March 18, 2011

టాంక్ బండ్ మీది వైతాళికుల విగ్రహాల ఫొటోలు....మొత్తం ......ఇవిగో!


టాంక్ బండ్ మీది తెలుగు వెలుగుల విగ్రహాల్లో ఎవరెవరివి ఉన్నాయో చాలామందికి స్పష్టతలేదు. మీడియాకీ, రచయితలకూ కూడా సరైన అవగాహన ఉన్నట్లు కనిపించడం లేదు.  అవి కూలి ధ్వంసమయ్యే వరకూ సమాచారం సరిగా లభ్యం కాకపోవడం విచారకరం!

అక్కడ ఉన్న 33 విగ్రహాల ఫొటోలూ, ఆయా వైతాళికుల గొప్పతనాన్ని వివరిస్తూ డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారు కవితాత్మకంగా రాసిన వ్యాఖ్యానాలూ నేను సేకరించాను.

అవి ఇక్కడ నా బ్లాగులో ఉంచుతున్నాను. ఇష్టమైన వారు ఈ చిత్రాలను భద్రపరచుకోవచ్చును.

వీటిలో మొదటి పదిహేడు ఫొటోలూ ధ్వంసమైపోయిన విగ్రహాల తాలూకువి! తర్వాతవి పదిలంగా ఉన్న విగ్రహాలవి!

ట్యాంక్ బండ్ మీద  ‘తెలుగు వెలుగుల మూర్తుల నిక్షిప్త కళా ప్రాంగణం’ సమర్పణ ఫలకంపై ఇలా ఉంది:

వందనం 
తెలుగు హృదయంగమ శుభాభినందనం


ఇది జాతి చైతన్యస్ఫూర్తికి కళాప్రాంగణం పట్టిన నీరాజనం
తెలుగుజాతి బహుముఖ వికాసానికి దివిటీలెత్తిన మహనీయుల సంస్మరణం 

 .                                                                     అన్నమాచార్య
                                                    ఆంధ్ర భాషా పదకవితా పితామహుడు
                                                        శ్రీ వేంకటేశ్వర సంకీర్తన ప్రవణుడు 
                                                                                                                        
ఆర్థర్ కాటన్ 
         
  గోదావరి జలాలను పొలాలకు తరలించిన భగీరథుడు
నిస్వార్థ ప్రజా సంక్షేమ నిరతుడు   


 బళ్లారి రాఘవ
ఆంధ్ర నాటక రంగ ప్రభాకరుడు
సముదాత్త నటనా ప్రదీపకుడు       


బ్రహ్మనాయుడు
పలనాటి సీమ పండించుకున్న ధర్మవేది
చాపకూటితో సమతను నేర్పిన సౌమ్యవాది

 సీఆర్ రెడ్డి
ఆధునిక సాహితీ విమర్శకు ఆద్యుడు
విద్యా పరిపాలనా రంగాలలో అనవద్యుడు

 గురజాడ అప్పారావు
ఆధునికాంధ్ర కవితా వైతాళికుడు
సువిశాల మానవతావాద ప్రతిపాదకుడు

జాషువా
నవయుగ కవి చక్రవర్తి
దళిత వర్గ జ్వలన్మూర్తి

కందుకూరి వీరేశలింగం
సంఘ సంస్కరణ రణ పండితుడు
బహుముఖ సాహితీ ప్రక్రియా మండితుడు

క్షేత్రయ్య
మువ్వగోపాల పద మోహనగాయకుడు
మధుర భక్తి భావ రాగ రంజకుడు

ముట్నూరి కృష్టారావు
సంపాదకీయ రచనా ప్రబోధ శీలి
ఆంధ్ర సముజ్జీవన చైతన్య శాలి

.నన్నయభట్టు
ప్రథమాంధ్ర మహా కావ్య నిర్మాణ చణుడు
వాగనుశాసన సార్థక బిరుద విభూషణుడు

 రఘుపతి వెంకటరత్నం నాయుడు
తెలుగు సీమలో బ్రహ్మసమాజ కులపతి
బ్రహ్మర్షి బిరుద సార్థక విద్యాపతి

. సిద్ధేంద్ర యోగి
కూచిపూడి నృత్యరీతికి ఆద్యుడు
తెలుగు నాట్యజగతికి ఆరాధ్యుడు

 శ్రీకృష్ణ దేవరాయలు
సాహితీ సమరాంగణ చక్రవర్తి
కర్ణాటకాంధ్ర సమన్వయ నిత్య విస్ఫూర్తి

శ్రీశ్రీ
అభ్యుదయ కవితా యుగ ప్రయోక్త
సమసమాజ సంస్థాపన ప్రవక్త

 త్రిపురనేని రామస్వామి చౌదరి
అపార హేతువాద కృపాణ ధరుడు
వినూతన సాహితీసృష్టి కరుడు

ఎఱ్ఱాప్రగడ
అశేష ఆగమ శాస్త్ర్ర తత్వ నిపుణుడు
ఆంధ్ర మహాభారత పూరణ దక్షుడు
అల్లూరి సీతారామరాజు
మన్యసీమ గాండ్రించిన మగటిమి గల మొనగాడు
తెల్లదొరల అదలించిన తెలుగు తల్లి బిడ్డడు

మహబూబ్ అలీఖాన్
ఆసఫ్ జాహీ వంశ పాలకుడు
ఆర్త జన నిత్య పోషకుడు

మొల్ల
కవితలల్లిన తొలి తెలుగు విదుషీమణి
రామాయణ కావ్య రచనా రసధుని

మఖ్దూమ్ మొహియుద్ధీన్
ఆధునిక ఉర్దూ మహాకవి
అభ్యుదయ భావ సముజ్వల రవి

పింగళి వెంకయ్య
త్రివర్ణ పతాక రూపకర్త
జాతీయ స్వాతంత్ర్య సమరవేత్త

పోతన
ఆంధ్ర మహాభాగవత భవ్య ఫలప్రదాత
మందార మకరంద మాధురీ సముపేత శబ్ద విధాత

 పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి
ఆగామి కాలజ్ఞాన కర్త
పురోగామి సమాజ సంస్కర్త

 రామదాసు
భద్రాచల రామన్నకు గుడికట్టిన గోపన్న
రామదాసై తెలుగు హృదికెక్కిన భక్తులమిన్న 

 రుద్రమదేవి
కాకతీయ మహా సామ్రాజ్య భార ధారణి
శాత్రవ భయంకర నిత్య  రుద్రరూపిణి 

 శాలివాహనుడు
ప్రథమాంధ్ర మహా పాలకుడు
నవీన శక సృష్టి కారకుడు

 సర్వేపల్లి రాధాకృష్ణన్
మూర్తీభూత సమగ్ర భారతీయ సంస్కృతి
వేదాంత విజ్ఞాన సందీప్త సుకృతి

సురవరం ప్రతాపరెడ్డి
ఆంధ్రుల సాంఘిక చరిత్రకు విధాత
అమూల్య గ్రంథ సూక్ష్మ వ్యాఖ్యాత

 తానీషా
గోలకొండనేలిన కుతుబ్ షాహీ పాదుషా
రామదాసు భక్తికి చలించిన మనీష

 తిక్కన సోమయాజి
ఉభయ కావ్య ప్రౌఢ శిల్ప పారగుడు
తెలుగు నుడికి పట్టం కట్టిన ధీ విలసితుడు

త్యాగయ్య
అగ్రేసర దాక్షిణాత్య వాగ్గేయ కారుడు
అక్షర నాదోపాసనైక జీవనుడు

 వేమన
ఆటవెలదిని ఈటెగా విసిరిన దిట్ట
ఛాందస భావాలకు తొలి అడ్డుకట్ట

టపా కి సహకరించిన మిత్రులు వేణు, సుధలకు ధన్యవాదాలు !


27 comments:

Manasa Chamarthi said...

Wonderful!
Thanks a lot to you, Sudha and Venu

తృష్ణ said...

Great great..!!

Sudha said...

చాలాబావుంది..మీ బొమ్మల కొలువు:))
తెలుగువెలుగులదీప్తిని పునరుద్దీపింపచేసినందుకు
మీకు....వందనాలు...వంద వందనాలు.

మధురవాణి said...

Superb! Thanks a lot for sharing with us..
Sujatha gaaroo! :)

లత said...

చాలా బావున్నాయండి.అన్నీ మరోసారి చూపించారు

kiran kumar said...

ఇవాళ మినీ టాంక్ బండ్ లా ఉంది మీ బ్లాగు!

ఆ.సౌమ్య said...

అందుకోండి వీరతాళ్ళు...ఒక్కో బొమ్మకి పది వీరతాళ్ళు.
అక్కడ కింద రాసినవి సినారె అని నిన్న వేణు చెబితే విని చాలా ఆశ్చర్యపోయాను. ఎన్నిసార్లో చూసానుగానీ నాకీ విషయం తెలీనే తెలీదు.
వాటన్నిటినీ ఇలా మా కళ్ళముందు ఉంచారు మళ్ళీ....మీకు నిజంగా బోలెడు ధన్యవాదములు.

ఆ.సౌమ్య said...

నాకో డౌటు
ఇదే వరుసలో ఉన్నయా అక్కడ అన్నీను?

శ్రీనివాస బాబు said...

నిజంగా భద్రపరచుకోవల్సినవి..

సుజాత said...

సౌమ్యా,
ఇదే వరసలో లేవు విగ్రహాలు! నేను టపాలో రాసినట్లు మొదటి పదిహేడూ ధ్వంసమైన విగ్రహాలు! మిగతావి పదిలంగా ఉన్నవి. alphabetical order లో ఉంచాను వీటిని కూడా

ఆ.సౌమ్య said...

అబ్బ ఒక్కోటీ చూస్తూ, చదువుతూ ఉంటే టాంక్ బండ్ మీద నిలుచున్న భావం కలుగుతున్నాది...మనసు ఉప్పొంగిపోతున్నాది. మీకు ఎన్నిసార్లు thanks చెప్పుకున్నా తక్కువే!

రవిగారు said...

సుజాత , సుధా , వేణు ఆంధ్రోల్లు

విగ్ర్రహాలు లేపుకు పోయి బ్లాగ్లో పెట్టుకునుడే గాక

ఉల్టా మా మీద ఎస్తున్రు .

oremuna said...

More photos here @ http://www.flickr.com/photos/chavakiran/sets/1833440/

సుజాత said...

వేమనకు రాసిన రైటప్ చూడండి.....అద్భుతంగా ఉందసలు!

sami said...

దేశమంటే ’మట్టి’కాదోయ్!!
దేశమంటే ’మనుషు’లోయ్!!!!

ఆ.సౌమ్య said...

జాషువాది, రఘుపతి వారిది, వేమనది...ఎంత బావున్నాయో!

బొల్లోజు బాబా said...

ఎప్పుడు హైదరాబాద్ వెళ్లినా వీలు చేసుకొని మరీ వెళ్లి ఈ విగ్రహ వ్యాఖ్యానాలను చదువుకొంటూ కొంతసేపు గడిపేవాడిని.

త్వరలోనే వాటిని పునర్నిర్మిస్తారని ఆశిస్తున్నాను.

విగ్రహాల కూల్చివేత తరువాత సినారె గారు కంటనీరు చిందించారని శంకర్ ఎస్. గారు చెప్పారు.

http://skybaaba.blogspot.com/2011/03/37.html

భవదీయుడు
బొల్లోజు బాబా

కోడీహళ్ళి మురళీ మోహన్ said...

బాగుంది.

వేణూ శ్రీకాంత్ said...

సుజాత గారు థ్యాంక్స్ చెప్పడం తప్ప ఏమిచ్చుకోగలం. వేణు సుధగార్లకు కూడా నెనర్లు. అన్నిటినీ పదిలంగా భద్రపరచుకున్నాను...

Vasu said...

ట్యాంక్ బ్యాండ్ కెళ్ళి చూసొచ్చి నట్టు ఉంది. చాలా చాలా థాంక్స్.

మీరన్నట్టు కొన్ని అంట శ్రద్దగా గమనించలేదు ఎప్పుడూ.

బొల్లోజు బాబా గారిచ్చిన లంకె చూసాను.
అక్కడ (ఆంధ్ర జ్యోతి - వివిధ ట ) విగ్రహాల గురించి బాధ పడ్డ వాళ్ళకంటే, అది కరెక్టే అనే వాళ్ళు ఎక్కువున్నారు.

వాసు

Ramana Murthy Venkata said...

చాలా సంతోషమండీ.....సుజాత గారూ !

మీలాంటి వాళ్ళ వల్ల ....విగ్రహాలు ధ్వంసమైనా ...ఇలా ఆ రూపాలు మా కళ్ళ ముందు కదలాడుతున్నాయి !

కనకాంబరం said...

Great work. నిబద్ధతతో మీరు చేపట్టి పూర్తిచేసిన యీపని.... విగ్రహ చిత్రాల నిక్షిప్త ఆలయం అద్భుతం .అభినందనలు.శ్రేయోభిలాషి ....నూతక్కి రాఘవేంద్ర రావు.

కనకాంబరం said...

నిబద్ధతతో మీరు చేపట్టి పూర్తిచేసిన యీపని విగ్రహ చిత్రాల నిక్షిప్త ఆలయం అద్భుతం .అభినందనలు.శ్రేయోభిలాషి ....నూతక్కి రాఘవేంద్ర రావు.

loknath kovuru said...

సుజాత గారు నమస్తే .... మేడం మీరు దిమ్మిస వినిర్మణ కవిత్వ సంకలనం చూసారా? చాల చాల భాదేసిందండి... వీలుంటే ఒకసారి చదివి మీ స్పందనను తెలియచేస్తే....

సుజాత said...

లోక్ నాథ్ గారూ, అవునా! కొత్తదా? ఇంకా చూడలేదు.వీలైనంత త్వరలో చూసి నా స్పందన తెలియజేస్తాను ధన్యవాదాలు

antharvedi said...

I was very sad after viewing the video of "telugoodu" OF GAJHAL SRINIVAS, depicting the destruction of statues on the tank bund.But your blog gave me a sense of elation& hope that we can see our 'vytalikulu' in future too.

mrs.antharvedi.
principal(retd.)

antharvedi said...

after viewing the video of sri srinivas (ghazal) 'Telugoodu'I felt very sad that WE will not be able to see our 'vytalikulu' again.
but your blog gave me a sense of elation, that in future too we can view the stalwarts of our history

Post a Comment