October 14, 2011

మేష్టారి సమ్మె స్వగతం !

అబ్బ, ఏవిటో ఈ సమ్మె! ఇంకా ఎన్నాళ్ళు చెయ్యాలో ఏవిటో! పరిస్థితులు చూస్తుంటే చేజారిపోయేలా ఉన్నాయి. పాడు తల్లి దండ్రులు పిల్లలకు స్కూళ్ళు కాలేజీలు లేకపోతే వెధవేడుపులు ఏడుస్తారేం? రోడ్లమీదికొచ్చి సిగ్గు లేకుండా నినాదాలు కూడా చేస్తున్నారు. "పిల్లల భవిష్యత్తు లతో ఆడుకోవద్దూ" అట! నాకు మాత్రం తెలీదా? నాకు మాత్రం పిల్లల్లేరూ? అంటే వాళ్ళిక్కడ ఈ హైద్రాబాదులో చదువుకోవడం లేదనుకోండీ! ఏ సమ్మెలూ లేని చోట హాయిగా ప్రశాంతంగా చదూకుంటున్నారు. మార్కులు సరిగ్గా రాకపోతే తాట వొలుస్తాను. యావనుకున్నారో! మేష్టారా మజాకా?

అయినా పైకి చెప్తే బాగోదు గానీ, ఊళ్ళో వాళ్ళ పిల్లల చదువులు ఏ చెట్టెక్కితే మాత్రం నాకెందుకు చెప్పండి?

అయినా చెప్తూనే ఉన్నాం కదా,మన రాష్ట్రం మనకొచ్చాకా విద్యార్థులందరికీ న్యాయం చేస్తామనీ, హందరికీ ఉజ్జోగాలిచ్చేస్తామనీనూ! విని చావరేం?

ఈ ఆర్టీసీ వాళ్ళున్నారే....తన్నాలి వీళ్లని! పట్టుమని నాలుగు నెల్లన్నా జీతాల్లేకుండా ఉండలేరూ? అప్పుడే కొంతమంది తిరగబడి(ఈ పదం వింటుంటేనే గుబులుగా ఉంది) బస్సులు రోడ్డెక్కించారు. పండగలకి బట్టల్లేవని పిల్లలేడుస్తారట? ఏం ఏడిస్తే? ప్రతేటా వస్తూనే ఉంటాయిగా పండగలూ? ఏ ఏడాది కాకపోతే వచ్చే ఏడాది వేసుకుందురు గానీ కొత్త బట్టలు అని సర్ది చెప్పలేనివాళ్ళు అసలు పిల్లల్నెందుకు కనాలండీ? మీరే చెప్పండి?

ఆటోల వాళ్ళో? వాళ్ళూ అంతే! మూణ్ణాలుగు రోజులు బంద్ చేయండి అంటే సరే అంటారు గానీ రోడ్లమీద తిరుగుతూనే ఉంటారు.

ఏవిటీ? కిరాయి ఆటోల వాళ్ళ సంగతా? ఏవిటి వాళ్ల సంగతి? ఉద్యమం కోసం, మన రాష్ట్రం వచ్చాక రుచి చూడబోయే బంగారు భవిత కోసం పది రోజులు వాళ్ళూ,వాళ్ళ పిల్లలూ పస్తుంటే ఛస్తారా?

బస్సుల్లేకపోతే జనాలు మొదట్లో రెండు రోజులు ఇబ్బంది పడ్డా, తర్వాత ప్రైవేటు వాహనాలెక్కి దర్జాగా తిరుగుతున్నారు! అసలు ఆర్టీసీ సమ్మె సంగతే మర్చిపోయినట్టున్నారు! బాగా తెలివి మీరారు! చావు తెలివి!

ఈ పాడు ముఖ్యమంత్రొక కొరకరాని కొయ్యలా దాపరించాడు! చూడ్డానికి సౌమ్యంగా కనపడతాడు కానీ హమ్మో హమ్మో గుండెలు తీసిన బంటు! ఢిల్లీలో మా పనులేవీ జరగనివ్వడు.పైగా రూపాయికి బియ్యం అదీ ఇదీ ఇదీ అని జనాల్ని పడగొడుతున్నాడు.సిగ్గుండాలి ఛీ! ఏం పన్లివి?

ఇలా విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్లమీదికొచ్చి, మరోవైపు బస్సులు రోడ్డెక్కాయి! ఇలా అయితే ఎలాగ? ప్రజలంతా సుఖ శాంతులతో ఉంటే రాష్ట్రం ఎలా వస్తుంది? అర్థం చేసుకోరేం?

మరో వైపు ఆయనేమో "టీడీపీ ఎమ్మెల్యేలను తన్నండి" అనీ, ఆంధ్రా నాయకులందర్నీ బొంద పెట్టమనీ అని మాట్లాడుతుంటాడు. ఈ మాటలకు వాళ్ళెవరో కేసు కూడా పెట్టారు.అప్పటికీ యువరాజా వారు "ఏం?రేణుకా చౌదరి మాట్లాళ్ళేదా? లగడపాటి మాట్లాళ్ళేదా?" అని తిప్పికొట్టబోయాడు కానీ ఎవరూ పట్టించుకోలా! వీళ్లని కంట్రోల్ చేయలేక చస్తున్నాను! ఏం మాట్లాడాలో కూడా తెలీదు! అవతలి వాళ్ళు అన్నారంటే అనరూ?

ఎన్నని చూసుకోనూ?

మరో పక్క ఆ మందకృష్ణ ఒకమాట,లక్ష్మణ బాపూజీ మరో మాటా మాట్లాడతారు! మాతో ఒక్కరూ కల్సి రాడం లేదు.

ఈ పరిణామాల మధ్య కాస్త గుబులుగా ఉన్నా,.."సమ్మె మరింత తీవ్ర తరమవుతుంది" అని గంభీరంగా ప్రకటించాను.

"ఎంతోమంది విద్యార్థుల తల్లిదండ్రులే మా వద్దకు వచ్చి సమ్మె కొనసాగించమని కోరారు"అని కూడా చూశాను. మీడియా నా మాటల్ని హైలైట్ చేయకుండా పగబట్టింది.

మరో పక్క అసంఖ్యాక ఐకాసలు(ఈ ఐకాస లు ఎన్ని ఉన్నాయో ఒకరోజు తీరిగ్గా కూచుని లెక్కెడదామంటే, టైమెక్కడా? కుదిరి చావడం లేదు) "ప్రజల కోరిక మీదే రైల్ రోకోలవీ చేస్తున్నామని" ప్రకటించారు.

ఏవిటో, జీవితంలో విశ్రాంతి లేకుండా పోయింది. మధ్యలో ఈ టవర్లూ,హోర్డింగులూ అవీ ఎక్కేవాళ్ళని దింపాలా? వీళ్ళకు మరీ తమాషాగా ఉంది. ప్రతి అడ్వర్టైజ్ మెంట్ హోర్డింగూ ఎవరో ఒకరెక్కుతుంటే ఎంతమందినని దింపుతాం?

ఎక్కేవాళ్ళే గానీ దూకేవాళ్ళే లేరాయె!

మొత్తం మీద ఇంకా సమ్మె కొనసాగితే ప్రజల్లో వ్యతిరేకత మరింత పెరుగుతుందేమో అని..ఒక పక్క అనుమానంగా...దడగా.. ఛ ఇలా మాట్లాడేస్తున్నానేంటి? తూచ్! అదేం లేదు!.అలా జరగదు

అంతా బాగానే ఉంటుంది. సమ్మె బలహీనమైతే దాన్ని మళ్ళీ ట్రాక్ లోకి తెచ్చేందుకు మాకు బోల్డు ప్లాన్లు ఉన్నాయి! ఏం చెయ్యాలో ఆలోచించాలి ఉండండి!

29 comments:

బంతి said...

సమ్మె లో పాల్గొన్న ఉద్యోగులకు రాష్ట్రం వచ్చాక రెండు నెలల జీతం బోనస్. విద్యార్థులకు రెండు డిగ్రీలు ఉచితం. ప్రతి నిరుద్యోగికి రెండు ఉద్యోగాలు నాలుగు జీతాలు.

praveensarma@teluguwebmedia.in said...

నేను మాత్రం సమ్మెకి సపోర్ట్ ఇస్తున్నాను. ప్రత్యేక రాష్ట్రం కంటే ఒక సంవత్సరం విద్యాకాలం ముఖ్యమా? సమాజంతో సంబంధం లేకుండా ఇంటిలో ఎవరి దారి వాళ్ళదే అన్నట్టు మాట్లాడేవాళ్ళకి తెలంగాణావాదులు చెప్పగలిగేది ఏమీ ఉండదు. బస్సులు తిరగకపోవడం అంటారా? హైదరాబాద్‌లో బస్సులు తిరుగుతున్నా గ్రామీణ ప్రాంతాలలో బస్సులు తిరగడం లేదు కనుక అక్కడి పేద ఆటోవాళ్ళకి ఎలాగూ మంచి బేరాలే వస్తున్నాయి. ఖర్చుపరంగా ఇది సమస్య అయినా, రవాణాపరంగా సమస్య కాదులేండి.

Indian Minerva said...

ప్రజల అంగీకారంతో రైల్‌రోకో చేస్తున్నారా? ఇది ఎవరు ఎప్పుడు అన్నారు? అనుంటే ఏప్రజల అంగీకారంతో చేస్తున్నారు? రైల్లోని ప్రజలా లేక పట్టాలమీద బైఠాయించిన ప్రజలా?

SNKR said...

/సమ్మె లో పాల్గొన్న ఉద్యోగులకు రాష్ట్రం వచ్చాక రెండు నెలల జీతం బోనస్. విద్యార్థులకు రెండు డిగ్రీలు ఉచితం. ప్రతి నిరుద్యోగికి రెండు ఉద్యోగాలు నాలుగు జీతాలు./
:))

SNKR said...

/నేను మాత్రం సమ్మెకి సపోర్ట్ ఇస్తున్నాను. /
ఇలాంటి గొట్టాం సపోర్ట్లు ఎవడైనా ఇస్తాడు. నీ దుకాణం కట్టేసి, వెళ్ళి సమ్మెలో రాళ్ళేసి, ఆక్టివ్ సపోర్ట్ ఇవ్వగలవా? హుసేన్సాగర్ నీళ్ళు తాగి టాన్‌బండ్ మీద నిరాహార దీచ్చ చేయగలవా? నీకు నిబద్ధత లేదు. గట్టుమీద కూచుని, కీబోర్డ్ మీదకారుకూతలు పొద్దంతా కూయడం పెద్దపని కాదు. తనది కాకుంటే గోదారి దాకా దేకుతా అన్నట్టుంది.
నీకు దమ్ముంటే, మావో మీద గౌరవముంటే, అసలైన స్త్రీవాదివైతే, రంగనాయకి అభిమానివే ఐతే, గుడిపాటి చలం కథలు చదివినోడివైతే, తుర్రెబాజ్ ఖాన్, చాకలి ఐలమ్మ, కొమొరం భీం ల మీద ఏమాత్రం గౌరవమున్నా ముందు నీవు తెలగాన ఉద్యమంలో నీ ఆటా-పాటలతో అలరించు... ఫో.. నీ గుర్రాన్ని రంగంలోకి వురికించు. సాహసం షేయరా ఢింబకా ... తెలగాన లభిస్తుందిరా... అభీష్టం సిద్దిస్తుందిరా... జై ముక్కు భైరవా!

పక్కింటబ్బాయి (ఇల్లు మారాడు) said...

సిర్పూర్ నుంచి జగిత్యాల వెళ్లే పాసింజరు రైలుకు తృటిలో తప్పిన ప్రమాదం. తెలంగాణా ప్రాంతంలో కరీం నగర్ జిల్లా వద్ద యాభై కిలోమీటర్లు మేరకు రైల్వేలైను పట్టాల క్లిప్పులను గుర్తుతెలియని వ్యక్తులు తొలగించారు. సమ్మె ఉధృతమైన తరుణంలో బస్సులు నడవకపోవడంతో ప్రజలు ఎక్కువగా రైళ్లలో ప్రయాణిస్తున్నారు. గత పదిరోజులలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా ఉండడంతో రైల్వే శాఖ నిర్వహిస్తున్న తనిఖీలో ఈ ఘటన వెలుగు చూసింది.
-ఈనాడు
ఇదేనా ప్రజాస్వామిక ఉద్యమం. పాసింజరుకు ఘోర ప్రమాదం జరిగి అమాయకులు(అందునా తెలంగాణా ప్రజలు) చనిపోతే ఎవరిది బాధ్యత. అసలు ఈ ఉద్యమకారులు మనుషులేనా.
ఏదేమైనా రైల్వే శాఖను అభినందించాలి.
-పక్కింటబ్బాయి (సూరంపూడి పవన్ సంతోష్)
అంతే లెండి ప్రజల ప్రాణాలకే విలువ లేనప్పుడు ఓ ఏడాది పిల్లల చదువులు చెట్టెక్కితే మాత్రమేం.

kranthi said...

praveen anya!!, nuv kuda ni internet shop close chesi ,telagana kosamu porada vachhu kada, nuv eppudu train lo velthuthuntav kada, nuv train journey lo unnappudu 3days railroko cheyali appudu telusthandi niku ....

SHANKAR.S said...

ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. మన కొంపలకి మనమే నిప్పెట్టుకుని మన ఆగ్రహ జ్వాలల్ని ఆంధ్రోల్లకి చూపిద్దాం. సకల జనుల సమ్మెలో భాగంగా భోజనాన్ని, మంచినీళ్ళని బహిష్కరిస్తాం. అప్పటికీ కేంద్రం దిగి రాకపోతే యావత్ తెలంగాణా ఒకటి, రెండు బందుకి పిలుపునిద్దాం. అందుకు సహకరించని వాళ్ళని సీమాంధ్ర తోత్తులందాం.

@ ప్రవీణ్ "ప్రత్యేక రాష్ట్రం కంటే ఒక సంవత్సరం విద్యాకాలం ముఖ్యమా? "
బాగా చెప్పావు ప్రవీణూ. నిజమే. వెధవది ఒక్క విద్యా సంవత్సరం పోతే ఓ కొంపలు మునిగిపోయినట్టు గగ్గోలు పెడుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఎగ్జాం పేపర్ మీద పేరు రాసి ఇస్తే డిష్టింక్షన్ లో పాస్ చేయించమూ. అసలు తెలంగాణా వస్తే పరీక్షలే ఎత్తేస్తాం కదా అది కూడా అర్ధం చేసుకోకుండా ఊరికే చెవి కోసిన మేకల్లా గోల. ఈ వెధవ జనాలింతే ప్రవీణూ అస్సలు అర్ధం చేసుకోరు. అన్నట్టు నువ్వు కూడా ఒక ఏడాది షాప్ మూసి తెలంగాణా కోసం ఇక్కడ ఉద్యమంలో పాల్గొనకూడదూ. అసలే ఇక్కడ నీకు ఫ్యాన్స్ బోలెడంత మంది ఉన్నారు కూడాను. వెధవది ప్రత్యేక రాష్ట్రం కంటే ఒక సంవత్సరం వ్యాపారం ముఖ్యమా? ఏమంటావ్?

లలిత said...

మాష్టారూ మిమ్మల్ని మూసేసినట్టున్నారుకదండీ ...బయటికెప్పుడొచ్చారూ?

సుజాత said...

ప్రవీణ్ శర్మ గారు ఉద్యమంలో పాల్గొనాలని ఒకరికి తెలీకుండా ఒకరు (కామెంట్ మాడరేషన్ ఉందిగా) ఇంతమంది కోరుతున్నారా? ప్రవీణ్ గారూ, మీరు ఆలోచించాల్సిందే!

SNKR said...

ప్రవీణ్,
మన శంకర్ గారు చెప్పినట్టు నీ యాపారం ఓ ఏడాది పోతేనేమి? ఎటువంటి బలిదానానికైనా సిద్ధం అని నిరూపించుకో అమరత్వం చవగ్గా దొరుకుతోంది, మిస్సవ్వద్దు. 613వ నంబర్ నీదే. తెలగానకై పోరాడిన చీకోలం యోధుడు అని టైటిల్తో గుండెగోసలో ఓ పోస్ట్, బ్రతిమలాడైనా మలక్పేటరౌడీతో ఓ విడియో పెట్టిస్తాం..... 'అంకితం నీకే అంకితం...' :)

వుత్తినే ఎంతకాలం చీకోలం నుంచి నోటి మద్దతిస్తు మాత్రం ఇచ్చి, చరిత్రలో "అసమర్థుని ఆరాటం" లా మిగిలిపోతావు? చరిత మరువదు నీ త్యాగం! తెలంగాన వస్తే టాంక్బండ్ మీద పెట్టే తుర్రెబాజ్ ఖాన్, చాకలి తిమ్మక్క, కొమరం ఢీం ల విగ్రహాలు నీ రూపురేఖలతో గుర్రంతో సహా నిర్మిస్తాం... ప్రామిస్!

muralirambha said...

bokkalo samme

రాజ్ కుమార్ said...

సమ్మె లో పాల్గొన్న ఉద్యోగులకు రాష్ట్రం వచ్చాక రెండు నెలల జీతం బోనస్. విద్యార్థులకు రెండు డిగ్రీలు ఉచితం. ప్రతి నిరుద్యోగికి రెండు ఉద్యోగాలు నాలుగు జీతాలు.. "వడ్డీతో సహా.." ఇది మరిచిపోయావ్ బంతీ.. ;)

ఎంతయినా హైదరాబాదు జనం అదృష్టవంతులు సుమండీ.. ;)

ఆ.సౌమ్య said...

మేషారి మనసులో దూరినట్టే రాసారండీ....రాను రాను జాఢ్యం పెరిగిపోతున్నాది.

రవి said...

SNKR: ఇన్నాళ్ళు ప్రవీణ్ ప్రతిభ గుర్తించనందుకు బాధపడుతున్నాను. (ఇందాకట్నుంచి మోకాలినెప్పి కూడా). ఇకనుండి నాదీ మీ బాటే.

తెలంగాణా ఏమైతే అదవనీ. నేను ప్రవీణ్ ను సమర్థిస్తాను.ప్రవీణ్, ఏ మాత్రం తగ్గొద్దు. కావాలంటే హైదరాబాదులో నీ షాపు ఒకటి ఓపెన్ చేసి మరీ మూసెయ్. విగ్రహం పెట్టించేంత శక్తి నాకు లేదు. అయితే బ్లాగులోల్లు అంతా కలిసి వీవెను, మాలిక టీము, హారం టీమూ వీళ్ళకు రాసి, సంకలినుల్లో నీ ఫోటో పెట్టిస్తాం, మా శక్త్యానుసారం.

Indian Minerva said...

బాగుంది కామెంట్ల వరస :DDDDDDDDD

praveensarma@teluguwebmedia.in said...

బడాయి ఎందుకు? నేను ఇంటర్నెట్ కేఫ్ ఇది వరకే మూసేసి వేరే వ్యాపారం పెట్టుకునే పనిలో ఉన్నానని గూగుల్ ప్లస్‌లో ఇది వరకే వ్రాసాను కదా. తెలంగాణావాళ్ళని విమర్శించే ముందు జై ఆంధ్ర ఉద్యమం కోసం మనం చేసిన హింస గుర్తు తెచ్చుకోండి. అప్పట్లో ఎవరూ ఆత్మహత్యలు చేసుకోలేదు కానీ పోలీస్ కాల్పుల్లో నాలుగు వందల మంది చనిపోయారు. మన కోస్తా ఆంధ్ర ప్రాంతీయవాదులు ఏమైనా కెసి‌ఆర్ కంటే గొప్పోళ్ళా? అప్పట్లో స్కూళ్ళు ముయ్యించకపోయి ఉండొచ్చు కానీ నాలుగు వందల మంది ప్రాణాలని గాలిలో కలిపారు కదా. రైల్ రోకోలు జరుగుతున్న టైమ్‌లో తెలంగాణాకి వెళ్తే మా ఇంట్లోవాళ్ళు ఒప్పుకోరులే. మొన్న మా అమ్మగారు ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు రాయ్‌పుర్ మీదుగా వచ్చే సమతా ఎక్స్‌ప్రెస్‌కి కాకుండా కాజీపేట మీదుగా వచ్చే లింక్ ఎక్స్‌ప్రెస్‌కి రిజర్వేషన్ చేశారు. రైల్ రోకో జరుగుతుందని భయపడ్డారు కానీ ఆ టైమ్‌లోనే రైల్ రోకో వాయిదా పడింది.

Muralidhara Rao Elchuri said...

You are at your sarcastic best. I am forwarding this well meaning Article to all my friends.

sanju -The king!!! said...

అప్పట్లో బ్లాగులు అవి లేవు కాని, లేకపోతే 1950's లో జరిగిన ప్రత్యెక ఆంధ్ర ఉద్యమం పై కూడా తమిళులు ఇలాంటివే బోలెడు రాసుండే వారు కదూ

Sravya Vattikuti said...

హ హ మీరు పేరు చెప్పక పోయినా ఎవరి స్వగతమో అర్ధం అయిపోయిందోచ్ , కాని కొంచెం మీకు సమస్య పట్ల ఉన్న సెన్స్ అంతర్లీనం గా మీకు తెలియకుండానో పోస్టులో కి వచ్చేసింది అనిపిస్తుంది , మన మాస్టారు కి ఈ మాత్రం కూడా అంతర్మధనం ఉండదు నాకు ఎందుకో గట్టి గా అనిపిస్తుంది . కామెంట్లు పోస్టు తో పోటీ పడుతున్నాయి :)))

సంజు ది కింగ్ గారు ఇలాంటివి ఏమో కాని ఖచ్చితం గా ఇప్పుడు తెలంగాణా వాదులు కొన్ని చోట్ల అతి గా దుమ్మెత్తిపోస్తున్నారు చూడండి , అలాంటివి మాత్రం ఉండేవి కాదు :)))

Sujata said...

సుజాత గారూ..

సమ్మె వల్ల నిజంగా లాభపడినవారు - ఆటోల, టాక్సీ ల డ్రైవర్లు. నోటికొచ్చిన సొమ్ము అడుగుతున్నారు. బస్టాండుల బయట.. స్కార్పియోలూ అవీ లైన్లు కట్టేసి - చుట్టుపక్కల ఊళ్ళకి ప్రయాణీకుల్ని తరలించేందుకు విపరీతంగా చార్జీలు వసూలు చేస్తూ - భలే దోపిడీ చేస్తున్నారు. Thanks to RTC Strike.


కోదండరాం కి ఒక నాలుగు నెలలు జీతం ఇవ్వకుండా వుంచితే, ఆయనకి కొంచెం అన్నా అర్ధం అవుతుంది. పాపం చిన్న చిన్న ఉద్యోగులు వందలాది రూపాయలు షేర్ ఆటోలకు పెడుతూ డ్యూటీలకి వెళ్ళి వస్తున్నారు. మీ పోస్ట్ చాలా నచ్చింది. మీరు సర్కాస్టిక్ గా రాయడం తక్కువ. కానీ రాస్తే మాత్రం భలే బావుంటుంది.

praveensarma@teluguwebmedia.in said...

సమ్మె అంటే ఎలా ఉండాలో ఇక్కడ వ్రాసాను: http://telanganasolidarity.in/90-15

జీడిపప్పు said...

సూపర్ పోస్టు సుజాతగారు.

ప్రవీణ్, మళ్ళీ ఇంకో వ్యాపారమెందుకు? తొందరగా నీ జీవనోపాధిని మూసివేసి తెలంగాణా కోసం ఉద్యమించు. మేమందరం బ్లాగులనుండి నీకు మద్దతు తెలుపుతాము.

kranthi said...

praveen anya, nuv internet cafe close chesthe ela annyya! srikakulam lo prajalu andaru em aiyipotharu , nuv e telagana kosam ni properties anni tyagam cheyavachhu kada, ni peru kuda charitha lo nilichipothundi ... ayina nuv just 10th varaku chadivi em chesav? niku chaduvu ante ento telusa ? ni bonda niku addadiddam ga mataldam tappa emaina telusa, niku unna aparamina talent edo oka dantlo pedithe manchidi kada.

praveensarma@teluguwebmedia.in said...

గొఱ్ఱెల మందేనని నిరూపించుకున్నారు. నువ్వు కూడా షాప్ మూసేయ్ అని ఒక గొఱ్ఱె అంటే మిగితా గొఱ్ఱెలు తలూపాయి. అసలు విషయానికొద్దాం. 2009లో సమైక్యాంధ్ర బంద్ సందర్భంగా మన సమైక్యవాదులు స్కూళ్ళు ముయ్యించలేదా? బురదలో పొర్లడం మనకి చేతకాదు అని చెప్పుకోవడం ఎందుకు?

praveensarma@teluguwebmedia.in said...

తెలంగాణా రైల్ రోకోలు చేసినవాళ్ళని అరెస్ట్ చేసినందుకు డిజిపిని ప్రశంశిస్తూనే తాము ఇక్కడ సీమాంధ్రలో రైల్ రోకోలు చేస్తామంటున్నారు సమైక్యవాదులు. సమైక్యవాదులకే గాంధేయవాదం మీద నమ్మకం లేనప్పుడు తెలంగాణా ఉద్యమం గాంధేయవాద ఉద్యమం కాదని విమర్శించడం ఎందుకు? ఈ రోజు ఉదయం టివి5 వార్తలలో సమైక్యాంధ్ర జె‌ఎసి నాయకుడు శామ్యూల్ చేసిన ప్రకటన చూశాను. తెలంగాణాకి వ్యతిరేకంగా బంద్‌లు చేస్తామని శామ్యూల్ ఓపెన్‌గానే ప్రకటించాడు.

reader said...

@ sanju -The king!!!
raised a good point

తెలుగు అభిమాని said...

ముదనష్టపు మాస్టారు ఆధ్వర్యం లో జరుగుతున్న దరిద్రగొట్టు ఏడుపుగొట్టు ఉద్యమం గురించి బాగా చెప్పారు.

Praveen Sarma (www.teluguwebmedia.in) said...

నేను ఇప్పుడు హైదరాబాద్‌లో BHEL దగ్గర మా చిన్న బాబాయి గారి ఇంటిలో ఉన్నాను. కొత్తగూడెంలో ఉన్న మా బాబాయి గారు ఈ రోజు హైదరాబాద్ వచ్చారు. తెలంగాణా సమ్మె ప్రభావం వల్ల వాళ్ళ పిల్లలకి ఆదివారాల నాడు కూడా క్లాసెస్ పెట్టేశారట. ఆయనేమీ తెలంగాణావాది కాదులెండి. వాళ్ళ సొంతూరు విజయనగరం జిల్లా పార్వతీపురం దగ్గర పెదమరికి. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్‌లో ఇంజినీర్‌గా పని చేస్తున్నారంతే. మొన్న సత్తుపల్లి బస్ స్టాండ్‌లో ఇద్దరు RTC ఉద్యోగులు మహమూద్‌ని తిట్టుకుంటున్నారు. మహమూద్ వల్లే సమ్మె ఆగిపోయిందనీ, గవర్నమెంట్ వాణ్ణి మెచ్చుకుంటోందనీ తిట్ట్కుంటున్నారు. సమ్మె ఆగిపోవడం వల్ల స్కూల్ పిల్లలకి లాభం కలిగినా తెలంగాణావాదులకి మాత్రం బాధగా ఉంది. ఆ ఇద్దరు RTC ఉద్యోగులు మాట్లాడుకున్నది కోస్తా ఆంధ్ర యాసలోనే కానీ వాళ్ళు ఉండేది తెలంగాణాలో. సత్తుపల్లి ప్రాంత యాస కోస్తా ఆంధ్ర యాసలాగే ఉంటుందిలెండి. కానీ ఇది భాషా సమస్య కాదు కదా. అందుకే వాళ్ళు పొలిటికల్‌గా కోరుకునేది తెలంగాణా రాష్ట్రాన్నే.

Post a Comment