May 19, 2010

ఇక్కడ ఎవరి ప్రాణాలు వాళ్ళు రక్షించుకోవాల్సిందే!

భయం భయం! అనుక్షణం భయంతో బతకడం ఏం బావుంటుంది? తిండి నీళ్ళు లేకపోయినా బతకొచ్చు గాని మనశ్శాంతి లేకుండా ఎలా?

షాపింగ్ మాల్స్ లో మల్టీ ప్లెక్సుల్లో లోపలికి వెళ్లగానే నిలేసి ఒళ్ళంతా తడిమి రక్షణ పరీక్షలు చేయడం మొదలైన రోజుల్లో నేను చాలా అవమాన పడేదాన్ని!"నాకా? నాకా ఈ పరీక్షలు!ఈ దేశ పౌరురాలిని, నన్నా, మీరు అనుమానిస్తున్నది?"అని కుమిలేదాన్ని!తర్వాత కన్వీనియెంట్ గా అలవాటు పడిపోయాను.




లోపల అడుగు పెడుతుండగానే మనల్ని ఎక్స్ రే కళ్ళతో అనుమానంగా చూస్తూ

"నువ్వు తీవ్రవాదివా? ఏదీ నీ బాగ్ లో ఏముందో చూపించు! ఆయుధాలేమీ తేలేదు కదా! కొంపదీసి నీ తోటి పౌరుల్ని చంపే ప్లానేదీ లేదు కదా!నీ మొహం చూస్తే అలాగే ఉంది గానీ కాస్త పక్కకి రా! నీ సంగతేంటో చూడాలి"  "అని షాపింగ్ మాల్స్ వద్దా, సరదాగా సినిమా చూద్దామని వెళితే అక్కడా,చివరికి బియ్యం, కందిపప్పు కొందామని వెళితే కూడా నిలువెల్లా పరీక్షలు చేసే పరిస్థితికి హైదరాబాదీయులు (మిగతా నగరాల్లో ఉన్నా, ఇంత తీవ్రంగా భయోత్పాత వాతావరణం ఉండదని నా విశ్వాసం)బాగా అలవాటు పడిపోయారు.



పోనీ అవేమన్నా సక్రమంగా జరుగుతాయా అంటే అదీ లేదు. జీవీకే వన్ వంటి మాల్ వద్ద కూడా మహిళలని చెక్ చేసే మహిళా సెక్యూరిటీ గార్డులు చాలా అలసత్వంతో ఉంటారు. ఇద్దరు ఉంటారు కాబట్టి సమకాలీన రాజకీయాల గురించో,వాళ్ల వీధిలో మంజీరా నీళ్ళెప్పుడొస్తాయో మాట్లాడుకుంటూ బాగ్ తెరిచి చూపిస్తున్నా, "సర్లే పదండి"అని పంపేస్తారు. రద్దీగా ఉంటే కొందరు చెకింగ్ లేకుండానే లోపలికి వెళ్ళిపోతుంటారు.

కొన్ని చోట్ల ఈ మాత్రం కూడా పట్టించుకోరు. బంజారా హిల్స్ లోని సినీమాక్స్ లోకి నాలుగైదు సార్లు నన్ను చెక్ చేయకుండానే పంపేశారు. కోకొల్లలు గా ఉన్న ఫలానా ఫలానా బ్రదర్స్ అయితే అసలు పట్టించుకోరు.వాళ్ళ సెక్యూరిటీ అంతా మాల్ లో సరుకు బయటికి పోకుండా ఉండేందుకే తప్ప, లోపలికి ఏం వెళుతున్నాయో అనే దాని మీద కాదు. అది ఈ మధ్యనే ఒక మాల్ లోకి పోలీసులు విజయవంతంగా లోపలికి పేలుడు పదార్థోలో ఆయుధాలో పంపడంతో రుజువైంది.

పరిస్థితి ఇంతగా విషమించి, పక్కన పోయే ప్రతి వాడినీ  "ఎవరు నువ్వు?కొంపదీసి తీవ్రవాదివా" అని అనుమానిస్తూ తొలగిపోయే రోజులొచ్చాయి!
అసలు ........
విపరీతమైన వాహనాల రద్దీ, ట్రాఫిక్ సమస్యలు, జన సమ్మర్థం ఉన్న చోట గ్రోసరీ సామాన్లు సైతం అమ్మే షాపింగ్ మాల్స్ కి అనుమతి ఇవ్వ కూడదు.

ఇక్కడ పార్కింగ్ దొరకదు,
వాలెట్ పార్కింగ్ ఉండదు,
పార్కింగ్ లో సరైన పర్యవేక్షణ గానీ, ఒక గార్డు కానీ ఉండడు.
చుట్టూ బోల్డన్ని షాపులు.
పైగా వీళ్ళు నెలకోసారి "సబ్ సే సస్తా వీక్" లాంటి స్కీములు, డిసెంబర్ నెలాఖరులో  "క్లియరెన్స్ సేలు"వగైరాలు ప్రకటిస్తుంటారు.

దానితో జనం విరగబడి వస్తారు.అలాంటపుడు ఏ బాంబైనా పేలితే? పోయిన ప్రాణాలకు ఎవరు జవాబుదారీ?

అంతా జరిగాక, ఆ భవనానికి అసలు అనుమతే లేదనీ,పార్కింగ్ తగినంతగా లేదనీ, ఏవేవో తవ్వి తీస్తారు, చేతులు కాలాక!

లేటెస్ట్ గా శ్రీమాన్ వికారుద్దీన్ గారి చొరవతో జరిగిందని భావిస్తున్న కానిస్టేబుల్ హత్య తర్వాత ఇక పోలీసుల హడావుడి చెప్పనలవి కాదు.

ఇందులో ముఖ్య బాధితులు టూ వీలర్స్, అందునా యువకులు!ఆ బండి నడిపేవాడి వద్ద ఒక బాక్ పాక్ ఉందంటే దాదాపుగా పక్కకి ఈడ్చుకెళ్ళినంత పని చేయడమే! లైసెన్సులూ వగైరాలన్నీ చెక్ చేసి అన్నీ సక్రమంగా ఉంటే పంపిస్తారా అంటే అదీ లేదు! ట్రాఫిక్ వాళ్ళ లాగా డబ్బు వసూలు చేయడం! నిర్లక్ష్య ధోరణిలో మాట్లాడ్డం,ఏకవచనంలో సంబోధించడం,విసురుగా బాగులు లాక్కుని చెక్ చేయడం ఇవన్నీ నిన్న ఒక కూడలిలో రెడ్ సిగ్నల్ వద్ద కారాగినపుడు తీరిగ్గా గమనించాను.


ఇదంతా ఎన్నాళ్ళంటే మరో నాల్రోజులు! ఈ లోపు అందరూ నెమ్మదిగా ఈ విషయాన్ని మర్చిపోతారుగా!మళ్ళీ మామూలే! మళ్ళీ ఏదన్నా హత్యో,బాంబు బెదిరింపులో రాగానే కథ మళ్ళీ మొదలు!
అంత "కాజువల్" గా మొక్కుబడిగా అయిపోయింది వ్యవహారం!

తీవ్రవాదుల  బెదిరింపులు నిత్యజీవితంలో ఒక భాగం అయిపోయినట్టు భయంతో  బతకడం మామూలైపోయింది.
ఎవరన్నా అదేపనిగా మనకేసి చూస్తుంటే భయం, రోడ్డు మీద ఏదన్నా ప్లాస్టిక్ సంచి చూస్తే భయం, నలుగురు ఉన్న చోట నిలబడాలంటే భయం!


వరసగా దాడులు జరుగుతున్నా, ప్రాణాలు గాలి బుడగల్లా పేలిపోతున్నా,  రక్షణ విషయాన్ని ఎందుకు ఎవరూ సీరియస్ గా తీసుకోరంటారు? కానిస్టేబుల్ హత్య తర్వాత అందుబాటులొ ఉన్న ఒక పోలీసు అధికారిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు.

అయితే ఇహ ఎవరి ప్రాణాల్ని వారు రక్షించుకోవలసిందేనా?
ఎన్ని సంఘటనలు వరసగా జరిగినా మనం వాటినుంచి ఏమీ నేర్చుకోలేమా? 9/11 దుర్ఘటన తర్వాత అమెరికా లొ ఒక్క తీవ్రవాద చర్యా జరిగినట్లు నాకు తెలీదు!

మనకెందుకు ఈ అలసత్వం? వరుసగా ఎన్ని దుర్ఘటనలు జరిగినా(అవి చేసింది తీవ్రవాదులా, మావోయిస్టులా అనేదిపక్కన పెట్టండి! ఏ రాయి అయితేనేం జనం పళ్ళు రాలగొట్టుకోడానికి?)ఎంత రక్తం పారినా,మన కేంద్ర,రాష్ట్ర హోమ్ మంత్రులకేం పట్టదు.

ఎంతటి దుర్ఘటన జరిగిందని తెల్సినా ఏ మాత్రం గాభరా పడకుండా,షాక్ తినకుండా ఏ భావమూ ప్రకటించకుండా,అతి నెమ్మదిగా స్పందించగలిగే హోమ్ మంత్రిని మీరెక్కడైనా చూశారా?..ఇక్కడ తప్ప!

కొన్నేళ్ళ క్రితం వరకూ యుద్ధ వాతారణం ఉన్న హాలీవుడ్ సినిమాల్లో మిడిల్ ఈస్టు దేశాల్లో వాతావరణం చూసి "అబ్బ,ఇలాంటి దేశాల్లో జనం ఎలా బతుకుతారో!అక్కడినుంచి వేరే చోటికి పోవచ్చుగా"అనుకునేదాన్ని!

ఈ మధ్య హర్ట్ లాకర్ సినిమా చూసినపుడు ఒకవ్యక్తిని బాంబులతో కట్టిపడేసి పేల్చేసిన దృశ్యం చూసినా పెద్దగా భయం వేయకపోగా ఇలాంటివి మనదేశంలోకూడా మొదలవుతాయేమో అని సందేహం కూడా కల్గింది.


 ఇక్కడ ఎవరి ప్రాణాలు వాళ్ళు రక్షించుకోవాల్సిందే! ప్రభుత్వం ఉందో లేదో తెలీని చోట వేరే ఛాయిస్ లేదు.

26 comments:

శేఖర్ పెద్దగోపు said...

సుజాత గారు, మన దేశంలో సెక్యూరిటీ ఎవరికైనా ఉంది అని అనుకుంటే అది ఒక్క రాజకీయ నాయకులకు, బడా వ్యాపారవేత్తలకు, సెలబ్రిటీలకు మాత్రమే...లేనోడు ఎవరంటే సామాన్యుడు...ఇక్కడ సామాన్యుడు ప్రాణం ఖరీదు ఓ లక్షో లేక రెండు లక్షలో(ఎక్స్ గ్రేషియా)...ఒకవేళ వాడు పోతే ఖజానాలో ఉన్న డబ్బుల్లో కొంచెం మొహాన కొట్టి చేతులు దులుపుకుంటారు...మళ్ళీ కథ మొదలు...

sphurita mylavarapu said...

ఈ రక్షణ పరీక్షల వల్ల జరగబోయే ఉపద్రవాలని ఎంతవరకూ నిరోధించగలుగుతున్నారు అన్నది పక్కన పెడితే, ఈ పరిణామాల వల్ల పక్క మనిషి ని కూడా నమ్మలేని అబధ్రతా భావం, దానివల్ల నిత్య జీవితం లో కలుగుతున్న అశాంతి మీ బాణీలో చక్కగా వివరించారు.

ఏదైనా మందు మొదటిసారి పని చేసినట్టు, రెండో సారి పని చెయ్యదంటారు. కారణం మన శరీరం లో క్రిములు దానికి అలవాటు పడిపోతాయి. అలాగే మనమూ ఈ భయాలకి, భీభత్సాలకి అలవాటు పడిపోతున్నాం.

sree said...

@sekhar garu,

mana desam lone kaadu andi ee desam lo aina security meeru cheppina vallake vuntundi. Thats how the system is through out the world. Manaku security antara police. This police force works at their best in other countries but not in India. That is the only difference. political leaders are the main reason for this. They recommend some police officers for higher positions and officers who work genuinely were taken off from their roles.

@sujatha garu,

manavallu anni systematic ga arrange chesthe security avasaram ledu. Manavallu antha chethulu kalaka akulu pattukune rakam kada.

శ్రీనివాస్ said...

పల్లెల్లో ఉండే మా జీవనం చాల ప్రశాంతం అనమాట

సుజాత వేల్పూరి said...

స్ఫురితగారు,
నేను చెప్పాలనుకున్న పాయింట్ అదేనండీ! థాంక్యూ

నీహారిక said...

సుజాత గారు,
అంతా బాగానే వ్రాశారు,బాగానే ఉంది,చేవెళ్ళ చెల్లెమ్మని ఏమయినా అనండి నేను ఊరుకుంటాను,కానీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలని అనకండి.ప్రతిదానికి ప్రభుత్వాలననేసి చేతులు దులిపేసుకుందామనుకుంటారు.మీ ఇంటి ప్రక్కన ఎవరుంటున్నారో మీరెపుడైనా ఆరా తీసారా?
తీవ్రవాదులు ఎక్కడనుంచో ఊడిపడరు, మన మధ్యనే ఉంటారు.ఎవరైనా ఎపుడైనా పోలీసులకు సమాచారమిచ్చినట్లు మనం చదివామా?
ఎందుకండీ ప్రభుత్వాన్ని నిందించటం?
వాళ్ళు చేయగలిగినంతా వాళ్ళు చేస్తున్నారు.మన్మోహన్ ని మీరు శంకించలేరు.
ఇంత ఎందుకు,మన దేశ రహస్యాలను పాకిస్థాన్ కి చేరవేసేది ఒక మహిళ అని తెలిసినపుడు మీకేమనిపించింది?

వాత్సల్య said...

26/11 జరిగిన కొద్ది రోజులకి ముంబై ఎయిర్ పోర్ట్ లో జరిగిన సంఘటన గుర్తు వస్తోంది ..అందరినీ లైను లో నిలబెట్టి తనిఖీ చేస్తున్నారు. ఆ తనిఖీలు కూడా తూ తూ మంత్రం గానే మళ్ళీ.

ఇంతలో ఒక పెద్దావిడ బాబూ నేను నిలబడలేను,మా అబ్బాయి ఉన్నాడు బయటకి వెళ్తా అనగానే,చక్కగా కనీసం చెక్ చెయ్యకుండా పంపించేసారు.నిలబడలేము అన్న పెద్ద వాళ్ళని అలా వదిలెయ్యడమేనా చెక్ చెయ్యకుండా..ఆవిడని అనుమానిస్తున్నా అని కాదు కానీ ఏమో ఎవరిని నమ్మగలము చెప్పండి.
అంత పెద్ద గాయం అయిన కొద్ది రోజులకే అంత అలసత్వం ఉంటే,ఇంక ఇప్పుడు సీరియస్ నెస్స్ ఎక్స్ పెక్ట్ చెయ్యడం వేస్ట్.

ముందరే జాగ్రత్త పడేవాళ్ళని ఉత్తములు,పాఠాలు నేర్చుకునే వాళ్ళని మధ్యములు,ఎప్పటికీ నేర్చుకోకుండా అడుగడుగుకీ తప్పు చేసేవారిని మూర్ఖులు అంటారుట.ఇప్పుడు చెప్పండి మన భద్రతా విభాగం దేనికి చెందుతుందో

సుజాత వేల్పూరి said...

నీహారిక,
మీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలే ఆశిస్తాను నేను!బావుంది!

తీవ్రవాదులు మన మధ్యనే ఉన్నా, వాళ్ళను గుర్తించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారుగా? ఉన్నారని తెలిస్తే పోలీసులకు ఆ మాత్రం సమాచారం అందించలేమంటారా?
మరి మన మధ్య లేని తీవ్రవాదులు బయటి నుంచి "లాహిరి లాహిరి 'అని పాడుకుంటూ సముద్రంలోంచి వచ్చి పిట్టల్ని కాల్చినట్లు వందల కొద్దీ జనాల్ని కాల్చిపడేసే దాకా కేంద్ర (ఆ)రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటారు? పైగా పట్టుబడ్డ పావు గాడిని ఏడాది పాటు 33 కోట్లు ఖర్చు పెట్టి విచారణ ఒకటా? వాడికి ఉరి శిక్ష వేశామని చంకలు గుద్దుకోవడం ఒక విజయమా? ఆ సంఘటన తర్వాత ఎన్ని దాడులు జరగలేదు?

దంతెవాడలో మొన్నా మధ్య పారిన రక్తం ఇంకా వెచ్చగా ఉండగానే,నిన్న, ఇవాళ..మళ్ళీ మళ్ళీ దాడులు!ఎక్కడుందండీ ప్రభుత్వం?(దాడి చేసింది ఎవరైతేనేం?పోయిన ప్రాణాల సంగతి మాట్లాడుతున్నాను)

వాళ్ళు చేయగలిగినంతా వాళ్ళు చేస్తున్నారు... ఎవరూ? ఎవరండీ బాబూ! వాళ్ళు నిజంగా చేయాలనుకుంటే చేయగలరేమో గానీ ఈ రావణ కాష్టం చల్లారితే పార్టీలకు మనుగడ ఉండదు.అందుకే తీవ్రవాదం గురించి స్టేట్మెంట్సే గానీ చేతలుండవు.



నా విషయానికొస్తే(మీరు సీరియస్ గా అడిగి ఉంటే)మా కాలనీ లోకి బయటి నుంచి చీమ కూడా దూరడానికి వీల్లేదంటే వీల్లేదు! ప్రతి ఒక్క రెసిడెంట్ చరిత్రా అసోసియేషన్ దగ్గరుంటుంది. బయటినుంచి వచ్చే ప్రతి ఒక్కరినీ మానిటర్ చేస్తాం మేము! ఇక్కడ ఉన్నవాళ్లంతా పాపం రోజంతా కంప్యూటర్ తో కుస్తీ పట్టి ఈసురోమంటూ ఇల్లు చేరేవారేలెండి!

మన దేశ రహస్యాలను పాకిస్థాన్ కి చేరవేసేది ఒక మహిళ అని తెలిసినపుడు మీకేమనిపించింది?.......ఆరోపణ నిజమే అయితే చంపి అవతల పారేయాలనిపించింది. ఇందులో ఆడా మగా తేడా ఏముంది? దేశ ద్రోహం ఎవరు చేసినా నేరమేగా!

సుజాత వేల్పూరి said...

రిషీ, కరెక్టేనండీ! తిరుపతిలో ఒకసారి నాక్కూడా ఇలాగే జరిగింది. మా పాపకు ఆరునెలల వయసు అప్పుడు.మా వాహనం చెక్ చేస్తూ పసి పాప ఉందని నన్ను దిగొద్దు, పర్వాలేదన్నారు! మా అన్నయ్య "ఇలా వడిలో పిల్లలున్న వారినందరినీ వదిలేస్తే, గోతిలో పడతారు జాగ్రత్త"అని నన్ను కూడా దిగమని చెక్ చేయించాడు. ఏ మాత్రం అలసత్వం పనికి రాని పరిస్థితి నెలకొని ఉన్నపుడు జాగ్రత్తగా ఉండాల్సిందే!

Anonymous said...

అవును సుజాత గారూ, టూ వీలర్స్ నడిపేవాళ్ళను ఎంత హింస పెడుతున్నారంటే చెప్పలేం! ముఖ్యంగా మగవారిని!చాలామంది ఇది తట్టుకోలేక ఆటోల్లో, బస్సుల్లో వస్తున్నారు ఆఫీసులకు!

అనుక్షణం నరకం అయిపోతోంది బతుకు!

వేణూశ్రీకాంత్ said...

బాగా రాశారు సుజాత గారు. నిజమే చేసే తనిఖీ ఏదో సీరియస్ గా చేస్తే బాగుండును. అంత అసౌకర్యాన్ని భరించినా రక్షణ కరువవడం శోచనీయం.

కత పవన్ said...

సుజాత గారు,
మీరు చెబుతున్నది వింటుంటే పల్లెలో ఉండే వాళ్ళమే కాస్తా సుఖంగా ఉన్నాం అనిపిస్తుంది..పల్లెలో కాస్తా సౌకర్యలు తక్కువగా ఉన్నా ఇక్కడి ప్రశాంతత ముందు అవి కుడా వ్యర్దం అనిపిస్తుంది..అయితే మీకు అక్కడ జరుగుతున్న పరిణామాలకు ఈ బధ్రతా అనివార్యం అనిపిస్తుంది

గీతాచార్య said...

ఇక్కడ ఎవరి ప్రాణాలు వాళ్ళు రక్షించుకోవాల్సిందే! ప్రభుత్వం ఉందో లేదో తెలీని చోట వేరే ఛాయిస్ లేదు.

RighttO!

Recently I too felt the heat. But the thing is I lectured them after the job is finished. ఎన్ని చేసినా సామాన్యుల మీద సా యింగే తప్ప జరిగేవి జరుగుతూనే ఉన్నాయి.

Hyderabad కాదు. Highడర్bad

గీతాచార్య said...

ప్రతీ రోజూ డబ్బులు పెట్టి సస్పెన్స్ థ్రిల్లర్లు చూడలేము కదా. ఈ తరహా జీవితాన్నే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా ఎంజాయ్ చేయటమేనేమో ఇక ముందు మనకి మిగిలేది. నగర జీవితం, నా గరం జీవితమైపోతోంది. Terrorism is a sort of dandruff. ఎన్ని షాంపూలు వాడినా పూర్తిగా పోదు.

krishna said...

@ సుజాత గారు, మీరు మరీను! లేని పోని అవిడియాలు ఇవ్వడం లేదు కదా! అర్రె! మనం ఇలా కూడా చెయ్యొచ్చు అని వాళ్లు అనుకోవడం లేదు కదా!
సీరియస్ గా మాట్లాడుకుంటె, మన ప్రజలు అందరికి అలసత్వమె అండి.సులువు గా పనులు అయ్యిపోవాలి. మన కోసం నిబంధనలు సడలించాలి.ఈ మెంటాలిటి ఒక కారణం.
రెండు మనకెందుకులే , అన్న భాద్యతా రాహిత్యం, బద్దకం.
మూడు , మన దేశ జన సాంద్రత! మన కన్నా ఒక పది పదిహేను కోట్లు జనాభా ఎక్కువ వున్న చైనా వైశాల్యం లో మూడు రెట్లు పెద్దది. అఫ్‌కోర్స్. బీజింగ్ వంటి పెద్ద నగరాలలో ఎక్కువ జన సాంద్రత వున్నా సరి పడా సిబ్బంది. మరి ఇక్కడా ... అరకొర సిబ్బంది, పనికి రాని ఆయుధాలు. ఇవి మారితే గాని పరిస్థితి మారదు అనుకుంటా!
ఇట్లు
కృష్ణా ఉరఫ్ పిల్ల కాకి.

కొత్త పాళీ said...

good points and very valid frustration.
ఈ తనిఖీలు చాలా మట్టుకి తూతూమేళంగానూ, జనాల్ని ఇబ్బంది పెట్టేవిగానూ ఉంటున్నాయి తప్ప, నిజంగా దానివల్ల భద్రత పెరుగుతోందా అనేది చాలా అనుమానించాల్సిన విషయం.

భావన said...

నిజమే సుజాత ఏమిటో ఎటూ తోచనట్లు వుంది నువ్వు రాసింది చదువుతుంటే. ఒకప్పుడూ నిజమే అమ్మో అమెరికా లో నల్లోళ్ళు కొన్ని ఏరియాలలో వూరికే సరదాగా కాల్చేస్తారంట వంటీ కొన్ని మూస పోసిన ఆలోచనలు వుండేవి (ఇప్పుడూ కూడా వున్నాయి లెండీ) కదా. ఇప్పుడూ ప్రపంచం చిన్నదయ్యింది అంటే ఇలా వీటీ లో కూడా కాబోలు అనుకోవాల్సి వస్తోంది. ఏమి భద్రత లే ఎక్కడా లేదు.

నాగప్రసాద్ said...

హైదరాబాదులో బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లకు, బాంబ్ ఫ్రూఫ్ లకు మాంఛి డిమాండ్ ఉండేలా కనిపిస్తోంది. ఆ వ్యాపారం చేసుకుంటే బెటరేమో :-)). త్వరలో నేను కూడా ఒక బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్టు తొడుక్కొని వస్తా హైడర్‌బ్యాడ్ కు. :-))).

ఇలా భయం భయంగా బ్రతకడం కన్నా, సింపుల్‌గా ఏదయినా ఉగ్రవాద సంస్థను స్థాపించుకోవడం బెటరేమో. అప్పుడు, పోలీసుల నుంచి పూర్తి రక్షణ ఉంటుంది. పాపం, పోలీసులు ఎంత మంచి వాళ్ళో. వాళ్ళ ప్రాణాలు/వాళ్ల సహచరుల ప్రాణాలు పోయినా బాధపడరుగానీ, ఉగ్రవాదులను కాల్చాలన్నా/పట్టుకోవాలన్నా తెగ బాధపడిపోతారు.

Lakshmi Naresh said...

Sujatha garu, mana akrosam kooda ee blog dati podu.evaro mitrudannadu,mana chttupakkala em jaruguthunte manam em chesthunnamani.Aaaaa mitudu cheppagalada "babu ikkada terrorist unnadani"?.Vaallu ekkada undedi andariki telsu.road meeda padi samanya jananni himsiste vachedi 4 chilla rupayalu.Patha basthi velli vethakamandi,antha dairyam evarikundi..MIM choosthu oorukutunda? Pichi manaki..congress palana ,Rakshasa palana.Balavanthudu ,balisina vadide rajyam....anthenduku.....anni vasthuvulu rates perigaye..evdaina pattinchukunnada....manlo manam anukodam tappa....deenne bahusa kadupu manta antaremo..idigo ila teerindi

గీతాచార్య said...

lakshminaresh,

lol. but how true ur comment is. నిజమే కడుపు మంట ఇలా తీర్చుకోవాల్సిందే. లేందే అల్సర్ కి దారి తియ్య వచ్చు

Raj said...

peddaga rAyalekapothunnanu...

bhaHUsa intaka mundu chaala saarlu ee vishayam gurinchi charchinchuta valanemo....


oKKataithey cheppagalanu... annintiki prabhuthvame javAAbudaari anadam maatram correct kAAdhu...

సుజాత వేల్పూరి said...

శేఖర్,
ఎక్స్ గ్రేషియా అంత సులభంగా ఇస్తే ఇంకేం? ఏళ్ళూ పూళ్ళూ పడుతుంది.

శ్రీ, మీరు చెప్పింది కరెక్టే!

శ్రీనివాస్, పవన్
పల్లెల్లో జీవితం ప్రశాంతంగా ఉండేమాట అక్షరాలా నిజమే కానీ మన ఉద్యోగాలు, చదువులు అన్నీ సిటీలో ఉన్నాయిగా మరి!అందుకే వీటి బారిన పడ్డాం!

వేణూశ్రీ, ఫోరం లో ఇలాంటి తంతు చూసే ఉంటారుగా!

వేణూ,థాంక్యూ,

గీతాచార్య మీ నిర్ వచనాలు బాగున్నాయండోయ్!

కృష్ణ,

బాధ్యతా రాహిత్యం జనంలో ఉన్నా, అది అవినీతికో, మరో అడ్డదారికో ఒప్పుకుంటాను కానీ రస్ఖణ విషయంలో ప్రభుత్వమే సింహభాగం బాధ్యతను స్వీకరించాలి. అత్యున్నతి స్థాయి నుంచి అతి తక్కువ స్థాయి వరకూ అధికారుల్లో ప్రజల ప్రాణాల మీద కన్ సర్న్ లేకపోవడమే కారణం దీనికి!అరకొర సిబ్బంది,అతి పాత ఆయుధాలు ఇవన్నీ ఉన్నత స్థాయి ప్రభుత్వ శాఖల నిర్వహణా లోపమే!

కొత్తపాళీ,
తూ తూ మంత్రంగా జరిగే ఈ పరీక్షల వల్ల టైము వేస్టు తప్ప ఒరిగేదేం కనపడటం లేదు.

భావన,
అవును, అభర్ద్రత జీవితంలో ఒక ముఖ్య భాగమైపోయింది ఆకలి,దాహం,నిద్ర లాగా!

సుజాత వేల్పూరి said...

నాగప్రసాద్,
త్వరలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు inners లాగా నిత్యావసరాలు, అత్యావసరాలు అయినా ఆశ్చ్రయ్పడక్కర్లేదల్లే ఉంది.అవును ఉగ్రవాద సంస్థలకు ఉన్న రక్షణ జనాలకు లేదు. కసబ్ కి చూడండి ఎన్ని రాచ మర్యాదలు జరుగుతున్నాయో!వాడి మీద ఏడాదిలో ఎన్ని కోట్లు ఖర్చుపెట్టారో!

పోలీసులు మరీ ఫ్రెండ్లీ అయిపోతున్నారు.:-))

లక్ష్మీ నరేష్,
అవును, ఇలాంటి మంటల్ని కొందరితో అన్నా పంచుకోకపోతే బీపీ పెంచుకోవాల్సి వచ్చేట్లుంది.

రాజ్,
అవినీతి విషయంలోనో, లంచాల విషయంలోనో ప్రజల సహకారం లేనిదే వ్యవస్థను బాగు చేయలేం అనొచ్చు! రక్షణ విషయంలో మీలాంటి నాలాంటి సామాన్య ప్రజలు ఎంత వరకూ చేయగలరు? ఏమి చేయగలరు? ఏ ప్రమాదమో జరిగితే బాధితులుగా మారడం తప్ప?

తీవ్రవాదలు దేశంలో ప్రవేశిస్తుంటే పౌరులు పట్టుకుంటారా? మెషీన్ గన్లతో ఎగబడితే నిరాయుధులైన పౌరులు తిరగబడగలరా?

పౌరుల్ని ప్రశ్నించాలంటే తీవ్రవాదులకు సహకరించే కమ్యూనిటీని (అంటే ఒక కులం, మతం అని కాదు)ప్రశ్నించాలి.

ఏ రోజూ పశాంతంగా నిద్ర పోలేని పరిస్థితి ఇవాళ ఉందంటే దానికి కారణం తీవ్రవాదం మీద ప్రభుత్వానికున్న తేలిక భావమే! చిత్త శుద్ధి లేకపోవడమే! అది మొక్కగా ఉన్నపుడు వంచకపోతే మానై పోయి ఇప్పుడు అందర్నీ భయపెడుతోంది.

తెలుగు వెబ్ మీడియా said...

సుజాత గారు. హైదరాబాద్ లో బులెట్ ప్రూఫ్ జాకెట్లు తయారు చేసే ఒక కంపెనీ ఉంది. వాళ్ళు పోలీసులకి, పోలీసుల అనుమతి ఉన్నవాళ్ళకి మాత్రమే బులెట్ ప్రూఫ్ జాకెట్లు అమ్ముతారు. ఆ కంపెనీ పేరు గుర్తు లేదు.

Dhanaraj Manmadha said...

చెరసాల శర్మ గారూ,

చానా బాగా చెప్పారు. పనిలో పనిగా దొంగ తుపాకులు (అంటే పని చెయ్యనివని కాదు, అక్రమ /స్మగుల్డ్ తుపాకులెక్కడ దొరుకుతాయో చెపితే వెళ్ళి తెచ్చుకుందును. నాకు లైసెన్స్ కూడా ఉందండీ చైనాలో.
*** *** ***

నిజమే సామాన్యులు రక్షణ విషయంలో చెయ్యగలిగిందేముంది? అంత సన్నివేశమే ఉంటే వారిని సామాన్యులంటారు? మాన్యులకే రక్షణలేని దేశమిది. (ఐబాబోయ్ ఇలా వచ్చేస్తున్నాయేంటి మాటలు?) చూ" గాంధీలు, సెంద్రబాబు నాయుడు.

ప్రభుత్వం కళ్ళు మూసుకుని చూస్తున్నాళ్ళూ ఇలాగే ఏడుస్తుంది మన రక్షణ వ్యవహారం

Vinay Chakravarthi.Gogineni said...

loksatta vallani(ur part of that right?) fight cheyamanaalsindi......?


u could have suggest ur own solution?
try to add ur own solution so that others can fallow and they can suggest their views as well.

Post a Comment