January 2, 2010

వనవాసి...పరిచయం "పుస్తకం" లో!

మంచి పుస్తకం ఒకటి నచ్చితే దాన్ని నలుగురితో పంచుకోవడం నాకిష్టం! బ్లాగులోనే కాదు, ఇతరత్రా కూడా నాలాగే పుస్తకాలంటే ఇష్టపడే మిత్రుల్ని పట్టుకుని వాళ్లతో చెప్పక మానను. అందుకే నా బ్లాగులో "పుస్తక పరిచయాలే" తప్ప సమీక్షలుండవు.




పుస్తకం.నెట్ మొదలైన ఏడాదికి ఆ వెబ్ సైట్ కి ఒక పరిచయ వ్యాసం పంపాను. ఈ ఏడాదిలో మొదటి టపా కాబట్టీ, "పుస్తకం" స్థాయినీ గుర్తు పెట్టుకుని ఒక మంచి పుస్తకం గురించి రాయాలని నిర్ణయించుకుని ఎప్పుడో దాదాపు అర్థ శతాబ్దం క్రితం అచ్చయిన భిభూతి భూషణ్ వంద్యోపాధ్యాయ నవల "వనవాసి" గురించి రాశాను. ఈ మధ్యే ఈ మంచి పుస్తకాన్ని హైదరాబాదు బుక్ ట్రస్ట్ అందుబాటులోకి తెచ్చింది.



అందరూ చదవాల్సిన మంచి పుస్తకం. అతి మంచి పుస్తకం! మరపురాని పుస్తకం!



ఈ పుస్తకం పై "పుస్తకం" లో నేను రాసిన పరిచయం. చదివి ఎలా వుందో చెప్పండి.దయచేసి మీ అభిప్రాయాలను అక్కడే రాయండి. వ్యాసం, అభిప్రాయాలు ఒక్కచోటే ఉంటే బావుంటుంది ! 


కొత్త సంవత్సరంలో నా రాతలు ఒక మంచి పుస్తక పరిచయంతో మొదలవడానికి, అది పుస్తకం ద్వారా సాధ్యమవడానికి కారణమయిన పూర్ణిమ, సౌమ్యలకు థాంక్యూలు!

5 comments:

చంద్ర మోహన్ said...

పుస్తక రచయిత పేరులో అవసరానికన్న వత్తులు ఎక్కువ పెట్టేశారు. సరిచేయండి.

సుజాత వేల్పూరి said...

చంద్రమోహన్ గారూ,
థాంక్యూ వెరీమచ్! పుస్తకం నిర్వాహకులకు తెలియజేశాను. సరి చేస్తారు బహుశా!ఇక్కడ సరి చేశాను. కొత్త పుస్తకం మీద "బంధోపాధ్యాయ" అని ఉంది. ఏది కరెక్టంటారు? వంద్యోపాధ్యాయా..లేక బంధోపాధ్యాయా?

కెక్యూబ్ వర్మ said...

మంచి పరిచయం. ధన్యవాదాలు.

Vasu said...

మీ టపాలలో ఏదో మహత్తు ఉంది సుజాత గారు. ఆద్యంతం సునాయాసంగా చదివిస్తారు. మీరు కథలు, నవలలూ ఏమన్నా రాసారా ??

చంద్ర మోహన్ said...

'వంద్యోపాధ్యాయ' కరెక్టు. ఐతో వంగ భాషలో "వ" పలకదు, 'య'వత్తుకూడా కష్టమే. అందుకని వారు 'బంద్యోపాధ్యాయ' లేక 'బందోపాధ్యాయ' అని పలుకుతారు. 'బెనర్జీ' అని మరో మాటకూడా ఉందిగానీ, శిష్ట బెంగాలీలలు ఆ మాటంటే చిరాకు.

Post a Comment