చాలా రోజుల తర్వాత ఇవాళ జేపీ మాటలు నాకు చాలా చాలా నచ్చాయి!ఎందుకంటే ఈ మధ్య జేపీ అసలేమీ మాట్లాడకుండా, తెలంగాణా మీద ఏ వైఖరీ తేల్చకుండా ఉండటం నాకు నచ్చడం లేదు.
"రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు ఉద్యమాల పేరుతో బలవంతపు వసూళ్ళకు పాల్పడుతున్నాయని లోక్ సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ్ ఆరోపించారు. చట్టాలకు లోబడి మాత్రమే కేసులు ఎత్తివేయాలన్న ఆయన హింసాత్మక బలవంతపు వసూళ్ళకు పాల్పడిన వాళ్లకు మినహాయింపు ఇవ్వడం సరికాదన్నారు." (ఈనాడు.నెట్ )
ఉద్యమాల సమయంలో హింస, విధ్వంసాలకు పాల్పడినవారిపై కేసులు ఎత్తివేయాలనటం సమంజసం కాదని లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ చట్టాన్ని ఉల్లంఘించే అధికారం ప్రభుత్వానికి కూడా లేదన్నారు. ప్రభుత్వం ఉన్నది ఇలాంటి చర్యలను ప్రోత్సహించేందుకు కాదన్నారు. ఉద్యమాల సమయంలో విద్యార్థులు, ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తివేస్తామని హోంమంత్రి చిదంబరం ప్రకటన సరికాదన్నారు.
ఉద్యమాల ముసుగులో కొందరు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఇటువంటివి జరుగుతున్నా ప్రభుత్వం నిస్తేజంగా ఉందని ఆయన విమర్శించారు. భయంతోనే వసూళ్ల బాధితులు ఫిర్యాదు చేయటం లేదన్నారు --సాక్షి
ఈ మాటల్లో తప్పుందో లేదో పార్టీలకతీతంగా ఆలోచిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. నిజానికి ఆయన ఏ పార్టీ పేరూ ఎత్తలేదు. కానీ ఆయన వ్యాఖ్యలు తగిలిన వారు మాత్రం వీరంగాలు వేసి "సో కాల్డ్ మేధావి గారు" అంటూ ఎద్దేవా చేస్తూ వసూళ్ళకి సాక్ష్యాలు చూపించమని సవాళ్ళు విసిరారు. అప్పుడే లోక్ సత్తా ఆఫీసుల్లో విధ్వంసానికి కూడా దిగారు.
ఇలాంటి వసూళ్ళు ఎవరైనా ఆడియో, వీడియో సాక్ష్యాలు పెట్టుకుని చేస్తారా? పోనీ సినిమా నిర్మాతలో,వ్యాపార సంస్థలో ముందుకొచ్చి సాక్ష్యం చెప్పే పరిస్థితి ఉందా?
ఉద్యమం సరైన దారిలో నడవటం లేదనీ, అక్రమ వసూళ్ళ వంటివి ఎక్కువై సరైన నాయకత్వమే లేకుండా పోతోందనీ తెలంగాణా వాదులే నిస్పృహ చెందిన సందర్భాలున్నాయి.
"Do question, when some thing is wrong అని చెప్పే జేపీ ఇవాళ దాన్ని చేసి చూపించారు.
దోపిడీ, అత్యాచారం వంటి సంఘటనల పట్ల కూడా ఇవాళ రాజకీయ నాయకులు "పార్టీ దృక్పథంతో" ఆలోచించి లాభ నష్టాలు బేరీజు వేసుకుని వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో పార్టీ స్పృహ లేకుండా ఒక మామూలు మనిషిగా మాట్లాడాడు జేపీ! ఒకే ఒక్కడనిపించాడు !
వీడియో చూడండి, జేపీ ఏ ఒక్క ప్రాంతాన్నీ, ఉద్యమాన్నీ ఉద్దేశించలేదు. పైగా "ప్రాంతాలకతీతంగా" హింసను ప్రేరేపించే వ్యక్తుల మీద చర్య తీసుకోవాలన్నారు.
ఒక సామాన్య పౌరులుగా ఆలోచించి చెప్పండి, జేపీ మాటల్లో తప్పుందా?
"సో కాల్డ్ మేధావి గారి అడ్డగోలు మాటలు"గా వాటిని వీళ్ళు నిర్ణయించేశారు !
ఆయన వ్యాఖ్యలు ఉపసంహరించుకోకపోతే హైద్రాబాదులో తిరగనివ్వరట.
ఏమిటీ బెదిరింపులు? ఎంతవరకు ఇలా?
ఇది నేను లోక్ సత్తా మెంబర్ గానో, జేపీ అభిమానిగానో రాయడం లేదు. నేనసలు ఈ మధ్య పార్టీ పద్ధతులు కొన్ని నచ్చక లోక్ సత్తాలో యాక్టివ్ గా లేను :-))
34 comments:
నేను పోయినసారి లోక్సత్తాకి ఓటేసినా ఆ తర్వాత కూడా పార్టీ నిర్మాణం ఏమీ చురుగ్గా సాగుతున్నట్టు కనిపించకపోవటంతో చాలా నిరాశపడ్డాను. పార్టీని నడపటంలో, పెంచటంలో ఎలా ఉన్నా ఈ రోజు అసంబ్లీలో మాట్లాడాక జేపీ ఒకే ఒక్కడనిపించాడు.
He is doing good.keep supporting him.
నిజమే
అన్నీ చట్టం ప్రకారమే జరగాలి.
శాంతియుతంగా యూనివర్సిటీలో నిరసన ప్రదర్శన చేస్తున్న విద్యార్థులపై లాఠీ చార్జి చేయడానికి, రబ్బర్ బుల్లెట్ల వర్షం కురిపించడానికి ఏ వైస్ చాన్సలర్ పర్మిషన్ ఇచ్చాడు? ఇవ్వకుండా ఏ చట్టం ప్రకారం పోలీసులు యూనివర్సిటీలో చొరబడ్డారు?
ఒకే వ్యక్తిపై ఒకే సమయంలో LB నగర్, కూకట్ పల్లి ప్రాంతాలో రెండు కేసులు బుక్ కావడం ఏ చట్టం ప్రకారం సాధ్యం?
జేపీగారు ఇవి కూడా ఆలోచిస్తే బాగుండేది. చంద్ర బాబు రెండు కాళ్ళ సిద్దాంతం లాగ, ఈయనకి కూడా కొన్నివిషయాలలో మాత్రమే చట్టాలు గుర్తొస్తున్నాయి మరి!
శాంతియుతంగా యూనివర్సిటీలో నిరసన ప్రదర్శన చేస్తున్న విద్యార్థులపై .....శాంతియుతంగా....శాంతియుతంగా..Lolz!
గుమ్మడి కాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు బలవంతపు వసూళ్ళు అనగానే ఉస్మానియా విద్యార్థులు జె పి దిష్టిబొమ్మ తగలబెట్టేసారు.వీళ్ళు ఇంత సన్నాసులు కాబట్టే రాజకీయనాయకులు వాళ్ళతో ఆటలాడుకుంటున్నారు.
హరి గారూ,కిరణ్ గారూ
ఎప్పుడెప్పుడో జరిగిన వాటిని తవ్వి మీరు కరెక్టా మేము కరెక్టా అని తేల్చుకోడానికి ఈ పోస్టు రాయలేదు. టాపిక్ పక్కదారి పట్టించవద్దు. ఇవాళ జేపీ మాట్లాడిన మాటలు సరైనవా కాదా అన్న దాని గురించే మాట్లాడండి!
ఇంత చెప్పాక కాదనడానికేముంది కానండీ, వారి పేరు J.P.Narayan నా లేక J.P.Narayana నా?
పేరులో ఏముందిలేండి అంటారా?:)
ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఎక్కడా హింసకు పాల్పడిన "తెలంగాణా ఉద్యమకారుల" పై కేసులు ఎత్తివేయడం మంచి పద్ధతి కాదు అనలేదు. హింసకు పాల్పడిన ఎవరినైనా ఉపేక్షించడం మంచిది కాదనేది మాత్రమే ఆయన అభిప్రాయం. బుర్రున్నోడెవరైనా దీన్ని సమర్ధిస్తాడు. ఇక్కడ కొంతమంది తెలంగాణా వాదులు అనవసరంగా భుజాలు తడుముకుంటున్నారన్నది వాస్తవం. ఏదైనా విషయం సూటిగా ప్రశ్నించినప్పుడు దాన్ని దాటవేయడానికి వేరే విషయాలు నెత్తినేసుకోవడం వారికి మామూలేగా!
జేపీగారు తెలంగాణ విషయంలో ఏమి తేల్చాలని మీరు ఆశిస్తున్నారో నాకు తెలియదు కానీ అతని తటస్థ వైఖరి వల్ల లాభమే జరిగిందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఉన్న రెండు ఉద్యమాలూ భావోద్వేగాలనూ, విద్వేషాలనూ రెచ్చగొట్టేవే...జేపీ ఏ ఒక్క వైపు వెళ్ళినా ఆ సదరు ఉద్యమం పట్ల జనానికి నమ్మకం కల్పించినట్లయ్యేది. ఏ విధంగానూ మార్పు తీసుకురాని, ప్రజలకు అవసరంలేని అలాంటి విషయాల కంటే అతను దృష్టి పెట్టవలసిన సమస్యలు చాలా ఉన్నాయి.....ముఖ్యంగా గత సంవత్సరంలో రాష్ట్రాన్ని చూశాక నాకలా అనిపించింది.
ఈ సందర్భం లో అన్నారు కాబట్టి పక్కా సాక్ష్యాధారాలు.. ఉంటే కేసు నడిపించవచ్చు.. కానీ కుట్రలు రాజ్యమేలే సమయం లో జరుగుతున్న ఈ విచారణలు నిష్పక్ష పాతం గా ఉంటాయి అని నెనైతే అనుకోవట్లేదు.. సో .. తెలంగాణా విధ్యార్థుల పై కేసులు ఎత్తివేయడమే సరైంది...
ఆశ,
జేపీ "అసలేమీ మాట్లాడకుండా" అన్నాను చూడండి,అది చాలా వాటికి వర్తిస్తుంది. ఇకపోతే మీరన్నట్లు తెలంగాణా విషయం లో తటస్థ వైఖరి అవలంబించడమే సరైనది కావొచ్చు! కానీ దాని వల్ల ఆయన ఏ వర్గానికీ నమ్మకం కల్గించలేకపోయారు.ఎందుకంటే ఉద్రిక్త భావోద్వేగాల మధ్య ఉన్న రెండు వర్గాల ప్రజలు ఈ తటస్థ వైఖరిని అర్థం చేసుకోలేరు.
ఏ విధంగానూ మార్పు తీసుకురాని, ప్రజలకు అవసరంలేని అలాంటి విషయాల కంటే అతను దృష్టి పెట్టవలసిన సమస్యలు చాలా ఉన్నాయి...కానీ to be frank... జేపీ ఏ సమస్యలమీదా దృష్టి పెట్టినట్లు నాకైతే అనిపించలేదు. :-(
తాత్కాలిక స్వప్రయోజనాల కోసం ఇట్లా కేసులు ఎత్తేస్తూ పోతుంటే ఉద్యమం ముసుగులో ఏ ఘోరాలయినా చేయొచ్చని స్పష్టపర్చడమే గదా! అవగాహన లేని నాయకులనుండి ఇంతకంటే ఏం ఆశించగలం?
@సుజాత
జే పీ దేనిమీదా మాట్లడడం లేదని నిరాశపడే ముందు ఆలోచించండి - ఈ ఒక్క విషయం మీద నోరెత్తినందుకే ఎంత దౌర్జన్యాన్ని ఎదుర్కోవలసి వచ్చిందో! మద్దతుగా మాట్లాడినవాడొక్కడూ లేడు. వాస్తవాలు గ్రహించగలిగినవారయినా వెనక ఉన్నామని ఎప్పటికప్పుడు గుర్తు చేయడం ప్రోత్సాహాన్ని అందిస్తుంది.
మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను. శభాశ్ జేపీ!
దాంట్లో తప్పేమీ కనిపించలే నాకు.
చట్టాన్ని మీరే అధికారం గవర్నమెంట్ కి కూడా లేదన్నాడు
నేను తెలంగాణా సపోర్టర్నే .కాని
దొంగ ఎవడైనా దొంగ నే.
అయన కూడా అదే అన్నాడు.
ఉద్యమాన్ని స్వార్ధానికి వాడుకునే వాళ్ళని ఏం చేసిన తక్కువే.
అయన మాట్లాడింది వాళ్ళ గురించే కదా.-
@తెలంగాణా మీద ఏ వైఖరి తేల్చకుండా - JP గారు తెలంగాణా ఇస్తే ఉపద్రవం రాదు, అలాగని అద్భుతాలు జరిగిపోవు; ఇవ్వాలా, వద్దా అన్నది ఒక committee వేసి, కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలి అన్నారు. AP లొ అన్ని జిల్లాల మీద ఒక report ఇవ్వండి, తెలంగాణా ప్రాంతమే వెనుక బడింది అని ప్రజలలో ఉన్న అపోహను తొలగించండి అని JP గారు ప్రభుత్వాన్ని కొరారు. ఆయన స్వయంగా ఒక report తీసుకొచ్చి ఒక TV studio లో (ఒక program లో) వివరించారు. ఇది ఒక నైతికతకు సంబందించిన విషయం కాదు, ఇందులో తప్పు, ఒప్పులు లేవు, ఒక ప్రాంతాన్ని దోచి ఇంకొక ప్రాంతానికి పెట్టిన దోపిడీ కూడా లేదు అనేది సార్వత్రిక వెనుకబతు తనాన్ని చూస్తే తెలుస్తుంది, అని అన్నారు. ఇంత స్పష్టమైన వివరణ తెలంగాణా కావాలి అన్న వాళ్లు ఇవ్వలేదు, వద్దు అన్న వాళ్లు ఇవ్వలేదు.
PS: నేను Lok Satta party తరపున మాట్లాడటం లేదు, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం.
people who can not spend an hour in public interest, i think, have no right to criticize JP.
Ram
జెపి మాటలు సబబుగానే ఉన్నాయి, ఆయన అన్నదాంట్లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఏమీలేవు. గొడవలు చేసేవారిదంతా గుమ్మడికాయదొంగల చందమల్లే ఉంది.
పార్టీ ఫండ్ కీ అక్రమ వసూళ్ళకీ తేడా తెలీట్లేదు జనాలకు!
ఆయన ఏ పార్టీ పేరూ ఎత్తకుండానే వీళ్ళు అర్జెంటుగా భుజాలు తడిమేసుకుని గోల చేస్తున్నారు! నోరు పారేసుకుంటున్నారు. లోక్ సత్తా పార్టీ వసూలు చేసే ప్రతి పైసాకీ ద్దాదాపుగా లెక్కలున్నాయి. వాటిని పార్టీ వెబ్ సైట్ లో చూడొచ్చు.
ఒక్క మగాడనిపించాడు జేపీ! ఇలాంటి వాళ్ళు ఇంకా ఇంకా రావాలి, అడగాలి, కడగాలి! వాళ్లకి మనలాంటి జనాల సపోర్టు ఉండి తీరాలి.
వేణు గారూ,
ఈ తటస్థ వైఖరి అనేది ప్రజల్లో చాలా మందిలో ఉంది. కానీ రెండు ప్రాంతాల గొడవగా మారి విద్వేషాలు పెచ్చరిల్లిన సందర్భంలో ఏదో ఒక వాదానికి, ముఖ్యంగా పార్టీనేతలు ఒక నిర్ణయానికి రావలసిన అవసరం కనపడుతుంది. ఈ విషయంలో జేపీ ఇంకా బ్యూరోక్రాట్ లాగే మాట్లాడుతున్నారు.
భాస్కర్ రామి రెడ్డి గారూ,
ఆయన పేరు J.P.Narayan గానే తెలుసు నాకు! :-))
కిరణ్ గారూ,
విద్యార్థుల హింసకు వీడియోలే ప్రత్యక్ష సాక్ష్యాలు! ఆంధ్రా నుంచి కేవలం పేపర్లు దిద్దడానికి వచ్చిన అధ్యాపకులను ఒక ఓయూ విద్యార్థి మెడ మీద కొట్టి "నడువుండ్రి" అని గేటు బయట వరకూ నెట్టిన దృశ్యం కళ్లముందే కదలాడితే నిజంగా దుఃఖం కలుగుతుంది.
పైగా విద్యార్థుల మీద కేసులు ఎత్తి వేసే విషయంలో ప్రభుత్వం పట్టింపులకు పోగూడదని హరీష్ రావు సుద్దులు చెప్తున్నాడు.
కానీ కుట్రలు రాజ్యమేలే సమయం లో జరుగుతున్న ఈ విచారణలు నిష్పక్ష పాతం గా ఉంటాయి అని నెనైతే అనుకోవట్లేదు.....అసలు విచారణ చేపట్టడమంటూ జరిగితే కదా! అప్పుడు రేకెత్తే ఉద్రిక్తతలకు భయపడే...సెప్టెంబర్ వరకూ పెట్టిన కేసులు అన్నీ ఎత్తి వేస్తున్నట్లు సబితా రెడ్డి ప్రకటించింది.
రవి చంద్ర,అవును,
అనవసరంగా ఆవేశపడి భుజాలు తడిమేసుకోవడం..ఇది! ఎవరినో ఏదో అంటే వీళ్ళకు రోషాలు కోపాలు రావడం, హైద్రాబాదులో ఉండనివ్వమంటూ బెదిరించడం మామూలైపోయింది.
తాత్కాలిక స్వప్రయోజనాల కోసం ఇట్లా కేసులు ఎత్తేస్తూ పోతుంటే ఉద్యమం ముసుగులో ఏ ఘోరాలయినా చేయొచ్చని స్పష్టపర్చడమే గదా! ...మీ బాధే నాదీను! ఇక్కడ స్వప్రయోజనమే కాదు, ఆ కేసులు కొనసాగితే ఏం జరుగుందో, ఎంత విధ్వంసం జరుగుంతుందో అని భయం కూడా! ఒక్క జేపీ వ్యాఖ్యలకే ఎంత గొడవ చేశారో చూశారుగా!
ఇక నా నిరాశకు అనేక కారణాలున్నాయి! అవి పార్టీ పరమైనవి. దీని మీద ఒక పోస్టే రాయొచ్చు! :-)
శరత్,
థాంక్యూ!
తెలంగాణా మీద సంవత్సరం క్రితం TV9 Dr JP తో చేసిన ఇంటర్వ్యూ(
మీ వద్ద 15 నిమిషాల సమయం వుంటే):
http://www.youtube.com/watch?v=tteA2rfrVv0&feature=related
http://www.youtube.com/watch?v=VE65vIlmiwI&feature=fvst
ఇలాగే JP ప్రతి పెద్ద సమస్య/పధకం/ఆలోచన (ఆరోగ్యశ్రీ, Energy -Gas Grid , మద్యం, AP వార్షిక budget , 2G spectrum ) పైన తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కట్టారు, తనకు తెలిసిన పరిష్కారాన్ని తెలియచేసారు.
కొన్ని ఈ క్రింద వీడియో లో
http://www.youtube.com/watch?v=rKxKtWANYgc
దయచేసి, లోక్ సత్తా మీద నమ్మకాన్ని వీడ వద్దు - ప్రత్యేకంగా సమస్యలపై ఏదో ఒక రూపేన స్పందించే మీలాంటి వారు.
This is not to prove a point, or to overwhelm you or anyone here. It doesn't offend me, if you don't post this comment; apply your discretion freely. Sorry that I had to say this English.
రమేష్ గారూ,
జేపీ చెప్పింది ప్రాక్టికల్! కానీ ఇక్కడ ప్రాక్టికల్ గా వర్కవుట్ అయ్యే పద్ధతుల గురించి ఎవరు ఆలోచిస్తారు. ఇదేదో ఆస్థి లాగ మాది మాకివ్వాల్సిందే అని పోట్లాడుతుంటే? ఇలాంటి విషయాల్లో జేపీ ఇంకా వ్యూహాత్మకంగా ఒక రాజకీయనాయకుడి తరహాలో మాట్లాడితే బాగుంటుందని పార్టీలో కూడా చాలా మంది అభిప్రాయపడుతుంటారు.
Ramgopal, మీరన్నది అక్షరాలా నిజం! వారసత్వం తప్ప వేరే ప్రాథమిక అర్హతలేమీ లేనివాళ్లు కూడా జేపీని "సో కాల్డ్" మేథావిగా వర్ణించేస్తున్నారు. ఏం చేస్తాం?
వేణూశ్రీకాంత్, రైట్!
నీలాంచల, మీకు జేపీ అంటే బాగా అభిమాననుకుంటాను. డబ్బు లెక్కల విషయంలో మిగతా పార్టీలకంటే పారదర్శకంగా ఉండే అవకాశం లోక్ సత్తాకే ఉంది. ఎందుకంటే అసలు ఇక్కడ ఉన్న డబ్బే తక్కువ కదా! :-))
రమేష్ గారూ,
థాంక్యూ! మీరు ఇచ్చిన వీడియో(నక్సలిజం మీద జేపీ) అద్భుతంగా ఉంది. ఇంతకు ముందు కూడా చూసినట్లు గుర్తుంది.
జేపీ ఒక సమర్థుడైన నాయకుడు! అందులో ఎలాంటి సందేహమూ లేదు. రాదు కూడా! కాకపోతే ఆయన ఇంకా ప్రజల్లోకి బాగా, ఇంకా బాగా వెళ్ళాల్సి ఉంది. అదీ కాక పార్టీలో ఆయన తర్వాత ఆయన వాణిని అదే స్థాయిలో జనంలోకి తీసుకెళ్ళే నాయకత్వం లేకపోవడం ఒక లోటు! కేడర్ పెంచుకోవడం ఒక సమస్య అయితే, అది కేవలం పదవులో మరోటో ఆశించి వచ్చి భంగపడేవారుగా కాక సమర్థులుగా, talkative గా, సెన్సిబుల్ గా మాట్లాడేవారు గా కూడా చూసుకోవడం మరో సమస్య! ఈ సమస్యల్ని లోక్ సత్తా అధిగమించాల్సి వస్తుంది.
దీని గురించి మనం వివరంగా మరోసారి మాట్లాడుకుందాం!
జేపి సరైన మాటలు సరైనవే....సమయం సరైనదే...కాని సందర్భం సరైంకాదు.....
నావాదనే సరైందన్న భావన మితిమీరడం వల్ల ఇలా జరుగుతుంది....
జేపిగారి అమాయకమైన నీతి మాటల వల్ల ...
సంవత్సరం క్రితమే ఇచ్చిన మాట తప్పుతున్న,
ఉద్దెశ్యపూర్వకంగా తాత్సారానికి పాల్పడుతున్న,
వారిని విడుదల చేయడం వల్ల ఉద్యమం ఉదృతి పెరుగుతుందని భయపడుతున్న,
ఈ చేతకాని సర్కారుకి ...నైతికంగా అనైతికమైన-ఊతాన్ని ఇచ్చినట్లయింది.....
కొందరి కళ్ళలో కన్నీళ్ళు వస్తుంటే...
కొందరి కళ్ళ మంట చళ్ళారి నట్లైంది...
ఈ బోడి వాదనలంతా మాట ఇవ్వముందు చేసిఊంటే బాగున్ను...
పిల్లికి గంట కట్టటం ఏలా అని అలోచిం చే ఎలుకల చర్చలా ఉంది.
నేను జే.పి. గారి ప్రసంగం ఇప్పటిదాకా వినలేదు.ఆయనేంతప్పు చెప్పడో తలియడం లేదు. ఏఒక్కరిని ఉటంకించలేదు. సర్వసాధారణమైన వ్యాఖ్య చేశాడు. మరి దానికి తె.రా.స వాళ్ళేందుకు బుజాలు తడుముకున్నాట్టుగ అంత రెచ్చిపోవడమెందుకో తెలియటం లేదు. పాలన మీద ఒక అవగాహన లేనివాళ్ల కు ఒక పాఠం చెప్పినట్టుగా వుంది. ఉన్న మాట అంత నిర్భయం గా చెప్పడం నాయకత్వ లక్షణం. కానీ ఇల్లంటి వాళ్ళు ప్రస్తుత కుళ్ళు రాజకీయాలలో పనికొస్తారా అన్నట్టు గావుంది
వాళ్ళేమో డిసంబర్ లో చెప్పి సంవత్సరం అయ్యింది మాట నిలబెట్టుకోమంటున్నారు... మీరేమో సెప్టెంబర్ ముందు కేసులు తీసేసారంటున్నారు.. ఏది నిజం ?
కిరణ్,
మాట ఇచ్చిన తర్వాత జరిగిన పరిణామలు, వెల్లువెత్తిన నిరసన మీకు తెలుసు! శ్రీకృష్ణ కమిటీని అందరూ స్వాగతించాక, ఇంకా ఆ "మాట" కి విలువ ఉందంటారా? లేదా కమిటీ వేసినపుడే ఈ కమిటీ మాకొద్దు అని TRS చెప్పి ఉండాలి. కమిటీ ముందుకు వెళ్ళి వారి వాదనలను వినిపించారంటే కమిటీని అంగీకరించినట్లే కదా!
సబితా రెడ్డి మొన్నటి (పదో తారీకు) అసెంబ్లీలో సెప్టేంబర్ వరకూ విద్యార్థుల మీద పెట్టిన కేసులన్నీ ఎత్తి వేస్తున్నామని ప్రకటించడం నేను చూశానండీ వార్తల్లో!
@ మావూరు గారు,
మీ వ్యాఖ్యకు స్పందించలేకపోయాను నిన్న!
ఉద్యామానికి మీలాంటి వాళ్ళే కావలసి ఉందనిపించింది మీ నిష్పక్షమైన అభిప్రాయం చూశాక!
సుజతా గారు
జె.పి గారి మాటలు సమర్ధనీయమయ్యేవెప్పుడు
కనీసం ఒక చిన్న ఆధారాన్ని చూపగల్గినప్పుడు సమర్ధనీయమే
అసెంబ్లీ వేదికగా దాడి చేసినాకూడా, మానాని కంటే ప్రానానికే విలువిచ్చినప్పుడు
ఆయనచెప్పే జె.పి రాజ్యంఘం ప్రకారం ఆధారసహితంగా మాట్లడాలి, నేరం చెసిన వాడికంటే నేరాన్ని దాచిన వాడే అతి పెద్ద నేరస్తుడు
జె.పి ఒక ఆధారాన్ని చుపగలిగితే తెలంగాన ఉద్యమం నుంచి మేమంతా వైదొలుగుతాం
నిఖార్సుగా మాట్లదలంటే ఇదే మా మనస్తత్వమ్యతె ఇంత మంది హైద్రబాద్ లొ మైక్ పట్టుకొని మాట్లడుండి పోకపొతుండే .
/ఈ తటస్థ వైఖరి అనేది ప్రజల్లో చాలా మందిలో ఉంది. కానీ రెండు ప్రాంతాల గొడవగా మారి విద్వేషాలు పెచ్చరిల్లిన సందర్భంలో ఏదో ఒక వాదానికి, ముఖ్యంగా పార్టీనేతలు ఒక నిర్ణయానికి రావలసిన అవసరం కనపడుతుంది. ఈ విషయంలో జేపీ ఇంకా బ్యూరోక్రాట్ లాగే మాట్లాడుతున్నారు/
ఇది కాంప్లిమెంట్ అనే నేననుకుంటాను. నోటికొచ్చినట్టు వాగి ప్రెస్ వక్రీకరించారనో, నా వుద్దేశ్యం అది కాదు అనో, నేనలా అనలేదని తరవాత తీరిగ్గా ఖండించే తుచ్చ రాజకీయనాయకుడవటం (దిగ్విజయ్ సింగ్, సల్మాన్ కుర్షిని, బేణి ప్రసాద్, చిదంబరం, అద్వానీ, సుష్మా స్వరాజ్) కన్నా జెపి అలావుండటమే బాగుంది. తెరాస వాళ్ళకు కావాల్సినట్టు 'స్పష్టంగా' చెప్పనవసరం లేదు. అటో ఇటో తేల్చాల్సిందే అని గిరిగీయడం ద్వారా దీన్నో 'టగ్ ఆఫ్ వార్' కింద పరిగణించడం అనవసరము. చీటికిమాటికి కేసులు పెట్టడం, విత్డ్రా చేసుకోవడం కూడా ప్రజలకు చట్టం మీద గౌరవం లేకుండా పోవడానికి ప్రధాన కారణం. 'వసూళ్ళు' అనగానే ఎవరికి తగలాలో వారికే తగిలింది :))
జెపిని బ్యూరోక్రాట్ అని ఈసడింపుగా అనడం సరికాదు. దొంగలు, సారావ్యాపారులు, గూడాలు, జైల్లోనుంచి పోటీ చేసే నేరస్థులు దర్జాగా ఎన్నికవుతున్న ఈ దేశంలో పరిపాలనానుభవము కలిగిన ఓ సివిల్ సర్వెంట్ ఎందుకు అభ్యంతరకరమో అర్థం కాని విషయం.
పార్టీలకు అతీతంగా ఈవిషయంలో జెపి సమర్థనీయుడు. ఆ మాటకొస్తే జెపిలో 10% క్వాలిటీస్ వున్న నాయకుడు దేశంలోనే అరుదనిపిస్తుంది.
SKNR gaaru
naaku allage undi. brahma kunde shakthi lo 10% unna brhma to poradi andarni JP lage putticche vaani.
సుజాత గారు
ఓఊ లో పేపర్లు దిద్దడానికి వచ్చిన ఉపాద్యాయుల్న్ని మెడపెట్టి గెంతివేసింత మాత్రానికేనా
800 మంది ఆత్మ త్యాగం గురించి ఒక అక్షరం కూడ రయలెఖపొయిండ్రు.
అదే యునివర్సిటేలో సజీవ దహనం చెసుకున్న విధ్యార్దిని చుడలేదా
గాందిజీని ఒకసారి నడుస్తున్న రైల్లొంచి తోసివెసిండ్రు, అదే ఒక స్వతంత్ర భరతావనికి కారనమయ్యింది
/800 మంది ఆత్మ త్యాగం గురించి ఒక అక్షరం కూడ రయలెఖపొయిండ్రు/
800 చేరిండ్రా?!!
నా పాట 810..832..901...1000.. ఒకటో సారి ... రెండోసారి... :)))
SKNR గారు
నాకర్ధం కాలేదు వెయ్యిని మీరు కలుపుకొంటారా? లేక వెయ్యిలో కలిసిపోతారా
కొంచెం అర్థం చేయించు
Post a Comment