April 10, 2009

హాస్యగుళిక_ఓటరు గుర్తింపు కార్డు !

నాకు వోటరు గుర్తింపు కార్డు వచ్చిన విధమెట్టిదో ఇంతకు ముందొక టపా రాశాను.(భయపడొద్దు, ఆ టపా  లింకు ఇవ్వటం లేదు.)"మీ ఇంటికే వస్తుంది కార్డు" అని చెప్పడంతో చాలా నెలలు వేచి చూసి ఇక లాభం లేదని వెబ్ సైట్ లో కార్డు వివరాలు తీసుకుని మునిసిపల్ ఆఫీసుకు వెళ్లాను. సాధారణంగా ఇలాంటి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళేటపుడు దార్లో రెండు చార్టుల బీపీ టాబ్లెట్లు కొనుక్కుని వెళ్తాను నేను.

ఇంతకు ముందు జరిగిన అనుభవంతో "ఆస్తిపన్ను" అనే గదిలో కార్డు అడగటానికి వెళ్లాను.  అక్కడ ఇద్దరు స్వీపర్లు కూచుని పేలు చూసుకుంటున్నారు. మరో ఇద్దరు పురుషులు(బంట్రోతులనుకుంటా)టీ సేవిస్తున్నారు. అందులో ఒకడు నిర్లక్ష్యంగా ఒక చూపు విసిరి "ఎవలు? ఏం కావాలె?" అన్నాడు. అతడి చూపుకి నా బీపీ థర్మా మీటర్లో పాదరసంలా సర్రున పైకి పోయింది. వెంటనే ఒక టాబ్లెట్ మింగి కార్డు సంగతి చెప్పాను. అతడు టీ తాగుతూనే "ఆ పక్కన"అని చెయ్యి ఊపాడు.



ఓహో, ఎన్నికల సమాచారం ఈ సారి "పట్టణ దారిద్ర్య నిర్మూలన పథకం" గదిలో లభిస్తుందన్నమాట! లోపలికి వెళ్ళి విషయం చెప్పి నా వివరాలిచ్చాక, అక్కడ ఉన్న ఇద్దరు  కాంట్రాక్ట్ క్లర్కులు ఒక కార్డుల కట్ట తీసి నా మీదకు దాదాపు 'విసిరారు'. మరో రెండు టాబ్లెట్లు మింగి కట్టలో వెదికాను.నా కార్డు లేదు. వెబ్ సైట్లో ఉన్న వివరాల ప్రకారం నా పోలింగ్ స్టేషన్ నంబర్ చెప్పాను. ఆ క్లర్కు కుర్చీలోంచి ఎగిరిపడ్డంత పని చేసి "ఫలానా నంబరా? అదెట్లయితది?"అన్నాడు. అదెట్లయితదో నాకూ తెలీకపోవడంతో జవాబు చెప్పలేకపోయాను.

మరో నాలుగు కట్టలు వెదికాక, నా కార్డు నాకు ఏవిధంగానూ సంబంధం లేని నంబర్ పోలింగ్ స్టేషన్ కట్టలో దొరికింది.నా పక్కనే ఉన్న మా ఆయన (ఈయనకసలు బీపీ రాదు.) ఆ కార్డు చూస్తూనే "పేరు ఇదే గానీ ఫొటో మావిడది కాదండీ"అని తేల్చేసి వెనక్కిచ్చేసారు. ఆ క్లర్కు ఒకసారి నాకేసి కార్డుకేసి మార్చి మార్చి చూసి" ఏమి సారూ, ఇంత సక్కగ గొడుతుంటే? మేడమే ఇందులున్నది"అని తీర్మానించాడు. ఆ ఫొటో నాదే అని ఒప్పుకోడానికి మెదడు మొరాయిస్తోంది.



ఘోర రోడ్డు ప్రమాదాల్లో మొహం ఆనవాలు తెలీకుండా గాయాలపాలై మరణించినవాళ్లని ఒంటిమీదున్న వస్తువుల్ని బట్టి గుర్తుపట్టినట్లు, నేను కూడా కాసేపు పరికించి చూసి సంతోషంతో కెవ్వుమన్నాను."ఏవండోయ్, ఇవిగో, ఈ ఇయర్ రింగ్స్ నావే! నాదే ఈ ఫొటో" అని ప్రకటించాను. తనేమో కథల్లో రాసినట్లు స్థాణువై పోయాడు కాసేపు.

"ఇదేమిటి? ఇలా ఉందేమిటి ఫొటో" అని బాధపడ్డాడు .

'అదే నా నిజస్వరూపం! ఊరుకోండి" అని ఓదార్చాను.

ఇంతా చేసి కార్డులో మా ఇంటి నంబర్ తప్పు, కాలనీ పేరు లేదు, ఏరియా తప్పు. తప్పుడు అడ్రసు...పైగా అచ్చుతప్పులతో! దీనివల్ల మా కాలనీ వాళ్లంతా ఒక చోట, నేనొక్కదాన్నీ వేరేచోట వెయ్యాల్సివస్తుంది ఓటు!

ఒక్క ఊరట ఏమిటంటే భర్త పేరు అనే చోట పేరు సరిగా ఉండటం. కొంతమందికైతే  వాళ్లనీ మార్చేశారు.

"ఇదేమిటి ఇన్ని తప్పులు ?" అనడిగితే,

"మాకేమెరిక ? మేమేమన్నా ప్రింట్ కొడుతున్నామా"- మళ్ళీ ఒక టాబ్లెట్!

"మరి ఈ కార్డు పనికొస్తుందా?"

"ఈసేవా కేంద్రానికెళ్ళి సరి చేయించుకోవాలె"

"ఏ ఈసేవా కేంద్రం?"

"మాకేమెరిక? న్యూస్ పేపర్లో ఇస్తారు, చూసుకోండి"

"ఎప్పుడిస్తారు?"

"మాకేమెరిక? రోజూ చూసుకోండి, ఇస్తారొక రోజు" గుప్పెడు టాబ్లెట్లు మింగి కార్డు తీసుకుంటుండగా క్లర్కు ఐదారు కార్డులు తీసి "గివి మీ బిల్డింగ్ కార్డులు మేడము! నువ్వు దీస్కబోవాలె" అన్నాడు కొంచెం మర్యాదగా!

'నేను తీసుకెళ్లను " అందామనుకుని "నేను తీసుకెళ్లడమేమిటి? వాళ్ళకు మీరు పంపరా"అన్నాను.


"పంపాలంటే ప్రాపర్టీ టాక్స్ బిల్ కలెక్టరు రావాలె! గాయన లీవ్ లో ఎల్లిండు, మీరు దీస్కోని దస్కత్ పెట్టండమ్మా "అన్నాడు. సరే ఇలాంటి సంఘసేవ చేస్తే మనక్కూడా మన బిల్డింగ్ లో వెయిట్ ఉంటుందని తీసుకుని, సంతకం పెట్టి వచ్చాను.



ఇంటికొచ్చాక ఆ కార్డులు ఒక్కోటీ ఒక్కోరకంగా భయంకరంగా నవ్వించాయి మమ్మల్ని! ఈటీవీ లో సుమన్ గారి "శ్రీకృష్ణ బలరామ యుద్దం" చూసినప్పుడు కూడా అంతగా నవ్వలేదంటే నమ్మండి.



మచ్చుకు నా కార్డు చూడండి.


 "బికశ్రీపత్తి నగర్" అంటే "భిక్షపతి నగర్" అని అర్థం కావాలంటే మెదడులో కొంచెం ఎక్కువ గుజ్జు ఉండాల్సిందే! అది మాకంటే మా వాచ్ మన్ కి ఎక్కువగా ఉండటం వల్ల తను కనుక్కున్నాడు. భిక్షపతి నగర్ అనేది ఎక్కడుందో మాకెవ్వరికీ తెలీదు. "గోపాల రెడ్డి.న ...." అని సగంలో వదిలేశారు. ఆయనెవరో నిజంగా నాకు తెలీదు. ఒకవేళ అది గోపాలరెడ్డి నగర్ అయితే, అది ఈ చుట్టుపక్కల ఎక్కడుందో మాకు తెలీదు. kondapur village అనే మాటలు యధాతథంగా తెలుగులోకి కొండాపూర్ "విళ్గే" అని దించారు. ఇంతా చేసి మేముండేది కొండాపూర్ విలేజ్ లో కాదు.



మా వాచ్ మన్ కార్డులో భర్త పేరు అని రాసి దాని కింద తండ్రిపేరు వేసారు.మరొకరికి తండ్రిపేరు అని వేసి భర్త పేరు ! మా కిందింటి సుధా రామనాధన్ గారి పుట్టిన తేదీ పదేళ్ళు వెనక్కి జరిపారు. "భర్త పేరు మారినా ఒప్పుకుంటాను కానీ దీనికి మాత్రం ఒప్పుకో"నంటుందావిడ! అమ్మో ఏకంగా పదేళ్ళే? 29 నుంచి 30 దాకా డేకడానికే ఆరేళ్లు తీసుకుందాయెను!



నాలుగో ఫ్లోర్ లో ఉండే వైభవ్ చోప్రా గారి పేరు తెలుగులో "విధవ్ చోప్రా"గా పడింది.ఇది మరీ ఘోరం! తెలుగులో దానర్థం వివరించేసరికి అసలే తెల్లగా ఉండే ఆయన మొహం ఇంకా పాలిపోయింది.మరొకావిడ కార్డులో ఆవిడ ఫొటోకి బదులుగా పురుషుడి ఫొటో పెట్టారు.అది మేము చాలాసేపటికి గానీ పట్టుకోలేకపోయామనుకోండి:-)!



ఇక లాభం లేదని ఒక శనివారం పొద్దున్న (మా కాలనీలో ఎక్కువమందికి శనివారమే తీరికుండేది)మా నియోజకవర్గానికి నిర్దేశించిన ఈ సేవా కేంద్రానికి వెళ్లాము. వాళ్ళు "ఇక్కడ కాదు, మార్చేశాం, వేరే చోటికి వెళ్లాలి" అని అడ్రసు ఇచ్చారు.మళ్ళీ వెనక్కి! ఇక్కడికొచ్చాక ఇక్కడి వాళ్ళు కనీసం మా దరఖాస్తులైనా చూడకుండా, తలైనా తిప్పకుండా పదో తారీకు వరకూ టోకెన్లిచ్చేసాం పొండి. పదో తారీకు తర్వాత రండి. వీలుంటే చూస్తాం. లేదంటే ఎన్నికలయ్యాకే ఇహ"అన్నారు.



వైభవ్ కి ఒళ్ళుమండిపోయి(పేరు విషయంలో తీరని అన్యాయం జరిగింది కదా పాపం) "ఈ కార్డుల తాలూకు డేటా ఎంట్రీ ఎవరు చేసారు?ఈ ప్రింటింగ్ తప్పులకు కారణమెవరు? వాళ్ల మీద పగ తీర్చుకోవాలంటే ఏం చెయ్యాలి" అనడిగాడు.



"దానికి సాయంత్రం 5-6 మధ్యలో తీసుకుంటున్నాం అప్లికేషన్లు, సాయంత్రం త్వరగా రండి! ఎందుకంటే రష్ ఎక్కువగా ఉంటుంది."అని జవాబిచ్చారు వాళ్ళు తలకూడా తిప్పకుండా!





గమనిక: నా కార్డులో ఉన్న అడ్రసు ఆధారంగా మా ఇల్లు గూగుల్ ఎర్త్ వాడు కూడా కనుక్కోలేడు. ఈ చిరునామా ఆధారంగా మా ఇంటికి ఎవరైనా రావాలని ప్రయత్నించి తప్పిపోతే నా పూచీ లేదు.



NOTE నేను ఇదంతా సరదాగా రాశాను గానీ నగరంలో లక్షల కార్డుల్లో అచ్చుతప్పులే!పోలింగ్ స్టేషన్ కి వెళ్ళాక, వోటు వెయ్యడానికి వీల్లెదంటే ఏం చెయ్యాలో చాలా మందికి తెలీదు. అందువల్ల వోటర్ గుర్తింపు కార్డుతో పాటు ఇతర గుర్తింపు కార్డు(బాంక్ పాస్ బుక్,డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్) తీసుకెళితే మంచిది.(తెలీనివాళ్లకోసం).

58 comments:

Bradpetehoops said...

Very nice blog!

పిచ్చోడు said...

సుజాతక్కా, మీది ఎంతో మేలు.
నా ఓటరు కార్డులోని వివరాలు చూసుకొనేంత వరకు నాలో ఇంత మనో నిబ్బరముందని నాకే తెలియదు!!!!!
ఇంకొకరయ్యుంటే ఆ షాక్ కి కోట పిసినారితనం చూసిన షాక్ తో పిచ్చెక్కిపోయిన ఆయన బావమరిది లా అయిపోయుండేవాళ్ళు

Unknown said...

సుజాత గారు గత రెండు గంటలనుండి ceo andhra , ghmc సైట్స్ బ్రౌస్ చేసి నాది , మా శ్రీమతి పేర్లు elcetoral లిస్టు లో చూసుకుని confirm చేసుకుందామని వెతికి వెతికి చూసి అలసిన్డి పౌరుడి మనసు అని ఏడ్చుకుంటూ కాసేపు బ్లాగ్స్ చూసినా బావుండేది మనసు వూరట చెందేది అనుకుంటూ రాగానే మీ పోస్ట్ నన్ను సేద దీర్చినది . మా ఇద్దరికీ voter id కార్డ్స్ వున్నాయి , కానీ జోక్ ఏంటంటే voter id నెంబర్ తో సెర్చ్ చేసే సదుపాయం ఇవ్వలేదు . పోనీ నేమ్ బట్టి సెర్చ్ చేద్దామంటే యెంత తంటాలు పడినా ఇంక అది ఎంటర్ చెయ్యి ఇది ఎంటర్ చెయ్యి అంటు విసిగిస్తోన్డి , వెంటనే కోపం వచ్చి ceo సుబ్బారావు గారికి మెయిల్ చేసి మీ పేరు మీ official వెబ్సైటు లో ఎలెక్టోరల్ లిస్టు లో స్వయమ్గా కనుక్కోడానికి ప్రయత్నిచి చూడండి మా బాధ అర్ధం అవుతుందని రాయాలని పించింది , యి లోపు మీ పోస్ట్ చూసాక నా లాగ ఎందరో అని తమాయించు కున్న , మా పేరు గనక రేపు అక్కడ లిస్టు లో లేకపోతె లోక్సత్తా కి రెండు వోట్లు లాస్ .

శ్రీనివాస్ said...

నా పేరు ఊరు అన్ని బాగానే ఉన్నాయి గాని డేట్ ఆఫ్ బర్త్ 1968 పడింది ... ఎవడన్నా పిల్లనిస్తాడా ఇంక :(

Ramani Rao said...

"ఏవండోయ్, ఇవిగో, ఈ ఇయర్ రింగ్స్ నావే! నాదే ఈ ఫొటో" అని ప్రకటించాను."

ఇంకా నయం ఇయర్ రింగ్స్ చూసుకొని మిమ్మల్ని మీరు గుర్తుపట్టుకొన్నారు. నాదయితే "తప్పిపోయిన మతిస్థిమితం లేని మహిళ" అని అనుకోవచ్చు ఆ ఫొటో చూస్తే. మొన్నామధ్య బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేద్దామని ఐ డి ప్రూఫ్ కోసం ఈ ఓటర్ కార్డ్ ఇస్తే ఎవరిదో ఇస్తారేంటండి మాకు కావల్సింది మీ ఓటరు ఐ డి అని బ్యాంక్ వాడు మొహం మీద చెప్పేసరికి "అది నాదే" అని చెప్పడానికి చచ్చే చావొచ్చింది.

అసాంతం చదివిన తరువాత ప్రభుత్వ నిర్వాకాల కోపం వచ్చినా , మీరు వ్రాసిన శైలికి నవ్వుకోకుండా ఉండలేకపోయాను.

baleandu said...

"నాలుగో ఫ్లోర్ లో ఉండే వైభవ్ చోప్రా గారి పేరు తెలుగులో "విధవ్ చోప్రా"గా పడింది.ఇది మరీ ఘోరం! తెలుగులో దానర్థం వివరించేసరికి అసలే తెల్లగా ఉండే ఆయన మొహం ఇంకా పాలిపోయింది.మరొకావిడ కార్డులో ఆవిడ ఫొటోకి బదులుగా పురుషుడి ఫొటో పెట్టారు.అది మేము చాలాసేపటికి గానీ పట్టుకోలేకపోయామనుకోండి:-)!"
excellent . నేను, మా ఆవిడా మీ లాంటి అనుభవమే చూసాం. ఇది చదివి నవ్వు అప్పుకోలేకపోయము. చాలా థాంక్స్ . నా ఫోటో , మా ఆవిడా ఫోటో మీరు చీపిన విధంగానే print అయ్యాయి. డేట్ అఫ్ బర్త్ దగ్గర తేదీలు xx ప్రింట్ అయ్యింది. ఇయర్ మాత్రమే వుంది. "N.Sailaja" కు "ఎన శైలజ " "kothapet" కు కొట్టప్ అని టైపు అయ్యింది. మా మొఖాలు చూస్తె ఎ తాలిబన్లో, అరుంధతి సినిమాలో అఘోరాలో అనుకున్నా అనుకుంటారు చూసేవారు.

చైతన్య said...

ఈటీవీ లో సుమన్ గారి "శ్రీకృష్ణ బలరామ యుద్దం" చూసినప్పుడు కూడా అంతగా నవ్వలేదంటే నమ్మండి.

హ హ్హ మేము కుడా అలాగే నవ్వుకున్నాం మీ టపా చదివి :D

@శ్రీనివాస్
భలే అయింది మీకు :D
అను గారికి మీ year of birth వెంటనే మెయిల్ చేయాలి... :P

సుజాత వేల్పూరి said...

ఈ కార్డుల మీది ఫొటోల మీద చాలా జోకులున్నాయి. ఇదివరలో ఒకసారి మా ఇంటిపక్కన ఉండే నాలుగేళ్ల పాప మాటవినకుండా అల్లరి చేస్తుంటే వాళ్లమ్మ నువ్విలాగే అల్లరి చేస్తే బూచాడెత్తుకెళ్ళిపోతాడని బెదిరించింది. "అమ్మా, బూచాడెలా ఉంటాడే" అని ఆ గడుగ్గాయి మరో ఏడుపు. ఏం చెయ్యాలో తెలీక ఆమె వాళ్ల మామగారికి చెప్తే ఆయన 'దానికంత ఆలోచిస్తారటమా! నా వోటై ఐడీ కార్డు మీది ఫొటో చూపించూ" అన్నారు. నవ్వలేక చచ్చాం ఆరోజు.

Anonymous said...

ఈటీవీ లో సుమన్ గారి "శ్రీకృష్ణ బలరామ యుద్దం" చూసినప్పుడు కూడా అంతగా నవ్వలేదంటే నమ్మండి.
LOLz....!

asha said...

నవ్వలేక చచ్చాను.
ఎన్నికల ఫలితాలను ఇలా సింబాలిగ్గా అనుభవించేశారన్నమాట.

teresa said...

మీ అడ్రస్ నిజంగా భలే వెరైటీగా ఉందే' అనుకుంటూ క్రింద ఇంగ్లీషులో అడ్రస్ చదివాక కొంతయినా అర్థమై నవ్వాలో ఏడవాలో తెలీలేదు! మరీ ఘోరం :(
బాగా చెప్పారు..

హరేఫల said...

మీ బ్లాగ్ చాలా బాగుంది. నా గొడవ చెప్పమన్నారా? నాకు, నా భార్యకీ పుణే లో పేర్లు ఉన్నాయి.ఇక్కడ రాజమండ్రీ ఓ రెండు, మూడేళ్ళు ఉండి అన్నీ చూద్దామని వచ్చేము.పది రోజుల క్రితం మా సొసైటీ కి ప్రభుత్వ ప్రతినిధులు వచ్చి " మీకు వొటర్ కార్డ్ ఉందా" అన్నారు. మేము పూణే నుండి వచ్చాము, అక్కడ ఉంది అని చెప్పినా, " పర్వాలేదు,అప్లికేషన్ లో అలా రాసి ఇచ్చేయండి, అది కాన్సిల్ చేసి మీకు కొత్తది ఇస్తాము" అన్నారు.ఇదేదో బాగానే ఉంది, ఎక్కడైతేనేమిటి మన ఓట్ హక్కు వినియోగించుకొందాము,నిజమైన భారతీయ పౌరుడిగా అనుకొని ఓ రెండేసి ఫొటోలు, జతచేసి దరఖాస్తు నింపి వాళ్ళకు ఇచ్చాను. కార్డ్ ఈమధ్యనే వచ్చింది.అది చూసిన తరువాత మా ఆవిడ నేను ఓట్ చెయ్యను పొమ్మంటోంది. వాళ్ళ నాన్నగారి పేరు శ్రీ పరిమి పేరయ్యశాస్త్రి --కార్డ్ లో పీరయ్యా భమిడిపాటి అని వచ్చింది. నా పేరు " పాణిబాబు భమిడిపాటి", తండ్రి పేరు " వాయ సోమయౌలు" అని వచ్చింది. ఆయన పేరు " యజ్ఞేశ్వర సోమయాజులు ". ఇంక వెనక్కాల చిరునామా అయితే ఒకే చోట ఉంటున్నా--నాదానిమీద రాజమండ్రి మండలం, తన దానిమీద రంగంపేట మండలం అని వచ్చాయి. ఇంత తప్పుల తడక లాగ చేయడానికి ఎలా సాధ్యం అయిందో తెలియడం లేదు.
This is possible only in India!! Mera Bhaarat Mahaan

krishna rao jallipalli said...

పోలింగ్ స్టేషన్ కి వెళ్ళాక, వోటు వెయ్యడానికి వీల్లెదంటే ఏం చెయ్యాలో చాలా మందికి తెలీదు....అప్పటి వరకు మన వోటు వేరే ఎవరూ వేయకుండా ఉండాలిగా.

నిషిగంధ said...

"ఎన్నికల సమాచారం ఈ సారి "పట్టణ దారిద్ర్య నిర్మూలన పథకం" గదిలో లభిస్తుందన్నమాట!"

"ఏవండోయ్, ఇవిగో, ఈ ఇయర్ రింగ్స్ నావే! నాదే ఈ ఫొటో" అని ప్రకటించాను.

"అమ్మో ఏకంగా పదేళ్ళే? 29 నుంచి 30 దాకా డేకడానికే ఆరేళ్లు తీసుకుందాయెను!"

:)))) టూ గుడ్!!
విషయం ఏదైనా మీ శైలి మాత్రం కేక!

రాఘవ said...

మీకు కనీసం కార్డు చేతికి వచ్చింది. మాకైతే ఆఫీసు చుట్టూ తిప్పుకుంటున్నారు తప్పితే కార్డు మాత్రం చేతికి రావడం లేదు. వెబ్‌సైట్‌లోనే పేర్లు బూతులు ఉన్నాయి. శ్రీరాఘవకిరణ్ ముక్కు ఐతే శ్రీ వదిలేసారు, సరే పోనీ పేరైనా సరిగ్గా ఉందా అంటే రాఘవ కిరణ్ యక్కు అని టైప్ చేసారు (నాకు వెంటనే చంద్రకాంత హిందీ సీరియల్‌లో క్రూర్‌సింగ్ గుర్తొచ్చాడు). కార్డు మీద ఎలా ఉంటాయో ఊహించుకోవాలంటేనే ... రామచంద్రప్రభో.

అక్షరం ముక్క రాని పనికిమాలిన సన్నాసులందరికీ టైప్ చెయ్యమని పని అప్పగిస్తే ఇలాగే ఉంటుంది. అసలు ఇది కేవలం రాజకీయాలలో లేని కేవలపౌరులకే జరుగుతోందా లేక రాజకీయనాయకులకి కూడానా? వాళ్ల పేర్లు కూడా ఇంత అద్వాన్నంగా ఉంటున్నాయా? ఇది దేశీయ సమస్యా లేక కేవలం రాష్ట్రానికే పరిమితమా? అసలు వయ్ ఎసెన్సు రజా శియకార రిడ్డె, నఱ్ఱ చిందర పాపు నయ్యోడు, బందర్లో డటట్రియ్య, బీ పీ రగ్గువోలు, కిసుక్కు చిందర సిగర రవ్వ, కొన్నితేళ్ల శీవు శెంఖర్ర వెఱ్ఱి పెసద్దు ... వీళ్ల పేర్లు ఇలా ఉంటే తెలుస్తుంది వాళ్లకి ఆ బాధ. ఠక్కున అందఱికీ పనులు సవ్యంగా జరగడం మొదలుపెడతాయి. అందువల్ల ఇది వాళ్లకి కూడా జరగాలని... ఇదే నా శాపం!

అరుణాంక్ said...

నా కార్డ్ లో నా శ్రీమతి ఫొతో వచ్చింది.తండ్రి పేరు కూదా తప్పే.కర్ద్ డిస్త్రిబుసన్ వారికి నేను తీసుకొనని రిజెక్ట్ చేసాను.తర్వాత పంచాయతి ఆఫిస్ కెలితే ఏడొ ఒకటి తీసుకొవల్సింది తర్వాత ఈ సేవ లో సరి చేఇంచుకోవలసింది అని సమాధానం.వేరే ఈడ్ ప్రూఫ్ తో వొతె వేయనిస్తె వేస్తాం లేకపొతే ?

సుజాత వేల్పూరి said...

రాఘవ, యక్కు ఇంకా గుర్తున్నాడా మీకు? నాకు భలే ఇష్టం వాడంటే!
పాపం మీ శాపం ఘోరంగా ఉందండి! ఈ కార్డులు ప్రింట్ చేసేవాళ్లకి ఏ మాత్రం తీసిపోకుండా పెట్టారు పేర్లు! నిజం చెప్తే నిష్టూరంగా ఉంటుంది కానీ కార్డుల్లో పడిన పేర్లన్నీ మీరు చెప్పిన స్థాయిలోనే ఉన్నాయి తప్పుల్లో! భలే నవ్వించారు పొండి!

సుజాత వేల్పూరి said...

Bradepetehoops గారు, థాంక్స్!

పిచ్చోడు గారు, అంత పరీక్ష పెట్టారా మీక్కూడా!

రవి గారు, ఆ వెబ్ సైటు లో సమాచారం దొరికిన వాళ్ళెవరూ లేరండి! నా వివరాలు కూడా మా కజినొకడు ఎలా ట్రాక్ చేసాడో గానీ పట్టుకోగలిగాడు. ఆ తర్వాత నేను 20 మందివి ప్రయత్నించి ఒక్కటీ దొరక్క ఊరుకున్నాను.

శ్రీనివాస్,
పెళ్ళి చూపులకి మనం కార్డు పట్టుకెళ్ళొద్దు. "ఏదైనా అడగండి కానీ కార్డు సంగతి మాకు తెలీదు " అని చెప్దాం ముందుగానే!:))).

సుమ,
తప్పిపోయిన మతిస్థిమితం లేని మహిళ...మీరు వర్ణించారు, నేను వర్ణించలేదు..అంతే తేడా! నా ఫొటో కూడా అలాగే ఉంది.

బాలేందు గారు,
మీరూ కార్డు బాధితుల జాబితాలో ఉన్నారా?

చైతన్య,
థాంక్స్, అన్నట్లు ఈ అను ఎవరో నాకు చెప్పాలి చెప్పాలి చెప్పాలి!

సుజాత వేల్పూరి said...

నీలాంచల,
భవాని గార్లు,
థాంక్స్ !

తెరెసా,
చెప్పానుగదండీ, ఈ కార్డు సాయంతో గూగుల్ ఎర్త్ వాళ్ళు కూడా మా ఇల్లు పట్టుకోలేరు. నాదే కాదు, చాలా మంది కార్డులు ఇలాగే ఏడిసాయి ఇక్కడ.

HAREPHALA గారు, నమస్కారం!
మీ కార్డులు చూసుకున్నాక, "ఇంతకంటే పూనా వెళ్ళి వోట్లేస్తే బాగుండేది" అనిపించి ఉండాలి మీకు!
మరీ "పీరయ్యా" ఏమిటండీ అన్యాయం కాకపోతే! బ్లాగు నచ్చినందుకు ధన్యవాదాలండి!


కృష్ణా రావు గారు,
మీరు చెప్పింది గుర్తుపెట్టుకోదగ్గ పాయింట్!నా మొదటి వోటే నేను వెళ్ళేసరికి ఎవరో చక్కా వేసేసారు.

నిషిగంధ,
ధన్యవాదాలు!

చైతన్య.ఎస్ said...

మా ఇంటి ఓనర్ కేమో 50, వాళ్ళ ఆవిడకి 69.
ఇంకా మా ఫ్రెండ్ కైతే తండ్రి పేరు , తన పేరు ఒకటే.
ఇంకోడిదైతే మరీ ఘోరం ... మగను ఆడ చేసేసారు. అన్నట్టు..ఇవి అంతా కర్ణాటకా లీలలు. ఇందుమూలంగా తెలిసేదేమంటే రాష్ట్రాలు మారిన వీరి పని తీరు మారదు :)

Bolloju Baba said...

ఎడ్రస్సు మారిందని పాతచోట తీసేసారు. కొత్తచోట్లో ఇంకా ఇవ్వలేదు. మొత్తానికి వోటు గల్లంతు.

ఈ సారి వోటర్ల లిస్టు తయారు చెయ్యటం నిక్ నెట్ వారికి అప్పచెప్పారట> అదేమో కెంద్ర ప్రభుత్వ సంస్థ. స్థానిక అధికారులకు వారు సబార్డినేట్లు కాదు.
కనుక విస్సన్న చెప్పిందే వేదం.
ప్రతీ చోటా అలానే ఉందన్న మాట :-)

జ్యోతి said...

సుజాతగారు,

అందరి కష్టాలు బానే ఉన్నాయి.. గంటకు పైగా లైన్లో నిలబడి తీసుకున్న రేషన్ కార్డు మీద నాపోటో చూసి నీ మీద నాకే విరక్తి కలిగింది. మళ్లీ ఫోటో దిగాలనే ఆశ చచ్చిపోయింది. ఇక అఢ్రస్ సంగతి .. మాట్లాడకపోతేనే మేలు. మళ్లీగాని ఎవడైనా వోటర్ లిస్టు చేస్తాము అని వస్తే వాడు ఐపోయాడే అన్నమాట. . అర్ధం చేసుకోండి మీరే.

చైతన్య said...

@సుజాత గారు
చెప్పేయమంటారా... మళ్లీ శ్రీనివాస్ గారు ఫీల్ అవుతారేమో!

asankhya said...

మొత్తం మీద మీరు మందుగుళికలని మింగి మాకు
హాస్యగుళికలని అందిస్తున్నారన్న మాట. బావుంది.

Kathi Mahesh Kumar said...

నిజమే! నా కార్డులో ఫోటో చూసి నన్ను నన్నే గుర్తుపట్టలేను. హేమిటో!

నాగప్రసాద్ said...

పల్లెల్లోనే నయమన్నమాట. నాకు తీరుబడిలేక, రెండు పాస్ పోర్టు ఫోటోలు మా ఇంటికి పంపిస్తే, ఎంచక్కా రెణ్ణెల్ల క్రితమే ఓటరుకార్డు తయారు చేయించి పెట్టారు. నేనింకా నా ఓటరు కార్డు చూసుకోలేదు. బహుశా బాగానే వచ్చింటుందనుకుంటున్నా.

ఏదేమైనా, మీ టపాతో భళే నవ్వించారు.

@రాఘవ: :):).

చదువరి said...

ఈ తప్పులు చాలావరకు ఆర్టియెస్నుంచి తెలుగులోకి మార్చేటపుడు వచ్చే తప్పుల్లాగా అనిపిస్తాయి. (తెలుగులో టైపించేందుకు వీళ్ళు ఆర్టీయెస్ వాడరులెండి)

ప్రచారానికి వెళ్ళి పోలింగు స్లిప్పులిస్తున్నపుడు ఒకాయన అడిగాడు, ఈ పేరేంటొ చెప్పండి అని. అక్కడ "శ్ర్న" అని ఉంది. శ్రావణి అని ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఔనౌను మమ్మాయే అని స్లిప్పు తీసుకున్నాడు. ఆర్టీయెస్‌లో తప్పులు చేసీ చేసీ ఇలాంటివి కనుక్కోడం తేలికైపోయింది.

మా కాలనీలో ఓ పోలింగు బూతు పేరు "దైవ హాయస్కుల 6th కలాస రూం" అని పడింది. అదెక్కడ అని అడిగాడొకాయన. అలాటి బడి మా కాలనీలో లేదు. పోనీ ఏదైనా చర్చికి సంబంధించిందేమోనని అనుకుందామా అంటే అలాటి చోట్ల పోలింగు పెట్టరు. లోక్‌సత్తా నాయకుడొకాయనకి ఫోను చేసి అడిగితే ఆయన చెప్పాడు - అది డి.ఏ.వి. పబ్లిక్ స్కూలు అని! :)

సుజాత వేల్పూరి said...

చదువరి గారు,
నిజమే! నిన్న మా కాలనీ లోక్ సత్తా నుంచి లో పోల్ స్లిప్పులివ్వడానికి వెళ్ళినపుడు ఆ స్లిప్పు మీద పేరు చూసి "ఇది మీదేనా" అని ఎలా అడగాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఆ పేరు చదవడం మా వల్ల కూడా కాలేదు. ఒకాయన పేరు "శ్ల్ యే శ్ రా డై" అంది ఉంది. ఆయన భార్య ను అడిగి ఆయన పేరు తెలుసుకుని ఇవ్వాల్సి వచ్చింది. ఆయన పేరు శైలేష్ రెడ్డి. మరొక చోట కుమార రత్నం తండ్రి పేరు పీరా సాహెబ్ అని పడింది. చాలా పేర్లు ఇలాగే పడ్డాయి. ఆ స్లిప్పు ఇవ్వడానికే భయం వేసింది.మునిసిపల్ నంబర్ కనుక్కోవడం మరో ప్రహసనం. అన్నీ తప్పుల తడకలే! దీనికంటే పోస్టర్లు అంటించడం సులభమనిపించింది.

మరి కొన్ని పేర్లు చూడండి, సరదాగా

ఓనల్గె లోకం ఆత్రి రెనూక

భిక్షం ఆయ్యా(భిక్షమయ్య అనుకుంటా)

పామ్ మోహన్ (శ్యాం మోహన్ అని ఉండాలట)

అణుపిండీ శ్రీదే (తర్వాత భాగం ఏమైందో తెలీదు)
ఆమె భర్త పేరు "ఫే"(ఇది ఎవరూ కనుక్కోలేకపోయారు)

షో ఉక్ చేటర జీ

స్వాపర్కూర

టంఖస్ముఖ భా ఈ (ఇదేంటో కనుక్కుంటే బహుమతి) ....ఇలా రాస్తూ పోతే సగం పుస్తకం ఎక్కించాలిక్కడ.

మరి ఆర్టీ ఎస్ లో టైప్ చేయకపోతే ఇలా ఆంగ్లాన్ని యధాతధంగా ఎలా దించారంటారు? ప్రతి కార్డూ, ప్రతి స్లిప్పూ ఇలాగే ఉన్నాయి.

చైతన్య said...

సుజాత గారు... అను గారు ఎవరో... శ్రీనివాస్ గారి లేటెస్ట్ టపా చూస్తే తెలిసిపోతుంది... చుడండి...

నేస్తం said...

అసలే వోటు హక్కు వినియోగించుకోలేక పోతున్నా అని బోలెడు భాధ పడిపోతున్నా,కాసింత ఊరట ..మీ పోస్ట్ చదువుతుంటే నవ్వు,ఆక్శ్చర్యం కలిపి వస్తున్నాయి ..చక్కని శైలి :)

జీడిపప్పు said...

హ హ్హ హ్హా భలే ఉన్నాయి మీ కార్డు కష్టాలు.

Dhanaraj Manmadha said...

"టంఖస్ముఖ భా ఈ"

ఇదేదో చెప్పందే నేను ఇక్కడే ధర్నా చేయగలనని మనవి చేస్తున్నాను.

"అమ్మో ఏకంగా పదేళ్ళే? 29 నుంచి 30 దాకా డేకడానికే ఆరేళ్లు తీసుకుందాయెను!"

దిస్ ఈజ్ తూ మచ్. ఇంత నవ్విస్తే అఆఫైన మా మూడ్ మళ్ళా బాగైపోద్ది.

There are so many incidents like this. But your post takes the cake.

"నా మొదటి వోటే నేను వెళ్ళేసరికి ఎవరో చక్కా వేసేసారు."

కొంపదీసి మీది గుంటూరు, వినుకొండ ఏరియానా?

గీతాచార్య said...

andukE nEnu Otaru gurtimpu kArDu tIsukOlEdu.

సుజాత వేల్పూరి said...

ధనరాజ్ మన్మధ గారు,
అదేమిటో నేను కనుక్కోగలిగితే మీకు తప్పక చెప్తాను.

అన్నట్టు మీరు ఊహించింది కరక్టే! మాది గుంటూరు జిల్లానే! పైగా వేడి వేడి రాజకీయ వాతావరణం ఉండే ఊరు "నరసరావుపేట"! అటువంటి ఊర్లో మొదటి వోటు వేరెవరో వేసేస్తే ఎంత బాధ చెప్పండి? మళ్ళీ అయిదేళ్ళు ఆగాలా వద్దా?

సుజాత వేల్పూరి said...

@ చైతన్య.ఎస్,

అయితే ఎక్కడైనా ఒకటే సర్వీసన్నమాట వీళ్లది.

అరుణాంక్ గారు :)

బాబాగారు,
పరిస్థితి ఇంత ఘోరంగా ఉందని నా కార్డు వచ్చాక, విషమించిందని నిన్న పోల్ స్లిప్పులివ్వడానికి వెళ్ళినపుడూ తెలిసిందండీ! దరఖాస్తు చేసి ఆర్నెల్లయినా కార్డు చేతికి రానివాళ్ళు ఎంతో మంది ఉన్నారని కూడా అప్పుడే తెల్సింది.

జ్యోతి గారు,
మీకేమో ఫొటో దిగాలని ఆశ చచ్చిపోయిందా? నేనేమో ఆ కార్డు మీది ఫొటో ని మర్చిపోవాలని బోల్డు ఫొటోలు దిగాను ఆ తర్వాత.:)

అసంఖ్య, మహేష్ గార్లు :)

నాగప్రసాద్ గారు
మీ కార్డు చూసుకున్నాక మళ్ళీ ఇక్కడికొచ్చి మా అందరితో ఏకీభవిస్తూ వ్యాఖ్య రాస్తారు చూడండి!

నేస్తం, జీడిపప్పు గార్లు:)

Dhanaraj Manmadha said...

పద మూడేళ్ళకే ఓటు వేసి ఇక జీవితంలో ఓటు వేయొద్దని డిసైడ్ అయ్యాను లెండి. పాపం అది ఎవరి ఓటో? అప్పుడు మెముంది పెదకూర పాడు.

హరేఫల said...

ఏమీ అనుకొకండి ( ఈ శిర్షిక పేరు 'హాస్య గుళిక ' కాబట్టి) గీతాచార్య గారిని ఈ గుర్తింపు కార్డ్ ల డిపార్ట్మెంట్ లో వేస్తే ఏమైనా మనకి మోక్షం కలుగుతుందేమో. ఇంగ్లీష్/తెలుగు లో రాసినా చాలు. మన పేర్లు/ఊర్లు ఎలగోలాగ సర్దేసుకొంటాము!!

ప్రియ said...

నవ్వలేక చచ్చాను. ఇంకానయం ఇండియాలో లేను. ఉంటే నా బొమ్మ ఎలా ఉండేదో?

గీతాచార్య said...

హరేఫల గారు,

ముందు నేను మిమ్మల్ని తీవ్రంగా ఖన్డిస్తున్నాను. మధ్యలో నా ఒక్కడి పేరే ఎందుకు మీకు తట్టింది? చిన్న పిల్లాడిని చేసి ఇలా నన్ను ఇరికించి మళ్ళీ నా మీద టపా రాయిద్దామనా? నేనొప్పుకోను.

Any way, there are some seroius issues in these elections to be sorted out.

See this post, and comment. I require some opinions, నా చేతుల్లో ఉన్నంతవరకూ నేనూ చేసే ప్రయత్నం లోనే ఉన్నాను.

http://thinkquisistor.blogspot.com/2009/04/1.html

గీతాచార్య

భాస్కర రామిరెడ్డి said...

సుజాత గారూ రేపో ఎల్లుండో ఎలక్షన్స్ కదా, మీరు పొద్దున్నే 5 గంటలకే మీ చెవి రింగులు పెట్టుకొని, సాక్షంగా ఇద్దరిని మీవెంట తీసుకెళ్ళండి.అదృష్టము బాగుండి మీ వోటు ఎవరూ వెయ్యకపొతే మీ వోటు మీకు దక్కుతుంది :)

Malakpet Rowdy said...

LOLOLOLOL .. !!!

సుజాత వేల్పూరి said...

హరేఫల గారు,
geetaachaarya is a kid. సరదాగా రాశారు. అతడి వ్యాఖ్యను సరదాగా తీసుకోండి మీరు!

గీతాచార్య said...

ఓ. సారీ. హహహ. నేను సరదాగా వ్రాశాను. మీ వ్యాఖ్యని నేను చాలా సరదాగా తీసుకున్నాను. మీరు నా వ్యాఖ్యని అన్యధా భావించ వద్దు అని మనవి.

హరేఫల said...

మీరు ఏమైనా సీరియస్సు గా తీసికొన్నారేమో అనుకొన్నాను.అందుకనే గొడవ లేకుండా క్షమాపణ చెప్పాను. ఎందుకంటే ఈ మధ్యన ఎక్కడొ ఓ వ్యాఖ్య రాస్తే ( ఆయన తీసిన సినిమా గురించి) ఆయనకు నచ్చలేదు. అప్పడినుంచీ వ్యాఖ్యలు రాయడం మానేసి ఏదో నాకు తోచినట్లుగా బ్లాగ్గులే రాస్తున్నాను. ఇదైనా హాస్య గుళిక అన్నారు కదా అని వ్రాశాను.ఎనీవే లెట్స్ ఫర్గెట్. అండ్ బీ ఫ్రెండ్స్.

వేణు said...

రాసిన తీరు చాలా బాగుందండీ. అంత హ్యమరస్ గా ఎలా చెప్పగలుగుతున్నారు? ఇంతకీ ఎన్నికల రోజున ఏం జరిగింది? అది కూడా...
అన్నట్టు- మీ పాత్రికేయ ‘జ్ఞాపకాలు’ రెండో భాగం కోసం ఎదురుచూస్తుంటే మొదటిది కూడా తీసేశారేమిటండీ? పాత్రల రూపురేఖలు మార్చి అయినా రాయొచ్చు కదా!

వేణు said...

సారీ, నా వ్యాఖ్యలో ‘అచ్చుతప్పు’. హ్యూమరస్ అని నా ఉద్దేశం. పోస్ట్ చేసేముందు ప్రివ్యూ చూడాల్సింది!

సుజాత వేల్పూరి said...

వేణు గారు, మీ రెండో వ్యాఖ్య చూసేదాకా మొదటి వ్యాఖ్యలో అచ్చుతప్పు ను నేను గమనించలేదు. అంటే నేను ఎంతగా అచ్చుతప్పులు చేస్తుంటానో చూడండి మరి!

మధురవాణి said...

సుజాత గారూ..
భలేగా రాసారండీ ఓటరు కార్డుల గురించి.. పడీ పడీ నవ్వానంటే నమ్మండి :)
మీ టపాలతో పాటుగా.. క్రింద వ్యాఖ్యలు రాసేవారికి కూడా హాస్యం అబ్బుతుందనుకుంటా.. అందుకే వ్యాఖ్యలు చదవడం కూడా ఆసక్తిగా ఉంటుంది :)
నేను కూడా ఓటరు లిస్టులో మా ఇంట్లో వాళ్ళ పేర్లు కోసం వెతికి.. అవి దొరికినా గానీ పోల్చుకోలేకపోయాను.. అంత ఘోరమైన అచ్చుతప్పులన్న మాట.!
ఇకపోతే ఆ అద్భుతమైన ఫోటో దిగే సదవకాశం నాకు ఇప్పటి దాకా రాలేదు. ఈ ఎన్నికలు కూడా మిస్ అయిపోయాను :(
అలాగే ఓటు వేసినప్పటి కబుర్లు కూడా చెబుదురూ..!

కొత్త పాళీ said...

ha ha ha.

Anonymous said...

heehhehe.... Thats True...

Last time ekanga otarla jaabita gallantavadam to naaku vote vese chaance raaledu..

ee saari tappulunna... peru raavadam santosham.. I have voted..

annatlu.. chaala chakkaga navvinchaaru...

దైవానిక said...

హ హ హ,
మా బెంగుళూరులో కూడా ఇదే వరసండి. నా పేరుని ఎలా ఖూనీ చేసారంటే, వద్దులేండీ.. మా రూంమేట్ వాళ్ళ నాన్న పేరు ప్రకాశం అని పడింది. ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లా పేరు పెట్తేస్తారా అని వాడు ఒకటే ఏడుపు.
మా అమ్మకైతే కార్డు వచ్చింది గాని ఓటరు లిస్టులో పేరు లేదు.

Unknown said...

chaalaa bavundi mee blog . really studd maxx

Ram said...

Its really funny to read, the way of writing is simply superb.

Note: Felt like real story, but seeing "NOTE" made us fun little down as it is assumed.

Anyway good work.

Ram said...

I couldn't stop writing this comment, after reading all these readres comments also. All are expressing very funny experiences with their way and spreading extra perfume to the original..

Really Superb....

మా ఊరు said...

sujatha gaaru

naa voter card chusukovalanan aasa monnati varaki vundedhi
mee badhalu anni vinnaka
ippudu adhi chusukonandhuku nenetha lucky oooooooo anipisthundhi

చైతన్య.ఎస్ said...

సుజాత గారు మీ బ్లాగ్ పరిచయం ఈనాడు లో (25/4/09) వచ్చింది... అభినందనలు

ananda said...

andamina bhaavaalaku addamlaa cheppe bhaavaalu ardavantamga kanipistunnay

naaku eppatinuncho madiloni baavalu
cheppalani
mee andaritho panchukovaalani
oka blog tayaaru cheyaali anukuntunna
mee help kaavali
naa ee paniki
emaina
chakkkava
ee tension bratukulo
saradaaga kaasepu
madi bhaavaalu panchukovachu
enjoy keeep it up
go ahead,,,
sorry na peru cheppa ledu kadu
anand from vizag working s/w engineer

Unknown said...

hello sujata garu,

Mee blog chala chala bagundi. Nenu swachamina telugu ni chadivi chala nelalu gadichi poyayi. chala kalam tarvatha eenadu paper lo mee blog gurinchi telusukoni open chesanu. meeku mee rachanalaku nijam dhanyavaadaalu.

Kiran

Post a Comment