April 26, 2010

అమ్మయ్య, అశ్లీల నృత్యాల "ఆట" కట్టు! తల్లిదండ్రులకు HRC చీవాట్లు!

అనుకున్నంతా అయింది.మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ సుభాషణ్ రెడ్డి రియాలిటీ షోల్లో అశ్లీల నృత్యాలు చేసే పిల్లల తల్లిదండ్రుల్ని ముక్క చీవాట్లు పెట్టారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి రియాలిటీ షోలని నిలిపేయాలని ఛానెళ్ళకు వార్నింగ్ ఇచ్చారు. రోగం బాగా కుదిర్చారు.మూడురోజుల క్రితం సాధన, మరికొన్ని ప్రజా సంఘాలు ఒక మంచి నిర్ణయం తీసుకుని పసి పిల్లల చేత ఐటమ్ సాంగ్స్ కి అశ్లీల నృత్యాలు చేయిస్తున్న ఛానెళ్ళ మీద కమిషన్ కి ఫిర్యాదు చేశారు.

ఒక తెలుగు ఛానెల్లో   వస్తున్న "ఆట" జూనియర్స్ లో మొదటి ప్రైజు కొట్టేసిన పాపట, ఈ మధ్య ముఖ్యమంత్రి రోశయ్య గారిక్కూడా ఏదో సభలో తెగ ముద్దొచ్చేసింది.(రీతికో, గీతికో ఏదో ఉండాలి..పేరు)ఆ పాప వేసే స్టెప్పులూ, భంగిమలూ, మొహంలో చూల్పించే హావభావాలూ ఏ స్థాయిలో ఉంటాయో ఖర్మ గాలి ఒకరోజు చూశాను. మొమైత్ ఖానూ మరొకరూ మరొకరూ వచ్చి ట్యూషన్ చెప్పించుకోవాల్సిందే!

 "ఆట" వచ్చే సమయానికి ఎవరింటికైనా పొరపాటున వెళ్ళామంటే అక్కడ మనల్ని పలకరించే దిక్కు కూడా ఉండదు. తల్లి దండ్రులూ, పిల్లలూ కూడా అందులో లీనమైపోయి చూస్తుంటారు.

ఈ కార్యక్రమానికి యాంకరూ, ప్రొడ్యూసరూ,డైరెక్టరూ, కాన్సెప్ట్ మేకరూ అయిన ఘీంకార్ మాట్లాడే తెలుగు వింటేనే డోకొస్తుంది. ఆ చెత్త తెలుగుతో ఆయన పిల్లల్ని ఉత్సాహ పరిచే తీరు చెప్పుకోదగ్గది.

 ఘీంకార్ వేసే వెధవ్వేషాలూ,ఒక పక్కన కూచుని వెకిలి వాగుడువాగే మెంటార్లూ,ఇంత గరిష్ట స్థాయిలో అశ్లీల మైన స్టెప్స్ కంపోజ్ చేసిన కొరియోగ్రాఫర్లు, "నేనే గనక వయసులో ఉంటేనా, నీతో స్టెప్పులేయాలని ఉందే పాపా"(I'm sorry to write these words) అంటూ జడ్జి ప్లేసులో కూచుని వూగిపోతూ పిచ్చి వాగుడు వాగే ముసలి తొక్కులైన మాజీ డాన్స్ మాస్టర్లూ....

వీళ్ళు కాదు అసలు నేరస్థులు!

పిల్లలు ఇలాంటి అశ్లీలమైన డాన్సులు చేసైనా సరే చేసి టీవీ మీద కనపడితే చూసి తరించాలని కోరుకునే తల్లిదండ్రులు!

ఒక ఛానెల్లో జరిగిన ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ లో శోభానాయుడు గారు ఫోన్ చేసి "ఈ కార్యక్రమాలు విదేశాల్లో సైతం భారతీయ నృత్య కళ పరువు తీస్తున్నా"యని ఎంతో బాధపడ్డారు.

వాళ్ళు అభినయించే పాటల తాలూకు సాహిత్యం, దాని అర్థం బహుశా ఆ పిల్లలకు తెలీకపోవచ్చు.తెలిసే వయసొచ్చిన నాడు, తాము చేసిన నృత్యాలు ఎంత "బూతు"గా ఉన్నాయో తెలిసిన నాడు తల్లిదండ్రుల్ని అసహ్యించుకోక మానరు.ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది.

ఎంతో శారీక మానసిక శ్రమకు గురి చేసి గంటల కొద్దీ ప్రాక్టీస్ చేయించి..రెండు గుడ్డ ముక్కలు కట్టి చెత్త డాన్సులు చేయిస్తే తల్లిదండ్రులకు ఏం ఒరుగుతుంది?

ఏ పైశాచికానందం వాళ్ళచేత ఇంతకు ఒడిగట్టిస్తుందో మరి!

"మీరు చూస్తున్నారు కాబట్టి మేం చేస్తున్నాం"అనే చద్ది వాదనకు ఈ ఛానెళ్ళు ఇక చరమగీతం పాడితే మంచిది.

ఎందుకంటే మనసుల మీద, మానవ స్వభావం మీద తీవ్ర ప్రభావాన్ని చూపించే కార్యక్రమాలను ప్రేక్షకులు సహించరని ఇంతకు ముందే నేర వార్తలను సీరియల్స్ స్థాయిలో ప్రసారం చేసినపుడే తేలింది.

ఇప్పుడు ఇదీ! తీవ్ర స్థాయి నిరసన!


ఏ వూళ్ళో తల్లిదండ్రుల్ని  ప్రశ్నించినా పిల్లలచేత చేయిస్తున్న అశ్లీల నృత్యాల పట్ల విచారాన్నీ,ఆగ్రహాన్నీ వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి ఆట కట్టే రోజొచ్చింది. ఖేల్ ఖతం!
కమిషన్ కి ఫిర్యాదు చేసిన ప్రజాసంఘాలను, దేవి ఇతర కార్యకర్తల్ని అభినందిస్తున్నాను.
చప్పట్లు!

21 comments:

గీతాచార్య said...

:D

This won't do. No use. పైగా ఇంకో నష్టమేమిటంటే... మనం ఆవేశంగా ఉపన్యాసాలిచ్చుకునే వీలు కూడా తగ్గి పోతుంది. ప్చ్. :( మన స్పీచి హక్కులని కాలరాసిన మానవహక్కుల వాళ్ళ మీద నా నిరశన వ్యక్తం చేస్తున్నా.

చెరసాల శర్మ said...

పదిహేనేళ్ల క్రితం కూడా టి.వి.లో డాన్స్ పోటీలు వచ్చాయి. ఆ కార్యక్రమానికి మా క్లాస్ మేట్ కూడా ఒకరు వెళ్లడం జరిగింది. ఆ డాన్సులకి ఇప్పుడున్న క్రేజ్ అప్పుడు లేదు.

Enaganti (ఇనగంటి) Ravi Chandra (రవిచంద్ర) said...

సదరు కార్యక్రమ నిర్వహకుడికి మీరు వాడిన ఘీంకార్ పేరు మొదటి సారి వాడింది నేనేనకుంటా :-)(ఈ టపాలో )

ముసలి జడ్జికి ప్రాచుర్యంలో ఉన్న పేరు బొంగరం మాస్టారు.సో ఇక నుంచి మీరు ఆయన్ను ఇదే పేరుతో వ్యవహరించవచ్చు. :-)

శేఖర్ పెద్దగోపు said...

హా..హా...భలే కడిగారు ఆ ఘీంకార్ని మరియు జడ్జిలను...ఓ మీడియా మిత్రుని ద్వారా తెలిసిందేమంటే ఆ ప్రోగ్రాం నిర్వాహకులు, అందులో పాల్గొనే చిన్నారుల తల్లి దండ్రులు కొన్ని టీ.వీ చానల్స్ నిర్వాహకులు పైనా ఈ విషయంలో రివర్స్ లో కేసు వేసేరటండి...అ చెత్త ప్రోగ్రాంను వ్యతిరేకిస్తూ కొద్ది సేపు ఓ కార్యక్రమం ప్రసారం చేయటమే ఆ చానల్స్ వాళ్ళు చేసిన తప్పట...

ఇలా ఉంటే వీళ్ళు hrc వాళ్ళ తీర్పును గౌరవిస్తారంటారా? లేకపోతే రేటింగ్ల కోసం పై స్థాయి కోర్టుకు వెళ్ళడానికైనా తెగిస్తారేమో...వేచి చూడలి..

budugu said...

ఆమెన్.
నేనూ ఆ తీర్పు విని ఎంత సంతోషించానో చెప్పలేను.
ఇలాగే తీర్పులు ఆదివారం-అనుబంధాల్లో సెక్స్ కాలంస్ మీద, లౌడ్ స్పీకర్లకు టైం/డెసిబుల్ లిమిట్స్ మీద ఇస్తే బాగుంటుంది.
జై సాధనా, జై ప్రజాసంఘాలు.

శివ said...

మంచిపని జరిగింది. అసలు ఎవరో కేసు పెట్టేవరకు ఆగాల్సిన పనేమిటి ఈ కమిషనుకు. ఇలాంటి చెత్త కార్యక్రమాలను గమనించగానే తమంతటతామే కేసు బుక్ చేసి వెనువెంటనే అపాల్సింది.

krishna said...

నిజంగా మానవ హక్కుల సంఘం తీర్పు అమలు లోకి వస్తుందంటారా? ఈ రూపం లో కాకపోతే పేరు మార్చి, కార్యక్రమం రూపు మార్చి మన ఘీంకార్ అన్నయ్య మన మీద ప్రేమ కురిపిస్తూనే వుంటాడని నా ఆశ!
పరాచికం కాదు గాని ఈ టీవీల వాళ్లకి ,అడ్వర్టయిజుమెంట్ల వాళ్లకి పిల్లలతో మంచి లాభసాటి.వారు అంత తొందరగా పిల్లల పైన ఈ అరాచకాలని ఆపరని భయం.

మధురవాణి said...

బాగా చెప్పారు సుజాత గారూ.. హమ్మయ్యా.. మంచి పనైంది.. నేను కూడా చప్పట్లు :-)

హరే కృష్ణ . said...

చిటికెలు
అవును ఆ అమ్మాయి పేరు 'ఆట'గీతిక


అసభ్యం అనే పదానికి అర్ధం చెబుతూ
కాసేపట్లో రింగా రింగా పాట పైన ఒక వ్యక్తీ రాయబోయే కామెంట్ కోసం ఇక్కడ వెయిటింగ్

వివరాలకు మన రవి బ్లాగు చూడండి
http://ravichandrae.wordpress.com/2009/11/20/%E0%B0%B0%E0%B0%BF%E0%B0%82%E0%B0%97-%E0%B0%B0%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B0%BE-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%9F-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A6%E0%B0%82/

Sandeep said...

మానవహక్కుల కమిషన్ నీ, ఈ ఫిర్యాదు చేసినవారినీ మనస్పూర్తిగా అభినందించాలండి. మనలో ఉన్న ప్రతీ ఒక్కళ్ళూ ఇలాంటి ముందడుగులో భాగం పంచుకుంటే మన దేశం బాగుపడుతుంది!

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

భలె రాశారు.నిన్న ఒక చానల్లో ఈ డాన్సులని సమర్ధించె తల్లులను చూశాను.వీళ్ళకి సిగ్గు లేకండా మళ్ళి సమర్ధన ఒకటా అనిపించింది.

సుజాత said...

గీతాచార్య,
అవును, ఇలాంటి ఆవేదనలు ఉపన్యాసాల్లాగ కనపడుతున్నాయి కాబట్టే ఘీకార్ లాంటి వాళ్ల ఆటలు సాగుతున్నాయి. పైగా ఈ ప్రోగ్రాములు లేకపోతే "ఎంజాయ్ మెంట్" మిస్ అయిపోతారు కాబట్టి కుర్రాళ్ళ బాధ అర్థం చేసుకోవచ్చులే!

ఎందుకంటే ఆ పిల్లలు పసివాళ్లనే జ్ఞానం కూడా లేకుండా విజిల్స్ వేసి ఉత్సాహపరిచే వాళ్ళు కుర్రాళ్ళే!

అర్థం కాని రాతలు రాసి మేథావుల సరసన చేరదామనే దురాశ లేదు:D

అన్నట్లు మానవ హక్కుల కమిషన్ తో పెట్టుకోకండి! :D ప్రమాదం!

సుజాత said...

పదినిమిషాల్లో ఊరికి బయలుదేరాలి! మిగిలిన వ్యాఖ్యలేమైనా ఉంటే తిరిగొచ్చాక పబ్లిష్ చేస్తాను. థాంక్యూ!

జయ said...

చాలా చక్కగా వివరించారండి. ఇలాంటి ఇతర ప్రోగ్రాంస్ అన్నీ కూడా ఆగిపోతె బాగుండు.

విశ్వనాథ్ said...

బాగా గడ్డి పెట్టారండి,రాత్రి N T.V లో జరిగిన చర్చ చూసారా?సిగ్గులేకుండా పిల్లలు పీలికలు కట్టుకుని ఎగురుతుంటే చూసి ఆహా,ఒహో అనే ఒక మెంటర్ "మిధ్య" వచ్చి చర్చను రచ్చ చేసి వెళ్ళింది ఆ చర్చ్చకి ఫోన్ చేసి దులుపుదామనుకున్నాను కాని లైన్ దొరకలేదు.

కెక్యూబ్ said...

http://saamaanyudu.wordpress.com/2010/04/24/%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B2%E0%B0%B2-%E0%B0%AE%E0%B0%A8%E0%B0%B8%E0%B1%81%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%86%E0%B0%9F/

pavan said...

there are so many programs that will air in all telugu private channels are simply non sense in terms of my perception. the strange thing is , these are encouraged by parents and youth also. i really dont understand how my friends stick to TV while these so-called reality shows are coming.

now a days its not movies and not internet that will make a impact, but it is TV which is situated in center of the home and will show you everything from neralu goraalu to sexy dances in half dresses.

if people dont watch and encourage , then channels wont telecast these programs as everything for them depend on TRP.

so, who has to change ????

వేణూ శ్రీకాంత్ said...

స్ట్రిక్ట్ గా ఆచరణలో పెట్టగలిగితే అభినందించదగిన విషయం.

sree said...

No use.Ika konni rojulu neat ga untai nxt malli shara mamule!!! Ippudu news channels and entertainment channels rendu okate!!!! Edo manchi samajam kosam ani tv9 vaadu scandals ni 30 minutes vesi chupisthadu.appudu teliya leda veediki chinna pillalu untaru intlo vallu chedipotharu ani!!!News channels lo vache daniki entertainment lo vache vatiki diff lekunda poindi !!!!!! Dnt blame one channel/program Blame the MEDIA!!!!!!!!!!!

Ruth said...

లాభం లేదండీ సుజాత గారు, ఈ ప్రొగ్రాం ఇంకా వస్తూనే ఉంది. ఆట ఆగడం కొంచెం కష్టమేనేమో! ఐనా వాళ్ళని అని ఏమి లాభం? ఆ తల్లిదండ్రులని అనాలి.... వాళ్ళ చర్చ ఒకటి చూసి(అసలు TV ఎప్పుడూ చూడని నాకు), ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. తెల్లవారి రెండు గంటలకు లేచి, అదేవిషయం ఆలోచిస్తూ ఉంటె మా అప్పారావు కంగారు పడిపోయారు!
ఏమి తల్లులో ? ఒకావిడ అంది: మైఖేల్ జాక్సన్ చేసాడు కదా వెస్ట్రన్ డాన్సులు అంటుంది. ఆవిడకి తెలుసా జీవితమంతా MJ తన తండ్రిని అసహ్యించుకుంటూ బతికాడని? అంత డబ్బు, తను ఊ అంటె ప్రాణాలైనా ఇచ్చే అభిమానుల్ని సంపాదించి కూడా జీవితమంతా అత్యంత ప్రేమ రాహిత్యంతో కుమిలిపోయాడని? ఆఖరికి తను పోగొట్టుకున్న బాల్యాన్ని పొందడం కోసం పిల్లలతో స్నేహం చేసి అక్కడా భయంకరం గా భంగపడ్డాడని? ఏమి సాధించాలని వీళ్ళ ఆరాటం? తమ పిల్లలు మైఖేల్ జాక్సన్లు, బ్రిట్నీ స్పియర్స్లు ఐపోయి సాధించేది ఏమిటి? బయటకు కనిపించే హంగు,ఆర్భాటం వెనుక ఎలాంటి కథలున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా వీళ్ళు???

Praveen Sarma said...

ఒక మీటింగ్ లో కస్తూరి మురళీకృష్ణ గారు అన్నారు. అందరూ మైకేల్ జాక్సన్ లు కాలేరు, ఎంత ఇమిటేట్ చేసినా కాలేరు, అయినా అవకాశాలు ఉన్నంత వరకే డబ్బులు వస్తాయి అని. మైకేల్ జాక్సన్ కూడా చివరి రోజులలో డబ్బులు లేక క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ లేదని హొటెల్ నుంచి గెంటివెయ్యబడ్డాడని వీళ్ళకి తెలియదు.

Post a Comment