April 23, 2008

అరవ(డ)ము

ఇవాళ పొద్దున్న ఎదురింట్లోంచి పెద్ద పెద్దగా కేకలు వినబడుతుంటే, ఏమిటో అని తలుపు తీసి చూశా! ఏమీ లేదు. సెలవులకి వచ్చిన శ్రీధర్ రామనాధన్ (మా పొరుగాయన)వాళ్ళ నాన్న గారు రామనాధన్ గారు, శ్రీధర్ పిల్లలకు లెక్కలు చెపుతున్నారు. ఆయన కింద ఫ్లోర్ కు కూడ వినపడేట్టు పాఠాలు బోధిస్తుంటే, శ్రీ శ్రీ విసిరిన చిన్న చలోక్తి గుర్తొచ్చింది.
ద్రావిడ భాషలు నాలుగు!
తెలుగు
మళయాళము
కన్నడము
"అరవడము"
అన్నారట చివరిదాకా మద్రాసులో జీవించిన శ్రీ శ్రీ

ఈ జోకు నాకు యాదాటి కాశీపతి (సీనియర్ జర్నలిస్ట్) చెప్పారు.
నోట్: తమిళాన్ని కించపర్చాలనే ఉద్దేశం నాకు లేదండొయ్! జోకుని జోకుగా తీసుకోండి.

13 comments:

రానారె said...

:)) సూపర్!!

శ్రీశ్రీ కాలంనాటి తమిళసినిమాల్లో పాటలుగానీ, మాటలుగానీ హెచ్చు స్వరాల్లోనే వుండేవి కదా!

కన్నడము - అరవడము ప్రాస భలే కుదిరింది.

'పంచతంత్రం' సినిమాలో అనుకుంటాను, కమలహాసన్ ఒక డైలాగు చెబుతాడు - అవరం అవరం అంటూనే అరుస్తూవుంటార్రా మీ అరవోళ్లు - అని. (ఈ సినిమా తెలుగు వెర్షన్లో ఆయన ఆంధ్రుడని మీకు తెలుసు)

మాలతి said...

శ్రీశ్రీయే అనుకుంటా రవము కానిది అరవము అని.
ఇది కూడా జోకుగానే తీసుకొనవలెను.
మాలతి

కొత్త పాళీ said...

రానారె .. గురుద్రోహీ! :-)
ఆ జోకు నాకు గుర్తుండి .. మరోచరిత్రలో సరిత తండ్రి అంటాడు.
సుజాతగారూ, మాలతి గారూ .. ఇదేదో ఇటీవల (సినీ)భక్తులంతా నాకు చేస్తున్న గీతోపదేశం - "సినిమాని సినిమాలానే చూడాలి " లాగానే ఉంది. అనాల్సిన వన్నీ అనేసి .. బాగానే ఉంది. ఐనా మీ తెలుగువాళ్ళకి గర్వం లెండి, ఇతరభాషల వాళ్ళే మీ భాషని మెచ్చేసుకున్నారని (అటు కృష్ణరాయల నించీ ఇటు సుబ్రహ్మణ్య భారతి దాకా).
సెందమిళ్ అంటారు. దాని మాధుర్యం వినాలంటే అటు తిరుప్పావై పాశురాల్లోనూ, ఇటు తేవారం, తిరువాచకం శివ కీర్తనల్లోనూ.

మాలతి said...

కొత్తపాళీగారూ

నేననలేదండి మహాకవులవాక్కు తిరిగి చెప్పానంతే. నిజానికి ఆయన ఆమాట నాఎదుటే అన్నారు.
పోతే నాతమిళ మిత్రులు నన్ను మాలది అంటే నేనేం కంప్లైంటు చెయ్యలేదు కద. :)
పనిలో పనిగా ఆరుద్ర తెలింగుఇసై తమిళసేవై అని ఒక వ్యాసం రాసారు తన వ్యాసపీఠంలో. తెలుగువాళ్లకి గర్వపడడానికి తమిళులలు కూడా కారణమేననుకుందామా!

సుజాత వేల్పూరి said...

మాలతి గారు,
అయితే తమిళులకు మీ పేరు మార్చి చెప్పాల్సిందే! ఇటీవల ఈ మాటలో అనుకుంటా ఒక కథలో 'యాదవ గుల మురళీ రవ ' అని పాడుతుంది ఒకావిడ. అల్లాగే ఉందిదీనూ!

కొత్త పాళీ గారు,
తిరుప్పావై వినకుండా ఒక్క ధనుర్మాసమూ గడవలేదు నాకు ఇరవయ్యేళ్ళొచ్చేదాకా! అంత ఇష్టం! అంతే కాదు, భారతియార్ పాట " ఓడి విళయాడు పాపా.." బళ్ళో చదివే రోజుల్లో బోలెడన్ని ప్రైజులు తెచ్చి పెట్టింది కూడా!

మ్మ్..కొంచెం గర్వం అంటారా..తెలుగు వాళ్లందరికీ ఉండాలి మరి.

రానారె said...

"ఓడి విలయాడు పాపా .. నీ వొయిందిరిక్క్‌లాగాదు పాపా" ఈపాటను నేనూవిన్నాను. చిత్తరంజంన్ గారు ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం నుంచి పాటనేర్చుకుందాం అనే కార్యక్రమంలో నేర్పించేవారు.

సుజాత వేల్పూరి said...

I learned many songs in that program, including 'odi vilayaadu papa'"ellalerugani vaaramu ' ' honge kaamiyaab' milke chalo ' and some other songs.

Anjani said...

Does anybody have lyrics for "ellalegani Varamu". Please let me know - Anjani

సుజాత వేల్పూరి said...

అంజని చిత్తజల్లు గారు,
"ఎల్లలెరుగని వారము" పాట లిరిక్స్ నా దగ్గరున్నాయి. మీకు కావాలంటే చెప్పండి. ఇరవయ్యేళ్ల క్రితం నేను ఎనిమిదో క్లాసు చదువుతున్నపుడు ఆదివారం ఉదయం చిత్తరంజన్ గారు హైదరాబాద్ రేడియో స్టేషన్లో "కలసి పాడుదాం" కార్యక్రమంలో నేర్పుతుంటే నేర్చుకున్నాను.

Anjani said...

Sujatha Garu
Naaku aa pata lyrics kavali. Naku pata sagam gurtu vastundi. Mee blog chala nachchindi naku. Maa pillalaku nerpiddamani anukuntunnanu
Thank you
Anjani

Anjani said...

sujatha garu, konchem lyrics pampincharuu. ee blog lone post cheste nenu chusukuntanu.

Anjani

సుజాత వేల్పూరి said...

అంజని గారు,
నా పాత డైరీ ని వెదకటంలో కొంచెం బద్ధకించాను. ఇవాళ ఆ పాట లిరిక్స్ తో కొత్త పోస్ట్ రాస్తున్నాను. చూసి, రాసుకోండి. ఆలస్యానికి మన్నించండి.

Anjani said...

Thank you so much. You are super!!!!!!!!!
Anjani

Post a Comment