September 10, 2009

కుట్రాజకీయం
మనలో చాలా మందికి చరిత్ర అంటే అంతగా ఆసక్తి లేకపోవడానికి కారణం గణాంకాల ఆధారాలకు ప్రాముఖ్యం ఇచ్చి కేవలం ముఖ్యాంశాలనో, "పాజిటివ్" అంశాలనో తెలియజేస్తూ "సమాచారాత్మకం"గా ఉండటం కావొచ్చు! నేనైతే స్కూలు రోజుల్లోనే చరిత్ర అంటే బోరు కొట్టే సబ్జెక్టుగా నిర్ణయించేసుకుని మళ్ళీ దాని జోలికిపోలేదు. కానీ తర్వాతి కాలంలో సమాజానికి నిజంగా అవసరమైన ప్రపంచ చరిత్ర,ముఖ్యంగా వాస్తవాలను తెలియజేసే రాజకీయ, ఆర్థిక చరిత్ర,కూలంకషంగా చదవడం చాలా ముఖ్యమని గ్రహించాను.

అమెరికన్ పత్రికా రచయిత , Newyork Times పత్రికకు విలేకరిగా ఐదు ఖండాల లో 50 దేశాల నుంచి వార్తలను అందించిన స్టీఫెన్ కింజర్ రచించిన "Over throw"(America's Century of Regime Change from Hawai) " పుస్తకానికి రచయిత, ఉద్యమకారుడు,గుండె చప్పుడు బ్లాగర్ శ్రీ కొణతం దిలీప్ స్వేచ్ఛానువాదం  కుట్రాజకీయం(అమెరికా దుర్మార్గాల శతాబ్ది అనే టాగ్ లైన్ తో) పేరుతో
ఈ మధ్యనే విడుదలైంది. నేను చదవడం ఈ ఉదయమే పూర్తయింది.
 
జాన్ పెర్కిన్స్ "confessions of an Economic hitman"  పుస్తకాన్ని దిలీప్ "ఒక దళారీ పశ్చాత్తాపం"గా తెలుగులోకి స్వేచ్ఛానువాదం చేసినపుడు ఎంత ప్రజాదరణ పొందిందో, ఎంత సంచలనం సృష్టించిందో, ఎన్ని చర్చలకు పునాది వేసిందో అందరికీ తెలిసిందే!పుస్తకం విడుదలైన మొదటి రెండేళ్ళలోనే ఆరుసార్లు, మొత్తం మీద ఎనిమిది సార్లు పునర్ముద్రించారంటే ఆ పుస్తకానికి లభించిన ఆదరణ గురించి ప్రత్యేక వివరణ అవసరం లేదు.దిలీప్ అనువదించిన ఈ రెండో పుస్తకం కూడా అమెరికా సామ్రాజ్యవాద కుట్రలను వివరించే పుస్తకమే కాబట్టి ఒక రకంగా దీన్ని 'ఒక దళారీ పశ్చాత్తాపం' పుస్తకానికి కొనసాగింపుగానే భావిస్తున్నట్లు ప్రకాశకులు ముందుమాటలో పేర్కొన్నారు!ఒక  శతాబ్దం పాటు అమెరికా అనేక చిన్న దేశాల ప్రభుత్వాలను ఎంత హేయమైన పద్ధతుల్లో కుట్ర చేసి కూల్చివేసిందో కళ్ళకు కట్టినట్లు వివరిస్తుందీ పుస్తకం! ప్రజాస్వామ్య పద్ధతులను అనుసరించడం,జాతీయ భావాలను కలిగి ఉండటం, అమెరికా ఆర్థిక ప్రయోజనాలకు భంగం కలిగేలా తమ దేశ వనరులపై ఆయా దేశాలు హక్కులు కలిగి ఉండాలనుకోవడం ఇత్యాది కారణాలు ఈ కుట్రలకు మూలస్థంభాలు! ఎదురు తిరిగిన వారిని పదవీచ్యుతులను చేయడం, ఆయా దేశాల్లోని ప్రజలను, మత పెద్దలను,సంస్థలను,చివరికి పత్రికలను,మిలిటరీని కూడా డాలర్లు గుప్పించి కొనేసి కృత్రిమ తిరుగుబాట్లను లేవదీయడం, సందట్లో సడేమియా లాగా పరిస్థితులను తన గుప్పిట్లోకి తెచ్చుకోవడం, తనకు అనుకూలంగా ఉండే కీలుబొమ్మ కు ప్రభుత్వాన్ని కట్టబెట్టడం ఇదీ అమెరికా రాజనీతి!
హవాయి దీవులలో 1893 లో మొదలైన ఈ కుటిలమైన కుట్ర నిన్న మొన్న మన కళ్ళెదురు గా జరిగిన ఆఫ్ఘనిస్తాన్,ఇరాక్ ప్రభుత్వాల కూల్చివేత వరకూ అప్రతిహతంగా ఎలా సాగిందో, ఎంత మందిని బలి కోరిందో, "నోరున్న వాడిదే రాజ్యం, డబ్బున్నవాడికే అది వీరభోజ్యం"అన్న కౄరమైన కఠిన సత్యాన్ని ఎలా అమలుపరిచిందో కళ్ళకు కట్టినట్లు వివరిస్తుందీ పుస్తకం!హవాయి,క్యూబా, ప్యూర్టోరికో,ఫిలిప్పీన్స్,నికరాగువా,హోండురాస్, ఇరాన్,గ్వాటెమాలా, దక్షిణ వియత్నాం,చిలీ,గ్రెనెడా,పనామా, ఆఫ్ఘనిస్తాన్,ఇరాక్ ...ఈ దేశాలలో కొన్ని చోట్ల రక్తం చిందకుండానూ, కొన్ని చోట్ల తిరుగుబాట్లు చేయించీ, మరి కొన్ని చోట్ల లాభం లేదనుకుంటే రక్తం వరదలై పారించి పంతాన్ని నెగ్గించుకుని ప్రభుత్వాల్ని పేకమేడల్లా కూల్చి వేయడానికి అగ్ర రాజ్యం చేసిన కుట్రలు చదువుతుంటే ఊపిరాడనంత ఆశ్చర్యం కల్గుతుంది.మొదట్లో తన కుట్రలను బహిరంగంగానే కానిచ్చిన అమెరికా తర్వాత కాలంలో సోవియట్ రష్యా భయంతో రహస్యంగా కుట్రలను సాగించిన విధానాన్ని ఇరాన్, గ్వాటెమాలా,చిలీ, దక్షిణ వియత్నాం వంటి దేశాల ప్రభుత్వ విచ్ఛిన్నాల్లో చూడొచ్చు! సోవియట్ విచ్ఛిత్తి తర్వాత అమెరికాకు రహస్య చర్యలకు పాల్పాడాల్సిన అవసరం తీరిపోవడంతో ప్రత్యక్ష సైనిక చర్యలతో నిస్సిగ్గుగా విరుచుకు పడటాన్ని ప్రత్యక్షంగానే చూశాం!ఈ పుస్తకంలోని ప్రతి కుట్ర కథా ఆద్యంతం ఆసక్తిగా, ఉత్కంఠగా చదివిస్తుంది.కొన్ని చోట్ల ఆశ్చర్యాన్ని,మరికొన్ని చోట్ల అమెరికా దుర్నీతి పట్ల అసహ్యాన్ని కల్గిస్తుంది. మరికొన్ని చోట్ల రక్తాన్ని మరిగిస్తుంది. ఉపోద్ఘాతం, ఉపసంహారం ఈ పుస్తకాన్ని సమతూకంలో నిలుపుతూ అద్భుతంగా అమిరాయి.దిలీప్ గారి స్వేచ్ఛానువాదం ఎలా వుంటుందో మొదటి పుస్తకంతోనే రుజువైంది కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. యూనివర్సిటీ చరిత్ర క్లాసులో అనుభవజ్ఞుడైన అధ్యాపకుడు శ్రద్ధగా వివరిస్తున్న పాఠం లో లీనమై పోయిన విద్యార్థిలా ఫీలయ్యాను ఈ పుస్తకం చదువుతున్నంత సేపూ!అందరూ చదవాల్సిన ఈ పుస్తకం ఆగస్టు లో విడుదలైందిప్రతులకు సంప్రదించాల్సిన చిరునామా


వీక్షణం ప్రచురణలు
మైత్రి రెసిడెన్సీ,
3-6-394
స్ట్రీట్ నెం 3,హిమాయత్ నగర్
హైదరాబాద్-29

ఫోన్:66843495

ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లభిస్తుంది.

వెల 40 రూపాయలు మాత్రమే

34 comments:

కత్తి మహేష్ కుమార్ said...

మూలపుస్తకాన్ని ఆమూలాగ్రం జీర్ణించుకుని, ఆ సారాన్ని విడమర్చి మనకోసమే చెబుతున్నట్లుగా సాగే దిలీప్ శైలి అనువాదాల్ని మరింత అర్థవంతమే కాక అత్యంత relevant చేస్తుంది.

కుట్రాజకీయాన్ని తెలుగు పాఠకులకు అందించిన దిలీప్ కు అభినందనలు. బ్లాగులోకానికి పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు.

PKMCT said...

అమెరికా సామ్రాజ్యవాదులకి రక్తం నిండా కుట్రలతత్వమే. http://nostatusquo.com చూడండి.

kiranmayi said...

ఈ పుస్తకం నేను చదవలేదు కాని మీ పోస్ట్ లో ఫస్ట్ రెండు లైన్లతో నేను ఏకీభవిస్తాను. నా మటుక్కు నాకు హిస్టరీ క్లాసు లో dates గుర్తుకుపెట్టుకోవటం మాత్రం బాగా గుర్తుండి పొయ్యింది. లాస్ట్ ఇయర్ నేను " The emperor's club" అన్న సినిమా చూసాను. అందులో హిస్టరీ ఎంత ఇంటరెస్టింగ్ గా teach చెయ్యొచ్చో చూపిస్తారు. of course అది కధలో ముఖ్యాంశం కాదనుకోండి. ఎప్పుడు ఇలా interesting పుస్తకాలు మాకు పరిచయం చేస్తూ ఉండండి.

Vinay Chakravarthi.Gogineni said...

mmmmmmmmmm

వేణు said...

కొణతం దిలీప్ గారి అనువాద పుస్తకం ‘ఒక దళారీ పశ్చాత్తాపం’ ఆలస్యంగా చదివినందుకు పశ్చాత్తాపపడ్డాను. సామ్రాజ్యవాద కుట్రలో భాగస్వామి జాన్ పెర్కిన్స్ స్వయంగా రాసిన ఆ పుస్తకం ఎన్నో కఠోర వాస్తవాలను వెల్లడించింది.

దిలీప్ గారి ఈ తాజా అనువాద పుస్తకాన్ని ఆసక్తికరంగా పరిచయం చేసినందుకు అభినందనలు!

బొల్లోజు బాబా said...

మీ ఈ పోస్టు పై ఈ పాటికి పెద్ద దుమారం రేగిఉండాలే.(బహుసా పుస్తక సమీక్ష అని మినహాయింపు లభించిందేమో) ఎందుకంటే, అమెరికాని ఎంతతిడితే ఇండియాలో అంత గొప్పట.... ఓ పెద్దాయన సెలవిచ్చారులెండి. సమర్ధించేవారూ లేకపోలేదు మన బ్లాగులోకంలో....

బొల్లోజు బాబా

భావన said...

మంచి పరిచయం, నేను తప్పక చదవ వలసిన పుస్తకాల లిస్ట్ లో ఇంకోటి... అమెరికా సామ్రజ్య వాదం కొత్తేముంది సుజాత..

PKMCT said...

అమెరికా సామ్రాజ్యవాదుల గురించి నిజాలు చదవండి: http://stalin-mao.net/?p=84

మేధ said...

చరిత్ర అంటే నాకు చాలా ఇష్టం :)
మంచి పుస్తకం పరిచయం చేసారు.. ఇక్కడ ఎటూ దొరకదు, ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు తప్పకుండా తీసుకోవాలి...

నీహారిక said...

అమెరికాని ఎంత తిడితే అంత గొప్పా?
ఈ మాట అమెరికాలో ఉండేవాళ్ళన్నారా లేక ఇండియాలో ఉండేవాళ్ళన్నారా?
కుట్రలు జరిపేవాళ్ళు మన చుట్టూ కూడా ఉంటారు,ఎవరో కుట్రచేస్తే కూలిపోయే ప్రభుత్వాలు లేదా దేశాలు ఉంటే ఎంత ఉండకపోతే ఎంత?
కాకపోతే ఆ పుస్తకాల నుండి మనము నేర్చుకోవలసిందేమిటంటే ఈ రకంగా కూడా కుట్రలు జరుగుతాయి కాబట్టి మనల్ని మనం జాగృతపరచుకుంటే మేలు ఏమంటారు సుజాతగారు?

సుజాత said...

నీహారిక,
మీ స్టైల్ లో ఉంది సుమా మీ వ్యాఖ్య!:-))

కానీ మీరు ఈ పుస్తకం చదివి తీరాలండీ! . ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత అప్రమత్తంగా ఉన్నా, దేశ ప్రజల నుంచి 100 శాతం మద్దతు ఉన్నా కూడా అమెరికా ఇరాన్ దేశ ప్రధాని మొస్సాదెగ్ ని పదవీచ్యుతుడిని చేయడానికి ఎంత కుట్ర చేసిందో,ఇందుకోసం మత సంస్థల్ని, మిలటరీని, ప్రెస్ ని సైతం ఎలా కొని పడేసిందో ,ఉత్తుత్తి ఆందోళనలకోసం వీధి మూకల్ని ఎలా సృష్టించిందో, దేశంలో అనిశ్చిత పరిస్థితులున్నట్లు ప్రజలని ఎంతగా మభ్యపెట్టి అయోమయంలో పడేసిందో, ఈ పుస్తకంలోని ఇరాన్ కుట్రలో తెలుస్తుంది. అదొక్కటే కాదు, అనేక దేశాల్లో ప్రభుత్వాలు ఇలాగే కూల్చబడ్డాయి.

ఈ పుస్తకం గురించి మీతో మాట్లాడాలనిపిస్తోంది.అర్జెంట్ గా చదివెయ్యరూ!

అబ్రకదబ్ర said...

మరి ఆఫ్ఘాన్ పై అమెరికా 'దురాక్రమణ' గురించి ఓ వర్గం ఓట్ల కోసం మొసలి కన్నీళ్లు కారుస్తూ, అదే ఆఫ్ఘాన్లో పునర్నిర్మాణ ప్రాజెక్టుల కోసం ఆబగా అంగలార్చే దేశాల గురించీ ఉందా ఆ పుస్తకంలో? అదీ ఉంటేనే వాస్తవాలన్నీ రాసినట్లు. లేకపోతే ఏకపక్షమే.

నీహారిక said...

సుజాత గారు,
మీరు ఫొన్ నంబర్ ఇచ్చారు కదా! vpp ద్వారా పంపమని ఇపుడే ఫొన్ చేసాను.అది రాగానే చదివి మీతో మాట్లాడతాను.

సుజాత said...

Neehaarika,

Excellent! waiting for you to receive the book!

Thank you!

అడ్డ గాడిద (The Ass) said...

EmaMta ceppukOdagga pustakam kaadu kani, meeru raasindi chaala nachhindi. Good blog.

BTW I'm new to blogs. How to tell my new posts to others? Would you help? Plz

సుజాత said...

అడ్డగాడిదగారూ,(ఏం చెయ్యనూ, పిలవడానికి ఇబ్బందిగా ఉన్నా, మీరేమో ఇదే పేరు పెట్టుకున్నారాయె,,బ్లాగుల్లో),
మీ ప్రొఫైల్ లోంచి ఇప్పుడే మీ బ్లాగులోకెళ్ళి చూశాను.! కూడలికి, జల్లెడకి జత చేశారా మీ బ్లాగుని! రెగ్యులర్ గా రాస్తూ ఉంటే గుర్తింపు పెద్ద కష్టం కాదు.

ఇక పుస్తకం గురించి!...ఈ పుస్తకం అమెరికాలో ఉండి అప్పుడే మీరు చదివేశారంటే సంతోషం!(లేక స్టీఫెన్ కింజర్ ఒరిజినల్ గురించి చెప్పారా?) ఇక్కడే ఈ మధ్య వచ్చింది.

మంచి పోస్టులు మీ బ్లాగులో రాస్తారని ఆశిస్తున్నా!

అడ్డ గాడిద (The Ass) said...

dhanyavaadaalu sujatha garu,

nannu alaa piliste bagane untundandi. kavalani pettukunna pere kada.

aa koodali jalleda linkulevo kaastha teliyajesthaaraa naa blog lo comment rupamlo.

duppalaravi said...

కుట్రాజకీయం గురించి నాకు తెలిసి మీదే మొదటి పరిచయం. ఆ పని విజయవంతంగా నిర్వర్తించారు. బ్లాగులోకానికి ఓ మంచి పుస్తకాన్ని మరింత అర్థవంతంగా పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు. అయితే 17వ లైనులో 'నోచుకుంది' అనే పదం కన్నా పొందింది అంటే సరిపోతుందేమో కదండీ. ఇక అమెరికా విషయానికి వస్తే బరాక్ ఒబామా తన పాలన వంద రోజులు పూర్తిచేసుకున్నాక ఆనియన్ అన్న పత్రిక ఎలా వెటకరించిందో తెలుసు కదా, 'కంగ్రాట్స్ ఒబామా, వంద రోజుల్లోనే నువ్వు చంపించిన జనం బూష్ నాలుగేళ్లలో కూడా చేయలేకపోయాడు. మరిన్ని విజయాలు సాధిస్తావులే' అని కూడా అవహేళన చేసింది. ప్రపంచమంతటా యుద్ధాలుంటేనే అమెరికా మనగలిగేది, అస్థిరత వుంటేనే అమెరికా బతకగలిగేది, పేదరికం వుంటేనే అమెరికా గాలి పీల్చగలిగేది కాబట్టి అమెరికా ఏకధృవ ఆధిపత్యం కొనసాగినంతవరకు యుద్ధాలు, పేదరికం... తదితర దౌర్భాగ్యాలు ప్రపంచమంతటా రాజ్యమేలుతూనే వుంటాయి. నేనింకా ఈ పుస్తకం కొనలేదుగాని, రాగానే చదివి స్పందిస్తా. కానీ భారత ప్రభుత్వానికి అమెరికా అంటే వెర్రి వ్యామోహం. అదెలా పోగొట్టడమో కదండీ!!!

సుజాత said...

రవి గారు,

ప్రపంచమంతటా యుద్ధాలుంటేనే అమెరికా మనగలిగేది, అస్థిరత వుంటేనే అమెరికా బతకగలిగేది, పేదరికం వుంటేనే అమెరికా గాలి పీల్చగలిగేది కాబట్టి అమెరికా ఏకధృవ ఆధిపత్యం కొనసాగినంతవరకు యుద్ధాలు, పేదరికం... తదితర దౌర్భాగ్యాలు ప్రపంచమంతటా రాజ్యమేలుతూనే వుంటాయి. -------చాలా బాగా చెప్పారు.

పుస్తకం వచ్చీ రాగానే పరిచయం మీ బ్లాగులోనే ఆశించాను. ఈ లోపు నేను చదవటం పూర్తి కావటంతో నేనే రాద్దామనుకున్నాను.


మీ సూచన చాలా అర్థవంతంగా ఉంది. కొన్ని సార్లు కొన్ని పడికట్టు పదాలు రాతలో అలా దొర్లిపోతాయి. మీరు చెప్పాక నాకూ "నోచుకోవడం" అనే మాట కొంచెం ఎబ్బెట్టుగానే తోచింది. దాన్ని సవరించాను.ధన్యవాదాలు!

SIVA said...

వ్యాఖ్యల్లో కొంతమంది ఇండైరక్టుగా ఆ పుస్తకం ఏక పక్షం అన్నట్టుగా ఉన్నది. రెండో ప్రపంచ యుధ్ధం అవుతున్న తరుణంలో, రష్యా నుండి జర్మనీ వరకు, తాము నడచిన దారంతా కమ్యూనిజాన్ని బలవంతంగా రుద్దిన సోవియట్ లను ఏమనాలి. సోవియట్ రష్యా ఏమీ పతివ్రత కాదు. ప్రపంచ శాంతి నాశనమవ్వటానికి అమెరికా ధనలాభం కొంత అయితే, తమ పార్టీని ఇతరులమీద బలవంతంగా రుద్దటానికి రష్యా అవలంభించిన అన్ని మార్గాలూ బలమైన కారణాలే & నిషిధ్ధాలే. ఈ పుస్తకం వ్రాసినట్టుగా, వడలి రాలిపోయిన అలనాటి సూపర్ పవర్ రష్యా చేసిన ఘోరాలు కూడ ఎవరన్నా వ్రాస్తే బాగుండును. మనం ప్రస్తుతం బాధపడుతున్న టెర్రరిజాన్ని మన దేశ సరిహద్దుల్లోకి తెచ్చింది రష్యా కాదూ, ఆప్ఘనిస్తాన్ని ఆక్రమించి?

నిజంగానే, అమెరికాని ఎంత తిడితే అంత సామాజిక స్పృహ ఉన్నట్టు మనదేశంలో అంత మేధావి అయినట్టు.

ఏమైనా సుజాత గారూ, ఈ పుస్తకం గురించి మీ పరిచయం బాగున్నది. . ధన్యవాదాలు.

గీతాచార్య said...

One of the rarest books I regretted to to read. (Read in Eng. Donno about telugu though. Are there any changes to suit our nativity? Some added fights, and songs?) Bought it, and dumped it within a few minutes. Moreover the Perk given to the communists is little better than this CRAP.

The second angle, the communistic beast is alwayz glorified in our country.

"వడలి రాలిపోయిన అలనాటి సూపర్ పవర్ రష్యా చేసిన ఘోరాలు కూడ ఎవరన్నా వ్రాస్తే బాగుండును. మనం ప్రస్తుతం బాధపడుతున్న టెర్రరిజాన్ని మన దేశ సరిహద్దుల్లోకి తెచ్చింది రష్యా కాదూ, ఆప్ఘనిస్తాన్ని ఆక్రమించి?" Wah Wah! What a timely point Siva garu.

Why blaming the US for everything? We oughtta be careful That's important than blaming them. Why not develop things that we are depending on them? Vaalla meeda aadhaara pade badulu aa tech ni maname develop chesukunelaa aalochana raadu. Communist bhajana thappa.

BUT UR INTRODUCTION OF THE BOOK IS NICE AS USUAL.

అడ్డ గాడిద (The Ass) said...

@గీతాచార్య
"Read in Eng. Donno about telugu though. Are there any changes to suit our nativity? Some added fights, and songs?"
evaru swamy meru? John Broomrs bradaraa? keka comedy guru. kastha na blog chusi pettandi.

గీతాచార్య said...

Siva garu have you read Ayn Rand's WE THE LIVING? It gave an account about the communist Russia's original face. But it's not like this Crap.

The plot and aim of that book is different.

గీతాచార్య said...

అడ్డ గాడిద (The Ass) GARU,

Who are you boss? Copied my le 'gender'y dialogue.

SIVA said...

చదవలేదండి. ఇప్పుడు వెతికి చదివే ఓపిక లేదు. కాని రష్యావారే అయిన మాక్జిం గోర్కి, మిహాయిల్ షోలకోవ్ ల రచనలు చదివాను. సోలొజెత్సియాన్ ను ఎన్ని తిప్పలు పెట్టారు, బోరిస్ పాస్టెర్నెక్ ఏమయ్యాడు? నా ఉద్దేశ్యం ఒక్కటే ఏదొ ఒక పార్శ్వాన్ని పట్టుకుని తీవ్రంగా విమర్శించటం పధ్ధతి కాదు. మనదేశంలో జరిగినది ఏమంటే, దాదాపు అన్ని చోట్ల వామపక్ష వాదులు చాపకింద నీరులాగ ప్రవేశించి గూళ్ళు కట్టుకుని మన అలోచనా పధ్ధతిని వారి పార్టీ వెపుగా ఉండేట్టు చాలావరకు ప్రభావితం చేసారు, . ముఖ్యంగా, మీడియా, కొన్ని కొన్ని విశ్వవిద్యాలయాలు, కొన్ని రెసెర్చ్ కేంద్రాలు అంతా వారి మయమే. ఇప్పుడంటే చాలావరకు తగ్గింది కాని, 1970లు, 1980లలో , వామపక్ష భావజాలం ఏకీభవించని వాళ్ళని,మనుషులే కాదన్నట్టుగా ప్రవర్తించేవారు. ఏది ఏమైనా ప్రపంచం ఎప్పుడూ ఒకలాగ ఉండదు. ఏ అన్యాయమైనా చివరకు న్యాయానికిదే విజయం అని నమ్ముతాను. ఇన్ని మాటలు మనిద్దరం వ్రాసుకోవటానికి అవకాశం కల్పించిన సుజాతగారికి కృతజ్ఞతలు.

Srujana Ramanujan said...

జరిగిన, జరుగుతున్న, జరగబోతున్న కుట్రలనీ, మోసాల్నీ, ఆసక్తిదాయకంగా చెప్పి సొమ్ముజేసుకునే అమెరికా సమ్రాజ్యవాద దళారీల యోచనే ఇది.

ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మాదిరిగా జరిగిన కొన్ని విషయాల్ని చెప్పి, అక్కడి ప్రభుత్వ వ్యతిరేక వర్గాల్నీ, కొన్ని బడుగు దేశాల్లో ప్రో కమ్యూనిస్టుగాళ్ళనీ ఆకట్టుకునే ప్రయత్నంలోనే ఇల్లాంటి పుస్తకాలు వస్తున్నాయి.

అంతే తప్ప జరిగిన కుట్రలని బయట పెట్టి, జనాల్ని ఉద్ధరించాలన్న కోరికా, నిజాయితీ ఏకోశానా లేని ఇటువంటి రచనల్ని ప్రోత్సహించటం, ఓ నలబై రూకల్ని వదిలించుకోవటమే. You seem to have fallen in to the trap after reading this crap.

అమెరికా గొప్పదనీ, దాన్ని సమర్ధించమనీ అనను గానీ, శివ గారన్నట్టు...

"మీడియా, కొన్ని కొన్ని విశ్వవిద్యాలయాలు, కొన్ని రెసెర్చ్ కేంద్రాలు అంతా వారి మయమే. ఇప్పుడంటే చాలావరకు తగ్గింది కాని, 1970లు, 1980లలో , వామపక్ష భావజాలం ఏకీభవించని వాళ్ళని,మనుషులే "

మనం బయటపడాల్సిన మహమ్మారి ఇది.

గీతాచార్య,

"Moreover the Perk given to the communists is little better than this CRAP."

You mean John Perkins? Right. He's the one who started this type of commercial confessing movement. Well said. I have some first hand information on this.

సుజాత said...

సృజనా, చాలా ఘాటైన పదాలనే వాడారు మీ వ్యాఖ్యలో! మీ దగ్గరున్న first hand information సహాయంతో జాన్ పెర్కిన్స్ పుస్తకంలోని లోపాల్ని, ఈ పుస్తకంలోని లోపాల్ని(ఈ పుస్తకం మీరు చదివి వ్యాఖ్య రాసి ఉన్నా, చదవకుండా రాసినా)ఎత్తి చూపుతూ మీరొక టపా రాస్తే బావుంటుందేమో చూడండి!

కత్తి మహేష్ కుమార్ said...

A గురించి పుస్తకం రాస్తే B గురించి ఎందుకు రాయలేదు అనడం అతితెలివో మూర్ఖత్వమో అర్థం కాకుండా ఉంది.

ప్రస్తుతం ప్రపంచంలో నెలకొనున్న పరిస్థితుల దృష్ట్యా అమెరికా ఒక rogue nation అనేది కూసింత ప్రాపంచిక జ్ఞానం ఉన్న ఏ పాపడైనా ఖచ్చితంగా చెప్పగలిగే విషయం. ఈ పుస్తకం అలాంటి కొన్ని విషయాల్ని చెబుతుంది. అంతమాత్రానా ఇదేదో సోవియట్ రష్యా (ప్రస్తుతం ఈ దేశమే లేదు. ఉన్నదల్లా ఏమాత్రం బలం లేని సంక్షోభభరితమైన రష్యా) ప్రాపగాండా అనో లేకపోతే అమెరికాను తిట్టడం ఫ్యాషన్ అనేసుకుని మనల్ని మనం మోసం చేసుకోవడం కేవలం అమెరికా ప్రేమికులకే చెల్లుతుంది.

డాలర్లను ప్రేమించడంలో తప్పులేదు. అమెరికాలో ఉంటూ ఆ దేశానికి విధేయతను ప్రకటించడం నేరం కాదు. అవకాశాల కోసం అమెరికా ప్రయాణం కట్టడంలో అవమానంగా ఫీలవ్వాల్సిన అవసరం లేదు. కానీ, ప్రపంచవ్యాప్తంగా అమెరికా చేస్తున్న దౌష్ట్యాల్నిమాత్రం అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఈ పుస్తకం అలాంటి ఒక ప్రయత్నం మాత్రమే.

ఎవరో రష్యా దౌర్జన్యాల గురించి చెప్పారు. అవును...ద్విధృవ ప్రపంచంగా ఉన్నప్పుడు రష్యా తన sphere of influence కోసం చాలా దేశాలకు సాంకేతిక,రాజకీయ,ఆర్థిక సహాయాలు చేసింది. కానీ ఆఫ్ఘనిస్తాన్, చెచెన్యా వంటి రెండు ఘోరాలు మినహా రష్యా కూల్చిన రాజ్యాలెన్నో చెప్పండి? అదే సమయంలో అమెరికా గురించి మాట్లాడితే సొంత దేశంలో ఉన్న మేధావుల్ని "మెకార్థీయిజం" పేరుతో లేక "గ్రేట్ అమెరికన్ విచ్ హంట్" పేరుతో హింసించిన ఘనత ఆ దేశానికుంది. కమ్యూనిజం బూచిని చూపించి వియత్నాంలో వాళ్ళు చేసిన దౌష్ట్యాలకు బలైన వియత్నాం ప్రజలతోపాటూ మోసపోయిన అమెరికన్ జనాల చరిత్ర మనకు తెలీదా?

ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ఏ అంతర్జాతీయ సమస్యనైనా తీసుకోండి దానికి మూలం చివరికి అమెరికా "కుట్ర" కాకపోతే అప్పుడు అడగండి...ఒకసారి గుండెల మీద చెయ్యి వేసుకుని ఆలోచించండి. అప్పుడు ఇంకా కావాలంటే చర్చిద్ధాం.

Srujana Ramanujan said...

Here Nobody's supporting the US, nor are pro American for dollars sake. There is another angle to the problem which is also to be discussed. That's what I told. That thing is obvious, I hope. Or I'l write a post if need be.

SIVA said...

చూడండి మహేష్ కుమార్ గారూ, ఒక చర్చ జరుగుతున్నప్పుడు పరుష పదాలు వాడడం పధ్ధతి కాదు. తోటి బ్లాగర్ అయిన మీ దగ్గరనుంచి ఇటువంటి ప్రతిస్పందన వస్తుందని భావించలేదు. ఏదో కరడుకట్టిన కమ్యూనిస్టుల దగ్గరనుంచి అయితే వాళ్ళ భాషే అంత అనుకోవచ్చు. సరే మీ భాషలోనే సమాధానం చెప్పాలంటే, రష్యా వాళ్ళయితే వాళ్ళ sphere of influence పెంచుకోవటమా ఇతరులు ఆ పని చేస్తే రోగ్ దేశమా?? ఇదెక్కడి కుతర్కం?? దీన్నేమంటారు, అతి తెలివా, మూర్ఖత్వమా.

సామాన్యంగా కమ్యూనిస్టులు వాళ్ళ పిడివాదాన్ని వదులుకోరు, ఎడుటివాడిమీద ఏదో ఒక అరోపణలు చేసి వాళ్ళు డెఫెన్సులో పడేట్టుగా చేసి తాము గెలిచామనుకుంటారు. రెండు దేశాలు సూపర్ పవర్లుగా ఉన్నప్పుడు ఒకరికొకరు తీసిపోరన్నది నా వాదన. ప్రస్తుత చర్చలో ఉన్న పుస్తకం ఒక పార్శ్వం మాత్రమే చూపిస్తున్నది అది పాయింటు.

సృజనగారు సరిగ్గా అర్థంచేసుకున్నారు నేను చెప్తున్న విషయం. సరిగ్గ చెప్పారు మనం బయట పడాల్సిన మహమ్మారి ఇది అని .

కత్తి మహేష్ కుమార్ said...

@శివ: రష్యాతన ఆధిపత్యం కోసం ఉపయోగించిన విధానాలు దేశ సార్వభౌమత్వాల్ని తాకట్టుపెట్టుకోవడం,ప్రజల్ని బానిసల్ని చెయ్యడం,మనుషుల్ని చంపడం వంటి అమెరికన్ విధానాలు కాదు. సాంకేతిక సహాయం,సాంస్కృతిక-మేదో ప్రభావం వంటి soft పద్దతులనే ఉపయోగించారు. అమెరికాతో పోలిస్తే ఇతరదేశాల ఆంతరంగిక వ్యవహారాలలో రష్యా వేలుపెట్టిన ఘటనలు వేళ్ళమీద లెక్కించొచ్చు.

స్టాలిన్ సాగించిన మానవహననం,ఆప్ఘనిస్తాన్ లో చెచెన్యాలో చేసిన ఘోరమైన తప్పిదాలను ప్రతొక్కరూ ఖండిస్తారు. USSR చేసిన సాంస్కృతిక అణచివేతను అందరూ గర్హిస్తారు. కానీ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న అమెరికన్ arrogance,self centeredness ను పోల్చేప్పుడు ప్రస్తుతం USSR లేదనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏకధృవ ప్రపంచంలో అమెరికానే "either you are with us or against us" అని ప్రపంచం మొత్తాన్ని బ్లాక్ మెయిల్ చేసి తన దురంతాల్ని సాగిస్తోందనే కనీస అవగాహన ముఖ్యం.

America as a nation is a ROGUE NATION. ఇందులో నాకు ఏ మాత్రం సందేహం లేదు. నా ఆలోచనకూ కమ్యూనిజానికీ సంబంధం లేదు. ఒక మనిషిగా మానవజాతికి అమెరికా చేస్తున్న హానిని చూస్తూ, నేను అమెరికాను ఒక "వెధవ దేశంగా,రౌడీదేశంగా" గుర్తిస్తాను.

SIVA said...

Everybody is entitled to his own opinion. But, if anybody tries to say that my opinion is only correct all other opinions are wrong, then I strongly condemn such attitudes. That was the reason I followed up and made more than one remark, otherwise this book does not deserve even a mention anywhere. Like Srujana said, its another ploy by a an American to sell his works where it would be sold, especially in India where leftist oriented elements are still left.

I wish to reiterate that what is to be taken into consideration or what one has to remember is ones own business and not anybody's damn affair to interfere and all the more nobody need to advise others as if they are supreme.

Russia and America after WW2 due to circumstances have become two opposite poles and both resorted to henious crimes and not one of them can excepted. As Russians drove off the invading Germans, they themselves had become invaders of countries like Poland, Hungary, Chekoslovakia, Rumania and part of Germany itself. What was the result? Oppressive regimes, experiments on people in the name of theoritically ok Communism. People born in 1940s in those countries if they did not survive their 50s were not knowing what is free world, what is democracy, why only one fellow is all the time President. There were uprisings in Chekoslovakia and Hungary. But who crushed them? Trade Unionism is supposed to be the hallmark of Russians, but when Lech Walesa, when he tried to organise labourers, he was oppressed. That was the first seed for the crumbling of the Soviet empire. Why peopel were fleeing from East Germany to West Germany. Despite the fact during 1950s and 60s,which were the haydays of Communists in India, why there was no brain drain to USSR?

These are all the other angles. Thats exactly what I wanted to telle about this book. Writing from one angle itself is a great commercial idea for the writer because he has seen an opportunity to sell his bookand was successful in his endeavour.

I thank Madam Sujatha for providing this opportunity to write several times on this matter. I am closing this matter with this lengthy comment and I hope others agree, as each of us has ones own opinion and we should always respect the other's opinion. Bye for now.

Srinivas Blogworld said...

సుజాత గారూ,

Thank you for introducing a good book. I could not get the telugu version, but could find the original 'Overthrow' online.

నేను ఈ మధ్యనే మీ బ్లాగు చదవటం మొదలుపెట్టాను.. 'స్వేఛ్ఛగా..సరదాగా..సూటిగా..' చెప్తున్న మీ 'మనసులో మాట ' చాలా బాగుంది. మీ అభిప్రాయాలు, ఆలోచనలు, అనుభవాలు, చిత్ర/రచనా విశ్లేషణలు & వాటిని అందరితో పంచుకునే తీరు బాగున్నాయి. Thank you!!

మేము ఉండేచోట తెలుగు పుస్తకాలు దొరకవు, ఆన్ లైన్ లింకులు, కినిగె.కాం వంటివే శరణ్యం . రంగనాయకమ్మగారి రచనల (original ones, అనువాదాలు/విశ్లేషణలు కాదు) కోసం కొన్నిరోజులుగా ప్రయత్నిస్తున్నాను, ఇంతవరకు దొరకలేదు. మీకు తెలిసిన సైట్లు, లింకులు ఉంటే చెప్తారా??

--శ్రీనివాస్

శ్రీనివాస్ said...

నా బ్లాగుని అడ్వర్టైజ్ చేసుకోవటం కాదు కానీ ఇది మీకు ఇంటరెస్టింగ్ గా అనిపిస్తుందేమో చూడండి, కొంచెం relevant కాబట్టి! :-)

http://srinivasblogworld.blogspot.com/2013/03/blog-post.html

"పెద్దన్నయ్య: ఒక సంఘటన, కొన్ని ప్రశ్నలు"

Post a Comment