December 25, 2008

ఈ-తెలుగు స్టాల్లో మేము- కొన్ని విశేషాలు

క్రిస్మస్ ఆటవిడుపు రోజు వీలైనంత మంది మహిళా బ్లాగర్లు పుస్తకాల పండగ లో ఈ-తెలుగు స్టాల్ లో కలుసుకోవాలనుకుని అనుకున్నాం! నేను, వరూధినిగారు, పూర్ణిమ, స్వాతి(ఊసులు),విరజాజి శిరీష గారు, జ్ఞానప్రసూన గారు,జ్యోతి గారు, రమణి గారు,అరుణ గారు కొంచెం ముందూ వెనుకలు గా అక్కడ కలుసుకున్నాం! స్టాలు కి మేము చేసిన సేవలు ఏమీ లేకపోయినా అందరం కలుసుకోవడం మాత్రం మరపురాని అనుభూతినే మిగిల్చింది.




చక్రవర్తి(భవదీయుడు)గారు,రవిగారు,తాడేపల్లి గారు,భార్గవ్, శ్రీనివాస్ కుమార్, హరివిల్లు శ్రీనివాస్,శ్రీధర్ గారు,మహేష్ కుమార్ గారు, పద్మనాభంగారు,నామాల మురళీధర్(మురళీగానం),దైవానిక(బెంగుళూరు నుంచి ఈ తెలుగు స్టాల్ కోసమే ప్రత్యేకంగా వచ్చారు)..వీరందరినీ కలుసుకున్నాం! కస్తూరి మురళీకృష్ణ గారి పుస్తకాలు,కొల్లూరి సోమ శంకర్ గారి మనీ ప్లాంట్ వారిద్దరి ఆటోగ్రాఫులతో సహా కొనేసుకున్నాం నేనూ, వరూధిని గారూ!



జ్ఞానప్రసూన గారు, జ్యోతి గారు ఆప్యాయత నింపి తెచ్చిన పూర్ణాలు,సున్నుండలు మొహమాటం లేకుండా ఖాళీ చేశాము. కంపెనీ గా ఉంటుందని బయట నుంచి మిర్చి బజ్జీలు కూడా వీటికి జత చేశాము.



జ్ఞానప్రసూన గారు ఆమె రాసిన పుస్తకాలు, వారి నాన్నగారు రాసిన పుస్తకం మా అందరికీ ప్రేమతో ఇచ్చారు.
ఇంతలో కలహార స్వాతికుమారి గారు మెరుపులా వచ్చి మమ్మల్ని పలకరించి మాయమైపోయారు


తాడేపల్లి గారు, శ్రీధర్ గారు, శ్రీనివాస్ గార్లు,పద్మనాభం గారు సందర్శకులతో బిజీగా ఉండగా మరి కాసేపు అందరం కలిసి గడిపి కొన్ని ఫొటోలు తీసుకుని వీడ్కోలు చెప్పుకుని బయలు దేరాం.
అప్పటివరకూ ఊహల్లో వేరే రూపాలు ఉన్నా, కలుసుకున్న తర్వాత వెంటనే ఎప్పటినుంచో స్నేహితులుగా మసలుతున్న అనుభూతితో ముచ్చటించుకున్నాం అందరం! రూపాలకు ప్రాముఖ్యం లేదని తేలిపోయింది.
నిజంగా ఈ క్రిస్మస్ మరపురానిదే మా అందరికీ!

21 comments:

వేణూశ్రీకాంత్ said...

బాగుందండి, మొత్తానికి అందరు కలిసి సందడి చేసారనమాట.

cbrao said...

మీ ఆనందాన్ని మాతో పంచుకున్నందుకు సంతోషం. మహిళ బ్లాగర్లు ఒకరినొకరు కలిసే అవకాశం ఇన్నాళ్లకు, e- తెలుగు స్టాల్ ద్వారా వచ్చినందుకు ప్రమోదం. ఛాయా చిత్రాలకింద పేర్లు రాయకపోతే, ఎవరెవరో ఎలా పోల్చుకోవటం?
"అప్పటివరకూ ఊహల్లో వేరే రూపాలు ఉన్నా, కలుసుకున్న తర్వాత వెంటనే ఎప్పటినుంచో స్నేహితులుగా మసలుతున్న అనుభూతితో ముచ్చటించుకున్నాం అందరం! రూపాలకు ప్రాముఖ్యం లేదని తేలిపోయింది."
-ఇది పూర్తి సత్యం కాదు. పాక్షిక సత్యం. అందరి అనుభవాలు ఒక్కలా ఉండవు.

Unknown said...

సుజాత గారు వేగంగా స్పందించి, మాట నిలబెట్టుకుని . అందరికన్నా ముందుగా upload చేసినందుకు అభినందనలు .

సుజ్జి said...

photos baagunnai sujatha garu. perulu kooda echi unte baagundedi.

చంద్ర మోహన్ said...

"రూపాలకు ప్రాముఖ్యం లేదని తేలిపోయింది." - లిటిల్ ప్రిన్స్ పుస్తకం చదివారా? అందులో రచయిత అంటాడు: "It is only with the heart one can see better. What is essential is invisible to the eye" అని.

That said, ఫోటోల క్రింద పేర్లు వ్రాస్తే బాగుండేది. హైదరాబాదీయులకే కాక ఇతర బ్లాగర్లందరికీ కూడా పరిచయం అయేది.

అభినందనలు!

Anil Dasari said...

మీ పనే బాగుంది. అప్పుడప్పుడూ తోటి బ్లాగర్లని కలుసుకుంటున్నారు. మొన్న సిబిరావుగారు చొరవ తీసుకుని బే ఏరియాలో తెలుగు బ్లాగర్ల సమావేశం ఏర్పాటు చేస్తే సమయానికి ఊర్లో లేకపోవట వల్ల వచ్చిన ఒక అవకాశాన్ని పోగొట్టుకున్నాను.

ఫొటోలు బాగున్నాయి. ఎవరెవరో చెబితే ఇంకా బాగుండేది. అయినా ఆ మాత్రం అనానిమిటీ ఉండాల్సిందే :-)

సుజాత వేల్పూరి said...

రావుగారు,
మా అందరి అనుభవం మాత్రం ఒకేలా ఉంది అక్కడ. కలుసుకోవడం ముఖ్యం అనిపించింది.

it is only with the heart one can see better" అన్నమాట అక్షర సత్యమనిపించింది. నా మటుకు నేను నిరాశ చెందలేదు కాకపోతే "మీరు సుజాత గారా" అని స్వాతిని అడగడం, "మీరు పూర్ణిమా?" అని నన్ను వచ్చి అడగడం వంటి తమాషాలు నవ్వించాయి అందర్నీ!

చంద్రమోహన్ గారు, ఆ పుస్తకం చదవలేదు గానీ, మీరు రాసిన కోట్ పైన నాకు పనికొచ్చింది.

పైన ఇచ్చిన పేర్లు అటూ ఇటూగా వేసుకుని చదువుకోగలరు.

Bolloju Baba said...

:-)
:-(

Anonymous said...

ఆ.... బావుందమ్మా...... బావుంది .ఇంతకన్న నేనేం చెప్పలేనమ్మా ....
మరే నాకు చాలా వుడుకుమోత్తనంగా వుంది

ఏకాంతపు దిలీప్ said...

:-)
:-(

Sujata M said...

Very nice. I missed it. I am feeling very bad to have missed it.

Sky said...

చాలా బాగుంది ఇలా అందరినీ ఒకే చోట చూడటం. కాకపోతే మనుషులని పోల్చుకోవడం కొంచెం కష్టంగానే వుంది.

విరజాజి said...

మనం అందరం కలుసుకున్న మధురక్షణాల్ని ఎప్పటికీ మరచిపోలేనండీ... అసలు ఒకరికొకరు ఎప్పటినుంచో తెలిసిన మంచి స్నేహితుల్లాగా.... మాట్లాడుకుంటూ ఉంటే, అసలు కాలం ఎలా గడిచిందో, చీకటి ఎప్పుడు పడిందో తెలీనే లేదు. "సురుచి" ఙ్ఞాన ప్రసూన గారన్నట్లు అందరూ బ్లాగు "బంధువులే". చాలా సంతోషంగా ఉంది.

San .D said...

I wish i was there....

మరువం ఉష said...

అబ్బా! కలవలేకపోయాం, కవితాయానం చేయలేకపోయాం, సాహిత్యవనం చేరకపోయాం అని పరి పరి విథాలా పరితాపం చెందుతుంటే, ఈ బూరెలు, సున్నుండలూ గుర్తుచేయటం సబబేనంటారా? హా హతవిధీ చివరికి ఆ దంతసిరి కూడా లేకపోయనే మరింత మనస్తాపం చెందమనేనా?

మీ అందరి అనుభవాలు చాలా బాగున్నాయండి, రోజుకొకరిలో పరకాయప్రవేశంచేసి మరీ తాదాత్మ్యం
చెందుతున్నాను.

Padmarpita said...

సుజాతగారు చాలా ఎంజాయ్ చేసివుంటారు కదా..!
చూడలేకపోయాను అన్న భాధని మీ ఫోటోలతో ఉపశయనం పొందానండి...!

ప్రతాప్ said...

నిజంగా నాకు చాలా బాగా బాగా బాగా బాధగా ఉంది హైద్ లో ఉండీ రాలేక పోయినందుకు. నేను తప్పకుండా కలవాలి అనుకొనే వ్యక్తులలో మొదటి స్థానం మన తెలుగు బ్లాగర్లదే.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

అదృష్టవంతులు...హు....

సుజాత వేల్పూరి said...

ఉష గారు,
ఏం చేస్తాం? జ్యోతి గారు తెచ్చిన సున్నుండలు జ్ఞాన ప్రసూన గారు తెచ్చిన పూర్ణాలు ఆ రోజు మా అందరి కలయికను మరింత తియ్యగా చేశాయి. అవి వస్తాయని ఊహించలేదు కానీ వచ్చే సరికి మతి పోయి లాగించేశాం. సాక్ష్యంగా ప్రసూన గారి పూర్ణాల డబ్బా ఇంకా నా దగ్గరే ఉంది కూడా.(ఆవిడ ముందుగా వెళ్ళిపోయారు)మీరు హైదరాబాదులోనేనా ఉండేది? ఉంటే రావలసింది, మిమ్మల్ని కూడా కలుసుకునే భాగ్యం కలిగేది.

నాకు మాత్రం ఒక్క విషయంలో నిరాశ కలిగింది. రమణి గార్ని చూడగానే "అబ్బ, నేను కూడా ఇంత పొడుగ్గా ఉంటే ఎంత బాగుండో" అనిపించింది.

మధురవాణి said...

ఆహా.. నేను కూడా హైదరాబాదులో ఉంటే ఎంత బావుండేది.. :(
మీరందరూ చక్కగా కలిసారు.. బాగా ఎంజాయ్ చేసారని ఓ పక్క నా లాంటి వాళ్ళు తెగ కుళ్ళుకుంటుంటే .. అది చాలదన్నట్లు.. మీరు పూర్ణాలు, సున్నుండలు,బజ్జీలు.. అని అన్నీ చెప్పి.. ఇంకా మమ్మల్ని ఊరిస్తున్నారా :( :(

ఫోటోలు పెట్టినందుకు చాలా సంతోషం..! నేనయితే ప్రతీ ఒక్కరి పేరునీ.. ఫోటోల్లోని ప్రతీ ఒక్కరి మొహంలో చూసి పోల్చుకుంటున్నా :)

నిషిగంధ said...

మీ అందరూ కలవడం గురించి గానీ, కలిసి సున్నుండలు, పూర్ణాలు, బజ్జీలు లాంటి నాకెంతో ఇష్టమైనవి తిన్నందుకు గానీ నేనస్సలు కుళ్ళుకోవడంలేదు.. నిజ్జంగా!! :-)

మీ ఆనంద సమయాన్ని ఫోటోల ద్వారా అయినా మా కళ్ళముందుంచినందుకు ఒక బస్తా థాంక్సులు తీసుకోండి :-)

Post a Comment