August 5, 2008

కొత్తిమీరకట్ట పాకం

కాలేజీ రోజుల్లో నేను చదివింది కామర్స్ అయినా నాకు మాత్రం తెలుగు అంటే ప్రత్యేక అభిమానం ఉండటం వల్ల బిఏ స్పెషల్ తెలుగు వాళ్ల క్లాసులకు కూడా వెళుతుండేదాన్ని!
మాస్టారు మాకొచ్చే మాస్టారే కాబట్టి సమస్య లేదు.
అలా నేను చాలా సార్లు నా ఆడిటింగ్ క్లాసులు ఎగ్గొట్టి వాళ్ల తెలుగు క్లాసుల్లో కూచునేదాన్ని.

ఒకరోజు నేను వెళ్ళేసరికి మాస్టారు(శ్రీ పళ్ళె శ్రీనివాసాచార్యులు గారు)కదళీ పాకం గురించి చెపుతున్నారు. ఆయన చాలా సీరియస్ గా సబ్జెక్టులో మునిగిపోయి కదళీపాకానికి ఉదాహరణలు చెపుతుండగా,
'ఎద్దు సబ్బు '(క్షమించాలి, అతగాడి అసలు పేరు నాకు తెలియదు గానీ రోల్ నంబర్ మాత్రం 501.అందుకే అలా పిల్చేవాళ్ళం) అనే కుర్రాడు లేచి,
"సినిమా పాటల సాహిత్యాన్ని ఏ పాకం అని పిలవొచ్చు మాస్టారూ" అనడిగాడు.
ఆయన తడుముకోకుండా "కొత్తిమీర కట్ట పాకం అని పిలవొచ్చు నాయనా" అన్నారు.
అతడి ప్రశ్న పట్ల ఉత్సాహం చూపించని మేము, మాస్టారి సమాధానం విని అప్పుడు కుతూహలపడ్డాం, ఎందుకో తెలుసుకోవాలని.

"ఎందుకంటే ఇవాల్టి సినిమా పాటలని సాహిత్యం వినకుండా ట్యూన్ వింటే ఆహ్లాదంగా ఉంటుంది. అర్థాలు వెదికామా వాంతొస్తుంది. కొత్తి మీర కూడా అంతే! ఆకు వాసన చూస్తే మహత్తరంగా ఉంటుంది. నలిపి చూస్తే నల్లి చచ్చిన కంపు కొడుతుంది" అని వివరణ ఇచ్చారు మాస్టారు.

ఇందాక ఒక పాట వింటుంటే 'బావుందే ' అనిపించింది. నాకుగా పాడుకోబోతే అసభ్యంగా తోచి ఆపాల్సివచ్చింది.మాస్టారిని తల్చుకోక తప్పలేదు.

10 comments:

Kathi Mahesh Kumar said...

నిజమే..ఇంకోపోలికకూడానూ, సినిమా పాటలేని ఫంక్షనూ కొత్తిమీర లేని కూరా ఉంటాయా అసలూ!

ప్రియ said...

చిన్నప్పుడు నా పిలకని (pony tail) ని అమ్మ కొత్తిమీర కట్ట అనేది. :-(

మంచి కామెడీ.

నిషిగంధ said...

కొత్తిమీర పాకమా :))
అదేం పాటో కాస్త చెవిలో చెప్పండి :-)

Srividya said...

మీ మేస్టారు భలేగా పోల్చారు. నిజంగానే చాలా వరకు పాడటానికి వీలులేనివే వుంటాయి.

Purnima said...

కొత్తిమీరా?? మజాకా?? బహు బాగు!!

హర్షోల్లాసం said...

yemitamdi sujatha gaaru
modatloo manchi oopumdeee tapaalu rasaaru, ipppudu ee kottimeera kattala meeda paddaremitamdi baabu.sarlemdi kanivvaMdi.aina bagumdi mee tapaa.

చంద్ర మోహన్ said...

'కొత్తిమీరకట్ట పాకం' , చాలా బాగుంది. అర్థం తెలుసుకుకోకుండా చదవాల్సినవన్నీ, కొత్తిమీర పాకమన్నమాట!

- చంద్ర మోహన్

వేణూశ్రీకాంత్ said...

హ హ భలే పోల్చారండీ మీ మాష్టారు.

చైతన్య.ఎస్ said...

పోలిక అదిరింది.

Niranjan Pulipati said...

భలే పోలిక :)

Post a Comment