అమ్మయ్య! తెలుగుకై నడిచాం! తెలుగు తల్లి విగ్రహం నుంచీ, (...అవును తెలుగుతల్లి విగ్రహం నుంచే) పీవీ జ్ఞానభూమి వరకూ తెలుగు భాషాభిమానులంతా కలిసి నినదిస్తూ నడిచాం!ఆశించినంత మంది రాకపోయినా వచ్చిన వారంతా ఉత్సాహంతో తెలుగులో మాట్లాడుకుంటూ నడిచారు!.
నిన్నటి ఉస్మానియా సంఘటన తాలూకు ఛాయలు గానీ తెలుగుబాట పై పడతాయేమో అని ఒక పక్క చిన్న సందేహం ఉన్నా, అవాంఛనీయ సంఘటనలు గానీ వ్యతిరేక నినాదాలు గానీ ఎక్కడా కనపడలేదు వినపడలేదు.
మైకాసురులెవరూ లేకుండా అతి చిన్న ప్రసంగాలతో ప్రారంభమైంది కార్యక్రమం! తర్వాత సభికులమంతా తలా ఒక శ్రుతిలో "మా తెలుగు తల్లి "గీతం ఆలాపించి ఒకరినొకరు అలరించే ప్రయత్నం చేశాము. (భాషాభిమానం ముఖ్యం,శ్రావ్యతదేముంది?):-))
ఆ తర్వాత తాడేపల్లి గారు అందరి చేతా తాను స్వయంగా రాసిన మాతృభాషా ప్రతిజ్ఞ చేయించారు. ఆ తర్వాత నడక ప్రారంభమైంది.
మాతృభాషా ప్రతిజ్ఞ
విశేషాలు:
పొద్దున్నే 6-45 కల్లా అక్కడికి చేరుకున్న మాకు ఎప్పటిదో ఏళ్ళనాటి వాడిపోయిన చెమికీ దండ ధరించిన తెలుగు తల్లి విగ్రహం కనిపించింది. ఈ- తెలుగు యువ బృందం సాహసించి అడుగు స్థలం కూడా లేని తెలుగు తల్లి విగ్రహ పీఠం ఎక్కి బంగారు హారం లా మెరిసిపోతున్న సరికొత్త చామంతి పూల దండ వేశారు.
దండ వేయడం ఇంత కష్టమా?
విశేషమేమిటంటే ఇవాళ మాతృభాషా దినోత్సవం! e-తెలుగు దండ తప్పించి వేరెవరూ తెలుగు తల్లి విగ్రహానికి ఒక దండ కూడా వేయకపోవడం!
హమ్మయ్య,వేసేశాం!
పూనా నుంచి వచ్చిన అచ్చ తెలుగు బ్లాగ్లోకం బాబాయి భమిడిపాటి ఫణిబాబు గారు మొదటినుంచీ చివరి వరకూ అలసిపోకుండా హుషారుగా నడిచారు.
శరత్ కాలం శరత్ గారు ఎనిమిదింటికల్లా వచ్చి తానూ కొన్ని బానర్లు పట్టుకుని సరదాగా కలిసిపోయి మాట్లాడారు.
అమెరికా నుంచి ఆంధ్రాకి..తెలుగుబాటకి!
ఆలోచింపజేసే వ్యాఖ్యలు రాసే గద్దె ఆనంద్ స్వరూప్ గారు ఈ కార్యక్రమానికి వచ్చారు.
ఏపీ మీడియా కబుర్లు రాముగారు,వేణువు వేణు గారు,ఫణిబాబు గారు పక్కపక్కనే కూచుని హాయిగా తెలుగు కబుర్లు చెప్పుకున్నారు.
గడ్డిపూలు సుజాత గారినీ నన్నూ అక్కడ అందరూ "ఇంగ్లీషు సుజాత-తెలుగు సుజాత" లు గా గుర్తించి పిలవడం మా ఇద్దరినీ బాగా నవ్వించింది.
HMTV రామచంద్ర మూర్తి గారు వచ్చి కాసేపుండి వెళ్ళిపోయారు.
భూమిక సత్యవతి గారు మాతో పాటు చివరి వరకూ నడవడమే కాక మాతో కల్సి పీవీ నరసింహారావు గారి సమాధిని చూడ్డానికి కూడా వచ్చారు.
భవదీయుడు చక్రవర్తి గారు అమెరికా యాత్ర ముగించుకుని ఈ రోజు ఉదయమే హైదరాబాదు లో అడుగు పెట్టినా సమయానికి సభాస్థలికి సతీ సమేతంగా విచ్చేశారు.
తన ద్విచక్ర వాహనంలో పెట్టిన మంచినీటి పాకెట్లని అడిగినప్పుడల్లా అందిస్తూ శ్రీమతి భవదీయుడు (స్వాతి) చాలా సహాయం చేసింది.
నడక ప్రారంభం కాగానే మీడియా వాళ్ళు బైట్స్(bytes) కోసమని నన్నూ,వీవెన్,తాడేపల్లి గార్లను ఆపడంతో మేము నడకలో ఇరవై నిముషాలు వెనుకబడిపోయాం. అందువల్ల కారులో వెళ్ళి మిగతా వారిని చేరి అక్కడనుంచీ నడక ప్రారంభించాం! ఈ విషయమై ఫణి బాబు గారు నన్ను చీల్చి చెండాడేశారు!(ఆయన బ్లాగులో రాస్తారుగా...!)
వయోధికులైన మండలి బుద్ద ప్రసాద్,మల్లికార్జున శర్మ,ఫణిబాబుగార్లు అలసట చెందకుండా ఉత్సాహంతో చివరి వరకూ నడవటం విశేషం! (నాకైతే దాదాపు చివరి వరకూ వచ్చాక రోడ్డు పక్కన కూచుండిపోదామనిపించింది)
జ్ఞానభూమి వద్దకు చేరేదాకా ఆగిన వర్షం అక్కడ మమ్మల్ని బాగానే ఆశీర్వదించింది. అసలే ఆకలితో మాడిపోతున్న మాకు అక్కడ ఒక టీ అమ్మే వ్యక్తి దేవుడిలా కనపడ్డంతో అందరమూ వర్షంలో వేడి వేడి టీ తాగి సేద తీరాం!
ఈ కార్యక్రమానికి వచ్చిన బ్లాగర్లు...ఈ తెలుగు సభ్యులతో కలిపి వీవెన్,కశ్యప్,సతీష్ యనమండ్ర,కౌటిల్య,రవిచంద్ర,నాగమురళి,అశ్విన్ బూదరాజు,కోడిహళ్ళి మురళీ మోహన్,కొండవీటి సత్యవతి,గడ్డిపూలు సుజాత,శరత్,నాగప్రసాద్,వేణు,రాము,ఫణిబాబు, తాడేపల్లి,చదువరి, శ్రీనివాస కుమార్,శ్రీనివాస రాజు దాట్ల,నందం నరేష్,చక్రవర్తి,స్వాతి,చావా కిరణ్,కట్టా విజయ్,రాజన్,శ్రీహర్ష,..మరికొందరు భాషాభిమానులు! (ఎవరినైనా మర్చిపోతే తిట్టకుండా గుర్తు చేయండి)
55 comments:
మైకాసురులు లేకపోవటమేమిటీ తల్లీ--- అడగకుండా వచ్చి మైక్ అందుకుని వాయించినది ఒకరు--- రెండే రెండు నిమిషాలు మాట్లాడతానని బతిమిలాడి మరీ పది నిమిషాలు తిన్నది ఒకరు... తెలుగు మాట్లాడుతున్నారో మరే భాష మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడినవారు ఒకరు, అసలే అంతంత మాత్రంగా ఆర్ధిక పరిస్థితిలో ఉన్న సంస్థ వేయించిన టీ షర్ట్స్ ను దోచుకుని వెళ్ళిన పోలీసు సోదరులు---- ఇవన్నీ చెప్పకుండానే ఇలా టపాలు రాయటాన్ని మేము ఖండిస్తున్నాము సుజాత గారు.
తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసే అదృష్టం కలిగినందుకు చాలా ఆనందం కలిగింది... అదో గొప్ప అనుభూతి....
తెలుగు బాట కార్యక్రమం సాగుతున్నంత సేపూ ఆపకుండా నినాదాలు చేసిన మిత్రుడిని అభినందిచాల్సిందే.... నాలుగు కిలోమీటర్ల పాటూ సాగిన ఈ యాత్ర ఆసాంతం అతను నినదిస్తూనే ఉన్నాడు...
మీకందరికీ అభినందనలు, అభివందనాలు తప్ప మరేమీ చెప్పుకోలేను. ఇలాంటివి మరిన్ని events జరగాలని మనస్స్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
:))
పీపుల్స్ ప్లాజా నుండీ మన తెలుగుబాటను ఒక శునకం అనుసరించింది--- పోలీసు వారు పలుమార్లు రాళ్లతో కొట్టినా పీవీ జ్ఞానభూమి వరకూ అది కూడా వచ్చింది. (కాకపోతే నినదించలేదు-గత జన్మలో అది తెలుగు భాషాభిమానేమో! ఆ వాసనలు ఇంకా వదలక మనల్ని అనుసరించిందేమో!
ఈ మాత్రం ప్రసంగాలు తట్టుకోలేకపోతే ఎలా సతీష్! త్యాగరాయ గాన సభలో ప్రసంగాలెప్పుడైనా చూశారా? వామ్మో!
అవునూ, ఆ అబ్బాయి పేరు ఏమిటో తెలుసుకున్నారా? దారి పొడుగునా అతడు ఆపకుండా చక్కని స్ఫూర్తి దాయకమైన స్వరంతో నినాదాలు ఇస్తూనే ఉన్నాడు.
ఆ శునకాన్ని నేను గమనించలేదు.పెళ్ళి ఊరేగింపనుకుందేమో!:-))
శ్రీనివాస్,
ఈ మధ్య మీరు ఎక్కడ చూసినా వ్యాఖ్య బదులు స్మైలీలు పెట్టి వదిలేస్తున్నారేమిటి చెప్మా? :-))
నిజమేనండి,
త్యాగరాయ గానసభ, రవీద్ర భారతిలో జులపాల శర్మ గారి ప్రసంగాలు రెండు మూడు సార్లు విన్నాను--- ఆ రోజు చెవుల్లో నుండీ కారిన రక్తం మళ్లీ నింపడానికి చిరంజీవి బ్లడ్ బాంక్ ను సంప్రదించాను.
వాటితో పోలిస్తే ఇవి చాలా బెటర్--- వారెవరో వక్త గత స్మృతుల్లోకు వెళ్ళి 1956 లో అనగానే కాస్త ఖంగారు పడ్డాను కానీ పొరపాటు 1975లో అంటు అక్కడినుండీ మాట్లాడటం మొదలెట్టడంతో కాస్త తేరుకున్నాం.... వీరే అల్లూరి సీతారామ రాజు గురించి మాట్లాడటం మొదలెట్టగానే నందమూరి వరకు సా............గదీస్తారేమో అనుకున్నాం కానీ మనపై దయతలచి వదిలేసారు.... అదేదో పాటండీ--- ఎంతకీ అవ్వని పాట...పాఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆడుతూనేఉన్నారు... ఏదైనా మొత్తానికి మన కార్యక్రమం బాగా జరిగింది......
బాగుంది. అభినందనలు.
ఫోటోలతో సహా వివరాలను పంచుకున్నందుకు ధన్యవాదాలు సుజాత గారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఒక్కరికి అభినందనలు :)
Congratulations!
"తెలుగుబాట"లో పాల్గొన్న అదృష్టవంతులందరికీ అభినందనలు!
"పొరుగు భాషను గౌరవించు, ఇంటి భాషను కౌగిలించు" - చాలా బాగుందీ మాట.
ప్రత్యక్షంగా చూడ(లే)ని,పాల్గొన(లే)ని మా లాంటి వారికి కళ్ళకి కట్టినట్టు చూపించారు,మీకు ప్రత్యేక ధన్యవాదాలు.
ఇలాంటి కార్యక్రమాలు ఇ-తెలుగు వారు ఇంకా చాలా జరిపించాలని ఆశిస్తూ,తెలుగుభాషాభివృద్ధికి తోడ్పడుతూ ఉన్న సభ్యులందరికీ,ఈ తెలుగుబాటలో పాల్గొన్నవారికి అందరికి పేరుపేరునా ధన్యవాదాలు.
ఈ కార్యాక్రమంలో పాల్గొన్న భాషాభిమానులందరికి అభినందనలు.
the post is very informative.thanks.
సుజాత గారు,
మీ పోస్టు బాగుంది. ఫోటోలు నాకు కూడా పంపండి. మనసు సహకరించక నేను నడకలో పాల్గొనలేదు. మీ అందరి ఉత్సాహానికి అభినందనలు. కాస్త మీ ఈ-తెలుగు వాళ్లకు చెప్పి అందరినీ కలుపుకుపోయే మంచి ప్రోగ్రామ్స్ పెట్టండి. అందరం కలిసి పనిచేద్దాం.
రాము
apmediakaburlu.blogspot.com
తెలుగు బాటలో ఆద్యంతం నినదిస్తూ పాల్గొన్నాను. నా పేరు మీ జాబితాలో లేదు. గమనించగలరు.
నేనూ వద్దామనే 6 కల్లా బయిలు దేరాను . కాని అనివార్య కారణాలవల్ల రాలేక పోయాను . స్చ్ప్ . . . మంచి అవకాశము చేజారి పోయింది . టి . వి లో కూడా చూడలేక పోయాను . సాయంకాలము నుడి ఈ పోస్ట్ కోసం ఎదురుచూసుతున్నాను .
హుం ఇప్పుడే సప్తగిరి లో ఈ తెలుగు రాలీ గురించి చెప్పారు కాని చూపించలేదు . వేరే వాళ్ళను చూపించారు దుర్మార్గులు .
మీ అందరికీ అభినందనలు .
తెలుగుబాటలో పాల్గొన్న ప్రతిఒక్కరికి పేరుపేరునా అభినందనలతో పాటు కృతజ్ఞతలు
అందరికీ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు!
>> "తెలుగుబాట"లో పాల్గొన్న
>> అదృష్టవంతులందరికీ అభినందనలు!
నిజమే! అప్పయ్య దీక్షితులు గారి మాటల్లో - ఈ అదృష్టం న అల్పస్య తపస: ఫలం!!
అందరికీ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు!
>> "తెలుగుబాట"లో పాల్గొన్న
>> అదృష్టవంతులందరికీ అభినందనలు!
నిజమే! అప్పయ్య దీక్షితులు గారి మాటల్లో - ఈ అదృష్టం న అల్పస్య తపస: ఫలం!!
ఇంకో అబ్బాయి మధ్య మధ్యలో గా...ట్టిగా ఖంగుమనే కంఠంతో "జై తెలుగుతల్లీ" అన్నపుడల్లా నాకు నాలుగు దిక్కులకూ చూడ్డం సరిపోయింది ఉస్మానియా ఐకాస సభ్యులు ఎవరైనా మనల్ని వెంబడిస్తున్నారా అని :)
అభినందనలు
నేను అమెరికా లో ఉన్న సమయంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు పెట్టాలన్న కుట్ర ఎవరిది? అక్టోబర్ e-తెలుగు సమీక్షా సమావేశం లో తేల్చుకోవాలి.
నేను అమెరికా లో ఉన్న సమయంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు పెట్టాలన్న కుట్ర ఎవరిది? అక్టోబర్ e-తెలుగు సమీక్షా సమావేశం లో తేల్చుకోవాలి.
"పొరుగు భాషను గౌరవించు, ఇంటి భాషను కౌగిలించు" నాక్కూడా భలే నచ్చిందీ మాట.
అభినందనలు మొత్తం టీం కు.
అభినందనలు! అయ్యో మేమూ వస్తే బాగుండేదే అనిపించింది :-( పిల్లల పరీక్షలు లేకపోతే తప్పక హైదరాబాద్ కి వచ్చేపని..
కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఒక్కరికి అభినందనలు :)
నేను తీసిన చాయాచిత్రాలు ఇక్కడ చూడండి http://picasaweb.google.co.in/katta.vijayk/Etelugu#
బాగుంది. చాలా చాలా సంతోషం. పాల్గొన్నవారందరికీ అభినందనలు. బొమ్మలు పెట్టినందుకు ధన్యవాదాలు.
మాతృభాషా ప్రతిజ్ఞను ఈతెలుగు సైట్లోగాని కార్యవర్గ సభ్యులెవరైనా బ్లాగులోగాని ఉంచవలసిందని ప్రార్ధన.
భలే అదృష్టవంతులు మీరంతా!
అభినందనలు
శారద
నేను అంతకుముందు వారం కాకుండా, మొన్న వారం హైదరాబాద్ వచ్చి ఉంటే, తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనేదాన్ని :(
ఏది ఏమైనా, కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసినందుకు అభినందనలు, ఆ వివరాలన్నింటిని మాతో పంచుకున్నందుకు నెనర్లు.
తెలుగు బాట విశేషాలు చదివి, నేనూ అక్కడే ఉన్నంత సంతోషంగా అనిపించింది.
ఆ విశేషాలు, ఫోటోలు అందజేసినందుకు ధన్యవాదాలు సుజాత గారు, ఆ చేత్తో మాతృభాషా ప్రతిజ్ఞను కూడా ఇక్కడే పొందుపరిస్తే ఇంకా బాగుంటుంది.
తెలుగుబాటలో పాల్గొన్నవారికి అభినందనలు
ఈ మధ్య నేను సరిగ్గా బ్లాగులోకాన్ని వీక్షించకపోవటం వల్ల తెలుగు బాట గురించి ముందుగా తెలుసుకోలేకపోయాను.
శనివారపు సాయత్రం వీవెన్ పోనుచేసి తప్పక రావాలని చెప్పాడు. నాతో పాటు నా పిల్లల్ని తీసుకొని వెల్దామనుకున్నా.
పిల్లలు రాలేమన్నారు. నాకుకూడా కొన్ని ప్రశ్నలు మొదలయ్యాయి.
నా పిల్లలచేత తెలుగు చదివించలేకపోతున్నాను. నాకు క్రమంగా వచ్చే పత్రికలన్నీ నేను మాత్రమే చదువుకుంటున్నాను. ఆటువంటప్పుడు నేను పాల్గొనటం ఎంత సమజం అనేది నన్ను తొలిచిన ప్రశ్న.
ఎందుకో ఈ తెలుగు నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొనలేకపోతున్నాను.
రాము గారూ,
"మనసు సహకరించకపోవడం" అనే మాటను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. సంస్థకు ఎక్కువమంది సభ్యులు లేకపోవడం, చేయవలసిన పని ఎక్కువా, చేయాల్సిన వాళ్ళు తక్కువగా ఉండటం,ముఖ్య పదవులుల్లో ఉన్నవారు విదేశాల్లో ఉండటం వల్ల అన్ని పనులూ సంతృపికరంగా నెరవేర్చలేకపోయాము.కశ్యప్ బోలెడన్ని పనులు నెత్తిన వేసుకున్నారు అప్పటికీ! మా వల్ల పొరపటేదైనా జరిగి ఉంటే మన్నినవలసిందిగా కోరుతున్నాను.
అందరినీ కలుపుకుని పోవాలన్నదే సంస్థ ఆశయం కూడాను! ఈ సారి మరింత జాగరూకతతో వ్యవహరిస్తామని మాట ఇస్తున్నాను.
అభినందించిన అందరికీ ఈ తెలుగు ధన్యవాదాలు!
శ్రీనివాస్ పప్పు గారు,
ఇదివరలో మీరు సంస్థకు బాసటగా నిలబడ్డారు కూడా. మీలాంటి భాషాభిమానుల అభిమానం ఉంటే ఎన్ని కార్యక్రమాలైనా చేయవచ్చు అనిపిస్తుంది.
బెండు అప్పారావు గారు,
మీ పేరు పైన రాయలేదా? మీ నినాదాలు జనానికి బాగా ఉత్సాహం పంచాయి. ధన్యవాదాలు!
రవిచంద్రా,
మనతో నడిచిన వారిలో ఉస్మానియా ఐకాస సభ్యులెవరన్నా ఉన్నారేమో అని నాకూ నిన్న కొంచెం అనుమానంగానే ఉంది. మీరు దిక్కులు చూశానంటే నవ్వొస్తోంది.
మాలాకుమార్ గారూ,
ధన్యవాదాలండీ! మీరైనా వస్తే బావుండేది
రావు గారు,
రండి తేల్చుకుందాం! అంతకు ముందు మీరు జోగ్ ఫాల్స్ ఎప్పుడెళ్ళారో చెప్పాలి మాకు!(పుస్తక ప్రదర్శన మధ్యలో వదిలేసి వెళ్ళారని నాకు గుర్తు)
కొత్తపాళీ, సుభగ,
తర్వాత పోస్టులో ప్రతిజ్ఞ పోస్టు చేస్తాను.
తెలుగుబాటలో మెట్టెల సవ్వడి ఎందుకో మఱీ యెక్కువ వినిపించలేదు. మఱింతమంది సుజాతగార్లు ఇందులోకి రావాల్సి ఉంది. తెలుగు స్త్రీల వైపునుంచి క్రియాశీలమైన పాల్గోలు లేకుండా తెలుగుభాష పరిస్థితి మెఱుగుపడడం పూర్తిగా అసాధ్యం.
పాల్గొన్నవారందరికి అభినందనలు. మీ అందరిని నేను టీవీలో చూసానులెండి..
మీరు అతిశయోక్తులు మాట్లాడుతున్నారు. ఈ-తెలుగుకి, సమైక్యవాదానికి సంబంధం లేదని మీకు తెలియదా? ఒస్మానియా విద్యార్థులు మీరు చెపుతున్నంత అమాయకులు కారు, వాళ్లకి అంత ఆవేశం లేదు. తెలంగాణాలో కూడా మాట్లాడేది తెలుగే కదా. ప్రాంతం పేరుతో కొట్టుకున్నంతమాత్రాన తెలుగులో మాట్లాడడం, చదవడం, వ్రాయడం మానేస్తారా? తెలుగు బాషతో తెలంగాణావాళ్లకి వచ్చే సమస్య ఏమీ లేదు కానీ మీరు మాట్లాడే అతిశయోక్తులు తెలంగాణావాళ్లని అవమానించే విధంగా ఉన్నాయి.
సుజాత గారు, తెలుగు బాట కార్యక్రమం గురించి బ్లాగ్స్ లో చూసాను. చాల మంచి కార్యక్రమాన్ని చేపట్టారు.ఒక క్షణం అనిపించింది "అయ్యో,నేను పాల్గొనలెకపోయానే అని".కార్యక్రమం గురించిన వివరాలు మరియు ఫోటోలు ఎవరైనా టపాలలో పెడతారెమో అని చూస్తుండగా మీ టపా కనిపించింది. కార్యక్రమంలో మేము పాల్గొనలేకపొయినా పాల్గొన్న అనుభూతిని కలిగించారు. తెలుగు బాట కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ అభినందనలు.
డియర్ ప్రవీణ్ శర్మ,
ఈ కింది లింకులో మూడో వ్యాఖ్య చూడండి.
http://apmediakaburlu.blogspot.com/2010/08/blog-post_5650.html
ఇది తెలుగు భాష ముసుగులో జరుపుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలా కనపడుతున్నదట. అంతే కాదు,ఇదే అంశంతో తెలుగు భాష రేపనగా కొందరు ఈ తెలుగు సభ్యుల ఫోన్లకు SMSలు వచ్చాయి.
ఇపుడు చెప్పండి, ఎవరివి అతిశయోక్తులు?
ఈ విషయమై మీరు విషయం పక్కదారి పట్టకుండా రాసే తర్వాతి వ్యాఖ్యలు మాత్రమే అనుమతించబడతాయని గుర్తుంచుకుని రాయండి
సుజాత గారూ, తెలుగు భాషాభిమానులందరినీ కలిసే మంచి అవకాశాన్ని చేజార్చుకున్నందుకు చాలా బాధగా ఉంది. ఈ సారి ఇలాటి కార్యక్రమాలేవైనా జరిగితే తప్పక రావడానికి ప్రయత్నిస్తాను. తెలుగు బాటలో పాల్గొన్న అందరికీ మీ బ్లాగు ముఖంగా అభినందనలు తెలియజేస్తున్నాను.
క్రింది లంకెలో తెలుగు భాషగురించిన మంచి పాట ఉంది. "చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు" మరింత మంది భాషాభిమానులకు ఈ పాట చేరవేయవచ్చనే ఉద్దేశ్యంతో వివరాలు ఇస్తున్నాను. తెలుగు కార్యక్రమాలలో పాడుకోతగ్గ మంచి పాట.
http://www.telugubhakti.com/telugupages/Music/index.html
పై పాట వ్రాత ప్రతి దొరికిందండోయ్! చాలా అనువుగా క్రింది లంకెలో ఉంది.
http://www.telugubhakti.com/telugupages/Telugu/Toranam/Chekkara.htm
బాగుందండి సుజాత గారూ, పోస్టు వ్రాసి మీతో మమ్మల్నీ నడిపించారు.
సుజాత గారు,
తెలుగుబాటలో పాల్గొన్నవారికి అభినందనలు.ఫోటోలలో ఉన్న వారి పేర్లు రాసి ఉంటె బాగుండేది. మన రాష్ట్రం వెలుపల/దేశం వెలుపల ఉండే నా బోటివారికి ఏ బ్లాగు రచయిత ఎలా ఉంటారో తెలిసి ఉండేది. మీరు ఎమీ అనుకోక పోతె ఒక్క మహిళా బ్లాగర్ ఫోటొ ఇక్కడ పెట్టలేదు. దీనికి ఎదైనా ప్రత్యేకమైన కారణం ఉందా? ఇంతమంది బ్లాగర్లు ఒక చోట కలవటం పెద్ద విశేషం. మీరంతా కలసినందుకు గుర్తుగా ఒక గ్రుప్ ఫోటొ అంతా కాలసి తీసుకొని ఉంటె బాగుండేదేమొ.
ఓహ్, పోస్ట్ చదువుతూ ఉంటే నేను కూడా అక్కడ ఉన్నట్టే అనిపించింది. ఫొటోలు అవీ పెట్టి మంచిపని చేసారు. మొత్తానికి తెలుగు కోసం దిగ్విజయంగా నడిచినందుకు సంతోషం. ఈసారి రాలేకపోయిన వచ్చే యేడాది తప్పక పాల్గొనేందుకు ప్రయత్నిస్తాను.
తెలుగు బాట విశేషాలు చదువుతుంటే మనసంతా ఆనందంతో నిండిపోయింది.
ayya nenu kooda ee karyakramam lo paalgonnanu
kaani naa vadda ee chaya chitralu levu meeru naayandu daya undi ee kaaryakramaniki sambandhinchi mee daggara unna anni chaya chitralanu naaku pampinatlaithe oka teepi gurtuga daachukuntanu
dhanyavaadalu
ఈ మాత్రం ప్రసంగాలు తట్టుకోలేకపోతే ఎలా సతీష్! త్యాగరాయ గాన సభలో ప్రసంగాలెప్పుడైనా చూశారా? వామ్మో!
అవునూ, ఆ అబ్బాయి పేరు ఏమిటో తెలుసుకున్నారా? దారి పొడుగునా అతడు ఆపకుండా చక్కని స్ఫూర్తి దాయకమైన స్వరంతో నినాదాలు ఇస్తూనే ఉన్నాడు.
ఆ శునకాన్ని నేను గమనించలేదు.పెళ్ళి ఊరేగింపనుకుందేమో!:-)) sujatha garu aa abbai nene andi naa peru suresh andaru uday antaru nenu radio jockey ga panichestunnanu chala santhosham gurtunchukunnanduku nenu asuresh_akula@yahoo.com thonu alaage naa mobile number 9959381537 thonu register chersukunnanu daya chesi naaku photos pampinchandi ee email id ki pampinchina ok leda rjudayrj@yahoo.com ki pampinchandi idi aithe nenu roju check chesukone mail dhanyavaadalu
cool boy
మీ మెయిల్ ఐడీ , ఫోన్ నంబర్ ఉన్నందువల్ల ఇక్కడ మీ మిగతా వ్యాఖ్యలు పబ్లిష్ చేయడం లేదు. ఫొటోలు నేను పంపిస్తాను మీకు.
మంచి కార్యక్రమం జరిగింది. మాలాటి రాలేని వారికి కొండంత అండ!
dhanyavaadaalu sujatha garu nannu gurthinchara mari ?
Post a Comment