December 28, 2011

ఆట విడుపు.... అందమైన చోట !


ఆటవిడుపుగా ఎప్పుడైనా హైద్రాబాద్ వాసులు శిల్పారామం వెళ్ళి హాయిగా కాసేపు మంచి ప్రకృతిని, చక్కని సంప్రదాయ కళల్ని, కాస్తో కూస్తో (అసలు ఇదే మేజర్ లెండి. కాస్తో కూస్తో కాదు) షాపింగ్ ని ఎంజాయ్ చేస్తుంటారు.

మా ఇంటికి కాస్త దగ్గర కదాని నేను టైము దొరికితే శిల్పారామం వెళ్ళి హాయిగా మొత్తం తిరిగి చూస్తూ,(షాపింగ్ తక్కువే)మంచి గాలి పీల్చుకుని వస్తుంటాను.

ప్రస్తుతం ఇక్కడ ప్రతి యేటా జరిగే హస్త కళల ప్రదర్శన జరుగుతోంది. దాదాపు 800 పై చిలుకు స్టాళ్ళు పెట్టారు. అన్ని రాష్ట్రాల నుంచి బట్టలు,హస్త కళలు,క్లే వర్క్స్,టెర్రకోట,శిల్పాలు,పోర్ట్రైట్ పైంటింగ్స్,గోరింటాకు,ఒకటా రెండా..అసలు ఇది చూడ్డమే ఒక అద్భుతం!

ఇవే కాక కోలాటం, చెక్క భజనలు, డప్పులు, పగటి వేషాలు, హరిదాసులు ఇవన్నీ ఈ ప్రదర్శన జరిగినన్ని రోజులూ ఇక్కడ చూడొచ్చు! ప్రతి యేటా ఇవి చూడ్డానికి మా పాపను తీసుకెళ్తాను. అంతే కాదు, ఎడ్లబండి సవారీ కూడా ఉంది. ఆసక్తి ఉంటే ఎక్కి తిరగొచ్చు.

కాస్త తీరిక దొరికించుకుని అలా ఒక ట్రిప్ వేసి కాసిన్ని ఫొటోలు తీశాను.

ప్రదర్శన 31 డిసెంబర్ వరకూ ఉంటుంది.  తర్వాత పొడిగిస్తారేమో చూడాలి.


విశ్వరూపం Clay art గణపతి 
కిష్ణుడు 
           
మళ్లీ కిస్నుడే !బొమ్మలే  బొమ్మలు 
                                                                        
గాజులు... గాజులు గిజి గాడి గూళ్ళు


చీరలు..బోల్డన్ని వెదురు ఈ పెయింటింగ్ బాబు, ఫోటో బాబు ఒకరే!
                                                                               
ఈ శిల్పారామంలో ఇదే తంటా! ఎవరు మనుషులో, ఎవరు బొమ్మలో కనుక్కోలెం!
నులక కుర్చీలు! భలే  ఉంటాయివి. ఇక్కడ నా షాపింగ్! తోలుబొమ్మలు ఆడించే వారు , ఆ ప్రదర్శనకు ఆదరణ తగ్గిపోవడంతో తోలుతో బొమ్మలు, లాంప్ షేడ్స్ చేసి ఇలా అమ్ముతున్నారు. చాలా ఖరీదే! అయినా సరే, తోలు కాబట్టి ఎప్పటికి పాడవ్వవు.లైట్ వేస్తే ఫ్లోర్ లాంప్ షెడ్ ఇలా ఉంటుంది. దీన్ని టేబులు మీద కుడా పెట్టుకుంటే బాగానే  ఉంటుందనుకుంటా!


డప్పులు


ఎడ్లబండి సవారి! జనాలు!


ఈ మట్టి బొమ్మలైతే అద్భుతాలు హాన్గింగ్స్ 


ఈ బొమ్మ ఎంత బాగుందో కదూ!

36 comments:

వేణు said...

శిల్పాలూ, బొమ్మలూ, గాజులూ, పక్షి గూళ్ళూ ఎంత అందంగా ఉన్నాయో! హస్తకళల ప్రదర్శన స్వరూపం సమగ్రంగా తెలిసేలా టపాలో కళ్ళకు కట్టించారు. భాగ్యనగరవాసి తాను మిస్సయిపోయిన పల్లెటూరి అందాలు చూసి సంతోషించాలంటే వెళ్ళాల్సిన ఏకైక ప్రదేశం శిల్పారామమే!

జయ said...

చాలా బాగున్నాయండి ఫొటోలు. అవును, శిల్పారామం పోతే అదొక వింత ప్రపంచం...వేరే లోకం. ఉన్నంత సేపూ..మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది.

మధురవాణి said...

అబ్బ.. శిల్పారామం గుర్తు ఎక్కడికో తీస్కెళ్ళిపోయారు నన్ను.. HCU లో ఉన్నప్పుడు వెళ్ళేవాళ్ళం మేము. :))
నేను వెళ్లాను ఒకసారి ఈ ఎక్జిబిషన్ కి.. బోల్డు కోనేసుకోవాలనిపిస్తుంది అక్కడికెళ్తే.. ;)
ప్రతీ ఏడాది ఇదే టైములో ఉంటుందనుకుంటా కదా! Thanks for the nice photos! :)

cbrao said...

మీ టపా చదివాక,చూశాక ఇంకా ఎందుకు శిల్పారామం చూడటం? అంతా సినిమా చూసినట్లు చూపించారుగా! అయితే Baya weaver bird nest కొనటం కోసం మాత్రం వెళ్లక తప్పేలా లేదు.

వేణూ శ్రీకాంత్ said...

ఫోటోలు చాలా బాగున్నాయండీ..

కృష్ణుడు said...

Hm missing it since3 yrs...

సాయి said...

అబ్బా...ఎంత బాగుందో...నిజంగా అక్కడికి వెళ్ళినా ఇంత బాగా చూడలేం... ధ్యాంక్యూ...

రసజ్ఞ said...

ఒకసారి అలా మళ్ళీ శిల్పారామాన్ని చుట్టి వచ్చినట్టుంది! నాకు కూడా ఎంతో ఇష్టమయిన ప్లేసు.

AMARNATH ALAPATI said...

ఎద్దుల బండ్లను ఇలా చూపించాలేమో ఈ కాలం పిల్లలకి, మా కాలంలో ఐతే..

నందు said...

చాలా బాగున్నాయి ఫోటోలు. ఏదేవైనా ఓ " మన ఊరి" సంత అన్నట్టూ ఓ అందమైన అనుభూతి కలుగుతుంది. మాలాంటి అబ్బాయిలకంటే గాజులూ బొమ్మలూ గోరింటాకులూ ఇష్టపడే అమ్మాయిలకి మరీ ప్రియం ఇలాంటివి :)

నందు said...

@ మధురవాణి గారు : మీరు HCU లో చదివారా? నేనూ HCU లోనే MSc Plant Biotechnology చేసానండీ. ఏ బ్యాచ్ మీది? మాకు సీనియర్లా ఐతేనూ :) ఇలా బ్లాగ్ ముఖంగానే తెలుసు మీరు. అలాకూడా అన్నమాట. సంతోషం !

Unknown said...

hmm susrprising nenu ninna ne vellanu wooden brackets konna..avnu akkada madhubani paintings stalls avee unnay avi ee vaaram tarvata malli dorakava?

బులుసు సుబ్రహ్మణ్యం said...

హైదరాబాద్ లో శిల్పారామం మొత్తమ్మీద 4,5 మాట్లు మాత్రమే వెళ్ళాం. ఈ ఫోటోలన్నీ చూస్తే మళ్ళీ ఇంకోమాటు వెళ్లాలనిపిస్తోంది.

అన్ని చీరల్లో ఎన్ని ఇంటికి తీసుకెళ్లారో? ... దహా

sarma said...

అందమె ఆనందం

A Homemaker's Utopia said...

శిల్పారామం కళ్ళకు కట్టినట్లు చూపించారు సుజాత గారు....ఫోటోలు చాలా బాగున్నాయి..

లత said...

చాలా బావున్నాయండి ఫొటోస్,చక్కని టైంపాస్

సుజాత said...

Thank you all!


Unknown గారూ,
శిల్పారామంలో 150 వరకూ పర్మినెంట్ స్టాల్స్ ఎప్పుడూ ఉంటాయి. వాటిలో రెండు మధుబని పెయింటింగ్స్ స్టాల్స్ తప్పకుండా అయి ఉంటాయి. కాబట్టి ఎప్పుడు వెళ్ళినా మీరు కొనుక్కోవచ్చు.

బులుసుగారు, చీరెలు ఈ సారి ఏమీ కొనలేదండీ! తోలు బొమ్మల స్టాల్లో హాంగింగ్ కర్టెన్లు కొన్నాను. దసరా దీపావళి టైములో "శారీ ఫెస్టివల్" పెడతారు ఇక్కడ! చీరెల షాపింగ్ అప్పుడు!

vasantham said...

chala baagunnayi photos, mee vyaakhyalu..

vasantham

Ravi said...

Sujatha garu,

aa madya maa voori nunchi..Hyd vellinappudu..okasaari...silparamam velladam jarigindi..

enduko..meeru cheppinantha khaas..vunnattu anipinchaledu...

may be..appudu event em jaraga ledu..
ee saari...malli oka look veyyaali..

photolu..baagunnayi madam

प्रवीण् शर्मा said...

శిల్పారామానికి మెట్రో లైన్ వేస్తున్నారట కదా. అది ఇప్పట్లో పూర్తవ్వదు అని కశ్యప్ గారు ఓ సారి అన్నట్టు గుర్తుంది.

సుజాత said...

ప్రవీణ్,
శిల్పారామానికి__కాదు, వేస్తున్న లైన్లలో ఒకటి శిల్పారామం సమీపం నుంచి పోతుంది. అది ఎన్నాళ్లలో పూర్తవుతుందో శ్రీధరన్ ని అడిగితే అంచనా వేస్తారేమో!


ఫొటోలు ఎలా ఉన్నాయి ఇంతకీ?

प्रवीण् शर्मा said...

శ్రీధరన్ ఎవరు? నాగోల్-శిల్పారామం మెట్రో లైన్ గురించి విన్నాను. కానీ ఏ మెట్రో లైన్ అయినా అంత తొందరగా పూర్తవ్వదు. అందుకే కశ్యప్ గారు ఇలా అన్నారు "మెట్రో లైన్‌లో ట్రైన్‌ల వల్ల వచ్చేది తక్కువ. అందుకే ఎలెవేషన్ స్థంభాల మధ్య షాపులు కట్టి అవి అద్దెకి ఇచ్చుకుంటారు. షాపులు కట్టడం వల్ల అక్కడికి దగ్గరలో భూముల ధరలు పెరుగుతాయనుకునే సత్యం రాజు భూములు కొని నష్టపోయాడు" అని. నాగోల్-శిల్పారామం లైన్ సికందరాబాద్ టచ్ అవుతుంది అని నేను విన్నాను. కానీ ఏ మెట్రో లైనూ మా బాబాయి గారు ఉండే BHEL వరకు వెళ్ళదు. ఒక వేళ మెట్రో ప్రోజెక్ట్ పూర్తైనా శిల్పారామానికి వెళ్ళాలంటే బస్ ఎక్కాల్సిందే. బొమ్మలు ఎలా ఉన్నాయంటారా? ఏమో కానీ అవి ప్లాస్టర్ ఆఫ్ పేరిస్‌తో చేశారా? చైనా క్లేతో చేశారా? సాధారణ బంక మట్టితో చేశారా అని జిజ్ఞాస ఉంది. ఇప్పటి వరకు నేను శిల్పారామానికి వెళ్ళి చూడలేదు కదా, అందుకే ఆ జిజ్ఞాస.

ఆ.సౌమ్య said...

వా ఆ వా ఆ శిల్పారామాన్ని చూపించి మరీ ఎందుకండీ ఏడిపిస్తున్నారు! :(

ప్రతీ యేడాది డిసంబర్ లో వెళ్ళేదాన్ని...బోల్డు కొనుక్కు తెచ్చుకునేదాన్ని కూడా. చాలా ప్రదేశాలు చూసాక నాకు అర్థమయిన విషయం ఏమిటంటే శిల్పారామం లో దొరికినన్ని వెరైటీలు, అత తక్కువ ధరకి ఇంకెక్కడా దొరకవు.

Zilebi said...

ఇక్కడా ప్రవీణుడున్నాడూ!!!


కాని కొంత వరైటీ గా, ప్రవీణుడు మొట్ట మొదటి సారి 'శ్రీధరన్' ఎవరూ అని తనక్కూడా తెలియని విషయాలు ఉందని చెప్పడం నేను గమనించానోచ్ !

హమ్మయ్య, మొట్ట మొదటి మారు, ప్రవీణుడికి తెలియని దంటూ కూడా ఒక టి వుంటుందని తెలిసింది. నాకు తెలుసు శ్రీధరన్ ఎవరో ! నేను చెప్పనే చెప్పను

ఇక్కడి అందరికీ నూతన వత్సర శుభాకాంక్షలతో

చీర్స్
జిలేబి.

MyClipta said...

Nijamgane chaala baabunnayandi. meeru manchi photographar.

Siri said...

Sujata garu,
Mee tapa bagundi, photolu bagunnai, naakaite, Mayabazaar cinemalo kavuravula vididhi nagaram gurtuku vachhindi
A very happy New year to u and ur family.. may u write many a post in the year 2012

సుజాత said...

అయ్యో, కృష్ణవేణి గారూ, ఆ ఢిల్లీ హట్స్ ఎక్కడ అని అడుగుదామనుకుంటుండగానే కామెంట్ తీసేశారేం? ఈ సారి ఢిల్లీ ట్రిప్ లో ఒక లుక్కేద్దాం అనుకుంటున్నా

kri said...

లేదు సుజాతగారూ కామెంట్ తీసేసినది కొత్తవాళ్ళ బ్లోగుల్లో కామెంట్ పెట్టడానికి సంకోచం అనిపించి.
దిల్లీ హట్లా ? పాతది సరిగ్గా INA market ఎదురుగా.అదే సరిగ్గా ఉంటుంది.ఒక రెండు సంవత్సరాల క్రితం బిగ్ బజార్ ఎదురుగా పీతమ్ పురాలో మొదలు పెట్టేరు కానీ అక్కడ తినడానికి తప్ప ఇంకేవీ దొరకవు.

प्रवीण् शर्मा said...

శిల అంటే రాయి. అయితే శిల్పారామంలో మట్టి బొమ్మలు కూడా ఉండడం బాగుంది.

प्रवीण् शर्मा said...

Mee blog ki mobile theme enable chesi umda? Mee blog Android mobile lo open avutomdi kani bharare gari blog open avvadam ledu. Nenu ippudu phone lo net chestunnanu. Mee blog matrame open avutomdi. Chala telugu blogulu open avvadam ledu.

vijay said...

ఈ ఫొటోలన్నీ మీరు తీసినవేనాండీ? మీ ఆసక్తి బాగుంది. ఓ సారి మెయిల్ చూడండి

vijay said...

మీరు పర్మిషన్ ఇచ్చేసారని భావిస్తూ, నా వార్తల బ్లాగ్ లో మీ ఫొటోలను పబ్లిష్ చేస్తున్నా.

సుజాత said...

విజయ్ గారూ, ఇవన్నీ నేను తీసిన ఫొటోలే! మీ బ్లాగులో పెట్టుకోడానికి అభ్యంతరమేమీ లేదు

Kalasagar said...

హస్తకళల హరివిల్లు - శిల్పారామం ను కళ్ళకు కట్టినట్లు చూపించారు సుజాత గారు....ఫోటోలు చాలా బాగున్నాయి..
కళాసాగర్

Padmavalli said...

అబ్బా... ఫోటోలు ఎంత బావున్నాయో. ఒక రెండు సార్లు వెళ్ళాను అదే టైములో అక్కడ ఉండటం వలన. నాకు షాపింగ్ ప్లస్ తిరుగుటూ చూడటం కూడా ఇష్టం. అక్కడ నుంచి తెచ్చే గిఫ్ట్స్ మాత్రం ఇక్కడ అందరికీ బలే నచ్చుతాయి.

:-)))))ఓ రచయిత్రీ, పద్మ ఇప్పుడు ఎందుకు నవ్వింది?

srinu said...

sujatha gaau

photos baagunnayi, inkonchem perfection raavali

Post a Comment