December 19, 2010

పుస్తకాల సంతలో వారాంతం ......కాసిన్నికబుర్లు!




వారాంతం రెండు రోజులూ పుస్తకాల సంతకి వెళ్ళాలని ముందే అనుకున్నాను కాబట్టి, శనాదివారాలు రెండురోజులూ సాయంత్రాలూ అక్కడే గడిపాను.ఇవాళైతే మధ్యాహమే వెళ్ళాను. ఎందుకంటే నిన్న పుస్తకాల స్టాళ్లన్నీ చూడ్డం కుదరలేదు.పైగా నిన్న నాతో సంకీర్తన ఉంది. ఆవిడను తీసుకెళితే కనపడ్డ యాక్టివిటీ పుస్తకాలన్నీ కొనమంటుంది. మరో పక్క భయపెడుతూ "ఛోటా భీమ్" వాళ్ళ స్టాలు! అందుకే నిన్న కొన్ని పుస్తకాలు మాత్రమే కొన్నాను. నిజానికి నా పుస్తకాల కొనుగోలు ఎప్పటికప్పుడు నవోదయలోనో, విశాలాంధ్రలోనో అప్ డేట్ అవుతూ ఉంటుంది కాబట్టి తెలుగు పుస్తకాలు అంతగా కొనాల్సినవి కనపడలేదనే చెప్పాలి.

ఇవాళ తీరిగ్గా తిరిగి, కొన్ని పుస్తకాలు కొన్నాను. నేను స్టాళ్ల పేర్లు పట్టింపు లేకుండా(అంటే నిజానికి పట్టించుకోకుండా) అన్నీ తిరిగి చూశాను."కన్ను దిష్టి గణపతి" స్టాల్ తో సహా! (ధర చాలా ఎక్కువ ఉండటంతో కొనలేదు)తల్లి అవతారమెత్తాక పుస్తకాలనే కాదు, ఎక్కడికెళ్ళినా పిల్లలకు పనికొచ్చేవి ఏమున్నాయో చూడ్డం ఒక దైనందిన చర్యగా మారిపోతుందిగా! అందుకే స్పైడర్ బుక్స్ స్టాల్లో మంచి యాక్టివిటీ పుస్తకాలు,క్రాస్ వర్డ్ పజిల్సు పుస్తకాలు కొన్నాను. ఈ స్టాల్లో మంచి కలెక్షన్ ఉంది. అలా వెళ్తోంటే నవోదయ వాళ్లు 'ఏవండోయ్, ఇల్లా చూడకుండా పోతున్నారేం?" అని కేకేశారు. కొమ్మూరి వేణుగోపాలరావు గారి పుస్తకాలన్నీ వచ్చాయి, చూస్తారా అన్నారు. చూశాను గానీ వాటిలో నాకు కావలసిన 'ఈ దేశంలో ఒక భాగమిది" నవల లేదు. ఈ నవల చాలా అద్భుతంగా ఉంటుంది.



అందరితో పాటే నేనూ నా 'నా ఇష్టం" కొన్నాను.పిలకా గణపతి శాస్త్రి గారి "విశాలనేత్రాలు" చినవీర భద్రుడి 'సత్యాన్వేషణ" తీస్కున్నా! ఈ సారి మంచిపుస్తకం, జనవిజ్ఞానవేదిక వాళ్ళు కల్సి నిర్వహిస్తున్నారు స్టాల్. వాళ్ళ దగ్గర గిజుభాయి పుస్తకాలు తీసుకున్నాను.

నన్ను బాగా ఆకర్షించిన మరో స్టాలు 'సేతు సాఫ్ట్ వేర్ సిస్టమ్" వాళ్ళది. My drona పేరుతో ఒక వీడియో డివైస్ ని అందిస్తున్నారు. ఫెయిర్ కి వెళ్ళినవాళ్లు తప్పక చూడండి.బాగా ఉపయోగంగా కనిపించిన మరో స్టాలు "కినిగె"!.స్నేహితులందరికీ ఈ స్టాలు గురించి మెయిల్ పంపాను చూడమని!

మరికొన్ని పుస్తకాలు తీసుకుని , ఛోటా భీమ్ స్టాల్లో ఒక టీ షర్టూ(పిల్లదానికి), ఒక కప్పూ,కీ చైనూ తీసుకుని బయటపడ్డాను.

ఈ లోపల రామ్ గోపాల్ వర్మ తో ముఖాముఖి ప్రారంభమైంది. సభికులు అడిగిన కొన్ని తింగరి ప్రశ్నలకే కాక,సీరియస్ ప్రశ్నలకు కూడా రాము తింగరి,వెటకారపు సమాధానాలే చెప్పి "నా ఇష్టం" అనిపించుకున్నాడు.(పుస్తకంలో కొన్ని భాగాలు నాకు చాలా నచ్చాయి)



ఆదివారం కావడం వల్ల ఇవాళ చాలామంది బ్లాగర్లు ఈ తెలుగు స్టాల్ కి వచ్చారు. శ్రీనివాస్ రాజు దాట్ల భార్గవ్,కట్టా విజయ్,రవిచంద్ర,కత్తి మహేష్,నవతరంగం వెంకట్,అరిపిరాల సత్యప్రసాద్,బూదరాజు అశ్విన్,వికాసధాత్రి అరుణ,కస్తూరి మురళీకృష్ణ,చావా కిరణ్, వేణు, గీతాచార్య,యోగి,జాన్ హైడ్ కనుమూరి,శ్రీనివాస కుమార్,సీబీరావు,బాలు(కోతికొమ్మచ్చి)  గార్లు కాక.....

కొత్తగా వీకెండ్ పొలిటీషియన్,కొడవటిగంటి రోహిణీప్రసాద్ గార్లు ఇవాళ్టి ప్రత్యేక అతిథులు.జ్యోతిగారు వచ్చి అరంగంట ఉండివెళ్ళిపోయారు.(ఇంకెవరైనా వచ్చారా? నేను గమనించలేదు)

వీళ్ళుకాక రోజూ స్టాల్లో ఉండటానికి (గుంటూరునుంచీ )వచ్చిన కౌటిల్య,రహమానుద్దీన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి.

అన్నట్లు వీవెన్ కూడా!:-))

స్టాలు సందర్శకులు కూడా అధిక సంఖ్యలోనే ఉన్నారివాళ. రామకృష్ణమఠం వారు నడిపే శ్రీ రామకృష్ణ ప్రభ పత్రికకు   ఆన్ లైన్ లో తెలుగువ్యాసాలు ఎలా టైప్ చేసుకోవాలో  పత్రిక నిర్వాహకులు పరిజ్ఞాయేంద్ర స్వామి కి రెహమాన్ వివరించారు.

ఇద్దరు ముగ్గురు బ్లాగర్లు "మలక్పేట్ రౌడీ హైద్రాబాదులోనే ఉన్నారా?నిజంగానే వస్తారా"అని ఆసక్తి ప్రదర్శించారు.(ఆయన ఇంతకు ముందు టపాలో "నేనూ రానా బుక్ ఫెయిర్ కి?" అని వ్యాఖ్య రాశారు)

స్టాల్లోని బ్లాగర్లకి మిర్చి బజ్జీలు సత్యప్రసాద్ గారూ, స్వీట్లు కౌటిల్యా స్పాన్సర్ చేశారు.:-))

ఇంకా కొనాల్సిన పుస్తకాలు,చూడాల్సిన స్టాళ్ళూ కొన్ని మిగిలిపోయాయి. వచ్చే వారాంతంలోపు వాటి సంగతీ చూడాలి.

హైద్రాబాదు బ్లాగర్లు తీరిక చూసుకుని ఒక రోజు బుక్ ఫెయిర్ కీ, పన్లోపనిగా స్టాలుకీ వచ్చేయండి!

16 comments:

Kathi Mahesh Kumar said...

ఇంకో ఫోటో పెట్టలేదే!

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

సుజాత గారు,
That is too quick a post :)

ఈ రోజు అనుకోకుండా రావడం జరిగింది. బ్లాగుల్లో మాత్రమే పరిచయమున్న అనేక మంది మిత్రుల్ని వ్యక్తిగతం గా కలవడం చాలా సంతోషాన్నిచ్చింది.

I will visit again and salute all of you people who are doing so many good things.

రమణ said...

e-తెలుగు మరియు పుస్తక ప్రదర్శనలో పాల్గొన్న బ్లాగర్లందరికీ అభినందనలు. నేను పుస్తక ప్రదర్శనను, స్టేట్ సెంట్రల్ లైబ్రరీని ఎంతగానో మిస్సవుతున్నా :( .

sivaprasad said...

nenu kuda vachhanandi

kasturimuralikrishna said...

ఇంతకీ, భారతీయ వ్యక్తిత్వవికాసం కొన్నారా? లేదా? రాం గోపాల్ వర్మ పుస్తకం అయితే కొంటారూ.....

సుజాత వేల్పూరి said...

మహేష్,

ఏ ఫొటో?:-)) నా కెమెరా నా వద్ద లేదు నిన్న! మిత్రులెవరో తీసుకుని ఫొటోలు తీశారు!వాటిలో ఏవో దొరికిన ఫొటోలు పెట్టానంతే!

మురళీకృష్ణ గారూ,

మీరసలు ఎక్కడా వ్యాఖ్యలు రాయనే రాయరు. చూశారా, మీ పుస్తకం కొనకపోయే సరికి చనువుతో నిలదీయడానికైనా ఇక్కడ వ్యాఖ్య రాశారు. నిన్న కొనలేదు. పెందలాడే ఇంటికొచ్చేశాను కదా! మళ్ళీ ఒకరోజు వస్తాను. ఈ సారి వచ్చేసరికి సైన్స్ ఫిక్షన్ కథలు కూడా సిద్ధంగా ఉంచండి మరి!

ఆ.సౌమ్య said...

ప్చ్ ఇవన్నీ వింటూ ఉంటే ఎంత మిస్ అవుతున్నానో అనిపించింది. :(

సిరిసిరిమువ్వ said...

"ఆవిడను తీసుకెళితే కనపడ్డ యాక్టివిటీ పుస్తకాలన్నీ కొనమంటుంది"....అమ్మా!!!మీరేమో కనిపించిన పుస్తకాలన్నీ(పోగొట్టుకుని కొన్ని రెండు..మూడు సార్లు కూడా) కొనేసుకుంటారా!! పాపం సంకీర్తననేమో ఇలా అంటారా?? ఉండండి..ఉండండి..ఈ సారి సంకీర్తనతో చెప్తాను తను ఏయే స్టాల్సుకి వెళ్లాలో!

సుజాత వేల్పూరి said...

వరూధినిగారూ, సంకీర్తనకు కూడా పుస్తకాల పిచ్చి బాగానే ఉంది. ఇంగ్లీష్ పుస్తకాలు ఈజీగానూ తెలుగు పుస్తకాలు కొద్దిపాటి కష్టంతోనూ నమిలేస్తుంది. ఆమెకు క్రాస్ వర్డ్ పజిల్స్ బాగా ఇష్టమని అవే తీసుకున్నాను నిన్న!

ఈ సారి మీరు వచ్చేప్పుడు చెప్పండి. ఆవిడ రాకుండా జాగ్రత్త పడతాను

Paddu said...

సుజాత గారూ,
పుస్తకాలు ఆన్ లైను లో కొనడానికి వీలవుతుందా? PDF లో దొరికితే బాఉంటుంది.
(ఆశ కి హద్దు ఉండదు అంటే ఇదే!!!!!)

మిర్చి said...

Nice to know

Vasu said...

అయ్యో మిస్ ఐపోయాను. నేను హైదరాబాద్ లో ఉన్నాను. ముందే తెలిసుంటే వెళ్ళేవాడిని. ఎక్కడ జరిగింది ఇది . ఇంకా ఉందా??

SRRao said...

మీకు, మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

SRRao
శిరాకదంబం

జయ said...

మీకు నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

kannaji e said...

ఓహ్ ఇంత అవుతూ ఉంటుందా...! థాంక్స్ సుజాత గారు..ఇలాటి మీట్ రాబోయే రోజుల్లో ఉంటే కాస్త ముందుగ చెప్తూ ఉండండి..వీలున్నప్పుడు నేను కూడ ముంబై నుంచి రావడానికి ట్రై చేస్తాను.
మీకు New year greetings...

Sharada said...

భలే అదృష్టవంతులు. నేను మిస్సయినందుకు చింతిస్తూ

శారద

Post a Comment