January 24, 2011

అయ్యో....భీమ్ సేన్ జోషి మరిక లేరు!


                                            photo:  from www.chembur.com


సరిగ్గా పదినిమిషాలైంది భీమ్ సేన్ జోషి మరణ వార్త టీవీ లో చూసి! :-(

మిలే సుర్ మేరా పాటతో  భారత దేశంలోని మారు మూల గ్రామాలకు   సైతం ఆయన స్వరం పరిచయమైంది. నిజానికి అంతకు ముందు సంగీత ప్రియులకు తప్ప ఆయనెవరో సామాన్యులకు అంతగా తెలీదు. మిలే సుర్ ..గీతాన్ని  టీవీలో చిన్నప్పుడు చూసి  "ఈయనెవరూ?అలా శూన్యంలోకి చూస్తూ పాడతాడేం?కెమెరా వైపు చూడొచ్చుగా  " అని నేను అన్నప్పుడు నెత్తి మీద  చిల్లు పడేలా మొట్టికాయ పడింది. వేసింది మా చిన్నక్క!

నిజమే!ప్రేక్షకుల్నీ,కెమెరానూ బాలమురళి పట్టించుకోవడం అక్కడక్కడా చూశాను గానీ ఈయనకు ఎక్కడా ఎప్పుడూ ఆ రెండూ(కెమెరా, ప్రేక్షకులూ) ఎదురుగా ఉన్నాయన్న స్పృహే కనపడదు. అందుకే చాలా ఫొటోలు extreme expressions తో కనపడతాయి ఆయనవి.


బాలమురళీ కృష్ణ, భీమ్ సేన్ జోషి ల అద్భుతమైన జుగల్ బందీ

తర్వాత తర్వాత , కర్ణాటక సంగీతం నేర్చుకునే రోజుల్లో ఆయన కచేరీలు విన్నపుడు  హిందూస్థానీ శైలి నచ్చేది కాదు. "బాలమురళి, సుబ్బులక్ష్మీ వీళ్ళే గొప్ప" అనుకునే దాన్ని! కానీ తర్వాత తర్వాత ఆయన కలెక్షన్లు కొనడం మొదలు పెట్టాను. అలా అలా హిందూస్థానీ అంటే ఇష్టపడటం అలవాటైంది.

భీమ్ సేన్ జోషి గురించి రాఘవేంద్ర స్వామి చరిత్ర లో ఒక అధ్యాయం ఉంటుంది..... అది ఎంతవరకూ నిజమో కానీ! గుర్తున్నంత వరకూ రాస్తున్నాను. భీమ్ సేన్ జోషి సంగీతం నేర్చుకుంటున్న రోజుల్లో కొన్నాళ్ళకు ఆయనకు ఏకాగ్రత లేకుండా పోయిందట. ఏది నేర్చుకోవాలన్నా విరక్తి కల్గేదట.అలా తిరుగుతూ తిరుగుతూ ఆయన మంత్రాలయం వచ్చారట. మఠంలో రాత్రి నిద్ర చేసేవారు. కొద్ది రోజులకే ఆయనకు రోజూ రాత్రి కలలో ఒక వృద్ధుడు కనపడి ఒక కొత్త రాగం బోధించేవారట. మెలకువ వచ్చాక కూడా ఆ రాగం, రాగ లక్షణాలు అన్నీ ఈయనకు బాగా గుర్తుండేవి. తెల్లవారుజామున తుంగభద్ర నదీ తీరానికి వెళ్ళి ఆ రాగాన్ని సాధన చేసే వారుట. సరిగ్గా అదే సమయానికి ఎక్కడినుచో ఒక కుక్క వచ్చి ఈయన సాధన చేస్తున్నంత సేపూ ఎదురుగా కూచుని, అపస్వరం పడగానే  తిరిగి  సరిగా పాడేవరకూ మొరుగుతూ ఉండేదిట. అలా ఎన్నో రాగాలను  సాక్షాత్తూ రాఘవేంద్ర స్వామి( వద్దనే జోషి  అభ్యసించారని  ఆ చరిత్ర చెప్తుంది.



భీమ్ సేన్ జోషి గారికి తొంభయ్యేళ్ళు! అయితే ఏం? ఇలాంటి అపురూప వ్యక్తులు ఒక రెండొందలేళ్ళు  జీవిస్తే మాత్రం ఏమి? వీళ్ళకు కూడా మామూలు మనుషుల్లాగే గరిష్టంగా వందేళ్ళేనా? ఎన్ని తరాలకు సరిపడా సంగీతామృతాన్ని పంచారో కదా! వీళ్ళకేమీ మినహాయింపులుండవా  ? అలా ఉంటే ఎంత బాగుండు !....బిస్మిల్లా ఖాన్ మరణించినపుడు కూడా ఇలాగే అనుకున్నాను నేను!

అత్యాశే కానీ అన్యాయం కాదుగా!








12 comments:

anveshi said...

what a loss.his legacy of music will live on.

anveshi said...

btw,A lovely article and an interview with Shrinivas Joshi, son of the maestro

http://www.hindu.com/fr/2010/03/26/stories/2010032650910300.htm

truly story of the Legend..

"Panditji was almost going to sleep when Shrinivas saw the ticker on television. He ran to his father's room, held him by the shoulder and shook him. Panditji looked up and an elated Shrinivas said, “Baba, you've got the Bharat Ratna!” “Okay,” he replied and turned to sleep."

తృష్ణ said...

oh..న్యూస్ మిసయ్యానండీ...తెలియపరిచినందుకు ధన్యవాదాలు...నాకు పండిత్ జస్రాజ్ తరువాత నచ్చే హిందుస్తానీ గాయకుడీయన.

మాగంటి వంశీ మోహన్ said...

మనకు బాధాకరమైన వార్త! కానీ స్వర్గ లోక వాసులకు శుభవార్తే! ఎంచక్కా జోషీగారి వర్షంలో తడిసే అవకాశం వచ్చింది వారికి.

ఆ.సౌమ్య said...

"భీమ్ సేన్ జోషి గారికి తొంభయ్యేళ్ళు! అయితే ఏం? ఇలాంటి అపురూప వ్యక్తులు ఒక రెండొందలేళ్ళు జీవిస్తే మాత్రం ఏమి?"....ఎంత మంచి మాటన్నారండీ. మీకులాగానే నాకూ హిందుస్తానీ మీద ఆసక్తి కలిగించింది మాత్రం భీంసేన్ గారే. నిజంగా ఒక గొప్ప నక్షత్రం రాలిపోయింది. ఆయనకి ఇదే నా శ్రద్ధాంజలి.

వేణూశ్రీకాంత్ said...

చివరిపేరా చాలా బాగా రాశారు సుజాత గారు.. నిజమే ఇలాంటి వారికి మినహాయింపులుంటే ఎంత బాగుండు..

సత్యసాయి కొవ్వలి Satyasai said...

How sad!

సుజాత వేల్పూరి said...

అన్వేషి గారూ,

చదువుతుంటేనే కన్నీళ్ళొచ్చేలా ఉంది."నాన్నా, రేపు నీ కచేరీ ఫలానా చోట" అన్న మాటకు స్పందించినట్లు అంత మామూలుగా స్పందించడం ఎవరికండీ సాధ్యం?

సంగీతం తప్ప అసలింకేమీ పట్టదు ఈ పెద్ద మనిషికి అబ్బ! నిజంగా దైవస్వరూపమే!

పద్మవల్లి said...

అయ్యో! నాకు కూడా భీమసేన్ గారూ అనగానే "మిలే సుర్ మేరా.." అనేదే గుర్తుకొస్తుంది.
మీ కోరిక చాలా సమంజసం గానే ఉంది. సుబ్బలక్ష్మి గారూ పోయోనపుడు కూడా ఇలానే, వీళ్ళకి చావు అనేదే లేకుండా ఉంటే ఎంత బాగుండు అనిపించింది.
పద్మవల్లి

సూర్యుడు said...

For some, awards bring the name and fame and some other bring name and fame to the award itself, Sri. Joshi belongs to the second category.

May his soul rest in peace.

చైతన్య said...

"అత్యాశే కానీ అన్యాయం కాదుగా!"

కానే కాదు...

వాత్సల్య said...

టపా కి సంబంధం లేని వ్యాఖ్య పెడుతున్నందుకు శమించెయ్యండీ ఈ ఒక్క మారు.

నవతరంగం లో మీ విశ్లేషణ బాగుందండీ ఈవీవీ గురించి.

Post a Comment