December 20, 2012

వోడ్కా విత్ వర్మ ........!!!!

సంచలనాత్మకమైన టైటిల్ తో,  గొప్ప ప్రచారం తో  అట్టహాసంగా మార్కెట్లో కి వచ్చిన కొత్త పుస్తకం !!

వర్మ మాట్లాడినా, సినిమా తీసినా, ప్రెస్ మీట్ పెట్టినా, ఒక ఛానెల్ స్టూడియో కూచుని వాళ్ళనే ఉతికి ఆరేసినా...సంచలనమే! ఇది ఎప్పుడో రుజువై పోయిన విషయమే! (Note: వర్మకీ నేనూ అభిమానినే)

ఆల్రెడీ రుజువైపోయిన విషయాల్ని ఏ కొత్త దనమూ లేకుండా మరో చప్పగా చెప్తే......ఎలా ఉంటుంది. సిరాశ్రీ  ఓడ్కా విత్ వర్మ లాగా ఉంటుంది.

 వర్మ ఏం చేసినా సంచనలం కోసమే అన్నట్టు ఉంటుంది. ఆయన తన మానాన తాను ఉన్నా అదొక సంచలనమై కూచుంటుంది.

పబ్లిషర్స్ ఇలా అంటారు ముందు మాటలో  "ఇది పూర్తిగా చదివిన తర్వాతైనా వర్మ కొంచెమైనా అర్థమైతే మా ప్రయత్నం సఫలమైనట్లే"!

అసలు వర్మ ఎందుకు అర్థం కావాలి? వర్మను ఎవరు అర్థం చేసుకోవాలి? ఆయన కుటుంబం, సన్నిహితులు, ఆయనతో కల్సి పని చేసే వాళ్ళకి ఆయన అర్థమైతే చాలుగా! ప్రపంచానికి అంతటికీ వర్మ ఎందుకు అర్థం కావాలి?

వర్మ లాగా ఎవరినీ లెక్క చెయ్యకుండా తమ ఇష్టమైనట్లు తాము బతికే వాళ్లు మన చుట్టు పక్కలే ఉండొచ్చు. కానీ సెలబ్రిటీలు కాకపోవడం వల్ల వాళ్లను మనం గుర్తించం..మీరైనా నేనైనా....!

సరే..పూరీ జగన్నాథ్ ముందు మాట లో వాక్యాలు చూడండి..

"ఆయన మాటలు వింటుంటే మనకి ఇంత వయసొచ్చినా ఇన్ని విషయాలు ఎలా తెలీలేదు సుమీ అనిపిస్తుంది."

"ఈయనున్నాడనే ధైర్యంతో అయాన్ రాండ్ ని చదవడం మానేశాను"

"పుస్తకానికి వొడ్కా విత్ వర్మ అని పేరు పెట్టడం వల్ల ఆయన్ని మీరంతా తాగుబోతు అనుకుంటారేమో....! ఆయన తాగుబోతు కాదు. అనాధలా ముంబాయిలో తిరుగుతున్న వోడ్కా ని చేర దీశాడంతే"

"ఆయన సినిమాని కిందేసుకోని, మీదేసుకోని, పక్కలో ఏసుకోని పడుకుంటాడు" (ఈ వాక్యాన్ని కోట్ చేస్తున్నందుకు క్షమించాలి) 

ఇలాంటి  అతిశయోక్తులతో మొదలైన పుస్తకంలో కంటెంట్ ని ఊహించడం కష్టమేం కాదు.

వర్మ అదీ వర్మ ఇదీ..వర్మ అలాగ..వర్మ ఇలాగ!
వర్మ అంతటి వాడు, ఇంతటి వాడు......
(పొగడ్తలు కూడా నెగటివ్ షేడ్స్ లో ఉంటాయి..బహుశావర్మకి నచ్చేలా)


 ఈ పుస్తకం మొత్తం మీద కాస్త ఆసక్తి కరంగా అనిపించినవి జేడీ చక్రవర్తి ఎపిసోడ్, వర్మ మేనమామ గారు మురళి రాజు ఎపిసోడ్!

వర్మ సొంత పుస్తకం నా ఇష్టం  లా ఆసక్తి తో పేజీల వెంట కళ్ళు పరుగులు తీసేలా చేయలేకపోయింది. త్వర త్వరగా పేజీలు తిప్పేస్తూ...అనవసర విశ్లేషణలని స్కిప్ చేస్తూ పోవడమే! కాబట్టి త్వరగా పూర్తయిపోతుంది.

ఇంతకంటే  విశ్లేషించాల్సింది ఈ పుస్తకంలో నాకేమీ కనిపించలేదు. ఇంతకంటే ఎక్కువ మాట్లాడుకోవడం కూడా అనవసరం !!

ప్రతి పెగ్గు కీ (చాప్టర్ కి రచయిత పెగ్గు అని పేరెట్టారు) వర్మ సూక్తులు అలవాటైనవే అయినా ఎప్పుడు చదివినా ఫ్రెష్ గానే ఉంటాయి కాబట్టి బాగున్నాయి.

ఇంతా చేసి ఈ పుస్తకం చదివాక వర్మ మీద కురిసిన  పొగడ్తల  వర్షమే తప్ప,వర్మని ఈ పుస్తకం ద్వారా అర్థం చేసుకోవాలనుకునే  పాఠకులకు  ఆయన కొత్తగా  ఏమీ  అర్థం కాడు. ఇది తెలిసే కాబోలు పబ్లిషర్లు "కొంతయినా అర్థమైతే......." అని కండిషన్ పెట్టారు.

ఈ లెక్కన వర్మ గురించిన మరో బుక్ వచ్చే బుక్ ఫేర్ సమయానికి సిద్ధం అయ్యే అవకాశాన్ని తోసి పుచ్చలేం! (ఎలాగూ ఇప్పుడు కొంతయినా అర్థం కాడు కాబట్టి )


త్వర త్వరగా పేజీలు తిప్పేసి ...ముగించి....పుస్తకం మూశాక....తెలుగులో వస్తున్న అత్యుత్తమ సాహిత్యం లో కనీసం ఒక్క పుస్తకానికైనా దీనికి లభించిన ప్రచారంలో పదో వంతు ఐనా  లభిస్తే ఎంత బాగుండు అనిపించక మానదు. 

ఇంతకీ ఈ పుస్తకం మీద వర్మ అభిప్రాయం ఏమిటో చెప్తే బాగుండు :-)))

అసలు ఇది సిరాశ్రీ ఆత్మ కథేమో అన్న సందేహం చాలా చోట్ల వచ్చింది నాకు  :-P


అన్నట్లు కవర్ పేజీ మీద ఫొటో ఆకర్షణీయంగా ఉంది. (నా ఇష్టం కవర్ పేజీ మీద ఫొటో నాకు అసలు నచ్చలేదు )

ఎమెస్కో వేసిన ఈ పుస్తకం వెల 125 రూపాయలు. ప్రస్తుతం అన్ని చోట్లా లభ్యం!

24 comments:

రాజ్ కుమార్ said...

హ్మ్మ్... ;);)
మీరెలాగా ఆ పుస్తకాన్ని దాచుకోరని తెలుసు.. ఇలా పారేస్తే, కొంచెం వాసన చూసి(నాకు స్మెల్ చూస్తే కిక్కెక్కి డోకులొచ్చేస్తాయి లెండి) నేనూ ఇంకొకరికి దానం చేసి Rs 125 షేవ్ అవ్వకుండా సేవ్ చేసుకుంటాను.

ఇప్పటిదాకా నేనో అద్బుతమైన్ పుస్తకాన్ని మిస్సయిపోతున్నా అనుకున్నా. పర్లేదన్న మాట ;)
ధన్యవాదగళు

Indian Minerva said...

నిన్న చదివాను ఈ పుస్తకాన్ని. మీరు రాసిన దాంతో అక్షరశ: ఏకీభవిస్తాను.

ఇది వర్మకి సోప్‌వేయడం అని ప్రతిపేజీలోనూ అనిపించింది. దాదాపు ప్రతిచోటా ఓవరాక్షనే!

తృష్ణ said...

బుక్ ఫైర్ లో చూసా కానీ మరీ పొగడ్తలెక్కువగా అనిపించి కొనలా..

రిషి said...

హమ్మయ్య ఏమీ మిస్స్ అవ్వట్లేదన్నమాట చదవకపోతే..ఇండియా నుండి తెప్పించుకుందామనుకుంటున్నాను. అయినా ఏ మూలో ఉన్న అభిమానం పీకుతోంది చదవాలి అని. నెట్ లో పీడీఎఫ్ దొరికినప్పుడూ చదివెస్తా లెండి.

నిన్ననే మీ బ్లాగు లో ఙాపకాల టపాలు చదివాను..ఈరోజు మీరు ఈ టపాతో ప్రత్యక్షం :)

BVJ said...

ఒక భక్తుడు గదిలో మూల కూర్చుని, ముసుగేసుకుని, భజన చేసినట్లుంది ... it's a waste of time, energey and money as well.

sharma said...

నేను కూడ అందరిలాగే కొనాలనే ఊగిసలాడుతున్న. కాని మనసులొ ఏదొ వెనక్కి లాగుతొంది. ఇప్పుడు మీ పొస్ట్ తొ చాలా clarity వచ్చింది.
ధన్యవాదంs

లోగిలి said...

this book is available in
our site

for all Telugu books
www.logili.com

for vodka with varma go through this link

Thank you

http://www.logili.com/books/vodka-with-varma-sirasri/p-7488847-70501307839-cat.html

Sekhar said...

మీరింత చెప్పినా.....బుక్ ఒక్కసారన్న తిరగేయాలి అన్న ఫీలింగ్ లోనే వర్మ కిక్ ఉందేమో :)

Kathi Mahesh Kumar said...

మనం ఒక వ్యక్తిని అభిమానిస్తాం. అతని అఛీవ్మెంట్స్ కి అబ్బురపడతాం. తన సక్సెస్ కి ఫాలోయర్స్ అవుతాం. అతని వ్యక్తిత్వాన్ని చూసి ఆశ్చర్యపోతాం. మనం కలలుగన్నది అతను చేస్తూ వెళ్ళిపోతుంటే ఆ జర్నీని అర్థంచేసుకోవాలనుకుంటాం. అతను తెలిసినవాళ్లని, అతన్ని మనకు పరిచయం చెయ్యగలిగినవాళ్లని, వీలైతే అతన్నే కలిసి తన అనుభవాల్ని, ఆలోచనల్ని, పద్దతుల్ని, పథకాల్ని అర్థంచేసుకోవాలని ప్రయత్నిస్తాం. అలాంటి ఒక ప్రయత్నం "వోడ్కా విత్ వర్మ". సిరాశ్రీ అనే ఒక అభిమాని తను అభిమానించే రాంగోపాల్ వర్మ అనే ఐకాన్ ని వెతుక్కుంటూ, డిస్కవర్ చేసుకుంటూ, అర్థంచేసుకుంటూ సాగించిన పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ ఈ పుస్తకం. సిరాశ్రీ లాంటి అభిమానులకు లేదా వర్మ భక్తులకు ఈ పుస్తకం ఖచ్చితంగా కొంత ఊరటనిస్తుంది.

పుస్తకానికి కమర్షియల్ హంగుల్ని చేర్చడానికి వర్మ శిష్యులచేత, కుశిష్యుల చేత, అశిష్యుల చేత, అరశిష్యులచేత, అర్థశిష్యుల చేత కొన్ని పెగ్గులు/పేజీలు రాయించినా అది మార్కెట్ గిమ్మిక్కేగనక వాటిని పక్కనపెట్టి ఒక అభిమాని ప్రయత్నంగా చూశాను. అందుకే తప్పకుండా చదవాల్సింది అంటున్నాను.

జ్యోతిర్మయి said...

చదవక్కర్లేదన్నమాట. థాంక్స్ సుజాత గారు.

ravikanth buggineni said...

గతం లొ ఈ రచయిత రీవ్యూ లకు కొన్ని సినిమాలు దెబ్బతిన్నాయి :) ఇప్పుడు ఈ రీవ్యూతొ రీవ్యూ పవర్ తెలిసి వస్తుందేమో?

సుజాత said...

రాజ్, దాచుకునే ఉద్దేశం లేదులే కానీ,ఇక్కడి నుంచి కొరియాకు ఎలా విసరడం? అని ఆలోచిస్తున్నా!

ఇండియన్ మినర్వా గారు, :-))

తృష్ణ గారు.. పుస్తకం చూడకుండానే పొగడ్తలు తెలిసి కొనలేదా? సూపరు...

సుజాత said...

రిషి,

చాలా రోజుల తర్వాత కనిపించారు..సంతోషం!
అర్జెంట్ గా కాకపోయినా తర్వాతైనా చదివి చూడండి..

వేణు....అభినందన సంచిక పోలిక భలేగా ఉంది.

వోడ్కా, మందు మాట వంటి పదాలు సెన్సేషన్ కోసం రాసినవే! కాబట్టి వదిలేయొచ్చు

సుజాత said...

BVJ.. :-))

Sharma గారు..థాంక్యూ

శేఖర్..ఎంత చెప్పాను? నా అభిప్రాయం చెప్పాను తప్ప చదవొద్దు అని చెప్పానా?
సరే..కొని చదువు. ఆ తర్వాత.....:-))

కత్తి మహేష్ కుమార్ గారు
LOLz దేన్నయినా సరే...సమర్థించాలంటే మీ తర్వాతే!

జ్యోతిర్మయి గారూ, చదవాలా వొద్దా అన్నది మీ నిర్ణయం...
ఇది నా కోణం మాత్రమే సుమండీ

సుజాత said...

రవి కాంత్ గారూ,
రచయిత పని చేసిన వెబ్ సైట్ నేను చూడను. అందువల్ల వారి రివ్యూలు, ఫలితాలు తెలిసే అవకాశం లేదు.
ఒక బ్లాగ్ రివ్యూ వల్ల ఏమీ ఒరగదు లెండి. అక్కడున్నది వర్మ...ది సెన్సేషన్

థాంక్యూ అండీ :-)

kiran kumar said...

చదివాను ఈ బుక్! దీని గురించి మీరు "ఇంత" రాయడానికి ఎలా కుదిరిందా అని ఆలోచిస్తున్నా!
ప్రతి పేజీలోనూ వర్మ గొప్పలూ, ఆయన్ని ఆకాశానికెత్తడం, పన్లో పనిగా రచయిత స్వోత్కర్షా...! సగం కూడా ఆసక్తి తో చదవలేకపోయాను. డబ్బు దండగ అనిపించింది నాకు

తృష్ణ said...

పుస్తకం చూడకుండానే కాదండీ... బుక్ ఫైర్లో చాలా చోట్ల కనబడ్డ ఈ పుస్తకం తాలుకూ పేజీలు తిప్పితే కనబడ్డ పొగడ్తలు చూసి చిరాకేసి...కొనలేదని నా ఉద్దేశం.

spandana said...

ఏదైనా పుస్తకాన్ని, సినిమాను నిష్కర్షగా చెప్పేవారు తక్కువ. మొహమాటం, సభ్యత లాంటి ముసుగుల్తో పాఠకులని అయోమయంలో ముంచేవారే ఎక్కువ.
కినిగేలో ఈ పుస్తకం కొన్నా గానీ ఇంకా చదవలేదు. ఇప్పుడు మీ సమీక్ష చూశాక డబ్బే వృధా అయితే ఫర్వాలేదూ సమయమూ వృధా చేయడమెందుకు అనిపిస్తోంది.

Ravi said...

Like it or lump it. He doesn't really care and continue to churn out movies of his taste.
Love him or hate him. you can't ignore him. That is R...G...V.Simply Varma the great.

Ganesh said...

నేను చదివాను. యేడ్చి మొహం కడుక్కునట్లు వుంది.

తెలుగు అభిమాని said...

సుజాతగారు! మీరు వ్రాసింది చదివితే this book is a cheap effort to encash varma అనిపిస్తుంది. varma లాంటి mavericks--

love him hate him can't ignore him.
most of the times he appears true to himself.

@ganesh: నేను చదివాను. యేడ్చి మొహం కడుక్కునట్లు వుంది. -it is too good.

డేవిడ్ said...

సుజత గారు నేను ఆ పుస్తకం కొన్నాను కాని వీలు దొరకక చదవలేదు....మీ పోస్ట్ చదివాక నిదానంగా చదవొచ్చు అని డిసైడ్ అయ్యను.

అబ్రకదబ్ర said...

పుస్తకాలు అచ్చేయించుకోటం బహు వీజీ ఐపోయింది. అందుకే వర్తమాన తెలుగు సాహిత్యమిలా ఘభ్భు ఖొఠేస్తుంది :-)

నవజీవన్ said...

వర్మ అభిమానులకు ఈ పుస్తకం చాల పెద్ద విషయమే. వర్మ గురించి అతని అభిమాని సిరాశ్రీ కొందరిని "ఇంటర్వ్యు" చేసిన భాగాలు చాలా బాగున్నాయి. అయినా ఈ పుస్తకానికి కమర్షియల్ హంగులు ఉండడం వలనేమో "నా ఇష్టం" కు వచ్చినంత పాపులారీటి రాలేదు ..

Post a Comment