October 4, 2012

ఒక మంచి పాట...మౌనమే ప్రియా

ప్రేయసీ ప్రియులు కల్సి పాడుకునే డ్యూయెట్స్ సినిమాల్లో మామూలే!

ప్రియుడి మీద ప్రేమను వ్యక్తీకరిస్తూ ప్రేయసి పాడుకునే పాటలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాంటి పాటలు తెలుగు సినిమాల్లో అడపా  దడపానే నే ఉన్నా..కొన్ని మాత్రమే మనసుకు బాగా నచ్చి అలా గుర్తుండి పోతాయి.

ఏ ఏకాంత సమయంలోనో మనకు తెలీకుండానే హమ్ చేస్తూ ఉండేలా వెంటాడతాయి.
జంధ్యాల సినిమా "చిన్ని కృష్ణుడు" సినిమాలో జానకి పాడిన "మౌనమే ప్రియా" పాట ఆ కోవలోదే!

ఈ సినిమాలో ఆశా భోంస్లే పాడిన పాట "జీవితం సప్త సాగర గీతం" అంటూ సాగే అమెరికా ఆవిష్కృత గీతం జనాదరణ పొందినా.... దాని కంటే ఈ పాట నాకు చాలా చాలా నచ్చుతుంది.
అతి సున్నితంగా, సుకుమారమైన భావాలతో తన భావాల్ని వెల్లడించే నాయికను హీరో కూడా  ఆరాధిస్తూ ఆ భావ సౌందర్యాన్ని పంచుకోడం అద్భుతంగా ఉంటుంది ఈ పాటలో!

రమేష్ ఎంత అందంగా ఉన్నాడో ఈ పాటలో! ఖుష్బూ మాత్రం....ఎంత సొగసు....!!

ఇద్దరూ ఆ రోజుల్లో ఎంతో సన్నగా..మెరుపు తీగల్లా ఉన్నారు :-)

ఈ సినిమాకి సంగీత దర్శకత్వం ఆర్.డి బర్మన్!! ఈ ట్యూన్ ని బర్మన్ ఇంతకు ముందే ఒక బెంగాలీ పాటకు వాడి ఆషా చేత పాడించారు.
బహుళ ప్రజాదరణ పొందిన ఆ పాటను మళ్ళీ శ్రేయా ఘోసల్ కూడా పాడింది.

కానీ తెలుగు పాట  సాహిత్యం వల్లా, జంధ్యాల చిత్రీకరణ వల్లా...జానకి స్వర సౌందర్యం వల్లా...తెలుగు పాటకే మొగ్గు చూపాను నేను.

నిజానికి ఆశ, శ్రేయ కూడా అద్భుతంగా పాడారు.

ఆశా , శ్రేయా ఇద్దరూ బాగా పాడారు.ఈ పాట వీడియో కావాలని అడగగానే, సినిమా సంపాదించి, ఆ పాటను యు ట్యూబ్ లో అప్ లోడ్ చేసి పంపిన మిత్రులు వేణు సి.హెచ్ గారికి ధన్యవాదాలు

 

9 comments:

వేణు said...

వేటూరి సాహిత్యం, బర్మన్ సంగీతం ఈ పాటను చిరస్మరణీయం చేశాయి.

ఆశా పాట ఒరిజినల్ అయినా, దాని ప్రత్యేకత దానిదే అయినా; జానకి ఈ పాటను బాగా ఇంప్రవైజ్ చేసినందుకేమో జానకి గానానికే నా ఓటు!

పల్లవిలో ‘నీలికన్నులా నిలిచీ పిలిచే’ అన్నచోట మాధుర్యం పోతపోసిన భావన కలుగుతుంది. తొలి చరణంలో - ‘వెన్నెలలో కాగే తారా మందారాలు’లో ‘తారా’ అన్న అందమైన దీర్ఘం రమేశ్ నాయుడి స్వరరీతిని గుర్తు చేస్తుంది.

ఖుష్బూ ఎక్స్ ప్రెషన్స్ చాలా బాగున్నాయీ పాటలో!

మరో విషయం- మీరు చెప్పేదాకా ఈ పాట నాకు తెలీదు. ఆరకంగా ఇంత మంచి పాట గురించి పరిచయం చేసినందుకు మీకే థాంక్స్ చెప్పుకోవాలి.:)

తృష్ణ said...

ఈ రెండిటి గురించీ సంగీతప్రియలో ఒకసారి రాసాను...
http://samgeetapriyaa.blogspot.in/2011/11/1988.html
నాక్కూడా "మౌనమే ప్రియా" పాట ఎక్కువ ఇష్టం. ఏ ఒక్క లైన్ వీడిగా కోట్ చెయ్యటానికి లేకుండా పాట మొత్తం అద్భుతంగా రాసారు వేటూరి.
ఈ బెంగాలీ పాట గురించి తెలీదు కానీ రమేష్ నాయుడు చేసిన "నీలాలు కారేనా" అసలు ఒరియా పాట ఉంది నా దగ్గర. ఆశా పాడినది.

Manasa Chatrathi said...

అసలు జంధ్యాల-వేటూరి పాటలన్నీ అద్భుతాలే....అవన్నీ నిద్రలో లేపి అడిగినా పాడగలననుకుంటున్నా ఇన్నాళ్ళూ - :( కొన్ని మిస్ అయ్యానన్నమాట. థాంక్యూ, పరిచయం చేసినందుకు. సాహిత్యం గురించి మీ శైలిలో ఇంకొన్ని మాటలు పంచుకోవాల్సిందండీ.. (యమహానగరి కి రాసినట్టు) . మీరు ప్రస్తావించిన "జీవితం సప్తసాగర గీతం" పాట కూడా నాకెందుకో భలే ఇష్టం- ఆశా గొంతులో అయినా సరే :)
(ఇంతకి పప్పు సర్ ఇది చూశారో లేదో - నే చెప్తాలెండి.)

Tejaswi said...

మొత్తానికి connoisseurలు ఇద్దరి(సుజాతగారూ, తృష్ణగారు) టేస్టులూ కలవడం మాకు సంతోషంగా ఉంది.

రాజ్ కుమార్ said...

ప్రస్తుతానికి మేటరే చదివానండీ.. ఇంటికెళ్ళీ పాటలు వినీ మళ్ళీ స్పందిస్తాను ;)

సుభ/subha said...

ఎక్కడో విన్నట్టు గుర్తొస్తోంది.. ఐనా పాట చాలా బాగుందండి.

చక్రవర్తి said...

ఖుష్బూ గారు ఇంతబాగా నాట్యం చేస్తారని నాకు తెలియదు. ఏది ఏమైనా, బాగానే చేసారు.

Ravi said...

Sujatha garu,

Thanks for sharing this soothing melody.The trivia about this song is also quite interesting.
But my pick from this movie is Jeevitham saptha saagara geetham.
తెలుగు అభిమాని said...

పాట, టపా హాయిగా ఉన్నాయి సుజాత గారు!. పాట అన్నివిధాలుగా classy గా ఉంది. మూడింటిలో తెలుగు పాట ఇంకా బాగుంది. ఖుష్బూ is a class act.'మెరుపు తీగలు ' కాస్తా కాలాంతరంలో పరుపు చుట్టల్లా మారిపోయారు. జీవితం సప్త సాగర గీతం పాట లో సాహిత్యం అత్యుత్తమంగా ఉంటుంది. ఈ పాట వేణు గారు అన్నట్టు రమేశ్ నాయుడు గారి పాటను తలపించింది.

Post a Comment