July 22, 2009
చందమామల్లాంటి బ్లాగులు!
పిల్లల కథలంటే నాకు ప్రాణం ఇప్పటికీ! బాలజ్యోతి, బాలమిత్ర,బొమ్మరిల్లు ,బుజ్జాయి వంటి ఎన్ని పిల్లల పత్రికలు "కొసరు"గా చదివినా,అల్టిమేట్ కథలంటే చందమామ కథలే! బాలమిత్ర స్టాండర్డ్ చిన్నప్పుడే నచ్చేది కాదు.చందమామ లో వచ్చే జానపద సీరియల్స్ చదవడం కోసం చందమామ ఇంటికొచ్చే సమయానికి మా ఇంట్లో (నాన్నతో సహా) ఎన్ని జతల కళ్ళు కాచుకుని ఉండేవో,నేను ముందంటే నేను ముందని ఎంతెంత యుద్ధాలు జరిగేవో తల్చుకుంటే ఉత్తేజం పొంగివస్తుంది.ఆ యుద్ధాల్లో నేను గెల్చిన సందర్భాలు గుర్తొచ్చి విజయహాసం ఇప్పటికీ మొహాన వికసిస్తుంది.
పాత చందమామల బైండ్లు బంధువుల ఇళ్ళలో కానీ, పాత పుస్తకాల షాపుల్లోగానీ, ఫుట్ పాత్ మీద పరిచిన పుస్తకాల దుకాణాల్లో గానీ ఎక్కడన్నా దొరుకుతాయేమో ఎంత డబ్బయినా పర్లేదు, కొనెయ్యాలని ప్రయత్నించి విఫలమయ్యాను ....బోల్డు సార్లు. కొందరిళ్ళలో ఉన్నాయి కానీ ఇవ్వమనేశారు. నేనైతే మాత్రం ఇస్తానా చెప్పండి? త్రివిక్రమ్ అబ్దుల్ కలామ్ గారికి ఇస్తారట గానీ మన్మోహన్ సింగ్ అడిగినా ఇవ్వరట. నేనైతే వాళ్ళిద్దరికీ ఇవ్వను..ఏం చేసుకుంటారూ? ఇద్దరికీ తెలుగు రాదుగా?
ఇలా వేట సాగిస్తుండగా....
ఆన్లైన్లో పాత చందమామలు ఉన్నాయన్న వెన్నెల లాంటి చల్లని కబురు నాగమురళి గారు తెచ్చారు.
నాగమురళి గారు పాత చందమామలు చదువుతారా ?. అంటూ పలకరించగానే ప్రాణం లేచొచ్చి అక్కడికి పరిగెత్తి ఆ యులిబ్ లో ఉన్న పాత చందమామలు వీలైనన్ని చదివాను. ఈ లోపు ఈ చందమామ దాహాన్ని మరింత పెంచుతూ
త్రివిక్రం గారు "చంపి" క్లబ్బు.స్థాపించి, పాత చందమామల గురించి మరో సారి టపా రాశారు.మరోసారి అక్కడికి పరుగు.ఆర్కుట్లో చందమామ కమ్యూనిటీ కూడా ఏర్పాటు చేశారంటే ఇక చూసుకోండి మరి!ఆ టపా చదువుతుంటే ఎంతో ఆశ్చర్యమేసింది. త్రివిక్రమ్ గారినే తలదన్నే మహానుభావుడొకాయన హైదరాబాదులో ఉన్నారని త్రివిక్రం గారి మాటల్లోనే తెలిశాక, ఇక చంపి ల్లో మనం చివరి లైన్లో ఉంటే మంచిదని అర్థమైంది.
ఈ లోపు బ్లాగాగ్ని ఫణి గారు ఇవికాకుండా "ఇవిగో అందుకోండి"అంటూ డౌన్ లోడ్ చేసుకోడానికి చందమామ సీరియల్స్ ని అందించారు.
ఇక్కడా..
ఇంకా ఇక్కడా..!
ఇక్కడ కూడా...!
దానితో తల తిరిగిపోయింది.
అవి డౌన్ లోడ్ చేసుకుంటూ ఉండగా ఆ బ్లాగులోకి చుట్టపు చూపుగా వచ్చిన కప్పగంతు శివరామ ప్రసాద్ గారు "ఓసింతేనా! నా బ్లాగు. చూడండొకసారి"అన్నారు. దానితో అక్కడికి పరుగు.(చందమామలు దొరుకుతాయంటే చందమామ వరకైనా ప్రయాణానికి రెడీ) అక్కడికి వెళ్ళి చూస్తే శివరామ ప్రసాద్ గారికి "చంపి మిత్ర" బిరుదు ఇవ్వాలనిపించేన్ని అద్భుతాలు అక్కడ కనపడ్డాయి. పాత జానపద సీరియల్స్ అనీ సిద్ధం... నోరూరిస్తూ!
ఆ పాత మధురాలై, మనల్ని ఒక్కసారిగా బాల్యంలోకి విసిరేసే అనాటి సీరియల్స్ ని అందించడమే లక్ష్యంగా కాక బొమ్మలన్నింటినీ ఫొటో ఎడిటర్లో డిజిటలైజ్ చేసి రంగుల్ని చాలా వరకూ పునరుద్ధరించడం,సరిగా స్కాన్ కాని చందమామ పేజీలను సరి చేయడం వంటివి చేసి మంచి క్వాలిటీతో చందమామ సీరియల్స్ ని అందుబాటులో ఉంచారు శివరామ ప్రసాద్ గారు!
ఇంతలో ఈ మధ్యనే చంపి క్లబ్బులో సభ్యత్వం తీసుకున్న వేణు గారు తానేం తక్కువ తినలేదంటూ చందమామ లోని జానపద సీరియల్స్ రచయిత దాసరి సుబ్రహ్మణ్యం గారిని మొన్న ఆదివారం ఈనాడులో పరిచయం చేశారు. తన బ్లాగులోనూ .ఇచ్చారు. అంత గొప్ప సీరియల్స్ రాసిన సుబ్రహ్మణ్యం గారి ఫొటో చూడ్డం, ఆయన గురించి తెలుసుకోవడం మరో సంబరం.
శివరామ ప్రసాద్ గారు ఇంతవరకూ అందించిన పాత చందమామ సీరియల్స్ వివరాలు ఇవీ!
పేరు మీద క్లిక్ చేస్తే అది మిమ్మల్ని ఆయన బ్లాగులో ఆ సీరియల్ ఉన్నచోటుకు తీసుకెళుతుంది.
1.సింద్ బాద్ యాత్రలు.
2.అరణ్య పురాణం.
3.మాయదారి ముసలిది.
4.ఆలీబాబా నలభై దొంగలు.
5.అలీ నూర్, ఆలీబాబా, మాయ వర్తకుడు .
6.అల్లాద్దీన్ అద్భుత దీపం.
7. వడ్డాది పాపయ్యగారి అద్భుత చిత్రాలు.(అరణ్య పురాణం సీరియల్ ముఖ చిత్రాల ఆల్బమ్)
8. ప్రహ్లాద చరిత్ర . (వడ్డాది గారి చిత్రాలతో సహా)
9.పురాణ గాథలు.
10.దుర్గేశ నందిని, నవాబు నందిని.
11.పరోపకారి పాపన్న కథలు .
ఈ సీరియల్స్ లో కొన్నింటిని నేను డౌన్ లోడ్ చేశాను. మరి కొన్ని చేస్తున్నాను.
ఇంటర్నెట్ లో చందమామ అందుబాటులో ఉందని తెలిసే ఎంతో సంబరపడ్డ చంపి లు ఈ సీరియల్స్ అన్నింటినీ చూస్తే ఇంకెంత సంబరపడతారో! కానీ శివరామ ప్రసాద్ గారి బ్లాగు ఇటీవల వరకూ కూడలిలో జత చేయకపోవడం వల్ల వారు అప్ డేట్ చేసిన సీరియల్స్ వివరాలు ఆయన బ్లాగుకెళ్ళి చూస్తే తప్ప తెలియడానికి లేకుండా పోయింది.
చందమామ సీరియల్సే కాక సాహిత్య అభిమాని బ్లాగులో అనేక ఆసక్తికర విషయాలపై టపాలున్నాయి.ఇంతకుముందు అవన్నీ మిస్ అయిపోయిన వారు వారి బ్లాగులో పాత టపాలు చదవొచ్చు!
చందమామ అభిమానులంతా ఈ బ్లాగులోని జానపద సీరియల్స్ ని డౌన్ లోడ్ చేసుకుని దాచుకుంటే భవిష్యత్తులో అవి దొరకకపోయే పరిస్థితి వచ్చినా మనకేం ఢోకా లేదన్నమాటే!ఇప్పటివరకూ డౌన్ లోడ్ చేసుకోని వారెవరైనా ఉంటే సాహిత్య అభిమాని బ్లాగు నుంచి వీటిని డౌన్ లోడ్ చేసుకోండి మరి!
వీటిలో కొన్ని సీరియల్స్ నేను పుట్టకముందు ప్రచురించబడ్డవి కూడా ఉన్నాయి.అప్పటి చందమామలు పుస్తకాల రూపంలో అయితే సంపాదించడం అసంభవమే! వీళ్ళందరి పుణ్యమా అని వాటిని చదవగలుగుతున్నాను.
ఈ "చందమామ"ల్లాంటి బ్లాగు రచయితలందరికీ ఎన్నెన్నో ధన్యవాదాలు.
54 comments:
Where I can get the jokes & Ads on the back cover of Chandamama? :))
* Running Away*
చాలా బాగుంది, మీ టపా. విలువైన సమాచారం ఇచ్చారు. అభినందనలు!
చందమామ సంచికల అన్వేషణలోనే నాకు తెలుగులోనూ బ్లాగ్ లోకం ఒకటుందని తెలిసింది. కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు అప్పుడెప్పుడో ‘ఈ మాట’ లో రాసిన ‘చందమామ జ్ఞాపకాలు’ వ్యాసం చదవటం ఈ ప్రస్థానంలో మొదటి అడుగు. తర్వాత... త్రివిక్రమ్, నాగమురళి, బ్లాగాగ్నిల గురించి తెలుస్తూంటే.. ఎంత సంబరమో....చందమామ తొలి సంచిక నుంచీ వీలైనన్ని సంచికలను డౌన్ లోడ్ చేసుకుని, డీవీడీలో భద్రపరచుకుంటే గానీ తృప్తి కలగలేదు. నా బ్లాగులోనూ
చందమామ టపాలు ఎక్కువుండటం యాదృచ్చికం కాదు.
శివరామ ప్రసాద్ గారు అందిస్తున్న సీరియల్స్ ను చందమామ అభిమానులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని నా అభిలాష.
సుజాత గారు ధన్యవాదములు.
నేను ఆ లింక్స్ అన్ని మిస్ అయ్యాను. బట్ మీ పోస్ట్ వలన అన్ని తెలిశాయి. మళ్లీ ఎమైనా ఉంటే చెప్పండి. ప్రమదావనంలో కూడా లింక్ ఇవ్వండి.
ఏదో ఈరోజు గ్రహణం వలన చూడటానికి వీలు పడింది నా లక్.
ధన్యవాదములు.
ఇది చిన్న మాటే అనుకోండి
ఇంత కన్నా ఏమి చెప్పాలో నాకు తెలియదు.
సుజాతగారూ,
నమస్తే. చందమామ మీద ఉన్న అభిమానంతో, ఫణి కుమార్(బ్లాగాగ్ని) ఇచ్చిన ఆధారలతో 1947 నుంది 1980 వరకు అన్ని సంచికలను నా కంప్యూటర్లోకి దింపుకున్నాను. కొన్ని సంచికలు చందమామవారి సైటులో కూడ లేవు. అలా లేని సంచికలను సాధించటానికి కొంత కృషి చెస్తున్నాను. ఎప్పుడు దొరుకుతాయో తెలియదు. ఎవరిదగ్గరన్నా హార్డ్ కాపీలు ఉంటే స్కాన్ చెయ్యాలేమో!!
ఇలా చందమామలను సాప్ట్ కాపీలు సంపాయించాక, ధారావాహికలను ఒకచోట చేర్చటం మొదలు పెట్టాను. ఆ వరుస క్రమంలో కొన్ని చేసినాక అనిపించింది, నేనొక్కడినే ఈ సంతోషం పొందటం స్వార్ధం అని. అందుకోసం అప్పటికప్పుడు ఒక బ్లాగు తయారు చేసుకుని, అప్లోడ్ చెయ్యటం మొదలు పెట్టాను. కూడలి బ్లాగుకు జతపరచాలని నాకు తెలియదు. నేను అప్లోడ్ చెసినప్పుడల్లా, బ్లాగాగ్ని బ్లాగ్ లోనే ఒక టపా వేసేవాణ్ణి. అంటే అక్కడకు వచ్చి చూడటం చందమామ అభిమానులకు ఎటూ అలవాటయీందికదాని.
ఇలా వేస్తూ ఉండగా వేణూ గారి పరిచయం అయ్యింది. వారిచ్చిన సలహా ప్రకారం కూడలి.ఆర్గ్ కు అతి కొద్దిరోజుల క్రితం నా బ్లాగును జతపరిచాను.
నా బ్లాగు గురించి నాలుగు మంచి మాటలు చెప్పినందుకు, మీ బ్లాగులో వ్రాసి మంచి ప్రాచుర్యం కలగచేసినందుకు ధన్యవాదములు.
శివరామప్రసాదు కప్పగంతు
బెంగుళూరు, భారత్
అందాల చందమామనే మాకందించినట్లయింది
సుజాతగారు,ఎంత చల్లని కబురు రాసారండి.బ్లాగాగ్ని గారి బ్లాగులొ ఉన్నవి download చేసుకున్నా కాని మిగిలినవి ఇప్పుడు చెప్పారుగా ...నేనూ పరుగెడతా!
బాలజ్యోతి,చందమామ,ట్వింకిల్,బాలమిత్ర,అమరచిత్ర కధలు, ఇవన్ని బైండులు చేసి మా అమ్మ దాచింది.ఇప్పటికీ మా పిల్లలం అవన్నీ నాక్కావాలి అంటె నాక్కావాలి వాటి కోసం దెబ్బలాడుకుంటు ఉంటాము.చిన్నప్పుడు చదవటం ఇంకా రానప్పుడు ఇంటికి ఎవరు వచ్చినా 'ఈ కధ చదివి చెప్పారా' అని అడిగేదాన్నట.
ఆ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసారు.ధన్యవాదాలు.
వంద చందమామల పెట్టు ఈ పోస్టు! ఇంటర్నెట్లో ఉన్న చందమామ లింకులన్నింటినీ ఒక్క చోట అందరికీ అందించిన పుణ్యానికి మీకు బైండుచేసిన చందమామలు ఏ పాత పుస్తకాల షాపుల్లోనో హఠాత్తుగా దొరకు గాక!
సూర్యగ్రహణం రోజు చంద్రోదయం అని పెడితే బాగుండేది టపా పేరు. నేను కూడా బ్లాగాగ్ని గారి బ్లాగు నుంచి చందమామలు డౌన్ లోడ్ చేశాను గానీ శివరామ ప్రసాద్ గారి బ్లాగు సంగతి తెలీదు. నిజంగా చాలా థాంక్స్!
Bharadwaaj,
jOkes and Ads on the back cover of Chandamaama?
I'm really running away!
శివరామ ప్రసాద్ గారు,
మీ బ్లాగు ఇటీవలి వరకూ కూడలిలో జత చేయకపోవడం వల్ల చాలా మందికి మీ పాత టపాల్లో చందమామ సీరియల్స్ ఉన్నాయని తెలీదు. వాటిని అందరితో పంచుకోవాలన్న చిన్న కోరికే ఈ టపాకు మూలం. ధన్యవాదాలు!
చంద్రమోహన్ గారు, ఇంత మంచి దీవెనా? అమ్మో!
తథాస్తు అనేసుకుంటున్నా!
కొన్ని చందమామలు నా వద్ద లేవు. ఉదా: 1968 ఎవరైనా సహాయం చేయగలరా?
అన్నట్టు నా వద్ద కొన్ని పాత చందమామ పుస్తకాలే ఉన్నాయి. కొన్ని ఇప్పటికి కొత్తపుస్తకాల్లా నవనవలాడుతున్నాయి. అవి ఎవరికీ ఇవ్వను గాక ఇవ్వను.
చందమామలతో బాటు పొట్టినవల్లు కూడా వచ్చేవి ఒకప్పుడు అవీ ఓ కుప్ప సంపాదించేను నేను. వాటి మీద ఎపుడైనా రాస్తా.
రవి గారు,
పొట్టి నవలలు కేవలం రెండంటే రెండు మొన్న గుంటూరులో దొరికాయి. మీరు కుప్ప ఎలా సంపాదించారూ? ఇంతకు ముందొక సారి మీ అత్తవారి వూరు వెళ్తే పాత పుస్తకాలేవో దొరికాయని రాసినట్లు గుర్తు. అవేనా ఇవి? అప్పుడే రాయకండి. దిగులుపడలేను.
gud work
అవునండి అవే. బొమ్మరిల్లు సంస్థవి.
good service you have done
అబ్బ.. ఇంచక్కా చందమామలన్నీ ఒక చోట.. బోల్డన్ని థాంకులండీ..
glorious...తెలుగు చిన్న పిల్లల సాహిత్యం మీకు శాశ్వతంగా రుణపడి ఉంటుంది ...
భూమి ,చంద్రుడు ,తారలు ఉన్నంతవరకు భద్రంగా ఉంటుందన్నమాట" చందమామ "
all of you are doing great service to తెలుగు సాహిత్యం ...
సుజాత గారూ,
మీకూ ’వీర చంపి’ తాడో, ’పరమవీర చంపి’ అవార్డో ఇవ్వాల్సిందే.
అన్ని లంకెలూ ఒక్కచోటే ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు.
చంపిల్లో ఒకడిగా నాపేరు తలిచినందుకు చాలా సంతోషం. మీకందరికీ అద్దిరిపోయే ఒక వార్త చెప్పనా? చందమామ త్వరలో ప్రింట్ ఆన్ డిమాండ్ పధ్ధతిన కోరిన సంవత్సరం పుస్తకాలు ముద్రించి ఇచ్చే ఏర్పాట్లు చేస్తోంది. నమ్మకం కలగట్లేదా? గిల్లి చూసుకుంటున్నారా? వేణుగారి బ్లాగులో http://venuvu.blogspot.com/2009/04/blog-post_16.html టపాలో రాజశేఖర్ గారు(ఈయన చందమామలో అసోసియేట్ ఎడిటర్) వ్రాసిన వ్యాఖ్యనొకసారి చదవండి.
మొత్తానికి- చందమామ అభిమానులు మరోసారి సంబరపడుతున్న సందర్భమిది.
ఆన్ లైన్ చందమామ అసోసియేట్ ఎడిటర్ కె. రాజశేఖరరాజు గారి పేరును ఫణి (బ్లాగాగ్ని) తన వ్యాఖ్యలో గుర్తుచేశారు కదా... ‘మీకందరికీ అద్దిరిపోయే ఒక వార్త’ అంటూ! రాజశేఖర రాజు గారికి చందమామపై ఎంత passion ఉందో ఆయన రాసిన వ్యాఖ్యలు చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. అలాంటి వ్యక్తి చందమామ బాధ్యతలు చూడటం ‘చంపి’లందరికీ ఎంతో సంతోషకరం.
ప్రింట్ ఆన్ డిమాండ్ బాగానే ఉంటుంది కానీ ఎన్నని పుస్తకాలు అలా ప్రింట్ చేయించుకుంటారు? దానికన్నా మంచి ఐడియా ఒకటుంది. సాఫ్ట్ కాపీలని అమ్మకానికి పెట్టటం (చందమామ వెబ్ సైట్లో ఉన్న ఆర్కైవ్స్ కన్నా మంచి నాణ్యతతో)
పదేళ్ల కిందట నేషనల్ జియోగ్రఫికల్ సొసైటీ వాళ్లు 1888 నుండీ అప్పటిదాకా వచ్చిన నూట పదేళ్ల NG పుస్తకాలన్నిట్నీ సీడీలుగా, డీవీడీలుగా తీసుకొచ్చారు. మంచి క్వాలిటీ, కొంత ఇంటరాక్టివిటీ (search, etc) ఉన్న పీడీఎఫ్ ల రూపంలో.
చందమామ కూడా అలా లభ్యమైతే బాగుంటుంది. పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాకపోవచ్చు, కనీసం break even అయ్యేంత అమ్మకాలుండొచ్చు. ఇప్పటికిప్పుడే కాకపోయినా ఎప్పటికైనా దానివల్ల లాభమే వస్తుంది. విలువైన వారసత్వ సంపదని నేటి కాలానికి తగ్గట్లుగా మలిచి ప్రస్తుత తరానికీ, ముందు తరాలకీ అందించినట్లూ ఉంటుంది. ఈ ఐడియా వాళ్లకింకా రాకపోవటం ఆశ్చర్యంగా ఉంది.
సుజాత గారు చక్కని లింకులిచ్చి చందమామ అభిమానులకు ఆనదాన్ని ఇచ్చారు ..థేంక్స్ అండి :)
>>>>>
భూమి ,చంద్రుడు ,తారలు ఉన్నంతవరకు భద్రంగా ఉంటుందన్నమాట" చందమామ "
>>>>>
అతిశయోక్తి అనుకుంటాను. చందమామ అంత పాపులర్ అయితే చందమామ కథలని టి.వి. సీరియల్స్ గా కూడా తియ్యొచ్చు.
ఇప్పుడూ.... నేనున్నానండి. మీరు నాకు ఒక పుస్తకం గురించి చెప్పారు. ఆ పుస్తకాన్ని నేను చదవడం పూర్తి చేసేవరకు ఆగాలి కదా. వెంట వెంటనె ఇలా రక రకాల ఇంఫర్మెషన్లు ఇస్తుంటే నేను తట్టుకోలేక పోతున్నా. మరీ ఇలా ఐతె ఎలా? నేనొప్పుకోనంతె.
ఎమంటాం... పరమ వీర చంపి (మురళి గారు అన్నట్లు) గారు ఒకటి అంటే మిగిలిన చంపీలు వేరొకటి అంటారా?..
మీ మాటే మా మాట సుజాత గారు.
నేను చెప్పగోరు ఇంకొక విషయం ఎమిటి అంటే, నేను Ramakrishna math గ్రంథాలయ సభ్యుడను. అక్కడ కూడ చందమామ బైండ్లు అన్ని దొరుకుతాయి. సభ్యులకు ఇంటికి ఇస్తారో ఇవ్వరో నేను కనుక్కొని చెప్తాను. కాని అక్కడ కూర్చొని చదువుకొడానికి ఎటువంటి అభ్యంతరము ఉండదు.
ధన్యవాదములు,
Rajendra
మంచిపని చేశారు. ఎంచక్కా మీ టపాని బుక్ మార్క్ చేసుకుంటే చాలన్నమాట. ధన్యవాదాలు.
అబ్రకదబ్ర,
పాత చందమామలు బయట ఎక్కడా దొరకడం సాధ్యం కాదు కాబట్టి, ఆన్ లైన్లో దొరికిన వాటిని సంబరపడి డౌన్ లోడ్ చేసుకోవడమే కానీ చాలా మందికి(నాతో సహా) పుస్తకాలు చేతిలో పట్టుకుని చదవడమే ఇష్టం, ఆన్ లైన్లోనో, సీడీలు డీవీడీలు చదువుకోవడం కంటే కూడా! అందువల్ల ప్రింట్ ఆన్ డిమాండ్ పద్ధతే నాకూ నచ్చింది.ఎన్నని ప్రింట్ చేయించుకుంటారు.. అంటే ఎన్ని కావాలంటే అన్ని చేయించుకోవచ్చుగా ఆసక్తి ఉన్నవాళ్ళు?
అసలు చందమామ వాళ్ళే పదేసి పుస్తకాలు పాత చందమామలు బైండ్లు చేయించుకున్నట్లు గానే కలిపి కూడా ప్రింట్ చేసి ఇస్తే ఇంకా బాగుంటుంది. క్వాలిటీ మాత్రం బాగుండాలి. అలాంటి హామీ ఉంటే నాలాంటి వాళ్ళ డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది.
మరి దీనికి చంపి లేమంటారో!
సుజాతగారు,
ముందుగా ఈ చంపి తరఫున వేనవేల ధన్యవాదాలు లింకులన్నీ ఒకచోట పెట్టినందుకు.. ఇక ఈ చందమామల బైండ్ పుస్తకాలు ఛందమామ వాళ్లే ప్రింట్ చేస్తే బావుంటుంది కదా. కంప్యూటర్ ముందు కూర్చుని చదివేకంటే హాయిగా మరమరాలు, జంతికలు, మొక్కజొన్నపొత్తులో లాగిస్తూ హాయిగా పుస్తకాలు చదువుకుంటే ఉన్న మజా ఎలా వస్తుంది. చందమామ పుస్తకాలకు సంబందించి ఎటువంటి సమాచరమైనా పంచుకోవలసిందిగా కోరుతున్నాను..
సుజాత గారూ మీ కోరిక ఫలించుగాక. పదేసి పుస్తకాలు కాదు ఒక సంవత్సరం చందమామ ప్రతులు కలిపి ఒకే సెట్‌గా తిరిగి ముద్రించడానికి చందమామ యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది. ప్రింట్ ఆన్ డిమాండ్ లేదా ప్రింట్ ఆన్ ఆర్డర్ వెనుక సారాంశం ఇదే. అంటే ఒక సంవత్సరంలో కొన్ని కాపీలు మీవద్ద ఇప్పటికే ఉన్నప్పటికీ మీ వద్ద లేని కాపీలు కావాలంటే మళ్లీ మీరు మొత్తం సంవత్సరం సెట్ తీసుకోవాల్సి ఉంటుందని నా అనుమానం, అది కూడా సామాన్యులకు అందుబాటులో ఉండేలా ధర పెడితే చందమామ అందరిదీ అవుతుంది. లేకుంటే పాత బంగారం కదా. తెలుగు వారు చందమామ పిచ్చోళ్లు కదా ఎంత పెడితే మాత్రం కొనక చస్తారా అనే అభిప్రాయంతో యాజమాన్యం ఉంటే మాత్రం మన చందమామ అందరికీ అందరని ద్రాక్షలాగే అవుతుందేమో మరి. ఇక క్వాలిటీ విషయం.. రీప్రింట్ చేస్తారు కాబట్టి ఒరిజనల్ క్వాలిటీయే ఇస్తారనుకుంటాను.
సాఫ్ట్ కాపీలని అమ్మకానికి పెట్టటం గురించి అబ్రకదబ్ర గారు చెప్పారు. నేషనల్ జియోగ్రఫికల్ సొసైటీ నూట పదేళ్ల సంచికలను సీడీలు, డీవీడీలలో ఇచ్చినట్లు చందమామను కూడా తీసుకురావడం. చందమామ అభిమానులు చాలా స్పీడ్‌గా ఉన్నారు. ఇలాంటి విషయాల్లో. కాని చందమామ మార్కెటింగ్ విషయంలో ఇప్పటికీ నత్తనడకతోనే ఉంటోంది. దాసరి సుబ్రహ్మణ్యం గారి సీరియల్స్ అన్నిటినీ విడి విడి పుస్తకాలుగా ప్రింట్ చేస్తే చందమామ అభిమానులకు పెన్నిధి దొరికినట్లే అవుతుందని నేను, చందమామ ప్రింట్ విభాగం అసోసియేట్ ఎడిటర్ బాల సుబ్రహ్మణ్యం గారు నొక్కి చెప్పాం. కానీ కామర్స్ ఈజ్ ప్రైమరీ అనే మార్కెట్ సూత్రం మా అభిప్రాయాలను పక్కన బెట్టేస్తోంది. ప్రస్తుతానికి ఎవరమూ ఏమీ చేయలేము. చూస్తూ ఉంటే మేం కూడా మీలాగే దొరికిన మేరకు చందమామలను డౌన్లోడ్ చేసుకోవడమే ఉత్తమం అని అనిపిస్తుంది చాలా సార్లు. త్రివిక్రమ్ గారిని పక్షం రోజుల ముందే ధైర్యం చేసి అడిగేశాను కూడా. మీలాంటి వారు ఎవరయినా పాత చందమామలను డౌన్లోడ్ చేసి ఉంటే మాకూ ఓ కాపీ పంపితే ఎంత బాగుంటుందో కదా.
రెండునెలలుగా చందమామ అభిమానులకోసం నెట్ గాలిస్తూ వస్తున్నా. ఈ బ్లాగ్ ఇప్పుడే చూస్తున్నా. ఇక రాత్రంతా జాగరణే నాకు. (జాగరణ ఎందుకో త్రివిక్రమ్, వేణు గార్లకు తెలుసు) ఇంకా ఎన్ని మంచి చంపిల బ్లాగులు తప్పిపోతున్నాయో. ఇప్పుడే శివరామ ప్రసాద్ గారు ఈమెయిల్ పంపి మరీ హెచ్చరించారు నేనూ రంగంలో ఉన్నానని. వారితో కమ్యూనికేట్ చేయవలసి ఉంది.
చందమామ అభిమానుల ఈ మెయిల్ ఐడీలు అన్ని ఎవరయినా సేకరిస్తే ఎంత బాగుంటుందో కదూ.. (వేణు గారితో డైరెక్టుగా కమ్యూనికేషన్‌లోకి వద్దామనుకుంటే రెండు నెలలుగా ఆయన మెయిల్ ఐడి దొరకటం లేదు. శివరామ ప్రసాద్ గారు చాలా మంచివారు. నా మెయిల్‌కే తన చిరునామా పంపేశారు. నా కొత్త చందమామ బ్లాగు
http://blaagu.com/chandamamalu/ ను ఆయన కూడలిలో చూసినట్లుంది. ధన్యవాదాలు.
తరాలు గడిచినా, గడుస్తున్నా ఆదరణ విషయంలో, ఆభిమానం విషయంలో పిసరంత కూడా తగ్గని మీ వంటి అభిమానులకు చందమామ నిజంగా రుణపడి ఉంది.
చందమామ అభిమానుల రుణం తీర్చుకోవడానికి ఆన్లైన్ చందమామ "మా చందమామ జ్ఞాపకాలు" పేరిట ఓ కొత్త విభాగం పాఠకుల కోసం రూపొందించింది. చందమామతో మీ అనుబంధం గురించిన మీ అందరి జ్ఞాపకాలు ఆ విభాగంలో చేర్చడానికి మీ అమూల్య సహకారం ఎంతైనా ఉంది. దాని గురించి ఇంటికి పోయాక రాత్రి మళ్లీ ఒక టపా రాస్తాను.
ప్రస్తుతానికి చందమామ ఆఫీసు సమయం ముగుస్తోంది. ఉంటాను
మనఃపూర్వక కృతజ్ఞతలతో..
రాజశేఖర రాజు
krajasekhara@gmail.com
;-)
పాత చందమామలను ‘ప్రింట్ ఆన్ డిమాండ్’ పద్ధతిలో అందజేయాలనే ఆలోచన వచ్చినందుకు చందమామ యాజమాన్యాన్ని అభినందించాలి. డిజిటల్ రూపంలో కంప్యూటర్ తెరపై రంగుల బొమ్మలను చూసుకోవటం బాగుంటుంది కానీ, సిస్టమ్ మీద పేజీలకు పేజీలు చదవటం కష్టమే.
‘పదేసి పుస్తకాలు పాత చందమామలు బైండ్లు చేయించుకున్నట్లు గానే కలిపి కూడా ప్రింట్ చేసి ఇస్తే ఇంకా బాగుంటుంది’ అని సుజాత గారన్నారు... విడి పుస్తకాల కంటే ఇలా చేయటం బెటర్.
దీంట్లో ఒక సమస్య ఉంది. ఒక బైండ్ పుస్తకంలో ఒక సీరియల్ ఉండకపోవచ్చు. రెండు బైండ్ పుస్తకాల్లో గానీ 18 భాగాలుండే జానపద సీరియల్ పూర్తవదు. పౌరాణిక సీరియల్ పరంగా చూస్తే... దాన్ని చదవాలంటే... మూడు నాలుగు బైండ్ పుస్తకాలు తిరగేయాల్సిరావొచ్చు.
ఇంతకంటే మంచి ఆలోచన ఏమిటంటే... బేతాళ కథలు, జానపద సీరియల్స్, పౌరాణిక సీరియల్స్, జాతక కథలు... ఇలా విడివిడిగా ఒక్కో సీరియల్ నూ పుస్తకాలుగా ప్రచురించటం. చందమామలో విడికథలను కూడా వరసగా సంకలనాలుగా తేవచ్చు (రంగుల బొమ్మలన్నిటినీ including full page illustration మంచి నాణ్యతతో ప్రచురించటం తప్పనిసరి షరతు).
చందమామ జానపద సీరియల్స్ ను సంకలనం చేసి అందించటం బ్లాగాగ్ని (ఫణి గారు) చేసిన అద్భుత ప్రయత్నం. బ్లాగాగ్ని కానుకలైన
కంచుకోట, ముగ్గురు మాంత్రికులు, తోకచుక్క, జ్వాలా ద్వీపం, మకర దేవత, విచిత్ర కవలలు నవలలు డిజిటల్ రూపంలో నా దగ్గర ఉన్నప్పటికీ వాటిని కలర్ ప్రింట్లు వేయించాలనే అత్యాశతో చాలాకాలం తాత్సారం చేశాను. కానీ అదెంత ఖరీదైన వ్యవహారమో తెలిసొచ్చాక... అయిష్టంగానే బ్లాక్ అండ్ వైట్ ప్రింటవుట్లు తీసుకుని, బైండ్ చేయించాను. బ్లాగాగ్ని ఈ మధ్యనే మరో ఏడు సీరియల్స్ ను అందించారు. వీటిని కూడా బ్లాక్ అండ్ వైట్ రూపంలో చూసుకునే అవసరం లేకుండా... ‘ప్రింట్ ఆన్ డిమాండ్’ మొదలైతే బావుణ్ణు.
@Praveen,
LOLOLOLOLOLOLOLOLOL.
వావ్ అద్భుతమైన సమాచారం సుజాత గారు. ఒకే టపా లో ఈ లింక్ లన్నీ కూర్చినందుకు ముందుగా మీకు, ఇంకా ఇంత విలువైన సమాచారాన్ని అందించిన బ్లాగ్ రచయితలు అందరికీ పేరు పేరు నా వేవేల ధన్యవాదాలు.
జాహ్నవి, విజయమోహన్,తృష్ణ,నీలాంచల, వినయ్ చక్రవర్తి,కొత్తపాళీ గార్లు
ధన్యవాదాలు!
మురళి,సత్యమేవ జయతే గార్లు,
ధన్యవాదాలు!
బ్లాగాగ్ని గారు,
మాలో ఈ అగ్ని రగిలించింది మీరేగా! మిమ్మల్ని తల్చుకోకుండా కథ ఎలా పూర్తి చేస్తాం చెప్పండి? మీ బ్లాగులో కామెంట్ రాసి సరిపెడితే బాగోదనిపించింది. అందుకే....టపా కట్టాను.
వేణు గారు,
మీ పాయింట్ నాకు నచ్చింది. పదేసి, పన్నెండేసి పుస్తకాలు బైండ్ చేయిస్తే కొన్ని సీరియల్స్ మిస్ అయ్యే అవకాశం ఉంది. మీరు సూచించినట్లు సీరియల్స్ విడిగా వేస్తే బాగానే ఉంటుంది.
రాజశేఖర్ గారు,
ప్రింట్ ఆన్ డిమాండ్ విషయంలో చందమామ చేస్తున్నది మంచి పనే! ఒక ఏడాదిలో వచ్చిన ఇష్యూలన్నింటినీ ఒకే ఇష్యూగా తీసుకురావడం మంచి వార్తే!క్వాలిటీ బావుంటే ఖరీదు కాస్త ఎక్కువ నిర్ణయించినా తీసుకుంటాం! తీసుకోక ఛస్తామా?
ఇక సాఫ్ట్ కాపీలను అమ్మకానికి పెట్టడం అంత లాభదాయకమైన పని కాదండి!ప్రతి ఇంట్లోనూ కంప్యూటర్ ఉన్న ఈ రోజుల్లో సాఫ్ట్ కాపీ ఒకరు కొంటే వంద దాన్ని పంచుకునే అవకాశం ఉంటుంది. అభిమానులు స్పీడుగా ఉన్నా, చందమామ యాజమాన్యం పుస్తకాలను మాత్రమే ప్రింట్ చేయాలనుకోవడం సరైన నిర్ణయమే!ఒకసారి ఈ విషయం గురించి ఆలోచించండి.
ఇకపోతే సాక్షాత్తూ మీరే చందమామలను డౌన్ లోడ్ చేసుకునే పరిస్థితి ఏమిటంటారు?
నా చిన్నప్పుడు చందమామతో ఎంత అనుబంధాన్ని పెంచుకున్నానో అటువంటి అనుబంధాన్ని తిరిగి మా పాప కూడా పెంచుకోవాలని,ఎప్పటికీ చెరిగిపోని ఆ జ్ఞాపకాలు తనకు కూడా మిగలాలని నా అభిలాష.అందుకే అన్ని లింకులనూ ఒకే చోట ఇస్తూ చందమామ మీది ప్రేమను మరోసారి అందరితో పంచుకోవాలనే కోరికే ఈ టపాకు మూలం! దీనికి వేణు చాలా సహాయం చేశారు లింకులు పంపించి! సాక్షాత్తూ చందమామే దిగొచ్చి ఇక్కడ వెన్నెల సంతకం చేసినంత ఖుషీగా ఉంది మీ వ్యాఖ్య చదువుతుంటే!
సంతోషం!
నేస్తం, మహేష్,రాజ్,జ్యోతి,వేణూ శ్రీకాంత్, గార్లు
థాంక్యూలు!
Murali మీరుచ్చిన వీర చంపి తాడు కి సంతోషం! నేను చదవడం వరకే! పైన చూశారుగా ఎంతమంది వీర చంపిలు, పరమ వీర చంపిలున్నారో!
ప్రవీణ్,
భలే చెప్పారు సుమా! :-))
గీతాచార్య,
:-))
కిరణ్మయి,
మీరు చాలా ఫాస్టుగా ఉండాలి మరి! నేనో పుస్తకం గురించి ఇలా రాసేయగానే అలా చదివేయాలి! :-)
పాత చందమామలు చదువరుల దగ్గరనుండి కొంత వెల తీసుకుని మళ్ళీ అచ్చు వెయ్యాలన్న అలోచన బాగానే ఉన్నది. చందమామవారు ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి పాత చందమామలన్నీ స్కాన్ చేయించి అందచెసారు, కృతజ్ఞులం. కాని, ప్రస్తుతం నెట్లో దొరుకుతున్న పాత చందమామల నాణ్యం ఏమాత్రం బాగాలేదు. కొన్ని, కొన్ని సంచికలలో అక్షరాలు అలికేసినట్టుగా కనపడుతున్నాయి. చందమామకు ప్రాణం బొమ్మలు. ఆ బొమ్మలు కూడ క్లారిటీతో స్కాన్ కాలేదు.ఆ స్కాను చేసినవాళ్ళకి కూడ తాము స్కాను చేస్తున్నవి ఏమిటో వాటి విలువ ఏమిటో తెలియని వాళ్ళులాగ ఉన్నారు. స్కాను చెస్తున్నా వాళ్ళమీద అజమాయిషీ, సూపర్విజన్ లేకుండా ఈ పని లాగించెసినట్టు కనపడుతున్నది.
రేపు రాబొయ్యే ప్రింట్ ఆన్ ఆర్డర్ లో కూడ ఇదే క్వాలిటీలో ప్రింట్లు ఇస్తే, అవి తీసుకోవటం అనవసరం. స్కానింగు బాగుండి(అక్షరాలు స్పుటంగా కనపడాలి, బొమ్మలు మంచి రంగులతో రిచ్ గా ఉండాలి)
నా ఉద్దేశ్యంలో పది పది కలిపి బైండ్లు కట్టి మరీ అమ్మటం కన్న, విడి సంచికలను, సంచిక ఇంత అని అమ్మటమే బాగుంటుంది.కాకపోతే, ప్రతి వ్యక్తి తప్పనిసరిగా ఇన్ని కాపీలు ఆర్డరు ఇవ్వలన్న నిబంధన పెట్టాల్సి రావచ్చును. చందమామ వారు అరోగ్యకరమైన లాభం వేసుకుని (వారికయిన ఖర్చుమీద) మనలాంటి అభిమానులకి అందిస్తే, వారికి లాభం, మనకూ, మన చిన్ననాటి నేస్తం మళ్ళీ మన చేతులలో పట్టుకుని చదువుకునే అవకాశం వస్తుంది.చందమామవారికి ఇదొక పరిమితమైన వ్యాపార అవకాశం. ఇప్పుడు పాత చందమామలకు ఉన్న గిరాకీ మరొక దశాబ్దం తరువాత ఉండకపోవచ్చు. కాబట్టి, సరసమైన ధరగనక పెట్టితే ఎక్కువమంది ఆర్డరు ఇచ్చి, టర్నోవర్ వల్ల ఎక్కువ లాభం వస్తుంది. లేదూ, వాటికి ఏదో exotic వస్తువు లాగ వెల పెట్టినట్టయితే, పెద్దగా ఆర్డర్లు రావు.
శివరామప్రసాదు కప్పగంతు
బెంగుళూరు, భారత్
wow! what a informative. I love to read those.. Thanks a lot Sujatha for sharing this...!!
As said by others, and big heads, it's a gr8 service you have done. Really I felt very happy. I downloaded the stories immediately. Thank you for that.
My father has a large collection of Chandamama, and other children monthlies. He collected some serials too. But unfortunately they were lost. Your post certainly helped many people like us. Also my wishes to all those persons who inspired you to write this post.
Dhanaraj Manmadha.
@Praveen Sharma,
So, I have nothing to fear.
The Indira Gandhi award is given to Bil Gates. Nelson Mandela celebrated his 91st Bday recently. Some news agencies feel that Obama and Hillary have differences in opinions regarding Indian subcontinent. Andrew Flintoff won the man of the match award in the second test for his matchwinning performance. That's all.
---> Reuters
ఈ టపా ఇంకా పూర్తిగా చదవలేదు. కానీ కలాం గారు బొమ్మలు చూసి ఆనందించగలరు కదండీ! :)
i think this is not related to chandamamalu and alll
but u can find lot of story books and novels here
just yesterday i cam across this........
mallepoolu.com
Very nice effort madam. Your post can justify the efforts of them. Congrats, and best wishes. Not to you, but to their passion.
Also thank you, for u.
చందమామ అభిమానులకు ..19.07.09 ఆదివారం ఈనాడు అనుబంధంలో ,చందమామలో ఎన్నో సీరియల్స్ వ్రాసిన "దాసరి సుబ్రహ్మణ్యం " గారి వివరాలు ఉన్నాయి ."జ్వాలాద్వీపం " మొ., సీరియల్స్ రాసింది ఆయనే .
satyamevajayate గారు,
ఈ వ్యాసం రాసింది "వేణువు" బ్లాగర్ వేణు గారే! ఆ వ్యాసం లింక్ కూడా ఈ టపాలో ఉంది చూశారా? మీరు సరిగ్గా గమనించినట్లు లేరు.
ఆలీబాబా నలబై దొంగలు download కావటం లేదు. సలహా ప్లీజ్.
రాపెడ్ షేర్ లో నేను సరిగ్గా అప్లోడ్ చెయ్యకపోవటం చేత కొన్ని ధారావాహికలు సరిగ్గా డౌన్లోడ్ కావటంలేదు. కాబట్టి నా బ్లాగుకు వచ్చి చూడండి, పాత అప్లోడ్ లు అన్నిటికి మళ్ళీ లింకులు ఇచ్చాను. ఆపైన కొన్ని కొత్త డౌన్లోడ్ లు కూడ ఉన్నాయి.
http://saahitya-abhimaani.blogspot.com/
శివరామప్రసాదు కప్పగంతు
బెంగుళూరు, భారత్
బ్లాగుల్లో పిల్లల నవలల (చందమామ, బాలజ్యోతి మొదలైన వాటిలో సీరియల్స్ వగైరా...) మీద బోలెడు చర్చ జరుగుతున్న నేపథ్యంలో ...
నాదగ్గరున్న ఒక "సిద్ధాంత గ్రంథం":
తెలుగులో బాలల నవలలు
డా. పసుపులేటి ధనలక్ష్మి
మోహనరూప పబ్లికేషన్స్, శ్రీకళహస్తి, డిశెంబర్,1986
ప్రతులకు (మరి పుస్తం వచ్చి 20 ఏళ్ళైపోయింది!)
డా. పి.వి. లక్ష్మి
కొండమిట్ట వీధి
శ్రీకాళహస్తి, 517644
బోలెడు data మాత్రం పై పుస్తకంలో దొరుకుతుందని మాత్రం చెప్పగలను :-)
-- శ్రీనివాస్
"ప్రింట్ ఆన్ డిమాండ్ విషయంలో చందమామ చేస్తున్నది మంచి పనే!" Is it true?
శ్రీనివాస్ గారూ
మీరు ఉదహరించిన పుస్తకంలో ఉన్న విషయాలు సంక్షిప్తంగా తెలియ చెయ్యగలరా. ఎందుకంటే బాల సాహిత్యం మీద "పెద్దలు" చెప్పే మాటలు నన్ను చాలా సార్లు భయపెట్టినాయి.
Install Add-Telugu widget button with ur blog, u can easily post ur articles on top Telugu social bookmarking sites & u get more visitors and traffic to ur blog.
Download from www.findindia.net
Madam Sujatagaroo,
Since I feel that you would surely see,I am writinghere as a comment, but it does nothave any link to the Article.
The other day,you had evinced interest in Lalita Geetaalu of AIR.
I found a website with a few songs, but I think of AIR, Hyderabad vintage. Following is the link:
http://mysite.verizon.net/res1wgre/index.html
Just listen to them, you may find some songs you are searching for.
Good Luck!
I invite Sujatagaru and everybody else who like Telugu Chandamama to join a Yahoo Group created by me.
You can join the above group by visiting my Blog link for which is given below:
http://saahitya-abhimaani.blogspot.com/
Just see on the right hand top where the link to join is given. The group is named CHANDAMAMA PRIYULU formed exclusively for Chandamama Fans for mutual benefit and sharing and not just coming and downloading.
SIVARAMAPRASAD KAPPAGANTU
FROM BANGALORE
Post a Comment