ఈ ఫిబ్రవరి నెల్లో చక్కని సంగీత నాట్య ప్రదర్శనలు చూసే అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది నాకు ! Times Hyd festival తర్వాత నాట్య తరంగిణి వాళ్ళ ప్రదర్శనలు వరుసగా! మంచి తరుణం మించితే దొరకదు కాబట్టి పన్లు వాయిదా వేసి మరీ చాలా వరకూ అటెండ్ అయ్యాను. శుక్రవారం సాయంత్రం గచ్చిబౌలి లోని బ్రహ్మకుమారీస్ ఆడిటోరియం లో రాజా రాధా రెడ్డి బృదం కూచిపూడి ప్రదర్శన "మహా నటం" రూపకం ....జరిగింది.
భగవంతుడు కళ్ళు ఇచ్చినందుకు ఇలాంటి కళా ప్రదర్శనలని అప్పుడప్పుడూ చూస్తేనే గానీ సార్థకత లేదనిపించేంత అద్భుతంగా ఉంది.
అరవై పై బడ్డ రాజారెడ్డి గారి వేగం, అమితమైన ఎనర్జీ లెవెల్స్ అబ్బరపరిచాయంటే నమ్మండి. రాధారెడ్డి ఆహర్యంలోనూ, కదలికల్లోనూ వార్థక్యపు జాడలు అనివార్యమైనా....అద్భుతమైన అభినయం వాటిని దాదాపుగా మరుగు పరిచింది .
వాళ్ళ కుమార్తెలు యామిని, భావన మిగతా శిష్యులు శ్లోక వైద్యలింగం, అల్ల ఆర్థర్,అపర్ణ కృష్ణ,చిత్కళా బాలన్,నేహా కృష్ణ, షాం కె సంసి,జ్యోతి,...ఇక్కడున్న ఫొటోల్లో వీళ్ళంతా ఉన్నారు.
ప్రమథ గణాల ప్రణతులు, మనోహరమైన ప్రకృతి మధ్య పార్వతీ శంకరులుగా రాజా రాధా రెడ్డి అపూర్వంగా నాట్యం చేశారు. శివుడు గా రాజారెడ్డి అరగంట సేపు చేసిన తాండవం ఆడిటోరియాన్ని ముందు పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉంచినా ఆ తర్వాత కరతాళ ధ్వనులతో నింపేసింది. ఎక్కువ చెప్పడం కంటే..... ఫొటోలు చూడండి!
ఆ బ్రహ్మకుమార్ ఆడిటోరియం కాస్త జనాలకు తెలిసే చోట, కాస్త ఊరిమధ్యలోనూ ఉంటే ఇంకా ఎక్కువమంది వచ్చేవారేమో! ఆడిటోరియమ్ లో వెనుకవరసలన్నీ ఖాళీగా ఉండిపోవడం ఆశ్చర్యపరిచింది.
15 comments:
> అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది నాకు
_______________________________
ఇదెక్కడి పద ప్రయోగం ;)
మనవాణి,
అదొక సినిమా డైలాగు లెండి! ఇంతకీ ఫొటోలు చూడలేదనుకుంటాను. అవి శ్రద్ధగా చూసి ఉంటే ఈ పద ప్రయోగం పట్టుకునే వారు కాదు
ఫోటోలని చూడలేదని బలే కనిపెట్టారే ! నచ్చిన ఫోటోలని దాచుకునే అలవాటు . అన్నిటిని ఉంచుకోవడం కుదరక ఫోటోలు కనిపించకుండా ఏర్పాటు చేసుకున్నా :(
భూకైలాస్ సినిమాలో మొదట వచ్చే శివతాండవం నృత్యం ఒక అద్భుతం
అలాగే ఆకాశవాణి లో శివతాండవం రూపకం కూడా బలే ఇష్టమైనది (మాగంటి.ఆర్గ్ లో లభిస్తుంది)
నిజంగానే మీరు చాలా అదృష్టవంతులు! :)
పుల్లెల గోపిచంద్ అకాడెమీ మా రూమ్లో నుంచి చూస్తే కనిపించేంత దూరంలో ఉంది. అంత దగ్గర్లో జరుగుతున్నా కూడా చూళ్ళేకపోయా. :-(
ప్చ్...ఏమ్చేస్తాం..దేనికయినా అదృష్ట దరిద్రం:) ఉండాలి, మేమేమో దూరంగా ఉండి అన్నీ మిస్ అవుతున్నాం.కనీసం ఇలా అయిన చూడగలుగుతున్నాం. థాంక్స్ ఫర్ షేరింగ్.
నాగ ప్రసాద్, ఇంకో విషయమేమిటంటే...రష్యన్ బాలే కంటే దీనికి తక్కువమంది ప్రేక్షకులు రావడంతో(నేను మాత్రం దీనికే ఎక్కువమంది వస్తారని ఊహించి ముందే వెళ్ళాను) అప్పటికప్పుడు వచ్చినవాళ్లకి కూడా VIP పాస్ లు ఇచ్చి మరీ లోపలికి పంపారు.
మొత్తానికి బిర్యానీ భలే పని చేసింది
భలే అదృష్టవంతులండీ మీరు!
మీడియా కవరేజీ, పబ్లిసిటీ అన్నీ నాసిగానే వుంటాయండీ ఇలాటి కార్యక్రమాలకి. వీటి విలువ మనకింతగా తెలియకుండా పోయిందేమిటా అనిపిస్తుంది. అంతెందుకు? మైకెల్ జాక్సన్ మరణమూ అందులో మసాలా ముందు పేజీలో హెడ్ లైనిగా వేసి, డి.కే.పట్టమ్మాళ్ మరణ వార్త మూడో పేజీలో వేసుకునే మీడియా మీకు ప్రపంచంలో ఇంకెక్కడైనా కనపడుతుందా?
మంచి అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.
శారద
శారదగారూ, కొన్ని సార్లు మీడియా పరిజ్ఞానానికి సిగ్గుపడాల్సి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ తరం మీడియా! పట్టమ్మాళ్ ఎవరో కూడా చాలాలమందికి తెలీదు. అదీ కాక రీడబిలితీ, సెన్సేషనూ ఉంటే తప్ప అది వార్త కాదని అభిప్రాయము! రష్యన్ బాలే ఫొటోలు ఫ్రంట్ పేజీలో రెండు ఇచ్చి, చివరి పేజీలో వార్త రాసి, దాంతో పాటు మరో ఫొటో కూడా ఇచ్చారు.(ఆ బాలే కూడా అద్భుతంగానే ఉంది, ఒప్పుకోవాల్సిందే)! కూచిపూడి ప్రదర్శన వార్త మూడో పేజీలో నాలుగు వ్యాక్యాల్లో ముగించి, ఒక్క ఫొటో ఇచ్చారు!
నేను పొద్దున్నే ఎంత బాగా కవర్ చేశారా అని ఆత్రుతగా పేపర్ చూస్తే ఇదీ సంగతి!
ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు అయితే ఈ నాట్యతరంగిణి ప్రదర్శనల మీద ఒక అరగంట కార్యక్రమం చేయొచ్చు! కానీ దానికి యాడ్స్ రావు బహుశా! అందుకే చేయరు.
వేణు గారూ,
అవును, సంగీతం ఎంతో బాగుంది. రాజారెడ్డి గారి నాట్యం చివర్లో శంఖ ధ్వని ఆడిటోరియంలో మార్మోగడం ఒక చక్కని అనుభూతి కల్గించింది.
హైదరాబాదు వంటి నగరాల్లో ప్రేక్షకుల వైవిధయం మీకు తెలియంది కాదుగా! విదీశీయులుల్ సైతం అధిక సంఖ్యలోనే వచ్చారు ఈ ప్రదర్శనలకు! అటువంటపుడు కేవలం నిర్వాహకులు తెలుగువారైనంత మాత్రాన ప్రసంగాలు తెలుగులో ఉండాలని కోరుకోడం అత్యాశే అనుకుంటా! ఇలా సరిపుచ్చుకునేటపుడు రెహమాన్ ఆస్కార్ అవార్డ్ తీసుకునేటపుడు అంతర్జాతీయ వేదిక మీద మాతృభాషను తల్చుకోవడం వంటివి గుర్తొస్తాయి.
కానీ రాజారెడ్డి గారు కనీసం "నమస్కారం" అనైనా తెలుగులో అని ఉంటే బాగుండేది.
ప్రణవ్,
అవునండీ! అదృష్టమే! సిటీలో ఉన్నారు కాబట్టి మీరు కూడా ఇలాంటి అదృష్టాలను అందిపుచ్చుకోవాలి మరి
భాను గారూ,
అవునండీ! అందుకే ఇలాంటి కార్యక్రమాలకు హాజరైనపుడు అందరితో పంచుకుంటే రాలేని వారు, వీలుపడనివారు ఇలాగైనా ఆనందించే అవకాశం ఉంటుంది కదా!
సుజాత గారు, మీ దరిద్రం నాకు పట్టినా బాగుండేది :( ఏంటో ఇలాంటివాటికి ముందుగా ప్రచారం చెయ్యరెందుకో ప్చ్! మొన్న బ్రయాన్ ఏడంస్ కాన్సెర్ట్ కి ఇచ్చినదానిలో పదోవంతుకూడాలేదు.
ఇలాంటి కార్యక్రమాలు ఇంతకు ముందు చూడకపోయినా, నాకు పేపర్లో చూసిన తరువాత "అయ్యో ముందే తెలిస్తే బాగుండేదే అనిపించింది"
Nice pics.
I envy u. నన్నయితే దురద్రుష్టమే పట్టిపీడిస్తూంది. ఊరికి ఈ కొసాన ఉండిపోబట్టి - ఎటూ వెళ్ళలేను, చూడలేను. మంచి టపా. అన్నట్టు మీ కేమెరా కూడా చాలా బావుంది.
’భగవంతుడు కళ్ళు ఇచ్చినందుకు ఇలాంటి కళా ప్రదర్శనలని అప్పుడప్పుడూ చూస్తేనే గానీ సార్థకత లేదనిపించేంత అద్భుతంగా ఉంది’. చాలా చక్కగా చెప్పారు. మీరు మంచి అభిరుచి కలిగి ఇటువంటి ప్రదర్శనలు చూచి మంచి సమీక్ష వ్రాయటం బాగుంది. such performances should be telecast a few times.
Nice pics Madam..
Your Camera(for sure) is Canon...
it is very much evident... of course for a Canon fan like me, it is much more obvious...
Raj
Post a Comment