January 27, 2009

పొద్దు గడి కి ఈ సారి స్లిప్పుల సర్వీసు ఇక్కడ!

స్లిప్పుల సుగాత్రి(సుగాత్రి గారూ, ఈ పేరు నేను కాదండీ పెట్టింది)ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదు.ఎంత పిలిచినా వినడం లేదు.  ఈ సారి(కూడా) గడి సొంతగా పూర్తయ్యేలా లేదు.  స్లిప్పులు కావలసిందే! (అత్తగారు కూడా ఊర్లో లేరు)అందువల్ల గడి పూర్తి చేసే వారు నా బ్లాగులో స్లిప్పులు ఇచ్చి పుచ్చుకుంటే ఉభయతారకంగా ఉంటుందని నా అవిడియా! చన్నీళ్లకు వేణ్ణీళ్ళు లాగా నేను కొన్ని స్లిప్పులిస్తున్నా......! అందుకుని నాక్కొన్ని స్లిప్పులివ్వండి దయగల ప్రభువులు...!

1 అడ్డం - అర్జునుల కాలం కూడా ఇదే!


4 అడ్డం -చారులో కంపల్సరీ


5 నిలువు - వేజు

10 నిలువు - గద్దర్ పక్కనే ఉంటాడెక్కువగా


27 నిలువు - crab అనగా పీత..

21 నిలువు - భోగి మర్నాడే!

38 అడ్డం - ఇన్నర్ సీక్రెట్ .....



నాకు స్లిప్పులు కావలసినవి..



22 నిలువు

17 అడ్డం

12 నిలువు



మిగిలినవి తరవాత చెప్తాను...!

47 comments:

Anonymous said...

మీక్కావలసిన స్లిప్పులు ఇవిగో:
12 నిలువు: అజాత శత్రువు గుప్తనామం.
17 అడ్డం: ఇది కష్టమే, బ్రౌణ్యంలో వెతికితే ఫలితం ఉంటుంది. అయినా చాలా పెద్ద క్లూ ఇచ్చేస్తున్నా - కామేశ్వర రావు గారు క్షమించాలి. 21 నిలువిని తెలుగులో చెప్పి తెగ్గొట్టండి.
22 నిలువు: ఈమధ్యనే వచ్చిన ఒక సినిమా.

కామేశ్వరరావు said...

"నాగమురళి గారు,మీరొస్తే మేమొప్పుకోం" అన్నాఅరుగా సుజాతగారు. మరెందుకొచ్చారండీ? :-)
ఇక్కడికి వస్తే నేనొప్పుకోను :-)

సుజాత వేల్పూరి said...

నాగమురళి గారు, ధన్యవాదాలు, మీ స్లిప్పుల ప్రకారం ప్రయత్నించి చూస్తాను.

కామేశ్వర్రావు మాష్టారు,
ఆయన ఇక్కడికి రావొచ్చండి! గడి పూర్తి చెయ్యడానికి మాతో పోటీకి రాకూడదన్నమాట.:)

Anonymous said...

కామేశ్వరరావు గారూ, అందుకే క్షమించమని ముందే అన్నాను. అయినా ఇక్కడికి రావడం మంచిదైంది. నేను పూర్తి చేసిన గడి చూస్తే అందులో ఒక తప్పు కనిపించింది. సరి చేసి మళ్ళీ పోస్టాను. ఇంకోటి కూడా సందేహం ఉంది. బుద్ధిగా ఇంక స్లిప్పుల జోలికి పోకుండా ఫలితం కోసం ఎదురు చూస్తాను.

పిచ్చోడు said...

అయ్యో సుజాత గారూ ఎంత పని చేశారండీ....... పొద్దులోకి వెళ్ళడం ఇదే మొదటి సారి. గంట నుండి పనులన్నీ వదిలేసి కూర్చొన్నాను. అంతా మీ వల్లే

Anonymous said...

ఈ స్లిప్పుల బెడద తట్టుకోలేక, ఆమెనే గడి కూర్చమన్నాం సుజాత గారూ! హమ్మయ్య, ఆమెను కటకటాల (గళ్ళ) వెనక్కు నెట్టేసాం గదాని తీరిగ్గా కూచుని ఉంటే, ఇదిగో.. మీరు ముందుకొచ్చారు. మిమ్మల్ని కూడా గళ్ళ వెనక్కు పంపాల్సి వచ్చేట్టే ఉంది.

mmkodihalli said...

44కు స్లిప్పు ప్లీజ్

సుజాత వేల్పూరి said...

మురళీ మోహన్ గారు,
"ద్వా"దశి కి ఇంకా పదకొండు రోజులేకదండీ ఉంది?

సుజాత వేల్పూరి said...

చదువరి గారు,
నాకూ కూర్చాలనే ఉంది. నాలుగు క్లూలు కూర్చే సరికి ఈ లోపు కొత్త గడి వచ్చేస్తోంది పొద్దులో! దానిమీద పడితే 20 రోజులు కావాల్సి వస్తోంది. ఇహ నా సొంత గడి ఎప్పటికి పూర్తయ్యేట్టు?

సుజాత వేల్పూరి said...

నాగమురళి గారు,
22 నిలువు వచ్చేసింది. ధన్యవాదాలు.
12 నిలువు తెగడం లేదు. నేను తెలుగు మాష్టారి
అమ్మాయినైనా కాదండి, మరో ఈజీ స్లిప్పు కావాలి.

పిచ్చోడు గారు, మరదే గడి మజా! మీకు పట్టుకుందన్నమాట.సరే స్లిప్పులిచ్చుకోండి మరి!

Anonymous said...

సుజాత గారూ, అమ్మో, కామేశ్వర్రావు గారు కోప్పడతారు.
22 నిలువు తేలికేనండీ. అజాత శత్రువు ఎవరో గుర్తించగలిగితే వచ్చేస్తుంది.

శ్రీనివాస్ పప్పు said...

ఈ పైన స్లిప్ రాసే వాళ్ళనీ,అందించే వాళ్ళనీ కూడా డీ-బార్ చేస్తున్నా.దట్ ఈజ్ మై ఫైనల్ డెసిషన్ అంతే..

పిచ్చోడు said...

సుజాతక్కా నేను చెప్తా.. 12నిలువు: పాండవాగ్రజుడు బొట్టెట్టుకున్నాడు

పిచ్చోడు said...
This comment has been removed by a blog administrator.
సుజాత వేల్పూరి said...

పిచ్చోడు గారు,
12 నిలువు వచ్చేసింది.

మరి కొన్ని స్లిప్పులు..

1 నిలువు..గుమ్మం
31 అడ్డం..mix
37 అడ్డం:నవగ్రహాల తర్వాతది....

పప్పుగారు,
మీరు కూడా పూర్తి చేస్తున్నారా? అయితే మర్యాదగా స్లిప్పులిచ్చుకోండి.

సుజాత వేల్పూరి said...

పిచ్చోడు గారు,
40 అడ్డం...(గడి ఇచ్చేనాటికి)ఈ నెల పుష్యమాసం కదండీ, మరి పోయిన్నెల ఏమిటో చూడండి!

43:దివంగత దిగంబర కవి

ఈ రెండూ పూరిస్తే 40 నిలువు అదే వస్తుంది.

నాకు 7 నిలువు కొంచెం సందేహంగా ఉంది, ఎవరైనా వివరించగలరు.

సుజాత వేల్పూరి said...

7 నిలువు వచ్చేసింది.

మురళి said...

'పొద్దు' ను పరిచయం చేసినందుకు థాంకులు.. నేను కూడా ప్రయత్నిస్తా.. స్లిప్పుల సర్విస్ కూడా ఉన్నప్పుడు ఇంక ఆలోచించడం ఎందుకు చెప్పండి?

సుజాత వేల్పూరి said...

మురళి గారు,
పొద్దు గడి కి స్వాగతం! స్లిప్పులున్నాయిగా, ప్రయత్నించండి! ఇంకా కావాలంటే అడగండి! ఎవరో ఒకరు అందిస్తారు.

కామేశ్వరరావు said...

చదువరిగారు,
ఈ బ్లాగులో స్లిప్పులు మొదలుపెట్టడం వల్ల ఒక లాభం కలిగిందండోయ్! ఈ బ్లాగుకున్న ప్రజాదరణ వల్ల పొద్దు గడి సుడిలో కొత్త పాఠకులొచ్చి పడుతున్నారు :-)
కాబట్టి కనీసం రెండు మూడు నెలలు సుజాతగారిని కటకటాల వెనక్కి నెట్టొద్దని మనవి :-)

mmkodihalli said...

అడ్డం 44 కు మీ స్లిప్పు సరిపోలేదు. మరొక్కటి ఇవ్వరూ?

సుజాత వేల్పూరి said...

మురళీ మోహన్ గారు,
అంత సులభమైన క్లూ ఇచ్చాను కదండీ? ఒక్కటే అక్షరం కదండీ...."ద్వా" నా. శాస్త్రి గారి లాంటి ఉద్దండులెవరన్నా మీకు క్లూ ఇవ్వాల్సిందే! ఎంత "నొక్కి" చెప్పానో చూడండి!

krishna said...

22 ,7,31 niluvu please.
ee saari naaku chaalaa kastamgaa vundi.

సుజాత వేల్పూరి said...

కృష్ణుడు గారు,
22 నిలువు ఈ మధ్య కొత్తగా వచ్చిన సినిమా! ఈ పేరుతో రెండు బ్లాగులున్నాయి. ఒకటి 'తెలుగు కళ ' ది!

31 కొంచెం కష్టమే! దాని ఇతర లింకులు పూర్తి చేస్తే రావొచ్చు.

నాకు 25 నిలువు కొంచెం సందేహం! అదొక్కటీ తీరితే పంపేయొచ్చు.

కామేష్ said...

25 నిలువు కష్టమేం కాదండి. ఆధారం లోనే సమాధానం కూడా దాగింది. కాకపోతే లింకులు పూరిస్తే సులువే.

పిచ్చోడు said...

అడ్డం 42, 35 స్లిప్పులు ప్లీజ్........

పిచ్చోడు said...

సుజాతక్కా మీ పెరట్లో పూల తీగలేం లేవా??? వాటిని చూస్తే ఆ లతలకు విరగ కాచిన విరులు కన్నుల విందౌతాయి కదా

సుజాత వేల్పూరి said...

పిచ్చోడు గారు,
35...సిరివెన్నెల సినిమాలో పాట వినండి "మనసున మనిషై, మమతల కొలువై" అని మూన్ మూన్ సేన్ ని ఉద్దేశించి బెనర్జీ పాడే పాట.

42...22 నిలువు, 39 నిలువు పూరిస్తే వచ్చేసి ఉండాలే!

తిండి కలిగితే "----" కలదోయ్ అన్నారుగా కవి గారు.

అన్నట్టు 25 నిలువు పొద్దునే వచ్చేసింది. గళ్ళు తప్పుగా చూసుకున్నాను. థాంక్యూ!

పిచ్చోడు said...

నా గడి పూర్తైపోయిందోచ్.............. పొద్దుకి పంపించేశాను. ఇక సమాధానాలు సరిగా రాశానో లేదో తేలాలి......... నేను పాసైతే ఈ స్లిప్పుల సర్వీసు ప్రారంభించిన సుజాతక్కకి ఫే......................ద్ద పార్టీ :-)

జ్యోతి said...

చదువరిగారు,

సుజాతగారిని కటకటాల వెనక్కి పంపిస్తే నేనున్నాగా.. స్లిప్పుల సర్వీసు నడపడానికి...

సుజాత వేల్పూరి said...

జ్యోతి గారు,
అయితే మనల్ని అందర్నీ వరసాగ్గా కటకటాల్లో పెడతారా ఏమిటి? నేనైతే తెలిసిన వాటికి స్లిప్పులివ్వకుండా సైలెంట్ గా కూచోలేను. కాబట్టి కట కటాల్లోకి పోడానికి ఇష్టంగా లేదు.

అన్నట్టు నా గడీ పూర్తయింది. కొన్ని పదాలైతే అవసలు ఉన్నాయా అని డౌటు ఉంది గానీ వాటి తాలూకు లింకులు కరక్టే గాబట్టి, చూసుకోకుండా పంపేశాను. అయినా ఒక్క తప్పన్నా లేకుండా పంపడం మా ఇంటా వంటా లేదు.

పిచ్చోడు గారు, తర్వాత గడి కి రెడీగా ఉండండి మరి!

krishna said...

సుజాత గారు,
నెనర్లు.అన్ని వ్చ్చేశాయండి.

గీతాచార్య said...

వారం నుండీ చూస్తున్నాను. ఈ స్లిప్పుల గోల ఏంటండీ బాబూ! (పదం బావోలేదా? :-( వేరేది దొరకలేదు.)

కొంచం నాకూ ఎవరన్నా చెప్పండి దయ చేసి. దయ చేయటం రాక పోయినా ఫర్లేదు. వంటవచ్చినా చాలు.

హాస్యం వదిలిపెట్టి నాకూ చెప్పి పుణ్యం కట్టుకోండి. ఇళ్ళెటూ కట్టలేము ఈరోజుల్లో.

సుజాత వేల్పూరి said...

గీతాచర్య,క్రమం తప్పక నా బ్లాగును దర్శిస్తున్నందుకు(వారం నుంచీ చూస్తున్నాను అన్నారుగా) ముందుగా ధన్యవాదాలు.

ఈ స్లిప్పుల "గోల" (ఈ పదం వాడటం మొదటి తప్పుగా భావించి వదిలివేయడమైనది) ఏమిటో తెలియాలంటే పొద్దు పత్రికకు వెళ్ళి గడి మీద క్లిక్కాలి. అపుడు మీరు కూడా ఇరుక్కుంటారు.(అసలే మీ నాన్నగారు సంస్కృతం మేష్టారు)!

కంగారు పడకండి, పొద్దు ఆన్ లైన్ పత్రికలో వచ్చే తెలుగు క్రాస్ వర్డ్ పజిలే "గడి". దాన్ని పూర్తి చేయడానికి ఉత్సాహం ఉన్న వారంతా ఇలా ఇచ్చిన అధారాలకు మరి కొన్ని ఆధారాలతో(వాటికే స్లిప్పులని పేరు) ఇతోధికంగా ఒకరికొకరు సాయపడుతూ ఉన్నారు.

మీరూ పాల్గొంటారా?

గీతాచార్య said...

మీరూ పాల్గొంటారా? చి హిన్న మహాట. ఇలాంటివి పూర్తి చేసినా చేయక పోయినా అవకాశం ఉండాలే కానీ రంగంలోకి దిగటమే.

కొంచం వివరాలు ఇచ్చి పుణ్యం కట్టుకోండి.
గీతాచార్య.

P. S.: నన్ను అపార్ధం చేసుకున్నారు. నేను పదం బావోలేదన్నది 'బాబు' గురించి. నేను బాబు కాదు అని బ్లాగు లోంచే కొడతారేమో అని.... పాపం భయం తో అలా అన్నాను. గోల ఎంత బాగుంటుందో! సరదాగా అలా మెదడుకి పదును పెడుతూ ఆడటం?

టి. శ్రీవల్లీ రాధిక said...

సుజాత గారూ!
16 నిలువుకి క్లూ ఇస్తారా!

సుజాత వేల్పూరి said...

రాధిక గారు,
15 అడ్డం,20 అడ్డం పూర్తి చేస్తే ఈ పాటికి వచ్చేసే ఉండాలి. ఈ పదాన్ని తిరగేస్తే మనాలి జోడిగా ఉంటే లోయ పేరొస్తుంది.

సుజాత వేల్పూరి said...

గీతాచార్య,
అయితే దిగండి. ఫిబ్రవరి ఏడో తారీకు వరకే గడువు! మీరు తల్చుకుంటే ఎంత సేపు? ఇదిగో లింకు..http://poddu.net/gadi/crossword.php

విజయోస్తు!

టి. శ్రీవల్లీ రాధిక said...

సుజాత గారూ!

15 అడ్డం,20 అడ్డం పూర్తి చేశాను. దాంతో 16 నిలువుకీ అక్షరాలు నిండిపోయాయి కానీ అది "యముడ్ని వీడిన దున్నపోతె"లా అవుతుందో అర్ధం కాలేదు. అది అర్ధం చేసుకుందామని అడుగుతున్నాను.

సుజాత వేల్పూరి said...

రాధిక గారు
దీనికి సంబంధించి నేనూ పప్పులో కాలు వేశాను. 16 నిలువును తిరగేస్తే భారత రైల్వేను లాభల పట్టాలెక్కించిన మంత్రి గారి పేరొస్తుంది. అప్పుడు 20 అడ్డం ఇంతకు ముందు వచ్చిన పదం కాక మరో పదం వస్తుంది. ఇంతకూ దున్న పోతు కు సరైన పదం వచ్చిందా లేదా?

Unknown said...

సుజాత గారు వచ్చేశాను
6 నిలువు "పా" తో మొదలయ్యే అక్రమార్జన ఏమిటో తట్టటం లేదు :(
12 నిలువు పాండవ అగ్రజుడు ఇంతమటుకు అర్ధమయ్యింది కానీ బొట్టెట్టుకున్నాడు అనేదే అర్ధం కాలేదు?@ పిచ్చోడు
32 అడ్డం ఎన్ని తెలంగాణ కవితలు కనిపిస్తాయండి?
17 అడ్డం జవ్వాజి అంటే తాంబూలంలో వేసుకుంటారని అంతమటుకే తెలుసు
25 నిలువు? అలాగే 31 అడ్దం లో చివర పి వస్తుందా? గి వస్తుందా? కొంచెం కంఫ్యూజన్ గా ఉంది :-?
మీ అందరి కంటే ఎంతో వెనకబడి ఉన్న నాకు కొంచెం వీటికి క్లూలు ఇచ్చి పుణ్యం కట్టుకోండి థ్యాంక్స్ :)

సుజాత వేల్పూరి said...

శ్రీలు,
మీకు చాలా స్లిప్పులు కావాలన్నమాట!
6 నిలువు: అక్రమార్జన అంటే ఇక్కడ లంచం కాదు. ఆర్జన అర్థం వచ్చే మాట అక్రమంగా(అక్షరాలు అటూ ఇటూగా) ఉన్నదని అర్థం! పెద్ద క్లూ ఇచ్చాను.

12 నిలువు: మీ దగ్గర నర్తన శాల సినిమా ఉందా, చూడండి! అతడి పేరు తెలుస్తుంది.

32 అడ్డం: సంఖ్యతో సంబంధం లేదు. అదొక పాతకాలం పెట్టె! 28 నిలువు, 33 నిలువు వస్తే వచ్చేస్తుంది సులభంగానే! 33 నిలువు కూడా సులభమే! క్లూ లోనే సగం సమాధానం "కల"దు!

17 అడ్డం: 12 నిలువు, 6 నిలువు వస్తే ఇది వచ్చేసినట్లే!

25 నిలువు: తీగ చివరన ఉండేది అని ఈ మాటకర్థం! ప్రయత్నించండి.

31 అడ్డంలో చివర "తం" వస్తుంది అని నమ్ముతున్నాను.

త్వరపడండి. ఎల్లుండే ఆఖరాట.

Unknown said...

సుజాత గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇచ్చిన క్లూల బట్టి గడులు నింపటం మటుకు నింపగలిగాను :)

3 నిలువు ఆధారం లోనే ఉన్నదా?
23 అడ్డం బద్దలు కొట్టేది ఏమిటో కానీ అన్ని గడులు నిండినాయి కానీ వాదాలు దగ్గర ఆగిపోయింది అది "దా" అక్షరంతో పూర్తి చేద్దామంటే బద్దలు కొట్టేదానికి సరిపోవటం లేదు :(

చైతన్య said...

ఏం జరుగుతుందిక్కడ? నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు...

పిచ్చోడు said...

సుజాతక్కా, గడి ఫలితాలు వచ్చేశాయోచ్...

మీకు congrats :-)

మీరు పార్టీ మిస్ అయిపోయారు. ఈ సారి నా గడి తప్పుల్లేకుండా పూర్తి అవ్వాలని మొక్కుకోండి. :-)


ఈ సారి స్లిప్పుల సర్వీసు ఎక్కడా???

హర్షోల్లాసం said...

hello sujatha garu ,
yemiti yemi blog's rayatam leeda yemiti,leeka potee inni rojulu meeru yemduku rayaleedu chepmaa?

సుజాత వేల్పూరి said...

kitkat brake!

Post a Comment