాడు. నామిని అలా కాదు. మొత్తం మాండలికంలో రాస్తాడు. అదీ ఆయన చెప్పేది

సుజాత said...

శ్రావ్య, అవును టెంప్లేట్ మార్చాను. ఆ తర్వాత ఇదే మొదటి పోస్టు! నేనూ ఇది నా బ్లాగులా లేదనుకుంటున్నా అప్పుడప్పుడు:-)

ఈ పుస్తకం మార్కెట్లోకి వచ్చిన్ నాలుగు రోజులైంది. పబ్లిషర్ కూడా నామినే! మీ వద్దకు రెండు నెలల ముందే వచ్చిందంటే ఆశ్చర్యమే!

"చదివించే లక్షణం" లేదు కదా! అందుకే

ఆ.సౌమ్య said...

కొంత చదివిన తరువాత నాకూ అలాగే అనిపించిందండీ...మీరంటే ఓపికగా మొత్తం చదివారుగానీ నాకు చదవబుద్దికాలేదు. కొంచం విసుగొచ్చింది. స్వోత్కర్షే కాకుండా పక్కవాళ్ళని పిచ్చి పిచ్చిగా తిట్టడం బాలేదు."....చెడ్డతనంలో వరం కంటే నాలుగాకులెక్కువే". ఎవరు ఎలాంటి వారైనా ఇలా రాయడం నాకు అస్సలు నచ్చలేదు.


నాకు మిట్టూరోడి కథలు, పచ్చనాకు సాక్షిగా అవన్నీ గుర్తొచ్చి బలే బాధేసింది..ఈయనేనా ఇలా రాసారు అని.

వేణు said...

తనకు సన్మానం జరిగినపుడు నామిని ‘పాఠకులను క్షమించలేను’ అంటూ ప్రసంగించాడు కదా? దానిపై ‘నామినీ, కొంచెం బడాయి తగ్గించుకో’ అంటూ రంగనాయకమ్మ గారు (లింక్:
http://kalpanarentala.blogspot.com/2010/02/blog-post_15.html) చేసిన విమర్శకు నామిని స్పందన ఈ పుస్తకంలో కనిపిస్తుంది.

‘నేనేమీ ఆ పెద్దామెకి సమాధానం యియ్యలా. ఏముంటాది నా దగ్గిర!’ అంటూనే ఏమి రాశాడో చూడండి- ‘..ఇట్టా నా పిలకాయలు కూడా ఎక్కొచ్చి దుర్మార్గపు జీతాలు సంపాయించుకున్నాక నాకు కండ్లు నెత్తికెక్కి బతకలేక కక్కుర్తి పనులు చేసేవాళ్ళ మిందికి ఒంటికాలెత్తుకోని పోయే దౌర్జన్యం నాకు అంటకుండును గాక!’! అంటే- ఆ విమర్శ ‘కండ్లు నెత్తికెక్కి’ ‘దౌర్జన్యం’ చేసినట్టుగా ఉందని నామిని భావిస్తున్నాడన్నమాట!

Sravya Vattikuti said...

హ హ సుజాత గారు అవునది ముందే సంపాదించగలిగాను దానికి హెల్ప్ చేసినవాళ్ళు , చాల కష్టపడ్డారు , అందుకే negative గా మరీ ఎక్కువగా ఏమి అనలేకపోతున్నా :)

Sravya Vattikuti said...

btw నేను చదివిన దానికి , ఫైనల్ వెర్షన్ కి ఏదన్న తేడా ఉంటుందేమో అని ఆరు రోజుల క్రితం వేరే కాపీ చూసే వరకు కొంచెం ఆశ పడ్డా :(

రవి said...

రచయిత - "చూసి" రాయడం వేరు. స్వయంగా తన జీవితంలో జరిగింది రాయడం వేరు.నామిని రెండవ తరహా వ్యక్తిలా కనబడుతూంది. అయితే తన జీవితంలో జరిగినవన్నీ సత్యాలేననీ ఆ అనుభూతులే అందరికీ ఉండాలని మంకుపట్టు పట్టడం పిల్లతనం. ఏమైనా ఈ పుస్తకం చదవాలని నిశ్చయించుకున్నాను.

ఇహ పోతే పసలపూడి కథలు. ఈ కథల్లో నేలవిడిచి సాము చేసిన పాత్రలు, ఇంటి పేర్లతో నేటివిటీ తీసుకువచ్చే కృతకప్రయత్నం, "గోదావరి" సొగసు అంతర్లీనంగా కాక కథలను ప్రమోట్ చేసే దిశగా ఉండడం, మాండలికం ప్రాంతీయత ముసుగులో అక్కడక్కడా సెక్స్ వ్రాయడం - ఇవన్నీ అటుంచితే ఓ మారు బాపు బొమ్మలు వేయలేదనుకుని ఆ బొమ్మలను మనసులో తుడిచేసి నిజాయితీగా మా పసలపూడి కథలు గురించి ఊహించండి. అమరావతి కథలు, మిట్టూరోడి కథలు, మధురాంతకం రాజారాం కథలు ఇలాంటి వాటి సరసన పోల్చి లెక్క చూసుకోవచ్చు.

kiran kumar said...

పసల పూడి కథల్లో తిండి, సెక్స్ కి అధిక ప్రాధాన్యం! ఆ రెండూ మనిషి జీవితంలో ప్రధానం అనుకున్నాడేమో వంశీ! అంతకు మించి గోదావరి సంస్కృతి ని ప్రతిబించే కథలుగా అవి అనిపించవు. మనుషుల పరిచయమే ఎక్కువా ఉంటుంది వాటిలో! సంస్కృతి పరిచయం కాదు.

మనుషుల ద్వారా సంస్కృతిని గ్రహించలేం! అందునా మామూలుగా సెక్స్, తిండి కోసం బ్రతికే మామూలు మనుషుల కథల ద్వారా! జీవన విధానం కంటే ఈ కథల్లో మనుషుల అనుభవాలకు, భావోద్వేగాలకు ప్రాముఖ్యం ఎక్కువ

విజయవర్ధన్ said...

ఈ రోజు (19 Apr 2011) సాక్షిలో వచ్చిన సమీక్ష:
౧. http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/19042011/Details.aspx?id=875873&boxid=28202236

౨. http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/19042011/Details.aspx?id=875873&boxid=28201782

సుజాత said...

పసలపూడి కథల విషయంలో కిరణ్ కుమార్ గారితో కొంత వరకూ ఏకీభవిస్తూ, నాగమురళితో కొద్దిగా విభేదిస్తున్నాను!

పసల పూడి కథల్లో పాత్రల భావోద్వేగాలే ఎక్కువగా ప్రొజెక్ట్ అవుతాయి. ప్రతి కథా బాగుంటుంది. కానీ ఇవి గోదావరి సంస్కృతిని ముందు తరాలకు బోధించే సిలబస్ అంటే ఒప్పుకోలేను. గోదావరి జిల్లాల సంస్కృతి తెలియాలంటే శ్రీపాద సాహిత్యం చదవాలి. అంత మాత్రం చేత ఆయనే గోదావరి సంస్కృతిని చాటారని చెప్పలేను.

ఒక్క వంశీ కథల ఆధారంగా గోదావరి సంస్కృతి ఇదని నిర్థారించలేం! కానీ గోదారి అందాల్ని, ఆ మనుషుల్ని తెచ్చి మనలో కలిపి ఈ తరానికి రుచి చూపించిన వాడు వంశీ!

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

ఇదెక్కడి అన్యాయమండి?
తనకు ఎవరి రచనలు నచ్చాయో చెప్పే స్వేచ్చ లేదా నామినికి?తన అభిప్రాయాలు రచనలమీదో,వ్యక్తులమీదో వ్యక్తం చెయ్యటం వల్ల ఆయన మనసులోమాటలు తెలుసుకునే అవకాశం కలిగింది కదా?? నామిని తన నిరసననో,ఇంకోదాన్నో కూడా మనకు నచ్చినట్టు రాయాలనుకోవటం,లేదా అతనికి మనకు నచ్చినవాళ్ళూ నచ్చితీరాలి,అస్సలు వాళ్ళ మీద ఎలాంటి వ్యతిరేకతా చూపకూడదంటే ఎలా?
అందరూ ఆచంట జానకిరామ్ గారిలా రాయలేరు కదా??!!
బూదరాజు(విన్నంత-కన్నంత) లాంటి వాటిల్లో ఎంతమంది మీద విసుర్లు లేవు.భరాగో కూడా తనకు తోచిన వారిమీద ఇలాంటిమాటలే రాసారు కదా!
గాడ్ ఫాదర్ వగైరాలు రాసిన మేరియో ఫ్యూజో-ఫూల్స్ డై చదవండి ...ఆయన షేక్ స్పియర్ ను కూడా వదల్లేదు.ఇర్వింగ్ వాలెస్-ది ప్లాట్ కూడా అలాంటిదే.మామ్ అయితే యేకంగా ఆకాలం నాటి ఒక మహాకవిని,ఆయన కుర్రభార్యను పాత్రలు గా కేక్స్ అండ్ యేల్ అనే భారీ నవలే రాసాడు.
నామిని గురించి నామిని ఇంతకన్నా(ఈ పుస్తకం గురించి ఇక్కడ పేర్కొన్న విధంగా) భిన్నంగా ఎట్లా రాసుకుంటాడో నాకు అర్థంకావట్లా?మీరు కూడా ఆవిధంగా ఎందుకాశించారో కూడా కాస్త ఆశ్చర్యంగానే ఉంది నావరకు.

సుజాత said...

రాజేంద్ర కుమార్ గారూ,

ప్రశ్నించటం లేదు! ఆశ్చర్యపోతున్నాను! అందుకే ఈ నామిని నాకు కొత్త అని రాశాను.


నామిని తన నిరసననో,ఇంకోదాన్నో కూడా మనకు నచ్చినట్టు రాయాలనుకోవటం,లేదా అతనికి మనకు నచ్చినవాళ్ళూ నచ్చితీరాలి,అస్సలు వాళ్ళ మీద ఎలాంటి వ్యతిరేకతా చూపకూడదంటే ఎలా?________అలా ఎవరూ ఆశించరు. కానీ ఈ పుస్తకం లో ఉంది అదొక్కటే కాదు! కాబట్టి మీరు పుస్తకం చదివితే గానీ మీతో మాట్లాడలేను. పుస్తకం పంపిస్తాను. చదవండి.

నాకు ప్రపంచ సాహిత్యంతో అంత పరిచయం లేదు. ఏదో లోకల్ గా దొరికే తెలుగు పుస్తకలు చదివి సంతోషపడటమే! మీరు చెప్పిన పుస్తకాలు మీ దగ్గరుంటే పంపండి. చదివిచ్చేస్తా :-)

బొల్లోజు బాబా said...

నామిని నాకు చాలా సార్లు తటస్థించినా, నా యాస కాని యాసలో ఉండే రచనలు చదవటం నాకు ఇష్టం ఉండదు కనుక ఎప్పుడూ చదవలేదు.

ఈ కామెంటెందుకంటే - నాలాంటి వాళ్ళు కూడా ఉంటారని తెలియటానికి..... :-)

vasantam said...

చాలా చక్కని విశ్లేషణ !!

తెలుగు అభిమాని said...

సుజాతగారు. నామిని మీ సమీక్ష చదవాలి. అలాగే వ్యాఖ్యలు కూడా. పాఠకులు ఏమనుకుంటున్నారో రచయిత తెలుసుకోవాలి. తాను freestyle wrestling చేయటం కాదు. అసలు యాస రచనలు చదవటం ఒక torture. మోతాదు మించితే చదవలేము. నామిని యాస రచనలతో యాసట కొస్తుంది. సంభాషణల వరకు యాస ok. కథనం ప్రామాణిక భాషలోనే ఉంటే బాగుంటుంది.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

మనలో మనమాట(మీరు ఎవరికీ చెప్పరనే రాస్తున్నా)కొంతమంది రాసిన తెలుగు పుస్తకాల కన్నా ఆ ఇంగ్లీషు పుస్తకాలేనయం.(పొజుకొట్టొచ్చుకూడా కదా :) )

kiran kumar said...

సాక్షిలో రివ్యూ చదివారా? ఈ పుస్తకం ఇంట్లో లేకపోతే దేవుడి పటం లేనట్టేనంట! భార్యా భర్తలిద్దరినీ సీతారాములతో పోల్చడం! భార్యతో పాటు నాలుగు దెబ్బలు తల్లిని కూడా బాదిన వాడు(పుస్తకం చదివా లెండి)రాముడు! ఈ మధ్య రాముడు మరీ లోకువైపోయాడు. ప్రతొక్కడూ రాముడే! ఖర్మ కాకపోతే!

వంద మంది వంశీలుంటారంట, నామిని ఒక్కడేనంట! హేవిటో ఈ మార్కెటింగు!

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

ఆ మాధవ్ సింగరాజు రాత నేనూ చదివా,ఇది అని చెప్పలేని ఒకరకమైన వికారం కలిగింది.

సుజాత said...

వేణూశ్రీకాంత్,

పుస్తకం చదవండి!చదివాక ఏమనిపించిందో చెప్పండి. రవి గారూ మీరు కూడా, చదివాక ఏమనిపించిందో రాయండి!

విజయవర్ధన్ గారూ, లింక్ ఇచ్చినందుకు థాంక్స్! సమీక్షలో మరో "భక్తి" కోణం చదివే అవకాశం దొరికింది.

బాబాగారూ,:-))


వసంతం గారూ, థాంక్యూ!


రాజేంద్ర గారూ, ఈ పోజులూ గీజులూ నా వల్ల కాదు. నచ్చితే చదవటం నచ్చకపోతే పక్కన పారేయడం. తెలుగైనా ఇంగ్లీషైనా ఇదే పద్ధతి! ఇంకోటి....నేను ఆ "కొంతమంది" రాసిన తెలుగు పుస్తకాల బారిన పడలేదనుకుంటా ఇంతవరకూ!

తెలుగు అభిమాని గారూ,

పాఠకులేమనుకుంటున్నారో ఆలోచించి ఉంటే నామిని ఈ పుస్తకం జాగ్రత్తగా రాసేవాడు. ఈ రివ్యూ ఎవరో ఒకరు ఆయనకు అందే ఏర్పాటు చేసే ఉంటారు లెండి!

కిరణ్ కుమార్ గారూ,

ఎవరి వ్యూ వాళ్ళది కదా! ఆ రివ్యూ అతిశయోక్తిగా ఉందని నాకూ అనిపించింది.

సుజాత said...

ఇద్దరు సౌమ్యలూ,

త్వరగా పుస్తకం మొత్తం చదివేసి ఎలా ఉందో నాకు రాయండి

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

ఆ పోజులు నాలాంటివాళ్ళ గురించి లేండి

సుజాత said...

రాజేంద్ర గారూ, మీ విషయంలో పోజులు అసలొప్పుకునేది లేదు. అందునా ఇంగ్లీష్ పుస్తకాల గురించి

భైరవభట్ల కామేశ్వర రావు said...

పుస్తకం చదవకుండా దాని గురించి మాట్లాడ్డం సబబు కాదు కాని, దీని గురించిన రివ్యూలు, పత్రికలో ప్రచురింపబడిన ఒక భాగం చదివితే నాకనిపించిన విషయం ఇదీ - అతను తన ముందు కతలు(తన జీవితం గురించి రాసినవి) రాసిన ధోరణిలోనే ఇదీ రాసారు, అందులో తేడా లేదు. అయితే ఏవి మన "సెన్సిటివిటీల"కి నప్పాయి అన్న దాన్నిబట్టి అవి నచ్చాయా నచ్చలేదా అన్నది మారుతుంది అంతే. తేడా అతని రచనల్లో లేదు మనలోనే ఉంది. అతని మిట్టూరోడి పుస్తకం కొన్నాను. కాని పూర్తిగా చదవలేదు. చదవాలనిపించ లేదు.

అబ్రకదబ్ర said...

ఈ పుస్తకం గురించి ఇంతలేసి చర్చ అనవసరం. దీనికన్నా మధుబాబు అరడజను క్లోన్లలో ఎవరో ఒకరి నకిలీ షాడో నవలని సమీక్షిస్తే మీ సమయం సద్వినియోగమయ్యుండేది.

సుజాత said...

కామేశ్వరరావు గారూ, మీరు చదివిన రివ్యూ సాక్షిలోదైతే , మీరు తప్పక పుస్తకం చదివి తీరాలి.

ఆయన తన జీవితం గురించి యథా తధంగా రాసుకుంటే ఎవరికీ ఏ అభ్యంతరమూ లేదు, ఉండదు.( అవి పూర్తిగా పాఠకులకు అనవసరం)! కానీ ఈ పుస్తకంలో అంతకు మించిన విషయాలున్నాయి. వెటకారాలూ, ఎద్దేవాలూనూ! అందుకే అభిమానిగా మింగుడు పడక నా అభిప్రాయం రాశాను.

Rambondalapati said...

సుజాత గారూ,
నామిని లోని ఈ కన్-ఫెషన్ ట్రెండ్ అతని మొదటి పుస్తకాలలో కూడా కనిపిస్తుంది..
ఒక కథ లో నామిని ఒక తొండని చంపి దాని మీద పాస్ పోస్తాడు, అలానే ఇంకో కథలో వాళ్ళ పొలం లో గడ్డి వదిలి పక్క చేలో గడ్డి కోస్తారు.
నామిని రాసిన ఫిక్షన్ లో కూడా అతని నిజ జీవితం లోని పాత్రలే ఉంటాయి. ముని కన్నడి సేద్యం లో అమ్మా నాన్నా అచ్చు నామిని అమ్మా నాన్నా లానే ఉంటారు.
ప్రేమ ని వ్యక్త పరచటానికి పల్లెటూళ్ళలో బూతులు మాట్లాడతారు, ఒక తొమ్మిది నెలల పిల్లాడిని ఎత్తుకొని ఒకామె మురిపెం గా "ఏరా లంజ కొడకా, ఎందుకొచ్చావ్ మా ఇంటికి?" అనటం నేను విన్నాను. ఫ్రాయిడ్ ప్రకారం కుటుంబ సంబంధాలలో చాలా వరకూ ఇండైరెక్ట్ గా సెన్సువల్ ఫీలింగ్స్ ని తృప్తి పరుస్తాయి. అందుకే పల్లె జనాలు ప్రేమ ను వ్యక్త పరుస్తానికి బూతులు వాడుతారనుకొంటా!
నామిని తనకు తానుగానే హెచ్చులు పోయినట్లు, పల్లెటూరి రైతు జీవనాన్ని చితించటం లో ఆయనే గొప్ప కావచ్చు..కానీ మిగిలిన వారు కూడా ఇతర విషయాలలో గొప్పవారే..రా వి శాస్త్రి కోర్టు పక్షులను చిత్రించినట్లు నామిని కోర్టు జనాలను చిత్రించగలడా? సుబ్బ రామయ్య టౌన్ లోని మధ్యతరగతి జీవులను చూపినట్లు నామిని చూపలేదు.
ఇకపోతే నిజ జీవితం లోని ఫీలింగ్స్ కి భాష/వర్ణన మధ్య వర్తిత్వం వహించకుండా నేరు గా ఫీలింగ్స్ ని వెలి గ్రక్కటం అనేది మానవ భావోద్వేగాల వ్యక్తీకరణ కమర్షియలైజ్ కాక ముందు ఉండేది..మనిషికి ఆలోచన పెరిగిన తరువాత ఆలోచననీ భాషనీ అరువు తెచ్చుకొని మానవ భావోద్వేగాలను మలినం చేశాడు.

duppalaravi said...

సుజాత గారూ, నామిని ఈ పుస్తకంతో చాలా సర్ ప్రైజ్ లు చేశారు. నిజమే, హిపోక్రసీ మేలి ముసుగుల్ని తొలగించినప్పుడు ఒక రకమైన షాక్ కు గిరికాక తప్పదు అభిమానులంతా.. అయితే, ఒక్కసారి, "నామిని...పుడింగి"లోని పేర్లన్నీ మర్చిపోయి, మారుపేర్లతో చదవండి. మీకా రచన నచ్చొచ్చు. ఇక నామిని చెప్పినట్టుగానే మనం పుడింగీలని నిజంగా నమ్ముతున్న రచయితలు నామిని దృష్టికోణంలో కాకపోవచ్చు. నామిని స్కూల్ ఆఫ్ థాట్ లో ఇమడని రచయితలని నామిని స్పష్టంగా వేరుచేశారు. ఎప్పటికైనా ఇది జరిగి తీరాల్సిన వేర్పాటే. విమర్శకులు చేయాల్సిన పనిని నామినే స్వయంగా చేశారు. ఇది కాస్త బడాయిలాగే కనిపించినప్పటికీ, మన తెలుగు సాహిత్యావరణంలో తప్పనిసరి. నేనా పుస్తకాన్ని వారంరోజులకిందటే పూర్తి చేసినప్పటికీ ముద్ద గొంతు దిగని ఫీలింగ్ నన్ను పీడిస్తూనేవుంది. సైకిలు మీద పుస్తకాల కట్టలు పెట్టుకుని స్కూలు స్కూలికీ తిరుక్కుంటూ.... దేవుడా.. మనం పాఠకులం కాకపోతే ఎంతబాగుండును!

సరళ said...

సుజాత గారు ఈ టపా చదవగానె మనసంతా చాల బాధగా అయిపో యిందండి. నా కూతురు చిన్నప్పట్నుంచి కథలు చెప్పమంటే సిన్నబ్బ కథలు , ఇల్లెరమ్మ కథలే చదివి వినిపించేదాన్ని. దానికి ఆ కథలంటె ఎంతిష్టమో. విన్న కథలే మళ్ళీ మళ్ళీ చెప్పమనేది. ఆ కథలు చదువుతుంటే ఎంత హాయిగా వుంటుందో.. మిట్టూరులో ప్రతి గడప మనకు పరిచయమున్నట్లె అనిపిస్తుంది..
నామిని గారి కొత్త పుస్తకం గురించి బుక్ రివ్యుస్ లొ చూడగానె ఈసారి హ్యెదరాబాదు వచినప్పుడు తప్పకుండా కొని చదవాలనుకున్నాను.
ఇప్పుడా కోరిక చచ్చిపోయింది.... ఉహూ ...తప్పకుండా చదువుతాను.

బాలు said...

నేనూ వచ్చేశా... మాగాయ మహాభిమానిని!
సుజాతగారూ, మా ఇంట్లో నీళ్ల మాగాయ పెడతాం తెలుసా! సాధారణంగా మాగాయ ముక్కలు ఎంత ఊరినా కొంచెం గట్టిగానే ఉంటాయి. కానీ మా నీళ్ల మాగాయ ముక్కలు ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేంత మృదవుగా ఉంటాయి తెలుసా!
రెసిపీ తొరలోనే నా బలాగులో పెడతా.

సుజాత said...

బాలు గారూ, కామెంట్ వేరే టపాలో పెట్టారు :-)) పెడితే పెట్టారు కానీ యమర్జెంట్ గా నీళ్ళ మాగాయ రెసిపీ కావలెను. మామిడికాయలూ ఎండలూ పోయేలోపుగా!

loknath kovuru said...
This comment has been removed by the author.
శ్రీ said...

maamulugaa oka book ok roju lo avutundi naaku max time.. ee book complete cehyyadaniki almost four days pattindi ... because i thought of not reading it ... but as i have to complete it ... i did ...

Ram said...

ఈ పుస్తకం నేను చదవలేదు. నామిని మిగతా పుస్తకాల తో వచ్చిన సంకలనం తెచ్చుకున్నా ఇండియా నుంచి ఆ మధ్య. ఆ నామిని మనసులో మిగలటమే మంచిదేమో.

రహ్మానుద్దీన్ షేక్ said...

:)

Post a Comment