March 9, 2011

ముళ్ళపూడి మనసు పూల కన్నా మెత్తన


ఒక రచయిత, లేదా కవి మనకు ఇష్టుడైనపుడు, ఆయన రాతలు మనకి ఎంతగానో నచ్చినపుడు వారు వ్యక్తిగతంగా ఎలా ఉంటారో కూడా తెలుసుకోవాలనే కుతూహలం కల్గుతుంది సహజంగానే! శ్రీ శ్రీ కవిత్వం చదివిన మత్తులో అనంతం చదివాక సగం మత్తు దిగిపోయింది. సరోజా శ్రీ శ్రీ రాసిన "సంసారంలో శ్రీ శ్రీ" చదివాక ఎటూ కాని అయోమయంలో పడ్డా!

బాపూ రమణలిద్దరూ భేషజాల్లేని అసలు సిసలు తెలుగు వాళ్ళుగా, తెలుగు నుడికారానికి , తెలుగు తనానికి కేరాఫ్ అడ్రసులుగా అంగీకరిస్తాం అందరమూనూ! కోతి కొమ్మచ్చి చదివాక రమణ వ్యక్తిత్వం, ఆత్మాభిమానం మరింత స్పష్టంగా తెలుస్తాయి. అయితే వారి వదాన్యత, వినయం వంటి విషయాలను వారు చెప్పుకోరు కాబట్టి ఇంకెవరైనా చెప్తే తెలుసుకుని సంతోషిస్తాం! అలాంటిదే ఈ సందర్భం!

రమణ గారి వెన్నలాంటి మనసుని ఆవిష్కరించే ఒక సన్నివేశాన్ని ఢిల్లీలో తెలుగు ప్రొఫెసర్ గా ఉన్న డాక్టర్ ఏల్చూరి మురళీధర్ రావు సాక్షిలో రాసి అందించారు. ఇది చదివాక రమణగారికి మనసులోనే నమస్కరించకుండా ఉండలేకపోయాను. కష్టంలో చేయి అందించే వారికెప్పుడూ నేను శిరసు వంచి నమస్కరిస్తాను. చదవండి మీరు కూడా!


10 comments:

వేణు said...

సాటి మనుషుల పట్ల స్పందించే లక్షణం కళాకారుల స్థాయిని ఉన్నతీకరిస్తుంది. ‘అప్పారావు’లాంటి గొప్ప సజీవ పాత్ర సృష్టికర్త నిజజీవితంలో కూడా అప్పుల పాలైన వైనం ‘కోతి కొమ్మచ్చి’లో చదివి, ఆశ్చర్యపోయాను. ముళ్ళపూడిలోని వదాన్యత కోణం ఈ వ్యాసం ద్వారా చదివాక, ఆయన పట్ల నాకు గౌరవం పెరిగింది. ఈ సంఘటనను గుర్తు చేసుకుని, అందరితో పంచుకున్నందుకు ఏల్చూరి మురళీధరరావు గారికి కృతజ్ఞతలు! టపా గా అందించిన మీకు అభినందనలు!

Sujata said...

ఎంత సహృదయత ? మీకు గుర్తుందో లేదో బాలూ గారి 'పాడుతా తీయగా' కు బాపు రమణలు జడ్జీలు గా వచ్చినప్పుడు ఒక ముస్లిమమ్మాయి (పేరు గుర్తు లేదు) 'నిదురించే తోటలో' పాట పాడింది. అప్పుడు ముళ్ళపూడి బాపుల అభినందన! బాలూ కి మాటలొకటి నేర్పాలా ? పొగడ్త అంతా బాలూది, వీళ్ళిద్దరూ చిర్నవ్వుతో, వినయంతో చేసిన ఆంగికం చెప్పేస్తుంది వాళ్ళెంతటి మాహానుభావులో ! ''కోతి కొమ్మచ్చి'' లో కూడా ఆర్ధిక బాధల గురించి ఎన్నో ప్రస్తావనలు. ఆకలి గురించి చెళ్ళు న తగిలే జోకులు. ఎవరు ఈయన ? సూర్యకాంతం మానస పుతృడౌ ?!

తెలుగు అభిమాని said...

వినా దైన్యేన జీవనం అని శంకరాచార్యులు చెప్పినారు. గొప్ప పండితులు దైన్యస్థితిలో ఉండటం సమాజానికి చేటు. ఆ రోజుల్లో అటువంటి పరిస్థితి ఉండేది అనుకుంటాను. ముళ్ళపూడి రమణ గారిది గొప్ప హృదయం.

ఆ.సౌమ్య said...

ఎంత మంచి మనసండీ ఆయనది. వాళ్ళు ఎంత ఎత్తుకెదిగినా అంతే ఒదిగి ఉంటారు...అది గొప్పవాళ్ల లక్షణం కాబోలు. కష్టాల, కన్నీళ్ళ విలువ తెలిసిన నిజమైన మనిషి ఆయన...ఉన్నా, లేకున్నా సాయం చేసే చెయ్యి ఆయనది...మహానుభావుడు..ఏ స్వర్గాన ఉన్నారో...వేల వేల నమస్కారములు.

సుజాత said...

వేణు గారూ,

థాంక్యూ!

సుజాత గారూ,

ఆ అమ్మాయి పేరు సబీరా అనుకుంటాను. నాకు గుర్తుంది ఆ దృశ్యం!కోతి కొమ్మచ్చి ఆయన రాయడం ఒక చారిత్రాత్మక ఘట్టం. అదే లేకపోతే ఎన్నో విషయాలు మనకు తెలీకుండానే మరుగున పడి పోయి ఉండేవి. అందుకు కారకులెవరైనా సరే వారికి కోటి వందనాలు!


తెలుగు అభిమాని గారూ,

నిజమేనండీ! వీరాంజనేయ శర్మ గారి దైన్య స్థితి చదివి గుండె పట్టేసింది! డబ్బు ఎంత మంచిదో అంత చెడ్డది కూడాను! నలభై ఏళ్ళ క్రితం వెయ్యి రూపాయలు ఇచ్చారంటే రమణ గారు డబ్బుకు పూచిక పుల్ల కూడా విలువ ఇవ్వలేదన్నమాట. పైన వ్యాసంలో ప్రస్తావించిన శర్మ గారి తోడి శతావధాని పళ్ళె పూర్ణ ప్రజ్ఞాచార్యుల వారిది మా వూరే! వారి కుమారుడు శ్రీ పళ్ళె శ్రీనివాసాచార్యులు గారు మా తెలుగు లెక్చరర్ గా ఉండేవారు.

సౌమ్య,
కదా! ఈ వ్యాసం చదివి నాకూ మరోసారి దుఃఖం వచ్చినంత పనైంది. ఎంత గొప్ప హృదయమో అని!

susee said...

sri yelchuri muralidhara rao gaari vyasaanni- mee blog lo post chesi - tadwaaraa-marendariko-mana mullapudi venkata ramana gaari velugu vennela challadanaanni -panchipetaaru-sujata gaaru-- nijaaniki meeru nirvahinchinadi oka punya kaaryamu.Abhinandanalu.-voleti venkata subbarao ,slough/UK

Muralidhara Rao Elchuri said...

Dear Sujatha garu,

It was astounding and I remained speechless from amazement for the alacrity and thoughtfulness with which you had subsumed the Article in to your beautiful Blog and the kind responses of your followers to it. True, the Blog is fast penetrating in to a vast majority of connoisseurs and lively in deed.

God or someone above should bless you with health, happiness, conviction and more devotion to the cause of literature and society.

With greetings,

Sincerely,
Elchuri Muralidhara Rao

ramana said...

murali,
your article moved many due to personal touch.....
mullapudi brought lively characters like BUDUGU,RENDUJADALA SEETHA,SEEGANA PESUNAMBA, APPULAAPPARAO,MUTHYALA MUGGU CONTRACTORS....
His KOTHIKOMMACHI is superb for the persons who knew madras city and also telugu modern literature,andhrapatrika of yester years,films like sakhi, andalaramudu,muthyala muggu,sampurna ramayanam etc

జ్యోతిర్మయి said...

ఒక రచయిత, లేదా కవి మనకు ఇష్టుడైనపుడు, ఆయన రాతలు మనకి ఎంతగానో నచ్చినపుడు వారు వ్యక్తిగతంగా ఎలా ఉంటారో కూడా తెలుసుకోవాలనే కుతూహలం కల్గుతుంది..... ఎటూ కాని అయోమయంలో పడ్డా!

రచన యొక్క గౌరవం రచయిత నడవడికమీద ఆధారపడి వుంటుంది. బాగా చెప్పారు.

రమణ గారి 'కోతికొమ్మచ్చి'వారు మనకిచ్చిన అమూల్యమైన కానుక.

రామ said...

పండితుడు, శతావధాని, వేద పారంగతుడు అయిన ఒక గొప్ప వ్యక్తి కుమార్తె పెళ్లి కోసం జోలె పట్టాల్సిన దుస్థితి గుండెల్ని తొలిచేసింది. అయితేనేం? ముళ్ళపూడి గారి విశాల హృదయాన్ని చాటడానికి ఈ ఉదంతం పనికి వచ్చిందేమో!. ఈ రోజుల్లో ఐతే అసలు ప్రయత్నించడమే వృధానేమో!. మనకి ఒకటి రాదు - వచ్చిన వాళ్లకి గౌరవం ఇవ్వడం అసలు రాదు - పరిస్థితి తలుచుకుంటే భయం వేస్తుంది.

Post a Comment