తెలుగు బాట కార్యక్రమం కోసం శ్రీ తాడేపల్లి గారు స్వయంగా రాసి, సభికులందరి చేతా చేయించిన తెలుగు భాషా ప్రతిజ్ఞ!
నా మాతృభాష తెలుగు! నేను నా మాతృభాషను ప్రేమిస్తున్నాను. అందరు తెలుగు
కవులను,కళాకారులను ,రచయితలను నేను బేషరతుగా గౌరవిస్తాను. తెలుగులో ఉన్న అన్ని
మాండలికాలూ,శైలులూ నాకు సమానమే!
తెలుగు గడ్డ మీద అన్ని రంగాలలోనూ తెలుగే వ్యవహారంలో ఉండటానికి నేను అంగీకరిస్తున్నాను.
నేను నా సహోదర తెలుగువారితో ఎల్లప్పుడూ తెలుగులోనే మాట్లాడతాను.
వారికి తెలుగులోనే లేఖలు రాస్తాను.తెలుగు రానివారు అది నేర్చుకోవడానికి నా ఇతోధిక సహకారాన్ని అందజేస్తాను.తెలుగుభాషకు,వారసత్వానికీ ఎక్కడా, ఏ సందర్భంలోనూ, ఎవరి వలనా అవమానం
జరగకుండా అన్ని విధాలుగా జాగరూకత వహిస్తాను.
తెలుగు భాష గురించిన సరియైన పరిజ్ఞానాన్ని
సంపాదించే నిమిత్తం ప్రేరణ ప్రోత్సాహాలు కలుగజేస్తాను.నా తెలుగు భాషా వారసత్వాన్ని భావి తరాలకు
యథా తథంగా అందించడానికి ఉద్దేశించిన ప్రతి కార్య కలాపానికీ నా మద్దతు ప్రకటిస్తాను.
రెండు వేల సంవత్సరాల చరిత్ర,సంస్కృతి,సాహిత్య సంప్రదాయమూ కలిగిన తెలుగు
భాషా వారసత్వం నాకు చాలా గర్వ కారణం! ఈ వారసత్వాన్ని సగర్వంగానూ,బహిరంగంగానూ
ప్రకటించుకోవడం నా కర్తవ్యం! శాయశక్తులా దాన్ని నిలబెట్టడానికి కృషి చేయడం నా విధ్యుక్త ధర్మం!
జై తెలుగు భారతి!
August 30, 2010
August 29, 2010
తెలుగుబాటలో తెలుగుకై నడిచాం!
అమ్మయ్య! తెలుగుకై నడిచాం! తెలుగు తల్లి విగ్రహం నుంచీ, (...అవును తెలుగుతల్లి విగ్రహం నుంచే) పీవీ జ్ఞానభూమి వరకూ తెలుగు భాషాభిమానులంతా కలిసి నినదిస్తూ నడిచాం!ఆశించినంత మంది రాకపోయినా వచ్చిన వారంతా ఉత్సాహంతో తెలుగులో మాట్లాడుకుంటూ నడిచారు!.
నిన్నటి ఉస్మానియా సంఘటన తాలూకు ఛాయలు గానీ తెలుగుబాట పై పడతాయేమో అని ఒక పక్క చిన్న సందేహం ఉన్నా, అవాంఛనీయ సంఘటనలు గానీ వ్యతిరేక నినాదాలు గానీ ఎక్కడా కనపడలేదు వినపడలేదు.
మైకాసురులెవరూ లేకుండా అతి చిన్న ప్రసంగాలతో ప్రారంభమైంది కార్యక్రమం! తర్వాత సభికులమంతా తలా ఒక శ్రుతిలో "మా తెలుగు తల్లి "గీతం ఆలాపించి ఒకరినొకరు అలరించే ప్రయత్నం చేశాము. (భాషాభిమానం ముఖ్యం,శ్రావ్యతదేముంది?):-))
ఆ తర్వాత తాడేపల్లి గారు అందరి చేతా తాను స్వయంగా రాసిన మాతృభాషా ప్రతిజ్ఞ చేయించారు. ఆ తర్వాత నడక ప్రారంభమైంది.
మాతృభాషా ప్రతిజ్ఞ
విశేషాలు:
పొద్దున్నే 6-45 కల్లా అక్కడికి చేరుకున్న మాకు ఎప్పటిదో ఏళ్ళనాటి వాడిపోయిన చెమికీ దండ ధరించిన తెలుగు తల్లి విగ్రహం కనిపించింది. ఈ- తెలుగు యువ బృందం సాహసించి అడుగు స్థలం కూడా లేని తెలుగు తల్లి విగ్రహ పీఠం ఎక్కి బంగారు హారం లా మెరిసిపోతున్న సరికొత్త చామంతి పూల దండ వేశారు.
దండ వేయడం ఇంత కష్టమా?
విశేషమేమిటంటే ఇవాళ మాతృభాషా దినోత్సవం! e-తెలుగు దండ తప్పించి వేరెవరూ తెలుగు తల్లి విగ్రహానికి ఒక దండ కూడా వేయకపోవడం!
హమ్మయ్య,వేసేశాం!
పూనా నుంచి వచ్చిన అచ్చ తెలుగు బ్లాగ్లోకం బాబాయి భమిడిపాటి ఫణిబాబు గారు మొదటినుంచీ చివరి వరకూ అలసిపోకుండా హుషారుగా నడిచారు.
శరత్ కాలం శరత్ గారు ఎనిమిదింటికల్లా వచ్చి తానూ కొన్ని బానర్లు పట్టుకుని సరదాగా కలిసిపోయి మాట్లాడారు.
అమెరికా నుంచి ఆంధ్రాకి..తెలుగుబాటకి!
ఆలోచింపజేసే వ్యాఖ్యలు రాసే గద్దె ఆనంద్ స్వరూప్ గారు ఈ కార్యక్రమానికి వచ్చారు.
ఏపీ మీడియా కబుర్లు రాముగారు,వేణువు వేణు గారు,ఫణిబాబు గారు పక్కపక్కనే కూచుని హాయిగా తెలుగు కబుర్లు చెప్పుకున్నారు.
గడ్డిపూలు సుజాత గారినీ నన్నూ అక్కడ అందరూ "ఇంగ్లీషు సుజాత-తెలుగు సుజాత" లు గా గుర్తించి పిలవడం మా ఇద్దరినీ బాగా నవ్వించింది.
HMTV రామచంద్ర మూర్తి గారు వచ్చి కాసేపుండి వెళ్ళిపోయారు.
భూమిక సత్యవతి గారు మాతో పాటు చివరి వరకూ నడవడమే కాక మాతో కల్సి పీవీ నరసింహారావు గారి సమాధిని చూడ్డానికి కూడా వచ్చారు.
భవదీయుడు చక్రవర్తి గారు అమెరికా యాత్ర ముగించుకుని ఈ రోజు ఉదయమే హైదరాబాదు లో అడుగు పెట్టినా సమయానికి సభాస్థలికి సతీ సమేతంగా విచ్చేశారు.
తన ద్విచక్ర వాహనంలో పెట్టిన మంచినీటి పాకెట్లని అడిగినప్పుడల్లా అందిస్తూ శ్రీమతి భవదీయుడు (స్వాతి) చాలా సహాయం చేసింది.
నడక ప్రారంభం కాగానే మీడియా వాళ్ళు బైట్స్(bytes) కోసమని నన్నూ,వీవెన్,తాడేపల్లి గార్లను ఆపడంతో మేము నడకలో ఇరవై నిముషాలు వెనుకబడిపోయాం. అందువల్ల కారులో వెళ్ళి మిగతా వారిని చేరి అక్కడనుంచీ నడక ప్రారంభించాం! ఈ విషయమై ఫణి బాబు గారు నన్ను చీల్చి చెండాడేశారు!(ఆయన బ్లాగులో రాస్తారుగా...!)
వయోధికులైన మండలి బుద్ద ప్రసాద్,మల్లికార్జున శర్మ,ఫణిబాబుగార్లు అలసట చెందకుండా ఉత్సాహంతో చివరి వరకూ నడవటం విశేషం! (నాకైతే దాదాపు చివరి వరకూ వచ్చాక రోడ్డు పక్కన కూచుండిపోదామనిపించింది)
జ్ఞానభూమి వద్దకు చేరేదాకా ఆగిన వర్షం అక్కడ మమ్మల్ని బాగానే ఆశీర్వదించింది. అసలే ఆకలితో మాడిపోతున్న మాకు అక్కడ ఒక టీ అమ్మే వ్యక్తి దేవుడిలా కనపడ్డంతో అందరమూ వర్షంలో వేడి వేడి టీ తాగి సేద తీరాం!
ఈ కార్యక్రమానికి వచ్చిన బ్లాగర్లు...ఈ తెలుగు సభ్యులతో కలిపి వీవెన్,కశ్యప్,సతీష్ యనమండ్ర,కౌటిల్య,రవిచంద్ర,నాగమురళి,అశ్విన్ బూదరాజు,కోడిహళ్ళి మురళీ మోహన్,కొండవీటి సత్యవతి,గడ్డిపూలు సుజాత,శరత్,నాగప్రసాద్,వేణు,రాము,ఫణిబాబు, తాడేపల్లి,చదువరి, శ్రీనివాస కుమార్,శ్రీనివాస రాజు దాట్ల,నందం నరేష్,చక్రవర్తి,స్వాతి,చావా కిరణ్,కట్టా విజయ్,రాజన్,శ్రీహర్ష,..మరికొందరు భాషాభిమానులు! (ఎవరినైనా మర్చిపోతే తిట్టకుండా గుర్తు చేయండి)

August 26, 2010
తెలుగు బ్లాగర్లకు విజ్ఞప్తి!
(ఈ కార్టూన్ ప్రముఖ కార్టూనిస్టు శ్రీ సరసి గారిది. వారి "సరసి కార్టూనులు-2" నుంచి తీసుకున్నాను.వారికి ధన్యవాదాలు)
ఈ కార్టూన్ చూశారా? దీన్ని మొదటి సారి చూసినపుడు నాకు నవ్వు రాలేదు. "అవును, ఇలాగే ఉన్నాం"అనిపించింది. కొంతకాలానికిది నిజమై పోతుందేమో అని భయమేసింది. మీకూ అలాగే అనిపిస్తోందా?
మాటల్లోనూ రాతల్లోనూ నెమ్మది నెమ్మదిగా నిర్లక్ష్యానికి గురవుతోన్న మాతృభాషను కాపాడుకునేందుకు, భాష గురించిన చైతన్యాన్ని రగిలించేందుకు, భాష గురించి కొందరినైనా ఆలోచింపజేసేందుకు etelugu సంకల్పించిన "తెలుగు బాట" కార్యక్రమంలో పాల్గొని అందరం కలిసి భాషా చైతన్యం దిశగా భావావేశంతో, నాలుగడుగులు వేద్దాం!
వ్యావహారిక భాషా ఉద్యమకర్త గిడుగు రామమూర్తి గారి జన్మదినమైన ఆగస్టు 29న మాతృభాషా దినోత్సవం జరుపుకుంటున్నాం! ఆ రోజు తెలుగు భాష వినియోగం పై చైతన్యాన్ని కలిగించేందుకు,పెంచేందుకు "తెలుగుబాట"అనే వినూత్న కార్యక్రమానికి eతెలుగు శ్రీకారం చుట్టింది. సెక్రటేరియట్ ( సచివాలయం )ముందు ఉన్న తెలుగు తల్లి విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డు లో గల పీ.వీ జ్ఞానభూమి వరకు ఒక "నడక" కార్యక్రమం ఇది!
తెలుగు పై అభిమానం గల మాతృభాషాభిమానులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అనేకమంది ప్రముఖులు ,భాషాభిమానులు ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ ఇప్పటికే సందేశాలు పంపారు. మీడియా భాగస్వామిగా HMTV ఉన్నందున ఈ సందేశాల వీడియోలను ప్రొమోలు గా మీరు HMTV లో చూడవచ్చ్చు.
ఈ కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించేందుకు, మరింత ఎక్కువ సంఖ్యలో భాషాభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గత పది రోజులుగా ఈ తెలుగు సభ్యులంతా అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఆర్థిక వనరులు లేనందున ఇది సంస్థ సభ్యులకు కొంత భారంగానే తోస్తున్నా తెలుగు మీద ప్రేమతో ముందుకు సాగుతున్నాం!
హైదరాబాదు బ్లాగర్లంతా ఆ రోజు ఆదివారం కాబట్టి కొద్దిగా వీలు చేసుకుని ఈ నడకలో పాల్గొనమని విజ్ఞప్తి చేస్తున్నాం!
ఈ నడక ఉద్దేశం ముందుగానే చెప్పినట్లు భాష పట్ల ఒక చైతన్యాన్ని కల్గించేందుకే! ఆ నడకకు వచ్చిన కొందరైనా మాతృభాష గురించి,భాషాభివృద్ధి గురించి ఆలోచిస్తే,కొందరైనా తమ పిల్లలు తెలుగులోనే మాట్లాడేలా చూస్తే,కొందరైనా తమ పిల్లలకు తెలుగులో(రాయడం తెలీని పిల్లలకు ) రాయడం నేర్చుకోమని చెపితే మా ప్రయత్నం సఫలమైనట్లే!
అంతర్జాలంలో తెలుగు భాష వాడకం పై ఇంతకు ముందు ఈ తెలుగు జర్నలిస్టులకు,రచయితలకు రెండు అవగాహనా సదస్సులను విడివిడిగా నిర్వహించింది.వాటికి ఎంతో ఆదరణ లభించింది.ఈ కార్యక్రమానికి కూడా అదే విధంగా ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నాం!
రండి,అచ్చ తెలుగులో మాట్లాడుకుంటూ ఒక ఆదివారం ఆహ్లాదకరమైన ఉదయాన్ని శోభాయమానంగా తెలుగు కోసం గడుపుదాం! మనతో పాటు నలుగురిని తీసుకువచ్చి నాలుగడుగులు వేయిద్దాం!
మీ పేర్లు నమోదు చేయించుకోండి.
ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యే ఈ నడక దాదాపు తొమ్మిది, తొమ్మిదిన్నరకల్లా ముగుస్తుంది. మీ ఆదివారం వ్యక్తిగత ప్రత్యేక కార్యక్రమాలకు ఏ మాత్రం అడ్డురాని సమయం!
తప్పక రండి,మాతో కలిసి నాలుగడుగులు వేయండి
హైద్రాబాదు తెలుగు బ్లాగర్లు అంతా తప్పక రావాలని కోరుతున్నాం! మిగతా ప్రాంతాల వాళ్ళు వస్తే మాకు మరింత
సంతోషం

August 14, 2010
మేరా రంగ్ దే బసంతీ!
ఈ పాటని, ఈ దృశ్యాన్ని చూడండి! రాజ్ గురు, సుఖ దేవ్ లతో కలిసి ఉరి కంబం ఎక్కడానికి వెళ్తూ భగత్ సింగ్ పాడే పాట. ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ సినిమా లోది. ఆగస్టు పదిహేనున ఈ పాట వినడం నాకు ఇష్టమైన పని!
వీడియో ఉన్న సబ్ టైటిల్స్ గమనించండి. ఎంత ఉత్తేజపూరితంగా ఉంటాయో! గుండె లోతుల్ని తడిమి కనులు చెమరింప జేసే ఈ పాట నాకెంతో ఇష్టం!అజయ్ దేవ్ గణ్ ఈ సినిమాలో మాత్రం నచ్చుతాడు! :-))
Happy independence day!

August 10, 2010
శ్రీరామ జయము కలుగవలెను
ప్రొఫెషనల్ గాయకుడికి కావలసిన సర్వ శుభ లక్షణాలూ అతడి గొంతులో కొలువున్నాయి. ముఖ్యంగా మెలోడీ!
నా వోటెప్పుడూ మెలోడీకే!
అవును, శ్రీరామ చంద్ర గురించే !
అతడు ఒక్కరే ప్రోగ్రామ్‌లో పాడినపుడు నేను చూడలేదు. ఇండియన్ ఐడల్ కూడా సెమీస్ కి ముందు చాలా తక్కువ ఎపిసోడ్స్ చూశాను. సెలెక్షన్లు జరిగేటపుడు ఒక కుర్రాడి తండ్రి (పెద్ద ఉద్యోగంలో ఉన్నాడట కూడా) అన్నూ మాలిక్ కాళ్ళమీద పడి "మా వాడు ఆశతో వచ్చాడు సార్!అతడిని సెలెక్ట్ చేయండి"
అంటూ భోరుమని ఏడవడం చూసి చిరాకు పుట్టింది .ఇలాంటి డ్రామాలు భరించలేక రియాలిటీ షోలేవీ చూడ్డం మానేశాను
సెమీస్ నుంచి రెగ్యులర్ గా చూస్తున్నాను.
రామచంద్ర చాలా బాగా పాడుతున్నాడు. కానీ సమస్య ఏమిటంటే ప్రత్యర్థి రాకేష్ కూడా బాగా పాడుతున్నాడు.చక్కని స్వరం,లయ,శృతి అన్నీ మెయింటెయిన్ చేస్తున్నాడు.
భూమి లాభం లేదు. ఒకటో రెండో ఐటమ్ సాంగ్స్ పాడ్డానికి తప్పించి శృతి విషయంలో నిలబడ లేకపోతోంది . "కజ్రా మొహబ్బత్ వాలా" పాటని నాలుగు కంటే తక్కువ శృతిలో పాడింది. ఆతీహై ఖండాలా పాటలో కూడా తెలిసిపోయింది ఆ సంగతి. హిందీ సినిమా పాటలన్నీ దాదాపుగా హై పిచ్ లో ఉంటాయి. కాబట్టి భూమి ఐడల్ అవడం మాట వట్టిదే!
పోటీ రాకేష్ కీ రామ చంద్రుడికీనూ!
నాకు ఇద్దరి గొంతులూ నచ్చాయి. కారుణ్య ఫైనల్ కి వచ్చినపుడు అతడి ప్రత్యర్థి సందీప్ ఆచార్య కారుణ్య ముందు మెలొడీ విషయంలో ఎందుకూ నిలబడలేకపోయాడు. (అందుకే అతడు ప్రొఫెషనల్ గా నిలదొక్కుకోలేకపోయాడు కూడా) అయినా నార్త్ వాళ్ళ ఎస్సెమ్మెస్ వోట్ల పుణ్యమా అని సందీపే గెల్చి పూడ్చాడు.
ఇప్పుడు అలా కాదు. రాకేష్ రామచంద్రకు గట్టి పోటీ ఇస్తున్నాడు.
రామచంద్ర గొంతు లో పరిపక్వత ఉంది. కారుణ్య గొంతులో ఉండే కొద్దిపాటి ఫిమేల్ టచ్(నా అబ్జర్వేషను) కూడా రామచంద్ర గొంతులో లేదు. పర్ఫెక్ట్ వాయిస్.
నిష్పక్షపాతంగా ఓట్ చేయాలంటే నా వోటు చెల్లదు.ఇద్దరికీ పడుతుంది. కానీ "మనవాడు"అన్న పక్షపాతం చూపించకపోతే లాభం లేదు.
ఇందుకు మా కాలనీ వాసులే ప్రేరణ! మా కాలనీలో అంతా హైటెక్ సిటీ ఉద్యోగులే! ఇతర దేశాల వాళ్ళు కూడా మాతో సమానంగా ఇక్కడ నివసిస్తూ తిరుగుతూ ఉంటారు!ఇతర రాష్ట్రాల వాళ్ల సంగతి చెప్పక్కర్లేదు. 70 శాతం వాళ్ళే ఉన్నారు.
రామచంద్రకు ఓట్ చేయమని A4 సైజు పేపర్ల మీద prints తీసి ప్రతి అపార్ట్ మెంట్ లోనూ నోటీస్ బోర్డులో పెట్టే ఏర్పాటు చేసాం. మరికొన్ని ప్రింట్స్ హైటెక్ సిటీ వద్ద పంచమని ఒక కుర్రాడికి అప్పగించాం! కాలనీ అసోసియేషన్ మీటింగ్ లో సరదాగా చివర్లో ఇండియన్ ఐడల్ ప్రసక్తి వచ్చినపుడు ఈ 70%మందీ "రామచంద్ర పర్లేదు!రాకేష్ మాత్రం.....రాకింగ్..మా వోట్లు అతనికే"అని చెప్పేశారు.
నా వోటు రామ చంద్రుడికే! కేవలం తెలుగు వాడనే ప్రాంతీయాభిమానంతో మాత్రమే కాదు,అద్భుతంగా పాడుతున్నందుకు కూడా!
August 2, 2010
టీచరమ్మ మొగుడు
నేను మూడో క్లాసు చదువుతున్నపుడు ఆ క్లాసుకు అన్ని సబ్జెక్టులూ చెప్తూ క్లాస్ టీచర్ గా శ్రీమతి శ్రద్ధా దేవి ఉండేవారు.అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు పాఠం చెప్పడమే కాక మాతో బోలెడన్ని ఆటలు ఆడి,వీలైతే హోమ్ వర్క్ కూడా స్కూల్లోనే చేయించేసి,"ఇంటికిపోయి హాయిగా ఆడుకోని తిని పడుకొండి"అని భరోసా ఇచ్చేది ఆమె.అందుకని ఆమె అంటే భలే ప్రాణంగా ఉండేది మాకు.ఒక్కరోజు కూడా స్కూలు ఎగ్గొట్టకూడదని తపించేంతగా! సన్నగా తెల్లగా, పెద్ద జడతో(అంటే జడకాదు తెల్లగా ఉండేది),జడలో ఎర్రని గులాబీతో, ఇస్త్రీ చేసిన లేతరంగు కాటన్ చీరెల్లో మెరుపుతీగలా ఉండేది ఆమె.
ఒకరోజు మధ్యాహ్నం లంచ్ టైమ్ లో నల్లగా లావుగా ఉండే ఒకాయన వచ్చి చెట్టు కింద ఆడుకుంటున్న మమ్మల్ని "శ్రద్ధా టీచరుందా" అనడిగాడు.
అంతలో ఆమె చిరునవ్వుతో ఆయన వద్దకు ఎదురెళ్ళి కాసేపు మాట్లాడి పంపేసింది. తర్వాత తెలిసింది ఆయన టీచర్ గారి భర్త అని!
గొప్ప షాక్ తగిలింది.
టీచర్ గారికి మొగుడేంటి అని తెల్లబోయాము! ఎందుకంటే అప్పటిదాకా అసలు టీచర్ గారికి భర్త పిల్లలు,వంటివి ఉండొచ్చని మాకు తట్టలేదు.పైగా టీచర్ గారికి ఆయన తగిన మొగుడుగా అనిపించలేదు.
తర్వాత ఆయన ఎప్పుడు స్కూలుకొచ్చినా చూడలేక కుమిలిపోయేవాళ్ళం! ఆయన రాగానే ఇంత అందమైన టీచరమ్మ పరుగెత్తుకుంటూ వెళ్ళడం నచ్చేది కాదు!పెద్ద పొసెసివ్ నెస్ తో రగిలిపోయేవాళ్లం!ఆయనకు వేరే వూరు ట్రాన్స్ ఫర్ అయిపోవాలని కోరుకునేవాళ్ళం!
కానీ అలా జరగలేదు..పైగా వాళ్ళు స్కూలుకు దగ్గర్లోనే ఇల్లు కట్టుకుని సెటిల్ కావడంతో ఆయన రోజూ స్కూలు ముందునుంచే పదిసార్లు తిరుగుతూ కనపడేవాడు.
తర్వాత హైస్కూల్లో తెలుగు మేడమ్ అవివాహిత. తల్లితో కల్సి ఉండేది.ఎప్పుడూ మాకు బోలెడన్ని పుస్తకాలు ఇస్తూ, మమ్మల్ని వ్యాసరచన పోటీలకు ప్రిపేర్ చేస్తూ ఎక్కడా ఎవరికీ బహుమతులు రాకుండా మా స్కూలుకే అన్నీ వచ్చేలా ఎంతో కృషి చేస్తుండేది.
ఒక ఫ్రెండ్ లా మాతో కల్సిపోయి పాటలు కూడా పాడుతుండేది.మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళి టిఫిన్లు పెట్టేది. ఒకరోజు పిడుగులాంటివార్త తెల్సింది!
ఆమెకు పెళ్లి కుదిరిందని!
ఇక మేము ఎంతగా ఏడ్చామంటే ఆమె పెళ్ళి ఆగాలని ఎంతో కోరుకున్నాం గానీ ఈసారి కూడా అలా జరగలేదు.పెళ్ళి అయిపోయింది.ఈ సారి పెళ్ళికొడుకు అందంగా ఉన్నా మాకు నచ్చలేదు. "ఏడిసినట్టున్నాడు"అని తిట్టుకున్నాం.అసలు టీచర్లకు పెళ్ళి పెటాకులేమిటని విసుక్కున్నాం!
మాకు లెక్కలు,పీ ఎస్ చెప్పడానికి మగపిల్లల హైస్కూలు నుంచి ఒక మాస్టార్ని డెప్యుటేషన్ మీద పంపారు.ఆయన చలవతో లెక్కలంటే భయం పోయింది.అంత బాగా చెప్పేవారు. ఖాళీ పీరియడ్లు ఉంటే స్టాఫ్ రూములో కూచోకుండా క్లాసుకు వచ్చి ఎక్ స్ట్రా క్లాసులు తీసుకునేవారు. అలాంటిది మా స్కూల్ డే రోజు మాత్రం ఆయన్ని చూస్తే "ఈయనెవరో మాకు తెలీ"దనిపించింది.
అప్పటివరకూ ఆయనకోభార్య ఉంటుందని తల్చుకోని కూడా తల్చుకోని మేము ఆయన ఏకంగా ఒక పిల్లను నడిపించుకుంటూ మరో పిల్లనో పిల్లాడినో ఎత్తుకుని వాళ్ళకు డ్రింకులూ అవీ ఇవ్వడం,కర్చీఫ్ తో వాళ్ళ ముక్కులూ మూతులూ తుడవడం,ఒకట్లకీ రెండ్లకీ బాత్ రూములకేసి తీసుకెళ్లడం వంటి "సామాన్యమైన పనులు " చేస్తుంటే తెల్లబోయాం.మా "ఐడియల్ హి" అసలు స్వరూపం ఇదా అనిపించింది.ఆయన్ని మాస్టారు పాత్రలో తప్ప ఇలా మొగుడు,తండ్రి పాత్రల్లో ఊహించుకోకపోడం వల్ల ఆయన సంసార తాపత్రయం చూస్తుంటే చీదర పుట్టింది. టీచర్లూ,మాస్టార్లు పెళ్ళి చేసుకోకుండా ఉంటే బావుంటుందనిపించింది.
ప్రతి విద్యార్థి దశలోనూ టీచర్లు మన సొంతం అనే ఫీలింగ్ ప్రతొక్కరికీ ఉంటుందేమో!వాళ్ళకంటూ పర్సనల్ లైఫ్,పిల్లలు, సంసారం ఉంటాయని తోచదెందుకో! చాసో రాసిన ఒక కథలో(రథ యాత్ర అనుకుంటాను) తిరణాలకు పెళ్ళాం పిల్లల్తో వచ్చిన మాష్టారిని చూసి విస్తుపోతాడు ఆరేళ్లకుర్రాడు."మాష్టారికీ పెళ్ళాముంటుందా"అని ఆశ్చర్యపోతాడు.
రెండో క్లాసు చదూతున్న మా పాపాయి నిన్న స్కూలు నుంచి వస్తూనే"ఇవాళ మా విద్యా మేమ్ హజ్బెండ్ వచ్చారు స్కూలుకు"అంది సంభ్రమంగా! "ఏం వస్తే?" అనడిగితే కొంచెం సిగ్గుపడి కాసేపు నానుస్తూ "మరేంటంటే...విద్యా మేమ్‌కి హజ్బెండ్ ఉంటాడని మేమెవరమూ అనుకోలేదు" అంది.
తర్వాత లోపలికెళుతూ వెనక్కి చూసి"ప్చ్,ఆయనసలేం బాలేదు. మా మేడమే బాగున్నారు"అని నిరాశపడుతూ వెళ్ళిపోయింది.
దానితో ఇదంతా గుర్తొచ్చింది! :-))

.jpg1.jpg)