September 23, 2009

నా చందమామ....!

ఎన్ని పత్రికలు చదివినా చందమామతో ఉన్న అనుబంధం ఎప్పటికీ మాసిపోనిది, మరపురానిది అనిపిస్తుంది. ఎందుకంటే అది పిల్లలకే పరిమితమైన పత్రిక అని ఎప్పుడూ అనుకోను. ఏడేళ్ళ వయసులో ఎంత ఉత్సాహంతో చందమామ కోసం ఎదురు చూశానో, ఎంత ఇష్టంగా చదివానో ఈనాటికీ అదే ఉత్సాహంతో ఎదురు చూసి, అంతకు మించిన ఇష్టంతో చదువుతాను. అటువంటి చందమామతో మీ జ్ఞాపకాలేమిటి అని ఎవరైనా అడగాలే కానీ ఎగిరి గంతేసి మరీ చెప్పనా! అందుకే ఆన్ లైన్ చందమామ కోసం జ్ఞాపకాలు రాయమని రాజశేఖర్ రాజు గారు అడగ్గానే రాసి పంపాను. !  చందమామ పత్రికను తల్చుకోవడమంటే చుక్కల తీరంలో, వెన్నెల దారుల్లో రెక్కల గుర్రం ఎక్కి అందమైన బాల్యం లోకి పరుగులు తీయడమే! నా చందమామ జ్ఞాపకాలు ఇక్కడ ....!.

అక్కడ,  ఫొటోలో ఉన్నది నా చందమామలతో మా పాప సంకీర్తన.

20 comments:

sunita said...

paapa muddugaa undi.

నీహారిక said...

సుజాత గారు,
మీ పాప ముద్దుగా ఉంది.కళ్ళు భలే sharp గా ఉన్నాయి.చందమామ విషయంలో కూడా నేను మీతొ ఏకీభవిస్తున్నాను.పిచాచాలు డబ్బు ఇవ్వడమేమిటండీ,మన sharemarket కూడా ఒక పిచాచం లాంటిదే ఏదో ఒకరోజు మనకు డబ్బులు ఇచ్చేస్తుందిలెండి,దాంతో రత్నాలు రాసులు కొనేసుకుందాం.ఏమంటారు?

శేఖర్ పెద్దగోపు said...

బాగున్నాయి చందమామతో మీ అనుబందం కబుర్లు...నిజంగానే చందమామ గుర్తొచ్చినప్పుడల్లా అలా అలా వెనక్కి వెళ్ళిపోవలసిందే ఎవరైనా...
అలక పాన్పు ఎక్కిన మీ ఇంటి సామ్రాజ్యపు యువరాణి 'సంకీర్తన', చందమామ పుస్తకాలతో ఫోటో అనగానే అలక వదిలినట్టుందే!!

kanthisena said...

సుజాతగారూ, ఎంత చక్కటి అభివ్యక్తీకరణ మీది. మీ చందమామ జ్ఞాపకాలుపై మీరు ఇక్కడ చేసిన చిన్న పరిచయం కూడా ఎంత కవితాత్మకంగా, రసరమ్యంగా రూపొందిందో కదా..!

"చందమామ పత్రికను తల్చుకోవడమంటే చుక్కల తీరంలో, వెన్నెల దారుల్లో రెక్కల గుర్రం ఎక్కి అందమైన బాల్యం లోకి పరుగులు తీయడమే!"

అబ్బా గుండె పట్టేస్తోంది చదువుతుంటేనే... నా జీవితం తొలి పదిహేనేళ్ల బాల్యం నాకివ్వండి అని తిరుపతిలో మాకు తెలిసిన అమ్మ ప్రాధేయపడటం గుర్తుస్తోంది ఈ వాక్యం చదువుతుంటే... అభినందనలు.

మీ చందమామ జ్ఞాపకాలు ఇంతటితో ముగియలేదని గుర్తుపెట్టుకోండి. శివరాం ప్రసాద్ గారిలాగా, మీకు నచ్చిన అలనాటి చందమామ కథలు, సీరియళ్లు గురించి చిన్న పరిచయం చేయండి మీ బ్లాగులో.

చందమామకు మీరు చేసే సహాయంలో ఇదొక గొప్ప సహాయం అనుకోండి. ఆన్‌లైన్ కథలమీద కూడా మీరు పరిచయం చేయవచ్చు. మీకు తీరిక సమయంలోనే ఈ పని చేయండి. మీ ప్రయత్నం చక్కగా ఫలిస్తుందని నా హామీ...

సుజాత వేల్పూరి said...

సునీత గారు,థాంక్యూ!
"పాప ముద్దుగా ఉంది"..అంటే నా టపా బాగాలేదనేగా? ఇలా అయితే నేను అలిగేస్తాను మరి!:-)

నీహారిక,
థాంక్యూ! భలే చెప్పారు! షేర్ మార్కెట్ పిశాచం అయితే అప్పుడప్పుడు మన డబ్బులు మాయం కూడా చేస్తుంది కదా!

శేఖర్ గారు,
ఆ పోజివ్వడానికి ఎన్ని తిప్పలు పెట్టిందో తల్చుకుంటే ఒళ్ళు మండిపోతోందండి!

రాజశేఖర్ గారు,
ధన్యవాదాలు! అన్నట్లు పాత చందమామల్లో సగం దొరికాయి.మీకు వివరంగా మెయిల్ చేస్తాను.

Srujana Ramanujan said...

ఆ పాప మీ అమ్మాయా? చాలా ముద్దుగా ఉంది. హత్తుకునేలా రాశారు. నాకా ఙ్ఞాపకాలు తక్కువే.

రవి said...

చందమామతో అనుభవాలు పంచుకోవడం ఓ కమ్మని అనుభూతి. ఆ అనుభూతి మీ సొంతమైనందుకు, మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.

మీ పాపాయి తన పేరుకు తగినంత అందంగా,ముద్దుగా ఉంది.

వేణు said...

చందమామ పత్రికను తల్చుకోవడం గురించి మీరు రాసింది చదువుతుంటే (చుక్కల తీరంలో, వెన్నెల దారుల్లో...) బాల్యాన్ని ప్రేమించే ఎవరికైనా చక్కని అనుభూతి కలుగుతుంది. మీ జ్ఞాపకాలు హృద్యంగా, ఆత్మీయంగా ఉన్నాయి!

వేణూశ్రీకాంత్ said...

"చందమామ పత్రికను తల్చుకోవడమంటే చుక్కల తీరంలో, వెన్నెల దారుల్లో రెక్కల గుర్రం ఎక్కి అందమైన బాల్యం లోకి పరుగులు తీయడమే!"

చాలా బాగా చెప్పారు. వ్యాసం బాగుంది.

సంకీర్తన పేరూ, పాపా ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు అందం లో :-)

మరువం ఉష said...

కాసేపు అలా కళ్ళు మూసుకుని ఆ రోజుల జ్ఞాపకాల్లో మునిగిపోయాను. చందమామని కిటికిలోంచి చూస్తూ కూర్చున్నంత హాయి మీ టపా, ఆ ఆర్టికిల్ చదువుతుంటే... I used to read chandmama for quite some years even when in college.

సుజాత వేల్పూరి said...

సృజనా,
థాంక్యూ! నా చందమామ జ్ఞాపకాల రోజుల్లో నువ్వు జస్ట్ అప్పుడే పుట్టి ఉంటావు!:-)

మీ జెనరేషన్ లో సీరియస్ గా చందమామలు చదివే వాళ్ళు తక్కువే అని చెప్పొచ్చు!

రవి,వేణు,వేణూ శ్రీకాంత్,ఉష గార్లు,

ధన్యవాదాలు.

Unknown said...

చందమామ తో పాటు బాలమిత్ర కుడా వుండేది అప్పట్లో సుజాత గారు మీరు చదివేవరో లేదో , చందమామ నేను బాగా like చెసినా, బాలమిత్ర పోటిలలో నా కెన్నో సార్లు బహుమతులు వచ్చి నా పేరు అచ్చు లో చూసుకుని బాలమిత్ర మీద అనుభందం పెరిగింది . చందమామ ఫోటో వ్యాఖ్యల లో నేను ఇప్పటికి మర్చి పోలేని బహుమతి వచ్చిన వ్యాక్య రోడ్ మీద బ్యాండ్ మేళం వాళ్ళు వాయించుకుంటూ వెళ్తున్న ఫోటో .దాని పక్కనే trafiic constable కూడలి లో నిలబడి వున్న ఫోటో .దానికి'' సరిగమ పదని '', ''సరిగా పదమని ''అన్న వ్యాక్య కి బహుమతి వచ్చింది .అలాగే కొత్త బుక్ వాసనా చాల బావుండేది .ఏవి నిరుడు కురిసిన హిమసముహాలు అనుకోవడమే ఇప్పుడు .

గీతాచార్య said...

ఏమన్నారేమన్నారు? చమ్దమామా? బాబూ చిట్టీ.....! పిపిపిపిపీఈఈఈఈఈఈఈఈఈఈఈఈఈఈఈఈఈ :-D

బాగా వ్రాశారని చెప్పటం సో రొటీన్. అయినా సరే అవే మాటలు.

Dhanaraj Manmadha said...

చందమామలని మీరూ, ఉక్రేనియన్ జానపదాలని మరొకరూ, నొప్పిదాక్టరు, పంచతంత్రాలూ, బాలజ్యోతులూ, అవీ, ఇవీ అని చెప్పి నాలాంటోళ్ళ ప్రాణాలు తీయందే మీలాంటోళ్ళకి నిద్రకూడా పట్టదేమో మరి (ఆశ పెడుతున్నారు. ఆశకురుపులొస్తాయి మీలాంటోళ్ళకి. జాగ్రత్త!)!

బాగుందండీ. చదవాలనిపించేలా రాశారు. ఇప్పటికిప్పుడే. నాకా అవకాశం లేకపోయింది కానీ ఆ కథల్ని మరోరకంగా చెప్పి పుణ్యం కట్టుకున్న వాళ్ళున్నారు.

Dhanaraj Manmadha said...

మీ టపా బాలేదని కొత్తగా చెప్పక్కర్లేదు కదా! సారీ టైపో. నిద్రమత్తులో ఏదో కొట్టేస్తున్నాను. మీ టపాలు బాగుంటాయని అందరికీ తెలుసు. మరి కొత్తగా చెప్పేదేముంది?

సుజాత వేల్పూరి said...

geetaachaarya,
thank you!

రవి గారు,
మీరు రాసిన వ్యాఖ్య నిజంగా చాలా భావయుక్తంగా ఉందండీ! పైగా అంత చిన్న వయసులో! ఆ జ్ఞాపకాలన్నీ నిరుడు కురిసిన హిమ సమూహాలే!

ధనరాజ్,
మీరు కొంచెం మీ కామెంట్స్ పగలు వీలు చూసుకుని రాస్తుండండి ప్లీజ్ ! బాలేదనైనా సరే! :-)))

మాలతి said...

:)మరోసారి సంకీర్తనని చూడ్డం నాకు బాగుంది. మిగితా విషయాలు మామూలే ..

అడ్డ గాడిద (The Ass) said...

Nice. :-)

Veeravadhani MN said...

సుజాతగారు! నేను మొదటిసారి మీబ్లాగ్ విజిట్ చేసాను. నిజానికి నాకు అంతగా పుస్తకాలమీద ఆసక్తి, వాటిని చదివే ఓపికా, తీరికా లేవు. ఐతే, నా కామెంట్లో విషయం అది కాదు.
మీకులాగే, మా తల్లిగారికి కూడా పుస్తక పఠనం, ముఖ్యంగా కథాపఠనం అంటే అమితమైన ఆసక్తి. ఎప్పుడో 80ల్లో చతురలోనో లేక విపులలోనో చదివిన రెడ్డి స్వరాజ్య లక్ష్మిగారి చేజారి(ర)ని స్వర్గం అనే నవలను చేజార్చుకుని ఈనాటికీ దానికోసం ఆమె వెదుకుతూనే ఉన్నారు. ఇదే ఆమెకు పుస్తకాలపై గల ప్రేమను తెలియజేస్తుంది.
మీకు పుస్తకాలపై, పుస్తక పఠనంపై గల ఆసక్తికి ఆమె ఎంతగానో ముచ్చటపడి మీకు అభినందనలు తెలియజేసారు.

Sky said...

""చందమామ పత్రికను తల్చుకోవడమంటే చుక్కల తీరంలో, వెన్నెల దారుల్లో రెక్కల గుర్రం ఎక్కి అందమైన బాల్యం లోకి పరుగులు తీయడమే!"" అక్షర సత్యం. బంగారు తల్లిలా ఉంది మీ పాప.

Post a Comment