January 16, 2010
ఈనాడులో తెలుగోడు.... అబ్రకదబ్ర!
బ్లాగ్లోకంలో తెలుగోడంటే అబ్రకదబ్రే! పరిచయం అవసరం లేదు.
బ్లాగర్ నుంచి కథా రచయిత ప్రమోషన్ తెచ్చుకున్న ఈ అసలు సిసలు తెలుగోడిని బ్లాగ్లోకంలోనే కాక తెలుగు పాఠక ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నంగా.... బుల్లి సమీక్ష ఈనాటి....ఈనాడులో!
ఇంత మంచి రచయితను తెలుగు పత్రికలు నిజంగా మిస్ అవుతున్నాయని నా అభిప్రాయం. ఈ మాట ఇక్కడెందుకు రాశానంటే ఈ లైను ఈనాడు రివ్యూలో ఎడిట్ అయిపోయింది మరి!
అనిల్...ది అబ్రకదబ్ర........!
మీ బ్లాగును ప్రపంచం నలుమూలలా అసంఖ్యాక పాఠకులు చదవాలనీ,మీరు ఈ వూపుని కొనసాగిస్తూ ఎన్నెన్నో మంచి టపాలు రాసి అందర్నీ అలరింపజేయాలని,త్వరలో మీ బ్లాగు లక్ష హిట్ల మైలు రాయిని దాటాలనీ...ఎన్నెన్నో మంచి కథలు సృష్టించి తెలుగు సాహితీ ప్రపంచాన్ని సస్యశ్యామలం చేయాలనీ(అబ్బ, మరీ పొయెటిక్ గా రాసేస్తున్నా కదూ)కోరుతున్నా!
14 comments:
అబ్రకదబ్ర కి అభినందనలు.
Congratulations abrakadabra
Abrakadabra deserves this! Congratulatios sir!
అనిల్ గారికి అభినందనలు. ఈ ప్రస్థానం ఇలాగే కొనసాగాలని కోరుకునంటున్నాను.
Congratulations.Great.
అబ్రకదబ్ర గారికి అభినందనలు తెలుపుతూ తన రచనా ప్రస్థానం అప్రతిహతంగా సాగాలని కోరుకుంటున్నాను. ఆయన బ్లాగు తరచు గా ఫాలో అయ్యే వారికి ఆయన సకల కళావల్లభుడన్న విషయం తెలుసే ఉంటుంది.
నిజమే తన బ్లాగుకు ఇది మరీ బుల్లి సమీక్ష కానీ ఉన్న కాస్త స్పేస్ కూడ సమర్ధవంతంగా ఉపయోగించుకుని బాగా రాశారు సుజాత గారు.
Thank you; Thank you all :-)
"తెలుగోడు" అబ్రకదబ్ర గారికి అభినందనలు...
అబ్రకదబ్ర గారికి హృదయపూర్వక అభినందనలు..
అంత చిన్న కాలంలో విభిన్న అంశాలుండే తెలు'గోడు' లాంటి ఒక బ్లాగుని సమీక్షించాలంటే కాస్త కష్టమైనే పనే! ఆ పనిని ఎంతో సమర్ధవంతంగా చేసిన సుజాత గారికీ అభినందనలు! :-)
congratulations అబ్రకదబ్ర
సుజాత గారు. నా బ్లాగ్ తిక్క తిక్క గా ప్రవర్తిస్తోంది అందుకే మీ కామెంట్ కి రిప్లై చెయ్యలెదు
2007 నుంచి వికీపీడియా ద్వారా కంప్యూటర్ లో తెలుగుతో పరిచయం ఉన్నా 2009 జూన్ లో నేను బ్లాగు లోకంలోకి రావడానికి ఒక బలమైన కారణం అనిల్ గారి బ్లాగు. యథాలాపంగా బ్లాగులు చూస్తున్న నన్ను ఆయన రచనా శైలి నన్నెంతగానో ఆకట్టుకుంది.
ఆయన ప్రతిభకిది చాలా చిన్న అచీవ్ మెంటే... ఆయన మరెన్నో ఉన్నత శిఖరాలని అధిష్టించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
అభినందనలు
చాలా సంతోషం. అబ్రకదబ్రకి అభినందనలు. తెలిపినందుకు మీకు నెనర్లు.
ఆ మధ్యన రెండు మూడు పత్రికల్లో క్రమం తప్పక బ్లాగుల్ని పరిచయం చేసే వాళ్ళు, ఇంకా వస్తున్నాయా ఈ పరిచయాలు?
కొత్తపాళీ గారూ,
పత్రికల్లో వారికి కూడా చాలామందికి బ్లాగులంటే ఏమిటో తెలియదంటే నమ్ముతారా? అలా ఉంది పరిస్థితి!
మంచి బ్లాగుల్ని పరిచయం చేసే పనిలోనే ఉన్నాను ఇప్పుడు. త్వరలో మరికొన్ని బ్లాగులు.
Post a Comment