తిరిగే కాలూ తిట్టే నోరూ... అని సామెత! రెండోదాని విషయం వదిలేస్తే మొదటి విషయం ప్రకారం ఏడాదికి కనీసం 3 వెకేషన్లు (వారానికి తక్కువ కాకుండా) తీసుకోడం మా ఇంటి సంప్రదాయం! అలా వెళ్ళొచ్చాక ట్రావెలాగులు ఇంతకు ముందు రాసి ఒకట్రెండు సార్లు పత్రికలకు పంపాను. ఆ తర్వాత రాయడం విసుగొచ్చి మానేసాను. ఈ మధ్య వెళ్ళొచ్చిన "కెమ్మణ్ణు గుండి" గురించి మాత్రం రాసి కౌముదికి పంపాను.
మే నెల సంచిక ఇవాళే విడుదలైంది. వీలు చేసుకుని యాత్రా స్పెషల్ పేజీకెళ్ళి చూడండి...!
అక్కడ ఫొటోల్లో ఉన్నది మిత్రులు నాగరాజు, అపర్ణ, వాళ్ళ పిల్లలు భువి, హర్ష!
9 comments:
చాలా బగుంది అండి ! నేను ఉద్యోగరిత్యా బెంగుళూరులో ఉన్నందున మాకు దగ్గరలో ఉన్న ప్రదేశాలు సందర్సిస్తూ ఉంటాను ఇటీవలే "కెమ్మణ్ణు గుండి" గురించి విన్నాను త్వరలోనే వెల్దామని అనుకుంటున్నాను. మీ ఆర్టికల్ చదివాక తొందరగా ఉంది వెళ్ళాలని !!
ఈ లింక్ చూడండి
మీ యాత్రానుభవాలు, వాటిని క్లుప్తంగా వివరించిన తీరు బాగున్నాయి.
నాక్కూడా చాలా రోజుల్నుంచి కెమ్మనగుండి వెళ్లాలని, కాని కుదరడంలేదు :(
మీ ట్రావెలాగ్ బావుంది. అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని వర్ణించిన తీరు ప్రశంసనీయం.
మీరు ఇదివరకు రాసిన ట్రావెలాగులు చూడలేదు కాని ..ఇప్పుడు మీరు రాసింది చదివి....నా అభిప్రాయం......
మీరు చేసిన ప్రకృతి వర్ణన చాలా బాగుంది...."ఆకుపచ్చదనాన్ని కప్పుకున్న ఎత్తైన కొండలు..", అలాగే "ఆకుపచ్చని శాలువా కప్పుకొని గంభీరంగా నిలబడ్డ...." లాంటి వర్ణనలు చాలా చాలా బాగున్నయి... ప్రకృతి ప్రసాదించిన ఒక అందమైన ప్రదేశం పరిచయం చేసినందుకు ధన్య వాదములు.....
....కాని ఒక ప్రదేశం వెళ్ళి అక్కడి విషయాలు చెబుతున్నామంటే....అక్కడికి వెళ్ళేందుకు ఉన్న అన్ని రకాల ప్రయాణ సదుపాయాలు, వాటి ఖర్చులు...తెలియ చేస్తే బాగుంటుంది....ఇది పెద్ద కష్టం కూడా కాదు....అక్కడ ఉండటానికి ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి....అక్కడి ప్రజల ఆహరపు అలవాట్లు,వారి ఆహార్యం,వారి సంస్కృతి...ఇవన్ని కూడా తెలియ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశ్యం....ఫొటోలు కూడా అక్కడి ప్రజలకు సంబంధించిన విషయాలను తెలియ పరచేవిగా ఉంటె బాగుంటుందేమో...ఇవన్ని చెయ్యాలంటే మనం ఉన్న కొద్ది సమయం లొ అక్కడి ప్రజలతో చాలా సంభాషించగలగాలి....వాళ్ళను,వారి పద్ధతులను గౌరవించే రీతిలో మాట్లాడ గలగాలి...అప్పుడే సాధ్యమవుతుందనుకుంటా....ఇవన్నీ మీరు చెయ్యలేదు అని కాదు...కాని ఒక ప్రదేశం "చూడటం" అనే మీ ఆలొచన వేరై ఉండవచ్చు.... దానికి తగ్గట్లుగానే మీరు రాయటం జరిగింది.....కాని నేను చెప్పినవి (కొన్నే చెప్పాను...ఇక మిగతావి మీకు అర్థం అయ్యిందని ఆపేసాను) కూడా ఒక సారి ఆలోచించండి......"యాత్ర" పరిపూర్ణం అవుతుందేమో.....
బాగుంది. బాగుంది.
HRUDAYA,
మీ వ్యాఖ్య చాలా అర్థవంతంగా ఉంది. నిజానికి మీరు పేర్కొన్న ఖర్చులు, ప్రయాణ సదుపాయాలు తెలియజేసే రీతిలో ఆ యాత్రకు వెళ్ళలేదు నేను. ఒకటో రెండో బస్సులు చిక్కమగళూరు నుంచి ఉన్నాయి. అక్కడికి దగ్గర్లోనే ఉన్న మిత్రుల ఇంటికి వెళ్ళడం వల్ల వారితో పాటు వారి కార్లో వెళ్లడం జరిగింది. అది నివాస ప్రదేశం కాదు. కేవలం ఒక మారుమూల హిల్ స్టేషన్. ప్రకృతి ని ఆస్వాదించడానికే వెళ్ళాలి తప్ప సంస్కృతిని అధ్యయనం చేయడానికి అక్కడ ప్రత్యేకంగా ఏదీ లేదండి!అక్కడి ప్రజల సంస్కృతి అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు. పైగా కర్ణాటక ప్రజల సంస్కృతి ఆంధ్రా ప్రజలకు మరీ కొత్తగా ఏమీ అనిపించదు,(స్వానుభవం).
పైగా మేము అక్కడికి ఉదయం వెళ్ళి అంతా తిరిగి చూడ్డం, రాత్రికి ఇల్లు చేరుకోవడం కూడా జరిగింది. అందువల్ల నేను సమయమంతా ప్రకృతిని ఆస్వాదించడానికి ఫొటోల్లో బంధించడానికీ మాత్రమే వెచ్చించాను. అదే అందరితో పంచుకున్నాను.
Thanks for your comment.
సుజాత గారూ..
మీ వ్యాసం చూసాక ఆ ఊరెళ్ళి చూసి రావాలనిపిస్తుంది.
మీరు హాస్యమే అనుకున్నా.. వర్ణనలు కూడా చాలా బాగా రాశారండీ.!
Nice one!
Post a Comment