July 2, 2010

నీ నగలను నువ్వే రక్షించుకో! !



నీ కొండకు నీవే రప్పించుకోమని ఏడుకొండల వాడిని అడిగే ఆనవాయితీ పోయి "స్వామీ , నీ నగలను నువ్వే కాపాడుకోవాలి , లే, లే !ఇహ నువ్వే రంగంలోకి దిగి ఒక్కొక్కళ్ళకీ నీ ఉగ్ర నరసింహావతారం కనీసం కల్లో అయినా చూపించి ఏదో ఒకటి చెయ్యి"అని వేడుకోవాల్సిన పరిస్థితి దాపరించింది.




అవి మామూలు నగలా? ఐదు వందల ఏళ్ళనాడు రాయలు దేవస్థానానికిచ్చిన నగలు! వాటికి బంగారం పరంగా పక్కన పెడితే పురావస్తు సంపదగా విలువ ఎంత ఉంటుందో టీటీడీ వాళ్ళు అంచనా వేయలేరా?



అసలు చివరి క్షణం వరకూ అవి లేవనే విషయమే దేవస్థానంలోవారికి సరిగ్గా తెలీదంటే ఎంత అలసత్వంతో కొట్టుమిట్టాడుతున్నట్లు వీళ్ళు? రాయలిచ్చిన నగలేవో, ఇతరులిచ్చిన నగలేవో అసలులెక్కలే లేవు.

అన్నింటితో పాటు రాయలవారిచ్చిన నవరత్న కిరీటాలు, వెండి పళ్ళాలూ మొత్తం కరిగించి పోశారట! ఏవి కరిగించారో తెలీదు. ఎంత కరిగించారో తెలీదు!


 అసలేమీ తెలీదు! ఎవ్వరికీ తెలీదు.


నలభై ఏళ్ళక్రితమే కరిగించినా ఫొటోలు తీసే చివరిక్షణం వరకూ, ఎవ్వరి వద్దా ఏ సమాచారమూ లేదు.సెబాసో!

నేనేం చెప్పేది? అని ఒకడు, నాకేటి తెలుసు ?అని ఒకడు !ఎంత బాధ్యతా రాహిత్యం!

అసలు నగలు కరిగించిన విషయం రికార్డుల్లో ఉందో లేదో స్పష్టత లేదు. పైగా పాత రికార్డులన్నీ కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయనీ వాటిలో వివరాలన్నీ ఉన్నాయని చెప్తున్నారు. అంటే అందులో రాయలు సమర్పించిన నగల వివరాలుండే ఉంటాయిగా!



దీనికి వ్యతిరేకంగా డాలర్ శేషాద్రి వారేమో "రాయలు ఇచ్చిన నగల ఆనవాళ్ళే లేవు.వాటిని గుర్తు పట్టలేం! 500 ఏళ్ళ నాటి నగలు కద, పాడైపోతాయి"అని సెలవిస్తున్నారు. వీరి "అనుభవం" దృష్ట్యా ఆ మాటలకు విలువ కట్టాలి!



నగలు కరిగిస్తే విలువైన వజ్రాలు, మణులూ,మాణిక్యాలూ ఏమయ్యాయి?



పైగా "కరిగించి ఉండొచ్చు"


"తాపడానికి వాడారేమో"


"రికార్డుల్లో లేకపోవచ్చు" అని అన్నీ అనుకోళ్ళే!

ఈనాడు లో శ్రీధర్ కార్టూన్ భలే వేశాడు,చూడండి





ఒకపక్క తొమ్మిదో టీవీ వాళ్ళు తిరుమల ను కాపాడుకోడానికి "సోనియా గాంధీ" గారికి ఈ మెయిల్స్ పంపాలని చెప్తూ కామెడీ చేస్తున్నారు.:-))

మరోపక్క టీటీడీ వాళ్ళు ఈ ట్రాజెడీ ని నిన్ననే బయట పెట్టారు.


ఇందులో ఎవరి బాధ్యతెంతో ఎప్పటికి తేలేను?

రెండు రోజుల్లో అందరం ఎవరి గొడవల్లో వాళ్ళుపడి పోతాం! దీనికి ఫాలో అప్ ఎప్పుడు?


టీటీడీ లో ఉన్నత స్థాయి నుంచి చిరుద్యోగుల వరకూ ఎవరికీ ఆ కొండమీద దేవుడనే వాడొకడున్నాడని నమ్మకమే లేనట్టుంది.

ఇప్పటికైనా కళ్ళు తెరిచి స్వామి నగల్ని కాపాడుకోకపోతే కొన్నాళ్ళకి ఇదిగో, పైన ఫొటోలో ఉన్నట్లు శ్రీవారిని చూపించి, "ఏమో, ఆ సర్వాంతర్యామే నగలన్నీ ఎవరికో ఇచ్చాడేమో, ఆయన లీలలు తెలియతరమా" అని చెవిలో పూలు పెట్టేగల్రు!


కనీసం నిజాం నగలను అప్పుడప్పుడూ ఏ తాజ్ కృష్ణలోనో ప్రదర్శనకు పెట్టినపుడన్నా చూస్తాం!


రాయలవారు సమర్పించిన అపార సంపద మాయం! కనీసం ఫొటోల్లో అయినా చూడలేం!


గోవిందా గోవిందా!

19 comments:

కృష్ణప్రియ said...

సుజాత గారూ,

Well written article..
రాయల వారిచ్చిన నగలకే జమా లెక్కా లేదంటే.. చాలా దురదృష్టకరం!

కృష్ణప్రియ/

telugodu said...

church kosam funds laga icharu emo...

ఆ.సౌమ్య said...

ఈ issue ఏమిటండీ, నాకు కొత్తగా ఉంది. దీని గురించి వార్తాపత్రికలలో ఎక్కడైనా వచ్చిందా? ఉంటే ఆ లింక్స్ ఇవ్వగలరు. ఈ మధ్య నేను టి.వీ చూదడం లేదులెండి, అందుకే తెలియలేదేమో. news papers వస్తే నాకు చెప్పండి, కనీసం ఆన్ లైన్ లో చదువుకుంటాను.
thanks!

Unknown said...

వీళ్ళు చేసే మోసాలు తట్టుకోలేక అంతటి స్వామి కుంగి పోయారని (విగ్రహ పరం గా )మనకి నిన్ననే సమాచారం వస్తే తట్టుకోలేక నా బ్లాగ్ లో రాసి స్వామిని నిలబెట్టే శుభ గడియల కోసం ఎదురు చూస్తున్నా .

Mahesh Telkar said...

ఎవరు చుసోచ్చారండి మీరు మరీను, అయన చేసిన అప్పు తక్కువ ఏంటి ? కుబేరుడు ఎప్పుడో ఆ కానుకలు వడ్డీ కింద జమ కట్టేసుకొని స్వర్గానికి తీసుకెళ్ళి ఉంటాడు .. ఆ కలం లో దస్తావేజులు లేవు కదా .. అంతా నోటి లెక్కే (ఇలాంటి కామెంట్ కూడా రాక మానదు)

హరి said...

ఇంకెక్కడి నగలు? ఈ పాటికి ఏ విదేశాలలోనో ఉంటాయి. ఏ ఆక్షన్ లోనో ప్రత్యక్ష మైతే తిరిగి కొనుక్కోవాల్సిందే, అదీ అవసర మనుకుంటే.

శేఖర్ పెద్దగోపు said...

>>
టీటీడీ లో ఉన్నత స్థాయి నుంచి చిరుద్యోగుల వరకూ ఎవరికీ ఆ కొండమీద దేవుడనే వాడొకడున్నాడని నమ్మకమే లేనట్టుంది....

హా..హ్హా..నమ్మకమా! అసలు 'దేవుడు అంటే భయం' లాంటివి అక్కడ పని చేస్తున్న ఎక్కువ శాతం మంది సిబ్బంది డిక్షనరీల్లో భూతద్దం పెట్టి వెతికినా కనపడవండి...దొంగలు ఎక్కడున్నా దొంగలే...ప్రదేశంతో వారికి పని ఉండదనుకుంటా..:-)

>>>ఇప్పటికైనా కళ్ళు తెరిచి స్వామి నగల్ని కాపాడుకోకపోతే కొన్నాళ్ళకి ఇదిగో, పైన ఫొటోలో ఉన్నట్లు శ్రీవారిని చూపించి, "ఏమో, ఆ సర్వాంతర్యామే నగలన్నీ ఎవరికో ఇచ్చాడేమో, ఆయన లీలలు తెలియతరమా" అని చెవిలో పూలు పెట్టేగల్రు!...

ఇది మాత్రం కేక!!..బాగా చెప్పారు.

మరువం ఉష said...

సుజాత, దాదాపు నాలుగేళ్ల క్రితం ఈ మెయిల్లో ఓ ఫొటో పంపారెవరో [చాలా నిండైన అలంకరణలో స్వామిది, ఇది మరొక పదిమందికి పంపితే ఇదీ లాభం, పంపకపోతే అదిగో వారికలా అని [మునుపు రోడ్ల మీద నిలబడి కరపత్రాలు పంచేవారే అలా] ముక్తాయింపు కలిపి మరీ. మీరు పెట్టిన ఈ చిత్రం పక్కన అది ఊహిస్తే 'ప్చ్..మనిషి స్వార్థాన్ని/దౌష్ట్యాన్ని ఎత్తి చూపినట్లుగా.' పాపం స్వామి తనకి వచ్చిన ఆ మాదిరి లేఖని నాలాగే నిర్లక్ష్యం చేసారేమో! నాకేవీ మణులు, మాన్యాలు లేవు. ఆయన మాట వేరుగా. ఎన్నిసార్లు కరిగించారో ఆ హారతి కర్పూరం..అక్కడి వార్తలేవీ చూడలేదు అనుకున్న క్షణమే మీ టపా కళ్లబడిమ్ది. నిజంగానే శెబాసో మన జనుల కుటిలనీతికి తిరుగేలేదు.

భావన said...

మనం కల్పించుకున్న విలువలలో మనమే మునిగి, ఆయనకు లేని తత్వాన్ని ఆయనకు అంటగట్టి, ఆనక ఆయన కాపాడుకోలేదనీ ఆయన ఎవరినో కాపాడాడని అనుకుంటాం మనం. ఆయన అడిగాడా ఈ నగలన్నిచెప్పు, ఈ డాలర్ శేషాద్రి లాంటీ దొంగలు కోసం ఇచ్చినట్లుంది రాయలు వారు నగలు.. ఆయన భక్తి పూర్వకం గా ఇచ్చినవి ఇలా అయ్యాయి చివరకు.
నాకెప్పుడూ అదే అనిపిస్తూ వుంటుంది కొండ మీద పని చేసే వాళ్ళు ఎవ్వరికి పూజారులతో సహా, దేవుడు వున్నాడనే నమ్మకం లేదనుకుంటా అని. నిజం గా నమ్మకం వున్న వాళ్ళెవ్వరు ఇలా చేయరు. వీళ్ళే అసలైన మోసగాళ్ళు.
ఏడు కొండలే ఆయనవి కావు అన్న ఘనులు.. ఇక ఆ బంగారం కాదు అనటం లో విచిత్రమేమి వుంది లే. ఒక్కో సారి నాకు అదే అనిపిస్తుంది మన న్యాయ స్మృతి లో వున్నట్లు "వెయ్యి మది అపరాధులు తప్పించుకున్నా పర్వా లేదు ఒక నిరపరాధి కి శిక్ష పడకూడదు" అన్నట్లు అనుకుంటే తప్ప మనకేమి హక్కు వుంది మనలను (మన మానవాళి ని) కాపాడమని ఆయనను అడగటానికి.. సర్వం గోవిందార్పణమస్తు..

సుజాత వేల్పూరి said...

sowmya,

రాయలవారు వివిధ సందర్భాల్లో ఏడుకొండల వాడికి బోలెడన్ని నగలు ఇచ్చుకున్నారట. రాయలు సింహాసం అధిష్టించి 500 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఆ నగల ఫొటో ప్రదర్శన నిర్వహించాలని తలపెట్టి కెమెరాలు తీసుకొచ్చాక నగలు హుష్ కాకి అయిపోయాయని తెలిసింది. మాకు తెలీదంటే మాకు తెలీదని ఒకళ్ళమీద ఒకర్ళ్ళు ఒట్లేసుకుంటున్నారు.

వాటన్నింటినీ ఎప్పుడో కరిగించేశామని అంటున్నారు! రాయలు గుర్తుగా ఒక్క నగ కూడా కొండమీద లేదు.ఏఅమైపోయాయో ఎవరి వద్దా లెక్కలు లేవు. నగలూ లేవు,బంగారానికీ లెక్క లేదు. ఇప్పుడు తీరిగ్గా విచారణ(అంటే విచారంగా కూచోడం)ప్రారంభిస్తారట.

ఈ బాక్ గ్రౌండ్ లో రాసిందే ఈ టపా
for more news.....

check this link.

http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel9.htm

రవి said...

తెల్లోళ్ళు మొత్తం దోచేసి పోయిన తర్వాత పీడ విరగడైందిలే, ఏదో మనల్నిలా మిగిల్చాడు అనుకుంటే, ఇప్పటి మహానుభావులు దేవుణ్ణే దోస్తున్నారు. పెద్దాయన సంగతి కుబేరుడికి తెలిస్తే, "అయ్యా బాబూ, నీవు అప్పు తీర్చనూ వద్దు ఏమీ వద్దు, నన్ను మాత్రం ఈ త్రాష్టులకు దూరంగా ప్రశాంతంగా బతకనీ" అని వేడుకుంటాడు.

భాస్కర రామిరెడ్డి said...

అవునా!!!!!!!!! నిజమా ఇది?ఎక్కడైనా పూర్తి వివరాలుంటే లింక్ ఇస్తారా?

స్థితప్రజ్ఞుడు said...

సరిగ్గా చెప్పారు...

నిన్ననే అనుకున్నా.. సుజాతగారెంటా..... ఇంకా ఈ విషయం మీద ఏమి స్పందించలేదు అని....

veera murthy (satya) said...

1000 సంవత్సరాల క్రితమే భగవత్ రామానుజులు, ఈ ఆగమ ఆలయ వ్యవస్తని నియమ బద్ధం చేసారు...శ్రీరంగం నుండి తిరుమల, అహొబిలం వరకు వందల ఆలయాలకి ఉపచార, ఉత్సవ, ప్రసాద-వితరణ విధిని ఏర్పాటు చేసి, ఆలయాలకి సంబంధించి 'జీయర్ల'నీ ఏర్పాటు చేసారు...ఆలయాలకి పొషక సదుపాయలన్ని భవథ్-మాన్యాల ద్వారా సమకూరెలా అలయవ్యవస్తని స్థిరీకరించారు....
1) ఆగమ జీర్నొద్ధరణం
2) స్త్రీ వేదపఠనం....
3) దలిత ఆలయ ప్రవేశం...
4) కులాలకి అతీతంగా వైష్ణవత్వం ప్రసాదించడం .. ఇలాంటివెన్నో ....
శ్రీ భగవత్ రామానుజుల, శ్రీవైష్ణవ-విప్లవ-భిక్ష.

మల్లీ అలాంటి విప్లవం ఎప్పుదొస్తుందో ....!!!

""భారపు పగ్గాలు ...పాప-పుణ్యములు వదలవు నీవవి వద్దనక "". . . . !!

||jaisreemannarayana||

bonagiri said...

పాపం పండాలి కదా.

Anil Dasari said...

దేవుడు, భక్తి ఇలాంటివన్నీ అవతల పెట్టండి. ఆ నగలకున్న చారిత్రక విలువని గుర్తించలేని మూర్ఖశిఖామణులు ఇంత ప్రసిద్ధ ఆలయాన్ని నడుపుతున్నారు!

సంస్కృతినీ, భారతీయతనీ ఉద్ధరించి పారేస్తామని ప్రగల్భాలు పలికే పార్టీలూ సంస్థలూ తిరుపతిలో ప్రొటెస్టెంట్ తెగల మత ప్రచారాల మీద పెట్టిన దృష్టిలో పదోవంతు ఇలాంటి తిరకాసు యవ్వారాల మీద పెట్టరేంటో. తూతూ మంత్రంగా ఖండించి ఊరుకోటం తప్ప రాముడి పార్టీవాళ్లు కూడా దీన్ని పట్టించుకున్నట్లు లేరు.

చైతన్య said...

దేవుడి నగాలకే దిక్కులేదు... ఇంక మనుషుల గతేం కాను!
రాయల వారు వచ్చి చెప్తే కానీ... ఆయన ఏమేం నగలు ఇచ్చారో తెలీదు!
శ్రీనివాసుడు వచ్చి చెప్తే కానీ ఆ నగలు ఏమయ్యాయో తెలీదు!

గోవిందా గోవిందా!

Unknown said...

paristiti chostunte yedupu vastundi andaru dongale. bhagavantudi nagalake dikku ledu yinka.... velani niladesevalu leraa
Rekha.

ఆ.సౌమ్య said...

Thanks సుజాతగారు, విషయం సంపూర్ణంగా అర్థమయింది.

గోవిందా గోవిందా అనడం కన్నా ఇంకేం చెయ్యలేను.

Post a Comment