January 26, 2012

హైద్రాబాదు లో పూరీ జగన్నాధ్!

(బిజినెస్ మాన్ సినిమా గురించి అనుకుని వస్తే సారీ...)

నేను ఆఫీసుకు రోజూ ఇదే రూట్లో వెళ్తూ చూసుంటా ఈ గుడిని! విశాలంగా, శుభ్రంగా, ఎక్కువ జన సమ్మర్థం లేకుండా (ఇది ముఖ్యం) ప్రశాంతంగా హాయిగా కనిపించే ఈ ఆలయాన్ని ఒకరోజు చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటుంటే నిన్న సెలవు రోజు కుదిరింది.

సెలవు రోజైనా తోసుకు చచ్చేంత రష్ లేదు. సావకాశంగా గుడి అంతా తిరిగి ఫొటోలు తీసుకున్నాను. ఫొటో గ్రఫీ నిషిద్ధం అని బోర్డు ఉంది కదాని తటపటాయిస్తోంటే పూజారే స్వయంగా తీసుకోమని అనుమతి ఇచ్చాడు. గర్భాలయంలో తప్ప ఏవైనా తీసుకోమన్నాడు.


గుడి ప్రాంగణమంతా చాలా శుభ్రంగా ఉంది. గోడల మీద మంచి శిల్పాలున్నాయి. రాతి శిల్పాలు కావు,. సిమెంట్ తో మలిచినవే అయినా అందంగా ఉన్నాయి. దశావతారాలు,రామాయణ ఘట్టాలు,ఇంకా కృష్ణ లీలలు వగైరాలు గోడల మీద మలిచారు. వాటిలోంచి కొన్ని నచ్చిన ఫొటోలు ___________
గోపురం మీద వాలిన పావురాలు ఒక్కసారిగా ఎగిరినపుడు  ____________
గీత 
 మరో కోణం 
                                                                             
 నీ వలపే బృందావనం
                                   
  నీ పిలుపే మురళీ రవం 
సింహా 


                                                    
                                                           సీతాపహరణం వరాహం 
                                                                                                                                          కల్కి 

బయటి నుంచి 

        ఇంకా..బయటి నుంచి (ఆ వెనకాల కనపడే తెల్ల       గోపురం, యాంటెన్నాలూ గుడివి కావు. తెరాస ఆఫీసువి) 

అన్నట్టు ఈ గుడి బజారా హిల్స్ రోడ్ నెంబర్ 10, 12 కలిసే చోట ఎమ్మెల్యేస్ కాలనీ లో ( (TRS ఆఫీసు  పక్కనే)  ఉంది.  

14 comments:

రాజ్ కుమార్ said...

నేను బిజినెస్ మేన్ అనుకునే వచ్చానండీ ;)
ఫోటోస్ బాగున్నాయ్.. నాకు ఆ పక్షులు ఎగిరే పిక్ బాగా నచ్చిమ్దండీ.. ఇంకా దశావతారాలు కూడా...

వేణూ శ్రీకాంత్ said...

ఫోటోలు బాగున్నాయండీ..
ఆ శిల్పాకృతులు సిమెంట్ తో అంత స్మూత్ ఫినిష్ తో రావని విన్నాను.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాడతారనుకుంటాను వాటికోసం.

రిషి said...

బోల్తా కొట్టించేసారుగా టైటిల్ తో..

బాగున్నయండీ ఫొటోలన్నీ. ఒక మంచి ప్లేస్ ని పరిచయం చేసారు.

వేణు said...

శిల్పాల ఫొటోలన్నీ బాగున్నాయి. గుడి శిఖరమ్మీద పావురాలు ఎగిరే ఫొటో చూడముచ్చటగా ఉంది! ‘నరసింహావతారం’ భయానకంగా ఉంది. సింహాచలంలో ఇలా కనిపించ, నిరాశపడ్డాను!

ఈ గుడి ఆధునికంగా ఉంది. వీటికంటే నాకు ప్రాచీన దేవాలయాలు చూడటమే ఎక్కువ ఇష్టం. అమరావతి, మంగళగిరి, సింహాచలం లాంటి క్షేత్రాలకు గానీ, బెజవాడ గుహాలయాలకు గానీ వెళ్ళినపుడు శతాబ్దాల నాటి శిల్పాలను చూడటం గొప్ప అనుభూతినిస్తుంది. ముఖ్యంగా అక్కడి పురాతన శాసనాలను చూడటం (వీలైతే చదవటం) మిస్సవను.

కాయ said...

నిజం గా వరాహం భూమిని అలా పైకి లెబట్టి ఉంటుందా ?.. ఎలా నమ్మాలి..
సిమ్హం మాస్క్ వేస్కొవచ్చేమో.. కానీ.. నిజంగా సింహం తల ఉంటే మెదడు మనిషిది ఉంటుందా.. ? ఒకన్ని చంపి ఒకడిని రక్షించడానికి.. ఇలాంటివి పురాణాలు వాటిని నమ్మాలా ?

రసజ్ఞ said...

చాలా బాగున్నాయి! గుడిని చూస్తుంటే లోపలకి వెళ్లి ఒక రోజంతా అక్కడే ఉండాలనిపిస్తోంది!

Country Fellow said...

ఫొటోలు చాలా బాగున్నాయి. దశావతారాలు. ఎంత ఓపికో మీకు :)

Sridevi said...

'Puri Jagannadhudu' ani raasunte confusion thakkuva undedi, Gudi gurinchi telukovaalani unna ekkuva mandi idi chadivevallu anipisthundi.

Zilebi said...

సుజాత గారు,

జగన్నాధ దేవాలయం ఫోటో లు బాగున్నాయండీ.
మరో బిర్లా మందిరం లా వుంది. ఆదరాబాదరా హైదరాబాదులో ఈ పాటి ప్రశాంత స్థలం ఉందంటే ఒక్కింత గొప్ప విషయమే !

జిలేబి.

జాన్‌హైడ్ కనుమూరి said...

సుజాత గారూ,
హైదరాబాదులో ఇంకేమున్నాయి చూడటానికి నాకు అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది, అదే మాట నా మిత్రులతో అంటూవుంటాను. నా మాట అబద్దమని మరో కొత్త తలపుల తలుపులు తెరిచారు.
అభినందనలు

మధురవాణి said...

గుడి, ఫోటోలూ రెండూ బాగున్నాయి.. పక్షులు ఎగిరే ఫోటో బాగుంది. సిమెంటుతో అంతందంగా చేసారా బొమ్మలు.. భలే బాగున్నాయి. రాధాకృష్ణుల బొమ్మ చాలా బాగుంది జీవం ఉట్టిపడుతూ... Thanks for sharing! :)

Sravya Vattikuti said...

భలే ఉందండి గుడి , ఈసారి చూడాలి .
పైన వేణువు వేణు గారు చెప్పినట్లు నాక్కూడా పాత గుడులు మహా ఇష్టం !

प्रवीण् शर्मा said...

అందరూ సినిమా క్రేజ్ అనుకుంటే ఎలా? టైటిల్ చూసి నేను సినిమా డైరెక్టర్ గురించని అనుకోలేదు. జగన్నాథస్వామి ఆలయాలు కడప జిల్లాలో కూడా ఉన్నాయి కదా, హైదరాబాద్‌లో ఉండడం విచిత్రమా అని అనుకున్నాను. బొమ్మలు చూస్తే అది శిల్ప కళ అని తెలిసింది.

Ravi said...

businessman cinema review ani vaste...daiva darsanam cheyincharu sujatha garu. thanks

Post a Comment