August 26, 2010

తెలుగు బ్లాగర్లకు విజ్ఞప్తి!

(ఈ కార్టూన్ ప్రముఖ కార్టూనిస్టు శ్రీ సరసి గారిది. వారి "సరసి కార్టూనులు-2" నుంచి తీసుకున్నాను.వారికి ధన్యవాదాలు)


ఈ కార్టూన్ చూశారా? దీన్ని మొదటి సారి చూసినపుడు నాకు నవ్వు రాలేదు. "అవును, ఇలాగే ఉన్నాం"అనిపించింది. కొంతకాలానికిది నిజమై పోతుందేమో అని భయమేసింది. మీకూ అలాగే అనిపిస్తోందా?

మాటల్లోనూ రాతల్లోనూ నెమ్మది నెమ్మదిగా నిర్లక్ష్యానికి గురవుతోన్న మాతృభాషను కాపాడుకునేందుకు, భాష గురించిన చైతన్యాన్ని రగిలించేందుకు, భాష గురించి కొందరినైనా ఆలోచింపజేసేందుకు  etelugu సంకల్పించిన "తెలుగు బాట" కార్యక్రమంలో పాల్గొని అందరం కలిసి భాషా చైతన్యం దిశగా భావావేశంతో, నాలుగడుగులు వేద్దాం!

వ్యావహారిక భాషా ఉద్యమకర్త గిడుగు రామమూర్తి గారి జన్మదినమైన ఆగస్టు 29న మాతృభాషా దినోత్సవం జరుపుకుంటున్నాం! ఆ రోజు తెలుగు భాష వినియోగం  పై చైతన్యాన్ని కలిగించేందుకు,పెంచేందుకు "తెలుగుబాట"అనే వినూత్న కార్యక్రమానికి eతెలుగు శ్రీకారం చుట్టింది. సెక్రటేరియట్ ( సచివాలయం )ముందు ఉన్న తెలుగు తల్లి విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డు లో గల పీ.వీ జ్ఞానభూమి వరకు ఒక "నడక"  కార్యక్రమం ఇది!

తెలుగు పై అభిమానం గల మాతృభాషాభిమానులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అనేకమంది ప్రముఖులు ,భాషాభిమానులు ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ ఇప్పటికే సందేశాలు పంపారు. మీడియా భాగస్వామిగా HMTV ఉన్నందున ఈ సందేశాల వీడియోలను ప్రొమోలు గా మీరు HMTV లో చూడవచ్చ్చు.

 ఈ కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించేందుకు, మరింత ఎక్కువ సంఖ్యలో భాషాభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గత పది రోజులుగా ఈ తెలుగు సభ్యులంతా అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఆర్థిక వనరులు లేనందున ఇది సంస్థ సభ్యులకు కొంత భారంగానే తోస్తున్నా తెలుగు మీద ప్రేమతో ముందుకు సాగుతున్నాం!


 తెలుగు బాటకి నేను వెళ్తున్నాను!



హైదరాబాదు బ్లాగర్లంతా ఆ రోజు ఆదివారం కాబట్టి కొద్దిగా వీలు చేసుకుని ఈ నడకలో పాల్గొనమని విజ్ఞప్తి చేస్తున్నాం! 

ఈ నడక ఉద్దేశం ముందుగానే చెప్పినట్లు భాష పట్ల ఒక చైతన్యాన్ని కల్గించేందుకే! ఆ నడకకు వచ్చిన కొందరైనా మాతృభాష గురించి,భాషాభివృద్ధి గురించి ఆలోచిస్తే,కొందరైనా తమ పిల్లలు తెలుగులోనే మాట్లాడేలా చూస్తే,కొందరైనా తమ పిల్లలకు తెలుగులో(రాయడం తెలీని పిల్లలకు  ) రాయడం  నేర్చుకోమని చెపితే మా ప్రయత్నం సఫలమైనట్లే!

 అంతర్జాలంలో తెలుగు భాష వాడకం పై ఇంతకు ముందు ఈ తెలుగు జర్నలిస్టులకు,రచయితలకు రెండు అవగాహనా సదస్సులను విడివిడిగా నిర్వహించింది.వాటికి ఎంతో ఆదరణ లభించింది.ఈ కార్యక్రమానికి కూడా అదే   విధంగా ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నాం!

రండి,అచ్చ తెలుగులో మాట్లాడుకుంటూ ఒక ఆదివారం ఆహ్లాదకరమైన ఉదయాన్ని శోభాయమానంగా తెలుగు కోసం గడుపుదాం! మనతో పాటు నలుగురిని తీసుకువచ్చి నాలుగడుగులు వేయిద్దాం!

మీ పేర్లు నమోదు చేయించుకోండి.

ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యే ఈ నడక దాదాపు తొమ్మిది, తొమ్మిదిన్నరకల్లా ముగుస్తుంది. మీ ఆదివారం వ్యక్తిగత ప్రత్యేక కార్యక్రమాలకు ఏ మాత్రం అడ్డురాని సమయం!

తప్పక రండి,మాతో కలిసి నాలుగడుగులు వేయండి

హైద్రాబాదు తెలుగు బ్లాగర్లు అంతా తప్పక రావాలని కోరుతున్నాం! మిగతా ప్రాంతాల వాళ్ళు వస్తే మాకు మరింత
 సంతోషం

27 comments:

హరేఫల said...

మీరు ' హైదరాబాదు బ్లాగర్లు' అనడం బాగో లేదు! 'తెలుగు బ్లాగర్లు' అనవలిసింది !! నమోదు చేసికున్న వారిలో నేనొకడిని.నాది హైదరాబాదు కాదే! నేను రాకూడదా?

Raj said...

i have also shared with all my friends about this..

thanks for a nice initiative.

సుజాత వేల్పూరి said...

ఫణిబాబు గారూ,

మీరు రిజిస్టర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు! హైద్రాబాదు బ్లాగర్లకు ఎక్కువ వీలుంటుందనే ఉద్దేశంతో అలా రాశాను. అయితే మిమ్మల్ని అక్కడ కలుస్తామన్నమాట.

Sujata M said...

Thank u very much for giving complete (clear-cut) info. See u there.

Anonymous said...

నేనూ వస్తానండోయ్! మీరుంటారా అక్కడ?

సుజాత వేల్పూరి said...

సుజాత గారూ, పాపను కూడా తీసుకురాకూడదూ, నే ఎత్తుకు నడుస్తా లెండి!

నీలాంచల, నేను తప్పక ఉంటాను అక్కడ! నిజంగా రావాలి మరి!

SRRao said...

సుజాత గారూ !
మంచి కార్యక్రమం. విజయవాడ నుంచి రావాలనే వుంది. అవకాశం వుంటే తప్పక ప్రయత్నిస్తాను. కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటూ... శుభాకాంక్షలతో...

సుభగ said...

నేను బెంగుళూరు లో ఉన్న కారణంగా రాలేను :-( కాని "తెలుగు బాట" విశేషాలు మాకు తెలియబరుస్తారు కదూ?
అక్కడ కూడా ఇంగ్లిష్ లో పలకరించుకుంటున్న వాళ్ళెవరైనా కనిపిస్తే ఒక మొట్టికాయ వేయడం మర్చిపోకండి.

ఆ.సౌమ్య said...

అబ్బ ఇది నేను నిజంగా మిస్ అవుతున్నాను. మీరు జరుపుతున్న ఈ కార్యక్రమం success కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

sivaprasad said...

i am also registered

Sujata M said...

ha ha ! Srijani teste, adi oka mota aipotundi & tana kooturu telugu kosam naDiste, valla nanna gunde agipotundi. ha ha. I will see.

వేణు said...

సాధారణంగా ‘నడక’, ‘పరుగు’ లాంటివి మీడియాలో ప్రచారం, సినీ రాజకీయ ప్రముఖుల హడావుడితో
ఒక రకమైన పటాటోప ప్రదర్శనల్లాగా ముగుస్తుంటాయి... చివరికొచ్చేసరికి అసలు లక్ష్యం మూలబడుతుంది.
ఈ ‘తెలుగు బాట’ అలా కాకూడదని కోరుకుంటున్నా.

ఆధునిక అవసరాలకు నిత్యజీవితంలో తెలుగును విరివిగా ఉపయోగించుకోవచ్చనేదానిపై అవగాహన ఈ ‘నడక’ మూలంగా ఎంతో కొంత ఏర్పడుతుందని ఆశిస్తున్నాను.

సుజాత వేల్పూరి said...

రాజేంద్ర,
మీరు మీ స్నేహితులకు చెప్పటమే కాదు,వారితో కలిసి రావాలి కూడా!

SR Rao గారూ, మిమ్మల్ని కలుసుకునే సదవకాశాన్ని ఈ సందర్భంగానైనా మాకుకల్పించాలని కోరుతున్నాం! వీలు చేసుకోండి సార్ !

సుజాత గారూ, అర్థమైంది.అయితే ఒరియా కోసం నడక నిర్వహిస్తే శ్రీజను తీసుకెళ్తారన్నమాట! సరే సరే! మీరైతే రండి!

సుభగ గారూ,
తప్పకుండా తెలియపరుస్తాను, ఫొటోలతో సహా! మొట్టికాయలు వేసే విషయంలో కూడా మీకు హామీ ఇస్తున్నాం! :-))

సుజాత వేల్పూరి said...

సౌమ్యా, నిజంగా మీరుంటే చాలా సందడిగా ఉండేదనిపిస్తోంది నాకు! ధన్యవాదాలు!

విజయవంతం కావాలనే ఈ తెలుగు సభ్యులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. వర్షం పడకుండా ఉంటే అంతే చాలని అనుకుంటున్నాను నేనైతే !

శివ ప్రసాద్ గారూ,
అయితే తప్పక వస్తున్నారుగా! మీ కుకట్ పల్లి నుంచి చాలామంది వస్తున్నారండి!

వేణుగారూ,
ఇంతకీ మీరొస్తున్నారో లేదో చెప్పలేదే?

sivaprasad said...

kukatpalli nunchi evaru vasturanoo chepthara vari mail ids ivvandi

సుజాత వేల్పూరి said...

శివప్రసాద్ గారూ,

కుకట్ పల్లిలో చాలామంది తెలుగు బ్లాగర్లు ఉన్నారండీ! వారిలో కొంతమంది తప్పక వస్తారు గానీ వారి మెయిలైడీలు నాకు తెలియదు. తెలుగు తల్లి వద్ద ముఖాముఖి గానే కలుద్దురుగాని రండి!

durgeswara said...

మాతృభాష మనుగడకై ఇంత శ్రమిస్తున్న వారందరికీ,ముఖ్యంగా ఈ కార్యక్రమ నిర్వాహకులకు శుభాభినందనలు

..nagarjuna.. said...

నేను రాలేనుకాని ఆర్కుట్‌లో, ఫేస్‌బుక్‌లో టాంటాం చేస్తా. మా స్నేహితులను పాల్గొనమని చెప్తాను.

సవ్వడి said...

సుజాత గారు! ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ఈ శనివారం మా ఊరు వెళ్తున్నా! కాబట్టి నేను పాల్గొనలేను.

సుజాత వేల్పూరి said...

నాగార్జున, సవ్వడి గార్లు,
ధన్యవాదాలండీ

శ్రీనివాస్ పప్పు said...

ఇ-తెలుగు నిర్వహించే ఈ తెలుగుబాట కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని ఆశిస్తున్నాను.కార్యక్రమ విశేషాలకోసం మీ శైలిలో లైవ్ టెలికేస్ట్ కోసం ఎదురుచూస్తూ...

వేణూశ్రీకాంత్ said...

కార్యక్రమం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండీ :-)

Raj said...

మీరు చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆశిస్తున్నాను.. ఈ కార్యక్రమానికి రావటానికి నా శాయశక్తులా కృషి చేస్తాను..

SRRao said...

సుజాత గారూ !
నా శిరాకదంబం లో ' తెలుగు బాట ' సందేశాన్ని ఉంచాను.

Vasu said...

మంచి కార్యక్రమం. విజయవంతం కావాలని ఆశిస్తున్నాను.

ఔను మీరు సచివాలయం అనకుండా secretariat అని రాశారు ఎందుకని. అందరికీ అర్థం కావాలనా..

సుజాత వేల్పూరి said...

అందరికీ ధన్యవాదాలు!

వాసు,
సెక్రటేరియట్ అని రాసింది అందరికీ అర్థం కావాలనే ఆలోచనతో కాదండీ. అలవాటు చొప్పున ఇంగ్లీష్ పదం రాసేశాను.:-(

మీ సూచనతో ఇప్పుడు మారుస్తున్నాను. :-)

Malakpet Rowdy said...

All the best!

Post a Comment