December 1, 2008

కౌముది లో నా కథ!

డిసెంబర్ నెల కౌముది అంతర్జాల మాస పత్రికలో నేను రాసిన "నీలమ్మ" కథ ప్రచురితమైంది. చదివి, అభిప్రాయం చెప్పండి.

నీలమ్మ కథ ఇక్కడ .

41 comments:

Kathi Mahesh Kumar said...

మొదటగా అభినందనలు. కథ తీరిగ్గాచదివి తరువాత నా అభిప్రాయాన్ని రాస్తాను.

Aruna said...

మనసుని మెలిపెట్టింది. నీలమ్మ మీద అసహ్యం వేసింది. స్వచ్చంధ సంస్థలపైన గౌరవం పెరిగింది.

చైతన్య.ఎస్ said...

తల్లి హృదయాన్ని చక్కగా ఆవిష్కరించారు. నిరక్షరాస్యత, పేదరికం మూలంగా చాలా మంది గ్రామీణ మహిళలు అటువంటి నరకకూపంలోకి లాగబడుతున్నారు. ఆ పరిస్థితులను చక్కగా తెలియచెప్పారు.

సుజాత వేల్పూరి said...

అరుణ గారు,
కథ చదివి అభిప్రాయం రాసినందుకు ధన్యవాదాలు! నీలమ్మ భర్త మీద, అతడి అన్న మీద, ఆమెను వృత్తిలోకి దించిన మహిళ మీద వేయని అసహ్యం, పిల్లల్ని చంపలేక ఒళ్ళమ్ముకోడానికి సిద్ధపడిన నీలమ్మ మీద వేసిందా?

లేక మీ అభిప్రాయాన్ని తప్పుగా అర్థం చేసుకున్నానా?

psm.lakshmi said...

కధ బాగుంది సజాతగారూ. నీలమ్మలాంటి మహిళలు సమాజం దృష్టిలోకి రాని వారు చాలామంది వున్నారు. వారే లేకపోతే ప్రపంచంలో చాలామంది మొగ్గ దశలోనే రాలిపోయి వుండేవాళ్ళు లేకపోతే తారుమారు జీవితాలు గడుపుతూండేవాళ్ళు. అంకురం ప్రభావం వున్నట్లుందే.
psmlakshmi
psmlakshmi.blogspot.com

Sujata M said...

సుజాత గారూ

చాలా బావుంది కధ. మా చిన్నపుడు మా పక్కింట్లో ఇలానే ఒక 15 ఏళ్ళ చక్కని చుక్క లాంటి పనమ్మాయి ఉండేది. ఇల్లంతా అద్దంలా పెట్టి, సొంత ఇంటి లానే కళ్ళాపి చల్లి ప్రతీ రోజూ.. రోజుకొకటి చాలా అందమ్యిన పెద్ద చుక్కల ముగ్గు పెట్టేది. ఆ అమ్మాయికి తనలాంటి అందమయిన ఇంకో చిన్న వయసబ్బాయితోనే పెళ్ళయింది. ఇద్దరూ టీనేజర్లే. ఆ తర్వాత ఆ అమ్మాయి పసిపిల్లాణ్ణి కంటూ 16 ఏళ్ళకే ప్రసవం లో వచ్చే ఏదో సీరియస్ వ్యాధి వల్ల (ఇంట్లో నే) చనిపోయింది. ఆ అమ్మాయి గుర్తొచ్చింది.

నీలమ్మ ని చూస్తే జాలి కలిగింది. మీరు చాలా చక్కగా చెప్పారు ఈ కధ ని. ఇలాంటి వ్యధా భరిత గాధలే కసా సెక్స్ వర్కర్లవి. అయితే ఒక తల్లి పిల్లల కోసం ఏమయినా చెయ్యగలదని చెప్పడం బావుంది. క్షణికావేశంలో వాళ్ళనీ చంపేసి, వీళ్ళూ చచ్చిపోతూంటారు కొందరు అభాగినులు. 'ఆమె ఏమి తల్లి ? చేతులారా పిల్లల్ని చంపుకుంది ' అని అందరూ బాధపడేలా.

కాబట్టి, నీలమ్మ లాంటి తల్లుల విచక్షణ కి (అలాంటి పరిస్థితుల్లో) ఆమె మీద గౌరవం కలిగింది.

మాలతి said...

సుజాతా, ఏకబిగిని చదివించిన కథ. వస్తువు కొత్తది కానప్పుడు,శైలి బలంగా వుండాలి. నువ్వు అది సాధించావు. నేరుగా నీ కథకి సంబంధం లేకపోయినా, నాకొక సందేహం వుంది. ఇలాటి ఇతివృత్తం తీసుకున్నప్పుడు, కిందితరగతి పాత్రలని రచయిత ఎంచుకోడానికి ప్రత్యేకమయిన కారణం ఏమైనా వుందా అని.
నువు మంచి కథ రాసినందుకు అభినందనలు.

Anil Dasari said...

బాగుంది. ఆ మధ్య వచ్చిన రాణీముఖర్జీ సినిమా 'లగా చునరి మేఁ దాగ్' గుర్తొచ్చింది. నీలవేణి మీద అసహ్యం కాకుండా జాలి వేసేలా రాశారు. నీలమ్మ pov లో రాసుంటే మరింత బాగుండేదేమో?

Kathi Mahesh Kumar said...

విఫలమౌతున్న వ్యవసాయం. అడుగంటిపోతున్న గ్రామీణజీవనోపాధులు.స్వార్థం. పురుషాహంకారం. మాతృప్రేమ.ఇన్నిపార్శ్వాల నీలమ్మ కథ హృద్యంగా ఉంది. ఇది జరుగుతున్నకథే.ఇంకాజరుగుతూనే వుండే వ్యధకూడా.

అరుణగారి వ్యాఖ్యలో నీలమ్మకు పిల్లలపైగల ప్రేమకన్నా, ఇలాంటి పరిస్థితుల్లోకూడా "పవిత్రత" కోల్పోవడం పట్ల నిరసన కనిపిస్తోంది.నీలమ్మవున్న బలీయమైన పరిస్థితులపట్ల సానుభూతికన్నా,"చెడిపోయిందనే" ఉక్రోశం కనిపిస్తొంది.మధ్యతరగతి విలువల నేపధ్యంలో అరుణగారి ఆంతర్యం అర్థం చేసుకోదగినదే అయినా, కథా ప్రయోజనానికి భంగంగా అనిపిస్తుంది.

జ్యోతి said...

సుజాతగారు.
కధ చాలా బాగా రాసారు. నీలమ్మ చేసినదాంట్లో తప్పేమీ కనిపించలేదు. ఆదే అమ్మతనం. తన పిల్లల కోసం ఎంతకైనా తెగిస్తుంది.

వేణూశ్రీకాంత్ said...

ముందు గా అభినందనలు సుజాత గారు. నీలమ్మ పాత్ర గుర్తుండిపోయేలా రాసారు. బాగుంది, కానీ నీలమ్మ కష్టాలు, పిల్లలపై ఆమెకున్న ప్రేమ ని ఎస్టాబ్లిష్ చేసే క్రమం లో... ప్రధమార్ధం అంతా రచయిత చేసిన సాయం గురించి కొంచెం ఎక్కువగా ప్రస్తావించినట్లు అనిపించింది. ముక్తాయింపు బాగుంది. ఇలా తమ ప్రమేయం పెద్దగా లేకుండానే చుట్టూ ఉన్న కొందరి స్వార్ధం వల్ల పరిస్థితుల వల్ల ప్రభావితం కాబడిన బ్రతుకులెన్నో అనిపించింది.

మధురవాణి said...

సుజాత గారూ..
నీలమ్మ కథ మనసుని కదిలించింది. తను ఉన్న పరిస్థితుల్లో.. తన గురించి మర్చిపోయి మరీ పిల్లల కోసం తన జీవితాన్ని పణంగా పెట్టిన నీలమ్మ మీద గౌరవమే కలుగుతుంది. అలా చేయగలగడం కూడా అందరికీ సాధ్యం కాదని నా అభిప్రాయం. అంత త్యాగనిరతి ఉండాలంటే అనంతమైన ప్రేమ ఉండాలి పిల్లల మీదయినా సరే.. ఆ విధంగా ఆలోచిస్తే ఆమె వ్యక్తిత్వం ఎంతో గొప్పదనిపిస్తుంది.

వేదాల రాజగోపాలాచార్య said...

కథా, కథనాల్లో మంచి బిగి ఉంది. భాష కూడా బాగున్నది. అభినందనలు.

గీతాచార్య said...

ఇది చదువుతుంటే నాకు నా చిన్నప్పుడు జరిగిన సంగతి గుర్తొచ్చింది.

నేను రెండో తరగతి చదివే రోజుల్లో వీరేశ్ అనే ఫ్రెండు ఉండేవాడు. బళ్ళో చాలా సరదాగా ఉండేవాడు. కానీ వాడెప్పుడూ చిరిగిన బట్టలే వేసుకుని రావటం నాకెందుకో ఆశ్చర్యం గా ఉండేది. ఒకసారి ఆగస్టు పదిహేనుకి బళ్ళో ఒక కేకు ముక్కా, రెండు మూడు చాక్లెట్లు ఇచ్చారు. వాటిని తినే పనిలో నిమగ్నం అయ్యాము. కానీ వాడూ, వాడి అక్కా, వాటిని తినకుండా జేబులో పెట్టుకుని పంచుతున్న మాస్టారి దగ్గరికి వెళ్లి మాకు ఇవ్వలేదు. అని అడిగి చెరో పేకెట్టూ తీసుకున్నారు.

నేను వేరే పిల్లలతో మాట్లాడుతూ ఉన్నాను. ఇంతలో "అమ్మా!" అంటూ వీరేశ్ గాడి గొంతు వినిపించింది. గొంతుకాదు, వాడి ఏడుపు. వీడు జేబులో పెట్టుకున్న సంగతి చూసిన పెద్ద తరగతి పిల్లాడు వాణ్ని బెదిరించి ఆ పెకేట్లని లాక్కోబోతే వాడు ఆ పిల్లాడితో కలబడ్డాడు. అప్పుడు వాడు వీణ్ణి చేయ్యిమేలిపెట్టినట్టున్నాడు. అందుకే అరిచాడనుకుంటా.

ఒకరిద్దరు మాస్టార్లు వాళ్ళని విడిపించి విషయం కనుక్కున్నారు. అసలు విషయం ఏమిటంటే వాళ్లు చాలా పేదవాళ్ళు. వాళ్ల చెల్లికి తినటానికి రెండు రోజుల నుంచీ ఏమీ లేదట. అందుకనే వాళ్ల ఆకలిని చంపుకుని ఆ పిల్ల కి పట్టుకేల్లెందుకు ఈ కేకు ముక్కలే కనిపించాయి. విషయం విన్న కొందరు మాస్టార్లు వాళ్ళని ఇంటి దగ్గర దిగపెట్టి ఓ ఏభై రూపాయలు సాయం చేశారట. నేను మురళీబాబు వస్తే ఇంటికి వెళ్లి పోయాను. మరో రెండు నెలల తరువాత ఫీజులు కట్టలేక బడి మానేశారు. ఆ తర్వాత నేను వాడిని చూళ్ళేదు. బాగా చదివేవాడు. మానేశాడే అని అప్పుడప్పుడూ అనిపించేది.

ఆ మధ్య నేను వాడి గురించి ఎంక్వైరీ చేస్తే తెలిసిన విషయాలకి మాటల లో చెప్పలేని వేదన కలిగింది. సరీగ్గా ఇల్లాంటి పరిస్థితుల లో వాళ్ల అమ్మా, నాన్నా పిల్లలకి పురుగుల మందు ఇచ్చి వాళ్ళో త్రాగి ఆత్మ హత్య చేసుకున్నారు. ముందు వాళ్ల ఊరు వెళ్లి పొలం వ్యవహారాలు చూసుకుందామని ప్రయత్నించి, ఎవరో మోసగిస్తే ఈ పరిస్థితి దాపురించింది.

ఆవేదనా పూరితమైన పాత జ్ఞాపకాలని తట్టి లేపిందీ కథ. నీలమ్మ చేసింది ముమ్మాటికీ తప్పు కాదు. ఆ పిల్లలు పైకి వచ్చి సమాజానికి సమాధానం చెపుతారు.

P. S.: మా నాన్నగారూ కథని (printouts) చదివి అభిప్రాయాన్ని తెలిపారు. దానిని కూడా ఇక్కడ ఉంచాను.

సహాయం చేయాలనే మంచి తలంపు ఉన్న ఆ నేరేటర్ కి 'వంద'నాలు. :-)

teresa said...

సుజాతగారూ,
కథ చాలా బాగా నడిపించారు.First person లోచెప్పడం వల్ల 'నేను'పాత్ర కాస్త ఎక్కువ glorify అయినట్లనిపించింది. పోతే నీలమ్మ మీద ఎటువంటి judgement చెయ్యవలసిన అవసరం కనబడలేదు. she just had to do what needed to be done! ప్రపంచమంతటా ఇలాంటి అభాగినులు కోకొల్లలు.

ramya said...

అభినందనలు. మరిన్ని మంచి కథలు రాయాలి మీరు.

Samanyudu said...

చా .....లా బాగుందండి. అలాంటి తల్లులకి పాదాభివందనం...ఆ తల్లులకి సహాయం చేసే మీలాంటి వారికి కూడా.

కాకపొతే, తన పిల్లల కోసం తనను తాను త్యాగం చేసుకున్న ఆ తల్లి కధకి మీరు రాసినది ప్రారంభం మాత్రమే అని నా అభిప్రాయం. Will she be paid back by those children? Are those children brought up to enough maturity levels to understand what & why she did choose that way, appreciate her and take care of her at a later stage of her life? No one knows, బహుశా కాలమే నిర్ణయించాలేమో కదా?

To what i have seen, these homes help such under-privileged children with daily bread & basic education but may not equip them with correct thought process & giving back to society attitude. If this can be incorporated, these under-privileged children may not become a threat to society in future but may become good citizens and fight back the terror, politicians blah blah blah.

Sorry, i am just expressing my thoughts ...may not be relevant to your story or MAY BE THE FLIP SIDE OF YOUR STORY.

చివరగా ఒక్క మాట, మీ కధ నిజానికి ప్రతిరూపంలా, చాల practical alochanalatO వుండి, చివరగా ఒక దేవతలో కనిపించి abruptగా end అవటం నాకు అర్థం కాలెదు.

By the way, కత్తి గురువుగారి blog లొ ఆయన 'లైంగికత s నైతికత : ఒక జెండర్ ధృక్కోణం' వ్యాసానికి ఒక comment పెడితే ఆయన silent అయిపోయారు. బహుశా అయనకి 'నైతికత సామజికం కాదు, వ్యక్తిగతం' అన్న విషయం అర్థమయినట్లుంది. ఓకవెళ కాకపొతే నీలమ్మ character నుండైనా ఈపాటికి తెలుసుకునుంటారు.

శ్రీధర్ said...

Kadha antha chadivaka Neelamma kanna NENU patra meeda jaali kaligindi... Entha nissahayatha...inka goppa goppa tyagalu chesi... neelamma..ki kotta jeevitham echhe avakaasam evvanantha ettuku yedigi poindi neelamma....
kadha lo neelamma dourbhagyapu paristhithi.. NENU goppatanaanni 10 inthalu penchindi...

సుజాత వేల్పూరి said...

అభినందించిన మిత్రులకు ధన్యవాదాలు!

మాలతి గారు, కథా వస్తువు కొత్తదా పాతదా అని చూసుకోలేదు. నాకు ఎదురైన "నీలమ్మ" ను నలుగురికీ పరిచయం చెయ్యాలనుకున్నాను, నవీన ని చేసినట్టుగానే!

అబ్రకదబ్ర, అవును, ఆ సినిమా నేనూ చుశాను టివిలో! నీలమ్మ మీద కలిగిన భావమే విభావరి మీదా కలిగింది.

వేణూ శ్రీకాంత్, మరియు తెరెసా గార్లు,
"నేను" పాత్ర కొంచెం lengthy అయిన ఫీలింగ్ నాకూ కలిగింది.

సామాన్యుడు గారు,
మీ అభిప్రాయానికి ధన్యవాదాలు! నీలమ్మ పాత్ర ఇహ అలా కాక ఎలా ముగుస్తుంది? ఇక ఆ పాత్ర ఏమయిందో, మనకి అనవసరం. ఆమె చేసింది తప్పు కాదు అని చెప్పడమే కథ ఉద్దేశం. ఉందో లేదో తెలియని దేవతని "అమ్మా" అని జనం పూజిస్తున్నపుడు పిల్లలకోసం ఎంతైకైనా తెగించగలిగిన నీలమ్మ కూడా తల్లిగా దేవతే అని చెప్పడమే కథ ఉద్దేశం!

ఇక పొతే నాకు తెలిసి మహేష్ కుమార్ గారు ప్రతి వ్యాఖ్యకూ వివరంగా సమాధానం ఇస్తారు, చర్చిస్తారు. మీ వ్యాఖ్యకు సమాధానం ఇవ్వనంత మాత్రాన మీతో ఏకీభవిస్తున్నట్టు కాదేమో! బిజీగా ఉన్నారో, లేక ఇద్దామనుకుంటూనే మర్చిపోయారో! మరో సారి ఆయన బ్లాగులో వ్యాఖ్య రాసి చూడండి.

సుజాత వేల్పూరి said...

రాజగోపాల చార్య గారికి,
నమస్కారాలు! మీరు ఇంతకు ముందు కూడా నా టపా ఒకటి చదివి ఓపిగ్గా వ్యాఖ్య రాశారు. ధన్యవాదాలు. మీకు ప్రింట్స్ తెచ్చి చదివిస్తున్న గీతాచార్యకు కూడా ధన్యవాదాలు.

గీతాచార్య,
మీరు చూసిన ఒక దీనగాధను మీకు గుర్తు తెచ్చిందంటే నీలమ్మ కు ఇంక ఏమి కావాలి! హిట్టే!

Anonymous said...

కధ చాలా బాగుంది.
ఇలాంటి నీలమ్మలు నాకు కూడా
తారసపడ్డారు. మీరు కధను
చాలా వాస్తవికతతో మలిచారు.
మంచి కధను అందించినందుకు ధన్యవాదములు.

Bolloju Baba said...

కంగ్రాట్స్ అండీ

నిషిగంధ said...

ముందుగా ఇంత లేటుగా వ్యాఖ్యానిస్తున్నందుకు క్షమాపణలు.. ఇక అందుకోండి అభినందనలు :-)
మీనించి కధ వస్తుంది అని తెలీగానే ఇంకో 'నవీన ' ని ఎక్స్పెక్ట్ చేశాను.. కానీ మీరు 'నీలమ్మ ' ని చూపించి మంచి సర్ ప్రైజ్ ఇచ్చారు! కధ గురించి అందరి అభిప్రాయమే నాదీను.. వాస్తవికతకి చాలా దగ్గరలో ఉంది.. మీ శైలి వలన కధ చదువుతుంటే ఆ పాత్రలు కళ్ళముందే ఉన్నట్లున్నాయి..

అంతకుముందు టపాలోనూ, ఇప్పుడు కధలోనూ 'అంకురం' గురించి చదివాక ఆ సంస్థ నిర్వాహకుల మీద గౌరవం ఇనుమడించింది! Hats off to them!

కాకపోతే ఈ మధ్య కాలంలో నేను గమనించిందేంటంటే.. ఈనాటి సెక్స్ వర్కర్ల కధలన్నీ వ్యధాభరితం కాదు.. ఒకప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లోనో లేక బలవంతానో మగవాళ్ళు రౌడీజం వైపుకీ, ఆడవాళ్ళు వ్యభిచారం వైపుకీ మళ్ళేవాళ్ళు.. ఇప్పుడు ఈజీ మనీ ప్రలోభానికి లోనయ్యి అటువైపుకి వెళ్ళేవాళ్ళున్నారు!

నా ఉద్దేశ్యం నీలమ్మ లాంటి వాళ్ళ గురించి ఎంతమాత్రం కాదు.. ఇంట్లో తల్లితండ్రులు పోషించి చదివిస్తుంటే సరిపోక చెడు మార్గాలు తొక్కేవాళ్ళ గురించి!

Aruna said...

@సుజాత
మీరూహించింది నిజమే. దిగజారుడుతనం పైన అసహ్యం వేసింది. కథలో దిగజారుడుతనాన్ని ప్రతిబింబించింది నీలమ్మ కాబట్టీ, పాత్ర పైకి అసహ్యం మళ్ళింది. పరిస్థితులను అర్ధం చేస్కుని సమస్య మూలాలైన పిల్లలకి భద్రత, చదువు కల్పించడం ద్వారా ఇంకొంతమంది నీలమ్మలు తయారు కాకుండా చూస్తున్న సంస్థల పట్ల గౌరవం పెరిగింది.
Well, తప్పు ఎప్పటికీ తప్పే. పరిస్థితులని చూపించి తప్పు ని సమర్ధించుకోలేము. ఆ న్యాయం అందరికి వర్తిస్తుంది. కాకపోతే తప్పు చెయ్యడం మానవ సహజం కాబట్టి దానిని మార్చుకొని నైతికత ని వీడకుండా జీవించాల్సిన బాధ్యత అందరి పైనా వుంది.
Btw, మీరు కథ లో చెప్పిన సంస్థ "అంకురం" ఆ? కొంచం క్లారిఫై చెయ్యగలరా. అలాంటి సంస్థ కి సాయపడాలని వుంది.

@కత్తి
నా వ్యాఖ్య పై మీ విశ్లేషణ ద్వారా మీరేమిటో బ్లాగు వీక్షకులందరికీ ఇంకోసారి రుజువు చేస్కున్నారు. :)

Aruna said...

@సుజాత
"నీలమ్మ భర్త మీద, అతడి అన్న మీద, ఆమెను వృత్తిలోకి దించిన మహిళ మీద వేయని అసహ్యం, పిల్లల్ని చంపలేక ఒళ్ళమ్ముకోడానికి సిద్ధపడిన నీలమ్మ మీద వేసిందా?"

మీ ప్రశ్న కి సమాధానం ఇవ్వడం మరిచాను. కథ చదివినంతసేపు నీలమ్మ కథానాయకురాలు గా, పరోక్షంగా ఇది నా కళ్ళ ముందు జరుగుతున్నట్టు అనిపించింది. బహుశా రచయిత్రి ఇంట్లో రచయిత్రికి, నీలమ్మ కు మధ్య నడిచిన సంఘటనలు కొన్ని నేను ప్రత్యక్షంగా చూసినవి, అనుభవించివి అయ్యి వుండడం చేత ఏమో. కథ చివర్లో నీలమ్మ నిర్నయం గురుంచి మాత్రమే నేను ఆలొచించాను కాని, పరిస్థితులని నిందించాలని నాకు అనిపించలేదు.

పరిస్థితులు అనేవి మనకు కాలం, ఖర్మం పెట్టే పరీక్షలు గా తీస్కుంటను నేను. పరీక్షలో గెలుపు అత్యవసరమై కాపీ కొట్టి పట్టుబడిన విద్యార్ధి మీద నేను జాలి పడను. కాపీ కొట్టడానికి ప్రయత్నించాడు కాబట్టీ సహజం గానే నా -ve reactions show చేస్తాను. కాపీ కొట్టాల్సి వచ్చిన పరిస్థితుల తీవ్రత తగ్గేలా నా చేతనైన సాయం చేస్తాను. పరీక్షలను ఎదుర్కోవడం కోసం సన్నధ్ధం చేస్తాను. నా చుట్టూ ఇలాంటి వాళ్ళు ఎంతోమంది వున్నా, నేను సాయం చెయ్యగలిగేది కొంతమందికే కాబట్టి, నా పరిధి లో నేను సాయం చేస్తాను. నా స్నేహితులకి కూడా వీలైతే ఇలానే చెయ్యమని చెప్తాను.

ఇకపోతే ఆ కథలో నీలమ్మ పాత్ర ద్వార మీరు పరిష్కార మార్గాలని సూచించాల్సింది లాంటి సలహాలు ఇవ్వడం, మిమ్మల్ని నాలా మారమనటం అవుతుంది కాబట్టి, కథ చదివాక నా ప్రతిస్పందనలని మాత్రం చెప్పి వదిలేశాను.

Samanyudu said...

Nishigandha gaaru, this was the first thought came into my mind but did not want to include in my first comment. Whatever the reason, bread earning or easy money or forced to or no other option / un-avoidable circumstances, these sex workers are into that for living...baseline. But, day-in / day-out i see girls (not all but a good number of them) working in MNCs and call-centers doing similar things for luxurious lifes. In a closed group, i have seen every girl enjoying (i literally mean it) with every boy; just for those 5-star dining, roaming cars, watching movies in Gold classes, expensive gifts etc. After knowing this, i respect these sex workers more and more as they are doing it for their living.

I hope i did not hurt any one; if yes, my sincere apologies.

సుజాత వేల్పూరి said...

అరుణ గారు, మీ అభిప్రాయాలు మీ వ్యక్తిగతమైనవి. వాటికి విలువ ఇస్తాను. ఓకే!

"దిగజారుడుతనం" అనేదానికి నిర్వచనం మీ దృష్టిలో ఒకటి కావొచ్చు. ప్రాణాలనైనా త్యాగం చేసి, శారీరకమైన శీలాన్ని కాపాడుకోడాన్ని మీరు సమర్థిస్తున్నారు. శీలం కేవలం శారీరకమైనదేనా అన్న ప్రశ్నకు సమాధానం ఉందా అసలు? మీరన్నట్టు నీలమ్మే "దిగజారకపోతే", ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆమె నలుగురు ఆడపిల్లలూ "దిగజార్చబడి" ఉండే వాళ్ళు కాదా? తన నలుగురి పిల్లల జీవితాలని సక్రమంగా నడపడానికి నీలమ్మ తనను తాను "దిగజార్చుకోడానికి"(మీ దృష్టిలో) సిద్ధపడింది. ఆమె త్యాగం చేసిందని నేను చెప్పడం లేదు. అది త్యాగమని నీలమ్మ కూడా అనుకోదు.

పరీక్షల్లో కాపీ కొట్టి పాసయ్యే విద్యార్థి పరిస్థితీ, నీలమ్మ పరిస్థితీ ఒక్కటేనా? బాధ్యతను సరిగ్గా నిర్వర్తించకుండా,(చదవకుండా) మరో క్లాసుకి ప్రమోషన్ పొందడానికి కాపీ కొట్టే విద్యార్థికి, నీలమ్మకి పోలిక ఎక్కడుంది?

పరిష్కార మార్గాలు ఎవరి పరిస్థితిని బట్టి వారు వెదుక్కుని నిర్ణయించుకోవాలి తప్పించి, ఆ బాధ్యత మన నెత్తిన వేసుకోవడం, నీలమ్మ తప్పు చేసిందనో, చేయలేదనో నొక్కి వక్కాణించడం నా పని కాదు. చదివిన వారికి వివిధ మార్గాలు తోచవచ్చు!

ఇంకొక్క విషయం! నైతికత అనేది 100 శాతం వ్యక్తిగతం! అది సామాజికం కాదు.

సుజాత వేల్పూరి said...

నిషిగంధ,
మీరు చెప్పిన కోణం కూడా రైటే! కేవలం జల్సాల కోసం, చేతి ఖర్చుల కోసం పార్ట్ టైం సెక్స్ వర్కర్లుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు.మరో వైపు నీలమ్మ లాగా గతిలేని పరిస్థితుల్లో దిగే వారు!

మీకు నవీన కూడా తెలుసా? తూలికలో చదివారా?

సుజాత వేల్పూరి said...

అరుణ గారు,
అంకురం వివరాలకోసం, నా ముందటి టపా "ప్రమదావనంలో అంకురించిన సేవాభావం" చూడండి.

Aruna said...

@సుజాత
ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఎన్నో రకాల అనుభవాలు, ఇంకెన్నో తర్క వితర్కాల తరువాత, ప్రతి ఒక్కరూ కొన్ని నిర్దుష్ట అభిప్రాయాలను ఏర్పరచుకుంటారు.
Well, let's agree to disagree. :)

వోహ్ ఐతే మీరు కథ లో ప్రస్తావించిన సంస్థ అంకురం అన్నమాట. Thank you for the info.

Unknown said...

సుజాత గారు''నేరం నాదికాదు ఆకలిది''అని అప్పట్లో ఓ సినిమా వచ్చింది అందులో NTR దొంగ గా మారడానికి ఆకలే కారణం అని చూపిస్తారు.మీ నీలమ్మ కదా చదివాకా ఏ EVV SATYANARAYANO '' బేరం నాది కాదు ఆకలిది ''అని సినిమా తీస్తా అంటాడేమో?ప్రపంచం లో అతి పురాతనమైన వృత్తి నీలమ్మ లాంటి వాళ్ళ సమస్యకి పరిష్కారం చూపోచ్చేమో గాని ,నిషిగంధ గారు చెపినట్టు ఈ రోజుల్లో easymoney కి చాల ఈజీ గా వాడేసుకుంటున్నారు ఆ వృత్తి ని.అసలు nelamma ఆ వృత్తి లో దిగడానికి పరోక్షం గా (మీకు తెలీకుండానే)సహకరించరేమో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి లూప్ వేయించడం ద్వార, లేక పొతే ఆమె ఇంకోసారి కడుపెసుకుని చెట్టుకింద కూర్చుని వుంటే'' అక్క'' చేరదిసేది కాదు గా?అయిన రునానుబంధ రూపేన పశు ,పత్ని,పనిమనిశాలయ అని మార్చుకుని చదువుకోవలసిన రోజులివి.

గీతాచార్య said...

సుజాత గారు,

"నైతికత అనేది 100 శాతం వ్యక్తిగతం! అది సామాజికం కాదు."

గట్టిగానూ, సూటిగానూ సరీగ్గానూ చెప్పారు. చచ్చి పోయే కన్నా, లేదా మీరు అన్నట్టుగానే నీలమ్మే "దిగజారకపోతే", ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆమె నలుగురు ఆడపిల్లలూ "దిగజార్చబడి" ఉండే వాళ్ళు కాదా? జరిగేదీ, జరుగుతున్నదీ అదే కదా.

పరిష్కారాలు ఎవరో సూచిస్తే దొరికేవి కాదు. ఎవరికీ వారే కనుగొనాలి. లేక పోతే ఈ పాటికి అన్ని సమస్యలూ పరిష్కరించబడేవి.

అయినా "రాం అన్నయ్యలూ" ఇంకా సామాజ రక్షకులూ... ఎన్ని సలహాలు ఇవ్వలేదూ... :-)

Kathi Mahesh Kumar said...

ఇక్కడ చర్చల్లో modern-urban-pleasure-prostitution గురించి మరోకోణం ఆవిష్కృతమయ్యిందన్నమాట.

కొందరు ఆధునికి మహిళలు నగరజీవన సుఖసంతోషాల్ని (తమ ఖర్చులేకుండా) అందుకోని అనుభవించాలనే కోరికతో తమ శరీరాల్ని ఉపయోగిస్తుంటారు .అది కథావస్తువు కాకపోయినా, కథా వస్తువుకు గల మరోకోణంకాబట్టి చర్చ సబబే!

Such women actually know what they are doing and for what.అలాంటప్పుడు వ్యక్తులుగా వాళ్ళకిదొక ఛాయ్స్ అనుకోవాలనుకుంటాను. ఇక్కడా value judgment కన్నా that's the reality అనుకోవాలి.అంతే!

కాకపోతే నీలమ్మ గల సామాజిక-ఆర్థిక పరిస్థితులు, ఆమెకు తల్లిగా గల బాధ్యత మనకు సానుభూతిని కలిగిస్తే, ఇలాంటివాళ్ళకోసం మనకు ఆ భావన రాకపోవచ్చు. దానికి గల ఒకేఒక కారణం మన నైతిక విలువల్ని నిర్దేశించిన సామాజిక కట్టుబాట్ల ప్రభావం. అందుకే నైతికత వ్యక్తిగతమైనా లైంగికపరమైన నైతికత సామాజిక నిర్దేశితంకాబట్టి the choice is limited అనుకుంటూ ఉంటాను.అక్కడే conventional morality Vs Individual morality debate మొదలౌతుంది.సుజాతగారు ఖచ్చితంగా నైతికత వ్యక్తిగతమని చెప్పినా అందులో కొంతభాగం మాత్రమే నిజమనిపిస్తుంది.

@అరుణ:నేను కొత్తగా బ్లాగులోకానికి ఋజువుచెయ్యాల్సింది ఇంకా ఉందంటారా!

@సామాన్యుడు:మీకు నా బ్లాగులో సమాధానం రాసాను చూడండి.

వేణూశ్రీకాంత్ said...

సుజాత గారు పాత్ర నిడివి పెరగడం కాదండీ అవన్నీ అవసరమే కాని తను చేసిన సాయాల గురించి చెప్పడం సొంత డబ్బా కొట్టినట్లు అనిపిస్తుంది. అదే నీలమ్మ తను పొందిన సాయం గురించి చెప్తే అలా అనిపించదు, కానీ నీలమ్మ కధ చెప్తే రచయిత తన మనోభావాలని చెప్పడం కష్టమయ్యేది.

అన్నట్లు మీ "నవీన" ని మాకు కూడా పరిచయం చేయవచ్చు కదా....

దైవానిక said...

బాగుంది. :)

SIMHA said...

hello madum..
ur blog is supurb..

Sky said...

సుజాత గారికి,
నమస్కారం. నా పేరు సతీష్ యనమండ్ర (సనాతన భారతి బ్లాగ్ నాది, గతం లో మీరు ఒక సారి చూసి ఒక మెసేజ్ కూడా వదిలి వెళ్లారు అప్పటి నా చాట్ బాక్స్ లో). గత మూడు రోజులుగా మీ బ్లాగ్ లోని దాదాపు అన్ని టపాలు చదివేసాను. మీ శైలి బహు బాగా నచ్చి నా అభిప్రాయాలను పంచుకుందాం అనీ ఈ వ్యాఖ్య రాయాటం మొదలు పెడుతున్నా. అన్ని టపాల మీదా ఒకేసారి రాసేస్తున్నా .

* మీ "భళా భళి నా బండి" చదవగానే మా అక్కయ్య గుర్తుకు వచ్చింది. నాన్న గారితో సైకిల్ మరియు స్కూటర్ నేర్చుకోడానికి వెళ్లి గంటలో వెనక్కి వచ్చి "నా వల్ల కాదురా ఈయనతో- నువ్వు నేర్పు అని నన్ను bratimilaadina రోజులు గుర్తుకు వచ్చాయి.
* "అరవడం" -- అబ్బో ప్రత్యక్షంగా అనుభవించానండి బాబు (మద్రాస్ లో వుద్యోగం వెలగబెట్టా రెండేళ్ళు)
* కర్ణుడి చావుకి కారణమెవరు" -- నట సార్వభౌముడి ఆపాత మధురాలు ఒక్కసారి మదిలో మెదిలాయి. పాపం పెద్దాయన.
* "బరువు-బాధ్యతలు"-- ఆరు నెలల్లో నీకు పెళ్లి చేస్తాం కాస్త "జిం" కి వెళ్లి బొజ్జ తగ్గించు అన్న మా నాన్న గారి హుకుం కి ఒక మంచి సాకు దొరికింది. దానితో నైకీ షూస్, ట్రాక్ సూట్ కొనే ఖర్చు తప్పడమే కాక, అడ్డ గాడిదలా (మా నాన్న గారు నన్ను అలా ముద్దు గా పిలుస్తారు) తొమ్మిది వరకూ పడుకునే అద్భుతమైన అవకాశం మళ్ళీ దక్కింది.
* "అమ్మాయిలూ-ఆంటీలు"-- నేను బొత్తిగా ఫీల్ అవడం మానేసా- ముప్ఫైలోకి ఇంకా రాకముందే, పెళ్లి కూడా కాకముందే మా పక్కింటి ఇంటర్మీడియట్ అమ్మాయి నన్ను అంకుల్ అని పిలవడం మొదలెట్టింది . ఇంకా మీరు ఈ విషయం లో అదృష్టవంతురాలు అక్కా(ఈ పిలుపు ఓకే అనుకుంటా మీకు?), కనీసం పెళ్లి అయిన తర్వాత మొదలెట్టారు.
* "గూర్ఖా" మీద ఎండ్లూరి సుధాకర్ గారి కవిత చాలా బాగుంది- మీ పర్మిషన్ తీసుకుని నా బ్లాగ్ లో కవితలు category లో పెట్టుకుందాం అని ఆగా ( తర్వాత దొబ్బేసాడు చచ్చినాడు అని మీరు నన్ను తిట్టుకోకుండా).
* మీ వంటింటి భాగోతం విన్న తర్వాత నాకు మళ్ళీ మా ఇల్లు గుర్తుకు వచ్చింది. అమ్మ కృష్ణ జిల్లా, నాన్న గారు గోదావరి జిల్లా ( అది తూగో నా లేక పాగో నా ఇప్పటికీ తెలియదు)-- వాయలు వాయలు గా తింటూనే వుంటాం మళ్ళీ ఏదో ఒక కామెంట్ . ఇకపోతే మీ వారికి వంట వచ్చు అన్న సంగతి మీకు తెలియక పోవడం. మా అన్నయ్య (వొదిన వర్కింగ్) ఒక ఉచిత సలహా ఇచ్చాడు -"ఒరేయ్ అబ్బాయి! నీకు పెళ్ళైతే నీకు వంట చెయ్యడం వచ్చు అన్న సంగతి నీ పెళ్ళానికి తెలియకుండా జాగ్రత్త పడు" అని. ఇప్పుడు నా భయం ఏంటంటే బండ పచ్చళ్ళ మొదలు, పులిహార, బిర్యాని వరకూ చెయ్యడం వచ్చిన నా పాక శాస్త్ర ప్రావీణ్యాన్ని మా అమ్మ ఎక్కడ మా ఆవిడకి చెప్పేస్తుందో అని. :(
* "బడి గంట మోగింది" --- మళ్ళీ నా చిన్నప్పటి రోజులు గుర్తుకు తెచ్చారు.
* "అల్లరా!అంట అదృష్టం కూడానా!!"--- నేను మా ఆక్క ఒకే బడిలో చదివాం. అది స్కూల్ ఫస్ట్... మనం హ హ హ (అర్ధమయింది అనుకుంటా) ప్రతి ఒక్కడూ మా అక్కని పిల్చి ఏమ్మా మాధవి, ఏంటమ్మా మీ తమ్ముడు అని తెగ కంప్లైంట్స్ ఇచ్చేవాళ్ళు. ఇది చివరికి ఏ పరిస్థితికి వచ్చిందంటే నన్ను వేరే స్కూల్ లో వేసే వరకు మా అక్కయ్య, స్కూల్ వాళ్లు శాంతించలేదు. ప్రపంచంలో అక్కలందరూ ఇలాగే ఎందుకు వుంటారో? :(
* "నా జర్నలిస్టు ఉద్యోగం"-- చదివిన తర్వాత అర్ధం అయ్యింది మీ భాష అంత ఖచ్చితంగా ఎందుకు వుందో అని. మీ రచనా శైలిలో చతురత, సూటిదనం సమపాళ్ళలో కలిసి చాలా బాగుందండి. ప్రత్యేకించి పిల్లల ప్రశ్నలకు మీరిచ్చిన సమాధానాలు సూపర్ అండి బాబు!!! :)
* "బ్రేక్ ఫాస్ట్"-- చదవగానే ప్రాణం లేచోచ్చిందంటే నమ్మండి, దానికి తోడు నోరు కూడా తెగ వూరింది లెండి. అందుకే ఇప్పుడే మళ్ళీ పెసర పప్పు నానబోసా- పొద్దున్నే పెసరట్టు ఉప్మా తిని కానీ బయటకి వెళ్ళకూడదు అని. (ఈ వ్యాఖ రాసేసి అల్లం పచ్చడి ఎలా చెయ్యాలో ఇంటర్నెట్ లో వెతకాలి :)
* "మీ చదువులే మా చావులు"-- ఇది నాలా ఏదో పెళ్లి చేసుకుని జీవితం లో సెటిల్ అవుదాం అనుకునేవాన్ని భయపెట్టడం లా వుంది.ఏదో హ్యాపీ గా వానాకాలం చదువుల్లా పెద్దగా ఖర్చు లేకుండా కానిచ్చేసాం- ఈ డొనేషన్ దందా చూస్తుంటే అసలు పెళ్లి చేసుకోవాలా వద్దా అన్న మీమాంస లో పడ్డా... ఒక వేళ చేసుకున్న పిల్లల్ని కనకూడదు అని కూడా డిసైడ్ అయ్యా :)
* "ఒక్క సారి నిలబడండి"--- జై హింద్.
* "తెలుగంటే అంత అలుసా"--- voice and accent trainer గా పనిచేసిన నేను ఈ విషయం మీద ఎంతయినా మాట్లాడగలను(దౌర్భాగ్యం ఏంటంటే ఇంగ్లీష్ లో). నేను ఇంగ్లీష్ లో మాట్లాడితే మీరు నన్ను కూడా చీల్చి చండాదేతట్లు వున్నారు.... కానీ మీరు అన్న మాటలు అక్షర సత్యాలు. దీనిమీద నా బ్లాగ్ లో కూడా ఒక చిన్న ఆర్టికల్ రాసా.
* దీపావళి-- మళ్ళీ పాతరోజులు గుర్తుకు వచ్చాయి. చిన్నప్పుడు మతాబాలు చుట్టిన రోజులు... ఎండలో పెట్టిన టపాకాయలకు కాపలా కాయడం--- మళ్ళీ రావేమో అలాంటి రోజులు.

* "హింస ధ్వని"- ప్రస్తుతం వస్తున్న కార్యక్రమాల మీద నాకున్న భ్రమలు తొలగిపోయాయి. సాహిత్యాన్నీ మింగేసే సంగీతంవినాల్సిన దౌర్భాగ్య పరిస్థితి నుండి మనం ఎప్పుడు బయట పడతామో. పెద్దాయన బాలుగారి మొదటి కార్యక్రమంపాడుతా తీయగా రోజులు గుర్తుకు వచ్చాయి. ఆ మహానుభావుడిని కలిసే అదృష్టం ఎన్నో సార్లు నన్ను వరించింది. నాబ్లాగ్ లో కూడా వారి గురించి రాసాను.
* కౌముదిలో మీ కదా ఇంకా చదవలేదు బట్ త్వరలో చదువుతాను.

నాకు మీ టపాలలో బాగా నచ్చిన వాటి గురించి రాసేసాను. మిగతా వాటికి మళ్ళీ ఇంకో రోజు కూర్చుంటా... ఇప్పటికే మీ కాలాన్నీ తినెసాను అని అర్ధం అయ్యింది. సమకాలీన అంశాలపై కాస్త చతురతతో, మీ నైపుణ్యాన్ని ఉపయోగించి మంచి టపాలను రాసారు. గుంటూరు భాష సుస్పష్టంగా కనిపించింది (ప్రత్యేకించి తిడుతున్నప్పుడు).... ఇలాగే ముందుకు సాగండి. ఈ రోజు నుండి నేను మీ బ్లాగ్ కి మరో అనుచరుడిని.

నా బ్లాగ్ ని కూడా వీలయితే ఒకసారి చూడండి. theme చాలా మందికి నచ్చక పోవచ్చు(కొంత మంది పాత చింతకాయ పచ్చడి కాన్సెప్ట్ అని మొహాన చెప్పారు) కానీ నాకు ఇష్టమైన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, లలితా కళల ounnatyaalanu నలుగురితో పంచుకునే ప్రయత్నం గా నా వంతూ కృషి నేను చేస్తున్నాను. మీ అంత గొప్పగా రాయాలని వుంటుంది కానీ రాయలేక పోతున్న బట్ ప్రయత్నం మాత్రం వదిలేది లేదు.

ఒక చిన్న విన్నపము .... నా బ్లాగ్ ని చూసి మీకు నచ్చితే నా బ్లాగ్ థీమ్ అయిన భారతీయ సంస్కృతీ సంప్రదాయాల మీద, లలితా కళల విశిష్టత పైన అతిధిగా మీరు ఒక టపా నా బ్లాగ్ కోసం రాయండి---దానిని ప్రచురిస్తాను. అదీ మీకు నా బ్లాగ్ నచ్చితేనే సుమా!! ప్రస్తుతానికి శలవ్

భవదీయుడు,

సతీష్ కుమార్ యనమండ్ర
PS: Please excuse me for any typo errors as i read all your posts once again sincerely and then started writing the comments.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

sujatha garu
neelamm katha chadivaanu chaala bagaa nachhindi. mee blogunu regulargaa follow avuthu untaanu naa favorite blogullo mee blog undandoi

వేణు said...

ఈ కథకు స్పందనను చాలా లేటుగా రాస్తున్నా. (చదివింది కూడా లేటుగానే అనుకోండీ).

ఆరంభం నుంచీ ముగింపు వరకూ well executed story ‘నీలమ్మ’. అయితే కథకు కీలకమైన ‘
నీలమ్మ నిర్ణయం ’ వెనక కారణాలు మరింత బలీయంగా ఉంటే కథ మరింత చక్కగా తయారయ్యేదని అన్పించింది.

‘నెరేటర్’ నీలమ్మకు ఉదారంగా చేసిన సహాయాల ప్రస్తావన ఎక్కువయింది అని వ్యాఖ్యాతలు అంటున్నారు. నాకలా అన్పించలేదు.
నా ఉద్దేశంలో నీలమ్మ అలాంటి నిర్ణయం తీసుకునేముందు ‘దొరసాని’ని గుర్తు చేసుకునివుండాలి. ఆమె సాయం చేస్తుందని ఆశించి, ఆ ప్రయత్నం చేసివుండాలి. అది కుదరనప్పుడే , ఆ రకంగా
అన్ని మార్గాలూ మూసుకుపోయాక మాత్రమే అలా చేసివుంటే సహజంగా ఉండేది. పని మనిషిగా ఉన్నప్పుడు కూడా భర్త/తండ్రి మీద ఆమె, ఆమె పిల్లలూ ఆధారపడిలేరు కదా!

నీలమ్మ సంభాషణలను పాత్రోచితంగా సహజంగా బాగా రాశారు.
కథనంలో ‘తో’ ఎక్కువగా వాడటం పాత్రికేయ రంగ ప్రభావమనుకుంటా. జర్నలిస్టులు కాని రచయితలు ‘తో’లు సాధారణంగా వాడరు.

విషయం ఆసక్తికరంగా ఉండటంతో...
ట్రాఫిక్ జాం కావడంతో...
ఏదో పని దొరకడంతో...
.....

‘ నవ్వుతున్న జగజ్జనని ముఖంలో నీలమ్మ ముఖం తటాలున మెరిసింది’- కొంత నాటకీయంగా ఉన్నా, చక్కని ముగింపు!

Raj said...

అందరూ చాలా బాగుంది చాలా మంచి కధ అంటున్నారు.
చాలా బాగా ఉండడం అంటే??

నీలమ్మ జీవితం అలా ఆయిపోతే బాగుండడం ఎంటో వారికే తెలియాలి.
బహుశా వారికి కధ కధనం నచ్చి అలా అన్నారేమో!!!

ఇక నీలమ్మ చేసిన పని విషయానికి వస్తే ఆవిడ చెసింది తప్పు అని నేను చెప్పను. అలాగని ఆవిడ చేసిన పనిని సమర్ధించను.

నైతిక విలువలు, తొక్క, తొటకూర పక్కన పెడితే ఈ ప్రపంచం లో మంచి చెడు అనేవి నీకు మాత్రమే ఉంటాయి. వేరే వాళ్ళకి అవే మంచి కావొచ్చు లేక చెడు కావొచ్చు. అందుమూలంగా మనం చేసిన పని మనకు నచ్చిందా, మరొకరికి ఉపయోగ పడిందా లేదా అని ఆలోచించాలే గాని ఇతరులని ప్రశ్నించి హింసించే హక్కు మనకు లేదు.(ఒక్క పొలీసులకి తప్ప) :-)

పోతే (ఎవరు పోతే?)
కధ చదివిన తర్వాత నాకు అనిపించిన విషయం ఏమిటి అంటే, మన సుజాత బేబి గారు (అదెలేండి ఆంటీ గారు) తన నిజ జీవితం లోని కొన్ని సంఘటనలనీ, ఇంకా అంకురం లో తనుగా తెలుసుకున్న సంగతులనీ కలిపి ఈ కధ రాసారు. అంతే కాని ఈ కధ పూర్తిగ యదార్దం కాదు. అవునా సుజాత గారు?

భవధీయుడు
రాజేంద్ర

సుజాత వేల్పూరి said...

Raj,
సరిగ్గా చెప్పారు. మంచి, చెడూ ఈ రెంటి మీదే నాకూ విశ్వాసం.నైతికి విలువలనేవి ఎవర్ని వారు ప్రశ్నించుకోవలసినవే తప్ప ఇంకొకరు ప్రశించేవి కాదు.

"నీలమ్మ జీవితం అలా ఆయిపోతే బాగుండడం ఎంటో వారికే తెలియాలి." భలే ఉంది ఇది!

పాఠకులు బాగుంది అన్నది కథ, కథనమే కానీ నీలమ్మ జీవితం అలా అయిపోవడం కాదు లెండి పాపం!



ఇంకోటి కూడా నిజమే! నాకు తెలిసిన ఒక పాత్ర, రెండు సంఘటనలు ఈ కథకు ప్రేరణ.

Post a Comment