September 24, 2010

వంశీ గాన మాధురి......తప్పక ఆస్వాదించండి..!
అంతకు ముందు వారమే గోపి గోపిక గోదావరి టీవీలో చూశానేమో, పోయినాదివారం మావారు,పాపాయి సరదాగా కాసేపు సినిమాకెళ్దామంటే వణుక్కుంటూ బయలుదేరాను. నవతరంగంలో రివ్యూ  లో వర్ణించినంత  నీరసంగా లేదు గానీ గో గో గో మీద చాలా రెట్లు బెటరే అనిపించింది. రివ్యూ రాయడం లేదు గానీ ఆ సినిమా సంగీతం గురించి, వంశీ పాడిన పాటల గురించి రెండు ముక్కలు రాద్దామని....!

వంశీ సినిమాల్లో పాటలు చాలా మందికి నచ్చుతాయి. మెలొడీకి నా వోటే కాకుండా రిగ్గింగు కూడా చేసి మరీ ఓట్లు వేసే నాకు మరీ నచ్చుతాయి. సినిమాలో అన్ని పాటలూ కాకపోయినా చాలా వరకూ నచ్చుతాయి.సితార,ప్రేమించు పెళ్లాడు,చెట్టుకింద ప్లీడరు,అన్వేషణ,ఆలాపన ...ఇలా ! అసలు ఇళయరాజా,వంశీ కల్సి మెలొడీ ప్రేమికులతో చాలా ఆటలు ఆడుకున్నారు.   అనుమానాస్పదం సినిమా ఎప్పుడొచ్చి ఎప్పుడు పోయిందో తెలీదు(ఆర్యన్ రాజేష్ అనగానే పాపం చాలా సినిమాలకు ఇలాగే జరుగుతుంటుంది)  కానీ అందులో......
ప్రతి దినం నీ దర్శనం.

నిను వెదికి వెదికి. .ఈ రెండు పాటలూ ఎంతో బావుంటాయి.

వాటన్నింటి సంగతి వదిలేస్తే..ఇప్పుడు సరదాగా కాసేపు సినిమాలో వంశీయే రెండు పాటలు పాడటం విశేషం! అవి అంత చక్కగా పాడటం నాకో పెద్ద ఆనందాశ్చర్యం!  వంశీ మంచి భావుకుడనీ,సంగీతం పట్ల మంచి అభిరుచి ఉందనీ, కొంత పరిజ్ఞానం కూడా ఉందనీ తెలుసు గానీ ఇంత చక్కని గాయకుడని మాత్రం ఇప్పుడే తెల్సింది నాకు!

పాడిన రెండు పాటలూ (ఇప్పుడు వస్తున్న తెలుగు సినిమా పాటలతో పోలిస్తే) రెండు ఆణిముత్యాలు!  అంజనా సౌమ్య తో కల్సి పాడిన "ఊహలో సుందరా" పాట లో పాట మొదట్లో   వంశీ ఆలాపన ఎంత ప్రొఫెషనల్ గా ఉందంటే.... విని తీరాల్సిందే!   మరో పాట చైత్రతో కల్సి పాడిన " మగధీరా"..! ఇదీ అంతే! చక్కని మెలొడీ ఉన్న పాట.

రెండు పాటలూ ఎంతో ఆర్దృంగా , ఫీల్ తో పాడిన వంశీనీ అభినందించకుండా ఉండలేకపోయాను, అంజనా సౌమ్య స్వరం లో శ్రేయా ఘోసల్ , అనూరాధా శ్రీరామ్ ల స్వరాల ఛాయలు కనిపిస్తున్నాయి. గాయకులను చూస్తూ వారి పాట వినడంకంటే ఇలా రికార్డ్ లో విన్నపుడు మరింత క్లారిటీ వస్తుంది.

ఈ పాటలు ఇంత మధురంగా ఉండటానికి సంగీత దర్శకత్వం కూడా కారణమనుకోండి. వంశీ ఇన్నాళ్ళూ పాడకుండా ఉండటం అన్యాయమని ఆరోపిస్తూ...ఇకపై తీసే సినిమాల్లో అప్పుడప్పుడైనా పాడుతూ ఉండాలని గాఠ్ఠిగా డిమాండ్ చేస్తున్నాను!

ఇక్కడ వంశీ పాడిన పాటలు వినండి...రాగా లో!

ఊహలో సుందరా....!

మగధీరా..! సుకుమారా .

22 comments:

భాస్కర రామి రెడ్డి said...

వంశీ సినిమాలో పాటలు నాకూ నచ్చుతాయండి. కానీ ఇక్కడ ఈ టపాకు కామెంటు వ్రాయడానికి మాత్రం ప్రేరణ వంశీ పాటలు మాత్రం కాదు. మరి ఏమిటంటే ఈ లైను

>>>> సినిమాకెళ్దామంటే వణుక్కుంటూ బయలుదేరాను

మీరు కాబట్టి వణుక్కుంటూ బయలుదేరారు. మా ఆవిడైతే గొణుక్కుంటూ బయలుదేరుతుంది :-)

సుజాత said...

వేణుగారూ,
ఈ "ఫస్ట్ కామెంట్" క్రేజ్..మీకూ అంటుకుందా! అభిప్రాయం ముఖ్యం కానీ ఎవరు మొదటి కామెంట్ రాస్తే ఏముంది? మొదట రాసిన కామెంట్ కి ఎక్కువ విలువా, చివర్లో వచ్చిన దానికి తక్కువ విలువా ఉండదు కదా!

శ్రీనివాస్ said...

:) వంశీ గారు పదేళ్ళ తర్వాత రావాల్సిన సినిమాలు అప్పుడే తీస్తారు :))

madhu said...

జోక్ గా రాసారేమో అనుకున్నా...నిజంగానే మీకు వంశీ పాడినవి నచ్చాయన్నమాట.

>>ఇకపై తీసే సినిమాల్లో అప్పుడప్పుడైనా పాడుతూ ఉండాలని గాఠ్ఠిగా డిమాండ్ చేస్తున్నాను!

బాబ్బాబు,అంత పని చేయకండి దయ చేసి. ఆయన గాత్రం లో పట్టు ఉన్నట్టు కనిపించలేదు.ఆ స్తర్తింగ్ ఆలాపన తప్పితే.(అది ఆయన పాడిందేనా?

చైత్ర బా పాడింది.

కత్తి. మహేష్ కుమార్ said...

పాటలు ఫరవాలేదు.నాకు పెద్దగా నచ్చలేదు.వంశీ గొంతు నాసల్ గా ఉండటంతోపాటూ పదాలు పలకడంలో ఏదో తేడా అనిపించింది.ముఖ్యంగా ల్యాండిగ్ నోట్స్ మరీ తేలికచేసేశారు.

ఆ.సౌమ్య said...

ఓహో ఈ పాటలు వంశీ పాడారా, విన్నాను కానీ ఎవరు పాడారో తెలీలేదు. కానీ వంశీ గొంతు నచ్చలేదు నాకు. మరీ సన్నగా,పీలగా ఉంది. ఒక కేర్‌లెస్ నెస్ ఉంది గొంతులో. కానీ బాగా పాడారులెండి, మంచి గాయకుడే.

ఇంతకీ సినిమా ఎలా ఉందో చెప్పారు కాదు. అదేదో చెప్పేస్తే మేము బుక్ అయిపోకుండా ఉంటాం.

సవ్వడి said...

నాకు కూడా " ఊహలో సుందరా... " పాటే బాగా నచ్చింది. మిగతా పాటలు కూడా బాగున్నాయి.
వంశీ సినిమాల్లో " ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు " తరువాత ఏదీ నచ్చలేదు. ఈ సినిమా టాక్ తెలీదు కాని పాటల కోసం చూడాలనుకుంటున్నాను.

వేణూ శ్రీకాంత్ said...

ఈ ఆల్బం మొదట చూసినపుడు అబ్బా ఈయనక్కూడా అంటుకుందా ఈ పాటలు పాడే జబ్బు అనుకుంటూ విన్నానుకానీ విన్నాక మీరన్నట్లే అనుకున్నాను ఇంకా ముందే మొదలు పెట్టి ఉండాల్సింది అని. పాట బాగానే పాడారు, వినసొంపుగానే ఉంది కానీ ఆయన స్వరానికి అలవాటు పడటానికి నాకైతే టైం పట్టింది. ఇంకా అలవాటు పడలేదనే చెప్పాలి.

సుజాత said...

మధు,
మీకు నచ్చలేదా? వంశీ ఒక డైరెక్టర్ గా తప్ప గాయకుడిగా తెలీదు కదా! పక్కా ప్రొఫెషనలిజం అప్పుడే ఆశించకూడదు. గొంతులో శ్రావ్యత సంగతి కంటే చక్కని ఫీల్ తో పాడటం నాకు బాగా నచ్చింది.

ప్రొఫెషనల్ గా పాడేవాళ్లకు పట్టు అలవోగ్గా పట్టుపడుతుంది. ఒక పది సినిమాల్లో వంశీ వరసగా పాడితే పట్టు అదే వస్తుంది. అందుకోసమైనా వంశీ వరసగా పాడాల్సిందే! ఏమంటారు? :-))

రాధిక(నాని ) said...

నాకు వంశి గారి పాటలంటే చాలా ఇష్టం. ఈ పాటలు బాగా నచ్చాయి కాని వంశి గారు పాడారనుకోలేదు.మీరు రాసింది చదివాక మళ్ళి విన్నాను.

సుజాత said...

మహేష్,
చెప్పానుగా, ఈ మధ్య వచ్చిన పాటలతో పోలిస్తే చాలా హాయిగా ఉన్నాయి! మీరు వంశీ గొంతులో ఏ పాయింట్స్ నచ్చలేదన్నారో అవే నాకు నచ్చాయి. refined గా లేకపోవడం,raw గా ఉండటం నాకు బాగా నచ్చింది.

సౌమ్య,
సినిమా పర్లేదు. మరీ ఘోరంగా ఏమీ లేదు. గో గో గో చూసి ఉంటే మీకు ఆ దెబ్బ నుంచి కోలుకోడానికి బాగా పనికొస్తుంది. అక్కడక్కడ ఈవీవీ హాస్యంలా తోచాయి కొన్ని సీన్స్! పాటల విషయంలో కూడా మీరు చెప్పిందే నేనూ చెప్పింది. గొంతులో శ్రావ్యత సంగతి పక్కన పెట్టి, మంచి గాయకుడిగా పాడాడా లేదా అని చూశాను. బాగానే మార్కులు వేయొచ్చనిపించింది.

సుజాత said...

సవ్వడి,

అవునండీ! ఊహలో సుందరా పాట బావుంది. మా పాపకి మరీ నచ్చింది. అవును వాళ్ళిద్దరూ...తర్వాత కాస్త చూడదగిన సినిమా ఇదే! చూడండి, పాటల చిత్రీకరణ వంశీ స్టైల్లోనే ఉంది.

వేణూశ్రీకాంత్,
నేనూ మీలాగానే ఈయన పాడకపోతే ఏమి లే అనుకుంటూ విని ఆశ్చర్య పోయాను. ఉత్సాహం కొద్దీ పాడే హీరోలా లాగా అనుకున్నాను గానీ గాత్ర శుద్ధి ఉందని తెలిసింది. మీరన్నట్లే అలవాటు పడటానికి కొంచెం సమయం పడుతుంది. పైగా మనకు వంశీ గొంతు ఎలా వుంటుందో తెలీదు కదా ఇంతకుముందు!

మహేష్,
చెప్పడం మరిచాను. లాండింగ్ నోట్స్ చాలా వెరైటీగా పాడాడు వంశీ! నేను పాడి చూస్తే వేరేలా లాండ్ అవుతున్నాయి. అవి కూడా నచ్చాయి. నాసల్ గా ఉండటం అనేది పాట పాడటంలో క్వాలిటీకి అడ్డం రాదు కదా! అది మెలొడీ పాయింట్ ఆఫ్ వ్యూ. దాని సంగతి మొదటి పాటకే అంత ఇదిగా మాట్లాడుకోలేం!

kiran kumar said...

నేనూ అంత గొప్పగా అనుకోలేదండీ వినకముందు! విన్నాక బాగా పాడాడనే అనిపించింది. చక్రిని,కీరవాణిని,గోగుల గారిని సంగీత దర్శకులనే డిస్కౌంట్ తో ఎన్ని పాటలకు భరించలేదూ! వాళ్ళకంటే బాగానే ఉంది నాకు వంశీ గొంతు!

గీతాచార్య said...

కత్తి వారికే నా ఓటు!

నాకైతే అదోలా, ఇంకేదో టైప్ లో నెహేను కహనుఖ ఫాఢాను అన్నట్టనిపించాయి మొదట్లో. కానీ, వినగా, వినగా బాగనే ఉన్నాయనిపించింది.

ఇక సంగీతం సంగతి. మన పూరీ డిస్కవర్డ్ చక్రి కదా. బాగనే ఉంటాయి. పాపం చాలా కష్టపడి మ్యూజిక్కిచ్చిన పోపోపో ఎగిరిపోయే సరికి కాస్త శద్ధ తగ్గించి, ఓ మాదిరి మ్యూజిక్కిచ్చాడు. ఒక్క పాటా నా జ్యూక్ బాక్స్ లోకెక్కలా. గోగోగో లోవి స్టిల్ రన్నింగ్

Vasu said...

నేనూ సెటైర్ అనుకున్నా. నిజంగానే నచ్చాయా..
సెటైర్ అయినా కూడా టపా పేరు భలే సరిపోతుంది :)

నేను ఆ పాటా వస్తోందంటే టీవీ చానెల్ మార్చేస్తా. నాకు సంగీత పరిజ్ఞానం లేదు కానీ వంశీ గొంతు మాత్రం వినడం కష్టం అనిపించింది.

సుజాత said...

vasu,
I'm hurted...!:-))

హరే కృష్ణ said...

కధ మాటలు స్క్రీన్ ప్లే సంగీత దర్శకత్వం అన్నీ
లారెన్స్ కదా చెయ్యాలి :)
మొన్న టీవీ లో ఈ పాట చూసిన తర్వాతే తెలిసింది ఇది వంశీ సినిమా అని పాటలు కూడా తనే పాడాడా గ్రేట్
వంశీ సినిమాలో హీరొయిన్ ఫస్ట్ టైం కాస్త గోదావరి అమ్మాయి లా కాకుండా కొత్తగా కనిపించడంతో ఎక్కువ సేపు చూసాను ఆ ప్రోగ్రాం అంతా :)
కాదెవడూ గాయకుడికి అనర్హం అని రుజువు చేసాడు కదా బోయ్స్ సిద్దార్థ్ షాన్ తో గొంతుకలిపి
మొదటి పాట కే విమర్శలా
హిమేష్ రేష్మియా acting కంటే ఈ పాట చాలా బెటర్
మీ డిమాండ్ ని నో.కా.బ్లా.స తరుపున బలపరుస్తున్నాం
మనం పాడవద్దు అని చెప్పినా వంశీ ఆపడు లెండి :)
పాటలు బావున్నాయి

శేఖర్ పెద్దగోపు said...

నాకైతే నచ్చింది వంశీ గొంతు..వేణు శ్రీకాంత్ అన్నట్టు కొంచెం అలవాటుపడాలంతే...రమణగోగుల వాయిసే అలవాటుపడిన మనకి అదంత పెద్ద కష్టం కాబోదు..:)
అంజనా సౌమ్యా మీరన్నట్టు అక్కడక్కడ శ్రేయాఘోషల్‌ని ఇమిటేట్ చేస్తున్నట్టు అనిపించింది నాక్కూడా...ఇప్పుడిప్పుడే సినిమాల్లో పాడుతుంది కదా..ఒరిజినాలిటీ రావడానికి టైం పడుతుందిలెండి..

anveshi said...

నిద్రపోయి లేచి, recording కి వచ్చిపాడినట్టు వుంది:D.యీ పాటలు చక్రి కీచు గొంతు వేసుకొని పాడకుండా వంశీ గారు పాడి మేలు చేసారు ఆ విషయంలో ఒక ఓఓ వేసుకోవాలి.

భావన said...

నేను ఇంత వరకు వినలేదు. ఇవి అన్నీ చూస్తుంటే వినాలని డెసైడ్ ఐపోయా. సరే వినొచ్చి నా అమూల్యాభిప్రాయం బోల్తా.

కమల్ said...

వంశీగారు ఒకరకంగా చెప్పాలంటే తనొక ప్రొఫిషన సింగరే అని చెప్పొచ్చేమో..!!? ఎందుకంటే ఆయన తన చిన్న వయసులోనే కర్ణాటిక్ శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు, ఆయనకు చాలా రాగాలు బాగా తెలుసు ఎక్కువగ ఇష్టపడే రాగాలు రెండు ఉన్నాయి సరిగ్గ పేర్లు గుర్తులేదుగాని ఎక్కువగా ఆ రాగాలలోనే తను పాటలు చేయించుకుంటారు. ఇళయరాజాకి ఇష్టమైన ఏకైక తెలుగు దర్శకుడు ఒక్క " వంశీ " గారు మాత్రమే..!

తెలుగు అభిమాని said...

వంశీ గొంతు బాగానే ఉంది. మీరు అన్నది నిజం సుజాతగారు. ఇంకా, అన్వేషణ సినిమాలోని ’ఏకాంతవేళ’ పాట hangover నుంచీ బైటికి రాలేకపోతున్నాడేమో అనిపిస్తుంది ఈ పాటలు వింటే. పాటల చిత్రీకరణ outdated గా అనిపించింది నాకు. make up ఇంకా ఆహార్యం garish గా అనిపించాయి.

Post a Comment