October 10, 2009

అటెన్షన్ లేడీస్..ఈ రోజు ఈనాడు వసుంధరలో మనం.....!










"బ్లాగులందు మహిళా బ్లాగులు వేరయా"అన్నట్లు(ఎవరైనా అన్నారా లేదా? అనే ఉంటార్లెండి)బ్లాగులు రాసే మహిళల సంఖ్యతో పాటు వాటిలో వైవిధ్యం కూడా పెరుగుతూనే ఉంది. అందుకే పత్రికల్లో తరచుగా బ్లాగుల ప్రసక్తి వచ్చినపుడు ప్రత్యేకించి మహిళల బ్లాగుల్ని గురించి పేర్కొనడం కూడా చూస్తున్నాం!


ఈ రోజు ఈనాడు "వసుంధర"లో ఆన్ లైన్ లో అక్షర  శరాలు సంధిస్తున్న తెలుగు మహిళా బ్లాగర్ల గురించి ఒక వ్యాసం వచ్చింది. అందులో కాస్త నా చెయ్యి కూడా పడింది.


ఎలా ఉంది?

బొమ్మల కొలువు దసరా అయిపోయాక పెట్టినట్లుంది కదూ!

55 comments:

Raj said...

:( :( :( :(

మా ఆఫీసులో ఈనాడు block చేసారు......

సిరిసిరిమువ్వ said...

వ్యాసం బాగుందండి.

మరువం ఉష said...

oh wow,I'm there :) Thanks a lot! Surprise news.... yey

నీహారిక said...

నన్ను మర్చిపోయారు కదా!! మీ సంగతి తర్వాత చెప్తాను!!!

swapna@kalalaprapancham said...

surprising, what abt my blog :). Thanks for info.

swapna@kalalaprapancham said...

ఆఆఆఆఆఆఆఅ నా బ్లాగ్ లేదు నేను ఒప్పుకోను :(((((((((((((((((((((

Unknown said...

బాగుంది వ్యాసం.

తృష్ణ said...

బాగుందండి.బాగా రాసారు.

సుజాత వేల్పూరి said...

నీహారిక,స్వప్న మరియు ఇతర బ్లాగ్మిత్రులు,

నాకు స్వేచ్ఛనిస్తే ప్రతి ఒక్క బ్లాగు గురించి ఇక్కడ ఉన్నంత వ్యాసం రాయాలని ఉంది. కానీ స్థలాభావ సమస్య ఒకటుంటుంది కదా! ఇంకా అక్కడ ఎడిటింగ్ కూడా జరుగుతుందని మీరు అర్థం చేసుకోవాలండీ! ఇంతకంటే ఏం చెప్పను? ఇంకా చాలా బ్లాగుల్ని ప్రస్తావించలేదనే అసంతృప్తి నాక్కూడా ఉంది.

Ramani Rao said...

సుజాతగారు: అభినందనలు

వర్గాలుగా విడిపోయి.. ఏవర్గం వారు ఆ వర్గానికి మాత్రమే కామెంట్లు రాసుకొంటూ మిగతావారు వారు చేస్తున్నా పనినే చేస్తున్నా కాని, ప్రోత్సాహంలేని నిరుత్సాహంతో బ్లాగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారినప్పుడు.. మీరు సమయానికి తగ్గట్లుగా "మహిళా బ్లాగులిదిగో " అంటూ మాంచి చేయుతనిచ్చినట్లుగా చాలా బాగుంది.

దసరా తరువాత బొమ్మలకొలువు (బ్లాగుల కొలువు) మరింకో బ్లాగుల దసరాని తలిపించేసింది .

ప్రచురించిన ఈనాడుకి వారికి ధన్యవాదాలు, సహకరించిన సుజాతగారికి మరో మారు అభినందనలు.

సుజాత వేల్పూరి said...

Ramani garu,:-))

Thank you!

వేణూశ్రీకాంత్ said...

వ్యాసం బాగుంది సుజాత గారు. గడ్డిపూలు సుజాత గారి టపా నేను మిస్ అయ్యాను ఇక్కడ చూసాక వెతికి మొత్తం మూడు భాగాలు ఇప్పుడే చదివాను.

అన్నట్లు స్కాన్ చేయాల్సిన పని లేకుండా ఈపేపర్ లో ఈ అర్టికిల్ బొమ్మ సేవ్ చేసుకోవచ్చండీ.. నేను అది మీకు మెయిల్ చేశాను, చూడండి.

బ్లాగాగ్ని said...

I was wondering why your blog wasn't mentioned in that list. Now I understood :) Well done Sujata garu.

Mahesh Telkar said...

అవును సుజాత గారు, ప్రొద్దున్నే పేపర్ లో మీ పేరు, బ్లాగ్ అడ్రస్ చూడగానే చాల సంతోషం వేసింది. నా హృదయపూర్వక అభినందనలు.

- మహేష్

Kathi Mahesh Kumar said...

మహిళాబ్లాగర్లందరికీ....అందరు బ్లాగర్లకీ అభినందనలు.

నేస్తం said...

ఎప్పుడూ వసుందర చూడని మా ఆయన ప్రొద్దున్న ,ప్రొద్దున్నే ఈనాడు లో వసుందర చదవడం ఏమిటొ,అందులో ఈ రోజే తెలుగు మహీళా బ్లాగుల గురించి వేయడమేమిటో,అందుకో నా పేరు లేకపోయేసరికి నన్ను అరనిమిషానికొక సారి ఫోన్ చేసి మరీ ఏడిపించడమేమిటో అంతా భ్రమ..
సుజాత గారు అభినందనలు మహిళల బ్లాగుల గురించి బాగా రాసారు ..నేను-లక్ష్మి గారి బ్లాగ్ ,వాలు కొబ్బరి చెట్టు సుభద్ర గారు,స్మృతుల సవ్వడి బ్లాగరు అబ్బో ఇలా గుర్తు తెచ్చుకుంటుంటే చాలామంది వచ్చేస్తున్నారు ..చాలా చక్కని బ్లాగులు మన బ్లాగ్లోకం లో ఉన్నాయి..మరి అందరి గురించి రాయాలంటే కుదరదుకదా ... అర్ధం చేసుకోగలరు లేండీ :)

padma said...

mee vyasam bagundandi. nenu poddunna papaer chusekane mee blog kosam vetiki oattukunna.

Chandra Latha said...

ఎందెందు వెతికినా అందందు కలమని మరొక మారు చక్కగా చెప్పినందుకు ..విపులంగా వివరించినందుకు.. మీకు ధన్యవాదాలు.
ఆపై,
బోలెడన్ని శుభాకాంక్షలు.
మీకు.మాకు.మనందరికీ..:-)

సుజాత వేల్పూరి said...

వేణూ శ్రీకాంత్,
థాంక్యూ వెరీ మచ్! మీరు పంపిన పేజ్ అప్ లోడ్ చేశాను.

నేస్తం,

మీ అవస్థే నాదీనూ! ఎందరో గుర్తొస్తున్నా..ఏమీ చేయలేకపోయాను. మరో సారి అవకాశం ఉంటే ఇప్పుడు ప్రస్తావనకు రాని బ్లాగులన్నింటిని గురించీ రాస్తాను.

సుజాత వేల్పూరి said...

@thika...
రేపు మళ్ళీ నా బ్లాగులో! :-))

sunita said...

బాగుందండి.బాగా రాసారు.

Anonymous said...

అయితే నేనూ ఒక పది రెసిపీ పుస్తకాలు, రామాయణం, భారతం పక్కనెట్టుకుని పదో పెన్నెండో బ్లాగులు మొదలెడతానండీ!

మాలతి said...

చాలా బాగుంది వ్యాసం సుజాతా. మరియు ధన్యవాదాలు. ఏదో పిల్లకారు బ్లాగరులనే కాక ఆడవారయిన పెద్దలు కూడా చక్కనిరచనలు చేయగలరని విశదం చేసినందుకు.
వేణూశ్రీకాంత్ గారూ, పేపరులో పేజీ ఎలా దాచుకోవచ్చో నాక్కూడా ఇవ్వగలరా, థాంక్స్

bonagiri said...

ఆడాళ్ళూ మీకు జోహార్లు.

Anonymous said...

మీరింతకి తెగిస్తారనుకోలేదండీ సుజాతగారూ .....నా మాట్టుకు నేను గుట్టుగా బ్లాగుకుంటుంటే నన్ను పేపర్కీడ్చారు . నా భయం అంతా మావారిగురించే. విషయమేంటంటే ......మా వాళ్ళంతా కాంగిరీసు వీరాభిమానులు . పోయిన ఎలక్షన్లలో మావారితో లోక్ సత్తాకి ఓటేయించి బయటికొచ్చి హస్తంగుర్తుకే మనఓటు అని బిల్డప్పు ఇచ్చాం. నా వ్యతిరేకతంతా నా బ్లాగులో వెళ్ళబోసుకుంటున్నాను.( నాకో బ్లాగున్నట్టు అందులో నేను ఇలాంటిరాతలు రాస్తున్నట్టూ మావాళ్ళెవరికీ తెలీదు) ప్రొద్దున్న పేపర్లో పేరు చూసుకున్న ఆనందంలో నేనే..అదినేనే , అని అందరికీ చెప్పి బ్లాగు లింక్ ఇచ్చేసేను. పాపం సాయంత్రం మా వంశస్తులంతా మీటింగ్ పెట్టి మా వారిని ఉతికి ఆరేస్తారేమో అని భయంగావుంది. అలాంటిదేమైనా జరిగితే మీదేపూచీ. ( అంతా వుత్తుత్తినే .....మీకు నో థేంక్స్ ....మరిమీరు వద్దన్నారుగా)
మరో విషయవండోయ్...... మన సమాజంలో వున్నాట్టే బ్లాగుల్లో కూడా రాజకీయాలమీద ఆసక్తి చూపించే మహిళలూ ...వారి టపాలూ తక్కువే అని నాఉద్దేసం . ఆ అంశంలోకూడా మహిళా బ్లాగరులు తమ సత్తా చాటాలని నా కోరిక .

Bolloju Baba said...

good work
congrats

సుజాత వేల్పూరి said...

లలితా, అదిగో మళ్ళీ నవ్విస్తున్నారు!

మురళి said...

బాగుందండి...

అడ్డ గాడిద (The Ass) said...

tension padaru madam. tandrats. ada gaadida gari niluvandanalu.

Your write up is also nice.

Dhanaraj Manmadha said...

indulo pramukha blogger, vanda paina comments kottina Sujatha gari blog gurinchi lekapovatam anyayam ani manavi chesukuntunnam. idantha narasaraopeta vyatireka vargala kutra ani janam anukuntunnarani sakshi tv lo vachhindi.

ee sandarbhamgaa, nirvahinche goppa bahiranga dharnaki janamantha chinaki tharali raavaalsindi gaa pilupunisthunnam. jai telangana! jai janmabhumi! jai soniya! jai shanghai!!!

:-D

Congrats 2 all the lady bloggers.

As telugu is not available, and unable to get, written in TengLiSh. Sory for the inconvenience.

నీహారిక said...

లలిత గారు,
నేనున్నాను.మీలాగా హాస్యంగా వ్రాయలేను కానీ రాజకీయాల గురించి వ్రాస్తున్నాను.

సుజాత వేల్పూరి said...

ధనరాజ్,

మొదటగా వంద కామెంట్లు కొట్టింది నేనే అయినా నా రికార్డు బద్దలైపోయిందిలెండి ఆ తర్వాత!

నరసరావు పేట వ్యతిరేక వర్గాలా? అమ్మో ఆలోచించాల్సిందే!

నా బ్లాగు గురించి ఇంతకు ముందు ఈనాడులో రివ్యూ వచ్చింది. పైగా ఈ వ్యాసంలో నా చేయి(పోనీ కలం..లేదా కీ బోర్డు) కూడా ఉంది కాబట్టి మన గురించి మనం చెప్పేసుకుంటే బాగోదు మరి!

చైనాలో బహిరంగ సభకి మేమంతా రావడం ఏమిటో, దానికి మీరు పక్షపాతం లేకుండా జై కొట్టడం ఏమిటో, మధ్యలో జగనన్న టీవీ పాత్ర ఏమిటో..అది సరే,
ఇప్పుడు అక్కడ టైమెంత?

థాంక్యూ లు, అభినందనలకి!

వేణూశ్రీకాంత్ said...

మాలతి గారు ఏ వార్తా పత్రిక అయినా మాములు వెబ్ పోర్టల్ కాకుండా ఈ-పేపర్ లింక్ కోసం వెదకాలండీ సాధారణం గా వాళ్ళ హోమ్ పేజ్ లోనే ఈ లింక్ ఇస్తారు. ఉదాహరణకు ఈనాడు వారిది http://epaper.eenadu.net/login.php ముందుగా ఈ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి. ముఖ్య వార్తా పత్రికలు అన్నీ కూడా ఫ్రీ రిజిస్ట్రేషన్ ఏ ఉంటాయి.

రిజిష్టర్ చేసుకున్నాక లాగిన్ అయితే పేపర్ మాములు ప్రింట్ లో కనిపించినట్లే వస్తుంది. ఎడమ వైపు పేజీలు అన్నీ Thumbnails ఉంటాయి అందులో మనకు కావాల్సిన పేజ్ క్లిక్ చేస్తే అది మెయిన్ విండోలో ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ పై మౌస్ పాయింటర్ మూవ్ చేస్తే ఒకో వ్యాసం ఒకో లింక్ గా కనిపిస్తుంది. మీకు కావాల్సిన వ్యాసం పై క్లిక్ చేస్తే అది వేరే విండో లో పెద్దగా ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అయిన విండో లో వ్యాసం పై రైట్ క్లిక్ చేసి వచ్చిన మెను బార్ లో సేవ్ పిక్చర్ యాజ్ ఆప్షన్ పై క్లిక్ చేసి దాన్ని మీకు కావాలిసిన పేరు తో jpg extension తో సేవ్ చేయండి like XYZ.jpg.

Anil Dasari said...

బ్లాగుల కబుర్లు, బ్లాగర్ల పరిచయాలు బాగున్నాయి. అభినందనలు.

@రమణి:

>>"వర్గాలుగా విడిపోయి.. ఏవర్గం వారు ఆ వర్గానికి మాత్రమే కామెంట్లు రాసుకొంటూ మిగతావారు వారు చేస్తున్నా పనినే చేస్తున్నా కాని, ప్రోత్సాహంలేని నిరుత్సాహంతో బ్లాగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారినప్పుడు.."

వర్గాలేమీ లేవండీ. ఉగ్రవాదుల ధాటికి వెరచి, ఎక్కడ ఏం రాస్తే ఎవరు మొరుగుతారో అన్న భయంతో మౌనంగా చదివి ఊరుకుంటున్నారు చాలామంది. అంతే. బ్లాగుల భవిష్యత్తుకేమీ ఢోకా లేదు. పాతవాళ్లు వెళ్లిపోయినా, కొత్త నీరు వస్తూనే ఉంటుంది.

Ramani Rao said...

@ వేణు గారు చాలా థాంక్స్ మంచి సమాచారమందించారు, నేను కూడా నేర్చుకొన్నాను.

Bhardwaj Velamakanni said...

U didnt write about yourself .hmmm .. but well written

ప్రియ said...

;-)

Shiva Bandaru said...

బాగుందండి మీ ప్రయత్నం

Malakpet Rowdy said...

తన్ననంటే ఒక విషయం చెప్పాలని ఉంది - దీనికి కాగడా పేరడీ ఏమి రాస్తాడో అని :))

పారిపోతున్నా దొరకకుండా

Swapna said...

Hi... Sujatha... I felt so happy to read the article in Eenadu today. All the blogs you have listed there are really intresting. And the most amazing thing is to read your blog. Thanks for letting me/readers discovering it. I am pakka telugu girl, but I am comfortable in writing in English. If u r intrested...
My blog: http://swapnadreams.blogspot.com

సుజాత వేల్పూరి said...

వ్యాఖ్యాతలందరికీ థాంక్యూలు!

మహేష్ ఖన్నా గారు,థాంక్యూ!
మీరు మీ బ్లాగును జులై తర్వాత అప్ డేట్ చేయలేదు, కూడలికి కలపనూ లేదు, ఎంచేత?

కిరణ్ కుమార్ గారు,:-))
ఆల్ ది బెస్ట్! ఎదురు చూస్తుంటాం, కొత్త బ్లాగుల కోసం!

అ.గా గారు,
మీ కామెంట్ లో మొదటి లైను నాకర్థం కాలేదండీ!

అబ్రకదబ్ర,రమణి గారి కిచ్చిన జవాబు చాలా బాగుంది.సరిగ్గా చెప్పారు.

భరద్వాజ్,
నా గురించి ఇంతకు ముందు ఈనాడు వాళ్ళు రాసేశార్లెండి.

మలక్పేట్ రౌడీ,
:-))! ఆగండి,పారిపోకండి, మాట!

స్వప్న,
మీ బ్లాగు చూస్తానండీ!

చదువరి said...

బాగా రాసారు.

అడ్డ గాడిద (The Ass) said...

atension ladies annaru kada. andukani tension padaru annanu

Ramani Rao said...

అబ్రకదబ్రగారు : నో కామెంట్స్ .. జరిగిన , జరుగుతున్న కొన్ని సంఘటనల నేపధ్యంలో రాసిన కామెంట్ అది. కొత్తనీరు విషయంలో మీతో ఏకీభవిన్స్తున్నాను. :))

సుజాత వేల్పూరి said...

A. gaa, gaaru
Oh...got it! Thank you! :-))

జ్యోతి said...

సుజాతగారు,
వ్యాసం చాలా బాగా వచ్చింది. అభినందనలు..

Dhanaraj Manmadha said...

సమయమిప్పుడు సాయంత్రం 4:52

మధురవాణి said...

సుజాత గారూ,
అదరగొట్టేసారండీ.! వ్యాసం చాలా చాలా బాగుంది. చాలా balenced గా చక్కగా రాశారు.
శుభాభినందనలు :)

భావన said...

సుజాత గారు,
థ్యాంక్స్ అండి నా బ్లాగ్ ను కూడా ప్రస్తావించినందుకు....

రమణ said...

బాగా వ్రాశారు.

కొత్త పాళీ said...

good show.

$h@nK@R ! said...

Congrats !!!

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

అక్షరతూణీరాలు అనే వాడుక ఉనికిలో లేదు. ఎందుకంటే తూణీరమంటే బాణాలు దాచుకునే పొది మాత్రమే. దాన్ని సంధించరు. బాణాల్నే సంధిస్తారు.

-- తాడేపల్లి

సుజాత వేల్పూరి said...

తాడేపల్లి గారూ,
మీరు చెప్పింది నిజమే! పొరబడ్డాను. వసుంధర వ్యాసంలో ఇప్పుడు సరి చేయడం అసాధ్యం కాబట్టి, టపాలో మార్పు చేశాను. సవరణకు ధన్యవాదాలు!

రవి said...

మహిళా బ్లాగుల పరిచయం బావుంది.

Post a Comment