October 30, 2008

సెంచరీ కొట్టేశాను!

సెప్టెంబర్ 29 న నేను రాసిన "మీ చదువులే మా చావులు" టపా అక్షరాలా వంద వ్యాఖ్యలను సంపాదించింది. వీటిలో నా ప్రతిస్పందనలు కూడా ఉన్నాయి. వాటిని మినహాయించినా అత్యధికంగా కామెంట్లకు నోచుకున్న టపా గా దీన్ని భావిస్తున్నాను. నేను కూడలికి చేరి ఆరు నెలలే కాబట్టి అంతకు ముందు ఏ టపాకైనా ఇంత ప్రతిస్పందన వచ్చిందేమో నాకు తెలియదు.



టపా అంశం ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అనుభవించిందీ, ఇప్పుడు పిల్లల కోసం అనిభవిస్తోందీ కావడంతో ప్రతి ఒక్కరూ వారి అనుభవాలనూ, అభిప్రాయాలనూ పంచుకోవడంతో ఇన్ని వ్యాఖ్యలు వచ్చాయి. నాకెదురైన అనుభవాలను పంచుకుందామనుకున్నానే గానీ ఇంత మంది విద్య కు అయ్యే వ్యయం గురించి ఇంతగా ఆలోచిస్తున్నారనీ, కొంత మంది ఈ చదువు ఖర్చుల గురించి ఆందోళన పడుతున్నారనీ నాకు ఇప్పుడే తెలిసింది.


వ్యాఖ్యాతలందరికీ శతకోటి ధన్యవాదాలు.

వందో వ్యాఖ్య రాసిన సత్యాన్వేషి గీతాచార్య కు ప్రత్యేక ధన్యవాదాలు!

53 comments:

ప్రదీపు said...

నాకు తెలిసి తెలుగులో 100 కామెంట్లకు పైగా సంపాదించిన మొట్టమొదటి టపా మీదే...
ఈ ఘనకార్యం సాధించినందుకు మీకో వీరతాడు :)

నాగప్రసాద్ said...

ప్రస్తుతం మనము సంపాదిస్తున్న దానిలో 75% శాతం చదువుకు మరియు ఆరోగ్యానికి ఖర్చుపెడుతున్నాము. మన సమాజంలో చాలామంది ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు డబ్బు ఖర్చవుతుందని 20 రూపాయలు పెట్టి తిండి తినడానికి ఆలోచిస్తారు గాని, ఆరోగ్యము, చదువుకు సంబంధించిన విషయాల్లో ఆలోచించరు. ఏ నాయకుడైనా ఈ రెండు ఖర్చులను తగ్గించగలిగితే వాడు నిజంగా దేవుడితో సమానమే నా దృష్టిలో.

కాకపోతే ఆరోగ్యం అనేది మన చేతిలోనే వుంది అనేవాళ్ళు లేకపోలేదు. ఆరోగ్యం కాపాడుకోవాలంటె చక్కని పౌష్టికాహారంతో పాటు, వ్యాయామం కూడా చేయాలి. అది కుదరని పని. ఎందుకంటే మన సమాజంలో చాలా మంది ఒక పూట తిండి మానేసైనా సరే వాళ్ళ పిల్లలకి మంచి చదువు చెప్పించాలనుకుంటున్నారు.

ఏదేమైనా సెంచరీ కొట్టినందుకు మీకు అభినందనలు.

--నాగప్రసాద్

Kathi Mahesh Kumar said...

సెంచరీ కొట్టడమంటే ఆషామాషీ వ్యవహారం అస్సలుకాదు. అదీ తెలుగు బ్లాగుల్లో మరీనూ! నా అభినందనలు.

శ్రీసత్య... said...

తెలుగు బ్లాగులో 100 చేసింది మీరే అనుకుంటాను.అలాంటి మంచి రచన మరొకటిరాసి 200 కొట్టాలని ఆకాంక్షిస్తున్నాను.

మీ శ్రీసత్య.....

Unknown said...

సుజాత గారు, కంగ్రాట్స్ మరియు హ్యాట్సాఫ్.

కొత్త పాళీ said...

అభినందనలు.

వికటకవి said...

ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని మరోసారి నిరూపించేసారన్నమాట. కంగ్రాట్స్.

జ్యోతి said...

congratulations..

అయ్యో .. రమణిగారి బ్లాగులో స్వయంవరం ప్రకటిస్తే ఇక్కడ వంద కామెంట్లు అయ్యాయేంటీ??

సుజాత,,

మీరు ఎంచుకున్న విషయం ప్రతి తల్లితండ్రులలో ఆలోచనలు , గత స్మృతులు చర్చించేలా చేసింది.. కీపిటప్.

Purnima said...

చాలా కష్టమైన ఫీట్ సాధించారు! అభినందనలు!! నేనెక్కడో చదివాను "పొద్దు గడి" కి తప్పించి ఎక్కడా యాభై కమ్మెంట్లు దాటవని. ఇప్పుడు మీ టపానే అనుకుంటా అత్యధికం!

మీ నుండి మరిన్ని టపాలు ఆశిస్తూ,

పూర్ణిమ

Purnima said...

బైదవే, అసలా వ్యాఖ్యల పరంపర మొదలెట్టింది నేనే! (ఇప్పుడే చూసొస్తున్నా) నాకూఊ పార్టీ కావాలి అంతే! ఎప్పుడూ? ఎక్కడా? ఎలా? త్వరగా చెప్పుదురూ!

సుజాత వేల్పూరి said...

పూర్ణిమా,
అది ఫీట్ అనుకోలేదు నేను. ఏదో అలా జరిగిపోయిందంతే!

సరే, పద! హవేలీ కో, లేక 36 జూబిలీ హిల్స్ కో(ఇద్దరికీ దగ్గరగా ఉండాలి కదా) వెళ్ళి చించేద్దాం!

వైష్ణవి హరివల్లభ said...
This comment has been removed by the author.
వైష్ణవి హరివల్లభ said...

సెంచరీ కొట్టిన మీకు రెండు సెంచరీల అభినందనలు.

ఇంతకన్నా ఏమి చెప్పినా ఎక్కువే అవుతుంది.

మీ సెంచరీకి నా దీపావళి వంటకం బహుమతిగా అందుకోండి.


http://priyamainamaatalu.blogspot.com/2008/10/blog-post_28.html

వైష్ణవి హరివల్లభ

Srujana Ramanujan said...
This comment has been removed by the author.
Srujana Ramanujan said...

Congratulations. I read that post just now. many people identified themselves.

My hearty congracts to the first (every journey starts with the first step)and the last last person too.

I can not comment everywhere. But accept my ... you know ... here itself

మున్నీ said...

సుజాత గారు, అభినందనలు. నేను ఈ బ్లగు లోకానికి కొత్త. మీ బ్లాగు సున్నితమైన హాస్యంతో చాలా బాగుందండి. హాస్యంతొ పాటుగా సమకాలీన సమస్యలను కుడా ఎత్తి చూపుతూ చాలా విషయలను తెలుపుతుంది. అందుకొండి మరి వీరతాడు.

Unknown said...

నమ్మశక్యం కాకుండా ఉంది. వంద వ్యాఖ్యలంటే మామూలు కాదు.
భేష్ !

Anil Dasari said...

అభినందనలు :-)

గీతాచార్య said...

వివాదాలూ కావు, అనుభూతులూ కావు. కేవలం చదివిన వారి జ్ఞాపకాలని తట్టి లేపారు అంతే. అందరూ తమని తాము గుర్తుకు తెచ్చుకున్నారు. అందుకే ఇది ప్రత్యేకం.

థాంక్స్.

cbrao said...

100 కామెంట్లే ఏకంగా! మీ అమ్మాయి పెళ్లికి దిగుల్లేదు. రాజకుమారుడు వెతుక్కుంటూ వచ్చి, మీ అమ్మాయిని వరిస్తాడు. అభినందనలు.

-cbrao
San Jose, CA.

Purnima said...

ఆ రెండూ .. tried and tested. నాకు అంతగా నచ్చవు!

బైదవే, road no.36 లో ఉన్న చత్తీస్‍కి వెళ్ళారా? సూపర్‍గా నచ్చేసింది నాకు. బార్బీక్యూ.. ఓహో ఉంటుంది! Awesome assalu! ;-)

రిషి said...

అభినందనలు!!

సుజాత వేల్పూరి said...

పూర్ణిమ,
ఏమిటి, హవేలీ నచ్చలేదా నీకు? సరే చత్తీస్ అంటే...ఆ శ్రీనిధి స్కూలు వెనకాలదేనా..? నేనింకా వెళ్లలేదు..సరే అక్కడికే పోదాం!

సుజాత వేల్పూరి said...

రావు గారు,
మా అమ్మయి పెళ్ళా? హ హ ! ఆమె నాకు చెప్పి చేసుకుంటుందో లేదో? అప్పటి సంగతి ఏమిటో...రాజకుమారుడిని తెచ్చి మాకు డైరెక్టుగా పరిచయం చేస్తుందేమో అని ఒక చిన్న డౌటు. అదే మంచిది లెండి!

ప్రతాప్ said...

అందుకోండి అభినందనలు.
మీకు వచ్చిన కామ్మెంట్లలో మేమూ ఒక చెయ్యి వేసాం కాబట్టి మరి మాకూ ఉండాలి కదా పార్టీ?
నిజమే 36 జూబ్లిహిల్స్ కన్నా చట్టిస్ బావుంటుంది, కానీ నాకెందుకో అదికూడా పెద్దగా నచ్చలేదు (హోం మేడ్ ఫుడ్ ఇష్టం లెండి), but కొన్ని ఐటమ్స్ సూపర్ గా ఉంటాయి దాంట్లో ముఖ్యంగా మొక్కజొన్న వడలు సూపరో సూపరు.

Anonymous said...

ఇక్కడేదో పార్టీల గురించి మాహాడుకుంటున్నారు.. నేను కూడా (ఆ టపాకెళ్ళి చెయ్యి చేసుకుని, ఆ పైన) చేతులు కడుక్కుని రమ్మంటారా? పండగపూటైనా పప్పుంటే చాలనుకునే అల్పసంతోషులు కొందరున్నారిక్కడ -చింతలేదు మీకు!

వంద వ్యాఖ్యలు వచ్చాయంటే రావూ మరి.. ఎంత చెట్టుకు అంతగాలి!

Bolloju Baba said...

congrats
as caduvari said aptly you deserve it.

సిరిసిరిమువ్వ said...

అభినందనలు.
ఏంటి పూర్ణిమకేనా పార్టీ? మేమంతా ఏమైపోయామంట! మా కుకట్‌పల్లి "అడ్డా"కి రండి చూసుకుందాం.

Shiva Bandaru said...

మీకు నా అభినందనలు . ఇంకా దూసుకుపోండి రాకెట్ లాగా.....

ప్రదీపు said...

ఇక్కడేదో పప్పు గురించి మాట్లాడుకుంటున్నారు. నేను వస్తా అయితే.

సుజాత వేల్పూరి said...

చదువరి గారు, ప్రతాప్ గారు,

పప్పన్నం కావాలంటే ఇంటికి, బార్బిక్యూలు కావాలంటే చత్తీస్ కి పోదాం! ప్రదీపు గారు కూడా ఉంటారు కాబట్టి ఎంత పప్పైనా ఇట్టే వండేస్తా!

వరూధిని గారు, మనం "ADDA" లో వేరేగా పెట్టుకుందాం అయితే! పప్పు, బార్బిక్యూ రెండూ అడ్డాలో ఉంటే అందరూ అక్కడికే!

బాబాగారు,
బ్లాగ్లోకంలో నిన్న గాక మొన్న మొలకెత్తిన చిరు మొక్క ని నేను. చదువరి గారు ఊరికే సామెత కోసం "ఎంత చెట్టు కి అంత గాలి" అన్నారు గానీ, ఆ టాపిక్కే అల్లాంటిది.

Siri said...

Sujata garu,
Naaku blogule kotta andulo meedi mari kotta...meeru koumudi lo raasina "maavari amma katha" lo mee blogspot gurinchi telusukuni,meeru march 2008 lo raasina "oka manchi pustakam" chadavatam jarigindi.. pustakalu chadive vaallaku, okkapudu chadivina pustakalu gurtuchesinaduku krutajnatalu!meeru mention chesina Nanduri Ramamohan Rao gari manavaralini nenu! mee blog lo aayana peru chusi cheppalenata aanandam kaligindi.andariki aayanani gurtuchesinanduku chala thanks.

వేణూశ్రీకాంత్ said...

అభినందనలు సుజాత గారు... ఫీట్ కాకపోడం ఎంటండి అందర్ని స్పందింప చేయగలిగిన టపా వ్రాసిన క్రెడిట్ అచ్చం గా మీదే కదా... ఓపిక గా స్పందించిన బ్లాగర్లని కూడా మెచ్చుకోవాలి లెండి కానీ ఆ టాపిక్ అలాంటిది ఎన్నుకున్నారు సెంచరీ కొట్టేసారు....

Anil Dasari said...

ఇక్కడేదో మెమెంటో సినిమా స్క్రీన్-ప్లే లాగా ముందు నుండి వెనక్కొకటి, దానికి సమాంతరంగా మరొకటి, లంబంగా ఇంకోటీ .. రకరకాల త్రెడ్స్ నడుస్తున్నాయి :-) ఈ టపాకీ అర్ధ సెంచరీ కామెంట్లు తధ్యం.

Unknown said...

అబ్బా telugu blooger records లో అరుదైన స్ధానం సంపాదించారు.
మీరికార్డులు.
> మొదలుపెట్టిన ఆరు నెలలకే ౧౦౦ కామెంట్లు
> ౧౦౦ కామెంట్లు వచ్చిన తొలి మహిళా బ్లాగరు
> ౧౦౦ కామెంట్లు వచ్చిన తొలి బ్లాగరు.

చత్త రాయకుండా సామాజికమైన విషయాన్ని ప్రస్తావిస్తే బ్లాగర్లు ఎప్పుడు ఓటేస్తారని బ్లాగర్లు నిరూపించారు.

నిషిగంధ said...

Superooo super!!! హృదయపూర్వక అభినందనలు :-)

ప్రియ said...

I'm too late? Oh! congratulations.

You have pulled an impossilbe wonder. I'm sure nobody can beat your record. To say truth, It's we, have to give you a party.

Priya Iyengar.

Dhanaraj Manmadha said...

అందుకోండి నా అభినందనలు. మీరు రాస్తున్న తెలుగు బాగుందండీ.

ధనరాజ్ మన్మధ.

సుజాత వేల్పూరి said...

ప్రియా,
థాంక్స్, నాకు పార్టీ ఇవ్వాలన్న అద్భుతమైన అయిడియా మీకన్నా వచ్చినందుకు!

చైతన్య.ఎస్ said...

అభినందనలు

ramya said...

ఆ వందలో నా వ్యాఖ్యా ఉంది నాకూ పార్టీ .
ఇప్పటినుండీ చూస్తూ ఉంటా మీపో్స్టలలో వందో కామెంట్ నాదే ఉండేలా. అప్పుడూ వందో వాఖ్య కి బహుమతీ ఇవ్వాలి.

సుజాత వేల్పూరి said...

రమ్య గారు,
మీ వ్యాఖ్య గీతాచార్య చూశారంటే నాకు ఖర్చవుతుంది. పార్టీ కి అందరికీ ఆహ్వానమే! ప్రతి పోస్టుకూ వంద వ్యాఖ్యలు రావాలనుకోవడం అత్యాశ కదండి మరీ!

Unknown said...

సుజాత గారు ప్లేస్ మీరు చెప్పిన సరే , మీ వారు చెప్పిన సరే. టైం నేను చెప్పిన సరే మీరు చెప్పిన సరే మీరు రమన్న చోటుకి రమన్న టైం కి వచ్చి మీరిచ్చే పార్టీ ని స్వీకరించి మరిన్ని వ్యాఖ్యలు మీ టపా ల మిద రాసుకుంటూ మిమ్మల్ని డబల్ సెంచరీ కొట్టిస్తా.

సుజాత వేల్పూరి said...

రవి గారు,
ప్లేస్ మా వారెందుకు చెప్పడం? మనందరం కలిసి డిసైడ్ చేద్దాం, మా వారినీ పార్టీకి పిలుద్దాం, బిల్లు మాత్రం ఆయన కార్డు మీద గీకేద్దాం! ఏమంటారు?

శ్రీ said...

ఇదిగో మళ్ళీ హాఫ్ సెచరీ కొడుతున్నారు!

సుజాత వేల్పూరి said...

శ్రీ గారు,
హాఫ్ సెంచరీలు ఇంతకు ముందు కూడా నాలుగైదు సార్లు కొట్టాను.

Unknown said...

ఎన్నాళ్ళో వేచిన ఉదయం అంటు పాడుకోవాలేమోఆ రోజు కోసం ఎదురుచూస్తూ, ఆ రోజు త్వరలోనే వస్తుంది గోపాలం నాకు ఆ నమ్మకం వుంది శంకరాభరణం శంకర శాస్త్రి డైలాగ్ గుర్తు చేసుకుంటూ మీ పిలుపు కోసం నిలువెల్ల కనులై ఈ నేటిజేన్స్ వేచేనులే.

One among you said...

Ohho! I have seen about your blog in computer era. Nice feat. Congrats to one and all, who had a share in that feat.keep giong.

గీతాచార్య said...

@ priya: A very nice and gracious gesture from your majesty. నిధులు మీరు సేకరిస్తారా? లేక మమ్మల్ని సేకరించమంటారా? :-) :-) :-)నవ్వే ఓపిక లేదండీ ఇప్పుడు.

@ramya garu:ఇలా ఐతే ఇంకెవరూ బాగా రాయలేరు. పాపం భయ పడుతారు. అయినా బంపెర్ ఆఫర్ స్కీముకి ఇదేమన్నా మహమ్మద్ ఖాన్ అండ్ జ్యూఎలర్స్ ఫ్రాంచైజీనా? ;-)

ఇప్పుడూ 50 మిస్సయ్యారు. నాదే ఆ చాన్స్. వంద కొట్టించిందీ నేనే:-).

నేనో SD కొట్టనా? ఎవరెస్ట్ ఎందరెక్కినా గుర్తుండేది ఎడ్మండ్ హిల్లరీనే. ఎన్ని గీతలున్నా శ్రీకృష్ణ గీతే గీతంటే.

The first man is always the first man. :-D. నాకెటూ అవకాశం లేదు. మీరన్నా పార్టీ ఎంజాయ్ చేయండి.

గీతాచార్య said...

@sujatha garu:

నేనూ కొట్టాను వంద. ఒక బ్లాగులో అన్ని టపాలకీ కలిపి. :-)

సుజాత వేల్పూరి said...

గీతాచార్య,
నాకు పార్టీ ఇవ్వడం అయిపోయింది కదా! ఇక మీరే నేనిచ్చే పార్టీకి రావాలి.

ఎంతైనా, అబ్రకదబ్ర గారికి వాక్సుద్ధి ఎక్కువే!

Anonymous said...

సుజాత గారు,
మీ బ్లొగ్స్ చదువుతుంటె రాష్ట్ర రాజధాని వివరాలు తెలుస్తూవుంటాఇ. మా అక్కగుర్తుకు వచ్చేది. కాని మీరు ఒక బ్లొగ్ లో చర్చ్ ని అనవసరము గా కొనసాగిస్తునారు.
"అబ్రకదబ్ర చెప్పినట్టు ఎవి ఎప్పటికీ తెగని చర్చలకు దారితీసే విషయాలు! ఎంత చర్చించినా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. మొత్తానికి ఇలా న్యాయ సమ్మతం కాని సంబంధాలను "దొంగతనం" అని ఒప్పుకుంటున్నారన్నమాట. దొంగతనానికి నైతికత ఆపాదిద్దామా వద్దా?"

I request you to stop promoting discussing ethical issues for senstaion.

నెనర్లు

satya said...

సుజాత గారు,

మీరు కామెంట్స్ మీద వచ్చే కామెంట్స్ (Meta comments అందామా!) లో కూడా మళ్ళీ half century కొట్టేసారు.

Post a Comment