September 24, 2010
వంశీ గాన మాధురి......తప్పక ఆస్వాదించండి..!
అంతకు ముందు వారమే గోపి గోపిక గోదావరి టీవీలో చూశానేమో, పోయినాదివారం మావారు,పాపాయి సరదాగా కాసేపు సినిమాకెళ్దామంటే వణుక్కుంటూ బయలుదేరాను. నవతరంగంలో రివ్యూ లో వర్ణించినంత నీరసంగా లేదు గానీ గో గో గో మీద చాలా రెట్లు బెటరే అనిపించింది. రివ్యూ రాయడం లేదు గానీ ఆ సినిమా సంగీతం గురించి, వంశీ పాడిన పాటల గురించి రెండు ముక్కలు రాద్దామని....!
వంశీ సినిమాల్లో పాటలు చాలా మందికి నచ్చుతాయి. మెలొడీకి నా వోటే కాకుండా రిగ్గింగు కూడా చేసి మరీ ఓట్లు వేసే నాకు మరీ నచ్చుతాయి. సినిమాలో అన్ని పాటలూ కాకపోయినా చాలా వరకూ నచ్చుతాయి.సితార,ప్రేమించు పెళ్లాడు,చెట్టుకింద ప్లీడరు,అన్వేషణ,ఆలాపన ...ఇలా ! అసలు ఇళయరాజా,వంశీ కల్సి మెలొడీ ప్రేమికులతో చాలా ఆటలు ఆడుకున్నారు. అనుమానాస్పదం సినిమా ఎప్పుడొచ్చి ఎప్పుడు పోయిందో తెలీదు(ఆర్యన్ రాజేష్ అనగానే పాపం చాలా సినిమాలకు ఇలాగే జరుగుతుంటుంది) కానీ అందులో......
ప్రతి దినం నీ దర్శనం.
నిను వెదికి వెదికి. .ఈ రెండు పాటలూ ఎంతో బావుంటాయి.
వాటన్నింటి సంగతి వదిలేస్తే..ఇప్పుడు సరదాగా కాసేపు సినిమాలో వంశీయే రెండు పాటలు పాడటం విశేషం! అవి అంత చక్కగా పాడటం నాకో పెద్ద ఆనందాశ్చర్యం! వంశీ మంచి భావుకుడనీ,సంగీతం పట్ల మంచి అభిరుచి ఉందనీ, కొంత పరిజ్ఞానం కూడా ఉందనీ తెలుసు గానీ ఇంత చక్కని గాయకుడని మాత్రం ఇప్పుడే తెల్సింది నాకు!
పాడిన రెండు పాటలూ (ఇప్పుడు వస్తున్న తెలుగు సినిమా పాటలతో పోలిస్తే) రెండు ఆణిముత్యాలు! అంజనా సౌమ్య తో కల్సి పాడిన "ఊహలో సుందరా" పాట లో పాట మొదట్లో వంశీ ఆలాపన ఎంత ప్రొఫెషనల్ గా ఉందంటే.... విని తీరాల్సిందే! మరో పాట చైత్రతో కల్సి పాడిన " మగధీరా"..! ఇదీ అంతే! చక్కని మెలొడీ ఉన్న పాట.
రెండు పాటలూ ఎంతో ఆర్దృంగా , ఫీల్ తో పాడిన వంశీనీ అభినందించకుండా ఉండలేకపోయాను, అంజనా సౌమ్య స్వరం లో శ్రేయా ఘోసల్ , అనూరాధా శ్రీరామ్ ల స్వరాల ఛాయలు కనిపిస్తున్నాయి. గాయకులను చూస్తూ వారి పాట వినడంకంటే ఇలా రికార్డ్ లో విన్నపుడు మరింత క్లారిటీ వస్తుంది.
ఈ పాటలు ఇంత మధురంగా ఉండటానికి సంగీత దర్శకత్వం కూడా కారణమనుకోండి. వంశీ ఇన్నాళ్ళూ పాడకుండా ఉండటం అన్యాయమని ఆరోపిస్తూ...ఇకపై తీసే సినిమాల్లో అప్పుడప్పుడైనా పాడుతూ ఉండాలని గాఠ్ఠిగా డిమాండ్ చేస్తున్నాను!
ఇక్కడ వంశీ పాడిన పాటలు వినండి...రాగా లో!
ఊహలో సుందరా....!
మగధీరా..! సుకుమారా .
September 5, 2010
జీవితమే(మోహన) కృష్ణ సంగీతము ....!
పేపర్లోనో,పత్రికలోనో ప్రచురణ అయిన ప్రతి ముక్కా తెచ్చి బ్లాగులో పెట్టేంత ఓపిక నాకు లేదు. అంత అవసరమూ కనిపించదు. కానీ ఈ మధ్య చేసిన ఒక ఇంటర్వ్యూ ఎంతో ఇష్టంతో చేశాను. బాలమురళీ కృష్ణ గారి ప్రియ శిష్యుడు శ్రీ డీవీ మోహన కృష్ణ గారి ఇంటర్వ్యూ ఈనాడు ఆదివారం సంచికకోసం!
ఆయన రేడియోలో సంగీత పాఠాలు నేర్చుకునేటపుడు మా చిన్నక్క శ్రద్ధగా కూచుని తనూ నేర్చుకునేది. మనకంత శ్రద్ధ లేదు కాబట్టి అటో ఇటో పోతూ అక్కడక్కడా గొంతు కలుపుతూ ఉండేదాన్ని. పైగా ఈయన బాలమురళి వద్ద పాఠం నేర్చుకుంటున్నపుడు ఎవరు గురువో, ఎవరు శిష్యుడో తెలిసేది కాదు. అంత సారూప్యత ఉంటుంది ఇద్దరి గొంతుల మధ్యా!
ఎన్నో సంగతుల్ని ఓపిగ్గా వివరించిన మోహన కృష్ణ గారిని అడగ్గానే కొన్ని పాటలు కూడా భేషజం లేకుండా పాడి వినిపించారు. ఇంటర్వ్యూ అనుకున్నది ఆత్మీయ మిత్రుల సమావేశంగా మారింది కాసేపటికి.
మోహన కృష్ణ ఒక అపురూపమైన శిష్యుడు. బాలమురళి ఒక అద్వితీయమైన గురువు గారు. గురుపూజోత్సవం సందర్భంగా ఈ రోజు ఈనాడు ఆదివారం లో వచ్చిన ఈ ఇంటర్వ్యూ ఇక్కడ ఇస్తున్నాను. కింద "వి.ఎల్.సుజాత" అని ఉంటుంది. నా పేరేలెండి అది! అన్ని రికార్డుల్లోనూ అలాగే ఉంటుంది మరి!
జీవితమే కృష్ణ సంగీతము అంటూ బాలమురళి పాడిన రాగమాలిక చిమట మ్యూజిక్ లో వినండి ఇక్కడ!