February 10, 2010

అందమైన ఫొటోలు !

 photography is all about timing! నిజమే అని ఈ ఫొటోలు చూసి ఒప్పేసుకోవాలి!

ఫొటోగ్రఫీ అంటే నాక్కూసింత సరదానే! డిజిటల్ కెమెరా కాదని , ఎస్సెల్లార్ లో ఫిల్మ్ రోల్స్ చాలా తగలేస్తూ ఉంటా. కాసిన్ని మంచి ఫోటోలు కూడా తీశాను. తర్వాతెప్పుడైనా చూపిస్తాలెండి!
నా బ్లాగు క్రమం తప్పక చదివే ఒక ఫ్రెండ్ ఈ ఫొటోలు నిన్న పంపారు నాకు. అద్భుతమనే మాట చాలదు.ఇంత పవర్ ఫుల్ కెమెరా కొనడానికి ఎంతవుతుందో , నేనెప్పుడు కొంటానో, నాకెప్పుడు ఇంత స్కిల్ వస్తుందో..ఏమిటో..అంతా మాయ!


.ఈ ఫొటోలు ఇంతకు ముందు మీరు చూసుంటే సరే, చూడకపోతే ఒకసారి .......!ఫొటోలు పంపిన ఫ్రెండ్ కి థాంక్యూలు!
                                                         I'm a disco dancer....!

                                         ఎంతైనా అమ్మ వొడి భలే వెచ్చగా ఉంటుంది కదండీ!
                                               ఏమిటింతాలస్యం? ఆకలి దంచేస్తోంది

                   There is no excuse for lazyness here! But I'm working on that!

ఎంత ముద్దొస్తున్నావో తెలుసా! హు, మా పిల్లలూ ఉన్నారు, ఇంతింత మెడలేసుకునీ....


ఇట్నుంచి తీసినా వస్తుందా పొటిగరాఫు?


                                             అద్దిరా దెబ్బ! జాక్ పాట్ కొట్టానివ్వాళ!                        

          
                                               అమ్మతోటే ఉంటాము.. అమ్మ మాటే వింటాము!
                                              బాబోయ్, అరుపులా ఆవలింతలా?

                                             నేనూ మీతోనే ఉంటా..!                                                ఆవురావురు...!

                                           Mow, Curly, and Larry..the three stooges!
                                                      తువ్వాయి తువ్వాయి...!
                                                కాసేపు పిచ్చాపాటీ కబుర్లాడుకుందాం!


                                                    వదల బొమ్మాళీ వదల!                                           సెలవుల్లో సరదాగా జిమ్నాస్టిక్స్ నేర్చుకుంటున్నా! 
అయ్యో పప్పోతున్నా! హెల్ప్ హెల్ప్!వీళ్ళమ్మ షాపింగ్ నుంచి వచ్చేదాకా బుజ్జి ముండ నా దగ్గరే ఉంటుందిలెండి!

నేనూ నేర్చుకుంటా, ఫుడ్డు సంపాయించుకోడం!


ఆటాడుకుందాం రా !


34 comments:

vineela said...

photo lu vatiki meeru pettina comment lu super vunnai andi.

లలిత said...

ఆహా అద్భుతం, ఫొటోలు వాటి వ్యాఖలు "వజ్ర వైఢూర్యాలు" అంటారే అలా...
భలేభలే... మొదటి వ్యాఖ్య నేనే వేసానోచ్...... ( ఎప్పటినుంచో కోరిక)

శ్రీనివాస్ said...

outstanding, amazing thanks to the original photographer and up loader :)

నేస్తం said...

పొటొస్ సంగతి సరే కాని క్రింద వ్యాక్యలు కూడా అబ్బో సూపరండి..అయ్యో పప్పోతున్నా ..హ హ భలే :)

రఘు said...

very nice photos and comments

MahaNagarjuna said...

Agree with our thoughts "when I'll buy an DSLR, when I'll take shots like these..."

cbrao said...

ఛాయా చిత్రాలు, వ్యాఖ్యలు రెండూ బాగున్నాయి. మీరు తీసిన చిత్రాలు ఎప్పుడు చూపిస్తున్నారు?

రవిగారు said...

వొపిక వున్టేనె ఇలాన్టీ ఫొటొస్ దక్కెది.గుడ్ షొ.

VillageMonkey said...

chala bagunnayi mee photos ..

శేఖర్ పెద్దగోపు said...

ఫోటోలు చాలా బాగున్నాయండి..వాటి క్రింద మీ వ్యాఖ్యలు కూడా...ఎస్సెల్లార్ కెమెరా అంటే??

sunita said...

ఫోటోలు, వ్యాఖ్యలు రెండూ చాలా బాగున్నాయి.

Enaganti (ఇనగంటి) Ravi Chandra (రవిచంద్ర) said...

నాదీ అందరి మాటే....ఫోటోలు వ్యాఖ్యలు రెండూ దేనికవే సాటి.
మీరు తీసిన ఫోటోలు ఈ వారాంతంలో జరిగే ఈ-తెలుగు సమావేశానికి తీసుకురండి చూస్తాం.

స్రవంతి said...

చాలా బాగున్నాయి అన్ని ఫొటోస్, ట్యాగ్ లైన్స్ తో సహా.'అమ్మ తోటే ఉంటాము ..అమ్మ మాటే వింటాము' అయితే నీళ్ళ లో ప్రతిబింబం తో చాలా బాగా వచ్చింది.

సుజాత said...

శేఖర్ పెద్దగోపు,
SLR అంటే Single Lense Reflex కెమెరా అండీ! అనుకున్న ఆబ్జెక్ట్ ని ఖచ్చితంగా పట్టుకోడానికి ఈ కెమెరా చాలా ఉపయోగిస్తుంది.! ఫోకస్,జూమ్ జాగ్రత్తగా అడ్జస్ట్ చేయడం తెలిస్తే అద్బుతమైన ఫొటోలు సృష్టించవచ్చు.

మధురవాణి said...

వావ్.. అద్భుతమైన ఫోటోలు.. అంతే అందమైన మీ వ్యాఖ్యలు :)

అక్షర మోహనం said...

Sahajam inta CHITRAMgaa vuntundaa?
prati photo poetic ga vundi.
choosenule naa kanule choodani vintaa..!

సుజాత said...

అక్షర మోహనం గారు,
మీ వ్యాఖ్య చాలా కవితాత్మకంగా ఉంది.

neelaanchala said...

"పప్పోతున్నా" ..సూపర్!

"మా పిల్లలూ ఉన్నారు,,ఇంతింత మెడలేసుకునీ.." ఫొటోలన్నీ సూపర్! captions ఇంకా సూపర్.

Rani said...

excellent photos.

వేణు said...

వండర్ ఫుల్! మెరుపు వ్యాఖ్యలు ఫొటోల అందాన్నీ, విలువనూ మరింతగా పెంచేశాయి.

కొత్త పాళీ said...

cute pics and cuter captions

నిషిగంధ said...

క్యాప్షన్స్ అన్నీ భలే ఉన్నాయి :))

vasu said...

photographer kastaniki & krushi ki na sirassu vanchi namaskaristunnanu... VASU

వేణూ శ్రీకాంత్ said...

హ హ :-) ఫోటోలు వాటికి ఇచ్చిన క్యాప్షన్స్ వేటికవే అన్నట్లు చాలా బాగున్నాయండీ.

స్ఫురిత said...

హెలో సుజాత గారు,

ఎప్పట్నుందో మీ బ్లగు చదువుటున్నా, ఎప్పుదూ వ్యాఖ్యలు రాయలేదు. ఫొటొలు వాటికి సరిగ్గా అతికినట్టున్న మీ వ్యాఖ్యలు చాలా బాగున్నాయండి. నేను ఈమధ్యనే ఒక బ్లాగు start చేసా. ఒక్కసారి చూసి పెట్టరూ.
http://naarathalu.blogspot.com

స్ఫురిత

Mahesh Telkar said...

చాలా మంది అన్నట్టు మీ కామెంట్స్ ఫొటోలకి మరింత ప్రత్యేకతను చేకూర్చాయి .. Thanks for Sharing :-)

అన్నట్టు నాకూ ఫోటోగ్రఫి అంటే ఇష్టం ... వ్రాయటం కన్నా ఫోటోలు తీయడం సులభమేమో అని నా అభిప్రాయం :-)

అబ్రకదబ్ర said...

ఎస్సెల్లార్ కోసం ఫిల్మ్ రోళ్లు తగలేయటం ఎందుకూ? డిజిటల్ ఎస్సెల్లార్స్ వచ్చి దశాబ్దం దాటింది :-) మీదే బ్రాండో తెలీదు కానీ, అదే బ్రాండ్ dSLR బాడీ మాత్రమే కొని పాత ఫిల్మ్ SLR లెన్సులు వాడేసుకోవచ్చు. పనిలో పనిగా ఓ మాక్రో అడాప్టరో, లెన్సో కొనేస్తే ఆ పురుగూ పుట్రా క్లోజప్పులో తీసేసి తరించిపోనూ వచ్చు :-) :-)

సుజాత said...

అబ్రకదబ్ర , నా కెమెరా నైకాన్! అది నేను అమెరికాలో ఉన్నపుడే దానికోసం మొత్తం 1300 డాలర్లు వెచ్చించి ఎక్ స్ట్రా ఫ్లాషూ, ఎక్స్ టెండెడ్ లెన్సూ, ఇవన్నీ పెట్టడానికి స్ట్రాలీ సైజు బాగ్ ఇలాంటి ఎక్సెసరీలన్నింటితో కలిపి ఒక వెబ్ సైట్లో(www.aaa camera.com ) కొన్నాను. అప్పటికి డిజిటల్ కెమెరాలు రాలేదనే గుర్తు. వస్తే అదే కొనుండేదాన్నిగా (ఇంత డబ్బూ తగలేస్తూ అక్కడ వెనకాడ్డం ఎందుకు చెప్పండి?)

మేముండేది sams club కి కూత వేటు దూరంలో కాదు, ఇండియాలో అని మీరు గుర్తు పెట్టుకోవాలండీ!ఇక్కడ బాడీలు మాత్రమే అమ్మే సౌలభ్యం కనీసం హైదరాబాదులోనూ, బెంగుళూరు,ఢిల్లోలోనూ(మూడు చోట్లా ప్రయత్నించాను) లేదింకా!నైకాన్ షో రూమ్ ని కూడా సంప్రదించాను.


అందువల్ల ఇదిలా ఇంట్లో గుండెల మీద కుంపటిలాగా ఉండగానే మరో కెమెరాకి డబ్బు పెట్టడానికి మనసు రాయి చేసుకోలేదింకా! అసలే రెసిషను! (ఇది కాక మరో కెనాన్ డిజిటల్ కెమెరా,వీడియో కెమెరా,మరో కెమెరా....కొన్నాగా! ఇక చాలు)

Raj said...

sujatha gaaru,

inka ekkuva konte mee srivaaru bettam theesukune prayathnam chesthaaremo ;)


lalitha gaaru:
ee saari kuda meeru first kaadhu anukunta.... malli prayathnimchandi... all the best...

సుజాత said...

Raj గారూ,
చాలా వరకూ మా ఇద్దరి హాబీలూ కలుస్తాయండీ! అందువల్ల నాకై నేను విరమించుకోవాలే గానీ తను బెత్తం తీసుకునే భయం లేదు.ఇంకా చెప్పాలంటే నా కంటే తనకి ఖరీదైన హాబీలున్నాయి గోల్ఫ్,స్నూకర్ లాంటివి. ఇప్పుడు చెప్పండి బెత్తం ఎవరు తీసుకోవాలో!:-))

pandu said...

photos are very good, Simply super

Raj said...

మీరు ఈ టపా రాసిన తదుపరి వారం ఆంధ్రజ్యొతి ఆదివారం పుస్తకంలో ఇవే Photos publish చేసారు.... చూసారా?

ellanki.bhaskaranaidu said...

wonderful photos. there is no comparison to them. simply super. thanks.

hima said...

nenu me kottha abhimaninadi. me photos coments katti chala bavunnayi

Post a Comment