ఇందిర గురించి తల్చుకుంటే భయమేస్తుంది. ధైర్యం వస్తుంది. ఇందిర ను అర్థం చేసుకోవాలంటే గుండె దిటవు కావాలి. మధ్య మధ్యలో గుండె నిండా ఊపిరి తీసుకుంటూ ఉండాలి.
ఇందిర ఒక అగ్ని శిఖ! ఒక అపురూప వ్యక్తిత్వమున్న యువతి ఇందిర!ఎలాటి దాపరికాలూ లేకుండా జీవితాన్ని ఉతికి ఆరేసేస్తుంది. నిండా ఇరవయ్యేళ్ళు లేకుండానే జీవితాన్ని కాచి వడబోసిన ఇందిర గుండెలు ఆగిపోయే జీవిత సత్యాలను నిర్మొహమాటంగా మొహం పగలగొట్టి మరీ చెప్తుంది.
కాలాతీత వ్యక్తులు నవల యాభై ఏళ్ళ తర్వాత కూడా ఇంత పటిష్టంగా నిలబడి ఉందంటే అందుకు కారణం కేవలం ఇందిరే! ఇందిర వ్యక్తిత్వమే ఇన్నాళ్ళు ఆ నవలను నిత్యనూతనంగా కాలాతీతంగా నిలబెట్టింది.
ఈ నవల దాదాపు పాతికేళ్ళ క్రితం స్కూల్లో ఉండగా అనుకుంటాను బహుమతిగా సంపాదించాను . మా అమ్మ ఈ పుస్తకం చూసి "ఇప్పుడే ఇంత బరువు పుస్తకాలెందుకులే నువ్వు క్లాసు పుస్తకాలు చదూకో, నేనిది చదూకుంటా"అని పుస్తకం తీసుకుని కానుగ చెట్టుకింద కుర్చీ వేసుకుంది.
ఆ తర్వాతెప్పుడో మూడు నాలుగేళ్ళకి చదివాననుకోండి!
గొప్ప నవలగా విమర్శకుల,పాఠకుల ప్రశంసలు దండిగా సంపాదించిన నవల గురించి రాయబూనడం సాహసమే అయినా ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించే ఇందిర గురించి రాయకుండా ఉండటం అసాధ్యమనిపించింది.
మీలో చాలామంది ఈ నవల చదివే ఉంటారు. చదవని వారు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకోసం కథ కొద్దిగా చెప్తాను.
1950ల్లో వాతావరణం!విశాఖపట్నంలో ఇందిర అనే పద్ధెనిమిదేళ్ళ యువతి తండ్రితో సహా ఒక ఇంటికిందిభాగంలో అద్దెకు దిగుతుంది.అదొక బ్రహ్మచారులుండే కొంప!పైభాగంలో ప్రకాశం అనే మెడికో ఉంటాడు.చలాకీ ఇందిర ప్రకాశంతో ఇట్టే స్నేహం చేస్తుంది.ప్రకాశం ఫ్రెండు కృష్ణ మూర్తితో కూడా!
అద్దె పంచుకోడానికి వీలుగా ఉంటుందని ఒకరోజు ఇందిర కళ్యాణి అనే స్నేహితురాలిని ఆ ఇంట్లో ఒక గదిలో ప్రవేశపెడుతుంది.కళ్యాణిదో తెలుగు సినిమా దీనగాధ!
తల్లి లేదు.తండ్రి రోగిష్టి!ఇంటిమీద అప్పు!ఎవరితోనూ కలిసిపోయే స్వభావం కాదు.ఎప్పుడూ తన దీనావస్థను తల్చుకుని కన్నీళ్ళు పెట్టుకోవడం తప్ప కళ్యాణికి మరేమీ చేతకాదు.
కళ్యాణి వచ్చాక ప్రకాశం ఆమెవైపు ఆకర్షితుడవటంతో ఇందిర కల్యాణితో నిరంకుశంగా ప్రవర్తించి ఆమె వెళ్ళిపోడానికి కారణమవుతుంది.తండ్రిని పోగొట్టుకున్న కళ్యాణికి స్నేహితురాలు వసుంధర ఆశ్రయమిస్తుంది.మునసబు రామినాయుడుని ఆస్పత్రికి తీసుకువెళ్ళిన సందర్భంలో డాక్టర్ చక్రవర్తి కళ్యాణికి పరిచయమవుతాడు.
ప్రకాశం మేనమామ కు ఇందిరతో ప్రకాశం చనువుగా ఉంటున్నాడన్న సంగతి తెల్సి ఊర్నుంచి వచ్చి ఇందిరకు వార్నింగిస్తాడు. ప్రకాశాన్ని ఊరికి తీసుకుపోయి రాజమండ్రి సంబంధం ఖాయం చేస్తాడు.స్వతహాగా భీరువైన ప్రకాశం మేనమామ మాట కాదనలేక ఒప్పుకుని ఆ తర్వాత ఇందిర మీద వ్యామోహాన్ని వదులుకోలేక పారిపోయి వస్తాడు.ఇందిర అతడిని ఛీ కొట్టి పొమ్మంటుంది.తనకోసం మామయ్యను ఎదిరించి కాకుండా పారిపోయి వచ్చినందుకు తిరస్కరిస్తుంది. అనుక్షణం మామయ్య నుంచి అతన్ని రక్షించలేను వెళ్ళమంటుంది !
మరోవైపు వసుంధర కృష్ణమూర్తివైపు ఆకర్షితురాలవుతుంది.కానీ ఇందిరతో అమితంగా పెరిగిన సాన్నిహిత్యం వసుంధరను వద్దనుకునేలా చేస్తుంది కృష్ణమూర్తిని!
కథ అనేక మలుపులు తిరిగి చివరికి కృష్ణముర్తి ఇందిరనూ,చక్రవర్తి కళ్యాణినీ పెళ్ళాడటంతో ముగుస్తుంది.
ఈ కథకు హీరో, హీరోయిన్,రెండూ ఇందిరే!
ఇందిర వ్యక్తిత్వం చదువుతున్నంత సేపూ అబ్బురపడేలా చేస్తుంది.
అసలు ఈ నవల్లోని పాత్రల స్వభావాలు ఈనాటికీ నిత్యనూతనంగా ఎవరో ఒకరి రూపంలో కళ్ళబడుతూనే ఉంటాయి.అందుకే రచయిత్రి ఈ నవలకు ఆ పేరుపెట్టారేమో అసలు!
"కాలాతీత వ్యక్తులు" కాదు.."వ్యక్తే"! ఆ వ్యక్తే ఇందిర అని కొందరి వాదనని 1958 లో ముందు మాట రాసిన పి.సరళా దేవి అంటారు
అడుగడుగునా మేనమామకు భయపడే ప్రకాశానికి, జీవితాన్ని అనుక్షణం విసుక్కుంటూనే మరోవైపు ప్రేమించే జీవించే ఇందిర లాంటి మనుషులు కొత్త!ఆ కొత్త ఇష్టంగానే ఉన్నా దాన్ని అందుకోడానికి భయపడే పిరికివాడు ప్రకాశం. పోరాడి సాధించుకోవడం అనేది జీవితంలో కాదు కదా కనీసం ఊహల్లోకూడా లేనివాడు!
"నేను బలపడి ఇంకొకరికి బలాన్నివ్వాలనుకునే తత్వం నాది" అని ఆత్మవిశ్వాసంతో చెప్పే ఇందిర అంటే ఆరాధన!
"అలా బీచ్ కీ పోదాం పద"అని లాక్కెళ్ళే ఇందిర,"...పర్లేదులే ఇంతలో నా పాతివ్రత్యానికేం భంగం రాదు.ఇద్దరమూ ఒకే రిక్షాలో పోదాం పద"అనే ఇందిర ..అతనికి అబ్బురంగానే కనిపిస్తుంది గానీ చేయి అందుకోవాలంటే భయం!
అలాగే ఇంటినుంచి వచ్చిపడే డబ్బుతో జల్సాగా స్నేహితులతో గడిపే కృష్ణమూర్తికీ ఇందిరలాంటిమనుషులు కొత్తే!
ఇందిరకు ఇటువంటి ఇన్ హిబిషన్స్ లేవు. ప్రకాశంతోనూ, కృష్ణముర్తితోనూ అరమరికలు లేకుండా స్నేహం చేస్తుంది.అలాగని ఇందిర పెద్ద ఆదర్శమూర్తేమీ కాదు.తాను కోరుకున్న ప్రకాశం కల్యాణికి దగ్గరవుతుంటే చక్రం అడ్డువేస్తుంది. స్త్రీ సహజమైనదిగా చెప్పబడే అసూయను ప్రదర్శించక మానవ సహజమైన నేర్పరితనం ప్రదర్శిస్తుంది.
అదీ ఇందిర అంటే!
ఇందిర పాత్ర రానున్న సమాజంపై స్త్రీ చేయగల ధిక్కారానికి ప్రతీక అని ఏటుకూరి ప్రసాద్ ముందుమాటలో పేర్కొంటారు. కానీ ఇందిర ఒక మనిషిగా ఇవన్నీ మాట్లాడుతుంది తప్ప తాను స్త్రీననీ, స్వేచ్ఛ సాధించుకోవాలనే స్పృహతోనూ మాట్లాడదు.స్త్రీవాదమంటే ఏమిటో ఇందిరకు తెలీదు.
ఎందుకంటే మరో పక్క "నేనున్నాలే,నీ సమస్యలూ,బరువులూ నా మీద పడేయ్"అనగలిగే మగాడు,అవసరమైతే నాకోసం సర్వస్వమూ వదులుకోగలిగే మగాడు కావాలి ప్రకాశం"అని కుండ పగలేస్తుంది ఇరవయ్యేళ్ళకే అరవయ్యేళ్ల కష్టానుభవాల్ని మూటకట్టుకుని విసిగిపోయిన ఇందిర .
"అందరం ఒక్కలాంటివాళ్లమే! అడుగు లేని పడవలం!ఏదో అలా ప్రవాహంలో పడి కొట్టుకుపొతున్నాం! అలాగని గడియ గడియకీ కాళ్ళు చాపి ఏడవటం నా వల్ల కాదు"అని నిర్మొహమాటంగా కల్యాణినుద్దేశించి చెప్పేస్తుంది.
"నువ్వెక్కడికిపోతావు ప్రకాశం, నువ్వు నా వాడివి"అని భరోసా ఇచ్చిన ఇందిరే అతడు పిరికివాడిలా పారిపోయి వచ్చినపుడు మండిపడుతుంది.
"బతుకులో నాకు కావలసినదొకటి,నాకు దొరుకుతున్నదొకటి !
అంచేత కసికొద్దీ లోకాన్ని ధిక్కరిస్తున్నాను.నాకూ ఓ ఇల్లూ,సంసారం,భర్తా ఇవేవీ అక్కర్లేదనుకోకు.కానీ లాటరీలో నాకు దొరికింది ఫైళ్ళూ,ఆఫీసూ,నా మీద ఒరిగిపోయి బతికేసే నాన్నా"అని నిస్పృహ వ్యక్తం చేస్తుంది.
కృష్ణ మూర్తి ఇందిరను పెళ్ళి చేసుకుంటున్నపుడు కూడా"జీవితంలో దేనివిలువ దానికివ్వాలి. పెళ్ళి నా జీవితంలో ఒక భాగం మాత్రమే! నీతో ఎంత దూరం రమ్మన్నా వస్తాను కానీ ఏ ఘట్టంలోనూ నా వ్యక్తిత్వాన్ని చంపుకోలేను.నా అవసరాలను గౌరవించడం నేర్చుకుని నన్ను నా ఇష్టం వచ్చినట్లు ఊపిరి పీల్చుకోనిస్తావా ("నా పర్సనల్ స్పేస్ నాకుండనివ్వు"అని 50ల్లోనే ఇందిర అడగటం ఎంత ఆశ్చర్యం!)అంటుంది.
"నీ ఆయుర్దాయం ఎంతో అన్ని రోజులూ నిండుగా బతుకు!నిర్భయంగా బతుకు!రోజుకు పదిసార్లు చావకు.ఈ ప్రపంచంలోని వికృతాన్నీ,వికారాన్నీ అసహ్యించుకో!ఆశలూ,స్వప్నాలు అనురాగాలు అన్నీ పెంచుకో!కానీ వాటికి శస్త్ర చికిత్స అవసరమైనపుడు నిర్దాక్షిణ్యంగా కత్తిరించి అవతల పారెయ్"అనే ఇందిర జీవితం నుంచి ఎంత నేర్చుకుందా అని ఆశ్చర్యం వేస్తుంది
నవల కొత్త ముద్రణ(2005)లో డాక్టర్ చంద్రశేఖర్ రావు రాసిన విశ్లేషణలో అంటారు"పాతివ్రత్యం, ప్రేమ,అంకితమవటాలు,అర్పించుకోడాలు ఈ నాన్సెన్స్ నీ ట్రాష్ నీ కాలితో ఫెడీమని తన్నే ఇందిరను మీరెరుగరు,గుర్తు పట్టడానికీ గుర్తుంచుకోడానికీ ఇష్టపడరు! ఇందిరను ఇష్టపడే రోజులు మనకింకా సమీపం కాలేదు" అని!
ఇందిర స్త్రీలాగా ప్రవర్తించదు. సగటు మనిషిలాగా ప్రవర్తిస్తుంది. ఆ ప్రవర్తనలో ప్రేమ, కోపం,ఆవేశం, లౌక్యం,దుఃఖం, నిరాశ, నిర్లిప్తత, స్వార్థం అన్నీ ఉంటాయి. అన్నీ జీవితం ప్రసాదించినవే!
కల్యాణిలాగా ప్రద్దానికీ భోరుమంటూ ఏడవదు. అయితే ఏమిటి? అని పరిస్థితులకు ధైర్యంగా ఎదురు తిరుగుతుంది. కనీసం బింకంగా కనిపిస్తుంది. "ఈ వెధవ లోకం నాకెందు లొంగిరాదో చూస్తాను"అనుకుంటుంది.
ఇందులో నాకు నచ్చనిపాత్రేదైనా ఉంటే అది కల్యాణే! ఈమె ఒంటినిండా సెల్ఫ్ పిటీ నిండిపోయి ఉంటుంది.ఆమె ఒంటరితనానికీ,నిస్సహాయ స్థితికీ ఒక పక్క కొంత సానుభూతి కలుగుతున్నా, ప్రతి క్షణం తన స్వాభిమానాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఏడుపుని ఆశ్రయించి పాఠకుడికి సానుభూతిని బదులు చిరాకుని కల్గిస్తుంది.
వసుంధర ఇంట్లో మునసబు రామినాయుడికి అనారోగ్యం చేయగానే"చూశావా, వసుంధరా,నా వంటి దానికి ఆశ్రయమిస్తే నీకెలాంటి ఫలితం దక్కిందో"అంటుంది. చివరికి పెళ్ళాడ్డానికి వెళ్తున్నపుడు కారుకి యాక్సిడెంట్ కాగానే "నావంటి దరిద్రాన్ని వరిస్తే ఇంతే!"అని చక్రవర్తిని బెదరగొడుతుంది. ఇలాంటివాళ్ళు జీవితంలో ఒకరుంటే నరకం ఆట్టే దూరంలో లేదనిపించడం ఖాయం!
కానీ ఇందిర అన్నట్లు "ఈ లోకంలో కల్యాణి లాంటి వాళ్లకే ఎక్కడ లేని జాలీ దొరుకుతుంది"
ఈ నవలకు జరిగిన అన్యాయమేదైనా ఉంటే అది "చదువుకున్న అమ్మాయిలు"సినిమాగా దీన్ని తీయడమే అనిపిస్తుంది నాకు! సినిమా టైటిల్స్ కార్డ్స్ లో కథ -డాక్టర్ పి.శ్రీదేవి అని చూడకపోతే అప్పటికి పదిసార్లు ఈ నవల చదివి ఉన్నా, అది ఈ సినిమాయేనని గుర్తు పట్టం!
ఆ సినిమాలో కల్యాణిపాత్ర కృష్ణకుమారికిచ్చి ఆమెను హీరోయిన్ను చేసి, ఆమె ఫ్రెండ్ వసుంధరగా సావిత్రిని పెట్టి వీళ్ళిద్దరికీ మధ్య అక్కినేని ని పెట్టి ఏదేదో చేశారు! ఇందిరను ఒక వాంప్ గా (ఈవీ సరోజ)చిత్రీకరించారు.
అలాంటి స్త్రీని అంగీకరించే పరిస్థితులు ఆరోజు లేవు కనుకా..అని జవాబిస్తారేమో ఇదేమని అడిగితే!
కానీ 1950 ల్లోనే ఇద్దరు మగ స్నేహితులతో కల్సి ధైర్యంగా బీచ్ లకూ సినిమాలకూ వెళ్లగలిగే ఇందిర పాత్ర ఒకింత ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. ఆ రోజుల్లో ఇలాంటి స్వేచ్ఛను ఇరుగుపొరుగులెవరూ నిరసించరా?అనే సందేహం కలుగుతుంది.ఇందిర అంత స్వేచ్ఛగా మసలడానికి ఏమీ ఇబ్బంది పడకపోవడం కూడా కొద్దిగా ఆశ్చర్యమే!
నవలా రచయిత్రి ముప్ఫయి ఏళ్ల వయసులోనే మృత్యువాత పడకపోయి ఉంటే ఇంకా ఎన్నెన్ని మంచి రచనలు అందించేవారో అన్న ఆలోచన ఈ నవల పూర్తి చేసిన ప్రతి సారీ కల్గుతుంది.
పాత్రల చిత్రణ,వాటి వ్యక్తిత్వాల వర్ణన గుక్క తిప్పుకోనివ్వదు పాఠకులను!
ఇందిర అసహనాన్నీ,వెంటనే తేరుకుని ప్రదర్శించే ధిక్కారాన్నీ ఎలా చిత్రీకరిస్తారంటే ఇందిర వెంట పరుగు తీయడం తప్ప ఇంకేం చేయలేం!
ఇంత రాసినా ఇంకా ఏదో రాయకుండా వదిలేశామనే ఫీలింగ్...అదే కాలాతీత వ్యక్తులు నవల చేసే మాజిక్!
ఒక అశాంతిని, కొన్ని లక్షల ఆలోచనలనూ,కొంత హాయినీ ఒకేసారి కల్గించే నవల!
1957 లో తెలుగు స్వతంత్ర పత్రికలో ధారావాహిక గా వచ్చిన ఈ నవల తరవాత చాలా ముద్రణలు పడింది.1981లో ఎమెస్కో వారు వేసిన ముద్రణ కాపీ నా వద్ద ఉంది.అందులో చివరి పేజీలు పోయాయని కొత్తది విశాలాంధ్ర వాళ్ళు వేసిన కొత్త కాపీ కొన్నాను.
ఇంత మంచి నవల ముద్రణకు విశాలాంధ్ర వాళ్ళుకొంత నాణ్యత ఉన్న పేపర్ వాడి ఉంటే బావుండేది. !:-(
విశాలాంధ్ర ప్రచురణ
వెల -అరవై రూపాయలు

63 comments:
నేను ఈ మధ్యే ఈ పుస్తకం కొని చదవడం మొదలుపెట్టాను. నిజంగా ఆ కాలంలో ఇందిరలాంటి అమ్మాయిలగురించి రాసారే అని కించిత్ ఆశ్చర్యపోయాను. అందరికి భిన్నంగా ఉండేవాళ్లని చూస్తే అందరికి ఆశ్చర్యమే కదా.. ముఖ్యంగా సమాజపు నీతి నియమాలు పాటించనివారి గురించి
బాగా రాసారు. నేను ఈ నవలని ఈమధ్యనే చదివాను, నా అభిప్రాయాలను కూడా రాసాననుకోండి.
http://kalas3.blogspot.com/search/label/%E0%B0%AA%E0%B1%81%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81
ఇందిర పాత్ర నాకు కూడా చాలా ఆశ్చర్యం కలిగించింది, చాలా బలమయిన భావాలు కలిగిన మహిళ.
ఈ నవలే "చదువుకున్న అమ్మాయిలు" అని తెలియదు నాకు. ఒకసారి సినిమా చూసి సంతోషిస్తా.
మా లిటరరీ క్లబ్బులో కూడా ఈ నవల గురించి చర్చ జరిగింది.
అద్భుతమైన నవల. ఇందిర ఇప్పటికీ సాధ్యమేనా అనిపిస్తుంది నాకు !
ఓ 5-6 యేళ్ళ క్రితం నేను కాస్త నిరాశ నిస్పృహలలో కొట్టుకుపోతున్నప్పుడు మా అత్త వచ్చి ఈ పుస్తకం నాకిచ్చింది "చదువమ్మా, నీకు ఉపయోగపడుతుంది" అని. చదివాను, అద్భుతం నిజంగానె ఎంతో ఉపయోగపడింది.
"నేను బలపడి ఇంకొకరికి బలాన్నివ్వాలనుకునే తత్వం నాది"....ఈ మాటని ఆరోజు నుండి ఈరోజు వరకు మననం చేస్తూనే ఉన్నాను. ఇందిర పాత్ర ఒక కలలా, అద్భుతంగా, అమోఘంగా అనిపించింది నాకు. కల్యాణి ఏడుపు చూసి చిరాకు పడే ఇందిర...ప్రకాశాన్ని ప్రేమిస్తూ దండించే ఇందిర...కల్యాణిపై జాలి చూపిస్తూ, ఇందిరని ద్వేషించే కృష్ణ ని కవ్వించే ఇందిర. స్నేహానికి విలువిచ్చే ఇందిర..ముఖ్యంగా తనకి తాను విలువ ఇచ్చుకునే ఇందిర...ఓహ్ నిజంగా గొప్ప వ్యక్తి. 50 లలో ఇటువంటి ఇందిరని ఊహించారంటే శ్రీదేవిగారు ఎంత అభ్యుదయవాదో అని చాలా అబ్బురపడ్డాను.
మీ రివ్యూ చాలా బావుంది. నేను చాలారోజులబట్టి అనుకుంటూ ఉన్నను, ఈ పుస్తకం గురించి రివ్యూ రాయాలి అని. కానీ కుదరలేదు. ఈరోజు మీ రివ్యూ చూసి నాకు ఆనందమేసింది. ఒక మంచి పుస్తకం గురించి రాసారు .
చదువుకున్న అమ్మాయిలు సినిమా కాలాతీతవ్యక్తుల కథా????????
చీ చీ ఈ పుస్తకానికి మచ్చ తెచ్చే పని ఇంతకన్నా ఇంకొకటుండదు.
పుస్తకం పేపరు నాణ్యత గురించి ఒకమాట:
ఈ రోజుల్లో ఒక నవలని తక్కువ ధరతో అందించాలంటే
తక్కువ నాణ్యత కల కాగితాన్ని వాడక తప్పదు మరి !!
( ఈ విషయం మీకు తెలియదని కాదు.. )
I read many times..
I don`t like this story..
I request the Readers don`t try to
comment without reading this book.
I invite a great discussion
on "KALATHEETA VYAKTULU"..
rputluri@yahoo.com
సౌమ్యా,
చెప్పానుగా, టైటిల్స్ లో చూస్తే కానీ తెలీలేదు విషయం! చదువుకున్న అమ్మాయిలు సినిమా ఇదే నవలని. అయినా అనుమానంతో ఒకసారి దేవరపల్లి రాజేంద్ర కుమార్ గారిని అడిగాను. అవును అని స్మైలీలు పెట్టారు.
రాధిక గారూ,
ఇందిర 50 ల్లో కథానాయికగా అంత సాహసంతో ఒంటరిగా వ్యవస్థను ప్రశ్నించే విధంగా ఆలోచించడం నన్ను ఇందిరకు అభిమానిని చేసింది. అయోమయం,నిర్పృహ ఉండటం కూడా ఆ పాత్ర ఉన్న పరిస్థిలకు బలాన్నిచ్చేవే! ఒంటరితనం, ఉన్నదల్లా తన మీద పడి బతికే నాన్న! కుటుంబమంటూ లేదు.ఎప్పటికి ఏర్పడుతుందో తెలీదు. మరి ఈ పరిస్థితుల్లో ఇందిర నిస్పృహనీ,అయోమయాన్నీ అర్థం చేసుకోలేమా?
నిజానికి ఇందిరకున్న పరిస్థితులు ఇంకెవరికన్నా ఎదురైతే కళ్యాణికంటే ఘోరంగా ఏడుస్తూ కూచుంటారని అనిపిస్తుంది నాకు!
ఇంతకీ కల్యాణి గురించి మీ అభిప్రాయమేమిటి?
రంజని,
మీరు చెప్పింది కరెక్టే కావొచ్చు! I agree!
రామనరసింహ గారు,
నచ్చలేదు సరే, ఎన్నో సార్లు చదివానన్నారు కదా, ఎందుకు నచ్చలేదో ఒక్క వాక్యమైనా రాసి ఉంటే బావుండేది కదా! కథ ఒక్కటే నచ్చలేదా, లేక పాత్రల స్వభావాలా?
ఆ great discussion ఏదో మీరే మొదలు పెడితే బావుండు కదండీ!
సుజాత గారూ,
మంచి పుస్తకాన్ని పరిచయం చేశారు. తప్పక చదివే ప్రయత్నం చేస్తాను. :-) 'చదువుకున్న అమ్మాయిలు' సినిమా నేను చూసాను. కొంచెం విసుగ్గానే అనిపించింది. మీరన్నట్టు మెయిన్ హీరోయిన్ కృష్ణ కుమారి బాధలు విసుగొస్తాయి. ఈ పాత్ర, వసుంధర పాత్ర కాకుండా అసలు ఇంకో మూడో అమ్మాయి పాత్ర ఉందనే నాకు గుర్తు రావట్లేదు. అయితే, నవలకి ప్రాణమైన ఇందిర పాత్రని మరుగున పడేసి దాన్ని సినిమాగా మలిచారన్నమాట! :(
చక్కటి పరిచయం. తెలుగులో ఉన్న ఉత్తమ నవలల్లో ఒకటి. తెలుగు వికీపీడియా లో ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా రూపొందించిన వారి పుణ్యమా అని గత సంవత్సరం చదివాను. ఇందిర వ్యక్తిత్వం పాఠకుల మీద బలమైన ముద్ర వేస్తుంది. అదేసమయంలో ప్రకాశం పాత్ర ఆత్మన్యూనతకు గురిచేస్తుంది. బలమైన వ్యక్తిత్వం ఉన్న స్త్రీ ముందు ఎంతటి ఉన్నత వ్యక్తిత్వం కల మగవాడైనా అల్పుడు అనిపిస్తాడు నాకు. శ్రీదేవి గారు అంత చిన్న వయసులోనే చనిపోవటం తెలుగు సాహిత్యానికి లోటే.
నాకు ఒక సందేహం ఉందండీ. నవలల్లో తక్కువ వయసున్న పాత్రలు ఎంతో పరిణతితో ఉన్నతంగా ఆలోచిస్తారు. ఆ కాలంలో నిజంగా అంత తక్కువ వయసుకే పరిణతి ఉండేదా ? రాను రానూ మనుషుల్లో మానసిక పరిపక్వత కు వయసు పెరిగిపోతుందా? యేమో! ఉదాహరణకు దయానిధి, గీతాదేవి ఉన్నారు.. వారి వయసు చాలా తక్కువే మరి. లేక అదంతా రచయితల సృష్టా !?
SRIVALLI RADHIKA - gari opinion
chudandi. INDIRA (says) - NENU
ANNI NA ANTHARATMA..ku
VIRUDHAMAIYA PANULE CHESHANU..
Is there any mistake if i dislike
this novel..
రాధిక గారూ, మీ పోస్టు కోసం ఉత్సుకతతో ఎదురు చూస్తాను.
ఈ నవల్లో మగ పాత్రలకు ఎవరికీ పెద్ద చెప్పుకోదగ్గ వ్యక్తిత్వాలు లేవు. మామూలు మనుషులు! వారిలోనూ కృష్ణమూర్తి అందరికంటే నయం!
ప్రకాశానికి ఆట్టే గొప్ప వ్యక్తిత్వం లేదన్న విషయం అందరూ ఒప్పుకోవాల్సిందే! అవకాశ వాది కూడా! ఇందిర ఛీ పొమ్మనగానే కాసేపు డీలా పడ్డా, మేనమామ మాట వినడమే శ్రేయస్కరమనీ, అతడు చూసిన పిల్లయితేనే తనకిష్టం వచ్చినట్లు మలుచుకోవచ్చనీ తనను తాను మోసం చేసుకుంటాడు. అంతే కాదు 'ఈ ఇందిరా కల్యాణీ ఎవరు వీళ్ళనా? డబ్బు కోసం వలలు పన్నే వాళ్ళు"అని ఇద్దరు ఆడపిల్లాల్మీదా తన పిరికి తనాన్ని కవర్ చేసుకోడానికి నింద వేస్తాడు కూడా!
డాక్టర్ గురించి చెప్పడానికేమీ లేదు. అతడొక మంచివాడు అంతే!
కృష్ణమూర్తి మెతక స్వభావం కల్గిన వాడు కాబట్టి, కష్టాలనేవి ఎరగని వాడు కాబట్టి, "మీ నాన్న ఏమయ్యాడు"అని అడిగినపుడు ఇందిర చెప్పిన ఆమె కథకు కరిగిపోతాడు. అంతకు ముందే ఆమెను అసహ్యించుకున్నానన్న సంగతి మరిచేపోయి ఆమె పట్ల సానుభూతి చూపిస్తాడు.
వసుంధర అతని పట్ల ఇష్టాన్ని చూపిస్తోందని గ్రహించినా, ఇందిరతో అతనికున్న సాన్నిహిత్యాన్ని గురించి ఆలోచించి వసుంధర వైపు మొగ్గకుండా నిగ్రహించుకుంటాడు. అంతే కాదు, ఇందిర జాణలా కనిపించినా అమాయకురాలేననీ,ఆమెకో తోడు తప్పకుండా కావాలనీ ఆ తోడు తానే అవ్వాలనీ అనుకుంటాడు. ఇందిర పైకి ఎంత డాంబికపు వేషాలేసినా, ఆమె లోని "స్త్రీ"అని కృష్ణ మూర్తి గౌరవిస్తాడు.
అందుకే కృష్ణమూర్తి అంటే కాస్త సాఫ్ట్ కార్నర్!
రమణ గారూ,
మీ సందేహమే నాకూ ఉండేది! తర్వాత నేను అర్థం చేసుకుందేమిటంటే చాలామంది రచయితలు తమ మానసిన పరిపక్వతను, ఆలోచనలను ,భావాలను తాము సృష్టించిన పాత్రల ద్వారా మనకు చూపిస్తారని!
దయానిధి పాత్రను చదివాక బుచ్చిబాబు మిగతా రచనలు కూడా చదివితే వాటిలోని పాత్రలు కూడా పరిపక్వత తో ఆలోచించడం చూస్తాం!
గీతాదేవి పాత్రా అంతే! చండీదాస్ ఆలోచనలే ఆమెలో కనిపిస్తూ ఉంటాయి.
Madam,
Naaku gurunnantha varku..
INDIRA..oka Opportunist..
She can do anything for her
survival..
(At present Novel is not available
to me..I dont know that expressing
my opinion according to my
Memory..If anybody tells i ll do
self-examination..
రాధిక గారూ,
హీరోల విషయం వస్తే ప్రకాశం ఒట్టి పిరికివాడు.
నాకయితే కృష్ణమూర్తి వ్యక్తిత్వమే నచ్చింది.
డాక్టరు వ్యక్తిత్వం కూడా బాగనే ఉంది లేండి. చదువుకున్న వాడు, అందరిలోకి పరిపూర్ణమయిన వ్యక్తిత్వం (మగవాళ్ళలో) అని చెప్పుకోవచ్చు.
నవల చదవని వాళ్ళు ఉంటారు కదా! అందుకే ఎక్కువ ఉదాహరణలు ఇవ్వకుండా చెప్పాను.
ఇక ఇందిర పాత్ర గురించి ఆలోచిస్తే ఆమె చీకటిని తిడుతూ కూర్చోక సమాజాన్ని ఎదిరించి నిలబడడం నాకు బాగా నచ్చింది.
ఇక వసుంధర కూడా ఏమీ తక్కువయినది కాదు, ఆమె కూడా నవలలో బలంగానే కనిపిస్తుంది మనకి.
రామకృష్ణ గారు, ఆ రాసేదేదో తెలుగులో రాయచ్చు కదా!
VENU Garu..
Prakash, Kalyanini.ni
ishtapadtunnadu ani telisi
Indira, Kalyani.ni intlo nunchi
vellipoyela chestundi..Asalu naaku
Indira.ku vyaktitvam ekkadundo?
artham kavadam ledu..
రామనరసింహ గారూ,
వ్యక్తిత్వం అంటే త్యాగం చేయడమా? ఇంకేమీ కాదా? ఇందిర సగటు మనిషిగా ప్రవర్తిస్తుంది. సమాజం నిర్దేశించిన విలువల్ని పాటించదు. అదేగా నవల్లోనూ ఇక్కడ పోస్టు లోనూ చెప్పింది.
ఇందిర వ్యక్తిత్వం ఈ ఒక్క సంఘటనను బట్టి అంచనా వేసేస్తారా?
Ramanarasimha garu,
ఇకపై మీరు తెలుగులో వ్యాఖ్యలు రాయాలని మనవి. లేదా పూర్తిగా ఇంగ్లీష్ లో రాయండి. RTS లో వద్దు దయచేసి! చదవడానికి ఇబ్బందిగా ఉంటుంది.
Madam,
I can show many reasons..
I will send a mail tomorrow
morning..
KRISHNAPRIYA..garu,
I can show many reasons..
I will send a mail tomorrow
morning.
చంద్ర శేఖర్ రావు గారు చెప్పినట్లు "ఇందిరను ఇష్టపడే రోజులు ఇంకా మనకు సమీపించలేదు"! ఇందిర పాత్రలో అయోమయం కనపడినా, మరే కారణం చేతనైనా ఆ పాత్ర నచ్చకపోయినా నిజమైన కారణం ఇందిర అందరు ఆడపిల్లల్లా, ఇంకా చెప్పాలంటే కల్యాణిలా ఏడుస్తూ ఉండక సమస్యకు ఎదురు తిరగడమే! దాన్ని అందరూ స్వాగతించలేదు.
రామ నరసింహ గారూ, వ్యక్తిత్వం అంటే మంచి లక్షణాలుండటం అని నిర్వచనం ఉందా?
ఇందిరే ఏడుస్తూ కల్యాణికి ప్రకాశాన్ని వదిలిపెడితే ఇందిరకు వ్యక్తిత్వమున్నట్లూ, లేకపోతే లేనట్లూనా?అసలు ఆ రోజుల్లో అంత ధైర్యంగా ఇందిర ప్రవర్తించడమే ఇందిర వ్యక్తిత్వానికి గీటురాయి.
సో కాల్డ్ త్యాగాలూ, కన్నీళ్ళూ కావాలంటే మరెవరి పుస్తకాలన్నా చదువుకోవచ్చు మనం! ఇందిర లేకపోతే ఈ నవలే లేదు. పుస్తకం ఇన్నాళ్ళు నిలబడిందంటే(ఇంకా నిలబడుతుంది కూడా) ప్రకాశం,కల్యాణిల వల్లకాదు.వీళ్ళు ఎక్కడబడితే అక్కడ కుప్పలు తెప్పలు!
ఇందిర లా తను కోరుకున్నది తను చేయగలిగే స్త్రీలు మీకు దుర్భిణి వేసి వెదికినా దొరకరు..50ల్లో!
శ్రీవల్లీ రాధిక గారూ,
మీ అభిప్రాయాలు మీరు రాయండి. అవి రచయిత్రి అభిప్రాయాలవునో కాదో నిర్థారించుకునే అవకాశం పాఠకులకివ్వండి. ఎందుకంటే రచయిత్రి ఏం చెప్పదల్చుకుందో, ఎవరి వ్యక్తిత్వాన్ని ఎలా చిత్రీకరించిందో ఇక్కడ తేటతెల్లం!
శ్రీదేవి ఏమనుకున్నారో నవల చదివిన వారందరికీ తెల్సిన విషయమే! మీరేమనుకుంటున్నారో చెప్పండి చాలు.
సుజాత గారు,
నా కామెంటు మీద మీ అభిప్రాయం ఏమిటి ?
నీలాంచల గారు,
అందరి అభిప్రాయాలూ ఒకలా ఉండవు.
దయచేసి వ్యంగ్యాలొద్దు! కొద్దిగా సాఫ్ట్ వాయిస్ తో రాయకూడదూ!
మీరు చెప్పిన ప్రతి పాయింట్ తోనూ ఏకీభవిస్తున్నాను.
చక్కని విశ్లేషణ!పదే పదే చదివించే గుణమున్న నవల.కలకాలం గుర్తుండే రచనగా ఈ నవలలో కాలాతీతవ్యక్తి ఇందిరను సృష్టించి మనకదించిన కాలాతీత వ్యక్తి డా.పి.శ్రీదేవిగారే అనిపిస్తోంది.మీ విశ్లేషణ నన్నుకూడా స్పందింపచేసింది.
@VENU,@NEELANCHALA..garu,
I will give my opinion
comprehensively(clearly) tomorrow
morning..
శ్రీ గారూ,
మీ బ్లాగుకెళ్ళి మీరు ఈ పుస్తకం గురించి రాసిన టపా చదువుతుండగా మీరు కొత్తగా వ్యాఖ్య రాసినట్లున్నారు, అక్కడ ముగించి రాగానే కనపడింది.
మీరు మీ టపా ఇంకొంచెం విశ్లేషణతో రాస్తే బావుండేదనిపించింది. కల్యాణి గురించి "అప్పుడప్పుడూ నవ్వుతూ ఉంటుంది"అని వ్యంగ్యంగా రాయడం నవ్వు తెప్పించింది.
మీ వ్యాఖ్యతో ఏకీభవిస్తున్నాను. కృష్ణమూర్తే మనిషిలా ప్రవర్తిస్తాడు ఇందులో! డాక్టర్ కూడా మొదటి భార్యతో విసిగి వేసారిన అనుభవంతో ఉన్నవాడు కాబట్టి సహజంగానే అనుభవజ్ఞుడిలా ప్రవర్తిస్తాడు.
నేను చెప్పాలనుకుని మర్చిపోయిన దాన్ని మీరు చెప్పడం బావుంది. వసుంధర గురించి! కృష్ణ మూర్తిని ఇష్టపడినా అతడు ఇందిరను వివాహమాడుతున్నాడని తెల్సీ స్పోర్టివ్ గా వాళ్ల పెళ్ళికి వస్తుంది. అదే కల్యాణి అయితే ఏం చేసేదో తల్చుకుంటే భయమేస్తుంది.
ఇందిర లాంటి బలమైన అభిప్రాయాలున్న స్త్రీలను సమాజం అంత త్వరగా యాక్సెప్ట్ చేయకపోవడం సహజమే!
@KRISHNAPRIYA..garu,
What is meant by Personality?
Plz define..
@VENU..garu,
Swabhimananiki, Adarshaniki madhya
theda emito cheppandi?
థాంక్స్ సుజాత గారు.
Sujata Garu,
The writer, Jalandhara garu (movie artiste ChandraMonhan's Wife) wrote analysis on Indira's Character of this book a while agao in Koumudi.net. It was really nice. Yours is good too. In that article, Jalandhara garu provided Dr. Sridevi's picture also. I think it was one of the beginning issues of Koumudi.net
@VENU,
You agreed that "Indira is not an
ideal character".
Thanq..u r making my way easier..
rputluri@yahoo.com
ఈ నవలకీ, మార్గరెట్ మిచెల్ రాసిన "గాన్ విత్ ద విండ్" నవలకీ చాలా పోలికలున్నాయనిపించింది నాకు. ఇందిర పాత్ర చాలా వరకు అందులో హీరోయిన్ స్కార్లెట్ లాగే ఆలోచిస్తుననిపించిందా ఎవరికైనా?
నిజంగానే చాలా రోజులు చాలా ఆలోచింపచేసే పుస్తకం.
శారద
నవలలను చిత్రం గా తీయటంలో ప్రధాన పాత్రల రూపు రేఖలు మారిపోయి వాటి స్వభావ స్వరూపాలు మారాక పాత్రలను గుర్తు పట్టడం కష్టమే అవుతుంది. గైడ్ సినిమా చూశాక, ఆ చిత్ర కధా రచయిత ఆర్.కె. నారాయణ్ ఎంతో అసంతృప్తికి లోనై, "The Misguided Guide!" అని లైఫ్ పత్రికలో వ్యాసం వ్రాశాడు. ఆ వ్యాసం గైడ్ చిత్రం బాక్స్ ఆఫీస్ వసూళ్లను ప్రభావితం చేసిందని ఆ చిత్ర కధా నాయకుడు దేవ్ ఆనంద్ అభిప్రాయ పడ్డాడు. అయితే జీవన తరంగాలు నవలలో కన్నా చిత్రంలో సన్నివేశాలు బాగా చిత్రీకరించిన సంఘటనలు కూడా లేక పోలేదు. ఆ చిత్రంలో కృష్ణం రాజు ఒక దొంగ. పారిపోతూ, పోలీసులనుంచి తప్పిచ్చుకొందుకు, ఒక శవ ఊరేగింపులో తన తండ్రి శవాన్నే మోయటం జరుగుతుంది. తన నవల కన్నా సినిమాలో ఈ సన్నివేశ చిత్రీకరణ చాలా బాగుందని ఆ నవలా రచయిత్రి తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఇది అరుదనే చెప్పుకోవాలి. కాలాతీత వ్యక్తులు సమీక్ష చదివాక నవల లోని ప్రధాన పాత్ర ఇందిర చిత్రీకరణలో సినిమాలో ఎంత అన్యాయం జరిగిందో అర్ధమవుతుంది. బాగా ప్రాచుర్యం పొందిన నవలలు సెక్రెటరి, డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు చిత్రీకరణలో ప్రధాన పాత్రల మానసిక సంఘర్షణలను ఆవిష్కరించటంలో, సెక్రెటరి, ఛాలెంజ్ చిత్రాలు విఫలమయ్యాయి. ఇందుకు కాలాతీత వ్యక్తులు కూడా మినహాయింపు కాలేకపోయింది. అది మన దురదృష్టం.
cbrao
Mountain View (CA)
@NEELANHALA..@KIRANPRIYA garu,
What is meant by "Personolity"?
Plz define..
ఈ నవల గురించి ప్రముఖ రచయిత్రి శ్రీమతి జలంధరగారి విశ్లేషణ ఇక్కడ చదవచ్చు
http://www.koumudi.net/Monthly/2007/may/may_2007_telugunavalallo_tarunimanulu.pdf
రామ నరసింహ గారూ,
ముందు ఇందిర గురించి మీరు ఏమనుకుంటున్నారో ,నవల గురించి మీ అభిప్రాయమేమిటో వివరంగా రాయండి.మిగతా వారి నిర్వచనాలు,అభిప్రాయాలు
తెలుసుకొంటే మీ భావాలు మారవు కదా! అందువల్ల మీకు నవల ఎందుకు నచ్చలేదో రాయండి చాలు. please write in telugu sir!
రామనరసింహ గారూ,
వ్యక్తిత్వమూ, స్వాభిమానమూ లాంటివి అంత గందరగో్ళపడే నిర్వచనాలతో ఏమీ లేవు కదండీ. అసలీ నవల మీకెందుకు నచ్చలేదో తెలుసుకోవాలని మేమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంటే మీరేమో నిర్వచనాలు చెప్పమంటూ ‘కాలాతీతం’ చేస్తున్నారు.
ఇందిరను‘వ్యక్తిత్వం’ లేని అవకాశవాది అన్నారు కదా, దాన్ని మీ దృష్టికోణంలోనే నిరూపించండి!
@ఇందిర పాత్రను నేను ఇస్టపడకపోవడానికి కారణాలు:-
1)ఆమె చేసేవన్ని అంతరాత్మకు విరుద్ధమైనపనులే..(రాధిక గారి అభిప్రాయం చూడండి..)
2)She doesn`t follow "the moral values" of the Society..(see opinion of the Jyothy garu..)
3)Shi divides Kalyani & Prakash..
4)I think that these 3 reasons are enough to support myself..
Sujatha garu,
Is there any possibility to read this book through INTERNET..?
Plz inform..
i wish happy bday to u in advance
ఇప్పుడే మీ సమీక్ష చదివాను. పుస్తకం పేరైతే విన్నానుగానీ... చదివితీరాలనిపించింది మాత్రం ఇప్పుడే. థ్యాంక్యూ సో మచ్... వ్యక్తిత్వ చిత్రణకి (కళ్ళముందు వ్యక్తుల్ని కనిపించేలా చేసినందుకు).
సుజాత గారూ... మీరేమనుకోనంటే చిన్నమాట... కామెంట్స్ గూగుల్ ఎకౌంట్ ఉన్న ఒక్కరివే తీసుకున్నారు. నాలాంటి యాహూ యూజర్స్ కామెంట్ చెయ్యాలనుకుని చెయ్యలేకపోవచ్చేమో(మొన్న 'బాలు గారికి లెటర్' చదివి కామెంట్ చెయ్యకుండా నేను వెనుదిరిగినట్టు). కనీసం ప్రొఫైల్‌లో మీ మెయిల్ ఐడి అయినా ఇవ్వలేదు...
ఏదేమైనా మంచి పుస్తకాన్ని నా(మా)కు పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు.
గీతిక బి
సుజాత గారు,
Wish you a very happy birthday...
మీరిలానే మరెన్నో చక్కటి,ఆనందకరమైన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..మీకు మెయిల్ చేసి విష్ చేద్దామనుకున్నాను. కానీ నా సిస్టం పాడయ్యింది..అందుకే ఇలా కామెంట్ రూపంలో ఆఫీస్(జీమెయిల్ ఆక్సస్ ఉండదు) నుండి విష్ చెయ్యాల్సి వచ్చింది..:)
bavundi :-)
" కాలాతీత వ్యక్తులు " చదివి చాలానే కాలం అయ్యిందండి. కధలో సంఘటనలు , సంభాషణలు అంతగా గుర్తు లేక పోయినా , గుర్తున్నది మటుకు ఇందిర విలక్షణ వ్యక్తిత్వమే !
ఎందుకు విలక్షణత ? ఎందుకంటే నలుపు తెలుపుల మిశ్రమం కాబట్టి ! కష్టమొస్తే ఏడిచి సాధించే పరిస్థితి చిన్నప్పటి నుండి లేక పోతే ఏడుపుని దూరం చేసుకుని లౌక్యం తో పని కానిస్తుంది కాబట్టి. ఒక ఆదర్శ వ్యక్తిత్వం కాకుండా సగటు మనిషిలా ( ఆడ అని మగ అని కాదు ) ప్రవర్తిస్తుంది కాబట్టి.[ సగటు అన్న పదం కరెక్ట్ కాదు అనిపిస్తుంది. బహుశా నిజ జీవిత పాత్ర సరి అయినదేమో ? ] రచయత్రి ఉద్దేశ్యం ఇందిరని పాఠకులు ఆదరించాలనా ? ద్వేషించాలనా ? నాకు అనిపించింది అర్ధం చేసుకోవాలని ! కధ కోసం సృష్టించబడ్డ ఆదర్శ మూర్తిలా కాకుండా నిజ జీవిత పాత్రలా వుంటుంది కాబట్టి. ఇద్దరు మగవారి తో చనువుగా వుండే నిజ జీవిత పాత్ర ? ఆశ్చర్యం గా వుందా ? ఏ వంద మందికో వెయ్యి మందికో ఒకరిద్దరు వుంటారు. అలాంటి వారిని లోకం చూసే చూపులు , అర్ధం చేసుకునే తీరు వేరు. కానీ శ్రీదెవి గారి గొప్ప తనం అదే.. ఇందిరని మనం నేడు చూస్తున్న తీరు వేరు. సమాజాన్ని ఎదిరించిన వీర వనిత కాదు ఇందిర... లౌక్యం తో.. తన జీవితాన్ని ఒక ఒడ్డుకి చేర్చే ప్రయత్నం చేసె సగటు ( ??? రచనా ప్రపంచం లో విలక్షణ ) వ్యక్తి తను. ఆవిడని మనం గ్లోరిఫై చెయ్యడమో , అసహ్యించుకోవడమో కాదు చెయ్యాల్సింది అర్ధం చేసుకోవాలి.
అన్నట్టు ముగింపు ముందు జరిగే ఆక్సిడెంట్ కధని , ఒక పాత్ర నిర్ణయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది కదూ.. సరిగా గుర్తుకు రావడం లేదు. మీరు ఏమన్నా కొంచెం చెబుతారా ? [ పుస్తకాలు చదివి కొనేటంత సంపాదన అప్పుడు ఉండేది కాదండి. కాలక్షేపం కోసం ఎవరి దగ్గరో చదివి తిరిగి ఇచ్చేసా ! మంచి పుస్తకం. తప్పు చేసానేమో తిరిగి ఇచ్చి :-) ]
పిల్లకాకి ఉరఫ్ కృష్ణ
కృష్ణ గారు,
అవును ఇందిరను అర్థం చేసుకోవాలనే రచయిత్రి భావన. కళ్యాణిని ఉన్నతంగా చిత్రీకరించారనీ, ఇందిరను రచయిత్రే హేళన చేసారని వాదనలు వినిపిస్తున్నాయి చూశారు కదా! ఇందిరను ఒక స్త్రీగా కాదు, ఒక మనిషిగా అర్థం చేసుకోవాలి! పరిస్థితులకనుగుణంగా తనను తాను కాపాడుకోడానికి లౌక్యంగా ప్రవర్తిస్తుంది ఇందిర. కానీ ఇటువంటి లౌక్యాన్ని ఆనాటి నుంచి ఈనాటి వరకూ స్త్రీ పాత్రలో అంగీకరించే స్థాయికి ఇంకా ఎదగలేదు మనం!
ఎవరో కొద్దిమంది తప్ప ఇందిర ను ఆరాధించేవారే ఎక్కువ! అర్థం చేసుకున్నవారే ఎక్కువ!
చివరలో కృష్ణమూర్తి ఇందిరనూ,కళ్యాణి డాక్టర్నీ తిరుమలలో పెళ్ళాడటానికి వెళ్తారు.అప్పుడు డాక్టర్, కళ్యాణి ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ అవుతుంది.ఎలాగో ఆలస్యంగా వాళ్ళు అంతా ఒకచోట కల్సి తిరుపతిలో పెళ్ళి చేసుకుంటారు.అంతే!
@ సుజాత గారు,
>> ఎవరో కొద్దిమంది తప్ప ఇందిర ను ఆరాధించేవారే ఎక్కువ! >>
ఎందుకో ఈ విషయం లో ... ఏకీభవించలేక పోతున్నాను.
ఒక నవలలో ఇందిరని మనం అర్ధం చేసుకున్నా.. ఆరాధించినా , నిజ జీవితం లో మటుకు అటువంటి వ్యక్తులు ఎదురు పడితే ఆశ్చర్య పోవడమో .. అపార్ధం చేసుకోవడమో జరుగుతుంది. సమాజం.. మన సాహిత్యం అలా వున్నాయి.
పుట్టగానే ఏ ఇందిర , కళ్యాణి.. వసుంధర ఇలా వుంటామని ముందుగా అనుకోరు. పరిస్థితులు , పెంపకం వారిని అలా తయారు చేస్తాయి. మనం వారిని ఆరాధించినా , అపార్ధం చేసుకున్నా , వారి పరిస్థితిలో సగటు మనిషి ఎలా వుంటాడో చూసుకోవాలి.
ఇందిర ప్రకాశం తో గాని, కృష్ణ మూర్తిని గాని పెళ్లి చేసుకోవాలనుకున్నది ప్రాక్టికల్‌గా ఆలోచించి...తనకి తోడు నీడగా.. కష్టాలు పంచుకుంటారు అని.. అలా ప్రాక్టికల్‌గా నిజాయితీగా వుండడాన్ని , రచనలలోనె కొంత మంది ఆమోదించలేరు.. ఇక నిజ జీవితం లో అలాంటి వారు ఎదురు పడితే చాలా మంది అపార్ధమే చేసుకుంటారు.
ఏది ఏమైనా మరొక్క సారి మంచి నవలని పరిచయం చేసారు. కృతజ్ఞతలు.
1) అసమర్ధుని జీవిత యాత్ర,
2) చివరకి మిగిలేది ,
3) మైదానం ( ఇది ఆ లిస్టులో సరిపోతుందో లేదొ ?)
4) అంపశయ్య
ఆధునిక సాహిత్యం లో ఇవేనా ఆణిముత్యాలు ? ఎక్కడొ ఎవరొ ఒక నాలుగు మంచి రచనలు ఇవి అని చెప్పారు. అందులో మూడవది గుర్తు లేదు సరిగా. మీదృష్టిలో ఈ లిస్టులో ఏవి వుండాలి ?
డియర్ సుజాత
నాకు ఎంతో ప్రియమైన ఇందిర గురించి మీ రివ్యూ అద్భుతం.ఈ వ్యాసాన్ని భూమికలో వేసేస్తున్నా.
సత్యవతి
యాదృచ్చికంగా ఈ నవలను ఇప్పుడే పూర్తిచేసాను. దీనిపై నెట్ లో ఏమైనా ఎవరైనా రాసారా అని చూస్తే చాలా లింకులు వేడి వేడి చర్చలు కనపడ్డాయి.
ఇక ఇందిర వ్యక్తిత్వం నాకు పెద్దగా నచ్చలేదు.
ఒక అవకాశవాది లానే కనిపించింది. మరీ ముఖ్యంగా ఇందిర కోసం వచ్చే వారిని ఎక్స్ ప్లాయిట్ చేసే ఆనందరావు,
-- "పెట్టే బళ్లు సొగసు ఇప్పుడేముందీ! అవెందుకు పనికొస్తాయో కూడా ఈ కాలపు వాళ్లకు తెలీదు అంటూ అన్యాపదేశంగా ఆనందరావు శృంగారాన్ని సూచించటం.
--తండ్రి తన రాసలీలలు చెపుతున్నపుడు ఇందిర ఆ సంఘటన జరిగింది రాజమండ్రిలో నాన్నా అంటూ కరక్ట్ చేయటం -
--పేజీ నంబరు 51 లో ఇందిరకు ప్రకాశానికి శృంగారం జరిగిందన్నట్లు చాలా చాలా సటిల్ గా రచయిత్రి సూచించటం (నిజంగా అత్యంత ప్రతిభావంతమైన నెరేషన్ ఇది)
వంటి వివిధ విషయాలు చదువుతున్నప్పుడు ఇందిర ఆనందరావుల వ్యక్తిత్వాలు అంత ఉన్నతమైనవి గా అనిపించలేదు. డబ్బున్న/చదువుకొన్న మగవారికి ఎరవేసి వలలో వేసుకొనే వాంప్ పాత్రలానే అనిపించింది తప్ప మరో భావన కలగలేదు. ఆమె తండ్రి పాత్రో పింప్ లా తోచింది.
ఇక ఆమెపలికిన కొన్ని మాటలు స్త్రీ స్వేచ్ఛ, సమానత్వం వంటి ఆధునిక భావజాలలకు దగ్గరగా ఉండటం కాకతాళీయం కావొచ్చు తప్ప ఆ పాత్ర వ్యక్తిత్వాన్ని/ప్రవర్తన ను సమర్ధించేవిగా లేవని నా అభిప్రాయం.
ఇక నవల గురించి చెప్పాల్సి వస్తే చాలా గొప్ప శైలి, నడక, ఉద్రేకపరచే సంభాషణలు, గొప్ప ప్రతిభావంతమైన అల్లిక. సమాజంపై చేసిన వ్యాఖ్యానం ఇప్పటికీ సజీవమే.
ఈ మధ్య కాలంలో బాగా ఎంజాయ్ చేసిన గొప్ప నవల.
బొల్లోజు బాబా
బాబా గారూ,
బ్లాగర్ సమస్య వల్ల అదనంగా వచ్చిన మీ కామెంట్స్ ని డిలీట్ చేశాననే అనుకుంటున్నా ఇంత సేపూ! మీ మరో కామెంట్ చూశాక కానీ తెలీలా "డిలీట్ " బదులు "పబ్లిష్" నొక్కానని! ఇప్పుడు తీసివేశాను.
ఒక మంచి నవలను పరిచయం చెసినందుకు మీకు థాంక్స్...
ఈరొజే చదవడం పూర్తి చెసా....చాలా బావుంది.
పాత్రల వర్ణన అద్బుతం.
కాని ఎందుకొ....ఇందిర కెవలం నవలల్లొ మత్రమే ఉండె వ్యక్తి లా అనిపించింది.
మీ పరిచయం, చర్చా రెండూ చాలా బాగున్నాయండీ !!
"మంచీ చెడూ రెండు రాసులు పోసినట్టు వేరు వేరు గా ఉండవు - మంచి చెడూ కలిస్తేనే మనిషి" అన్న ముళ్ళపూడి వారి మాట గుర్తొచ్చింది చర్చ అంతా చదివాక.
ఇందిర అప్పటి సమాజాన్నే లెక్క చెయ్యలేదు - ఇప్పటి మన కామెంట్లని లెక్క చేస్తుందా ? :)
సుజాత గారూ - మీరు రాసినట్టు - "ఒక అశాంతిని, కొన్ని లక్షల ఆలోచనలనూ,కొంత హాయినీ ఒకేసారి కల్గించే నవల!"
అందుకే ఇన్ని పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు !!
కాలాతీతవ్యక్తులు నవలమీద సమీక్ష చదివాను.నేను ఇటీవల శ్రీదేవి గారి పై మొనోగ్రాఫ్హ్ రాశాను.అప్పుడు మీ రచన చదివుంట్ బాగుండేదని అనుకున్నాను.ఇటీవలే బ్లాగ్స్ చూడడం నేర్చుకున్నాను. ఇందిర పై మీ అభిప్రాయం తో ఏకీభవిస్తాను. మరో విషయం పి సరళాదేవి మా అక్క.నేను నా రచన లో ఇందిర ప్రవర్తనకు ఆమె పెరిగిన వాతావరణం పరిసరాలు కూడా కారణం గా చూపాను.మొత్తం మీద మీకు నవల పై వున్న అభిప్రాయాలు ,వ్యాసం బూగున్నాయి. మీకు అభినందనలు SeelaSubhadraDevi
Post a Comment