December 24, 2009

విజ్ఞానం......కొంటారా కేజీల్లో?

మొన్నొక రోజు బుక్ ఫేర్ కి వెళ్లానా పుస్తకాలు కొనుక్కుందామని..! అక్కడ ఒక స్టాల్ ముందు ఈ ఫ్లెక్సీ వేలాడదీసి ఉంది. పెద్ద బాల శిక్ష గురించిన ఒక ప్రకటన!






ప్రకటనేమో అచ్చతెలుగు పెద్ద బాల శిక్షకి! అది తెలుగు వారి "మెగా" పెద్ద బాల శిక్ష అట.



అది పక్కన పెడితే కేవలం Rs.116 లకే "ఒకటిన్నర కేజీల విజ్ఞానం" అట! కవర్ పేజీ మీద ఉన్న సరస్వతి సిగ్గుతో తల దించుకోవాలన్నమాట ఈ ఒక్క మాటకీ!



పుస్తకం ఒకటిన్నర కేజీల బరువుందనీ, అంటే ఎక్కువ పేజీలున్నాయనీ చెప్పాలనీ ప్రకాశకుల అభిప్రాయం అనుకుంటాను!



అందువల్ల అత్యుత్సాహంతో అందులో ఉన్న విజ్ఞానమంతా కూడా కలిపి కేవలం ఒకటిన్నర కేజీలు "మాత్రమే"నని వంకాయల లెక్కో ఉల్లిపాయల లెక్కో వేసి తేల్చారు.



విజ్ఞానం ! కేజీల్లెక్కన!




సిగ్గేస్తోంది తెలుగు పుస్తకాలమ్మే వారి తెలుగు పరిజ్ఞానానికి, సృజనాత్మక ఆలోచనలకీ!

గమనిక: ఫొటో బాగా రాలేదు కదూ! తీసింది నేను కాదులెండి! :-))

18 comments:

వేణు said...

పుస్తకమే ‘మెగా’ పెద్ద బాలశిక్ష ! మరి ప్రకటన కూడా అదే స్థాయిలో లేకపోతే ఏం బావుంటుంది చెప్పండి? :)

మురళి said...

సృజనాత్మకత కొత్త పుంతలు తొక్కిందన్న మాట!!

Anonymous said...

ఇంకా నయం కేజీ చికెన్ కంటే చీపు, రెండుకేజీల పంచదారకంటే చవక , డజన్ ఏపిల్స్ ధరకే కేజీన్నర విజ్ఞానం అననందుకు సంతోషించాలేమో. కాలాన్ని బట్టి పోవాలనుకున్నరో ఏమో.....ఈ బోర్డు కాన్సెప్ట్ స్కూల్స్ నడిపే వాళ్ళ కంటపడితే ఇంకేమన్నా వుందా ! రేపట్నించీ పిల్లలకి వాళ్ళందించే విజ్ఞానానికి కేజీల్లెక్కన ఫీజులు కట్టమంటే ఇంకేమన్నా వుందా!

శేఖర్ పెద్దగోపు said...

:-)

నేను చూశానండీ అక్కడ...ఈ కాలంలో కూడ పెద్దబాలశిక్ష తో తెలుగు నేర్పించే తల్లిదండ్రులు ఇంకా ఉన్నారా అని డౌట్ కూడా వచ్చింది నాకు.

నేను ఒక స్టాల్లో పరిశీలించినది ఏంటంటే ఎక్కువ మంది "అరగంటలో అరకోటి సంపాదించటం ఎలా?"
"తొడకొట్టకుండానే ఈగలను తోలటం ఎలా?" లాంటి పుస్తకాలను కొనటంలో చూపిస్తున్న ఉత్సాహం ఇలాంటి పుస్తకాలు కొనటంలో చూపించటం లేదనిపించింది. మరి ఇలాంటి వాటిని ప్రమోట్ చేసుకోడానికి ఈ మాత్రం వెర్రిపోకడ అనుసరించటం వాళ్ళకు తప్పలేదేమో...

సుజాత వేల్పూరి said...

శేఖర్ గారు,
మంచిపుస్తకం వాళ్ళ స్టాల్ చూశారా మీరు? ఎంతమంది మంచి తల్లిదండ్రులో అక్కడ , పిల్లలకు పుస్తకాలు కొనడానికి! ఈ అరకోట్లు సంపాదించడాలూ, ఈగల్ని తోలడాలూ అయితే ఫుట్ పాత్ మీదే దొరుకుతాయిగా! 999 విజిటేరియన్(సరిగ్గానే చదివారు..వెజిటేరియన్ కాదు) వంటకాలు,1001 నాన్ విజిటేరియన్ వంటకాలూ వంటి పుస్తకాలు కూడా బాగానే పోతున్నాయటండోయ్!

పెద్ద బాల శిఖకు ఈ మధ్య ఆదరణ బాగానే పెరిగింది.

ఒక జెన్యూన్ పుస్తకాన్ని జెన్యూన్ గానే పరిచయం చేస్తే బావుంటుంది కదండీ!

ఆ.సౌమ్య said...

అయ్యో మీరింతవరకు చూడలేదా?
ఆ 'మెగా' పెద్ద బాలశిక్షని చూసి ఎంత నవ్వుకున్నమో మేమంతా. అతి పెద్ద బాలశిక్ష అని రాస్తే సరిపోతుంది కదా !

లోపల విభాగాలని చూసారా?
ఒకప్పుడు పెద్దబాలశిక్ష అంటే తెలుగు నేర్చుకోవడానికి ఉపయోగపడేదిగా ఉండేది, ఇప్పుడు అది జనరల్ నాలెడ్జి పుస్తకమయిపోయింది. దానిలో చర్చించని విషయం లేదు. ఇంటర్ నెట్, గూగల్, విండోస్, మైక్రోసాఫ్ట్ ఒకటేమిటి అన్నీ ఉన్నాయి అందులో. ఇంకా అద్భుతమైనది ఏంటంటే, పెళ్ళి ఎలా చేసుకోవాలి, ఏ మతానికి సంబధించిన పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి, వాటి వివరణ, టీకాతాత్పర్యాలు ఉన్నాయి. పెద్ద బాలశిక్ష చదువుకునే చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళ గురించి వివరణ అవసరమా? లేకపొతే పెద్దబాలశిక్ష అంటే పెద్దలకు బాల్య విషయాలు నేర్పేది అని అర్థమేమైనా మార్చారా అని డౌటు వచ్చింది నాకు.

నాకు ఆ "మెగా" బాలశిక్షను చూసిన తరువత మతి పోయింది. బాలశిక్ష అంటూ భలే శిక్ష వేసారే అనుకున్నాను.

ఇప్పటి పిల్లలు పుస్తకభారాన్ని కేజీలలెక్కన వీపున మోస్తున్నారు కదండీ అందుకే పెద్ద మెగా బాలశిక్షనికూడా కేజీల లెక్కన చెప్తే పిల్లలకి, తల్లిదండ్రులకి ఎక్కుతుంది అనుకున్నారేమొ :D

సౌమ్య

సుజాత వేల్పూరి said...

సౌమ్య గారూ,
నిజమా! నా దగ్గర ఎప్పుడో తాతల నాటి పాత బాలశిక్షే ఉంది ముందూ వెనకా పేజీలు కోల్పోయి! గూగుల్, మైక్రో సాఫ్ట్ గురించి కూడా ఉందా? ఎక్స్ లెంట్! అయితే మా అమ్మాయి కోసం కాదు కానీ నేను కొనుక్కోవాల్సిందే ఈ మెగా బాల శిక్షని! నేనసలే టెక్నికల్లీ వీక్!

ఏ పెళ్ళి ఎలా చేసుకోవాలో తెలుసుకునేందుకు మా పాపక్కూడా పనికొస్తుందేమో చూడాలి. :-)) (కనీసం 20 ఏళ్ళు టైముందనుకోండి)

మొత్తానికి ఇది మెగా శిక్షే అన్నమాట.

Ravi said...

యధా రాజా తథా ప్రజ
యధా ప్రజా తథా వర్తక: (ఇది నా సొంత కవిత్వం :) )

ఇప్పటి ప్రజలు అలాంటి ప్రకటనలకే ఆకర్షితులౌతున్నారని అలా వేశారేమో... నిజమైన సృజనాత్మకత చూపిస్తే అందరికీ అర్థం కాదని కూడా ఇలా చేసి ఉండవచ్చు.

ఆ.సౌమ్య said...

అవునండీ సుజాతగారు, నాకు ఆ మెగా బాలశిక్షని కళ్ళారా, సంపూర్ణంగా చూసే గతి ఓ ఆరు నెలలక్రితం పట్టింది. ఆహా, మీరు టెక్నికల్లీ వీకు అయితే తప్పక పెద్ద బాల శిక్ష చదవండి...సారీ సారీ 'మెగా' పెద్ద బాల శిక్ష చదవండి. వీవెనుడి టెక్కులు, నిక్కులు కూడా సరితూగవు దానిముందు :D

మీ అమ్మయికి ఓ 20 యేళ్లు పోయాక ఖచ్చితంగా పనికి వస్తుంది 'బాల' శిక్ష :P పెళ్ళి మంత్రాలకి అర్థాలు కూడా ఉన్నయండోయ్ అందులో...అన్ని చదివాను నేను తీరి కూర్చుని.

శేఖర్ పెద్దగోపు said...

సుజాత గారు,
అవునా? నేను కొన్ని స్టాల్స్ లో జనాలు విపరీతంగా ఉండటం వల్ల చూడలేదండి.
పెద్ద బాల శిక్షకి ఆదరణ పెరిగిందంటే సంతోషంగా ఉంది.
కానీ అంతలోనే సౌమ్యా గారి వ్యాఖ్య చదివాక భయం వేస్తుంది..ఆ పుస్తకాన్ని చూడాలంటే...
ఒకప్పుడు మా ఇంట్లో దాన్ని దేవుని పుస్తకాలతో కలిపి ఉంచేది అమ్మ.

sunita said...

పెద్ద బాల శిక్ష చదివించేవాళ్ళం ఇంకా ఉన్నామండి. మా పెద్ద పాప కోసం, మా చెల్లి వాళ్ళ పాప కోసం కొన్నాము. ఇంత హై టెక్కు అప్పుడు లేదుగానీ ఓ వీశెడు సైజు ఓ పదిరకాలు పై కామెంటుల్లో వర్ణించినట్లే ఇచ్చ్హాడు షాప్ అతను. నేను ఓపిగ్గా తిరగేసి కొన్నాను.ఐతే మా పిల్లలు అందులో నేర్చుకున్నది ఎంత? అని మాత్రం అడక్కండి.

వేణూశ్రీకాంత్ said...

ఆహా ఒకటిన్నరకేజీల విఙ్ఞానం చూశాక ఇక ఏంమాట్లాడతాం

Unknown said...

very shame

Viswanath said...

మన వెలగా వెంకటప్పయ్య గారు విజ్ఞానాన్ని కిలో లెక్కన అమ్ముతున్నారన్నమాట. ఈయన కోవలోకే మరొక వ్యక్తి వస్తాడండోయ్. గాజుల సత్యనారాయణ గారు. ఇద్దరి పుస్తకాలూ కలిపి బుర్రకి కొట్టుకోవడానికి బాగా పనికివస్తాయి. అవి కొని పడేయడం, చిన్న పిల్లల మీద రుద్దడం చాలా చోట్ల చూశాను.

అడ్డ గాడిద (The Ass) said...

మనోళ్ళకి ఙ్ఞానమున్తెనె కద. విఙ్ఞానమ్ గురిన్చి తెలిసేది. హహహ. ఇంత మందిక్కడ కామెంటు చేశారు కానీ చూసినప్పుడు పట్టించుకునుంటారా అని నా అనుమానమ్. ఉన్నమాటన్నాను. ఉలుక్కోకండబ్బాయిలూ. అమ్మాయిలూ.
ఫోటో బాగా వచ్చింది. ఎవరండి పాపమ్ ఆ దురదృష్టవంతుళు

వేణు said...

‘పెద్ద బాలశిక్ష’కు పెద్ద చరిత్రే ఉంది. ‘గోపాల్ పెద్ద బాలశిక్ష’ అనే పుస్తకం 1915 నుంచీ ప్రచురితమవుతోంది.

ఎవరు ప్రచురించినా, ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ వచ్చారు!

ఈ పుస్తకంలో మంచి విషయాలతో పాటు శకునాలు, ‘బల్లి పడే శాస్త్రం’... ఇలా మూఢ నమ్మకాల సమాచారమూ ఉంటుంది. దైవప్రార్థనలూ, సుప్రభాతాలూ కూడా ఉంటాయి. ఇప్పుడు వాటితో పాటు గూగుల్, విండోస్, మైక్రోసాఫ్ట్ వివరాలు చేర్చాక .. ఇయర్ బుక్ కంటే ఎక్కువా, ఎన్ సైక్లోపీడియా కంటే తక్కువా అయిపోయి... ‘మెగా’ పెద్ద బాలశిక్షగా మారిందన్నమాట!:)

హర్షోల్లాసం said...

ఏమండోయ్ సుజాత గారుఉఉఉఉఉఉఉఉ,
మిమ్మలని innaltiki chusee bhagyuam kaligimcharu.ఈ రోజు ఈనాడు దినపత్రికని చూసారా?
మీ ఫొటో వుందండొయ్(e -తెలుగు)

శివ చెరువు said...

నేనూ వచ్చాను అక్కడికి కాని ఈ ఫ్లెక్ష్ ని అంత క్షుణ్ణం గా చూడలేదు సుమీ.. ఎంత తప్పిదం..!

Post a Comment