August 10, 2010

శ్రీరామ జయము కలుగవలెను


ప్రొఫెషనల్ గాయకుడికి కావలసిన సర్వ శుభ లక్షణాలూ అతడి గొంతులో కొలువున్నాయి. ముఖ్యంగా మెలోడీ!

నా వోటెప్పుడూ మెలోడీకే!

అవును, శ్రీరామ చంద్ర గురించే !

అతడు ఒక్కరే ప్రోగ్రామ్‌లో పాడినపుడు నేను చూడలేదు. ఇండియన్ ఐడల్ కూడా సెమీస్ కి ముందు చాలా తక్కువ ఎపిసోడ్స్ చూశాను. సెలెక్షన్లు జరిగేటపుడు ఒక కుర్రాడి తండ్రి (పెద్ద ఉద్యోగంలో ఉన్నాడట కూడా) అన్నూ మాలిక్ కాళ్ళమీద పడి "మా వాడు ఆశతో వచ్చాడు సార్!అతడిని సెలెక్ట్ చేయండి"
 అంటూ భోరుమని ఏడవడం చూసి చిరాకు పుట్టింది .ఇలాంటి డ్రామాలు భరించలేక  రియాలిటీ షోలేవీ చూడ్డం మానేశాను

సెమీస్ నుంచి రెగ్యులర్ గా చూస్తున్నాను.

రామచంద్ర చాలా బాగా పాడుతున్నాడు. కానీ సమస్య ఏమిటంటే ప్రత్యర్థి రాకేష్ కూడా బాగా పాడుతున్నాడు.చక్కని స్వరం,లయ,శృతి అన్నీ మెయింటెయిన్ చేస్తున్నాడు.

భూమి లాభం లేదు. ఒకటో రెండో ఐటమ్ సాంగ్స్ పాడ్డానికి తప్పించి శృతి విషయంలో నిలబడ లేకపోతోంది . "కజ్రా మొహబ్బత్ వాలా" పాటని నాలుగు కంటే తక్కువ శృతిలో పాడింది. ఆతీహై ఖండాలా పాటలో కూడా తెలిసిపోయింది ఆ సంగతి. హిందీ సినిమా పాటలన్నీ దాదాపుగా హై పిచ్ లో ఉంటాయి. కాబట్టి భూమి ఐడల్ అవడం మాట వట్టిదే!

పోటీ రాకేష్ కీ రామ చంద్రుడికీనూ!

నాకు ఇద్దరి గొంతులూ నచ్చాయి. కారుణ్య ఫైనల్ కి వచ్చినపుడు అతడి ప్రత్యర్థి సందీప్ ఆచార్య కారుణ్య ముందు మెలొడీ విషయంలో ఎందుకూ నిలబడలేకపోయాడు. (అందుకే అతడు ప్రొఫెషనల్ గా నిలదొక్కుకోలేకపోయాడు కూడా) అయినా నార్త్ వాళ్ళ ఎస్సెమ్మెస్ వోట్ల పుణ్యమా అని సందీపే గెల్చి పూడ్చాడు.

ఇప్పుడు అలా కాదు. రాకేష్ రామచంద్రకు గట్టి పోటీ ఇస్తున్నాడు.

రామచంద్ర గొంతు లో పరిపక్వత ఉంది. కారుణ్య గొంతులో ఉండే కొద్దిపాటి ఫిమేల్ టచ్(నా అబ్జర్వేషను) కూడా రామచంద్ర గొంతులో లేదు. పర్ఫెక్ట్ వాయిస్.

నిష్పక్షపాతంగా ఓట్ చేయాలంటే నా వోటు చెల్లదు.ఇద్దరికీ పడుతుంది. కానీ "మనవాడు"అన్న పక్షపాతం చూపించకపోతే లాభం లేదు.

ఇందుకు మా కాలనీ వాసులే ప్రేరణ! మా కాలనీలో అంతా హైటెక్ సిటీ ఉద్యోగులే! ఇతర దేశాల వాళ్ళు కూడా మాతో సమానంగా ఇక్కడ నివసిస్తూ తిరుగుతూ ఉంటారు!ఇతర రాష్ట్రాల వాళ్ల సంగతి చెప్పక్కర్లేదు. 70 శాతం వాళ్ళే ఉన్నారు.

రామచంద్రకు ఓట్ చేయమని  A4 సైజు పేపర్ల మీద prints  తీసి ప్రతి అపార్ట్ మెంట్ లోనూ నోటీస్ బోర్డులో పెట్టే ఏర్పాటు చేసాం. మరికొన్ని ప్రింట్స్ హైటెక్ సిటీ వద్ద పంచమని ఒక కుర్రాడికి అప్పగించాం! కాలనీ అసోసియేషన్ మీటింగ్ లో సరదాగా చివర్లో ఇండియన్ ఐడల్ ప్రసక్తి వచ్చినపుడు ఈ 70%మందీ "రామచంద్ర పర్లేదు!రాకేష్ మాత్రం.....రాకింగ్..మా వోట్లు అతనికే"అని చెప్పేశారు. 

 నా వోటు రామ చంద్రుడికే!    కేవలం తెలుగు వాడనే ప్రాంతీయాభిమానంతో మాత్రమే కాదు,అద్భుతంగా  పాడుతున్నందుకు కూడా!

33 comments:

శేఖర్ పెద్దగోపు said...

నేను నిన్న ఎపిసోడ్ లోనే శ్రీరాంకి ఓటేసేసాను..మీరన్నట్టు భూమి విషయంలో నాది సేం ఒపీనియన్..ఇంక రాకేష్ నిన్ని పాడిన పాటకి ఫుల్ ఫిదా అయిపోయాను..శ్రీరాం కూడా మేల్,ఫిమేల్ గొంతుతో ప్రయోగాత్మకంగా పాడాడు...నేనైతే ఓటు వేసింది ప్రాంతీయ అభిమానంతోనే..ఎందుకంటే రాకేష్ కొద్దిపాటి ప్రతిభ శ్రీరాం కన్న ఎక్కువ కనబరుస్తున్నాడనిపించింది నాకైతే.. అయితే శ్రీరాం 'ఒక్కరే' తో పోలిస్తే ఎన్నో రెట్లు ప్రతిభకి సాన పెట్టుకున్నాడన్నది కాదనలేని సత్యం...

Anonymous said...

నిజం మీరు నిజం చెప్పారు. నిష్పక్షపాతం గ వారు వ్యవహరించరు. కనుక మనవాడిని మనమే గెలిపించాలి

సుజాత వేల్పూరి said...

వేణు గారూ,

ఎస్సెమ్మెస్ ల మీద మాకు మాత్రం సదభిప్రాయముండీ, మా జేబులో డబ్బులెక్కువుండీ వేస్తున్నామా వోట్లు? మాకూ లేదండీ! మరి మన వాడు గెలవాలంటే తప్పదు కాబట్టి గుర్తు పెట్టుకుని మరీ వేస్తున్నాం వరసపెట్టి!

శీర్షిక నచ్చినందుకు థాంక్స్!

సుజాత వేల్పూరి said...

రమణ గారూ,అవునండీ, పక్షపాత వైఖరి వల్లనే ఇంతకు ముందు కారుణ్య గెలవలేకపోయాడు. రాంచంద్ర చదివిన కాలేజీ వాళ్ళనుకుంటాను నెక్లెస్ రోడ్ లో పెద్ద హోర్డింగ్ ఒకటి పెట్టారు వోట్ చేయమని. సంగీత ప్రియులం కొంతమంది శక్తి వంచన లేకుండా రామచంద్రకు వోట్లేయిస్తున్నాం!

శేఖర్,
అవును, నిన్న రాకేష్ చాలా అద్భుతంగా పాడాడు. నిన్న నేను మా వారి ఫోన్ లోంచి రామ చంద్రకీ, నా ఫోన్ లోంచి రాకేష్ కీ(ఫనా పాటకి ఫిదా అయిపోయాను మరి) వేశాను. :-))

ఆ.సౌమ్య said...

నేను ఒక్కరే ఫాలో అయ్యేదాన్నీ. నిన్న జ్యోతి గారి పోస్ట్ చూసాకే శ్రీరామచంద్ర పాటలు విన్నాను. శంకర్ మహాదేవన్ బ్రెత్లెస్ పాట అదిరిపోయే లెవెల్లో పాడాడు. అసలు శ్రీరామ పాటలు అంటేనే నాకిష్టం. అష్టా చమ్మ లో పాడాడు చూడండి..భలే పాడాడు.
ఇక నుండి నేనూ సోనీ చూస్తా, శ్రీరామ కే వోటు వేస్తా

ఇక్కడ నార్త్ లోనూ శ్రీరామ కి చాలా ఫేన్స్ ఉన్నారండి. డిల్లీలో అయితే PVR మాల్స్ లో శ్రీరామ ది పెద్ద కటౌట్ పెట్టారు.

Anonymous said...

నా విషయానికొస్తే I'm totally in love with Sreeraamachandra! Breatheless ఎంత బాగా పాడాడో చెప్పలేను. నా వోట్లన్నీ రామచంద్రకే! కానీ రాకేష్ కూడా బాగా పాడుతున్నాడన్నది కాదనలేని సత్యం!

సుభగ said...

నేను వోటింగ్ వల్ల గెలుపోటములు నిర్ణయించే కార్యక్రమాలను చూడడం, వోట్లు వేయడం ఎప్పుడో మనేసానండి.
ఇలా మనలా చాలా మంది ప్రాంతీయభిమానంతోనో మరో కారణం వల్లో వోటేసి నిజంగా ప్రతిభ ఉండి గెలవాల్సిన వాళ్ళకు అన్యాయం చేస్తున్నామనిపిస్తుంది..

కారుణ్య విషయంలో తనకు అన్యాయం జరిగినట్టే, రాకేష్ ఒకింత రామచంద్ర కన్నా బాగ పాడగలిగినా మనం శ్రీరాం కి వోటు వేయడం వల్ల రాకేష్ కి అన్యాయం చేసినట్టే కదా!

సుజాత గారూ, ఇద్దరికీ వోటేసారా? భలే! ఇంక వేసినా వేయనట్టే కదండీ! అదో తుత్తి అంటారా? ;-)

సుజాత వేల్పూరి said...

సుభగ గారూ,
అవునండీ ఈ ప్రాంతీయాభిమానం వల్ల ప్రతిభ ఉన్నవాళ్ళకు అన్యాయం జరుగుతుంది.కారుణ్యకు ఇంతకు ముందు జరిగిందిగా!

మరి ఇక్కడ రామచంద్ర రాకేష్ ఇద్దరూ పోటీపడి పాడుతున్నారు. ఒక్కోసారి ఒక్కొక్కరిదీ పై చేయిగా కనపడుతోంది.

ఇహ వోట్లంటారా మా వారి ఫోన్ లోంచి ఒకరికి, నా ఫోన్ లోంచి ఒకరికి వేశానండీ వోట్లు!

ప్రతిభ లేకపోతే శ్రీరామచంద్రకు వోటెయ్యమని "మనవాడు" అన్నమాట ప్రాతిపదికగా పొరపాటున కూడా రికమండ్ చేయను.

మొత్తానికి ఈ ఎస్సెమ్మెస్ విధానం ద్వారా గెలుపోటములు నిర్ణయించే విధానం నాకూ నచ్చదండీ ! ఇది సెల్ ఫోన్ కంపెనీల కుట్ర కదా! ఏమీ చేయలేం, మన ఎమోషన్స్ తో ఆడుకుంటున్నా!

నిషిగంధ said...

"ప్రత్యర్థి రాకేష్ కూడా బాగా పాడుతున్నాడు.చక్కని స్వరం,లయ,శృతి అన్నీ మెయింటెయిన్ చేస్తున్నాడు."

I agree.. కానీ.. బట్.. పరంతూ.. మొదటినించీ ఈ ప్రోగ్రాం ని చూస్తే ఒక విషయం గమనించవచ్చు.. Rakesh never did any experiments.. always sang easy songs.. అవి కాస్త ఫీల్ తో పాడే సరికి బాగా పాడేస్తున్నాడని అనిపిస్తుంది.. శ్రీరాం అల్మోస్ట్ ప్రతిసారీ కష్టమైన పాటలే పాడాడు.. శంకర్ మహదేవన్ ది, Breathless సాంగ్ ఇప్పటివరకూ రియాలిటీ కాంపిటీషన్స్ లో ఒక్క శ్రీరామే ఎటెంప్ట్ చేశాడు!! ఇక్కడ ప్రాంతీయ అభిమానంతో మాట్లాడటం లేదని గమనించ ప్రార్ధన :))

నాకు రాకేష్ కంటే శివం, స్వరూప్ ఖాన్ లు చాలా నచ్చారు.. ఇక భూమి గురించి చెప్పాల్సివస్తే, టాప్ 3 లో ఉండాల్సిన కాండిడేట్ కానే కాదు... నిన్న అమీర్ తో కలిసి 'క్యా బోల్తీ తూ' పాడినప్పుడు నా చెవులు మళ్ళీ మళ్ళీ ఆత్మహత్య చేసుకున్నాయి!!

some of Sriram's best performances..

(breathless)
http://www.youtube.com/watch?v=JsFESl2kJrUfeature=related

http://www.youtube.com/watch?v=v89y3lh8wdIfeature=related

http://www.youtube.com/watch?v=Wu_x4N1rzww

చిలమకూరు విజయమోహన్ said...

ప్రతిభ ఉంది కాబట్టే శ్రీరామచంద్ర గురించి ఆలోచిస్తున్నాము.అప్పుడప్పుడు రాకేష్ తల్లిదండ్రి సెంటిమెంటు,ఏడుపు సెంటిమెంటు కలగలిపి న్యాయనిర్ణేతల మీద వదులుతున్నాడు . ఇదే విషయంపై నాటపా చూడండి.
http://vijayamohan59.blogspot.com/2010/08/blog-post_09.html

సుజాత వేల్పూరి said...

నిషిగంధ,
మీ వ్యాఖ్యతో ఏకీభవిస్తున్నాను!ఎందుకంటే ఈ కార్యక్రమం నేను సెమీస్ కి ముందు నుంచి మాత్రమే చూస్తున్నాను. మొదటినుంచీ చూడటం లేదు.(నిద్రకు రాత్రి 9 తరవాత ఆగలేకపోవడం వల్ల చాలా ప్రోగ్రాములు చూడలేను:-)))

రామచంద్ర నిన్న చేసిన ప్రయోగం కూడా అద్భుతం! అంత ఫాస్ట్ గా శృతి మిస్ కాకుండా గొంతులు మార్చడం మామూలు విషయం కాదు.బ్రెత్ లెస్ మొన్న చూశాను. శంకర్ మహదేవన్ కే కళ్ళు తిరిగిపోయాయి, ఇక మనమొక లెక్కా!

స్వరూప్ ఖాన్ నాకూ నచ్చాడు. :-))


నిన్న అమీర్ తో కలిసి 'క్యా బోల్తీ తూ' పాడినప్పుడు నా చెవులు మళ్ళీ మళ్ళీ ఆత్మహత్య చేసుకున్నాయి! ఈ ఎక్స్ ప్రెషన్ సూపర్బ్ గా ఉంది.

విజయమోహన్ గారూ,
ప్రాంతీయాభిమానం అని ఎందుకు అన్నానంటే అది ఉత్తర భారతం నుంచి వచ్చే గాయకులకు ప్రతిభా ఉన్నా లేకపోయినా బాగా ఉపయోగపడుతోంది. కారుణ్య ఫెయిల్ అయింది ఇక్కడే!

మీ టపా చూశాను. బ్రెత్ లెస్ పాట మరోసారి ఎంజాయ్ చేశాను. మీరు వేసిన రామచంద్ర బొమ్మ చాలా బావుంది.

Sky said...

రామ చంద్ర నాకు వ్యక్తిగతంగా తెలుసు. మా పక్క కాలనీలో ఉండేవాడు. మా పై వాటా అబ్బయి క్లాస్మేట్ కావటంతో తరచూ కలిసేవాడిని. మా కాలనీ రామనవమి పందిరిలో అతను పాడిన పాటలు చేసిన అల్లరి నాకు ఇంకా గుర్తు. అన్నా అన్నా అంటూ పిలిచిన మా రామచంద్ర ఎంతపెద్దవాడు అయిపోయాడో గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మా అమ్మకి మరో ముద్దుల కొడుకు కూడా కావటంతో అప్పుడప్పుడూ ఈర్ష పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి.

ప్రాంతీయాభిమానం పక్కన పెట్టినా మావాడు (మనవాడు ఇప్పుడు మీ అందరికీ అయ్యాడు కానీ అంతకు ముందు నుంచే మావాడుగా!) గొప్పగా పాడతాడు. తప్పక గెలుస్తాడని నమ్మకం నాకుంది. దానికి నా సెల్ నుండీ మా అమ్మ పంపిన ఎస్ ఎం ఎస్ లు, తను పంపలేదేమోనని నేను పంపిన ఎస్ ఎం ఎస్ లు సాక్షి.

మా మనవాడు ఈ పోటీలో తప్పక గెలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.



""ప్రత్యర్థి రాకేష్ కూడా బాగా పాడుతున్నాడు.చక్కని స్వరం,లయ,శృతి అన్నీ మెయింటెయిన్ చేస్తున్నాడు."

ఈ అగ్రీ.. కానీ.. బట్.. పరంతూ.. మొదటినించీ ఈ ప్రోగ్రాం ని చూస్తే ఒక విషయం గమనించవచ్చు.. ఋఅకెష్ నెవెర్ దిద్ అన్య్ ఎక్ష్పెరిమెంత్స్.. అల్వయ్స్ సంగ్ ఏస్య్ సొంగ్స్.. అవి కాస్త ఫీల్ తో పాడే సరికి బాగా పాడేస్తున్నాడని అనిపిస్తుంది.. శ్రీరాం అల్మోస్ట్ ప్రతిసారీ కష్టమైన పాటలే పాడాడు.. శంకర్ మహదేవన్ ది, భ్రేథ్లెస్స్ సాంగ్ ఇప్పటివరకూ రియాలిటీ కాంపిటీషన్స్ లో ఒక్క శ్రీరామే ఎటెంప్ట్ చేశాడు!! ఇక్కడ ప్రాంతీయ అభిమానంతో మాట్లాడటం లేదని గమనించ ప్రార్ధన :))"

-నిషిగంధ గారూ చెప్పింది అక్షరాలా నిజం.

Vasu said...

"పోటీ రాకేష్ కీ రామ చంద్రుడికీనూ!"

నేనస్సల ఒప్పుకోను. మన వాడని కాదు అసల శ్రీరాం కి రాకేశ్ పోటి కానే కాదు. నేనే కాదు ఆన్ లైన్ పోల్ల్స్, జడ్జ్ లు, వచ్చిన గెస్ట్ లు అందరూ అదే అంటున్నారు.

జనాలు ఈ సారి మాత్రం శ్రీరాం ని గెలిపిస్తారని ఎందుకో నమ్మకం ఉంది.

శేఖర్ పెద్దగోపు said...

>>>>Rakesh never did any experiments.. always sang easy songs.. అవి కాస్త ఫీల్ తో పాడే సరికి బాగా పాడేస్తున్నాడని అనిపిస్తుంది....

ఇది మాత్రం వంద శాతం కరెక్ట్..అసలే మనలో చాలా మందిమి ఫీల్‌తో ఉన్న మెలొడి సాంగ్స్ అంటే చెవిని టీవికి అతికించేస్తాం..బహుశా అందుకేనేమో నాక్కూడా ఆ కొద్దిగా బాగా పాడేస్తున్నాడనిపించింది...

>>>ఇక భూమి గురించి చెప్పాల్సివస్తే, టాప్ 3 లో ఉండాల్సిన కాండిడేట్ కానే కాదు...

అవును ఇది చాలా చాలా కరెక్ట్..అసలు శివం ఎలిమినేట్ అయ్యాడంటే నమ్మబుద్దికాలేదు..పైగా ఈ అమ్మాయి ఒకరకమైన పాటలు మాత్రమే పాడగలదు..వైవిధ్యం అస్సలు చూపించలేదు గొంతులో..

మిత్రులకు నేను గమనించిన ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను..అదేంటంటే ప్రోగ్రాం అవుతున్నప్పుడు ఎస్సెమ్మెస్ చేస్తుంటే ట్రాఫిక్ ఎక్కువ వల్ల ఎస్సెమ్మెస్ పోవటం లేదు...మనమేమో ఎస్సెమ్మెస్ వెళ్ళిందనుకుని పొరపాటుపడతాం...మీ ఎస్సెమ్మెస్ చేరిందనే దానికి కన్‌ఫర్‌మేషన్ ఏంటంటే తిరిగి Indian Idol నుండి మెసేజ్ వస్తుంది..గమనించగలరు...

హరే కృష్ణ said...

పిచ్ variation లో మనవాడు కాస్త వెనుక ఉన్నాడు
అనూ మాలిక్ ప్రతి ఒక్కరిని అవతలవాడు ఎంత :( గా పాడినా
you are a rock star అనే అంటున్నాడు


javascript:void(0)

దైవానిక said...

కారుణ్యకి జరిగిన అన్యాయానికి నేను ఇండియన్ ఐడల్ చూడడం మానేసాను. శ్రీరాం ఒక్కరే కంటే ముందు సై అనే కాంపిటీషన్ లో 2nd వచ్చాడు. అప్పట్లోనే తన గొంతు బాగా నచ్చేది. ఇప్పుడు ఇంకా బాగా పాడుతున్నాడు.
కాని నేను ఎప్పుడు ఎవరికి ఓటు వెయ్యలేదు, వెయ్యను :)

సుజాత వేల్పూరి said...

సతీష్,
రామ చంద్ర గెలవాలనే అందరమూ కోరుకుంటున్నాం! అతడు గెలిస్తే మీ అమ్మగారికి ఫోన్ చేసి చెప్పడం మర్చిపోకండి!ఎంతైనా ముద్దుల కొడుకు కదా!

వాసు గారూ,
నాకూ ఈ సారి రామచంద్ర గెలుస్తాడనే నమ్మకం ఉందండీ!

శేఖర్,
వోటింగ్ కి భలే జాగ్రత్తలు చెప్పారే! భూమి టాప్ 3 వరకూ ఎలా వచ్చిందో నాకూ అర్థం కాని విషయం!

సుజాత వేల్పూరి said...

హరే కృష్ణ,
అన్నూ మాలిక్ మన కోటి గారి పోలికన్నమాట:-) ! కోటి అయితే ఓ మాదిరిగా పాడిన వాళ్ళకు కూడా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చేస్తాడు.

ఈ విషయంలో శైలజ నాకు నచ్చుతుంది. అభినందిస్తూనే లోపాలు ఎత్తి చూపుతుంది.బాలు కూడా బాగా కరెక్ట్ చేస్తాడు.

అసలు ఇలాంటి రియాలిటీ షోల్లో అలాగే 'యూ రాక్" అంటూనే ఉండాలని జడ్జీలకు ముందే instructions ఇస్తారట. ఎవరినీ నిరాశ పరచకూడదనిట!ఒక మ్యూజిక్ డైరెక్టర్ చెప్పాడు.:-)

దైవానిక,
ఎన్నాళ్లకెన్నాళ్లకు! ఈ మధ్య అసలు కనపడటమే లేదు.

కారుణ్యకు జరిగిన అన్యాయం తల్చుకుంటే నాకూ బోలెడు బాధ వేస్తుంది ఇప్పటికీ!

ఈ సారికి వోటు వేద్దురూ, రామచంద్ర గెలిచే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి మరి!

నేస్తం said...

ఆ అబ్బాయి చాలా బాగా పాడుతున్నాదు..కాని ఏం లాభం మాకు ఓటు వేసే చాన్స్ లేదుగా లేకపోతేనా ఓ రెండొందల ఓట్లు వేయించేదాన్ని :)

సుజాత వేల్పూరి said...

నేస్తం,
అవునా! అయ్యో!మిడిల్ ఈస్టు వాళ్ళు ఒట్లేసే విధానమేదో చెపుతున్నారే నిన్న? అలాగే సింగపూర్ వాళ్ళు ఓట్లేసే పద్ధతేమీ లేదా? వీకెండ్ లోపు ఏదో ఒకటి చెయ్యాల్సిందే మీరు!రెండొందల వోట్లు వెయ్యాల్సిందే!

నేస్తం said...

సుజాత గారు అవునా చాన్స్ ఉందా?? ..మాకు ఇక్కడ ఏ ప్రోగ్రాం ఎప్పుడువస్తుందో సరిగ్గా తెలియదు.. మరి సింగపూర్ వాళ్ళు ఏమైనా ఓటు వేసే వీలుంటే కాసింత త్వరగా చెబుదురూ..దొరికిన వారందరికీ చెప్పెస్తా :)

చింతా రామ కృష్ణా రావు. said...

విజయోస్తు శ్రీరామ చంద్రా!

Sky said...

సుజాత గారు,
అమ్మ అక్కడికి వెళ్ళినా కూడా మనవాడి ప్రోగ్రాం చూస్తూనే ఉంది. నిన్న రాత్రి కూడా నాతో మాట్లాడింది.

అనూ మాలిక్ అనే కాదు కానీ మీరు ఇలాంటి కార్యక్రమాలలో ఏ జడ్జీని గమనించినా "యు రాక్" లాంటి మాటలు అంటూనే ఉంతారు. ఆణిముత్యాల్లాంటి పాటల్ని అందించిన ఒకనాటి సంగీత దర్శకుడి పుత్రరత్నం తెలుగులో ఓ కార్యక్రమం చేశారు ( పేరు చెప్పనఖరలేదనుకుంటా!) శృతి సరిగ్గా లేని పాటల్ని కూడా నువ్వు అద్భుతంగా పాడావంతూ పాడినవారిని మెచ్చుకుంటే నాలాంటి సంగీతాభిమానులు చాలామంది బాధపడ్డారు, సంగీతం తెలిసిన మీలాంటి వారు ఆయనని చూసి నవ్వుకున్నారు ( అందులో మీరు కూడా ఒకరని మీ పాత టపాలను తిరగేస్తే తెలుస్తుంది) :)


ఈ సారి మనవాడు గెలవటం ఖాయం. ఇంతమంది అభిమానం ఆశీస్సులు అతనికి ఉండగా గెలవక ఏమౌతుంది? ఆపైన తెలుగు మీడియా ఇప్పటికే చాలా ప్రచారం చేసింది ( ఇలాంతి విషయాల్లో మీడియా నాకు బాగా నచ్చుతుంది). కనీసం ఈ సారైనా మనవాళ్ళు సాటి తెలుగువాడిని గెలిపిస్తారేమో!

అడ్డ గాడిద (The Ass) said...

LOL here too

Sujata M said...

Oh ya madam! Waow. Naku Telugu cinema choostunnaTTu undi. EEroje ma office daggara local MLA garu peeda cut out pettincharu - Vote to Sriram ani. Blogulalo kooda Sriram ke votu. TV lo kooda Sriram ! I think Sriram already won so many hearts. Uma is religiiously watching Indian Idol from Geneva. He likes both Rakesh and Sriram ! (ade ikkada problem!) Sriram has definitely helped Sony with the TRP. Sony must thank him.

సుజాత వేల్పూరి said...

సుజాత గారూ,I'm curious to know....! మీ వోటెవరికి?

శ్రీనివాస్ said...

నాకు తెలిసి చాలామంది నార్త్ భారతీయులు ( ఉత్తర ఇండియన్స్) శ్రీ రాం కి మద్దతు తెలుపుతున్నారు మరి చూద్దాం ఏమవ్తుందో

కౌటిల్య said...

నా ఓటు కూడా శ్రీరామ్ కే....రాకేశ్ కంటే శివం బాగా పాడాడు...మొన్న ఫైనల్ సెలక్షన్ అప్పుడు ఇంట్లో అందరం ఎంత టెన్షన్ పడ్డామో...మొదట్లో శ్రీరామ్ ని ఆ యాంకరు టెన్షన్ పెట్టినప్పుడైతే మా బుడ్డది(అక్క వాళ్ళ పాప) గుడ్ల నీరు కుక్కుకుంది...ఎప్పుడూ టీవీ వంక చూడని మా మావయ్య కూడా రెగ్యులర్ గా చూడాల్సిందే!
నాకైతే పాట విషయంలో ఏమోకాని అతన్లొ నాకు బాగా నచ్చింది అతని వినయం...అస్సలు అతి ఎక్కడా ఉండదు...ఫేస్ ఫీలింగ్స్ చాలా సహజంగా ఉంటాయ్...మొన్న ఫైనల్స్ కి సెలెక్ట్ ఐనప్పుడు,అడగ్గానే మొదట బుఱ్రగోక్కున్నాడు.ః-)....

సుజాత వేల్పూరి said...

శ్రీనివాస్,
కరెక్టే గానీ ఈ ఛానెళ్ళ వాళ్లనీ అసలు నమ్మటానికి లేదు.పోయిన సారి సందీప్ ఆచార్య వాళ్ల పేదరికమంతా ఉట్టిపడేట్లుగా వాళ్ళ ఇంటినీ,కుక్కి మంచాలూ, సరైన బట్టలు లేని అమ్మానాన్నల్నీ చూపి వాళ్ళంతా కలిసి దేవుడికి ప్రార్థన చేయడం లాంటి సీన్లు షూట్ చేసి చూపారు. ఎమోషనల్ వొట్లు చప్పున అటు పడ్డాయి.

ఈ సారి కూడా అలాంటి డ్రామాలు మొదలయ్యాయనే అనుమానిస్తున్నాను. అదీ కాక నార్త్ గాయకులకు అడ్వాంటేజ్ ఏమిటంటే అందరూ హిందీ వాళ్ళే కాబట్టి టౌన్లు,పల్లెల్లో కూడా ఈ ప్రోగ్రాములు చూసే ఛాన్స్ ఉంది!దానివల్ల వోట్లు పడే ఛాన్సూ ఉంది. మన వైపు పల్లెటూళ్లలో ఎంతమంది ఈ కార్యక్రమం చూసేవాళ్ళు, హిందీపాటల్ని ఎంజాయ్ చేసే వాళ్ళూ ఉంటారు? విజయవాడ,హైద్రాబాదు,వరంగల్, గుంటూరు(కూడా అనుమానమే)వంటి సిటీల్లో తప్ప!శ్రీరామ్ అనే తెలుగువాడు ఫలానా జాతీయ స్థాయి పోటీల్లో ఫైనల్ కి వచ్చాడని మన రాష్ట్రంలోనే చాలామందికి తెలీదు.

అందుకే ఇంత ప్రచారం చేయాల్సి వస్తోంది,.

ఏదేమైనా శ్రీరామ్ మాత్రం గెలవాలి. గెలిచి తీరాలి!

సుజాత వేల్పూరి said...

కౌటిల్య,
అవును శ్రీరామ్ నార్త్ వాళ్ళని కూడా ఈ వినయమూ "అతి లేకపోవడం"వంటి లక్షణాలతో ఆకట్టుకుంటున్నాడు. (ఈ లక్షణానికి మార్కులుంటే బావుండు )

పాట విషయంలో కూడా ఎటువంటి వంకా పెట్టనక్కర్లేని ప్రతిభ శ్రీరామ్ ది!

గెలిస్తే బావుండు గెలిస్తే బావుండని జపం చేస్తున్నాననుకోండి నిజంగా!

Anonymous said...

Dear friend there is one more way of voting for our sreeram, you must be knowing about this earlier..however I wish to make it a point....enter www.bolegaindia.com register and can vote for our boy any no of times not less than at least 500 so could you please make post of this site in your esteemed blog. Please its my request. 'cause our views are alike.

Sujata M said...

Sri Ram !

Uma asked me (ordered me) to send asmanyas SMSes in his favour. He says bhumi gets easy gujju votes. Whereas moving telugu people to vote, is a difficult task.

సుభగ said...

మన వాడు గెలిచాడోచ్!
అందరికీ శుభాకాంక్షలు

Post a Comment